Airlines
-
గోఫస్ట్ లిక్విడేషన్‌కు మార్గం సుగమం
న్యూఢిల్లీ: కార్యకలాపాలు నిలిచిపోయిన ఎయిర్‌లైన్స్ సంస్థ ‘గోఫస్ట్’ లిక్విడేషన్ (ఆస్తుల విక్రయానికి)ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) కొట్టివేసింది. గోఫస్ట్ లిక్విడేషన్‌కు అనుకూలంగా జనవరి 20న జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఢిల్లీ బెంచ్ ఇచి్చన ఆదేశాలను అప్పిలేట్ ట్రిబ్యునల్ సమరి్థంచింది. నాటి ఆదేశాల్లో ఎలాంటి తప్పును తాము గుర్తించలేదని చైర్పర్సన్ జస్టిస్ అశోక్ భూషణ్ ఆధ్వర్యంలోని ఎన్సీఎల్ఏటీ బెంచ్ వ్యాఖ్యానించింది. గోఫస్ట్ లిక్విడేషన్ అనుకూల ఉత్తర్వులను బిజీ బీ ఎయిర్వేస్, భారతీయ కామ్‌గార్ సేన (ముంబై), కెపె్టన్ అర్జున్ ధానన్ ఎన్సీఎల్ఏటీ వద్ద సవాలు చేశారు. డీజీసీఏ లైసెన్స్ సహా విలువైన ఆస్తులున్న గోఫస్ట్‌ను ఉన్నది ఉన్నట్టు స్థితిలో కొనుగోలు చేసేందుకు సమ్మతిస్తూ బిజీ బీ ఎయిర్వేస్ దరఖాస్తు సమరి్పంచింది. ఈజీమై ట్రిప్ ప్రమోటర్ నిశాంత్ పిట్టీ బిజీ బీ ఎయిర్వేస్లో ప్రధాన వాటాదారుగా ఉన్నారు. కంపెనీ ఆస్తులను విక్రయించేస్తే 5,000 మంది కారి్మకులు నష్టపోతారంటూ భారతీయ కామ్‌గార్ సేన తన పిటిషన్లో పేర్కొంది. -
టొరంటో విమానాశ్రయంలో అదుపుతప్పిన విమానం
టొరంటో: కెనడాలో సోమవారం ఓ విమానం అదుపుతప్పింది. టొరంటోలోని పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ల్యాండ్ అవుతుండగా రన్‌వే పైనుంచి జారిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు గాయపడ్డట్లు స్థానిక అధికారులను ఉటంకిస్తూ మీడియా తెలిపింది. ప్రమాద సమయంలో విమానంలో 80 మంది ఉన్నట్లు సమాచారం. ఈ విమానం మిన్నెపోలిస్ నుంచి టొరంటోకు వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం నేపథ్యంలో ఎయిర్‌పోర్టును మూసివేశారు. -
అంత ప్రమాదంలో బతికి బట్టకట్టాడు.. మరో వీడియో వైరల్
ఒక ఘోర ప్రమాదం.. అందులో చావు అంచు నుంచి బయటపడితే ఎవరైనా ఏం చేస్తారు?.. దేవుడికి దణ్ణం పెట్టి అక్కడి నుంచి పరుగులు తీస్తారు. ఇంకాస్త ధైర్యవంతులైతే ఆపదలో ఉన్నవాళ్లకు సాయం చేస్తారు. కానీ, ఇక్కడో ప్రయాణికుడు మాత్రం స్పాట్లో కలియదిరుగుతూ ఆ తీవ్రతను తెలియజేస్తూ ఏకంగా ఓ వీడియో తీశాడు. అజర్ బైజన్ ఎయిర్‌లైన్స్(Azerbaijan Airlines) ప్రమాదం తాలుకా మరో వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.అజర్ బైజన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన జె2-8243 విమానం ప్రమాదానికి గురికావడంతో 38 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే, ఈ ప్రమాదం జరిగాక ఓ ప్రయాణికుడు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. సుబ్ఖోన్ రఖిమోవ్ అనే ఆ ప్రయాణికుడు అదృష్టంకొద్దీ స్వల్పగాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. 🚨AZERBAIJAN AIRLINES PASSENGER WHO SURVIVED CRASH FILMS SHRAPNEL DAMAGESubkhon Rakhimov, a passenger on the Azerbaijan Airlines flight that tragically crashed, miraculously survived the incident. He initially filmed a video for his wife as the plane plummeted from the sky.… https://t.co/J9oGZIpGiG pic.twitter.com/0nk9YIbtJV— Mario Nawfal (@MarioNawfal) December 26, 2024అయితే ఓవైపు సహాయక చర్యలు కొనసాగుతుండగానే.. తన ఫోన్లో అక్కడి దృశ్యాలను చిత్రీకరించాడు. అయితే విమాన తోకభాగంపై, రెక్కలపై చిన్న చిన్న రంధ్రాలు ఉండడం గమనించవచ్చు. విశేషం ఏంటంటే.. అంతకు ముందు ప్రమాద సమయంలోనూ వైరల్ అయిన వీడియో కూడా ఈయనగారు పోస్ట్ చేసిందే.ప్రమాదం సమయంలో భయాందోళనకు గురైన ప్రయాణికుల హాహాకారాలు వీడియోలో వినిపిస్తున్నాయి. సుబ్ఖోన్ రఖిమోవ్ మాత్రం భగవంతుడ్ని ప్రార్థిస్తూ కనిపించాడు. ఆపై విమానం కూలిన అనంతరం ప్రయాణికులు చెల్లాచెదరుగా పడి ఉన్న దృశ్యాలు కనిపించాయి.The final moments of the Azerbaijan Airlines plane before its crash in Kazakhstan were captured by a passenger onboard.Aftermath also included in the footage. pic.twitter.com/nCRozjdoUY— Clash Report (@clashreport) December 25, 2024బాకు నుంచి రష్యాలోని చెచెన్ ప్రాంతానికి చెందిన గ్రోజ్నికి ప్రయాణిస్తుండగా కజకిస్థాన్(Kazakhstan)లోని అక్టౌలో కూలిపోయింది. ఈ ప్రమాదానికి గల కారణాలపై అంతర్జాతీయ మీడియా పలు కథనాలు వెలువడ్డాయి. ఈ ప్రమాదం నుంచి 29 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై స్పందించిన అజర్బైజన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం నేపథ్యంలో గురువారం ఒక్కరోజు జాతీయ సంతాపం దినంగా పాటించారు.ప్రమాదానికి గల కారణాలపై ఇప్పటిదాకా స్పష్టత లేదు. పొగమంచు కారణంగా జరిగిందని.. పక్షిని ఢీ కొట్టడంతో జరిగిందని రకరకాల ప్రచారాలు తెర మీదకు వచ్చాయి. అయితే ప్రమాదం జరిగిన తీరు.. విమాన రెక్కలకు ఉన్న రంధ్రాలు పలు అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ క్రమంలో రష్యా పనిగా ఊహాజనిత కథనాలు వెలువడ్డాయి. ఉక్రెయిన్ డ్రోన్ దాడిని తిప్పికొట్టే క్రమంలో రష్యా వైమానిక దళాలు జరిపిన దాడిలో.. ఈ విమాన ప్రమాదం జరిగిందా? అని తొలుత చర్చ నడిచింది. అయితే ఇటు రష్యాతో పాటు అటు కజకస్తాన్.. ఘటనపై దర్యాప్తు పూర్తి కాకుండా ఒక నిర్దారణకు రావడం సరికాదని చెబుతున్నాయి.ఇదీ చదవండి: ఉక్రెయిన్‌కు బైడెన్ బంపరాఫర్ -
Year Ender 2024: 999 బెదిరింపులు.. రెండు కంపెనీల మూసివేత.. ఎయిర్‌లైన్స్ పరిణామాలు
దేశంలోని విమానయాన రంగానికి 2024 మిశ్రమంగా గడిచింది. ఈ సంవత్సరం రెండు విమానయాన సంస్థలు మూసివేతకు గురయ్యాయి. ఒక విమానయాన సంస్థ దివాలా ప్రక్రియకు దారితీసింది. ఈ ఏడాది దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య రెండుసార్లు రికార్డు స్థాయిలో ఐదు లక్షలను అధిగమించింది.దేశంలో దీపావళి, ఛత్ సందర్భంగా విమానయాన టిక్కెట్ల ఛార్జీల్లో రికార్డు స్థాయిలో పెరుగుదల నమోదైంది. ఈ ఏడాది నవంబర్ 14 వరకు విమానయాన సంస్థలకు మొత్తం 999 సార్లు బెదిరింపు కాల్స్ వచ్చాయి. విచారణలో అవి ఫేక్ అని తేలింది. ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్-1 వద్ద పైకప్పు కూలిపోయిన దుర్ఘటనలో ఒకరు మృతిచెందారు.2025లో చోటుచేసుకోబోయే మార్పులివే..శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారతీయ విమానయాన రంగం 2025లో పెను మార్పులను చూడబోతోంది. భారీ విలీనాలతో పాటు, విమానాల సంఖ్య మరింతగా పెరగనుంది. ఇంతేకాకుండా పలు కొత్త ఎయిర్‌లైన్స్‌లు ప్రారంభం కానున్నాయి. మార్చి 2025తో ముగిసే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయ విమాన ట్రాఫిక్ 164 నుంచి 170 మిలియన్లకు పెరుగుతుందనే అంచనాలున్నాయి. వైడ్-బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌లను పెంచడం, ఎక్కువ సంఖ్యలో ప్రత్యక్ష విదేశీ విమాన లింక్‌లను ఏర్పాటు చేయడం, దేశాన్ని గ్లోబల్ ఏవియేషన్ హబ్‌గా మార్చడంపై పరిశ్రమ దృష్టి కేంద్రీకృతమై ఉంది.ఇటీవల అకాసా ఎయిర్ హెడ్ వినయ్ దూబే మాట్లాడుతూ భారతీయ విమానయాన మార్కెట్‌కు అవకాశాలు అపరిమితంగా ఉన్నాయన్నారు. కాగా ఇండియన్ ఎయిర్‌లైన్స్ 60కి పైగా వైడ్ బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో సహా 800 విమానాల సముదాయాన్ని కలిగి ఉంది. 157 విమానాశ్రయాలకు సేవలు అందిస్తోంది. సింగపూర్ ఎయిర్‌లైన్స్ భాగస్వామ్యమైన విస్తారాతో ఎయిర్ ఇండియా తన విలీనాన్ని ఇటీవలే పూర్తి చేసింది. ఎయిరిండియా ఫ్లైట్ రిటర్న్ ప్రోగ్రామ్ పేరును 'మహారాజా క్లబ్'గా మార్చాలని టాటా గ్రూప్ నిర్ణయించింది. అలాగే ఎయిర్ ఇండియా మరో 100 ఎయిర్‌బస్ విమానాల కొనుగోలుకు ఆర్డర్ చేసింది. వీటిలో10 వైడ్-బాడీ ఏ350, 90 నారో బాడీ ఏ320 విమానాలున్నాయి.ఇది కూడా చదవండి: Kisan Diwas 2024: ఈ పథకాల వినియోగంతో రైతే రాజు -
ప్రపంచంలోనే చెత్త ఎయిర్‌లైన్స్.. ఇండిగో స్థానం ఇది!
విమానంలో ప్రయాణించాలంటే ఏ విమానయాన సంస్థ బెటర్ అనేది తెలుసుండాలి. అలాగే కేబిన్లు, సేవల నాణ్యత తోపాటు..విమానాలు ఎంత ఆలస్యంగా వస్తున్నాయన్నది కూడా అన్నింటికంటే ముఖ్యం. ఈ నేపథ్యంలోనే గ్లోబల్ ఎయిర్‌లైన్స్ ఇండస్ట్రీ ప్రతి ఏటా దీనికి సంబంధించి ప్రయాణికులకు అవగాహన కల్పించేలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ విమానయాన సంస్థలకు ర్యాంకులు ఇస్తుంది. ఏడాది మెత్తంలో ఎన్ని సార్లు ఆలస్యంగా కస్టమర్లను గమ్యస్థానాలకు చేర్చింది, సౌకర్యం, సేవలు, ప్రయాణికుల ఫీడ్‌బ్యాక్ వంటి అంశాల ఆధారంగా అత్యుత్తమమైనవి, చెత్త సర్వీస్ అందించిన ఎయిర్‌లైన్స్‌గా జాబితా చేసి ర్యాంకులు ఇస్తుంది. ఈ ఏడాది మాత్రం కస్టమర్ ఫీడ్‌బ్యాక్, కార్యచరణ సామర్థ్యం ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎయిర్లైన్లకు ర్యాంకుల ఇచ్చింది.ఇందులో జనవరి నుంచి అక్టోబర్ వరకు గల డేటాను బేస్ చేసుకుని ఈ ర్యాంకులు ఇచ్చింది. ఇలా ర్యాంకులు ఎందుకంటే.. కేవలం ప్రయాణికుల అభిప్రాయానికి ప్రాధాన్యత ఇచ్చేలా ఎయిర్‌లైన్స్‌ని ప్రోత్సహించడమేనని ఎయిర్ హెల్ప్ సీఈవో టామ్జ్ పౌల్జిన్ చెబుతున్నారు.2024 సంవత్త్సరానికి అత్యంత చెత్త విమానయాన సంస్థలు..100. స్కై ఎక్స్‌ప్రెస్101.ఎయిర్ మారిషస్102. తారోమ్103. ఇండిగో104. పెగాసస్ ఎయిర్‌లైన్స్105. ఎల్ అల్ ఇజ్రాయెల్ ఎయిర్‌లైన్స్106. బల్గేరియా ఎయిర్107. నౌవెలైర్108. బజ్109. తునిసైర్2024 సంవత్సరానికి అత్యుత్తమ విమానయాన సంస్థలు..10. ఎయిర్ సెర్బియా9. వైడెరో8. ఎయిర్ అరేబియా7. లాట్ పోలిష్ ఎయిర్‌లైన్స్6. ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్5. ప్లే (ఐస్లాండ్)4. అమెరికన్ ఎయిర్‌లైన్స్3. యునైటెడ్ ఎయిర్‌లైన్స్2. ఖతార్ ఎయిర్వేస్1. బ్రస్సెల్స్ ఎయిర్లైన్స్ఈసారి బ్రస్సెల్స్ ఎయిర్‌లైన్స్ 2018 నుంచి ర్యాంకింగ్స్‌లో ఆధిపత్యం చెలాయించి.. ఖతార్ ఎయిర్వేస్ను వెనక్కు నెట్టి అగ్రస్థానంలో కొనసాగుతోంది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్, అమెరికన్ ఎయిర్‌లైన్స్, ఈ ఏడాది గణనీయమైన కార్యాచరణ అంతరాయాలను ఎదుర్కొన్నప్పటికీ..మంచి పనితీరును కొనసాగించి మూడు, నాలుగు స్థానాలను దక్కించుకున్నాయి. ఇక కెనడియన్ క్యారియర్ ఎయిర్ ట్రాన్సాట్ 36వ స్థానంలో నిలవగా, డెల్టా ఎయిర్ లైన్స్ 17వ స్థానానికి పడిపోయింది. అలాగే జెట్‌బ్లూ, ఎయిర్ కెనడా దిగువ 50 స్థానాల్లో నిలిచాయి. అలాస్కా ఎయిర్‌లైన్స్ కూడా 88వ స్థానానికి పరిమతమయ్యింది.ఇండిగో స్పందన:భారత్‌లో అత్యంత ప్రాధాన్యత కలిగిన విమానయాన సంస్థ ఇండిగో ఈ సర్వే ఫలితాలపై స్పందించింది. సదరు గ్లోబల్ ఎయిర్‌లైన్స్ ఎయిర్ హెల్ప్ ఇచ్చిన ర్యాంక్‌ని ఖండిచింది. తమ సంస్థ కస్టమర్లకు మంచి ప్రయాణ అనుభవాన్ని ఇస్తుందని స్పష్టం చేసింది. కస్టమర్ పిర్యాదులు కూడా తక్కువేనని పేర్కొంది ఇండిగో. భారత ఏవియేషన్ రెగ్యులేటర్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ప్రకారం..తొమ్మిది నెలల కాలంలో 7.25 కోట్లకు పైగా ప్రయాణికులను తీసుకెళ్లడమే గాక 61.3% మార్కెట్ వాటాను కలిగి ఉంది. అంతేగాక నెలవారీగా కస్టమర్ పిర్యాదులను, సమయాపాలన డేటాను ప్రచురిస్తామని కూడా ఇండిగో స్పష్టం చేసింది. గ్లోబల్ ఎయిర్‌లైన్స్ ఎయిర్ హెల్ప్ విశ్వసనీయత లేని విధంగా ర్యాంకులు ఇచ్చిందని, తమ విమానయాన సంస్థ డేటాని పరిగణలోనికి తీసుకుని ఇచ్చిన ర్యాంకు మాత్రం కాదని ఆరోపించింది. (చదవండి: నేషనల్ అమెరికా మిస్ పోటీల్లో సత్తా చాటిన తెలుగమ్మాయి హన్సిక) -
రేణిగుంట విమానాశ్రయంలో ప్రయాణికుల నిరసన
-
బాంబు బెదిరింపుల వెనక నాగ్‌పూర్‌కు చెందిన పుస్తక రచయిత..
న్యూఢిల్లీ: బాంబు బెదిరింపులతో యావత్ దేశం హడలిపోతోంది. విమానాలు, హోటళ్లు, విద్యాసంస్థలు.. ఇలా ప్రతిచోటా బాంబులు పెట్టినట్టు ఈమెయిల్, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా బెదిరింపుల వరద ముంచెత్తుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు బాంబు బెదిరింపు హెచ్చరికలు ఎక్కువగా వస్తుండటంతో పోలీసు బృందాలు, బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు చేయడం.. బాంబు లేదని నిర్ధారించడం ప్రహసనంగా మారింది.ఈనేపథ్యంలో బెదిరింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని మహారాష్ట్రలోని నాగ్‌పూర్ పోలీసులు గుర్తించారు.ఈ బూటకపు బెదిరింపుల వెనక గోండియాకు చెందిన 35 ఏళ్ల వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు తెలిపారు. అయితే నిందితుడు గతంలో ఉగ్రవాదంపై ఓ పుస్తకాన్ని రచించడం గమనార్హం. నిందితుడిని జగదీష్ యూకీగా గుర్తించామని, ఓ కేసులో 2021లో అరెస్ట్ కూడా అయినట్లు నాగ్‌పూర్ సిటీ పోలీస్ స్పెషల్ బ్రాంచ్ అధికారులు తెలిపారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని. అతడిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నట్లు చెప్పారు.జగదీశ్ యూకీ అనే వ్యక్తి ఇ-మెయిల్ ద్వారా పలు ఎయిర్‌లైన్స్‌లకు నకిలీ బాంబు బెదిరింపులు పంపించాడు. దీని కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడిచాయి. దీంతోపాటు ప్రధానమంత్రి కార్యాలయం, రైల్వే మంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం కార్యాలయాలతోపాటు పలు ఎయిర్‌లైన్స్ కార్యాలయాలకు, డీజీపీ, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్)తో సహా వివిధ ప్రభుత్వ సంస్థలకు బెదిరింపు మెయిల్స్ పంపినట్లు డీసీపీ శ్వేతా ఖేద్కర్ వెల్లడించారు. సోమవారం నాగ్‌పూర్ పోలీసులు ముంబైలోని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు సైతం బెదిరింపులు రావడంతో ఆయన నివాసం వెలుపల భద్రతను పెంచారు. తాను తెలుసుకున్న రహస్య ఉగ్రవాద కోడ్‌పై సమాచారం ఇచ్చేందుకు అవకాశం ఇవ్వకపోతే నిరసన తెలుపుతానంటూ నిందితుడు బెదిరింపు మెయిల్లో పేర్కొన్నాడు. ఉగ్రవాద బెదిరింపులపై తనకున్న అవగాహన గురించి చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కావాలని కూడా అభ్యర్థించారు. -
బాంబు బెదిరింపులు.. సోషల్ మీడియాపై కేంద్రం సీరియస్
న్యూఢిల్లీ: ఇటీవల దేశీయ విమానాలతోపాటు అంతర్జాతీయ విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు భారీగా పెరిగాయి. గత 10 రోజుల్లోనే 250కి పైగా భారతీయ విమానాలకు బాంబు బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. బెదిరింపులు విమానయాలన సంస్థలకు పెద్ద తలనొప్పిగా మారాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో, విస్తారా, స్పైస్ జెట్, ఆకాశ ఎయిర్ లైన్లకు వరుసగా బెదిరింపులు రావడంతో కేంద్రం ఈ అంశంపై దృష్టి సారించింది.ఈ క్రమంలో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి బెదిరింపుల వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, తప్పుడు వార్తలు వ్యాప్తి చెందకుండా తగిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ శనివారం ఆదేశించింది. కేంద్రం ఆదేశాలను ధిక్కరించినట్లయితే థర్డ్ పార్టీ కంటెంట్‌ను ఆయా ప్లాట్‌ఫామ్‌లు తీసుకునే వెసులుబాటును నిలిపివేస్తామని స్పష్టం చేసింది.నకిలీ బెదిరింపుల వల్ల విమాన సర్వీసులు ఆలస్యం అవ్వడం నిలిచిపోవడం జరుగుతున్నాయని తెలిపింది. ఆకతాయిలు పెట్టే ఫేక్ బెదిరింపు మెసేజ్‌లను ఎప్పటికప్పుడు గుర్తించి, తొలగించేందుకు చర్యలు చేపట్టాలని పేర్కొంది. ఫేక్ బెదిరింపు మెసేజ్‌లను ఎప్పటికప్పుడు తొలగించడంలో విఫలమయ్యే సోషల్ మీడియా కంపెనీలను బాధ్యులుగా పరిగణించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది. -
బాంబు బెదిరింపులు: సోషల్‌మీడియా సంస్థలపై కేంద్రం ఆగ్రహం
న్యూఢిల్లీ: దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు బాంబు బెదిరింపు హెచ్చరికలకు తెరపడటం లేదు. గతంలో ఎన్నడూ లేనివిధంగా కొద్దిరోజులుగా విమానయాన సంస్థలకు వస్తున్న బాంబు బెదిరింపులు అందరినిషాక్ గురిచేస్తున్నాయి. దాదాపు 10 రోజుల్లో 170కి పైగా విమాన సర్వీసులకు హెచ్చరికలు వచ్చాయి. వీటిపై విమానయానశాఖ విచారణ చేపడుతున్ప్పటికీ, ఎయిర్‌లైన్స్ యాజమాన్యం తనిఖీలు చేస్తున్నా బెదిరింపులు మాత్రం ఆగం లేదు.అయితే బెదిరింపులు ఎక్కువగా సామాజిక మాధ్యమాల ద్వారా వస్తుండటంతో తాజాగా కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటీ మంత్రిత్వశాఖ.. సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ఎక్స్’పై ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రిత్వశాఖ సంయుక్త కార్యద్శి సంకేత్ ఎస్ భోంద్వే.. విమానయానసంస్థ అధికారులు, ఎక్స్, మెటా వంటిఇ సోషల్ మీడియా ప్రతినిధితులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల పనితీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఎక్స్ వంటి మాధ్యమాల్లో వస్తున్న పుకార్లను నియంత్రించడంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.కాగా గత కొన్ని రోజులుగా భారతీయ విమానయాన సంస్థలు నిర్వహిస్తున్న 120కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. నిన్న కూడా ఇండిగో, విస్తారా, ఎయిర్ ఇండియాకు చెందిన 30 విమానాలకు ఇలాంటి బెదిరింపులు అందాయి. అయితే అధికారులు అప్రమత్తమై భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరించారు. ఈ పరిస్థితిపై పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఇలాంటి బాంబు బెదిరింపులకు పాల్పడేవారిపై కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ప్రయాణీకుల భద్రతపై రాజీ పడకుండా ప్రభుత్వం దీనిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. ఇలాంటి బూటకపు బెదిరింపులను ప్రసారం చేసే వారిపై నో ఫ్లై లిస్ట్‌తో సహా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అదేవిధంగా ప్రస్తుత విమానయాన భద్రతా నిబంధనల సవరణకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.ఇవి బూటకపు బెదిరింపులే అయినప్పటికీ వాటిని సీరియస్‌గా తీసుకోవాల్సి ఉంటుందని ఆయన ఉద్ఘాటించారు. బెదిరింపుల దాడి వెనుక కుట్ర దాగి ఉంటుందా అని ప్రశ్నించగా.. దీనిపై సమగ్ర విచారణ జరుగుతోందని మంత్రి చెప్పారు.ఇప్పుడే ఏ విషయం చెప్పలేమని, దర్యాప్తు పూర్తయ్యే వరకు వేచి ఉండాలని కోరారు. -
కొనసాగుతున్న బాంబు బెదిరింపులు
న్యూఢిల్లీ: దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు బాంబు బెదిరింపు హెచ్చరికలకు తెరపడటం లేదు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు సుమారు 50 విమానాల్లో బాంబులు పెట్టామంటూ ఆగంతకులు సోషల్ మీడియా ద్వారా బెదిరించారు. ఇందులో ఎయిరిండియా, ఇండిగోకు చెందిన 13 చొప్పున విమానాలు, ఆకాశ ఎయిర్‌కు చెందిన 12, విస్తార విమానాలు 11 ఉన్నాయి. బెదిరింపుల నేపథ్యంలో సోమవారం రాత్రి ఇండిగో తన మూడు సర్వీసులను సౌదీ అరేబియా, ఖతార్లకు మళ్లించాల్సి వచ్చింది. అయితే, ఇవన్నీ వట్టివేనని తేలింది.తాజా ఘటనతో కలిపి 9 రోజుల్లో 170కి పైగా విమాన సర్వీసులకు బెదిరింపులు అందినట్లయింది. బాంబు హెచ్చరికల కారణంగా బెంగళూరు–జెడ్డా సర్వీసును దోహా(ఖతార్)కు, కోజికోడ్–జెడ్డా విమానాన్ని రియాద్(సౌదీ అరేబియా)కు, ఢిల్లీ–జెడ్డా సర్వీసును మదీనా(సౌదీ అరేబియా)కు మళ్లించామని ఇండిగో తెలిపింది. ప్రయాణికులందరినీ సురక్షితంగా దించి వేసి, విమానంలో పూర్తి స్థాయిలో తనిఖీలు జరిపామని వివరించింది. ఢిల్లీ–దమ్మమ్, ఇస్తాంబుల్–ముంబై, ఇస్తాంబుల్–ఢిల్లీ, మంగళూరు–ముంబై, అహ్మదాబాద్–జెడ్డా, హైదరాబాద్–జెడ్డా, లక్నో–పుణే విమానాలకు కూడా బాంబు హెచ్చరికలు అందాయని ఇండిగో వెల్లడించింది. అయితే, ఎయిరిండియా తమ విమాన సర్వీసులకు అందిన బాంబు బెదిరింపులపై ఎటువంటి ప్రకటన చేయలేదు.సోషల్ మీడియా ద్వారా తమ విమానాలకు కూడా బెదిరింపులు వచ్చాయని విస్తార ప్రతినిధి చెప్పారు. మిగతా వివరాలను ఆయన తెలపలేదు. బాంబు బెదిరింపులు వట్టివేనని తెలిసినా, ఈ విషయాన్ని సీరియస్‌గానే తీసుకుంటున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. 1982 నాటి సప్రెషన్ ఆఫ్ అన్ లాఫుల్ యాక్ట్స్ ఎగెనెస్ట్ సేఫ్టీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ యాక్ట్(ఎస్యూఏఎస్సీఏ)కు సవరణలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. దీని ప్రకారం బెదిరింపులకు పాల్పడే వారిని కోర్టు ఉత్తర్వులతో పనిలేకుండానే వెంటనే అరెస్ట్ చేసి, విచారణ చేపట్టేందుకు అవకాశమేర్పడుతుంది. అలాగే, దోషులకు కఠిన శిక్షలు పడేలా విమాన భద్రతా నిబంధనలను మార్చాలని కూడా కేంద్రం భావిస్తోంది.9 రోజుల్లో రూ.600 కోట్ల నష్టంతొమ్మిది రోజులుగా కొనసాగుతున్న బాంబు బెదిరింపుల కారణంగా విమానయాన సంస్థలకు రూ.600 కోట్ల మేర నష్టం వాటిల్లి ఉంటుందని విమానయాన సంస్థల మాజీ అధికారులు అంటున్నారు. దేశీయ విమానాలకైతే నష్టం సుమారుగా రూ.1.5 కోట్ల చొప్పున, అంతర్జాతీయ సర్వీసులకైతే రూ.5 కోట్ల నుంచి రూ.5.5 కోట్ల వరకు నష్టం ఉంటుందని చెప్పారు. దేశీయ, అంతర్జాతీయ విమానాలకు కలిపి సగటున రూ.3.5 కోట్ల మేర నష్టం ఉంటుందని, ఈ లెక్కన 170 విమానాలకు కలిపి ఈ నష్టం రూ.600 కోట్ల వరకు ఉంటుందని వారు అంచనా వేశారు. ఎయిర్ పోర్టులో పార్కింగ్ చార్జీలు, ఇంధనం వంటి ప్రత్యక్ష ఖర్చులతోపాటు ఇతర విమానాల షెడ్యూళ్లపై పడే పరోక్ష ప్రభావాన్ని కూడా లెక్కించాల్సి ఉంటుందన్నారు. ఇందులో చిన్న, పెద్ద విమానాలు, వాటి ప్రయాణ వ్యవధిని బట్టి కూడా నష్టం వేర్వేరుగా ఉంటుందని చెప్పారు. -
వట్టి బెదిరింపులేనా?
