Mahindra Scorpio N Record Booking With 1 Lakh In 30 Minutes - Sakshi

Mahindra Scorpio N: మహీంద్రా బుకింగ్స్‌ బీభత్సం.. నిమిషాల్లో రూ.18వేల కోట్ల బిజినెస్‌

Published Sun, Jul 31 2022 2:44 PM | Last Updated on Sun, Jul 31 2022 7:04 PM

Mahindra Scorpio N Record Booking With 1 Lakh In 30 Minutes - Sakshi

ప్రముఖ ఆటోమొబైల్‌ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీ కార్ల బుకింగ్స్‌లో సరికొత్త రికార్డ్‌లు సృష్టించింది. ఆ సంస్థకు చెందిన (Scorpio N) స్కార్పియో-ఎన్ మోడల్‌ కారు బుకింగ్స్‌ బీభత్సం సృష్టించింది. దీంతో కేవలం నిమిషాల వ్యవధిలో వేల కోట్ల బిజినెస్‌ జరిగినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

మహింద్రా కొత్త స్కార్పియో-ఎన్(Mahindra Scorpio N) అధికారిక బుకింగ్స్ (శనివారం) జూలై 30 ప్రారంభమైంది. అలా విడుదల అయ్యిందో లేదో ప్రారంభమైన నిమిషంలోనే 25 వేలు, అరగంటలో లక్ష బుక్సింగ్స్‌ నమోదయ్యాయి. ఈ విలువ రూ.18వేల కోట్లపైనే ఉంటుందని మార్కెట్‌ నిపుణులు అంచనా.

కొత్త మహింద్రా స్కార్పియో-ఎన్ ధర ఎక్స్‌-షోరూంలో పెట్రోల్ వెర్షన్లకు రూ.12 లక్షల నుంచి రూ.19 లక్షల మద్యలో ఉండనుంది. అలాగే డీజిల్ వెర్షన్ల ధర రూ.12.5 లక్షల నుంచి రూ.19.5 లక్షల మధ్యలో ఉంది. అయితే కంపెనీ ప్రకటించిన ప్రారంభ ధర కేవలం తొలి 25 వేల బుకింగ్స్‌కి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత డెలివరీ సమయంలో ఏ ధర ఉంటుందో దాన్నే కస్టమర్లు కట్టాల్సి ఉంటుంది.

మహీంద్రా ఈ కార్లు బుక్‌ చేసుకున్న కస్టమర్లకు డెలివరీ ప్రక్రియను సెప‍్టంబర్‌ 26 నుంచి ప్రారంభించబోతుంది. డిసెంబర్ 2022 నాటికి 20 వేల యూనిట్లకు పైగా స్కార్పియో-ఎన్ వెహికిల్ డెలివరీ చేపట్టాలని సన్నాహాలు కూడా చేస్తోంది. కాగా మహీంద్రాలోని థార్, ఎక్స్‌యూవీ700 మోడల్స్‌ కోసం కూడా కస్టమర్లు వేచి చూస్తున్నారు. మరి ఈ బుకింగ్స్‌ ఏ రికార్డు క్రియేట్‌ చేస్తోందో వేచి చూడాలి.

చదవండి: ఆగస్ట్‌ ఒకటి నుంచి మారనున్న కొత్త రూల్స్‌..! ఇవే..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement