
వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ల కొట్టివేత
న్యూఢిల్లీ: కార్యకలాపాలు నిలిచిపోయిన ఎయిర్‌లైన్స్ సంస్థ ‘గోఫస్ట్’ లిక్విడేషన్ (ఆస్తుల విక్రయానికి)ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) కొట్టివేసింది. గోఫస్ట్ లిక్విడేషన్‌కు అనుకూలంగా జనవరి 20న జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) ఢిల్లీ బెంచ్ ఇచి్చన ఆదేశాలను అప్పిలేట్ ట్రిబ్యునల్ సమరి్థంచింది. నాటి ఆదేశాల్లో ఎలాంటి తప్పును తాము గుర్తించలేదని చైర్‌పర్సన్ జస్టిస్ అశోక్ భూషణ్ ఆధ్వర్యంలోని ఎన్‌సీఎల్‌ఏటీ బెంచ్ వ్యాఖ్యానించింది.
గోఫస్ట్ లిక్విడేషన్ అనుకూల ఉత్తర్వులను బిజీ బీ ఎయిర్‌వేస్, భారతీయ కామ్‌గార్ సేన (ముంబై), కెపె్టన్ అర్జున్ ధానన్ ఎన్‌సీఎల్‌ఏటీ వద్ద సవాలు చేశారు. డీజీసీఏ లైసెన్స్ సహా విలువైన ఆస్తులున్న గోఫస్ట్‌ను ఉన్నది ఉన్నట్టు స్థితిలో కొనుగోలు చేసేందుకు సమ్మతిస్తూ బిజీ బీ ఎయిర్‌వేస్ దరఖాస్తు సమరి్పంచింది. ఈజీమై ట్రిప్ ప్రమోటర్ నిశాంత్ పిట్టీ బిజీ బీ ఎయిర్‌వేస్‌లో ప్రధాన వాటాదారుగా ఉన్నారు. కంపెనీ ఆస్తులను విక్రయించేస్తే 5,000 మంది కారి్మకులు నష్టపోతారంటూ భారతీయ కామ్‌గార్ సేన తన పిటిషన్‌లో పేర్కొంది.