ఇది కనివిని ఎరుగని కథ. వారంరోజుల్లోనే మన విమానాలకు శతాధికంగా బాంబు బెదిరింపు కాల్స్... వివిధ జాతీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థలకు చెందిన పలు విమానాలను అర్ధంతరంగా దింపాల్సి రావడం, దారి మళ్ళించడం, చివరకు ఫైటర్ జెట్ల రక్షణ మధ్య తీసుకువెళ్ళాల్సి రావడం జరిగింది. ఈ–మెయిల్, సోషల్ మీడియా అజ్ఞాత పోస్టుల బెదిరింపులతో భారత వైమానిక రంగం ఉలిక్కిపడింది. ఏ బెదిరింపు వచ్చినా నిశితంగా పరీక్షించి, జాగ్రత్త చేపట్టాలన్నది నిబంధన కావడంతో విమానయాన పరిశ్రమపై తాజా బెదిరింపుల ప్రభావం అంతా ఇంతా కాదు. ఖలిస్తానీ తీవ్రవాది గురుపథ్‌వంత్ సింగ్ పన్నూ సైతం ఎయిరిండియా విమానంపై దాడి చేస్తామనీ, నవంబర్ 1–19 మధ్య ఎయిరిండియాలో ప్రయాణించవద్దనీ హెచ్చరించడంతో కథ కొత్త మలుపు తిరిగింది. పెరుగుతున్న భద్రతా సమస్యలపై విమానయాన శాఖ మల్లగుల్లాలు పడుతోంది. బెదిరింపులకు పాల్పడినవారిపై తీవ్ర శిక్షలు విధించేలా చట్టంలో మార్పులు చేయాలనీ, దోషుల్ని విమానయానం నుంచి శాశ్వతంగా బహిష్కరించాలని భావిస్తున్నామనీ కేంద్ర మంత్రి మాట. భవిష్యత్తుకు పనికొచ్చే ఆ చర్యల మాటెలా ఉన్న వర్తమానంలో తక్షణ మార్గాంతరమేమిటన్నదే ఇప్పుడు ప్రశ్న.2014 – ’17 మధ్య అంతా కలిపి 120 బాంబు బెదిరింపులే రాగా, ఇప్పుడు ఒక్కవారంలోనే 100కు పైగా బెదిరింపులు రావడం గమనార్హం. విమానాల దారి మళ్ళింపు, తక్షణ ల్యాండింగ్ వల్ల అయ్యే ఇంధన వృథా ఖర్చు, వగైరాలతో ప్రతి బెదిరింపు కాల్ వల్ల ఎయిర్‌లైన్స్‌కు రూ. 3 కోట్ల పైగా నష్టమట! ప్రయాణికుల్లో భయాందోళనల్ని పెంచడంతో పాటు ప్రయాణంలో ఆలస్యంతో కీలకమైన పనులు దెబ్బతినడం లాంటివి సరేసరి. రద్దీ ఎక్కువగా ఉండే పండగ సీజన్ కావడంతో కష్టం, నష్టం ఎక్కువ. ఒక్క వారంలోనే వంద బెదిరింపులు వచ్చాయంటే భద్రతా వ్యవస్థలు, సైబర్ సెక్యూరిటీలు ఏం చేస్తున్నట్టు? ఇప్పటి వరకు ఒక మైనర్నీ, అతని తండ్రినీ మాత్రమే అరెస్ట్ చేసినట్టు వార్త. నింది తుల్ని వేగంగా కనిపెట్టి, కఠినచర్యలకు ఎందుకు దిగడం లేదు? అయితే ముష్కరులు, తీవ్రవాదులు వర్చ్యువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌ల ద్వారా ఈ నకిలీ బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. దాంతో, వారున్న లొకేషన్ కనిపెట్టలేని పరిస్థితి. ఈ సవాలును అధిగమించేందుకు మార్గాలు అన్వేషించాలి. నిజానికి, విమాన సర్వీసులకే కాదు... కొద్ది నెలలుగా రైల్వేలకూ ఈ బెడద తప్పడం లేదు. రైల్వే ట్రాకుల మీద రాళ్ళు, గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్ నింపిన సీసాల లాంటివి దుండగులు పెడుతున్న ఘటనలు చూస్తున్నాం. ఆ మధ్య అనేక చోట్ల వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లను లక్ష్యంగా చేసుకొని రాళ్ళు విసిరిన ఉదంతాలూ చూశాం. ఈ చర్యల వెనుక పెద్ద పన్నాగమే ఉందని విశ్లేషకుల మాట. దేశంలో విమానయాన రంగం వేగంగా దూసుకుపోతోంది. ఒక్క 2023లోనే 15.2 కోట్ల మంది దేశంలో విమానయానం చేశారు. అలాంటిది... ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో భారత వైమానిక రంగాన్నీ, రైల్వేలనూ గనక అప్రతిష్ఠ పాల్జేస్తే, ఆర్థిక నష్టంతో పాటు భూమి మీదైనా, ఆకాశంలోనైనా సురక్షితంగా ప్రయాణం చేయలేమనే భీతిని దేశ, విదేశీ ప్రయాణికుల్లో పెంచాలన్నది కుట్ర. భయం పెంచి, ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి విద్రోహ చర్యలను తక్షణం అరికట్టాలి. చిత్రమేమిటంటే, ఐరోపా గగనతలంలోనూ భారత విమానయాన సంస్థలకు బెదిరింపులు వస్తున్నాయి. భారత ప్రభుత్వం, గూఢచర్య వ్యవస్థలు ఈ వ్యవహారాన్ని తేలికగా తీసుకుంటే పెను ప్రమాదమే! భారత్‌కు తీరని నష్టం కలిగించడమే ధ్యేయంగా పెట్టుకొన్న ఖలిస్తానీ తీవ్రవాది గురుపథ్‌వంత్ సింగ్ పన్నూ ఎయిరిండియా విమానాలను పేల్చేస్తామంటూ గత ఏడాది నవంబర్ లోనూ ఇలానే బెదిరింపులకు దిగాడు. అతను, అతని అనుచరుల ఆనుపానులు, దుశ్చర్యలు తెలిసినప్పటికీ అమెరికా గూఢచారి వ్యవస్థ ఎఫ్‌బీఐ లాంటివి కళ్ళు మూసుకొని, వారిని కాపాడుతూ వస్తుండడమే విషాదం. మరోపక్క దేశీయ విమానాల్లో సిక్కు ప్రయాణికులు కృపాణాలతో ప్రయాణించడాన్ని నిరోధించేందుకు సుప్రీమ్ కోర్టు సైతం నిరాకరించడంతో, పన్నూ లాంటి వారు దాన్ని అవకాశంగా తీసుకొంటే కష్టమే. ఈ ఖలిస్తానీ తీవ్రవాదులు ఒకటికి రెండు తీవ్రవాద బృందా లను కలుపుకొనిపోతే పెను ప్రమాదమే. దాదాపు పాతికేళ్ళ క్రితం 2001 సెప్టెంబర్ 11న తీవ్ర వాదులు విమానాల హైజాక్‌తో అమెరికాలోని ప్రపంచ వాణిజ్య కేంద్రం జంట భవనాల కూల్చి వేతతో సహా 3 వేల మంది మరణానికి కారణమైన ‘9/11’ ఘటనను విస్మరించలేం. ఈ పరిస్థితుల్లో ఈ ముష్కరమూకలకు పరోక్షంగా అండగా నిలుస్తున్న అమెరికా, కెనడాలకు పరిస్థితిని వివరించి, దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకొనే దిశగా భారత ప్రభుత్వం కట్టుదిట్ట మైన చర్యలు చేపట్టాలి. మన ప్రయాణ వ్యవస్థలతో పాటు పౌరుల భద్రత అత్యంత ప్రధానమని తెలియజెప్పాలి. అవసరమైతే అంతర్జాతీయ న్యాయస్థానాన్నీ, ఐరాస భద్రతా మండలినీ ఆశ్రయించాలి. అదే సమయంలో కొద్దివారాల పాటు టెక్నాలజీని తమ చేతుల్లోకి తీసుకోవడం వల్లే ముష్క రులు ‘9/11’ ఘటనకు పాల్పడగలిగారని మర్చిపోరాదు. సాంకేతికంగా ముష్కర చేష్టలకు వీలు కల్పించే ట్రాన్సీవర్స్ లాంటి సాంకేతిక సామగ్రిని ఆన్లైన్లో అమ్మడాన్ని తక్షణం నిషేధించడం అవసరమని నిపుణుల సూచన. అన్నిటి కన్నా ముఖ్యంగా యుద్ధ ప్రాతిపదికన మన విమాన, రైల్వే భద్రతా వ్యవస్థలను పునఃపరిశీలించి, సరికొత్త సవాళ్ళకు అనువుగా పటిష్ఠం చేయాలి. అత్యవసర పరిస్థితిలో అనుసరించాల్సిన ప్రామాణిక ఆచరణ విధానాలను (ఎస్ఓపీ) సిద్ధం చేయాలి. అదే సమయంలో అన్ని ఎయిర్‌లైన్స్, వివిధ దేశాల వైమానిక రంగాలు ఒక్కటై, సమాలోచనలు జరపాలి. పెరుగుతున్న ముప్పును పరస్పర సహకారం, సమన్వయంతో ఎలా ఎదుర్కోవాలో చూడాలి. -
70 విమానాలకు బాంబు బెదిరింపులు.. ఎయిర్‌లైన్స్ సీఈఓలతో భేటీ
భారత్‌కు చెందిన విమానాలకు బాంబు బెదిరింపుల పర్వం తీవ్ర కలకలం రేపుతోంది. అటు దేశీయంగా నడిచే వాటితోపాటు విదేశాలకు వెళ్తున్న అనేక ఎయిర్‌లైన్స్ వరసగా బాంబు బెదిరింపులు వస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. గడిచిన ఆరు రోజుల్లో ఏకంగా 70 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయంటే.. వీటి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓవైపు అధికారులు, కపౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ నకిలీ బెదిరింపులపై దర్యాప్తు జరుపుతున్నప్పటికీ పరిస్థితులో మార్పు కనిపించడం లేదు.ఈ క్రమంలో తాజాగా ‘బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ’ (బీసీఏఎస్) అప్రమత్తమైంది. విమానయాన సంస్థల సీఈఓలతో శనివారం సమావేశమైంది. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్‌లోని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో.. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించే బెదిరింపులను ఎదుర్కోవడానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానాన్ని (ఎస్ఓపీ) అనుసరించాలని సీఈవోలను కోరినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.బాంబు బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్న వేళ.. ప్రయాణికులకు అసౌకర్యం, క్యారియర్లకు నష్టం కలగకుండా ఈ సమస్యను పరిష్కరించడానికి కృషి చేయాలని సూచించింది. బెదిరింపులు, వాటి పట్ల తీసుకుంటున్న చర్యల గురించి తెలియజేయాలని కోరింది.ఇక గత వారం రోజులుగా 70కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. శనివారం ఒక్కరోజే వివిధ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలకు 30కి పైగా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇప్పటివరకు జరిపిన విచారణలో బెదిరింపులు వచ్చిన బెదిరింపులు వాటిలో ఐపీ (ఇంటర్నెట్ ప్రోటోకాల్) చిరునామాలు లండన్, జర్మనీ, కెనడా, యూఎస్ నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు. -
విమానాలకు వరుస బాంబు బెదిరింపులు.. అనుమానితుల జాడ గుర్తింపు
న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన పలు విమానాలకు వరుస బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతున్నాయి. గడిచిన మూడు రోజుల్లో వివిధ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 12 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ ఘటనలు అటు విమానయాన సంస్థలు, ఇటు ప్రయాణికుల్లోనూ ఆందోళన కలిగిస్తున్నాయి.అయితే విమానాల్లో బాంబు బెదిరింపులును కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇదే అంశంపై చర్చిందేందుకు రవాణాపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బుధవారం భేటీ అయ్యింది.తొలుత పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రిత్వ శాఖ అధికారులు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు ఈ అంశంపై చర్చించి ఆ వివరాలను కమిటీకి వెల్లడించారు. ఈ ఘటనల్లో కొంతమంది అనుమానితుల జాడ గుర్తించినట్లు, కీలక సమాచారాన్ని సేకరించామని చెప్పినట్లు సంబంధిత వర్గాలు మీడియాకు వెల్లడించాయి. అబద్దపు బెదిరింపు కాల్స్ చేసిన వారిని 'నో-ఫ్లై లిస్ట్'లో చేర్చాలని, అదేవిధంగా విమానాల్లో ఎయిర్ మార్షల్స్ సంఖ్యను పెంచడం వంటి చర్యలను ప్రబుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.48 గంటల్లో 10 విమానాలకు బాంబు బెదిరింపులుకాగా బుధవారం బెంగళూరు వెళ్తున్న అకాశా ఎయిర్ ఫ్లైట్, ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానానికి గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఇకమంగళవారం ఏకంగా పలు సంస్థలకు చెందిన ఏడు విమానాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీ-చికాగో ఎయిర్ ఇండియా విమానం, జైపూర్-బెంగళూరు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, దమ్మం-లక్నో ఇండిగో విమానం, దర్భంగా-ముంబై స్పైస్‌జెట్ విమానం, సిలిగురి-బెంగళూరు అకాశ ఎయిర్ విమానం, అలయన్స్ ఎయిర్ అమృత్సర్-డెహ్రాడూన్-ఢిల్లీ విమానం, మధురై నుంచి సింగపూర్ వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం సహా ఏడు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.సోమవారం రెండు ఇండిగో, ఎయిరిండియా విమానాలకు ఇలాంటి నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు పోలీసులతో కలిసి బెదిరింపుల వెనుక ఉన్న నిందితులను కనిపెట్టడానికి పని చేస్తోంది -
3 ఎయిర్‌లైన్స్‌పై డీజీసీఏ చర్యలు
న్యూఢిల్లీ: వివిధ నిబంధనల ఉల్లంఘనలకు గాను మూడు విమానయాన సంస్థలు, 1 ఫ్లయింగ్ ట్రైనింగ్ సంస్థపై విమానయాన రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ చర్యలు తీసుకుంది. రద్దయిన ఫ్లయిట్లకు సంబంధించి ప్రయాణికులకు పరిహారం చెల్లించనందుకు గాను ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు రూ. 10 లక్షల జరిమానా విధించింది. అలాగే సంక్షోభంలో చిక్కుకున్న స్పైస్‌జెట్‌పై పర్యవేక్షణ స్థాయిని పెంచడంతో పాటు పలు ఉల్లంఘనలకు గాను ఆకాశ ఎయిర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఫ్లయిట్స్ తరచుగా రద్దవుతున్న వార్తల నేపథ్యంలో ఆగస్టు 7, 8 తేదీల్లో కంపెనీ ఇంజినీరింగ్ యూనిట్ల స్పెషల్ ఆడిట్ నిర్వహించగా, నిర్దిష్ట లోపాలు తమ దృష్టికి వచ్చినట్లు డీజీసీఏ తెలిపింది. ఈ నేపథ్యంలోనే సంస్థపై పర్యవేక్షణను మరింతగా పెంచినట్లు పేర్కొంది. అటు, ట్రైనీ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రమాదంపై ఆడిట్ నిర్వహించిన మీదట అల్కెమిస్ట్ ఏవియేషన్ అనుమతులను డీజీసీఏ సస్పెండ్ చేసింది. -
ఎయిర్‌లైన్స్‌కు పండుగే!
న్యూఢిల్లీ: రానున్న పండుగల సందర్భంగా విమాన ప్రయాణాల బుకింగ్‌లకు ఇప్పటి నుంచే డిమాండ్ ఊపందుకుంది. దీంతో ఎయిర్‌లైన్స్ సంస్థలు పలు మార్గాల్లో 10 శాతం నుంచి 25 శాతం మధ్య టికెట్ ధరలను పెంచేశాయి. దీపావళి సమయంలో ప్రయాణ టికెట్ల ధరలు 10–15 శాతం పెరగ్గా.. ఓనమ్ సమయంలో (సెపె్టంబర్ 6–15 మధ్య) కేరళలోని పలు పట్టణాలకు వెళ్లే విమాన సరీ్వసుల్లో టికెట్ ధరలు గతేడాదితో పోల్చి చూస్తే 20–25 శాతం మేర పెరిగినట్టు ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో డేటా తెలియజేస్తోంది. దీపావళి సమయంలో ప్రయాణాలకు డిమాండ్ పెరుగుతోందని, దీంతో విమానయాన టికెట్ల ధరలు గతేడాదితో పోలిస్తే అధికమైనట్టు ఇక్సిగో గ్రూప్ సహ సీఈవో రజనీష్ కుమార్ తెలిపారు. → అక్టోబర్ 30–నవంబర్ 5 మధ్య ఢిల్లీ–చెన్నై మార్గంలో ఒకవైపు ప్రయాణానికి ఎకానమీ తరగతి నాన్ స్టాప్ ఫ్లయిట్ టికెట్ ధర రూ.7,618గా ఉంది. క్రితం ఏడాది నవంబర్ 10–16తో పోల్చి చూస్తే 25 శాతం ఎక్కువ. → ఇదే కాలంలో ముంబై–హైదరాబాద్ మార్గంలో ఫ్లయిట్ టికెట్ ధరలు 21 శాతం పెరిగి రూ.5,162కు చేరాయి. → ఢిల్లీ–గోవా సరీ్వసుల్లో టికెట్ ధరలు 19 శాతం పెరిగి రూ.5,999కు, ఢిల్లీ–అహ్మదాబాద్ మార్గంలో ఇంతే మేర పెరిగి రూ.4,980గా ఉన్నాయి. → హైదరాబాద్–తిరువనంతపురం మార్గంలో టికెట్ ధరలు 30 శాతం ఎగసి రూ.4,102కు చేరాయి. → కానీ, పండుగల సీజన్లోనే కొన్ని మార్గాల్లో టికెట్ చార్జీలు 1–27 శాతం మధ్య తగ్గడం గమనార్హం. ఉదాహరణకు బెంగళూరు–హైదరాబాద్ మార్గాల్లో టికెట్ ధరలు 23 శాతం తగ్గి రూ.3,383గా ఉంటే, ముంబై–జమ్మూ ఫ్లయిట్లలో 21 శాతం తక్కువగా రూ.7,826కే లభిస్తున్నాయి. → ముంబై–అహ్మదాబాద్ విమాన సరీ్వసుల్లో 27 శాతం తక్కువకే రూ.2,508 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ముంబై–ఉదయ్‌పూర్ మధ్య టికెట్ ధర 25 శాతం తగ్గి రూ.4,890గా ఉంది.విమాన ప్రయాణికుల జోరు దేశీయంగా జూలైలో 1.29 కోట్ల మందికిపైగా విమాన ప్రయాణాలు సాగించారు. 2023 జూలైతో పోలిస్తే ఇది 7.3 శాతం అధికం. అయితే 2024 జూన్‌తో పోలిస్తే గత నెల ప్రయాణికుల సంఖ్య 2.27 శాతం తక్కువగా ఉంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకారం.. దేశీయ విమాన ప్రయాణికుల విషయంలో ఇండిగో తన హవాను కొనసాగిస్తూ మార్కెట్ వాటాను జూలైలో 62 శాతానికి పెంచుకుంది. ఎయిర్ ఇండియా వాటా 14.3 శాతానికి వచ్చి చేరింది. విస్తారా వాటా 10 శాతానికి, ఆకాశ ఎయిర్ వాటా 4.7 శాతానికి పెరిగాయి. -
2024లో ప్రపంచంలో బెస్ట్ లో కాస్ట్ ఎయిర్‌లైన్స్ ఇవే (ఫోటోలు)
-
నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం.. 18 మంది దుర్మరణం
ఢిల్లీ: నేపాల్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఖాట్మాండ్‌లోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో రన్‌వే నుంచి టేకాఫ్ తీసుకునే విమానం జారిపోయి కుప్పకూలింది. దీంతో విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న 19 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు 14 మృతదేహాలు లభ్యం అయ్యాయి. పైలట్ ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన్ను ఖాఠ్మాండ్‌లోని మెడికల్ కాలేజీ టీచింగ్ ఆసుపత్రికి తరలించారు. #WATCH | Plane crashes at the Tribhuvan International Airport in Nepal's KathmanduDetails awaited pic.twitter.com/DNXHSvZxCz— ANI (@ANI) July 24, 2024ప్రమాదానికి గురైన విమానం శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందింది. ప్రమాదం జరిగిన వెంటనే అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకున్నాయి. సహాయక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నేపాల్ ఆర్మీ తమ బృందాన్ని పంపించింది. కొన్నేళ్ల క్రితం త్రిభువన్ ఎయిర్పోర్ట్ వద్ద బంగ్లాదేశ్ ప్రయాణికుల విమానం కూలిపోయింది. ఈ ప్రమదంలో కూడా పదుల సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందారు. #BREAKING : A plane has crashed at Tribhuvan International Airport. Sources at TIA reported that the aircraft skidded off the runway during takeoff as it was departing for Pokhara with 19 passengers. #Nepal #planecrash #TribhuvanInternationalAirport #skid #landing #airport… pic.twitter.com/ILnl0zQnZH— mishikasingh (@mishika_singh) July 24, 2024 -
7030 విమానాలు రద్దు.. గవర్నమెంట్ డేటా
దేశీయ విమానయాన సంస్థలు ఈ ఏడాది మే 31 వరకు 7,030 షెడ్యూల్ విమానాలను రద్దు చేశాయి. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ వెల్లడించారు. మంత్రిత్వ శాఖ సోమవారం రాజ్యసభకు సమర్పించిన డేటా ప్రకారం.. క్యారియర్లు 2024లో 4,56,919 షెడ్యూల్డ్ డిపార్చర్లను నిర్వహించాలి. 2022లో 6,413 విమానాలు రద్దయ్యాయని, 2023లో ఈ సంఖ్య 7,427కి పెరిగిందని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి తెలిపారు.డిజి యాత్ర (Digi Yatra) గురించి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, దశలవారీగా దేశవ్యాప్తంగా విమానాశ్రయాలలో దీనిని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 2.5 కోట్లకుపైగా విమాన ప్రయాణికులు డిజి యాత్రను ఉపయోగించారు.డిజి యాత్ర అనేది ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ (FRT) ఆధారంగా రూపొందించారు. విమానాశ్రయాల్లోని వివిధ చెక్పాయింట్ల వద్ద కాంటాక్ట్‌లెస్ ప్రయాణం కోసం దీనిని ప్రవేశపెట్టారు. ఇందులో ప్రయాణికుల డేటా అంత ఉంటుంది. అయితే విమానం బయలుదేరిన 24 గంటల తర్వాత సిస్టమ్ నుంచి డేటా తొలగిస్తుంది. ఇది ప్రయాణికులకు సంబంధించిన విషయాలను గోప్యంగా ఉంచుతుంది. -
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమాన ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. ఢిల్లీ వెళ్లాల్సిన ఆకాశ ఎయిర్ లైన్స్ విమానం ఆలస్యం అయింది. సోమవారం ఉదయం 5 గంటలకు వెళ్లాల్సిన విమానం ఇప్పటికి బయలుదేరలేదు. ఇప్పటికి వెళ్లకపోవటంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసల్యంపై ఎయిర్‌లైన్స్ సిబ్బందిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
కేంద్ర కేబినెట్‌తో ‘విమానం’ మోత!
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాని మోదీ, కేంద్ర మంత్రుల ప్రమాణస్వీకారానికి అన్ని రాష్ట్రాల నుంచి నేతలు, కార్యకర్తలు ఢిల్లీకి తరలివెళ్లారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు ఎంపీలకు కేబినెట్లో చోటు దక్కడంతో.. వారి అనుచరులు, కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలోనే హస్తినకు పయనమయ్యారు. ఇంతవరకు బాగానే ఉన్నా వారంతా తిరిగిరావడానికి మాత్రం ఇక్కట్లు మొదలయ్యాయి. విమానాలకు విపరీతంగా డిమాండ్ పెరగడంతో.. ఎయిర్‌లైన్స్ సంస్థలు చార్జీలను రెండు, మూడింతలు పెంచేశాయి. మరోవైపు రైళ్లలోనూ విపరీతంగా వెయిటింగ్ లిస్టులతో సీట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఎక్కడికి వెళ్లాలన్నా.. తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీ వెళ్లేప్పుడు రూ.10– 12 వేలు టికెట్ ధర ఉండగా.. తిరిగి వచ్చేందుకోసం టికెట్ల ధరలు రూ.25 వేల నుంచి రూ.45 వేల వరకు టికెట్ చార్జీలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ (గన్నవరం), రేణిగుంట (తిరుపతి), విశాఖపట్నం, రాజమహేంద్రవరం ఇలా ఎక్కడికైనా ఇదే పరిస్థితి. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు దాదాపు 20కిపైగా విమాన సర్వీసులు.. విజయవాడ, రేణిగుంట(తిరుపతి), విశాఖపట్నం, రాజమహేంద్రవరంలకు రెండు, మూడు చొప్పున సర్వీసులు ఉన్నాయి. ఒకట్రెండ్ స్టాప్‌లతో మరో పది వరకు సర్వీసులు ఉన్నాయి. వీటన్నింటిలోనూ చార్జీలు పెరిగిపోయాయి. రైళ్లలో సీట్ల కోసం ‘ఈక్యూ’రిక్వెస్టులు విమాన టికెట్ భారం ఎక్కువైందని భావించేవారు, టికెట్ దొరకనివారు.. రైళ్లలో తిరిగి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ సికింద్రాబాద్, విజయవాడ ప్రాంతాలకు ఉన్న ఏడెనిమిది రైలు సరీ్వసుల్లో స్లీపర్‌క్లాస్‌లో భారీగా వెయిటింగ్ లిస్టులు ఉంటే.. ఏసీ కోచ్‌లలో సీట్లు అందుబాటులోనే లేవని చూపిస్తోంది. దీంతో రైలు టికెట్ కన్ఫర్మేషన్ కోసం ఈక్యూ (ఎమర్జెన్సీ కోటా) లెటర్ ఇవ్వాలంటూ ఎంపీలను కోరుతున్నారు. అయినా సీట్లు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. సోమవారం ఉదయం వెళ్లాల్సినవారు శనివారమే ఈక్యూ లెటర్ ఇచి్చనా.. టికెట్లు కన్ఫర్మ్ కాక ఢిల్లీలోనే ఆగిపోయారు. -
విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. 30 నిమిషాలే టైమ్!
