
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ దారు మారుతి సుజుకి తన వినియోగదారులకు షాక్ ఇచ్చింది. వచ్చే ఏడాది ఆరంభంలో కార్ల ధరలు పెంచక తప్పదని 2021, డిసెంబరులో ప్రకటించిన మారుతీ సుజుకి ఇండియా జనవరి 16 నుంచి కార్ల ధరల పెంపు అమల్లోకి వస్తుందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.వెల్లడించింది. దాదాపు అన్ని మోడళ్ల కార్లపై సగటు పెరుగుదల 1.1 శాతంగా ఉంటుందని తెలిపింది.
కఠినమైన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా అన్నో మోడళ్ల కార్లను అప్‌డేట్ చేయడం, ఉత్పత్తి ఖర్చులు పెరిగిన నేపథ్యంలో పెంపు తప్పడలం లేదని కంపెనీ తెలిపింది. ఢిల్లీలోని ఎక్స్-షోరూమ్ ధరలపై ఇది వర్తిస్తుందని ప్రకటించింది. దీంతో మారుతీ సుజుకీ లవర్స్ కారు కొనాలంటే మరింత ధర పడనుంది. మారుతి ఎంట్రీ-లెవల్ చిన్న కారు ఆల్టో నుండి SUV గ్రాండ్ విటారా వరకు రూ. 3.39 లక్షల నుండి రూ. 19.49 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్య వాహనాను విక్రయిస్తోంది.