Airlines Baggage : విమాన ప్రయాణికులకు శుభవార్త. ఫ్లైట్ దిగిన తర్వాత బ్యాగేజీకి కోసం ఎయిర్‌పోర్టుల్లో గంటలకొద్దీ ఎదురుచూడాల్సిన దుస్థితి ప్రయాణికులకు తప్పనుంది. విమానాశ్రయాలలో ప్రయాణికులకు వేగంగా బ్యాగేజీ డెలివరీని అందించాలని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) దేశంలోని ఏడు విమానయాన సంస్థలను ఆదేశించింది. దేశంలోని ప్రధాన విమానాశ్రయాల్లో బ్యాగేజీ రాకపోకలను నెలల తరబడి పర్యవేక్షించిన బీసీఏఎస్ అనుమతించదగిన వెయిటింగ్ టైమ్ మించిపోతుందనే ఆందోళనలను ఉటంకిస్తూ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఆపరేషన్, మేనేజ్మెంట్ మరియు డెలివరీ అగ్రిమెంట్ ప్రకారం (OMDA) ప్రమాణాల ప్రకారం.. చివరి చెక్-ఇన్ బ్యాగేజీ చేరుకున్న 30 నిమిషాలలోపు డెలివరీ అయ్యేలా చూడాలని ఎయిర్ ఇండియా, ఇండిగో, అకాస, స్పైస్‌జెట్, విస్తారా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కనెక్ట్ , ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలకు బీసీఏఎస్ సూచించింది. ఈ ఆదేశాలు అమలు చేయడానికి విమానయాన సంస్థలకు ఫిబ్రవరి 26 వరకు బీసీఏఎస్ సమయం ఇచ్చింది. బీసీఏఎస్ జనవరిలో ఆరు ప్రధాన విమానాశ్రయాల్లోని బెల్ట్ ప్రాంతాలలో బ్యాగేజీ చేరే సమయాన్ని ట్రాక్ చేయడానికి పర్యవేక్షణ ప్రక్రియను ప్రారంభించింది. పనితీరు మెరుగుపడినప్పటికీ నిర్దేశించిన ప్రమాణాల కంటే ఇది ఇంకా తక్కువగా ఉందని సమీక్ష వెల్లడించింది. ఇంజన్ షట్‌డౌన్ అయిన 10 నిమిషాలలోపు మొదటి బ్యాగ్ బెల్ట్‌కు చేరుకోవాలని, చివరి బ్యాగ్ 30 నిమిషాలలోపు చేరుకోవాలని ఓఎండీఏ నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. పర్యవేక్షణ ప్రక్రియ ప్రస్తుతం ఆరు ప్రధాన విమానాశ్రయాలలోనే కేంద్రీకృతమై ఉన్నప్పటికీ బీసీఏఎస్ నిర్వహించే అన్ని విమానాశ్రయాలలో తప్పనిసరి ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూడాలని విమానయాన సంస్థలను ఆదేశించింది. -
అన్నింటికీ చాట్‌బాట్ అంటే ఇలాగే ఉంటుంది.. తిక్క కుదిరిందిగా!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఇప్పుడు చాలా కంపెనీలు విస్తృతంగా వినియోగిస్తున్నాయి. ముఖ్యంగా కస్టమర్లతో సంభాషించడానికి మానవ ప్రమేయం లేకుండా చాట్బాట్లను ( chatbot )ఉపయోగిస్తున్నాయి. అంటే కస్టమర్లు ఆయా కంపెనీలతో తమ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు చాట్బాట్లు సమాధానమిస్తాయి. ఇక్కడే చిక్కంతా వస్తోంది. చాట్‌బాట్ చేసిన తప్పునకు కెనడాకు ( Air Canada ) చెందిన ప్రముఖ ఎయిర్‌లైన్ సంస్థ ఎయిర్ కెనడా పరిహారం చెల్లించాల్సి వచ్చింది. సీబీసీ న్యూస్ కథనం ప్రకారం.. 2022లో జేక్ మోఫాట్ అనే వ్యక్తి టొరంటోలో తన అమ్మమ్మ మరణించినప్పుడు అంత్య క్రియలకు వెళ్లేందుకు విమోచన ఛార్జీలకు తనకు అర్హత ఉందో లేదో తెలుసుకోవడానికి ఎయిర్ కెనడా విమానయాన సంస్థను సంప్రదించాడు. ఎయిర్ కెనడా సపోర్ట్ చాట్‌బాట్‌తో సంప్రదిస్తున్నప్పుడు, మోఫాట్ కూడా బీవ్మెంట్ ఛార్జీలను ముందస్తుగా మంజూరు చేస్తారా అని అడిగారు. ఆన్లైన్ ఫారమ్‌ను పూరించడం ద్వారా "మీ టిక్కెట్‌ను జారీ చేసిన తేదీ నుంచి 90 రోజులలోపు" వాపసు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని చాట్‌బాట్ మోఫాట్కి తెలిపింది. దీంతో బ్రిటిష్ కొలంబియా నివాసి అయిన మోఫాట్ టొరంటోలో తన అమ్మమ్మ అంత్యక్రియలకు హాజరు కావడానికి ఆన్లైన్లో టిక్కెట్లను బుక్ చేశాడు. అయితే ఆ తర్వాత అతను బీవ్మెంట్ ఛార్జీ, సాధారణ ఛార్జీల మధ్య వ్యత్యాసం వాపసు కోసం దరఖాస్తు చేసినప్పుడు, ఎయిర్ కెనడా అతనికి పూర్తి ప్రయాణానికి బీవ్మెంట్ రేట్లు వర్తించవని తెలియజేసింది. దీనికి తాను తీసుకున్న చాట్‌బాట్ సంభాషణ స్క్రీన్‌షాట్‌ను మోఫాట్ ఎయిర్ కెనడాకు షేర్ చేశారు. దీంతో నాలుక కరుచుకున్న ఎయిర్ కెనడా తమ చాట్‌బాట్ "తప్పుదోవ పట్టించే పదాలను" ఉపయోగించినట్లు అంగీకరించింది. సరైన సమాచారంతో బాట్‌ను అప్డేట్ చేస్తామని చెప్పింది. దీంతో మోఫాట్ ఎయిర్ కెనడాపై దావా వేశారు. దీంతో బాధితుడికి రావాల్సిన ఛార్జీల వ్యత్యాసం 650.88 కెనేడియన్ డాలర్లు (సుమారు రూ.40 వేలు)తోపాటు వడ్డీ 36.14 కెనేడియన్ డాలర్లు, ఫీజు 125 కెనేడియన్ డాలర్లు చెల్లించాలని ఎయిర్ కెనడాను సివిల్ రిజల్యూషన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. అయితే చాట్‌బాట్ ప్రత్యేక చట్టపరమైన సంస్థ అని, దాని చర్యలతో తమకు సంబంధం లేదని ఎయిర్ కెనడా వాదిస్తోంది. -
ఒకేసారి 150 విమానాలు.. హైదరాబాద్ వేదికగా ఆర్డర్
WingsIndia2024: ప్రముఖ విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌లైన్స్ ఏకంగా 150 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలను కొనుగోలు చేయడానికి ఆర్డర్ ఇచ్చింది. హైదరాబాద్‌లో జరిగిన వింగ్స్ ఇండియా ఈవెంట్లో దీనికి సంబంధించిన ఒప్పందం కుదుర్చుకున్నట్లు సీఈఓ వినయ్ దూబే వెల్లడించారు. ఆకాశ ఎయిర్ భారతదేశపు సరికొత్త విమానయాన సంస్థ అయినప్పటికీ.. 2022లో కార్యకలాపాలను ప్రారంభించినప్పటి నుంచి నాలుగు శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఇప్పటికే ఈ కంపెనీ గతంలో 72 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలకు ఆర్డర్ ఇచ్చింది. ఇందులో 22 విమానాలను డెలివరీ చేసుకుని నిర్వహణలో ఉంచింది. అంతర్జాతీయ విస్తరణ వైపు అడుగులు వేస్తున్న ఆకాశ ఎయిర్ ప్రణాళికలో భాగంగానే ఈ కొత్త ఆర్డర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అనుకున్నవన్నీ సవ్యంగా జరిగితే.. భారత్ నుంచి ఆగ్నేయాసియా, మిడిల్ ఈస్ట్ సహా సమీప విదేశీ గమ్యస్థానాలకు వెళ్లేందుకు వీలుగా బోయింగ్ విమానాలను ఉపయోగిస్తారు. ఇదీ చదవండి: టీసీఎస్ వర్క్ ఫ్రమ్ హోమ్.. సీఈఓ ఏమన్నారంటే? గత ఏడాది మరో ఎయిర్‌లైన్స్‌లో చేరటానికి ఎలాంటి నోటీసు లేకుండానే సుమారు 40 మంది పైలట్లు రాజీనామా చేయడంలో విమానయాన సంస్థ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో సంస్థ సంక్షోభంలోకి వెళ్ళింది. ఆ సమయంలోనే ఆకాశ ఎయిర్ తన కార్య కలాపాలను నిలిపివేసే అవకాశం ఉందని చాలామంది భావించారు. ఆ తరువాత కొత్త ఫైలెట్లను నియమించుకుని ముందుకు సాగుతోంది. Thank you, Hon’ble @JM_Scindia for your constant support and encouragement. We are proud to be a part of the India growth story and are committed to create an inclusive travel environment by connecting people, places, and cultures. #AkasaAir #ItsYourSky #WingsIndia2024 https://t.co/5AhlZ30z1j — Akasa Air (@AkasaAir) January 18, 2024 -
లక్షద్వీప్‌కు త్వరలో స్పైస్‌జెట్ సర్వీసులు
ముంబై: త్వరలో లక్షద్వీప్‌తో పాటు అయోధ్యకు విమాన సర్వీసులు ప్రారంభించనున్నట్లు విమానయాన సంస్థ స్పైస్‌జెట్ చీఫ్ అజయ్ సింగ్ తెలిపారు. కంపెనీ మరింత పటిష్టమయ్యేందుకు ఇటీవల సమీకరించిన నిధులు దోహదపడగలవని ఆయన వివరించారు. ప్రస్తుతం నిలిపివేసిన విమానాలను తిరిగి వినియోగంలోకి తెచ్చేందుకు కూడా ఉపయోగపడగలవని పేర్కొన్నారు. కంపెనీ వార్షిక సర్వ సభ్య సమావేశంలో పాల్గొన్న సందర్భంగా సింగ్ ఈ విషయాలు తెలిపారు. లక్షద్వీప్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై మాల్దీవులకు చెందిన కొందరు మంత్రులు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం ఇరు దేశాల మధ్య వివాదానికి దారి తీసిన నేపథ్యంలో లక్షద్వీప్‌కు స్పైస్‌జెట్ సర్వీసుల ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది. -
వికటించిన క్రిస్మస్ డిన్నర్.. 700 మందికి అస్వస్థత
క్రిస్మస్ సందర్భంగా ఓ విమానయాన సంస్థ తమ ఉద్యోగులను ఖుషీ చేయాలని నిర్ణయించింది. ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ అట్లాంటిక్ కంపెనీ తవ వద్ద పనిచేసే వారికి పసందైన విందు ఇవ్వాలని ప్లాన్ చేసింది. అనుకున్నట్లుగానే గ్రాండ్‌గా డిన్నర్ పార్టీ ఇచ్చింది. అయితే క్రిస్మిస్ డిన్నర్ ప్లాన్ బెడిసి కొట్టింది. భోజనం చేసిన ఉద్యోగుల్లో దాదాపు 700 మందికి అస్వస్థతకు గురయ్యారు. డిన్నర్ చేసిన తర్వాత ఉద్యోగులు.. వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. అయితే డిన్నర్‌కు ఇచ్చిన మెనూలో ఏయే వంటకాలు ఉన్నాయన్న విషయం తెలియరాలేదు. అంతేగాక భారీ సంఖ్యలో ఉద్యోగుల అనారోగ్యానికి గురవడం వెనక ఉన్న నిర్ధిష్ట కారణం తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఎయిర్‌బస్ సంస్థ కూడా ఇప్పటి వరకు స్పందించలేదు. కాగా ప్రపంచంలోని అతిపెద్ద విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్‌కు చెందిన అనుబంధ సంస్థే ఎయిర్‌బస్ అట్లాంటిక్. ఆ సంస్థ కింద అయిదు దేశాల్లో సుమారు 15,000 మంది పనిచేస్తున్నారు. ఫుడ్ పాయిజనింగ్‌కు సంబంధించిన దర్యాప్తు జరుగుతున్నట్లు ఏఆర్తెఎస్లి ఆరోగ్య సంస్థ తెలిపింది. ఎయిర్‌బస్ సంస్థలో సుమారు లక్షా 34 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. ఎయిర్‌క్రాఫ్ట్, హెలికాప్టర్, డిఫెన్స్, స్పేస్, సెక్యూరిటీ పరిశ్రమలు ఆ కంపెనీ పరిధిలో ఉన్నాయి. చదవండి: విమానం కంటే స్పీడ్‌గా వెళ్లే రైలు.. కథ కంచికే.. -
ఆన్‌టైమ్‌లో బెస్ట్.. ఆకాశ ఎయిర్
తరచూ ఫ్లైట్ ఎక్కే ప్రయాణికులు విమానాల ఆలస్యం, రద్దు వంటి సమస్యలతో ఎప్పుడోసారి ఇబ్బందులు పడే ఉంటారు. ఇలాంటి సమస్యలు అన్ని ఎయిర్‌లైన్స్‌లోనూ ఉంటాయి. అయితే దేశంలోని ఏయే విమానయాన సంస్థలో ఇలాంటి సమస్యలు ఏ స్థాయిలో ఉన్నాయనే దానిపై పౌర విమానయాన సంస్థ తాజాగా గణాంకాలు విడుదల చేసింది. సమయ పనితీరు (ఆన్‌టైమ్ పర్ఫార్మెన్స్- OTP) మెరుగ్గా ఉన్న ఎయిర్‌లైన్స్ జాబితాలో ఆకాశ ఎయిర్ (Akasa Air) అగ్రస్థానంలో ఉంది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకారం.. 2023 నవంబర్ నెలలో ఆకాశ ఎయిర్ సమయ పనితీరు 78.2 శాతం వద్ద ఉంది. ఇండిగో సంస్థ 77.5 శాతంతో రెండవ స్థానంలో నిలిచింది. 72.8 శాతం ఓటీపీతో విస్తారా మూడవ స్థానంలో ఉండగా స్పైస్‌జెట్ 41.8 శాతంతో ఆధ్వాన సమయ పనితీరును నమోదు చేసింది. ఇక అతిపెద్ద దేశీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా 62.5 శాతంతో రెండో అధ్వాన ఆన్‌టైమ్ పర్ఫార్మెన్స్ ఎయిర్‌లైన్‌గా నిలిచింది. ఫ్లై బిగ్.. రద్దుల్లో అత్యధికం దేశంలోని ప్రధాన మెట్రో నగరాలైన బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, ముంబై విమానాశ్రయాలలో నమోదైన వివరాల ఆధారంగా దేశీయ విమానయాన సంస్థల ఆన్-టైమ్ పర్ఫార్మెన్స్ను లెక్కించారు. ఇక నవంబర్‌లో దేశీయ విమానయాన సంస్థల మొత్తం సరాసరి రద్దు రేటు 0.73 శాతంగా ఉంది. ఇందులో ఫ్లై బిగ్ అత్యధికంగా 7.64 శాతం రద్దు రేటును నమోదు చేయగా ఎయిర్ ఇండియా రద్దు రేటు అత్యల్పంగా 0.10 శాతంగా నమోదైంది. ఇండిగో విమానాల రద్దు రేటు 0.90 శాతంగా ఉంది. ఈ ఏడాది నవంబరులో దేశీయ విమానయాన సంస్థలకు సంబంధించి ప్రయాణికుల నుంచి మొత్తం 601 ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదు రేటు ప్రతి 10,000 మంది ప్రయాణికులకు సుమారు 0.47గా ఉంది. ఇండియావన్ ఎయిర్‌పై అత్యధికంగా ప్రతి వెయ్యి మంది ప్రయాణికులకు 99.1 ఫిర్యాదులు చొప్పున నమోదయ్యాయి. ఇక విస్తారా, ఇండిగో సంస్థలు వరుసగా 0, 0.1 ఫిర్యాదు రేట్లు నమోదు చేశాయి. -
వచ్చే ఏడాది 25.7 బిలియన్ డాలర్ల లాభాలు
న్యూఢిల్లీ: ప్రయాణికులు, కార్గో విభాగాల వృద్ధి మళ్లీ సాధారణ స్థాయికి తిరిగొస్తున్న నేపథ్యంలో 2024లో అంతర్జాతీయంగా విమానయాన పరిశ్రమ నికర లాభాలు 25.7 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండగలవని ఎయిర్‌లైన్స్ సమాఖ్య ఐఏటీఏ తెలిపింది. 2023లో ఇది 23.3 బిలియన్ డాలర్లుగా ఉండవచ్చని పేర్కొంది. ఈ ఏడాది జూన్‌లో అంచనా వేసిన 9.8 బిలియన్ డాలర్ల కన్నా ఇది గణనీయంగా ఎక్కువగా ఉండనున్నట్లు వివరించింది. ‘2024లో రికార్డు స్థాయిలో 470 కోట్ల మంది ప్రయాణాలు చేయొచ్చని అంచనా. 2019లో కరోనాకు పూర్వం నమోదైన రికార్డు స్థాయి 450 కోట్ల మందికన్నా ఇది అధికం‘ అని ఐఏటీఏ తెలిపింది. ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్ తిరిగి 2019 స్థాయికి చేరుతుండటంతో ఎయిర్‌లైన్స్ ఆర్థికంగా కోలుకునేందుకు తోడ్పాటు లభిస్తోందని 2023 సమీక్ష, 2024 అంచనాల నివేదికను విడుదల చేసిన సందర్భంగా ఐఏటీఏ డైరెక్టర్ (పాలసీ, ఎకనామిక్స్) ఆండ్రూ మ్యాటర్స్ చెప్పారు. మరోవైపు, ప్రస్తుత ఏడాది కార్గో పరిమాణం 58 మిలియన్ టన్నులుగా ఉండగా వచ్చే ఏడాది 61 మిలియన్ టన్నులకు చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. 2.7 శాతం మార్జిన్.. ‘అవుట్‌లుక్ ప్రకారం 2024 నుంచి ప్యాసింజర్, కార్గో విభాగాల వృద్ధి మళ్లీ సాధారణ స్థాయికి తిరి గి వచ్చే అవకాశం ఉంది. రికవరీ ఆకట్టుకునే విధంగానే ఉన్నా నికర లాభాల మార్జిన్ 2.7 శాతానికే పరిమితం కావచ్చు. ఇలాంటి మార్జిన్లు ఏ రంగంలోనూ ఇన్వెస్టర్లకు ఆమోదయోగ్యం కావు‘ అని ఐఏ టీఏ డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్‡్ష చెప్పారు. విమానయాన సంస్థలు కస్టమర్ల కోసం ఒకదానితో మరొ కటి తీవ్రంగా పోటీపడటమనేది ఎప్పుడూ ఉంటుందని.. కాకపోతే నియంత్రణలు, మౌలిక సదుపాయాల వ్యయాలు, సరఫరా వ్యవస్థల్లో కొందరి గు త్తాధిపత్యం వంటివి పరిశ్రమకు భారంగా ఉంటున్నాయని ఆయన పేర్కొన్నారు. భారత మార్కెట్ ఎంతో ఆసక్తికరంగా ఉందని, తాను అత్యంత ఆశావహంగా ఉన్నానని వాల్‡్ష తెలిపారు. ఐఏటీఏలో 300 పైచిలుకు ఎయిర్‌లైన్స్‌కు సభ్యత్వం ఉంది. ఐఏటీఏ నివేదికలో మరిన్ని విశేషాలు.. ► 2023లో ఎయిర్‌లైన్స్ పరిశ్రమ నిర్వహణ లాభం 40.7 బిలియన్ డాలర్లుగా ఉండవచ్చు. వచ్చే ఏడాది ఇది 49.3 బిలియన్ డాలర్లకు చేరవచ్చు. 2024లో పరిశ్రమ మొత్తం ఆదాయం 2023తో పోలిస్తే 7.6 శాతం వృద్ధి చెంది 964 బిలియన్ డాలర్లకు చేరవచ్చు. ►ఆసియా పసిఫిక్ ప్రాంతంలో కరోనా ప్రభావాల నుంచి భారత్, చైనా, ఆ్రస్టేలియా దేశాల్లో అంతర్గత మార్కెట్లు వేగంగా కోలుకున్నాయి. అయితే, 2023 మధ్య నాటికి గానీ అంతర్జాతీయ ప్రయాణాలపై చైనాలో ఆంక్షలు పూర్తిగా సడలకపోవడంతో ఆసియా పసిఫిక్ మార్కెట్లో ఇంటర్నేషనల్ ప్రయాణికుల రాకపోకలు అంతంతమాత్రంగానే నమోదయ్యాయి. ఆసియా పసిఫిక్ ప్రాంతం 2023లో 0.1 బిలియన్ డాలర్ల నికర నష్టం ప్రకటించవచ్చని, 2024లో మాత్రం 1.1 బిలియన్ డాలర్ల నికర లాభం నమోదు చేయొచ్చని అంచనా. ►అంతర్జాతీయంగా ఆర్థిక పరిణామాలు, యుద్ధం, సరఫరా వ్యవస్థలు, నియంత్రణలపరమైన రిసు్కలు మొదలైనవి ఎయిర్‌లైన్స్ పరిశ్రమ లాభదాయకతపై సానుకూలంగా గానీ లేదా ప్రతికూలంగా గానీ ప్రభావం చూపే అవకాశం ఉంది. -
టాప్ విరిగిన విమానం, భయంతో కేకలు: ఈ షాకింగ్ ఘటన ఎక్కడ?
విమాన ప్రయాణంలో పొరపాటున కిటికీ ఓపెన్ చేస్తేనే చాలా ప్రమాదం. అలాంటిది ఒక విమానం ముందు భాగం పై భాగంలో కొంత లేచి పోతే.. పరిస్థితి ఏంటి? మిరాకిల్ ఏంటంటే ఇది సేఫ్‌గా ల్యాండ్ అయింది. ఒక్కరు తప్ప అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఏంటి నమ్మలేక పోతున్నారా? అసలు ఊహించడానికే కష్టంగా ఉందా? కానీ షాకింగ్ ఘటన నిజంగానే చోటు చేసుకుంది. ఏప్రిల్ 28, 1988, విమానయాన చరిత్రలో అత్యంత దిగ్భ్రాంతికరమైన రోజు. బోయింగ్ 737-297 విమానంలో ప్రయాణించిన ప్రయాణికులు, సిబ్బంది మాత్రమే, ఎవరు తలచుకున్నా వెన్నులో వణుకు పుట్టే ఘటన ఇది. అలోహా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 243 89 మంది ప్రయాణికులు , ఆరుగురు సిబ్బందిని హవాయి బిగ్ ఐలాండ్‌లోని హిలో నుండి ఓహులోని హోనోలులు వరకు 300కిమీల హాప్లో తీసుకువెళుతోంది ఇంతలో ఫ్యూజ్లేజ్లోని పైభాగం మధ్యలోసగం భాగం ఎగిరిపోయింది. ట్విన్-ఇంజన్, 110-సీట్ బోయింగ్ జెట్ 40 నిమిషాల ఫ్లైట్‌లో సగం దూరంలో ఉండగా, అకస్మాత్తుగా క్యాబిన్ కంట్రోల్ పోయింది. ఫ్యూజ్‌లేజ్‌లో కొంత భాగం విరిగిపోయింది. అంతే ఒక్కసారిగా భయానక వాతావరణం ఏర్పింది. పసిఫిక్ మహాసముద్రం మీదుగా 24వేల అడుగుల ఎత్తులో విపరీతమైన గాలులకు ప్రయాణీకులు బెంబేలెత్తిపోయారు. భయంతో కేకలు వేశారు. ల్యాండ్ అయ్యే లోపే కూలిపోవడం ఖాయమని దాదాపు అందరూ వణికిపోయారు. భారీ సీలింగ్ ప్యానెల్లు ప్రయాణీకుల తలపై పడ్డాయి. అందరికీ దెబ్బలు, రక్త స్రావాలు. ఆక్సిజన్ మాస్క్‌లు పెట్టుకున్నా.. ఏం లాభం లేదు.. ఉరుములు, తుఫానులాంటి వాతావరణం. కానీ ఆశ్చర్యకరంగా ఈ విపత్కర పరిస్థితి సంభవించిన పదమూడు నిమిషాల తర్వాత మౌయిలోని కహులుయ్ విమానాశ్రయంలో ఈ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. అంతగా డ్యామేజ్ అయిన విమానం సేఫ్‌గా ల్యాండ్ అవడం చూసి గ్రౌండ్ ఎమర్జెన్సీ సిబ్బంది కూడా తమను తాము నమ్మలేకపోయారు. Let’s take a moment to remember Aloha Airlines Flight 243. On April 28th 1988 the roof ripped off the Boeing 737 at 24,000 ft. The chief flight attendant (the only fatality) fell from the plane and debris struck the tail section. Amazingly the pilot still managed to land safely… pic.twitter.com/TAXzlW6KNo — Mothra P.I. (@Hardywolf359) November 17, 2022 ఇప్పటికీ దొరకని ఎయిర్‌హోస్టెస్ మృతదేహం విమానంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సంఘటన నుండి బయటపడ్డారు. 95 మందిలో కేవలం ఒకరు మృతి చెందగా, ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. విషాదం ఏమిటంటే ప్రయాణీకులకు సేవలందిస్తున్న ఫ్లైట్ అటెండెంట్ క్లారాబెల్లె లాన్సింగ్ ప్రాణం మాత్రం గాల్లోనే కలిసిపోయాయి. ఆమె మృతదేహం ఇప్పటికీ లభ్యం కాలేదు. ''అకస్మాత్తుగా, పెద్ద శబ్దం, చప్పుడు వినిపించింది, కానీ పేలుడు కాదు, ఒత్తిడిలో ఏదో మార్పు వచ్చినట్లు అనిపించింది. పైకి చూసాను , విమానం యొక్క ఎడమ ఎగువ భాగం విచ్ఛిన్నం కావడం, విరగడం, ముక్కలు దూరంగా ఎగిరిపోవడం చూశాను. ఇది ఒక గజం వెడల్పు గల రంధ్రంతో ప్రారంభమై, అలా విరుగుతూనే ఉంది’’ అని విమానం వెనుక కూర్చున్న ఒక ప్రయాణీకుడు ఎరిక్ బెక్లిన్ ది వాషింగ్టన్ పోస్ట్‌తో తన భయంకరమైన అనుభవాన్ని పంచుకున్నారు. ది మిరాకిల్ ల్యాండింగ్ ఆఫ్ అలోహా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 243గా సినిమాగా కూడా తెరకెక్కింది ఈ స్టోరీ. నిజమైన హీరోలంటూ ప్రశంసలు పర్స్సర్ క్లారాబెల్లె లాన్సింగ్తోపాటు, జేన్ సటో-టోమిటా , మిచెల్ హోండా విమానంలో క్యాబిన్ సిబ్బందిగా ఉన్నారు. కెప్టెన్ రాబర్ట్ స్కోర్న్స్టెయినర్కు కాక్‌పిట్‌లో ఫస్ట్ ఆఫీసర్. కోపైలట్ మాడెలైన్ టాంప్కిన్స్ ఉన్నారు. ఈ ఘటనలో వీళ్లు నిజమైన హీరోలంటూ పలువురి ప్రశంసలు దక్కించుకున్నారు. ఇదిఇలా ఉంటే యూఎస్ నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) నివేదిక ప్రకారం, డికంప్రెషన్, స్ట్రక్చరల్ ఫెయిల్యూర్ వల్ల జరిగింది. విమానంలో ఎడమ ఇంజిన్ కూడా విఫలమైంది. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ సమాచారం ప్రకారం బోర్డింగ్ సమయంలో విమానం ఫ్యూజ్‌లేజ్‌లో పగుళ్లను ఒకామె గమనించింది. అయితే ఆమె టేకాఫ్‌కి ముందు సిబ్బందికి చెప్పలేదు. -
ఎయిర్‌లైన్స్‌కు కలిసొచ్చిన వరల్డ్‌కప్ ఫైనల్ - కనీవినీ ఎరుగని సరికొత్త రికార్డ్..
పండుగ సీజన్లో వ్యాపారాలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా జరుగుతాయని అందరూ నమ్ముతారు. అయితే ఆ పండుగ సీజన్ కంటే వరల్డ్‌కప్ బాగా కలిసొచ్చిందని ఎయిర్‌లైన్స్ తాజాగా వెల్లడించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ రోజు దేశంలో సుమారు 4.6 లక్షలమంది విమాన ప్రయాణం చేశారని, దీపావళికి కూడా చేయలేని పనిని క్రికెట్ వరల్డ్ కప్ చేసిందని ఎయిర్‌లైన్స్ స్పష్టం చేసింది. గత దీపావళి కంటే కూడా ప్రయాణికుల సంఖ్య చాలా ఎక్కువని తెలిపారు. దీపావళి సమయంలో విమాన ప్రయాణికుల సంఖ్య పెరిగింది, కానీ అంత కంటే ఎక్కువ వరల్డ్‌కప్ ఫైనల్ రోజు ప్రయాణించారు. భారత్ ప్రపంచకప్ ఫైనల్ చేరడంతో అహ్మదాబాద్ చేరుకోవాలనే ఉత్సాహం అభిమానుల్లో కనిపించి సరికొత్త రికార్డు సృష్టించింది. పెరిగిన చార్జీలను కూడా లెక్క చేయకుండా ఒక్కసారిగా ప్రయాణికులు రావడంతో విమానయాన సంస్థల ఆదాయం భారీగా పెరిగింది. ప్రపంచకప్ ఫైనల్ రోజు కొందరు రూ. 20,000 నుంచి రూ. 40,000 వెచ్చించి కూడా టికెట్స్ కొనుగోలు చేశారు. ఫ్లైట్ చార్జీలు ఎక్కువని కొందరు ట్రైన్ ఏసీ క్లాసులు బుక్ చేసుకుని ప్రయాణించారు. అటు విమానయాన సంస్థలు, ఇటు రైల్వే సంస్థలు బాగా సంపాదించుకోగలిగాను. ఒకే రోజులో 4 లక్షల మంది విమాన ప్రయాణం చేయడం ఓ అరుదైన రికార్డ్. ఇది మాకు చారిత్రాత్మకమైన అవకాశం అని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఇదీ చదవండి: టీమిండియా ఓటమి - పారిశ్రామిక వేత్తల ట్వీట్స్ వైరల్ అక్టోబర్ నెలలో ప్రారంభమయ్యే పండుగ సీజన్ సద్వినియోగం చేసుకోవడానికి విమానయాన సంస్థలు గత సెప్టెంబర్ చివరి వారంలో అడ్వాన్స్ బుకింగ్ చార్జీలను పెంచడం ప్రారంభించాయి. కొందరు పెరిగిన చార్జీలను దృష్టిలో ఉంచుకుని ట్రైన్ జర్నీ చేయడానికి సిద్ధమయ్యారు. మొత్తం మీద ఇండియా వరల్డ్‌కప్ కోల్పోయినప్పటికీ.. విమానయాన సంస్థలు మాత్రం లాభాలను గడించాయి. -
ఇండిగో ఉద్యోగులకు అక్టోబర్ 1 నుంచి పండగే..!
అతిపెద్ద దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (IndiGo)ను నిర్వహిస్తున్న ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ తమ పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి వేతనాలను పెంచినట్లు ఒక నివేదిక తెలిపింది. వేతనాల పెంపుదల అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. గత ఏడాది ఇండిగో తమ సిబ్బందికి రెండు విడతల్లో 10 శాతానికిపైగా జీతాలను పెంచింది. ఈ విమానయాన సంస్థ పైలట్లకు నెలకు 70 గంటల చొప్పున స్థిరమైన వేతనాన్ని కూడా కొనసాగిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. 2023-24 మొదటి త్రైమాసికంలో ఇండిగో రికార్డు స్థాయిలో రూ. 3,090 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. భారతీయ విమానయాన సంస్థలు అంతర్జాతీయంగా, దేశీయంగా విస్తరించడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఉన్న పైలట్లు వెళ్లిపోకుండా చూసుకోవడంతోపాటు కొత్త పైలట్లను నియమించుకోవడానికి గట్టి పోటీనే ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఇండిగో కార్యకలాపాలు ప్రారంభించి 17 ఏళ్లు కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ సంస్థ 320కు పైగా విమానాలతో 1,900 రోజువారీ సర్వీసులు నిర్వహిస్తోంది. దేశీ విమానయాన మార్కెట్లో ఈ సంస్థకు 63 శాతం వాటా ఉంది. 32 అంతర్జాతీయ, 81 దేశీయ గమ్యస్థానాలకు ప్రయాణికులను చేరవేస్తోంది. అయితే ఇటీవల పీఅండ్‌డబ్ల్యూ ఇంజన్లలో సమస్యల కారణంగా కొన్ని ఏ320 విమానాలను నిలిపివేయాల్సి వచ్చింది. దీన్ని అధిగమించేందుకు సంస్థ కొన్ని విమానాలను వెట్‌లీజ్ తీసుకుంది. -
దెబ్బకు దిగొచ్చిన ఇండిగో.. ఇక ఫ్రీగా..
దేశీయంగా విమాన ప్రయాణాలు ఇటీవల గణనీయంగా పెరిగాయి. దేశంలోని వివిధ నగరాల మధ్య విమానాల్లో ప్రయాణించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో విమానాల్లో ఆహార పదార్థాలు, పానీయాల కోసం ప్రయాణికుల నుంచి అత్యధికంగా వసూలు చేస్తున్నాయంటూ మాజీ ఎంపీ ఫిర్యాదు చేయడంతో ఇండిగో (IndiGo) ఎయిర్‌లైన్స్ దిగొచ్చింది. ఇండిగో విమానంలో సాఫ్ట్ డ్రింక్ కావాల్సిన ప్రయాణికుతో బలవంతంగా స్నాక్స్ కొనిపిస్తున్నారని, విడిగా సాఫ్ట్ డ్రింక్స్ ఇవ్వడం లేదని బీజేపీ నాయకుడు, మాజీ ఎంపీ స్వపన్‌దాస్ గుప్తా ‘ఎక్స్’ (ట్విటర్) ద్వారా పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియాను ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేశారు. ఎక్స్‌ట్రాల పేరుతో ప్రయాణికులను పిండడం మానేయాలని ఆ విమానయాన సంస్థకు హితవు పలికారు. (ఇండిగో విమానం ఎక్కుతున్నారా? అయితే గుడ్‌న్యూస్!) ఈ నేపథ్యంలో ప్రయాణికులకు అందుబాటు ధరల్లో స్నాక్స్ అనుభవాన్ని అందించడానికి తమ సేవలను పునరుద్ధరించినట్లు ఇండిగో ప్రతినిధి తాజాగా తెలిపారు. ఇక క్యాన్లలో పానీయాలు విక్రయించడం నిలిపివేసినట్లు చెప్పారు. వేలాది క్యాన్ వ్యర్థాలను అరికట్టే తమ గో గ్రీన్ నిబద్ధతకు అనుగుణంగా ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే విమానాలలో క్యాన్లలో పానీయాల విక్రయం ఎప్పటి నుంచి నిలిపివేసిందో ఇండిగో ఎయిర్‌లైన్ పేర్కొనలేదు. ఉచితంగా సాఫ్ట్ డ్రింక్ ఇండిగో ఎయిర్‌లైన్ ప్రకటన ప్రకారం.. కస్టమర్లు ఆన్‌బోర్డ్‌లో కొనుగోలు చేసిన ఏదైనా స్నాక్‌తో కాంప్లిమెంటరీ పానీయాన్ని (ఉచితంగా) ఆస్వాదించవచ్చు. దేశీయ విమానయాన మార్కెట్లో 63 శాతానికిపైగా వాటాతో ఇండిగో దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థగా కొనసాగుతోంది. -
ఇండిగో విమానం ఎక్కుతున్నారా? అయితే గుడ్‌న్యూస్!
ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ యాజమాన్యంలోని ఇండిగో ఎయిర్‌లైన్స్ దాని 'ఈట్స్ ఆన్-బోర్డ్' క్యాటరింగ్ సర్వీస్‌లో మార్పులు చేసింది. ప్రత్యేకంగా క్యూరేట్ చేసిన మెనూ నుంచి ప్రయాణికులు తమకు ఇష్టమైన ఆహారాన్ని ముందుగానే బుక్ చేసుకునే వీలు కల్పించింది. ఈ ప్రత్యేక మెనూను తమ అన్ని దేశీయ, అంతర్జాతీయ విమానాలలో ప్రవేశపెట్టినట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. రుచికరమైన ప్రాంతీయ వంటకాలతో మొదలుకొని స్ట్రీట్ ఫుడ్స్ వరకూ సరికొత్త ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. వీటన్నింటినీ ప్రయాణానికి ముందుగానే బుక్ చేసుకోవచ్చు. “ఇండియా ప్రముఖ క్యారియర్‌గా మా కస్టమర్ల కోసం సేవలను మెరుగుపరిచే మార్గాలను నిరంతరం పరిశీలిస్తున్నాం. కస్టమర్లు, క్యాబిన్ సిబ్బంది, సర్వీస్ పార్టనర్ల నుంచి తీసుకున్న ఫీడ్‌బ్యాక్‌కు అనుగుణంగా మా కొత్త 6ఈ ఈట్స్ మెనూ కొత్త ఆప్షన్లను అందిస్తుంది” అని ఇండిగో కస్టమర్ సర్వీసెస్, ఆపరేషన్స్ కంట్రోల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ రాందాస్ అన్నారు. ఇదీ చదవండి: పాన్‌కార్డు పనిచేయడం లేదా? మరి జీతం అకౌంట్లో పడుతుందా? -
విమానంలో "పెద్దలకు మాత్రమే" జోన్ : కారణం, ధర తెలిస్తే షాకవుతారు
Corendon Airlines Adultonly Zone: టర్కిష్-డచ్ కొరెండన్ ఎయిర్‌లైన్స్ వినూత్న నిర్ణయం తీసుకుంది. తన విమానాల సర్వీసుల్లో "పెద్దలకు మాత్రమే" విభాగాన్ని ఎయిర్‌లైన్ ప్రారంభించడం వార్తల్లో నిలిచింది. అసలు అడల్ట్స్ ఓన్లీ జోన్ అర్థం ఏమిటి, ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది ఈ కథనంలో తెలుసుకుందాం. పిల్లల గోల లేకుండా ప్రశాంతంగా.. ది హిల్ రిపోర్ట్ ప్రకారం విమానంలో ప్రయాణించే ప్రయాణికులకు చిన్న పిల్లల గొడవ లేకుండా ఉండేందుకు, ప్రశాంతంగా ప్రయాణాన్ని కొనసాగించేందుకు ఈ స్పెషల్ జోన్‌ను లాంచ్ చేసినట్టు కొరండెన్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. "పెద్దలకు మాత్రమే" జోన్ అనేది నిశ్శబ్ద వాతావరణంలో పని చేయాలనుకునే వ్యాపార ప్రయాణీకులకు బాగా ఉపయోగపడుతుందని, అలాగే తమ పిల్లలు ఏడుస్తున్నప్పుడు తోటి ప్రయాణీకులనుంచి వచ్చే విమర్శలు, మాటలునుంచి పిల్లలు గల పేరెంట్స్‌కు కూడా ఆందోళన తగ్గుతుందని చెప్పింది. 16, అంతకంటే ఎక్కువ వయస్సు ప్రయాణీకుల సౌలభ్యంకోసం ఈ జోన్‌ను ప్లాన్ చేస్తోంది. ఈ పథకం కింద, ఎయిర్‌లైన్ ఉపయోగించే ఎయిర్‌బస్ A350లలో కొన్ని సీట్లు రిజర్వ్ చేస్తారు. డచ్ కరేబియన్ ద్వీపం అయిన ఆమ్స్టర్డామ్, కురాకో మధ్య విమానాల్లో ఈ జోన్లు నవంబర్‌లో లాంచ్ చేయనుంది. అదనపు వాత తప్పదు మరి! విమానంలో ముందు భాగం "పెద్దలకు మాత్రమే" జోన్లను ఏర్పాటు చేస్తారు ఇందులో తొమ్మిది అదనపు-పెద్ద సీట్లు అదనపు లెగ్‌రూమ్ , 93 స్టాండర్డ్ సీట్లతో ఉంటాయి. వాల్స్, కర్టెన్ల ద్వారా జోన్ భౌతికంగా మిగిలిన విమానం నుండి వేరు చేస్తామని, ప్రశాంతంగా, రిలాక్స్డ్ వాతావరణాన్ని కల్పించడమే దీని ఉద్దేశమని పేర్కొంది. అయితే వన్‌వేలో ఈ సీట్లకు అదనంగా 45 యూరోలు (రూ4,050), అదనపు పెద్ద సీట్లకు అదనంగా 100 యూరోలు (రూ.8,926) చెల్లించాల్సి ఉంటుంది. నెదర్లాండ్స్‌లో ఇలాంటి జోన్‌ను తీసుకొచ్చిన తొలి విమానయాన సంస్థగా నిలిచింది. -
వరుసగా మృతిచెందుతున్న పైలట్లు.. ఏం జరుగుతోంది?
న్యూఢిల్లీ: మియామి నుండి చిలీ ప్రయాణిస్తున్న విమానంలో పైలెట్ బాత్రూమ్లో కుప్పకూలి మృతి చెందిన సంఘటన మరువక ముందే రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు భారతీయ పైలట్లు రెండు వేర్వేరు సంఘటనల్లో మృతి చెందారు. ఈ విషయాన్ని సివిల్ ఏవియేషన్ శాఖ డైరెక్టరేట్ జనరల్ ధృవీకరించారు. మృతి చెందినవారిలో ఒకరు ఇండిగో ఎయిర్ లైన్స్ కెప్టెన్ కాగా మరో పైలట్ ఖతార్ ఎయిర్ లైన్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. ఇండిగో కెప్టెన్ ఈరోజు నాగ్‌పూర్ నుండి పూణే విమాన సర్వీసు నడిపించాల్సి ఉండగా నాగ్‌పూర్ బోర్డింగ్ గేటు వద్దే స్పృహ కోల్పోయి పడిపోయారు. వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు ధృవీకరించాయి ఆసుపత్రి వర్గాలు. ఈయన రెండు సెక్టార్లు ఆపరేట్ చేశారని ఉదయం 3 గంటల నుండి 7 గంటల వరకు ట్రివేండ్రం నుండి పూణే మీదుగా నాగ్‌పూర్ చేరుకున్నారని అనంతరం 27 గంటల విరామం తర్వాత ఈరోజు నాలుగు సెక్టార్లు ఆపరేట్ చేయాల్సి ఉందని సివిల్ ఏవియేషన్ శాఖ వెల్లడించింది. కానీ అంతలోనే ఆయన మధ్యాహ్నం ఒంటిగంటకు నాగ్‌పూర్ విమానాశ్రయంలోని బోర్డింగ్ గేటు వద్ద కుప్పకూలి మృతి చెందారు. ఖతార్ ఎయిర్ లైన్స్ పైలట్ మాత్రం నిన్న అదనపు సిబ్బందిగా ఢిల్లీ దోహా ఫ్లైట్‌లో పాసింజర్ క్యాబిన్ లో ప్రయాణిస్తుండగా గుండెపోటు రావడంతో మృతి చెందారు. అంతకు ముందు ఈయన స్పైస్ జెట్, అలయన్స్ ఎయిర్, సహారా ఎయిర్ లైన్స్ కు పనిచేశారు. ఇలా వరుస రోజుల్లో పైలట్లు గుండెపోటుతో మృతి చెందడంతో సివిల్ ఏవియేషన్ వారు ఆందోళనకు గురవుతున్నారు. ఇది కూడా చదవండి: మానవమృగం.. శిక్ష అనుభవించినా బుద్ధి మారలేదు.. -
ఎగతాళి చేద్దామనుకున్నాడు.. చివరికి నవ్వులపాలై..
వైరల్: భారీ కాయం వలన అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వాటిలో ముఖ్యంగా ప్రయాణాల్లో ఎదురయ్యే సమస్యలు మరీ ఎక్కువ. కూర్చోవడంలో అసౌకర్యం సంగతి అటుంచితే ఎదుటివారు ఏమనుకుంటారోనన్న ఆత్మన్యూనతా భావం సగం కుంగదీస్తుంది. అలాంటి సందర్భాల్లో వారు చాలా అవమానంగా కూడా ఫీలవుతూ ఉంటారు. అచ్చంగా అలాంటి పరిస్థితినే విమానం ప్రయాణంలో ఎదుర్కొంది భారీ కాయమున్న ఓ ప్రయాణికురాలు. ఆమె పక్క సీటులో కూర్చొని ప్రయాణించాల్సిన వ్యక్తి ఆమెను ఎగతాళి చేయడమే కాకుండా ఆమె ఫోటోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. పైగా దానికి ఒక క్యాప్షన్ కూడా జతచేశాడు... ఇలాంటి దృశ్యాన్ని చూసినప్పుడు నాకు కేటాయించిన మధ్య సీటులో కూర్చోవడమెలా? మీరేమంటారు? అని ప్రశ్నించాడు. అతడికి మద్దతుగా కామెంట్లు వస్తాయనుకుంటే అది కాస్తా రివర్స్ లో ఫైర్ అయ్యింది. అందరూ ఆ మహిళకు మద్దతుగా కామెంట్లు చేసి సదరు ప్రయాణికుడికి చురకలు అంటించారు. అతడి ఉద్దేశ్యాన్ని గ్రహించిన నెటిజన్లు అతడి పోస్ట్ పై అంతే సున్నితంగా స్పందించారు. అదసలు సమస్యే కాదు.. నేనైతే నోరు మూసుకుని వెళ్లి నా సీటులో కూర్చుని అడ్జస్ట్ అవుతాను అని ఒకరు రాయగా.. మరొకరు, గతంలో నాక్కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది.. అప్పుడైతే ఆ వ్యక్తి ఏం అనుకోకండి నన్ను పిల్లోలా వాడుకోమని చెప్పిన సరదా సన్నివేశాన్ని షేర్ చేశారు.. ఇంకొకరైతే, మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాను.. ఈ విషయాన్ని రచ్చ చేయడం కంటే వేరే ఫ్లైట్ చూసుకోవచ్చు కదా భయ్యా అంటూ వెటకారం చేశాడు. ఆ విధంగా ఆ ప్యాసింజరు తోటి ప్రయాణికురాలిని నవ్వులపాలు చేద్దాం అనుకుని తానే నవ్వులపాలయ్యాడు. ఇది కూడా చదవండి: కూతురు అబార్షన్‌కు సాయం చేసిన తల్లి.. అలా పోలీసులకు దొరికిపోయింది! -
ప్రపంచంలో ఇదే బెస్ట్ ఎయిర్ లైన్! భారత్ ఎక్కడుందంటే?
Best Airlines In 2023: ఆధునిక ప్రపంచంలో విమాన ప్రయాణం సర్వ సాధారణమైపోయింది. అందులో కూడా చాలా మంది ప్రయాణికులు ఉత్తమ సేవలను అందించే బెస్ట్ ఎయిర్ లైన్స్‌ని ఎక్కువగా ఎంచుకుంటారు. ఈ ఏడాది టాప్ 20 అత్యుత్తమ విమానయాన సంస్థలు ఏవి? ఇందులో మొదటి స్థానంలో ఉన్న ఎయిర్ లైన్.. చివరి స్థానంలో ఉన్న ఎయిర్ లైన్ ఏది అనేది ఈ కథనంలో తెలుసుకుందాం. 2023లో బెస్ట్ ఎయిర్ లైన్స్ జాబితాలో సింగపూర్ ఎయిర్ లైన్స్ మొదటి స్థానంలో నిలిచి రికార్డ్ బద్దలు కొట్టింది. ఆ తరువాత ఖతార్, ఆల్ నిప్పన్, ఎమిరేట్స్ వంటివి ఉన్నాయి. స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్ లైన్ అవార్డ్ 2023 ఎయిర్ లైన్స్‌కు ఈ ర్యాంకింగ్స్ అందిస్తుంది. ఇందులో ఖతార్ రెండవ స్థానంలో ఉన్నప్పటికీ బెస్ట్ బిజినెస్ క్లాస్ ఎయిర్ లైన్, సీట్ అండ్ లాంజ్ కేటగిరీల్లో మొదటి స్థానంలో నిలిచింది. ఇక బడ్జెస్ట్ ఎయిర్ లైన్స్ కేటగిరీలో ఎయిర్ఆసియా తొలి స్థానంలో నిలిచింది. ఆ తరువాత లో కాస్ట్ లాంగ్ హాల్ కేటగిరిలో డెల్టా ఎయిర్ లైన్స్ మొదటి స్థానంలో నిలిచింది. అత్యంత క్లీనెస్ట్ ఎయిర్‌లైన్ అవార్డు ఏఎన్ఏ (ఆల్ నిప్పన్ ఎయిర్ వేస్)కు దక్కింది. 2022 సెప్టెంబర్ 2022 నుంచి మే 2023 వరకు 100 కు పైగా దేశాలకు చెందిన విమాన ప్రయాణికుల నుంచి మొత్తం 335 ఎయిర్ లైన్స్ సంస్థల పనితీరుపై సమాచారం సేకరించి ఈ లిస్ట్ రూపొందించారు. (ఇదీ చదవండి: హెయిర్ ఆయిల్ అమ్మి వేలకోట్ల సామ్రాజ్యం.. తల్లి పెట్టుబడితో కుబేరుడైన కొడుకు!) టాప్ 20 బెస్ట్ ఎయిర్ లైన్స్ సింగపూర్ ఎయిర్ లైన్స్ ఖతార్ ఎయిర్ వేస్ ఆల్ నిప్పన్ ఎయిర్ వేస్ (ఏఎన్ఏ) ఎమిరేట్స్ జపాన్ ఎయిర్ లైన్స్ టర్కిష్ ఎయిర్ లైన్స్ ఎయిర్ ఫ్రాన్స్ కాథే ఫసిఫిక్ ఎయిర్ లైన్స్ ఇవా ఎయిర్ కొరియన్ ఎయిర్ హైనన్ ఎయిర్ లైన్స్ స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ ఎతిహాద్ ఎయిర్ వేస్ ఐబేరియా ఫిజి ఎయిర్ వేస్ విస్తారా క్వాంటాస్ ఎయిర్ వేస్ బ్రిటిష్ ఎయిర్ వేస్ ఎయిర్ న్యూజిలాండ్ డెల్టా ఎయిర్ లైన్స్ -
వరల్డ్ టాప్ 100 ఎయిర్‌లైన్స్: మళ్లీ అదరగొట్టిన సంస్థ ఇదే!
ప్రపంచవ్యాప్తంగా టాప్ 100 ఎయిర్‌లైన్స్ జాబితాలో రెండు భారతీయ విమానయాన సంస్థలు చోటు సంపాదించు కున్నాయి. విమానయాన సంస్థలు విస్తారా, ఇండిగో మాత్రమే ఈ లిస్ట్‌లో ఉండటం విశేషం. టాప్ 100లో 49వ ర్యాంకు సాధించిన ఇండిగో మూడవ ఉత్తమ తక్కువ-ధర విమానయాన సంస్థగా ఎంపికైంది. టాటా గ్రూపు నేతృత్వంలోని ఎయిరిండియా 10 అత్యంత మెరుగైన విమానయాన సంస్థల జాబితాలో 9వ స్థానంలో ఉంది. స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌లైన్ అవార్డుల ప్రకారం 2022లోని 20వ ప్లేస్నుంచి నాలుగు స్థానాలు ఎగబాకి మరీ విస్తారా 16వ స్థానానికి చేరింది.అటు ఇండిగో గత సంవత్సరం 45వ స్థానం నుండి రెండు స్థానాలు పెరిగి 43వ ర్యాంక్‌కు చేరుకుంది. టాప్ 100 ఎయిర్‌లైన్స్‌కు స్కైట్రాక్స్ ఈ అవార్డులను ఇచ్చింది. అలాగే 20 ‘ప్రపంచపు అత్యుత్తమ ఎయిర్‌లైన్ క్యాబిన్ క్రూ 2023’ జాబితాలో కూడా విస్తారా 19వ ప్లేస్ కొట్టేసింది. అంతేనా ఆసియాలోని టాప్ 10 ఎయిర్‌లైన్స్ జాబితాలో విస్తారా 8వ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది. (రెండుసార్లు ఫెయిల్...రూ. 2463 కోట్లకు అధిపతి: మిస్బా అష్రఫ్ సక్సెస్ స్టోరీ) ఎయిర్‌లైన్ స్కైట్రాక్స్ టాప్ 20 ఎయిర్‌లైన్స్ జాబితాలో వరుసగా రెండవ సారి స్థానం పొందింది విస్తారా.అలాగే వరుసగా మూడో ఏడాది కూడా 'బెస్ట్ ఎయిర్‌లైన్ ఇన్ ఇండియా అండ్ సౌత్ ఆసియా' అవార్డును, ఇండియా దక్షిణాసియాలో ఉత్తమ క్యాబిన్ క్రూ' గా వరుసగా ఐదవసారి, 'భారతదేశం, దక్షిణాసియాలో ఉత్తమ క్యాబిన్ క్రూ' మూడవసారి గెలుచుకుంది. దీంతోపాటు 'వరల్డ్స్ బెస్ట్ ఇన్‌ఫ్లైట్ ఎంటర్టైన్మెంట్ 2023' విభాగంలో 20వ స్థానాన్ని కూడా కైవసం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 100 దేశీల నుంచి వరల్డ్ ఎయిర్‌లైన్ అవార్డ్స్‌లో ఓటు వేయగా, మొత్తం 20.23 మిలియన్ల ప్రయాణికుల నుండి ఓట్లు వచ్చాయి.విస్తారా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వినోద్ కణ్ణన్ మాట్లాడుతూ ఈ అవార్డులు తమ సేవలు, కస్టమర్ల నమ్మకంతో పాటు వారి ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచే లక్ష్యంతో తమని మరింత ఉత్తేజితం చేస్తామన్నారు. తమ ఉద్యోగులు, ముఖ్యంగా ఫ్రంట్‌లైన్ టీమ్‌లు, ఎనిమిదేళ్ల ప్రస్థానంలో విశేష కృషికి గుర్తింపుగా నిలిచాయని పేర్కొన్నారు. ఇండియా సౌత్ఏసియాలో ఉత్తమ విమానయాన సిబ్బంది అవార్డును ఐదోసారి గెలుచుకోవడం గొప్ప విషయమని స్కైట్రాక్స్ సీఈవో ఎడ్వర్డ్ ప్లాస్టెడ్ అన్నారు. (రిలయన్స్ గ్రూప్‌లో కీలక పరిణామం: ప్రెసిడెంట్‌గా పారుల్ శర్మ) విస్తారా విస్తారా టాటా సన్స్ , సింగపూర్ ఎయిర్‌లైన్స్ లిమిటెడ్ జాయింట్ వెంచర్. ప్రస్తుతం ఇది 61 విమానాల సముదాయాన్ని కలిగి ఉంది, ఇందులో 46 ఎయిర్‌బస్ A320neo, 10 ఎయిర్‌బస్ A321, ఒక బోయింగ్ 737-800NG, నాలుగు బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ ఉన్నాయి. -
మలేషియాలో పాకిస్తాన్ కు ఘోర అవమానం.. విమానం సీజ్
పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్(PIA )కు చెందిన విమానాన్ని మలేషియాలోని కౌలాలంపూర్‌లో సీజ్ చేశారు. ఎయిర్ క్యాప్ అనే లీజింగ్ సంస్థకు చాలాకాలంగా బకాయిలు చెల్లించని కారణంగా పాకిస్తాన్ విమానం బోయింగ్ కో. 777 విమానాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు మలేషియా అధికారులు. బాకీ తీర్చమంటే... ఎయిర్ క్యాప్ సంస్థకు పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్(PIA ) సుమారుగా 4 మిలియన్ల డాలర్లు(రూ. 33 కోట్లు) బకాయి పడింది. ఈ సంస్థ అనేకమార్లు బకాయిల గురించి వివరణ కోరుతూ సందేశాలు పంపినా కూడా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ సంస్థ నుండి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో ఇదే విషయాన్ని మలేషియా కోర్టుకు విన్నవించగా బోయింగ్ కో. 777 విమానాన్ని వెంటనే సీజ్ చేయాల్సిందిగా ఆదేశాలను జారీ చేసింది. ఈ విమానం మంగళవారం కౌలాలంపూర్ విమానాశ్రయం చేరుకున్నట్లు సమాచారం అందుకోగానే అక్కడి కస్టమ్స్ అధికారులు నిర్దాక్షిణ్యంగా విమానంలో నిండుగా ప్రయాణికులు ఉండగానే విమానం సీజ్ ప్రక్రియను చేపట్టారు. ఇదే విమానం రెండోసారి... ఇదే తరహాలో 2021లో కూడా కౌలాలంపూర్ ఏవియేషన్ శాఖ ఇదే కారణంతో ఇదే విమానాన్ని మొదటిసారి సీజ్ చేయగా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ సంస్థ బకాయిల చెల్లింపుపై హామీ ఇవ్వడంతో 173 ప్రయాణికులతో ఉన్న ఈ విమానాన్ని జనవరి 27న తిరిగి పంపించడానికి అంగీకరించారు కౌలాలంపూర్ ఏవియేషన్ అధికారులు. తాజాగా పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ నుండి జవాబు లేకపోవడంతో సదరు లీజింగ్ సంస్థ కోర్టును ఆశ్రయించి మరోసారి సీజ్ ఆర్డర్స్ తెచ్చుకుని విమానాన్ని సీజ్ చేయించింది. మొత్తం చెల్లించేసాం... మళ్ళీ అదే కథ పునరావృతం కావడంతో పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కు చెందిన అధికారి అబ్దుల్లా హఫీజ్ ఖాన్ స్పందిస్తూ మా విమానం ఆగ్నేయ దేశాల్లో సీజ్ కావడం ఇది రెండోసారి. మేము చెల్లించాల్సిన బకాయిలను మేము గతంలోనే చెల్లించేసాం, అయినా కూడా వారు ఇలా చేయడం సరికాదని అన్నారు. దీనికి బదులుగా ఎయిర్ క్యాప్ సంస్థ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ బకాయిలు ఇంకా అలాగే ఉన్నాయని దానికి తోడు వివరణ కోరుతూ అనేక సందేశాలు పంపించినా కూడా వారినుంచి ఎటువంటి స్పందన రాలేదని అన్నారు. గతకొంత కాలంగా పాకిస్తాన్ దేశం ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితుల నుండి తేరుకుంటోన్న పాకిస్తాన్ పై మలేషియా కోర్టు కఠినంగా వ్యవహరించడంతో మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టయ్యింది. -
ఆ ఉద్యోగులకు నిజంగా పండగే! రూ.7.5 లక్షల జీతం, రూ.లక్ష రివార్డు..
దేశీ ఎయిర్‌లైన్స్ కంపెనీ స్పైస్‌జెట్ వార్షికోత్సవం సందర్భంగా తమ ఉద్యోగులకు పలు వరాలు ప్రకటించింది. విమాన పైలట్లకు నెలకు రూ.7.5 లక్షల జీతం, రూ.లక్ష నెలవారీ లాయల్టీ రివార్డు వంటివి ఇందులో ఉన్నాయి. గురుగ్రామ్‌కు కేంద్రంగా పనిచేసే స్పైస్ జెట్ ఎయిర్‌లైన్స్ సంస్థ 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తమ కెప్టెన్ల నెల జీతాన్ని రూ.7.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పైలట్లకు నెలలో 75 గంటల ఫ్లయింగ్ అవర్స్ ఉంటాయి. ఈ పెంపుదల 2023 మే 16 నుంచి వర్తిస్తుందని స్పైస్ జెట్ తెలిపింది. అలాగే ట్రైనర్లు (డీఈ, టీఆర్ఐ), ఫస్ట్ ఆఫీసర్ల జీతాలను కూడా పెంచింది ఈ ఎయిర్‌లైన్స్ కంపెనీ. అంతకుముందు నవంబర్లోనూ స్పైస్‌జెట్ తమ పైలట్ల వేతనాలను పెంచిది. అప్పట్లో కెప్టెన్ల జీతం 80 గంటల ఫ్లయింగ్ అవర్స్‌కు గానూ నెలకు రూ. 7 లక్షలు ఉండేది. రూ.లక్ష లాయల్టీ రివార్డ్ అదనంగా ఈ ఎయిర్‌లైన్ సంస్థ తమ కెప్టెన్లకు నెలకు రూ.లక్ష వరకు నెలవారీ లాయల్టీ రివార్డ్‌ను ప్రకటించింది. వారి ఉద్యోగ కాలానికి అనుగుణంగా ఇచ్చే ఈ రివార్డ్ వారి నెలవారీ జీతం కంటే ఎక్కువగా ఉంటుంది. అంతకుముందు స్పెస్‌జెట్ చైర్మన్ అజయ్ సింగ్ ఉద్యోగులతో మాట్లాడుతూ భవిష్యత్తు మరింత ఉత్తేజకరంగా ఉంటుందని, ప్రయాణికులకు అత్యున్నత ప్రమాణాలతో సేవలు అందించేందుకు కట్టుబడి ఉండాలని సూచించారు. స్పైస్‌జెట్ దేశ, విదేశాల్లో మొత్తం 48 గమ్యస్థానాలకు రోజూ దాదాపు 250 విమానాలను నడుపుతోంది. బోయింగ్ 737 మ్యాక్స్, బోయింగ్ 700, క్యూ400 వంటి అత్యాధునిక విమానాలు ఈ సంస్థకు ఉన్నాయి. ఇదీ చదవండి: Air India Salaries: జీతాలు పెంచిన ఎయిర్ ఇండియా.. పైలట్ జీతమెంతో తెలుసా? -
దేశం దాటి ప్యాసింజర్లకు సారీ చెప్పిన ఎయిర్‌లైన్స్ అధినేత
ఇటీవల ఎయిర్‌లైన్స్ సంస్థల పేర్లు ఏదో ఒక రూపంలో తరచూ వార్తల్లో వినపడుతున్నాయి. సిబ్బంది లేదా ప్యాసింజర్ల ప్రవర్తన సరిగా లేకపోవడం కారణంగా పలు ఘటనలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా తమ సిబ్బంది చేసిన పనికి ఓ ఎయిర్‌లైన్స్ సంస్థ అధినేత దేశం దాటి వెళ్లి మరీ క్షమాపణలు చెప్పడం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే.. జపాన్ రాజధాని టోక్యో శివారులోని నరిటా అంతర్జాతీయ విమానాశ్రయంలో స్టార్లక్స్ JX803 విమానంలో ప్రయాణీకులు మొదట మే 6న మధ్యాహ్నం 3.45 గంటలకు ఎక్కవలసి ఉంది. సాయంత్రం 5.30 గంటలకు, బోర్డింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఈలోగా, JX801 విమాన ప్రయాణీకులు కూడా వేచి ఉన్న JX803 ప్రయాణికులతో చేర్చారు. కొన్ని కారణాల వల్ల రెండు విమానాలను విలీనం చేస్తున్నట్లు స్టార్లక్స్ సిబ్బంది ప్రయాణికులకు తెలియజేశారు. చివరికి రెండు విమానంలోని ప్రయాణికులను ఒకదానిలో చేర్చారు. అయితే అందులోని సిబ్బంది పనివేళలు ముగియడంతో రెండో విమానం కూడా ఆలస్యమైంది. చివరికి అర్ధరాత్రి అయ్యాక విమానం రద్దయిందని విమాన సిబ్బంది ప్రయాణికులకు తాపీగా చెప్పారు. దీంతో ప్రయాణీకులు ఆ రాత్రంతా విమానాశ్రయంలోనే గడపవలసి వచ్చింది. మరుసటిరోజు వీరిని మరో విమానంలో పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న స్టార్లక్స్ ఎయిర్‌లైన్స్ ఛైర్మన్ చాంగ్ కు వీ హుటాహుటిన తైవాన్ నుంచి జపాన్‌కు బయలుదేరారు. మే 7వ తేదీ ఉదయం నరిటా విమానాశ్రయంలో చిక్కుకున్న ప్రయాణికులను స్వయంగా కలిసి క్షమాపణలు తెలియజేయడంతో పాటు వారి టికెట్ నగదును పూర్తిగా రీఫండ్ ఇస్తామన్నారు. చదవండి: ‘మూన్ కింగ్’గా మళ్లీ శని గ్రహం.. 83 నుంచి 145కు చంద్రుల సంఖ్య -
కలసిరాని విమానయాన రంగం .. ఏడాదికో ఎయిర్‌లైన్స్ కనుమరుగు
న్యూఢిల్లీ/ముంబై: దేశ విమానయాన రంగం ఎయిర్‌లైన్స్ సంస్థలకు కలసిరావడం లేదు. దీనికి నిదర్శనంగా గడిచిన మూడు దశాబ్దాల కాలంలో 27 సంస్థలు కనుమరుగయ్యాయి. 1994లో మొదటిసారి దేశంలో ప్రైవేటు విమానయాన సంస్థలు (ఎయిర్‌లైన్స్ కంపెనీలు) కార్యకలాపాల నిర్వహణకు అనుమతించారు. ఆ తర్వాత రెండేళ్లకు అంటే 1996లో తొలి వికెట్ పడింది. ఈస్ట్ వెస్ట్ ట్రావెల్స్ అండ్ ట్రేడ్ లింక్ 1996 నవంబర్‌లో కార్యకలాపాలను (ఆరంభించిన రెండేళ్లకు) మూసివేసింది. అదే ఏడాది మోడిలుఫ్త్ కార్యకలాపాలు కూడా నిలిచిపోయాయి. ఇలా మొత్తం మీద 27 సంస్థలు (సగటున ఏడాదికొకటి) వ్యాపార కార్యకలాపాలను మూసివేయడం, దివాలా తీయడం లేదా ఇతర సంస్థల్లో విలీనం కావడం, కొనుగోళ్లతో కనుమరుగు కావడం చోటు చేసుకుంది. కరోనా రాక ముందు 2019లోనూ జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. దివాలా పరిష్కారంలో భాగంగా ఓ కన్సార్షియం జెట్ ఎయిర్వేస్ను సొంతం చేసుకున్నప్పటికీ కార్యకలాపాలు ప్రారంభించలేని పరిస్థితి నెలకొంది. అదే ఏడాది జెట్‌లైట్ (సహారా ఎయిర్‌లైన్స్) కూడా మూతపడింది. జూమ్ ఎయిర్ పేరుతో కార్యకలాపాలు నిర్వహించే జెక్సస్ ఎయిర్ సర్విసెస్, డెక్కన్ చార్టర్డ్ ప్రైవేటు లిమిటెడ్, ఎయిర్ ఒడిశా ఏవియేషన్ 2020లో మూసివేయగా, 2022లో హెరిటేజ్ ఏవియేషన్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. 17 ఏళ్లకు గో ఫస్ట్ 2020లో కరోనా మహమ్మారి కారణంగా ఎయిర్‌లైన్స్ కంపెనీలు తమ కార్యకలాపాలను కొన్ని నెలల పాటు నిలిపివేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కూడా పాక్షిక సర్విసులకే పరిమితమయ్యాయి. దీని కారణంగా ఎయిర్‌లైన్స్ సంస్థలకు నష్టాలు పెరిగాయి. ఆ తర్వాత డిమాండ్ అనూహ్యంగా పుంజుకున్నప్పటికీ, గో ఫస్ట్ సంస్థకు చెందిన సగం విమానాలు ప్రాట్ అండ్ విట్నీ ఇంజన్లలో సమస్యలతో పార్కింగ్‌కే పరిమితం కావాల్సి వచ్చింది. దీంతో సగం సర్విసులనే నడుపుతూ చివరికి కార్యకలాపాలు మొదలు పెట్టిన 17 ఏళ్ల తర్వాత గో ఫస్ట్ దివాలా పిటిషన్ దాఖలు చేసింది. జెట్ ఎయిర్వేస్ తర్వాత దివాలా పరిష్కారం కోసం ఎన్సీఎల్టీకి ముందుకు వెళ్లిన రెండో సంస్థ ఇది. 2012లో కింగ్‌ఫిషర్ ప్రముఖ సంస్థగా పేరొంది, పెద్ద ఎత్తున విమానయాన కార్యకలాపాలు నిర్వహించిన కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ మూతపడడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 50 విమానాలతో వందలాది సర్విసులు నిర్వహిస్తూ, ఎంతో మందికి ఉపాధి కల్పించిన ఈ సంస్థ 2012లో మూతపడడంతో బ్యాంకులకు రూ.9,000 కోట్లకు పైగా నష్టం ఏర్పడింది. డిమాండ్‌కు తక్కువేమీ లేదు ఒకవైపు భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న పౌర విమానయాన మార్కెట్‌గా గుర్తింపు తెచ్చుకుంటుంటే, మరోవైపు ఒక్కో ఎయిర్‌లైన్ సంస్థ మూతపడుతుండడం సంక్లిష్టతలకు అద్దం పడుతోంది. కానీ, ఎయిర్‌లైన్స్ సేవలకు ఏటేటా డిమాండ్ పెరుగుతూనే ఉంది. 2023 మొదటి మూడు నెలల్లో దేశీ ఎయిర్‌లైన్స్ సంస్థలు 3.75 కోట్ల మంది ప్రయాణికులను చేరవేశాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 52% అధికం. గుత్తాధిపత్యానికి బాటలు.. ప్రభుత్వరంగంలోని ఎయిర్ ఇండియాను టాటాలు గతేడాది జనవరిలో కొనుగోలు చేయడం తెలిసిందే. దీంతో ప్రస్తుతం ప్రభుత్వం ఆధ్వరం్యలో అలయన్స్ ఎయిర్ ఒక్కటే ఉంది. దీని సేవలు నామమాత్రమే. ఇక ప్రధానంగా సేవలు అందించే సంస్థలుగా ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్, విస్తారా, ఏయిరేíÙయా, ఆకాశ ఎయిర్ ఉన్నాయి. ఇందులో ఆకాశ ఎయిర్ రాకేశ్ జున్‌జున్‌వాలా ఆరంభించినది. ఇది చాలా తక్కువ సర్విసులకే పరిమితమైంది. ఎయిర్ ఏషియా, విస్తారా టాటాల జాయింట్ వెంచర్లు, వీటిని ఎయిర్ ఇండియాలో విలీనం చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అదే జరిగితే అప్పుడు ప్రధానంగా సేవలు అందించేవి ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్ అని చెప్పుకోవచ్చు. స్పైస్‌జెట్ కూడా తీవ్ర ఆర్థిక సమస్యల్లో ఉంది. భారీ నష్టాలతో, రుణ భారంతో నడుస్తోంది. ఒకవేళ ఇది కూడా మూతపడితే అప్పుడు ఎయిర్ ఇండియా, ఇండిగోతో దేశ ఎయిర్‌లైన్స్ మార్కెట్ మోనోపలీగా మారిపోతుందన్న ఆందోళన వినిపిస్తోంది. అంతేకాదు, సేవలపైనా దీని ప్రభావం పడుతుందని అంటున్నారు. -
తప్పతాగి.. విమానంలో తోటి ప్రయాణికులపై మూత్రవిసర్జన!
న్యూయార్క్-న్యూఢిల్లీ అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ భారతీయుడు మద్యం మత్తులో వీరంగం సృష్టించాడు. తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. అయితే విమానయాన సంస్థ, విమానంలోని ప్రయాణీకుల వాంగ్మూలాలను రికార్డ్ చేసి, నిందితులను లా ఎన్ఫోర్స్మెంట్కు అప్పగించాయని దేశ విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ తెలిపింది. ప్రయాణికుడిపై ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఫిర్యాదు చేసిన తర్వాత పౌర విమానయాన చట్టంలోని నాన్-కాగ్నిజబుల్ నేరాల కింద చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు డీజీసీఏ వెల్లడించింది. ఈ ఘటనపై సహ ప్రయాణికుల నుంచి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ ఏఏ292 విమానం ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ (IGI) విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత సీఐఎస్ఎఫ్ అధికారులు ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు. వరుసగా మూడోసారి గత ఏడాది నవంబర్ 26న ఎయిర్ ఇండియా న్యూయార్క్-ఢిల్లీ విమానంలో బిజినెస్ క్లాస్‌లో ఓ వ్యక్తి వృద్దిరాలిపై మూత్రం పోశాడు. డిసెంబర్ 6 న ఎయిర్ ఇండియా ప్యారిస్-న్యూఢిల్లీ విమానంలో ఓప్రయాణికుడు ఖాళీ సీటుపై, దుప్పటిపై మూత్ర విసర్జన చేశాడు. ఇలా వరుస ఘటనలపై డీజీసీఏ చర్యలు తీసుకున్నప్పటికీ తాజాగా మరో ఘటన వెలుగులోకి రావడం గమనార్హం. -
గాల్లో ఉండగానే పెద్ద శబ్దాలతో ఇంజన్లో మంటలు..ఆ తర్వాత విమానం..
విమానం గాల్లో ఉండగానే ఇంజన్లో మంటలు చెలరేగాయి. దీంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ ఘటన కొలంబస్ ఎయిర్‌పోర్ట్‌లో ఆదివారం చోటు చేసుకుంది. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన బోయింగ్ 737 విమానం 1958లో ఈ ప్రమాదం జరిగింది. కొలంబస్ నుంచి ఫీనిక్స్‌కి వెళ్తున్న ఆ విమానాన్ని ఓ పక్కుల మంద ఢీ కొట్టాయి. దీంతో విమానంలోని కుడి ఇంజన్లో మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే పైలెట్ అత్యవసర ల్యాండింగ్‌ని ప్రకటించి కొలంబస్‌లోని జాన్ గ్లెన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొద్ది నిమిషాల్లోనే తిరిగి వచ్చింది. ఐతే విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. అత్యవసర సిబ్బింది కూడా వెంటనే స్పందించారని, ఆ సమయానికి ఎయిర్పోర్ట్ తెరిచే ఉందని జాన్‌గ్లెన్ విమానాశ్రయం ట్విట్టర్లో పేర్కొంది. ఐతే ఆ విమానం ఇంజన్లో కొద్దిపాటి సాంకేతిక సమస్యలున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రయాణికుడు మాట్లాడుతూ..విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పెద్ద పెద్ధ శబ్దాలు వినిపించాయని చెప్పాడు. ఆ తర్వాత పైలట్ పక్షుల ఢీకొట్టాయని చెబుతూ ప్రయాణికులను అప్రమత్తం చేశాడని అన్నారు. కొద్ది సేపటికే ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితం ల్యాండ్ అయ్యిందని, ఆ తర్వాత తమను వేరే విమానంలో గమ్యస్థానాలకు తరలించినట్లు వెల్లడించాడు. Taken from Upper Arlington, Ohio. AA1958. pic.twitter.com/yUSSMImaF7 — CBUS4LIFE (@Cbus4Life) April 23, 2023 (చదవండి: నైట్ షోలో అగ్ని ప్రమాదం..ఎగిసిపడ్డ అగ్నికీలలు) -
విమానంలో మరో అనుచిత ఘటన: 62 ఏళ్ల ప్రయాణికుడి వీరంగం
గత కొన్ని రొజులుగా విమానంలో చోటు చేసుకున్న ప్రయాణికుల అనుచిత ప్రవర్తనల గురించి వింటున్నాం. వారిపై ఎయిర్‌లైన్స్ అధికారలు చర్యలు తీసుకున్నప్పటికీ అలాంటి ఘటనలే చోటు చేసుకోవడం బాధకరం. అలాంటి అనుచిత ఘటనే మరోకటి జరిగింది. బ్యాంకాక్ నుంచి ముంబైకి వెళ్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానంలో 62 ఏళ్ల ప్రయాణికుడు ఎయిర్ హోస్టస్, తోసహా ఇతర ప్రయాణికుల పట్ల చాలా అనుచితంగా ప్రరవ్తించాడు. తాగిన మత్తులో సదరు వ్యక్తి విమానంలో వీరంగం సృష్టించినట్లు సమాచారం. అతను భోజనం వడ్డిస్తున్న సమయంలో వెస్టబర్గ్ ఎయిర్‌హోస్టస్‌తో అనుచితంగా ప్రవర్తించడమే గాక ఆమె చేయి పట్టుకునే యత్నం చేశాడు. ఇతర ప్రయాణికుల ముందు ఆమెనే వేధింపులకు గురి చేశాడు. ఆ తర్వాత ఇతర ప్రయాణికులను దుర్భాషలాడంటి వంటివి చేసినట్లు ఎయిర్ హోస్టస్ ఆరోపించింది. దీంతో విమానం ముంబై ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోగానే సదరు నిందితుడిని స్వీడిష్‌కి చెందిన క్లాస్ ఎరిక్ హెరాల్డ్ జోనాస్ వెస్ట్‌బర్గ్‌గా గుర్తించి, అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. విమానంలో ప్రయాణికులు వరుస అనుచితత ఘటనల్లో ఇది ఎనిమిదోది. ఇటీవల వార్తల్లో నిలిచిన న్యూయార్క్ నుండి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలోని వృద్ధురాలిపై మూత్ర విసర్జన ఘటన మరువుకే మునుపే అదే తరహాలో మరో ఘటన చోటు చేసుకోవడం బాధకరం. (చదవండి: అరుదైన ఘటన: మొక్కల్లో వచ్చే శిలింద్ర వ్యాధి సోకిన వ్యక్తి) -
ఒక్క యాడ్‌తో సెలబ్రిటీగా మారింది.. ఏం జరిగిందో ఏమో భావోద్వేగ పోస్టు పెట్టి మృతి!
యునైటెడ్ ఎయిర్‌లైన్స్ వాణిజ్య ప్రకటనలో కనిపించి సెలబ్రిటీగా మారిన ట్రాన్స్‌జెండర్ ఫ్లైట్ అటెండెంట్ కైలీ స్కాట్ సోషల్ మీడియాలో భావోద్వేగ పోస్టు పెట్టి ప్రాణాలు తీసుకున్నారు. ఆమె కొలరాడోలోని తన ఇంటిలో గత సోమవారం చనిపోయింది. స్కాట్ మరణించడానికి ముందు తన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పోస్ట్‌లలో.. తన స్నేహితులు, కుటుంబ సభ్యులను ఉద్దేశించి భావోద్వేగ పోస్ట చేసింది. ‘మనం పంచుకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకోవాలని’ కోరింది. ‘నేను నా చివరి శ్వాసను తీసుకుంటూ, ఈ భూమి నుండి నిష్క్రమిస్తున్నాను. నేను నిరాశపరిచిన ప్రతి ఒక్కరికీ క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను’ అని స్కాట్ పేర్కొంది. ‘మీతో ఉండలేకపోయాను, క్షమించండి, నేను ఇష్టపడే వారికి తోడుగా ఉండలేకపోతున్నాను, మిమ్మల్ని వదలి వెళ్ళడం లేదని దయచేసి అర్థం చేసుకోండంటూ’ తన ఆవేదనను పోస్ట్ రూపంలో రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌లో స్కాట్ తన ప్రియమైన వారిలో కొందరి పేర్లను కూడా పేర్కొంది. స్కాట్ తల్లి, ఆండ్రియా సిల్వెస్ట్రో, లేఖను పోస్ట్ చేసిన తర్వాత తన కుమార్తె మరణించినట్లు ధృవీకరించింది. ఫేస్బుక్ పోస్ట్‌లో.. సిల్వెస్ట్రో ఇలా వ్రాశారు.. "కైలీ స్కాట్... నువ్వు నా కుమార్తెగా పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నీ నవ్వు చాలా అందంగా ఉండేది. నీ హృదయం మాలో ఎవరికీ అర్థం కానంత పెద్దది” అని తెలిపారు. కాగా, స్కాట్ మరణంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
డీజిల్‌పై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. ఎంతంటే?
విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్ ఎగుమతిపై విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్‌ను లీటర్‌కు 50 పైసలు తగ్గించింది. అదే సమయంలో దేశీయంగా ఉత్పత్తి చేసే చమురు కంపెనీలకు లెవీ పన్నును మరో రూ.50 విధించింది. కొత్తగా అమల్లోకి తెచ్చిన ఈ ధరలు మార్చి 4 నుంచి అమల్లోకి వచ్చినట్లు కేంద్రం ఆర్ధిక శాఖ అధికారికంగా ప్రకటించింది. క్రూడ్ పెట్రోలియంపై స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (ఎస్ఏఈడీ) టన్నుకు రూ.4350 నుండి రూ. 4400కు పెంచింది. ప్రస్తుతం ఎగుమతి అవుతున్న డీజిల్‌పై పన్ను రూ.2.5 ఉండగా, దీనిని 50 పైసలు తగ్గించింది. అలాగే ఏటీఎఫ్‌పై విధిస్తున్న రూ.1.50 విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను సైతం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. భూమి నుండి, సముద్రపు అడుగుభాగం నుండి పంప్ చేయబడిన ముడి చమురును శుద్ధి చేసి పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఇంధనం వంటి ఇంధనాలుగా మారుస్తున్న విషయం తెలిసిందే. -
ఎయిర్‌లైన్స్‌కు పూర్వ వైభవం.. వచ్చే ఏడాది నుంచి లాభాలే లాభాలు
జెనీవా: అంతర్జాతీయంగా ఎయిర్‌లైన్స్ పరిశ్రమ 2022 సంవత్సరానికి 6.9 బిలియన్ డాలర్లు (రూ.56,580 కోట్లు) నష్టాలను ప్రకటించొచ్చని.. వచ్చే ఏడాది నుంచి లాభాల బాటలో ప్రయాణిస్తుందని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) పేర్కొంది. ఎయిర్‌లైన్స్ సంస్థలు వ్యయ నియంత్రణకు తీసుకున్న చర్యలు, అధి ప్రయాణికుల రవాణా నష్టాలు తగ్గేందుకు అనుకూలిస్తాయని తెలిపింది. ఐఏటీఏ డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్ష్ జెనీవాలో మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంతో పోలిస్తే భారత్ ఎయిర్‌లైన్స్ పరిశ్రమ ఈ ఏడాది మంచి రికవరీని చూసినట్టు చెప్పారు. కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌లను, వాటి విడిభాగాలను పొందడమే సవాలుగా పేర్కొన్నారు. కరోనాతో కుదేలైన దేశీ ఎయిర్‌లైన్స్ పరిశ్రమ ఈ ఏడాది మంచిగా కోలుకోవడం తెలిసిందే. ప్రయాణికుల డిమాండ్ బలంగా ఉండడంతో ఎయిర్‌లైన్స్ కంపెనీలు సేవలను మరిన్ని ప్రాంతాలకు విస్తరించే పనిలో ఉన్నాయి. అయితే, చైనాలోని లాక్డౌన్లు, జీరో కోవిడ్ పాలసీ, రవాణాపై ఆంక్షలు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో పరిశ్రమ రికవరీపై ప్రభావం పడేలా చేసినట్టు ఐఏటీఏ తన తాజా నివేదికలో తెలిపింది. వచ్చే ఏడాది లాభాలు.. 2023లో అంతర్జాతీయంగా ఎయిర్‌లైన్స్ పరిశ్రమ లాభాల్లోకి అడుగు పెడుతుందని ఐఏటీఏ అంచనా వేసింది. 4.7 బిలియన్ డాలర్ల లాభాన్ని నమోదు చేయవచ్చని పేర్కొంది. ఈ ఏడాదికి 6.9 బిలియన్ డాలర్ల నష్టాన్ని ఎదుర్కోవచ్చన్న ఈ నివేదిక.. 2020లో 138 బిలియన్ డాలర్లు, 2021లో 42 బిలియన్ డాలర్ల కంటే చాలా తగ్గినట్టేనని తెలిపింది. ఈ ఏడాది అంతర్జాతీయంగా ఎయిర్‌లైన్స్ కంపెనీలు 9.7 బిలియన్ డాలర్ల నష్టాలను ఎదుర్కోవచ్చని ఐఏటీఏ జూన్‌లో అంచనా వేయడం గమనార్హం. ఈ ఏడాది ఒక్క నార్త్ అమెరికాలోనే ఎయిర్‌లైన్స్ పరిశ్రమ లాభాలను కళ్ల చూసినట్టు తెలిపింది. 2023లో నార్త్ అమెరికాతోపాటు యూరప్, మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లోని సంస్థలు సైతం లాభాల్లోకి అడుగుపెడతాయని పేర్కొంది. ఇక ల్యాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆసియా/పసిఫిక్ ప్రాంతాల్లోని సంస్థలు వచ్చే ఏడాదీ నికరంగా నష్టాలను చూస్తాయని అంచనా వేసింది. 2019లో నమోదైన ప్రయాణికుల రేటుతో పోలిస్తే ఈ ఏడాది 70 శాతంతో ముగించొచ్చని పేర్కొంది. ఈ ఏడాది అంతర్జాతీయంగా ఎయిర్‌లైన్స్ సంస్థల ఆదాయం 727 బిలియన్ డాలర్లుగా ఉంటుందని, వచ్చే ఏడాది 779 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా వేసింది. -
ఎయిర్‌లైన్స్‌లో కొత్త రూల్! గర్భిణి క్యాబిన్ సిబ్బంది కూడా...
ఎయిర్‌లైన్స్ గర్భిణి క్యాబిన్ సిబ్బందిని విధుల నుంచి తొలగించనని చెబుతుంది. వారు ఉద్యోగం కొనసాగించేలా ఒక ప్రత్యామ్నాయ విధానాన్ని కూడా ఇచ్చింది. అంతేగాదు డెలిరీ అయినా తర్వాత కూడా యథావిధిగా ఉద్యోగాన్ని కొనసాగించవచ్చని కూడా స్పష్టం చేసింది. గత కొంతకాలంగా సింగపూర్ ఎయిర్‌లైన్స్‌పై పలు విమర్శులు ఉన్నాయి. లింగ సమానత్వం పాటించడం లేదని గర్భిణి క్యాబిన్ సిబ్బందిని నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తుందని ఆరోపణలు ఉన్నాయి. అంతేగాదు వారిని ప్రెగ్నెన్సీ సమయంలో బలవంతంగా వేతనం లేని సెలవుల్లో ఉంచి, తదనంతర డెలివరీ తర్వాత పిల్లల బర్త్ సర్టిఫికేట్ తీసుకుని వారిని విధుల నుంచి తొలగిస్తుంది. దీనిపై సర్వత్ర విమర్శలు రావడంతో సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఈ కొత్త రూల్‌ని అమలు చేయనుంది. ఇక నుంచి గర్భణి క్యాబిన్ సిబ్బందిని తొలగించమని చెబుతోంది. అంతేగాదు గర్భిణి క్యాబిన్ సిబ్బంది తాత్కాలికంగా గ్రౌండ్ అటాంచ్మెంట్ పని చేసుకోవచ్చని, ప్రశూతి సెలవుల అనంతరం తిరిగి విధులు నిర్వర్తించ వచ్చని పేర్కొంది. ఈ మహమ్మారి కారణంగా సిబ్బంది కొరత సమస్యను ఎదుర్కొనడంతో ఒక కొత్త నిబంధనను అమలు చేస్తోంది. ఈ గర్భిణి సిబ్బంది మూడు నుంచి తొమ్మిది నెలలు గ్రౌండ్ ప్లేస్మెంట్లో విధులు నిర్వర్తించవచ్చు అని తెలిపింది. అలాగే ప్రతిభావంతులైన తమ సిబ్బందిని వదులుకోమని కూడా పేర్కొంది. అసోసియేషన్ ఆఫ్ ఉమెన్ ఫర్ యాక్షన్ అండ్ రీసెర్చ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కొరిన్నా లిమ్ ప్రసవానంతరం తల్లులు విమాన ప్రయాణం చేయకుండా మరైదైన బాధ్యతలు అప్పగించే అవకాశం లేదా అని ప్రశ్నించారు. అంతేగాదు ఈ కొత్త రూల్ కచ్చితంగా అమలవుతుందా అని కూడా ఎయిర్‌లైన్స్‌ని నిలదీశారు. ఐతే సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఈ విషయంపై ఇంకా స్పందించ లేదు. (చదవండి: కొట్టుకువచ్చిన... 500కి పైగా భారీ తిమింగలాలు) -
ఏవియేషన్‌కు రూ. 1,500 కోట్ల రుణ పరిమితి
న్యూఢిల్లీ: కోవిడ్ ధాటికి కుదేలైన రంగాలకు ఆర్థికంగా వెసులుబాటు కల్పించడానికి ఉద్దేశించిన ఈసీఎల్‌జీఎస్‌కి (అత్యవస రుణ సదుపాయ హామీ పథకం) కేంద్ర ఆర్థిక శాఖ సవరణలు చేసింది. వైమానిక రంగ సంస్థలకు గరిష్ట రుణ పరిమితిని రూ. 400 కోట్ల నుంచి రూ. 1,500 కోట్లకు పెంచింది. సముచిత వడ్డీ రేటుతో తనఖా లేని రుణాలు పొందడం ద్వారా విమానయాన సంస్థలు నిధుల కొరత సమస్యను అధిగమించడంలో తోడ్పాటు అందించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో 2020 మే నెలలో కేంద్రం ఈ స్కీమును ప్రవేశపెట్టింది. ఆ తర్వాత నుంచి పరిస్థితులను బట్టి సవరిస్తూ, పొడిగిస్తూ వస్తోంది. ఇది ఈ ఏడాది మార్చితో ముగియాల్సి ఉండగా 2023 మార్చి వరకూ పొడిగించింది. ఈ స్కీము కింద 2022 ఆగస్టు 5 నాటికి ఈ స్కీము కింద రూ. 3.67 లక్షల కోట్ల మేర రుణాలు మంజూరయ్యాయి. -
నేలపై నుంచి కాల్పులు.. విమానంలోకి దూసుకెళ్లిన బుల్లెట్
మయన్మార్‌లో షాకింగ్ ఘటన జరిగింది. నేషనల్ ఎయిర్ లైన్స్ విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడికి బుల్లెట్ తగిలింది. దీంతో అతనికి తీవ్ర గాయమైంది. నేలపై నుంచి ఎవరో కాల్పులు జరపడంతో విమానం పైకప్పుకు రంద్రంపడి బుల్లెట్ లోనికి దూసుకెళ్లింది. అనంతరం లోయికావ్ నగరంలో విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికుడ్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. బ్రిటీష్ వార్త సంస్థ వివరాల ప్రకారం విమానం 3,500 అడుగుల ఎత్తులో, విమానాశ్రయానికి నాలుగు మైళ్ల దూరంలో ప్రయాణిస్తోంది. ఈ ఘటన జరిగిన వెంటనే లోయికావ్ విమానాశ్రయానికి రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే విమానంపై కాల్పులు జరిపింది కచ్చితంగా రెబల్ గ్రూప్‌కు చెందిన వారే అని మయన్మార్ సైన్యం తెలిపింది. కరెన్ని నేషనల్ ప్రోగ్రెసివ్ పార్టీకి చెందిన ఉగ్రవాదులే ఈ చర్యకు పాల్పడినట్లు వెల్లడించింది. రెబల్స్ గ్రూప్స్ మాత్రం ఈ ఆరోపణలను ఖండించాయి. మయన్మార్‌లో సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని సాయుధ దళాలు, సంప్రదాయ తెగలు పోరాటం చేస్తున్నాయి. పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్ అనుబంధ సంస్థలే విమానంపై కాల్పులు జరిపాయని మయన్మార్ మిలిటరీ కౌన్సిల్ అధికార ప్రతినిధి మేజర్ జనరల్ జామ్ మిన్ టున్ తెలిపారు. మయన్మార్‌లో సైన్యం తిరుగుబాటు చేసి అధ్యక్షురాలు ఆంగ్ సాన్ సూకీని జైలుకు తరలించిన నాటి నుంచి ఆ దేశంలో అనేక చోట్ల సాయుధ దాళాలు పోరాటం చేస్తున్నాయి. సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు విమానంపై కాల్పులు జరిగిన కాయా రాష్ట్రంలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. చదవండి: ఉక్రెయిన్ వ్యూహంతో రష్యా ఉక్కిరిబిక్కిరి.. ఆ నగరం వదిలి పరార్! -
లోదుస్తులు కంపల్సరీ.. పాక్ ఎయిర్‌లైన్స్ పరువుపాయే!
ఇస్లామాబాద్: సొంత దేశంలోనే పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ పరువు పోయింది. విమాన సిబ్బందికి డ్రెస్ కోడ్‌లో భాగంగా లోదుస్తులు తప్పనిసరి అంటూ ఆదేశాలు ఇవ్వడమే అందుకు కారణం. ఈ తరుణంలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తగా.. ఆ ఆదేశాలను వెనక్కి తీసుకుంది ఎయిర్‌లైన్స్. గురువారం పీఐఏ.. క్యాబిన్ సిబ్బంది కోసం ఒక ఆదేశం జారీ చేసింది. యూనిఫాం కింద లోదుస్తులు ధరించడం తప్పనిసరి అని అందులో పేర్కొంది. అంతేకాదు.. అలా వేసుకోకపోవడం వల్ల ఎయిర్‌లైన్స్ సేవలపై పేలవమైన ముద్ర పడిపోతుందని, తద్వారా గడ్డుపరిస్థితి ఎదురుకావొచ్చని ఎయిర్‌లైన్స్ ఆ ఆదేశాల్లో అభిప్రాయపడింది. లోదుస్తులు వేసుకుంటేనే డిగ్నిటీగా ఉంటుందని పేర్కొంది. ఇంకేం.. అక్కడి నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఎయిర్‌లైన్స్ ఇచ్చింది అసలు అవసరం లేని ఆదేశాలన్నారు చాలామంది. ఎయిర్‌లైన్స్‌పై సొంత దేశంలోనే ట్రోలింగ్ కూడా జరిగింది. దీంతో ఆ ఆదేశాలను వెనక్కి తీసేసుకుంది ఎయిర్‌లైన్స్. అయితే ఆ విమర్శలు మామూలుగా రాలేదు. అందుకే ఆ ఆదేశాలపై కచ్చితంగా వివరణ ఇవ్వాల్సి వచ్చింది పీఐఏ. How do undergarments potray positive image of PIA (Pakistan International Airlines)?#Pakistan #PIA #Undergarments pic.twitter.com/gPEmyDc2O9 — lyfmail.com (@lyfmailcom) September 30, 2022 @nailainayat @Arzookazmi30 Its Very important news coming from Pakistan. This decison by #PIA will be helpful in revenue generation. 🤣🤣🤣🤣🤣 Kuch Bhi, kya akal andhe baithe hai bhai #PIA me 🤣🤣 — मौलाना काण्डकारी अल हरामी مولانا کندکاری الحرامی۔ (@Maulanakandkari) September 30, 2022 డ్రెస్ కోడ్‌కు సంబంధించిన ఆదేశాల్లో చిన్న తప్పిదం జరిగిందని, అనవసరమైన పదాల చేరికతోనే ఇలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చిందని పీఐఏ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ రాతపూర్వక వివరణ ఇచ్చుకున్నారు. ఇక.. జరిగిన ఘటనకు వ్యక్తిగతంగా పశ్చాత్తాపం తెలియజేశారాయన. పీఐఏ పాక్‌లో అతిపెద్ద ఎయిర్‌లైన్. రోజూ వందకు పైగా విమానాలు నడిపిస్తోంది. అందులో 18 దేశీయ సర్వీసులు కాగా, 25 అంతర్జాతీయ సర్వీసులు ఉన్నాయి. ఇదీ చదవండి: రూ. 8 కోట్ల కారు.. నీటిపాలు -
ప్యాసింజర్ షార్ట్ టెంపర్.. దెబ్బకు ఫ్లైట్ జర్నీ చేయనీకుండా జీవితకాల నిషేధం
కొంతమందికి చిన్న చిన్న వాటికే కోపాలు వచ్చేస్తుంటాయి. దీంతో ముందు వెనుక ఆలోచించకుండా అనుచితంగా ప్రవర్తించి లేనిపోనీ తంటాలను కొని తెచ్చుకుంటారు. ఇక్కడో ఒక విమాన ప్రయాణికుడు అలానే ప్రవర్తించి జీవితంలో విమాన ప్రయాణమే చేయనీకుండా నిషేధింపబడ్డాడు. వివరాల్లోకెళ్తే... మెక్సికోలోని ఒక అమెరికన్ ఎయిర్‌లైన్స్ లాస్ కాబోస్ నుంచి లాస్ ఏంజెల్స్‌కు వెళ్తున్న సమయంలో ఒక ప్రయాణికుడు విమాన సిబ్బందిపై అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో జీవితంలో అసలు ప్లైట్ జర్నీ చేసేందుకు లేకుండా నిషేధం విధించింది. ఈఘటన అమెరికన్ ఎయిర్‌లైన్స్ 377 విమానంలో చోటు చేసుకుంది. ఒక విమాన సహయకుడుని నన్ను బెదిరిస్తున్నావా అంటూ ఒక ప్రయాణికుడు వెనుక నుంచి వచ్చి దాడి చేశాడు. సదరు ప్రయాణికుడు పిడికిలితో ఫ్లైట్ అటెండెంట్ తల వెనుక భాగంలో కొట్టాడు. దీంతో సదరు అటెండెంట్ ఈ ఆకస్మిక దాడికి వెంటనే కిందపడిపోయాడు. వాస్తవానికి సదరు ఫ్లైట్ అటెండెంట్ ప్రయాణికుడి ప్రవర్తన విషయమై కంప్లైంట్ చేసేందుకు వెళ్తున్నసమయంలోనే ఈ దాడి జరిగిందని అధికారులు తెలిపారు. ఈ అనుహ్య ఘటనకి విమాన సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. ఆ విమానంలోని ఒక హోస్ట్ గాయపడిన అటెండెంట్‌కి సపర్యలు కూడా చేసింది. ఈ ఘటనతో ఆగ్రహం చెందిన అమెరికా విమాన ఎయిర్‌లైన్స్ వెంటనే స్పందించి...ఈ దాడికి పాల్పడిన వ్యక్తి 33 ఏళ్ల అలెగ్జాండర్ తుంగ్ క్యూ లేగా గుర్తించి అతన్ని వెంటనే విమానం నుంచి దించేయడమే కాకుండా జీవితకాలం విమానంలో ప్రయాణించకుండా నిషేధం విధించింది. అంతేగాదు తమ సిబ్బందిని గాయపరిచినందుకు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. విచారణలో నేరం రుజువైతే సదరు ప్రయాణికుడికి 20 ఏళ్లు జైలు శిక్ష పడుతుందని కూడా పేర్కొంది. ఈ మేరకు అమెరికా ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటన విడుదల చేసింది కూడా. తమ ఎయిర్‌లైన్స్ పట్ల అనుచితంగా ప్రవర్తించి దాడి చేస్తే... చూస్తూ ఊరుకోమని, వారికి అవసరమైన సహాయాన్ని అందిస్తామని స్పష్టం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. A man was arrested by Los Angeles Airport police after assaulting a flight attendant on an American Airlines flight from Cabo. pic.twitter.com/2VDXxIqUfn — 🇺🇸BellaLovesUSA🍊 (@Bellamari8mazz) September 22, 2022 (చదవండి: మూడేళ్ల చిన్నారి చేతిలో తల్లి మృతి) -
విమానం గాల్లోకి ఎగిరాక పైలట్ల ఫైట్.. పాపం ప్రయాణికులు..!
పారిస్: విమానంలో ఏ చిన్న పొరపాటు జరిగినా పెను ప్రమాదానికి దారితీస్తుంది. విమానాలను నడిపే పైలట్లు ఎంతో నేర్పుతో, నైపుణ్యవంతులై ఉంటారు. సమన్వయంతో విమానాన్ని సురక్షితంగా తీసుకొస్తారు. అలాంటిది.. వారే విమానంలోని కాక్‌పుట్‌లో గొడవకు దిగారు. ఒకరిపై ఒకరు పిడిగుద్దులతో హల్చల్ చేసి.. ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలో పడేశారు. ఈ సంఘటన ఫ్రాన్స్‌లో జరిగింది. పారిస్ నుంచి జెనీవాకు వెళ్తున్న ఎయిర్ ఫ్రాన్స్ విమానంలోని ఇద్దరు పైలట్లు గొడవకు దిగిన కారణంగా వారిని సస్పెండ్ చేశారు అధికారులు. పైలట్లు గత జూన్ నెలలో విమానం కాక్‌పిట్‌లో గొడవ పడినట్లు ఎయిర్‌లైన్స్ అధికార ప్రతినిధి ధ్రువీకరించారు. అయితే, కొద్ది క్షణాల్లోనే గొడవ సద్దుమణిగిందని, ఆ తర్వాత విమాన ప్రయాణం సాఫీగా కొనసాగినట్లు చెప్పారు. తమ ప్రవర్తనపై మేనేజ్మెంట్ నిర్ణయం కోసం పైలట్లు ఇన్నాళ్లు వేచి ఉన్నారని చెప్పారు. ఫ్రాన్స్ పౌర విమానయాన సంస్థ భద్రతా దర్యాప్తు సంస్థ నివేదిక బయటకు రావటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. జూన్‌లో జరిగిన సంఘటన నివేదిక ప్రకారం.. విమానం గాల్లోకి ఎగిరిన కొద్ది సమయానికే కాక్‌పిట్‌లో పైలట్, కోపైలట్‌ల మధ్య వివాదం మొదలైంది. దీంతో ఒకరు ఎదుటి వ్యక్తి కాలర్ పట్టుకున్నారు. దాంతో అతడిపై దాడి చేశారు మరొకరు. కాక్‌పిట్ నుంచి అరుపులు క్యాబిన్లోకి వినిపించినట్లు పలువురు తెలిపారు. దీంతో వారు వెళ్లి గొడవను ఆపారని, ఓ పైలట్ ఫ్లైట్ డెక్కు వెళ్లిపోయినట్లు చెప్పారు. ఇదీ చదవండి: పెళ్లయి ఇద్దరు పిల్లలు.. ఇంజనీరింగ్ విద్యార్థితో జంప్ -
డ్రగ్ టెస్టులో పైలట్ ఫెయిల్.. విధుల నుంచి ఔట్
న్యూఢిల్లీ: డ్రగ్ పరీక్షలో విఫలమైన ప్రముఖ విమానయాన సంస్థ పైలట్‌ను ఫ్లైట్ డ్యూటీ నుంచి తొలగించినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) శుక్రవారం వెల్లడించారు. పైలట్లకు డ్రగ్ టెస్టు నిర్వహించడం ఈ ఏడాది జనవరి 31 నుంచి ప్రారంభమయ్యింది. తాజా కేసుతో కలుపుకొని ఇప్పటిదాకా నలుగురు పైలట్లు, ఒక ఏటీసీ అధికారి ఈ టెస్టులో ఫెయిలయ్యారు. విమానయాన సిబ్బంది మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు తేలితే మొదట డి–అడిక్షన్ సెంటర్‌కు పంపిస్తారు. రెండోసారి కూడా పరీక్షలో ఫెయిలైతే మూడేళ్లపాటు విధుల నుంచి సస్పెండ్ చేస్తారు. మూడోసారి సైతం ఫెయిలైతే లైసెన్స్ రద్దు చేస్తారు. -
Indian Women Pilots: ఆకాశమే ఆమె హద్దు..
మహిళల భాగస్వామ్యానికి సంబంధించి మిగిలిన రంగాల పరిస్థితి ఎలా ఉన్నా.. విమానయాన రంగంలోని పైలట్ల విషయంలో మాత్రం ప్రపంచంలో భారతే నంబర్ వన్ అట. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ వుమెన్ ఎయిర్‌లైన్ పైలట్స్ విడుదల చేసిన గణాంకాల(2021) ప్రకారం.. దేశంలోని వివిధ ఎయిర్‌లైన్స్ పైలట్లలో 12.4 శాతం మహిళలే. ప్రపంచంలోని మరే దేశంలోనూ ఈ స్థాయిలో వారి ప్రాతినిధ్యం లేదు. ఈ విషయంలో ప్రపంచవ్యాప్త సగటు 5.8 శాతం మాత్రమే. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలైతే.. ప్రపంచ సగటు కన్నా కిందనే ఉండటం గమనార్హం. కొన్ని దశాబ్దాలుగా భారత్‌లో మహిళా పైలట్ల భర్తీ గణనీయంగా పెరిగిందని బ్లూంబర్గ్ మీడియా తెలిపింది. -
చౌక ధరల్లో విమాన టికెట్లు: రూ. 9 లకే ఫారిన్ చెక్కేయొచ్చు!
సాక్షి, ముంబై: రానున్న ఫెస్టివ్ సీజన్లో ఫారిన్ చెక్కేయ్యాలని న్ చేస్తున్నారా? అయితే మీకో బంపర్ ఆఫర్. కేవలం 9 రూపాయలలో విదేశాలకు వెళ్లే అవకాశం ఎదురుచూస్తోంది. వియత్నాంకు చెందిన విమానయాన సంస్థ వియట్జెట్ చాలా చౌకగా విమాన టిక్కెట్లను ఆఫర్ చేస్తోంది. దీంతో పాటు ఇతర నాలుగు విమానయాన సంస్థలు కూడా పర్ తగ్గింపు ఆఫర్లు అందిస్తున్నాయి. ‘సీజన్ సేల్’ పేరుతో స్పైస్‌జెట్ కస్టమర్ల కోసం ఈ ఆఫర్‌ను అందిస్తున్నాయి. ముఖ్యంగా. బడ్జెట్ ఎయిర్‌లైన్స్ ఇండిగో, స్పైస్‌జెట్, గోఫస్ట్, ఎయిర్ ఏషియా ఇండియా ఇలాంటి ఆఫర్లతో ముందుకొచ్చాయి. ఈ సేల్‌లో కేవలం రూ.1498కే విమాన ప్రయాణ టిక్కెట్లను అందిస్తున్నాయి. రూ.9కే విమాన టికెట్లు: వియట్ జెట్ ఈ ఆఫర్లో కేవలంరూ.9కే (ట్యాక్స్‌లు మినహాయించి)విమాన ప్రయాణ టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్లోదాదాపు 30,000 ప్రమోషనల్ టిక్కెట్లను అందిస్తోంది. వియట్జెట్ ఎయిర్ కంపెనీ వెబ్సైట్ లేదా యాప్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. 26 ఆగస్టు 2022 వరకు ప్రతి బుధ, గురు శుక్రవారాల్లో ప్రయాణీకులు ఈ చౌక ప్రమోషనల్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా 2022 ఆగస్టు 15 నుంచి 2023 మార్చి 26 వరకు ప్రయాణం చేయవచ్చు. ఎయిర్ ఏషియా ఇండియా పే డే సేల్ ఎయిర్ ఏషియా ఇండియా తన కస్టమర్ల కోసం ‘పే డే సేల్’ను తీసుకొచ్చింది. ఇందులో ఢిల్లీ-జైపూర్ వంటి రూట్లలో విమాన టిక్కెట్లను రూ.1,499 నుంచి అందిస్తోంది. ఈ ఆఫర్ కింద, వినియోగదారులు జూలై 28 జూలై 31 మధ్య బుక్ చేసుకోవచ్చు. ప్రయాణ వ్యవధి ఆగస్టు 15 నుండి డిసెంబర్ 31 వరకు ఉంటుంది. ఇది కాకుండా, ఎయిర్ ఏషియా ఇండియా తన నెట్‌వర్క్‌లో మరిన్ని డిస్కౌంట్ సేల్ ఆఫర్లను కూడా తీసుకొచ్చింది. -
స్వతంత్ర భారతి: డియర్ గెస్ట్.. నేను మీ కెప్టెన్
జంషెడ్జీ టాటా స్థాపించిన ఎయిర్ ఇండియాను భారత ప్రభుత్వం జాతీయం చేసింది. కొంత కాలం బాగానే నడిచినా చివరకు రాజకీయ జోక్యం పెరిగిపోవడం, నిర్వహణ లోపాల కారణంగా నష్టాల పాలైంది. అప్పుల కుప్పగా మారిన ఎయిరిండియాను కొనేందుకు ఎవ్వరూ ముందుకు రాని సమయంలో ఇటీవలే మరోసారి ధైర్యం చేశారు రతన్ టాటా. తన తండ్రి కలల ప్రాజెక్టయిన ఎయిర్ ఇండియాను తిరిగి 2021లో టాటా గూటికి చేర్చారు. ప్రభుత్వం నుంచి టాటాపరమైన తర్వాత తొలి ఫ్లైట్ ఈ ఏడాది జనవరి 27న టాటాల ఆధ్వర్యంలో నడిచింది. ఈ సందర్భంగా తమ విమానంలో ప్రయాణిస్తున్న వారికి మొదటి సారిగా వినిపించిన అనౌన్స్‌మెంట్‌ని టాటా మీడియాకు రిలీజ్ చేసింది. ఈ అనౌన్స్మెంట్ ‘ డియర్ గెస్ట్, నేను మీ కెప్టెన్ ను మాట్లాడుతున్నాను.. సరికొత్త చరిత్రకు నాంది పలుకుతున్న విమానంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.., అంటూ మొదలు పెట్టి ‘వెల్కమ్ టూ ది ఫ్యూచర్ ఆఫ్ ఎయిర్ ఇండియా! వి హోప్ యూ ఎంజాయ్ ది జర్నీ’ అంటూ ముగించింది. 1932లో తొలిసారిగా టాటా గ్రూప్ ఇండియాలో ఎయిర్‌లైన్స్‌ను స్థాపించింది. అప్పటి టాటా గ్రూప్ ఛైర్మన్ జేఆర్డీ టాటా ఆధ్వర్యంలో ఇది విజయవంతంగా నడిచింది. అయితే 1953 జాతీయీకరణలో ఎయిర్ ఇండియా పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లింది. చాలాకాలం విజయవంతంగా నడిచిన ఎయిర్ ఇండియా.. దాదాపు పదేళ్ల క్రితం వరకు నష్టాలను నమోదు చేస్తూనే ఉంది. -
బిగ్బుల్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ప్లాన్స్‌లో మార్పులు.. కారణం ఇదే
ముంబై: సుప్రసిద్ధ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా ఇన్వెస్ట్ చేస్తున్న ఆకాశ ఎయిర్ సర్వీసులు మరింత ఆలస్యంకానున్నట్లు తెలుస్తోంది. కంపెనీకి తొలి విమానం(ఎయిర్‌క్రాఫ్ట్) ఈ ఏడాది జూన్ లేదా జులైలో అందే వీలున్నట్లు డీజీసీఏ సీనియర్ అధి కారి ఒకరు అభిప్రాయపడ్డారు. ఎస్ఎన్వీ ఏవియేషన్ పేరుతో రిజిస్టరైన ఈ ముంబై సంస్థ గతేడాది అక్టోబర్‌లో పౌర విమానయాన శాఖ నుంచి నోఅబ్జక్షన్ సర్టిఫికెట్‌ను పొందిన సంగతి తెలిసిందే. తొలి విమానం వచ్చేది అప్పుడే తాజాగా చోటు చేసుకున్న మార్పుల ప్రకారం ఎయిర్‌లైన్స్ సర్వీసులు జులైలో ప్రారంభించే యోచనలో ఆకాశ ఉన్నట్లు అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. మొదటి ఎయిర్‌క్రాఫ్ట్‌ను అందుకున్నాక తొలుత పరీశీలన ప్రాతిపదికన విజయవంతంగా సర్వీసులను నిర్వహించవలసి ఉన్నట్లు తెలియజేశారు. కాగా.. 2022 జూన్ మధ్యకల్లా తొలి విమానాన్ని పొందే వీలున్నట్లు ఆకాశ ఎయిర్ వ్యవస్థాపకుడు, ఎండీ వినయ్ దూబే అంచనా వేశారు. విమానయాన సర్వీసుల సంస్థ(ఏవోపీ)గా అనుమతులు పొందేందుకు ముందుగా పరిశీలనా సర్వీసులు చేపట్టవలసి ఉన్నట్లు తెలియజేశారు. వెరసి 2022 జులైకల్లా వాణిజ్య ప్రాతిపదికన సర్వీసులను ప్రారంభించగలమని భావిస్తున్నట్లు చెప్పారు. 2023 మార్చికల్లా 18 విమానాలను సమకూర్చుకోగలమన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. చదవండి: రాకేష్ ఝున్‌ఝున్‌వాలా టార్గెట్ అదే, రూ.66వేల కోట్లతో..! -
శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్‌ను అమ్మేస్తాం!: ప్రధాని విక్రమసింఘే
కొలంబో: శ్రీ లంక ప్రభుత్వం నేషనల్ ఎయిర్‌లైన్స్‌ను అమ్మేయాలని అనుకుంటోంది. ప్రస్తుతం దేశం ఉన్న పరిస్థితుల్లో నష్టాలను భరించేందుకు.. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఈ నిర్ణయం తప్పదని ప్రధాని రణిల్ విక్రమసింఘే స్పష్టం చేశారు. సోమవారం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన లంక ప్రధాని రణిల్ విక్రమసింఘే.. పలు కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో లంక దారుణమైన పరిస్థితిని ఎదుర్కోనుందని, ప్రజలను అబద్ధాలతో మభ్య పెట్టడం ఇష్టం లేక నిజాలు చెప్తున్నానంటూ ఖుల్లా ప్రకటనతో దేశ పరిస్థితి చెప్పేశారు ఆయన. ఈ క్రమంలో.. ప్రభుత్వ విమాన సంస్థను అమ్మేయాలనుకుంటున్నట్లు కూడా తెలిపారు. మార్చి 2021 చివరినాటికే విమానయాన సంస్థ.. 45 బిలియన్ రూపీస్ (124 మిలియన్ డాలర్లు) నష్టాల్లో ఉందని తెలిపారు. విమానంలో ఏనాడూ అడుగు పెట్టని నిరుపేదలు ఈ నష్టాన్ని భరించాల్సిన అవసరం ఏముంది? ఏం లేదు.. అంటూ ప్రైవేటీకరణ దిశగా సంకేతాలు ఇచ్చారాయన. 1975లో ఏర్పాటైన శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ ప్రపంచవ్యాప్తంగా 61 దేశాల్లోని 126 ప్రదేశాలకు విమాన సర్వీసులు నడుపుతోంది. 2006 తర్వాత తొలిసారి ఓ త్రైమాసికంలో లాభాలు వచ్చాయని గత నెలలో శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ ప్రకటించుకుంది కూడా. ఇదిలా ఉండగా.. విక్రమ్‌సింఘే శ్రీలంక ప్రధాని పదవి చేపట్టి వారం కూడా కాలేదు. కానీ, ఆయన ముందు పెను సవాల్లే ఉన్నాయి. సంక్షోభం నడుమే ప్రధాని పగ్గాలు అందుకున్న ఆయన.. వచ్చి రావడంతోనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు కరెన్సీ ముద్రణ లాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు కూడా. డాలర్ల కొరత వేధిస్తున్న తరుణంలో.. రాబోయే ఒకటి రెండు రోజుల్లో 75 మిలియన్ డాలర్ల విదేశీ కరెన్సీ అవసరమని, ఇంధనాల మీద ప్రభుత్వం ఇక సబ్సిడీ భరించే స్తోమత లేదని, రాబోయే రోజుల్లో ధరల మోత తప్పదంటూ సంచలన ప్రకటనలు చేశాడు కూడా. Sri Lanka | Fuel stations put up 'No Petrol' posters amid severe shortage of petrol-diesel Petrol stocks only for a day, said PM Ranil Wickremesinghe y'day We're waiting since early hours of day, but petrol is yet to come. People are waiting in kilometers-long queue, say locals pic.twitter.com/Mqn2VNu62W — ANI (@ANI) May 17, 2022 చదవండి: ముందు ముందు మరింత ఘోరం.. చేతులెత్తేసిన శ్రీలంక కొత్త ప్రధాని! -
ఎయిర్ లైన్స్ పై ఫిర్యాదులు... స్పందించిన సింధియా
న్యూఢిల్లీ: స్పెస్ జెట్ బోర్డింగ్ పాస్ కోసం అదనపు చార్జీలు వసూలు చేస్తున్నాయంటూ విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ట్విట్టర్లో ఫిర్యాదు చేశారు. దీంతో సింధియా ఫిర్యాదులను పరీశీలించేందుకు అంగికరీంచడమే కాకుండా త్వరితగతిన విచారణ చేస్తానని ట్వీట్ చేశారు. కొన్ని విమానయాన సంస్థలు వెబ్ చెక్-ఇన్ చేయాలని పట్టుబట్టడమే కాకుండా అలా చేయడంలో విఫలమైన ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ పలువురు సోషల్ మీడియా ఫిర్యాదులు చేశారు. అంతేగాదు ఎయిర్పోర్ట్ కౌంటర్లో బోర్డింగ్ పాస్ కోసం ప్రయత్నించే వారి నుంచి కొన్ని ఎయిర్‌లైన్స్ ఛార్జీలు వసూలు చేస్తున్నాయని తెలిపారు. ఎయిర్పోర్ట్ చెక్-ఇన్ కౌంటర్లో చెక్ ఇన్ చేయడానికి ఒక్కో టికెట్‌కు రూ. 200 ఖర్చవుతుందని స్పైస్‌జెట్‌తో పాటు ఇండిగో కూడా అదే పని చేసిందని వెల్లడించారు. దీని వల్ల వినియోగ దారులకు చాలా అన్యాయం జరుగుతుందంటూ ఫిర్యాదులు చేశారు. Agreed, will examine this asap! https://t.co/KkY8b0xP93 — Jyotiraditya M. Scindia (@JM_Scindia) May 13, 2022 Ridiculous .Is @JM_Scindia listening? https://t.co/HBL8hUo4oT — Madhavan Narayanan (@madversity) May 13, 2022 new rule of SpiceJet. If you wish to get a boarding card at the check in counter,you need to pay extra. This is like telling a customer In a restaurant that if you want eat in a plate, you will be charged. Wonder what’s conssumer forum doing!@flyspicejet @BDUTT @madversity — Dr. Neeti Shikha (@neetishikha) May 13, 2022 (చదవండి: ల్యాప్‌టాప్ కీబోర్డులో పట్టుబడ్డ రూ. 1.3 కోట్ల బంగారం) -
ఇక నాన్‌స్టాప్ ప్రయాణం
దూరాలు వెళ్లాలంటే... విమానాల కోసం ఎదురుచూపులు, పడిగాపులు. ఒకటి, రెండు ఫ్లైట్స్ మారాల్సి వస్తుంది. లేదంటే ఒకట్రెండు హాల్టులైనా ఉంటాయి. ఇక ఇలాంటి మార్పులకు హాల్టులు చెక్ పెడుతోంది ఆస్ట్రేలియాకు చెందిన విమానయాన సంస్థ క్వాంటాస్. లండన్ నుంచి ఆస్ట్రేలియాకు డైరెక్ట్ ఫ్లైట్‌ను 2025 నుంచి నడపనుంది. 19 గంటలపాటు నాన్‌స్టాప్‌గా నడిచే ఈ ఫ్లైట్.. ఆగకుండా అత్యంత దూరం 17,016కి.మీ ప్రయాణించే విమానంగా చరిత్ర సృష్టించనుంది. కాగా ప్రస్తుతం సింగపూర్ టు న్యూయార్క్ 15,300కి.మీ దూరాన్ని 17న్నర గంటలపాటు ప్రయాణించే ఫ్లైట్ అత్యంత లాంగెస్ట్. కాగా... లాంగెస్ట్ ట్రయల్ ఫ్లైట్ 2019లో లండన్ నుంచి సిడ్నీ 19 గంటల 19 నిమిషాలు ప్రయాణించింది. ఎక్కడా హాల్టులు లేని ఈ ప్రయాణాలకు డిమాండ్ పెరగడంతో ఎ350–1000 ఎయిర్‌బస్సులు 12 ఆర్డర్ చేసింది. ఇక ఈ ఎ350, ‘ప్రాజెక్ట్ సన్‌రైజ్’విమానాల్లో ఆస్ట్రేలియా నుంచి లండన్, న్యూయార్క్... ఇలా ఏ నగరానికైనా నాన్‌స్టాప్‌గా ప్రయాణించొచ్చు. మొట్టమొదటి ‘ప్రాజెక్ట్ సన్‌రైజ్’ఫ్లైట్స్ న్యూయార్క్, లండన్ల నుంచి ప్రారంభమవ్వనున్నాయి. అలాగే.. ఆస్ట్రేలియా నుంచి పారిస్, ఫ్రాంక్ఫర్ట్ వంటి నగరాలకూ ప్రయాణించనున్నాయి. ఒక్కో విమాన సామర్థ్యం 238 మంది. అధికదూరం ప్రయాణించేవి కావడంతో... ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా నడక, చిన్నపాటి వ్యాయామాలకోసం వెల్బియింగ్ జోన్లను కూడా ఏర్పాటు చేసింది. ఇక ఇందులో ఉన్న ఫస్ట్‌క్లాస్ సూట్... చిన్నపాటి హోటల్ రూమ్‌ను తలపిస్తుంది. బెడ్, పెద్ద టీవీ, లాంజ్చైర్, వార్డ్రోబ్ వంటి ఆధునిక సౌకర్యాలున్నాయి. తక్కువ కర్బన ఉద్గారాలు, తక్కువ శబ్దం వచ్చేలా పర్యావరణహితంగా తయారు చేయిస్తోంది క్వాంటాస్. ప్రయాణికుల బడ్జెట్‌కు అందుబాటులో ఉంటాయని చెబుతోంది. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
ట్రూజెట్‌లో విన్‌ఎయిర్‌కు మెజారిటీ వాటాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా తొలి సమాంతర విమానయాన సంస్థ విన్‌ఎయిర్ తాజాగా ట్రూజెట్‌లో 79 శాతం వాటాలను కొనుగోలు చేసింది. ఈ ఒప్పంద విలువ రూ. 200 కోట్లు. డీల్ ప్రకారం ట్రూజెట్ నిర్వహణ నియంత్రణ, కార్యకలాపాలను విన్‌ఎయిర్ (ఉయ్ ఇండియన్ నేషనల్స్) టేకోవర్ చేస్తుంది. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై టర్బో మేఘా ఎయిర్వేస్ ఎండీ ఉమేష్ వంకాయలపాటి, విన్‌ఎయిర్ సీఎండీ శామ్యూల్ తిమోతీ సంతకాలు చేశారు. దీని ప్రకారం ఉమేష్ ఎండీగా కొనసాగనుండగా, నూతన మేనేజ్మెంట్ టీమ్‌కు కొత్త వ్యాపార ప్రణాళికతో తిమోతీ దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ ఒప్పందంతో ట్రూజెట్ 650 మంది పైగా ఉద్యోగులు, వారి కుటుంబాలకు స్వాంతన చేకూరనుంది. మీడియా, రియల్ ఎస్టేట్ తదితర వ్యాపారాల్లో ఉన్న ఆర్యన్ గ్రూప్ కంపెనీస్‌లో విన్‌ఎయిర్ కూడా భాగంగా ఉంది. డిసెంబర్ ఆఖరు నాటికి రోజూ 17 ఎయిర్‌క్రాఫ్ట్‌లు, 3 బ్యాకప్ విమానాలతో ట్రూజెట్ సర్వీసులు నిర్వహించగలదని తిమోతీ తెలిపారు. ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఆపరేటింగ్ పర్మిట్లు మొదలైనవన్నీ ఉన్న ఎయిర్‌లైన్స్ నుంచి విమానాలను వాటి లైసెన్సులతో పాటు లీజుకు తీసుకుని లాభసాటి రూట్లలో నడిపించుకునే సంస్థను సమాంతర (ప్యారలల్) ఎయిర్‌లైన్‌గా వ్యవహరిస్తారు. -
భారీ షాక్..! రూ. 17 వేలకు పైగా పెంచేసిన చమురు సంస్థలు..! టికెట్ ధరలకు రెక్కలే..!
Aviation Turbine Fuel Price Hiked: కోవిడ్-19 రాకతో విమానయాన రంగం పూర్తిగా కుదేలయ్యంది. పలు దేశాలు అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధ్జాలు విధించడంతో ప్రకటించడంతో విమానయాన రంగం భారీగా దెబ్బతింది. ఇప్పుడిప్పుడే కరోనా ఉదృతి కాస్త తగ్గడంతో విమానయాన రంగం పుంజుకుంది. ఐతే తాజాగా మరో చమురు సంస్థలు విమానయాన సంస్థలకు భారీ షాక్ ఇస్తూ జెట్ ఇంధనం(ఎయిర్ టర్బైన్ ఫ్యుయల్) ధరలను భారీగా పెంచాయి. ఏకంగా రూ. 17 వేలకు పైగా..! చమురు మార్కెటింగ్ కంపెనీలు జెట్ ఇంధనంపై కిలోలీటర్‌కు రూ.17,136 చొప్పున పెంచాయి.దీంతో ఢిల్లీలో ఏటీఎఫ్ ధర కిలోలీటర్ రూ.1.10 లక్షలకు చేరుకుంది. జెట్ ఇంధన ధరల పెరుగుదలతో విమాన ప్రయాణం మరింత భారంగా మారనుంది. ఆయా ఎయిర్‌లైన్ సంస్థలో ఇంధన నిర్వహన వ్యయమే దాదాపు 40 శాతం ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో ముడిచమురు ధర అధికంగా ఉండడంతో ఈ ఏడాదిలో ఏటీఎఫ్ ధరలను చమురు సంస్థలు పెంచడం ఇది ఆరోసారి. మరింత ఖరీదు..! ఎటీఎఫ్ ధరలను పెరగడంతో విమానయాన సంస్థలు విమాన టికెట్ల ధరలను పెంచడం అనివార్యమైంది. గత రెండు, నాలుగు వారాల్లో డొమెస్టిక్ విమాన ప్రయాణ ఛార్జీలు 15 నుంచి 30 శాతం మేర పెరిగాయి. జనవరి 1 నుంచి ఇప్పటి వరకు ఐదు సార్లు పెంపులో ఏటీఎఫ్ ధరలు కిలోలీటర్‌కు రూ.36,644.25 చొప్పున పెరిగాయి. ఇక కొద్ది రోజుల క్రితమే అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధ్ఞాలను కేంద్రం ఎత్తివేసింది. దీంతో అంతర్జాతీయ విమాన ప్రయాణ ఛార్జీలు తగ్గినట్లు తెలుస్తోంది. చదవండి: జెలన్ స్కీ కీలక ప్రకటన.. ఈ షేర్లపై భారీగా పెరుగుతున్న పెట్టుబడులు! -
త్వరలో హైదరాబాద్‌కు మరో విమాన సర్వీసు
శంషాబాద్: ఉడాన్ పథకంలో భాగంగా ఫ్లైబిగ్ ఎయిర్‌లైన్స్ సంస్థ హైదరాబాద్‌కు సర్వీసులను ప్రారంభించనుంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి మహారాష్ట్ర గొండియా మీదుగా హైదరాబాద్‌కు ఈ నెల 13 నుంచి సర్వీసును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ప్రధాన నగరాలతో పాటు టైర్–2, టైర్–3 నగరాలను అనుసంధానించడంలో భాగంగా సర్వీసులను విస్తరిస్తున్నట్లు సంస్థ సీఎండీ సంజయ్ మాండవియా తెలిపారు. మే 2వ వారంలో ఈశాన్య రాష్ట్రాల్లో సర్వీసులు ప్రారంభమవుతాయన్నారు. ప్రసుతం దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో ఎనిమిది గమ్యస్థానాలకు 20 సర్వీసులు కొనసాగుతున్నాయన్నారు. చదవండి: జమ్షెడ్జీ నుసర్వాన్జీ టాటా.. మీరే మాకు స్పూర్తి! -
ఎయిరిండియా సీఈవో పోస్టుకు ఇల్కర్ తిరస్కరణ
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఎయిరిండియా సీఈవో, ఎండీగా చేరాలంటూ టాటా గ్రూప్ ఇచ్చిన ఆఫర్‌ను ఇల్కర్ అయిజు తిరస్కరించారు. భారత మీడియాలోని కొన్ని వర్గాలు .. అవాంఛనీయ కథనాలతో తన నియామకంపై సందేహాలు రేకెత్తించేందుకు ప్రయత్నించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తాను తాజా నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ‘ఒక వ్యాపార నాయకుడిగా నేను ఎప్పుడూ ఉన్నత విలువలకు ప్రాధాన్యం ఇస్తాను. నా నియామకాన్ని ప్రకటించినప్పటి నుంచి దానికి అవాంఛనీయ రంగులు అద్దేలా భారత మీడియాలోని కొన్ని వర్గాలు అభ్యంతరకమైన కథనాలను ప్రచారం చేస్తుండటాన్ని పరిశీలించాను. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఆ బాధ్యతలు చేపట్టడం సరికాదనే నిర్ణయానికి వచ్చాను‘ అని ఇల్కర్ తెలిపారు. ఎయిరిండియాకు సారథ్యం వహించే అవకాశాన్ని ఆఫర్ చేసినందుకు టాటా గ్రూప్, దాని చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎయిరిండియాను టాటా సన్స్ గతేడాది అక్టోబర్‌లో రూ. 18,000 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీనికి సీఈవో, ఎండీగా టర్కిష్ ఎయిర్‌లైన్స్ మాజీ చైర్మన్ ఇల్కర్‌ను నియమిస్తున్నట్లు ఫిబ్రవరి 14న ప్రకటించింది. -
ప్రాంతీయ విమాన సేవలకు ప్రత్యేక పాలసీ
న్యూఢిల్లీ: ప్రధాన కేంద్రాల నుంచి వివిధ ప్రాంతాలకు వైమానిక సర్వీసులకి మరింత ఊతమిచ్చే దిశగా ప్రాంతీయ ఎయిర్‌లైన్స్, హెలికాప్టర్ ఆపరేటర్లకు సంబంధించి ప్రత్యేక పాలసీ రూపొందించడంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. చిన్న పట్టణాల్లోని విమానాశ్రయలతో పాటు ప్రాంతీయంగా కనెక్టివిటీపైనా ప్రధానంగా దృష్టి పెడుతోంది. పరిశ్రమల సమాఖ్య అసోచాం సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ విషయాలు వెల్లడించారు. ‘సాధారణంగా ఇలాంటి సర్వీసులకు ప్రత్యేక సమస్యలు ఉంటాయి. పరిమిత స్థాయిలో కార్యకలాపాల వల్ల అధిక లీజింగ్ వ్యయాలు, ధరలపరమైన సవాళ్లు ఉంటాయి. వీటిని అధిగమించడంపై దృష్టి పెడుతున్నాం. ప్రాంతీయ ఎయిర్‌లైన్స్, హెలికాప్టర్ల సేవలు మరింత అందుబాటులోకి వచ్చే విధంగా ప్రత్యేక పాలసీపై కసరత్తు చేస్తున్నాం‘ అని మంత్రి చెప్పారు. ఒడిషాలోని ఝర్సుగూడ, అసోంలోని రూప్సీ వంటి చిన్న నగరాల్లో కూడా ఇలాంటి సర్వీసులు వృద్ధి చెందే అవకాశాలు గణనీయంగా ఉన్నాయని వివరించారు. ప్రస్తుతం భారత్‌లో హెలికాప్టర్ల వినియోగం నామమాత్రంగానే ఉందన్నారు. సంపన్న దేశాల్లో సివిల్ హెలికాప్టర్లు వేల సంఖ్యలో ఉంటుండగా.. భారత్‌లో 130-140 మాత్రమే ఉన్నాయని సింధియా చెప్పారు. విమాన ఇంధనం (ఏటీఎఫ్)పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను తగ్గించేందుకు రాష్ట్రాలతో చర్చలు జరుపుతున్నామని సింధియా తెలిపారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు గణనీయంగా తగ్గించాయని వివరించారు. (చదవండి: టాటా గ్రూప్‌కి షాక్ ! ఊహించని మలుపు తీసుకున్న సీఈవో నియామకం) -
ఇదో చెత్త ప్రశ్న.. ఇంటర్వ్యూలో యువతి షాకింగ్ రిప్లై.. వీడియో వైరల్
Woman's Disastrous Job Interview Experience: కోవిడ్ కారణంగా ప్రజల జీవనశైలిలో సరికొత్త మార్పులు చోటుచేసుకున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పలు కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ఇచ్చి ఇంటివద్ద నుంచి విధులు నిర్వర్తించే వెసులబాలు కల్పించిన సంగతి తెలిసిందే. పైగా ఇంటర్వ్యూలు సైతం ఆన్ లైన్లోనే జరుగుతున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సమయంలో పలు ఫన్నీ ఘటనలు జరిగిన వీడియోలు చాలానే చూశాం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అలాంటి మరో ఆసక్తికరమైన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఏం జరిగిదంటే.. స్కైవెస్ట్ ఎయిర్‌లైన్స్‌లో ఫ్లైట్ అటెండెంట్ జాబ్ కోసం ఆన్లైన్లో చైలీన్ మార్టినెజ్ అనే యువతి ఇంటర్వ్యూ కోసం సిద్ధమైంది. ఈ సందర్భంగా.. ‘స్కైవెస్ట్ కంపెనీ కల్చర్ పై మీ అభిప్రాయం ఏంటి’ అని మార్టినెజ్‌ను సంస్థ అధికారి ప్రశ్నించారు. దీనికి మార్జినెజ్ ఫన్నీగా తన పక్కనే ఉన్న వేరొకరితో ‘నా జీవితంలో నేను విన్న అతి తెలివితక్కువ, చీజీ ప్రశ్న’ అని సమాధానం ఇవ్వడంతో సదరు అధికారి ఒక్కసారిగా షాక్‌కి గురైంది. అంతేకాకుండా ఆ సమయంలో వీడియోని కాస్త పాజ్‌లో ఉంచి మరీ మార్టినెజ్ లిప్ గ్లాస్ వేసుకుంటూ కనిపించడం అధికారిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే, మార్టినెజ్ ఇంటర్వ్యూ కోసం వీడియో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో పొరపాటున ఆమె ఇంటర్వ్యూ వీడియో రికార్డు ఆన్ చేయడంతో ఇదంతా జరిగింది. ఇక తన తప్పును తెలుసుకున్న యువతి వెంటనే తేరుకుని తన సమాధానంపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ, అప్పటికే నష్టం జరిగిపోయింది. స్కైవెస్ట్ కంపెనీ ఆమె ప్రవర్తన సరిగా లేదంటూ జాబ్ రిజెక్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు చాలామంది పాపం ఆమెకు మరే కంపెనీలో జాబ్ రాదని, మరి కొందరేమో అలాంటిది ఏమీ లేదు ఆమెకు మరో కంపెనీలో ఉద్యోగం వస్తుందని ట్వీట్ చేశారు. (చదవండి: అతని శరీరంలో కరోనా శాశ్వతంగా ఉండిపోతుందట.. ఇదే తొలికేసు!) View this post on Instagram A post shared by NDTV (@ndtv) -
గుడ్ న్యూస్: విదేశాల నుంచి వచ్చిన వారు క్యారంటైన్లో ఉండక్కర్లేదు!
ఒమిక్రాన్ వేరియంట్‌తో ప్రమాదం అంచున ఉన్న దేశాలను తప్పించి మిగతా దేశాల నుంచి రాకపోకలు సాగించే వారికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఇక నుంచి విదేశాల నుంచి వచ్చేవాళ్లు క్యారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని, కేవలం 14 రోజుల స్వీయ పర్యవేక్షణ సరిపోతుందని పేర్కొంది. అయితే ఈ మార్గదర్శకాలు ఫిబ్రవరి 14 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. అంతేకాదు నిరంతరం మార్పు చెందుతున్న ఈ కోవిడ్ -19 వైరస్‌ని పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పింది. కానీ ఆర్థిక కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరింది. కొత్త మార్గదర్శకాలు... విదేశీయులందరూ తప్పనిసరిగా గత 14 రోజుల ప్రయాణ చరిత్రతో సహా ఆన్లైన్లో స్వీయ-డిక్లరేషన్ ఫారమ్‌ను సమర్పించాలి తప్పనిసరిగా ప్రయాణ తేదీ నుండి 72 గంటలలోపు నిర్వహించబడిన ప్రతికూల ఆర్టీ-పీసీఆర్ పరీక్షను కూడా అప్లోడ్ చేయాలి. రెండు డోసుల వ్యాక్సిన్లు వేయించుకున్నట్లు ధృవీకరించే ధృవీకరణ పత్రాన్ని కూడా అప్లోడ్ చేయాలి. వ్యాక్సిన్ ప్రోగ్రాంలో భాగంగా భారత్ నిర్దేశించిన 72 దేశాల వారికి మందికి మాత్రమే ఈ మార్గనిర్దేశకాలు అందుబాటులోకి ఉంటాయి. ఆయా దేశాల్లో కెనడా, హాంకాంగ్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్డమ్, బహ్రెయిన్, ఖతార్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో సహా కొన్ని యూరోపియన్ దేశాలు కూడా ఉన్నాయి. "ఈ మేరకు సెల్ఫ్ డిక్లరేషన్ ఫారమ్‌లో మొత్తం సమాచారాన్ని నింపి... ప్రతికూల ఆర్టీ-పీసీఆర్ పరీక్ష నివేదిక లేదా కోవిడ్-19 వ్యాక్సిన్ సర్టిఫికేట్‌ను అప్లోడ్ చేసిన ప్రయాణికులను మాత్రమే ఎయిర్‌లైన్స్ (విమానయాన సంస్థలు) బోర్డింగ్‌కి అనుమతిస్తాయి. ఫ్లైట్ సమయంలో తప్పనిసరిగా కోవిడ్ ప్రోటోకాల్‌ని పాటించాలి " అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. (చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. డ్రోన్ల దిగుమతిపై నిషేధం.. కారణం ఇదే) -
అమెరికాలో 5జీ సేవలు ప్రారంభం.. భయాలతో విమానాల రీషెడ్యూల్!
న్యూయార్క్: అమెరికాలో బుధవారం నుంచి ప్రారంభమైన 5జీ సేవలతో విమానాలకు పెనుముప్పు ఏర్పడుతుందన్న భయాలు యూఎస్ వైమానిక రంగంపై పెనుప్రభావం చూపుతున్నాయి. దేశమంతటా పలుచోట్ల విమానాలను రద్దు చేయడం లేదా దారి మరలించడం జరుగుతోంది. దీంతో ప్రవాస భారతీయులు సహా వేలాదిమంది ప్రయాణాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. పలు ఇతర దేశాలు అమెరికాకు నడిపే విమానాలను రద్దు చేసుకున్నాయి. విమానాల నావిగేషన్ వ్యవస్థను కొత్తగా ఆరంభించే 5జీ వ్యవస్థ దెబ్బతీయవచ్చన్న అనుమానాలున్నాయి. సీ బ్యాండ్ తరంగాల వల్లే 5జీ తరంగాలు(సీ బ్యాండ్ తరంగాలు) విమానాల రేడియో ఆల్టిమీటర్ (భూమి మీద నుంచి విమానం ఎంత ఎత్తులో ఉందో కొలిచేందుకు ఉపయోగపడే సాధనం)పై ప్రభావం చూపుతాయని, దీనివల్ల ఇంజిన్, బ్రేకింగ్ సిస్టమ్ ల్యాండింగ్ మోడ్‌లోకి వెళ్లకుండా నిరోధం ఎదురయ్యే ప్రమాదం ఉందని, దీంతో విమానం రన్‌వేపై ఆగకపోవచ్చని ఈనెల 14న అమెరికా వైమానిక నియంత్రణా సంస్థ(యూఎస్ఎఫ్ఏఏ) హెచ్చరించింది. ఆల్టిమీటర్ వంటి సున్నిత పరికరాలకు వినియోగించే స్పెక్ట్రమ్ ఫ్రీక్సెన్సీకి సమీపంలోనే, 5జీ సేవల స్పెక్ట్రమ్ ఫ్రీక్వెన్సీ(3.7-3.98 గిగాహెర్ట్జ్ ఫ్రీకెన్సీ) ఉంది. అందువల్ల విమానాలకు ప్రమాదం తప్పదని ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో పలు ఎయిర్ఇండియా, ఎమిరేట్స్ తదితర అంతర్జాతీయ విమానయాన సంస్థలు యూఎస్‌కు విమానాలను రీషెడ్యూల్ చేశాయి. మరోవైపు బుధవారం ప్రారంభించిన 5జీ సేవల పరిధిని నియంత్రిస్తామని, యూఎస్‌లో విమానాశ్రయాల వద్ద 5జీ సేవలను జాప్యం చేస్తామని టెలికం కంపెనీలు హామీ ఇచ్చినట్లు డెల్టా ఎయిర్‌లైన్స్ తెలిపింది. మరిన్ని రక్షణాత్మక చర్యలు చేపట్టేవరకు 5జీ సేవల ఆరంభాన్ని నిలిపివేయాలని ఇతర ఎయిర్‌లైన్స్ సంస్థలతో కలిసి ప్రభుత్వాన్ని కోరతామని తెలిపింది. విమానాల రక్షణకు అల్టిమేటర్ల సేవలు చాలా కీలకమని వివరించింది. విమానాల నిలిపివేత ప్రభావం ప్రయాణికులతో పాటు సరుకు రవాణాపై కూడా పడుతోందని తెలిపింది. కొన్ని విమానాశ్రయాల వద్ద 5జీ సేవలను మరికొన్నాళ్లు నిలిపివేస్తామని ఏటీ అండ్ టీ, వెరిజాన్ (టెలికం కంపెనీలు) మంగళవారం ప్రకటించాయి. ఇదంతా ఎఫ్ఏఏ వైఫల్యమని, 40 దేశాల్లో 5జీ సేవలు సురక్షితంగా ఆరంభమయ్యాయని, కానీ అమెరికాలో మాత్రం కుదరడం లేదని కంపెనీలు విమర్శించాయి. 8 విమానాలు రద్దుచేసిన ఎయిర్ఇండియా బుధవారం అమెరికాకు వెళ్లే 8 విమానాలను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. అమెరికా, భారత్ మధ్య ఎయిర్ఇండియా, డెల్టా ఎయిర్‌లైన్స్, అమెరికన్ ఎయిర్‌లైన్స్ సంస్థలు మాత్రమే నేరుగా విమానాలు నడుపుతున్నాయి. ఎయిర్ ఇండియా విమానాలు నిలిపివేయగా, మిగిలిన రెండు కంపెనీలు తమ నిర్ణయాన్ని ఇంకా ప్రకటించలేదు. ఎయిర్ ఇండియా రద్దు చేసిన విమానాల్లో ఢిల్లీ-న్యూయార్క్, ఢిల్లీ-చికాగో, ఢిల్లీ-శాన్ఫ్రాన్సిస్కో, ఢిల్లీ-నెవార్క్ తదితర రూట్ల విమానాలున్నాయి. యూఎస్‌లో పరిస్థితిపై సమీక్షిస్తున్నామని, విమాన ప్రయాణాలు పునఃప్రారంభంపై ఆయా కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నామని డీజీసీఏ చీఫ్ అరుణ్‌కుమార్ చెప్పారు. వైమానిక సంస్థల హఠాత్నిర్ణయంపై ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు. విమాన తయారీ సంస్థలు, విమానయాన సంస్థల ఆందోళనతో 5జీ సేవల ప్రారంభాన్ని అమెరికాలో ఇప్పటికే రెండుసార్లు టెలికం సంస్థలు వాయిదా వేశాయి. ఇప్పటికే 5జీ సేవలు ఆరం భించిన ఇతర దేశాల్లో ఈ సమస్య తలెత్తలేదు. అమెరికాలో 5జీ సేవలు ప్రారంభం అమెరికాలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. విమానాలకు అంతరాయం లేకుండా ఏటీ అండ్ టీ, వెరైజన్ టెలికాం సంస్థలు 5జీ సేవలను ప్రారంభించాయి. ఈ క్రమంలో కొన్ని అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ విమానాలను రద్దు చేసుకున్నాయి. అమెరినా నుంచి వెళ్లే లేదా అమెరినా రావాల్సిన మొత్తం 538 విమానాలు 5జీ సేవలు ప్రారంభమవడం కారణంగా రద్దు కానున్నాయని నివేదికలు వచ్చాయి. అయితే బుధవారం నాడు కేవలం 215 విమానాల మాత్రమే రద్దయ్యాయి. వీటిలో ఎమిరేట్స్, ఎయిర్ ఇండియా, ఏఎన్ఏ, జపాన్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన విమానాలున్నాయి. -
అన్నా ఏందిది..! అదేమన్నా ట్రక్కనుకున్నావా..? తోసుకెళ్తున్నారు..
ఎక్కడాగిపోతాయో తెలియని ఎర్ర బస్సులను ఎక్కాలంటే గుండెలు దడదడలాడాల్సిందే! చెప్పాపెట్టకుండా ఏ రోడ్డుమధ్యలోనే టైర్ పంక్చరయ్యో లేక ఇంజన్ ఫెయిలయ్యో ఆగిపోతే ఈసురోమంటూ.. ఎక్కిన ప్రయాణికులందరూ కిందికి దిగి బస్సును తొయ్యడం.. దాదాపు అందరి జీవితాల్లో ఈ సీన్ ఎదురయ్యే ఉంటుంది. ఐతే ఇక్కడ టైర్ పంక్చర్ అయ్యింది బస్సుకు కాదు, కారుకు అంతకన్నాకాదు. విమానానికి... ఆ..! అవును అక్షరాలా విమానానికే.. పాపం అందరూ తలోచెయ్యివేసి తోసుకుంటూ తీసుకెళ్లారు. నెపాల్‌కు చెందిన తారా ఎయిర్‌లైన్స్ చోటుచేసుకున్న ఈ సంఘటన ఇది. రన్‌వేపై ఆగివున్న విమానాన్ని ప్యాసెంజర్లు, సెక్యురిటీ సిబ్బంది నెట్టుకుంటూ తీసుకెళ్లడం ఈ వీడియోలో కనిపిస్తుంది. నేపాల్ జర్నలిస్ట్ సుషీల్ భట్టారాయ్ కథనం ప్రకారం.. టైర్ పేలడంతో రన్‌వేపై ఈ విమానం ఆగింది. ఇతర విమానాల రాకపోకలకు అంతరాయం కలగడంతో ప్యాసెంజర్లు, సెక్యురిటీ సిబ్బంది సహాయంతో దానిని పక్కకు నెట్టవలసి వచ్చిందని పేర్కొన్నారు. కాగా దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ‘అన్నా ఇది ట్రక్కు అనుకుంటున్నావా? 10 మందితో తోసుకుంటూ వెళ్లడానికి' అని నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు పేల్చుతున్నారు. నిజానికి ఇది నేపాల్ వైమానిక అధికారుల తప్పిదం. ఎయిర్‌పోర్టులో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటే సరిచేసే పరికరాలు వారి వద్ద ఉండాలి. లేకపోవడంతో ఈ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. చదవండి: Lucknow: ఫేస్బుక్లో పరిచయం.. మత్తిచ్చి అత్యాచారం.. ఫోర్న్‌వీడియో తీసి 10 లక్షలు డిమాండ్! सायद हाम्राे नेपालमा मात्र होला ! pic.twitter.com/fu5AXTCSsw — Samrat (@PLA_samrat) December 1, 2021 -
ఎయిర్ హోస్టెస్‌ల అర్థనగ్న నిరసనలు.. కారణం అదేనట..!
కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు తమకు ఏదైనా అన్యాయం జరిగితే ఆయా కార్యాలయాల్లో పని పూర్తిగా ఆగిపోయేలా చేసి తమ డిమాండ్లు నెరవేర్చుకుంటారు. అలాగే ఈ ఎయిర్‌లైన్స్ ఎయిర్ హోస్టెస్‌లకు కూడా తమ ఉద్యోగాల్లో సమస్యలు ఎదురయ్యాయట. దీంతో వినూత్నంగా నిరసనలు చేపట్టారు. ఆ వివరాలు.. ఇటలీలోని కాంపిడోగ్లియోలో సుమారు 50 మంది ఎయిర్ హోస్టెస్‌లు రోడ్డు మీదకు వచ్చి బట్టలు విప్పి నిరసన చేపట్టారు. జీతంలో కోతలు, ఉద్యోగాల నష్టంపై మనస్తాపం చెందారని, అందుకే తాము నిరసన చేపట్టామని మీడియాకు వెల్లడించారు. ఇంత హఠాత్తుగా వారి ఉద్యోగాల్లో మార్పులు ఎందుకువచ్చాయంటే.. చదవండి: ఉన్నట్టుండి వేప చెట్లు ఎండిపోతున్నాయి.. కారణం తెలియట్లేదు!! అలిటాలియా ఎయిర్‌లైన్స్ తాజాగా ఐటీఏ ఎయిర్వేస్ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఐతే ఈ పరిణామం అలిటాలియా ఎయిర్‌లైన్స్‌లో పని చేస్తున్న ఉద్యోగులపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. అలిటాలియా ఎయిర్‌లైన్స్ దాదాపు 10,500 మంది ఉద్యోగులను నియమించుకుంది. కానీ అయితే ఐటీఏ ఎయిర్వేస్లో మాత్రం కేవలం 2,600 మంది ఉద్యోగులు మాత్రమే ఉద్యోగాలు పొందగలిగారట. మరోవైపు ఐటీఏ ఎయిర్వేస్కు చెందిన ఓ ఉద్యోగి.. సీనియారిటీ ప్రకారం రావల్సిన ఉద్యోగాలు కూడా మాకు దక్కలేదు, శాలరీలు కూడా బాగా తగ్గించారు, ఉద్యోగం ఎంతకాలం ఉంటుందో కూడా తెలియని సందిగ్థంలో ఉన్నామని’ విచారం వ్యక్తం చేశారు. దీని గురించి ఐటిఎ ఎయిర్వేస్ ప్రెసిడెంట్ ఆల్ఫ్రెడో అల్టావిల్లాను అడిగితే.. ‘అందరు ఉద్యోగులందరూ కంపెనీ నిబంధనలను అనుసరించి ఒప్పందంపై సంతకం చేసారు. ఉద్యోగులు సమ్మె చేస్తారని నేను భావింలేదు. అలా చేస్తే, వారిపై తీవ్ర ప్రభావం ఉంటుందని మీడియాకు తెలిపారు. చదవండి: Suspense Thriller Crime Story: 37 కోట్ల బీమా కోసం పాముకాటుతో చంపించి.. -
విమాన ప్రయాణికులకు శుభవార్త! ఇకపై ఆంక్షల్లేవ్
విమాన ప్రయాణికులకు కేంద్రం శుభవార్త చెప్పింది. విమాన ప్రయాణాలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు సర్క్యూలర్‌ని జారీ చేసింది. దీని ప్రకారం అక్టోబరు 18 నుంచి దేశీయంగా విమాణ ప్రయాణాలపై ఉన్న ఆంక్షలు తొలగిపోనున్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభనతో దేశంలో విమాన సర్వీసులపై ఆంక్షలు విధించారు. ప్లైట్‌లో ప్రయాణించాలంటే కోవిడ్ నెగటీవ్ సర్టిఫికేట్, మాస్క్ తదితర రక్షణ చర్యలను కట్టుదిట్టం చేశారు. ఫిజికల్ డిస్టెన్స్ పాటించే లక్ష్యంతో విమానంలో ప్రయాణికుల పరిమితిపరై ఆంక్షలు విధించారు. మే 21వ తేది నుంచి ఆంక్షలు అమలులో ఉన్నాయి. అయితే కోవిడ్ తగ్గుముఖం పడుతుంటంతో క్రమంగా ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తి వేస్తూ వస్తున్నారు. చివరి సారిగా విమాన ప్రయాణాలపై సెప్టెంబరు 18 మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది. వాటి ప్రకారం 85 సామర్థ్యంతో మాత్రమే ప్రయాణికులకు అనుమతించారు. తాజాగా ఇచ్చిన గైడ్‌లైన్స్ ప్రకారం ఇకపై విమానాలు వంద శాతం సీటింగ్ కెపాసిటీతో నడిపించుకునేందుకు అనుమతి ఇచ్చింది. అక్టోబరు 18 నుంచి విమానయాన సంస్థలు వంద శాతం టిక్కెట్లను విక్రయించనున్నాయి. విమాన ప్రయాణాలపై ఆంక్షలు ఉండటంతో ఫ్టైట్ ఆపరేటర్లు పూర్తి స్థాయిలో టిక్కెట్లు విక్రయించడం లేదు. దీంతో సమయానికి టిక్కెట్లు దొరక్క ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో ఈ సమస్య తీరనుంది. చదవండి:ఎయిర్‌లైన్స్ మహిళా సిబ్బంది..... ఇక హైహిల్స్, స్కర్ట్స్‌కి స్వస్తీ -
ఎయిర్‌లైన్స్ మహిళా సిబ్బంది..... ఇక హైహిల్స్, స్కర్ట్స్‌కి స్వస్తీ
విమానంలో పని చేసే మహిళా సిబ్బంది అంటే స్కర్ట్లు, హైహిల్స్ వేసుకుని దర్శనమిస్తుంటారు. ఇక నుంచి వాటికి స్వస్తి పలికి మహిళా సిబ్బంది ఆరోగ్య సంరక్షణార్థం సౌకర్యవంతమైన యూనిఫాంని తీసుకోస్తున్నామని చెబుతోంది ఒక ఎయిర్ లైన్ సంస్ధ. ఆ వివరాలు.. ఉక్రెయిన్: మహిళా ఉద్యోగుల సౌకర్యార్థం ఇక నుంచి సరొకత్త యూనిఫాంని తీసుకొస్తున్నట్లు ఉక్రెయిన్ ప్రముఖ విమానాయాన సంస్థ స్కైఅప్ ప్రకటించింది. ఈ సంస్థ అత్యంత తక్కువ ధర కలిగిన అతిపెద్ధ విమానయాన సంస్థ. ఇంతవరకు తమ మహిళా సిబ్బందికి పాత యూనిఫాం (హైహిల్స్, స్కర్ట్స్) వంటివి ధరించేవారని, వాటితో తమ సిబ్బంది చాలా రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొటున్నట్లు వివరించింది. అంతేకాదు అత్యవసర సమయాల్లో ఎగ్జిట్ డోర్ ఓపెన్ చేయాలంటే హైహిల్స్ వేసుకుని పరిగెడితే అత్యంత కష్టమవుతోందని.. పైగా ఈ పాత యూనిఫాంతో వాళ్లు చాలా విసిగిపోయారని తెలిపింది. (చదండి: ఒకప్పుడు నేరస్తుడు.. ఇప్పుడు అనాథలకు మార్గదర్శకుడు!) ఈ మేరకు మహిళా సిబ్బంది, ట్రౌజర్లు (ఫ్యాంట్లు), స్నీకర్లు (తేలికపాటి ష్యూ) ధరించవచ్చని స్కైఅప్ ఎయిర్‌లైన్స్ మార్కెటింగ్ హెడ్ మరియన్న గ్రిగోరాష్ వెల్లడించారు. అంతేకాదు 1930ల నాటి యూనిఫాంలన్నింటిని అధ్యయనం చేసి మరీ అత్యంత సౌకర్యవంతమైన నారింజ రంగు యూనిఫాంని డిజైన్ చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు స్కై అప్ సంస్థ త్వరలో తమ మహిళా సిబ్బంది ప్రయాణికులకు సరికొత్త యూనిఫాంలో స్వాగతం పలుకుతారని చెప్పింది. (చదండి: నేను గిటారు వాయిస్తాను... మీరు పాట పాడండి ప్లీజ్!) -
విమానంలో సిగరెట్ తాగిన యువతి.. ప్రయాణికులు షాక్
సాక్షి, తల్లహస్సీ: బహిరంగ ప్రదేశాలలో ధూమపానం చేయడాన్ని నిషేధిస్తూ ఇప్పటికే అనేక దేశాలు కఠిన చట్టాలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. దీన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకొవడంతో పాటు జరిమానా కూడా విధిస్తారు. అయితే, కొంత మంది వ్యక్తులు అప్పుడప్పుడు బస్సుల్లో లేదా రైళ్లల్లో సిగరెట్ తాగిన సంఘటనలు తరచుగా వార్తలలో వస్తుంటాయి. సిగరెట్ తాగటం వలన.. వారికే కాకుండా తోటి ప్రయాణికుల ప్రాణాలకు కూడా పెద్ద ముప్పు సంభవించే అవకాశం ఉంటుంది. కాగా, ఒక యువతి ఏకంగా విమానంలోనే సిగరెట్ తాగి తోటి ప్రయాణికులను షాకింగ్‌కు గురిచేసింది. ఈ సంఘటన ఫ్లోరిడాలోని స్పిరిట్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో గత మంగళవారం చోటుచేసుకుంది. ఒక తోటి ప్రయాణికుడు దీన్ని వీడియో తీసి టిక్‌టాక్‌లో పోస్ట్ చేయగా ఇది వైరల్‌గా మారింది. ఫోర్ట్లాడర్డేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్పిరిట్ ఎయిర్‌లైన్స్ కు చెందిన విమానం టేక్ఆఫ్ అయ్యింది. రన్‌వే మీద వెళ్లడానికి మరికొంత సమయం ఉంది. ఈ క్రమంలో ఒక యువతి సిగరెట్‌ను తీసి తాగడం ప్రారంభించింది. దీంతో తోటి ప్రయాణికులు తీవ్రమైన అసౌకర్యానికి గురయ్యారు. అయితే, ఆమెతో పాటు ప్రయాణిస్తున్న.. మజ్దలావి అనే వ్యక్తి దీన్ని రికార్డు చేశాడు. అంతటితో ఆగకుండా విమాన సెక్యురిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. వారు వెంటనే యువతి దగ్గరకు చేరుకుని ఆమెను కిందికి దిగిపోవాల్సిందిగా సూచించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. కాగా, యూఎస్‌లో 1988లోనే బహిరంగ ప్రదేశాలలో సిగరెట్ తాగడాన్ని నిషేదించారు. చదవండి: Anaconda: రోడ్డు దాటుతున్న భారీ అనకొండ.. షాకింగ్ వీడియో.. -
స్పైస్‌జెట్‌కు పెరిగిన నష్టాలు
న్యూఢిల్లీ: బడ్జెట్ ధరల విమానయాన కంపెనీ స్పైస్‌జెట్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర నష్టం పెరిగి రూ. 729 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 593 కోట్ల నికర నష్టం నమోదైంది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 705 కోట్ల నుంచి రూ. 1,266 కోట్లకు జంప్‌చేసింది. అయితే నిర్వహణ వ్యయాలు సైతం రూ. 1,298 కోట్ల నుంచి రూ. 1,995 కోట్లకు ఎగశాయి. కోవిడ్–19 ప్రభావం నేపథ్యంలో గత ఐదు క్వార్టర్లుగా పలు సవాళ్లమధ్య కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు స్పైస్‌జెట్ చైర్మన్ అజయ్ సింగ్ పేర్కొన్నారు. -
అత్యంత చౌక ధరలకే విమాన ప్రయాణాలు..! త్వరలోనే..!
ముంబై: ది ఇండియన్ వారెన్ బఫెట్‌గా ప్రసిద్ధి చెందిన దిగ్గజ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా పలు రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. తాజాగా విమానయాన రంగంలో పెట్టుబడులను పెట్టనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నాలుగు సంవత్సరాల్లో సుమారు 70 ఎయిర్‌క్రాఫ్ట్‌లతో కొత్త ఎయిర్‌లైన్‌ను మొదలుపెట్టాడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు రాకేష్ జున్‌జున్‌వాలా ప్రకటించారు. భారత్‌లో తీవ్ర నష్టాలను ఎదుర్కోంటున్న విమానయాన రంగంలో సుమారు 35 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనున్నారు. ఎయిర్‌లైన్ కంపెనీలో సుమారు 40 శాతం మేర వాటాను రాకేష్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వచ్చే పదిహేను రోజుల్లో భారత విమానయాన శాఖ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్ ఓ సీ ) రానుందని బ్లూమ్‌బర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాకేష్ జున్‌జున్‌వాలా పేర్కొన్నారు. కాగా రాకేష్ మొదలుపెడుతున్న సొంత ఎయిర్‌లైన్ ‘ఆకాశ ఎయిర్’ అని తెలుస్తోంది. గతంలో డెల్టా ఎయిర్ లైన్స్‌లో పనిచేసిన మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్, పలు సభ్యులు కూడా కంపెనీలో పాలుపంచుకుంటున్నట్లు తెలుస్తోంది. కొత్తగా కొనబోయే ఎయిర్‌క్రాఫ్ట్స్ సామర్ధ్యం 180 ప్యాసింజర్ల వరకూ ఉండబోతోంది. అత్యంత చౌక ధరలకే విమాన సర్వీసులను అందించే లక్ష్యంతో మార్కెట్లోకి రానుంది. కోవిడ్ మహమ్మారి రాకతో విమానయాన రంగం పూర్తిగా కుదేలయ్యింది. అయితే రాబోయే రోజుల్లో భారత్‌లో విమానయాన రంగం గణనీయంగా అభివృద్ధి చెందుతుందని రాకేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారికి ముందే, భారతదేశంలోని విమానయాన సంస్థలు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ఒకప్పుడు దేశంలో రెండవ అతిపెద్ద దేశీయ విమానయాన సంస్థ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ 2012 లోనే తన కార్యకలాపాలను ముగించింది. దాంతో పాటుగా ఇటీవల జెట్ ఎయిర్వేస్ ఇండియా లిమిటెడ్ విమాన ప్రయాణాలను ఆమోదం వచ్చిన కొన్ని రోజులకే 2019లో తన ఆపరేషన్లను నిలిపివేసింది. -
విమాన ప్రయాణికులకు ఇండిగో గుడ్ న్యూస్
భారతదేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో వ్యాక్సిన్ తీసుకున్న వినియోగదారులకు భారీ ఆఫర్ ప్రకటించింది. నేటి నుంచి ఫస్ట్, సెకండ్ డోస్ కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న ప్రయాణీకులకు టికెట్ బుక్ చేసేటప్పుడు బేస్ ఛార్జీలపై 10 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు పేర్కొంది. భారతదేశంలో ఈ ఆఫర్ ప్రకటించిన మొదటి విమానయాన సంస్థ ఇండిగో. బుకింగ్ సమయంలో భారతదేశంలో కోవిడ్-19 వ్యాక్సిన్ అందుకున్న 18 సంవత్సరాలు కంటే ఎక్కువ వయస్సు గల వ్యాక్సిన్ తీసుకున్న ప్రయాణీకులకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉందని సంస్థ తెలిపింది. "బుకింగ్ సమయంలో ఈ ఆఫర్ పొందాలంటే ప్రయాణీకులు ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అందించాల్సి ఉంటుంది. అలాగే, వారు విమానాశ్రయ చెక్-ఇన్ కౌంటర్/బోర్డింగ్ గేట్ వద్ద ఆరోగ్య సేతు మొబైల్ అప్లికేషన్ లో వ్యాక్సినేషన్ స్టేటస్ చూపించాలి" అని ఇండిగో ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ సందర్భంగా ఇండిగో చీఫ్ స్ట్రాటజీ, రెవెన్యూ ఆఫీసర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. "దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ కావడంతో, జాతీయ వ్యాక్సినేషన్ డ్రైవ్ కు మా వంతు సహకారం అందించడం మా బాధ్యతగా భావిస్తున్నాం. అలాగే, ప్రతి ప్రయాణికుడు తక్కువ ధరలకే సురక్షితంగా ప్రయాణించేలా ఈ ఆఫర్ తీసుకొచ్చినట్లు" తెలిపారు. ఈ ఆఫర్ ప్రస్తుతం ఇండిగో వెబ్ సైట్ లో మాత్రమే అందుబాటులో ఉంది. చదవండి: బంపర్ ఆఫర్.. రూ.1 కే టీడబ్ల్యుఎస్ ఇయర్‌బడ్స్ -
పుంజుకుంటున్న విమానయానం
సాక్షి, అమరావతి బ్యూరో: కోవిడ్ సెకండ్ వేవ్ కల్లోలం నుంచి కోలుకుని విమానయానం క్రమేపీ వేగం పుంజుకుంటోంది. సెకండ్ వేవ్ ఉధృతిలో కాస్త తగ్గుదల కనిపిస్తుండటంతో క్రమంగా విమాన ప్రయాణాలు చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. విజయవాడ విమానాశ్రయం కూడా సెకండ్ వేవ్ ప్రభావం నుంచి క్రమంగా కోలుకుంటోంది. ఈ నెల ఆరంభం నుంచి విజయవాడ విమానాశ్రయానికి ప్రయాణికుల తాకిడి పెరిగింది. కోవిడ్‌కు ముందు ఈ ఎయిర్‌పోర్టు నుంచి నెలలో 75 వేల నుంచి 90 వేల మంది వరకు ప్రయాణికులు రాకపోకలు సాగించేవారు. కోవిడ్ రెండో దశ తీవ్ర రూపం దాల్చిన ఏప్రిల్ నెలలో 44,214 మంది ప్రయాణాలు చేయగా, మే నెలలో ఆ సంఖ్య 16,381కి తగ్గింది. అయితే జూన్ ఆరంభం నుంచి పరిస్థితి మారింది. రోజు రోజుకూ ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం సగటున రోజుకు 600 మంది విజయవాడ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ప్రధానంగా ఇక్కడి నుంచి ఢిల్లీకి వెళ్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఆ తర్వాత బెంగళూరు, హైదరాబాద్‌లకు ఎక్కువగా వెళ్తున్నారు. ఈ విమానాశ్రయం నుంచి ప్రస్తుతం 10 విమాన సర్వీసులు నడుస్తున్నాయి. వీటితో పాటు వందే భారత్ మిషన్ కింద మస్కట్, దుబాయ్, సింగపూర్, కువైట్ల నుంచి అంతర్జాతీయ విమానాలు వస్తున్నాయి. ఢిల్లీ సర్వీసు రద్దుతో ఇక్కట్లు.. ఎయిరిండియా సంస్థ ఢిల్లీ – విజయవాడ ఎయిర్‌పోర్టుల మధ్య రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు విమాన సర్వీసులను నడిపేది. వీటిలో ఉదయం సర్వీసును జూలై 31 వరకు రద్దు చేశారు. ప్రధానంగా ఈ సర్వీసు అమెరికా నుంచి వచ్చి, వెళ్లే వారికి ఎంతో అనుకూలంగా ఉండేది. అమెరికా నుంచి అర్థరాత్రి దాటాక ఢిల్లీ చేరుకునే వారు ఈ సర్వీసు ద్వారా ఉదయానికల్లా విజయవాడకు వచ్చేవారు. ఇప్పుడు సాయంత్రం సర్వీసు ఒక్కటే ఉండడం వల్ల వీరంతా 20 గంటలకు పైగా ఢిల్లీలో వేచి ఉండాల్సి వస్తోంది. ఇక్కడ నుంచి అమెరికా వెళ్లేవారూ దాదాపు ఓ రోజు అదనంగా ఢిల్లీలో గడపాల్సి వస్తోందంటున్నారు. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రద్దు చేసిన ఢిల్లీ విమాన సర్వీసును పునరుద్ధరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రయాణికుల సంఖ్య పెరిగింది పక్షం రోజుల్లో ప్రయాణికుల సంఖ్య రోజుకు వెయ్యికి చేరుకుంటుంది. ఈ నెలాఖరుకి ప్రయాణికుల సంఖ్య మునుపటి సగటు ప్రయాణికుల్లో 50 శాతానికి పెరిగే అవకాశం ఉంది. – జి.మధుసూదనరావు, విజయవాడ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ -
కస్టమర్ కోరిన చోటుకే లగేజీ డెలివరీ...!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన సంస్థ ఇండిగో.. డోర్ టు డోర్ బ్యాగేజ్ డెలివరీ సేవలను ప్రారంభించింది. ప్రయాణికుల లగేజీని ఇంటి నుంచి విమానాశ్రయానికి, అలాగే విమానాశ్రయం నుంచి కస్టమర్ కోరిన చోటకు చేరుస్తారు. 6ఈబ్యాగ్పోర్ట్ పేరుతో ఈ సేవలను కార్టర్‌పోర్టర్ అనే కంపెనీ సహాయంతో ఢిల్లీ, హైదరాబాద్‌లో ఇండిగో అందుబాటులోకి తెచ్చింది. ముంబై, బెంగళూరుకూ ఈ సేవలను విస్తరించనున్నారు. ఒకవైపుకు చార్జీ రూ.630తో మొదలు. కస్టమర్‌కు చెందిన లగేజీని పూర్తిగా ట్రాక్ చేస్తారు. విమానం బయల్దేరడానికి 24 గంటల ముందు బుక్ చేయాల్సి ఉంటుంది. విమానం దిగిన ప్రయాణికులకు వెంటనే ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. బెంగళూరుకు చెందిన కార్టర్‌పోర్టర్ ఆన్ డిమాండ్ బ్యాగేజ్ డెలివరీ సేవలను విస్తారా, ఎయిర్ ఏషియాకు సైతం అందిస్తోంది. చదవండి: కర్నూలు ‘ఉయ్యాలవాడ’ ఎయిర్‌పోర్టులో ప్రారంభమైన విమానాల రాకపోకలు -
ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో ప్రారంభమైన విమాన సర్వీసులు
సాక్షి, కర్నూలు: ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో విమానాల సర్వీసులు ఆదివారం ప్రారంభమయ్యాయి. బెంగళూరు నుంచి తొలి ఇండిగో విమానం 52 మంది ప్రయాణికులతో కర్నూలు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంది. ఈ విమానానికి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి గుమ్మనూరు జయరాం, నంద్యాల ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే కాటసాని ఘన స్వాగతం పలికారు. అదే విమానం 72మంది ప్రయాణికులతో బెంగళూరుకు తిరుగు ప్రయాణమైంది. దీంతో పాటు ఉదయం 10:30కి ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ నుంచి విశాఖ వెళ్లే మొదటి విమానాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. ఇక మూడు నగరాలకు ఇండిగో సంస్థ విమానాలు నడపనుంది. రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిర్మించిన కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును గురువారం సీఎం జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును సీఎం జగన్ ప్రకటించారు. చదవండి: గిరిజనుల అభ్యున్నతికి ఎన్నో చర్యలు -
మోడల్ పొట్టి డ్రెస్.. ఫ్లైట్‌లోకి నో ఎంట్రీ
మెల్బోర్న్ : పొట్టి దుస్తులు ధరించిన కారణంగా ఓ మోడల్‌కు చేదు అనుభవం ఎదురైంది. డ్రెస్ కారణంగా సిబ్బంది ఆమెను విమానంలోకి అనుమతించలేదు. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..ఇసాబెల్లే ఎలెనార్ అనే ఇన్స్టాగ్రామ్ మోడల్ జెట్‌స్టార్ అనే ఎయిర్‌లైన్స్‌లో గోల్డ్ కోస్ట్ నుంచి మెల్బోర్న్కు బయలుదేరింది. అయితే ఆమె వేసుకున్న టాప్ మరీ చిన్నదిగా ఉండటంతో సిబ్బంది ఆమెను విమానం ఎక్కనివ్వలేదు. ఆ సమయంలో మోడల్ బ్లూ జీన్స్, బ్లాక్ క్రాప్ టాప్ ధరించి ఉంది. అయితే టాప్ మరీ చిన్నదిగా ఉందని, ఓవర్ కోట్ ధరించాలని సూచించారు. లేదంటే విమానంలోకి అనుమతించమని సిబ్బంది తెగేసి చెప్పడంతో ఇక చేసేదేమీ లేక జాకెట్‌ను ధరించింది. ఈ విషయంపై తన ఫేస్బుక్ పేజీలో ఆవేదనను వ్యక్తం చేసింది. (రైతులకు మద్దతు.. నటికి అత్యాచార బెదిరింపులు) 'నేను విమానంలోకి అడుగుపెట్టగానే, అక్కడి సిబ్బంది ఏదో వెతకడం ప్రారంభించాడు. నా డ్రెస్ చూసి నన్ను జాకెట్ వేసుకోమని చెప్పినప్పుడు చలిగా ఉంటుందని అలా అన్నారేమో అనుకున్నా. కానీ నా టాప్ చిన్నగా ఉండటం వల్ల నన్ను విమానంలోకి ఎక్కించలేదమని చెప్పిన్పపుడు చాలా బాధేసింది. జాకెట్ వేసుకునేంత వరకు సీట్లోకి కూర్చోనివ్వలేదు. నేను ఒక మోడల్ని. అంత మంది ప్రయాణికుల ముందు నన్ను అవమానించారు. నాపై వివక్ష చూపించారు. జెట్ స్టార్ ఆస్ట్రేలియా..ఇది 1921 ఆ లేక 2021' ?అని తన ఆక్రోశాన్ని వెళ్లగక్కింది. (ఫోటో గ్రాఫర్ ఓవరాక్షన్.. వరుడి రియాక్షన్: వైరల్) View this post on Instagram A post shared by ISABELLE (@isabelle.eleanore) I almost got kicked off the plane for what I was wearing!! 🤬 This is ridiculous.. I was humiliated, degraded and discriminated against. @JetstarAirways you have some answering to do!! pic.twitter.com/66jk5P6J3E — Isabelle Eleanore (@IsabelleEleano) February 2, 2021 -
ఆమె పేరుతో ‘ఎయిర్ ఇండియా’లో రికార్డు
న్యూఢిల్లీలోని ‘అలయెన్స్ ఎయిర్’ సంస్థకు ఈరోజు కొత్త సీఈవో వస్తున్నారు. అత్యున్నతమైన ఆ స్థానంలో హర్‌ప్రీత్ సింగ్‌ను నియమిస్తూ శుక్రవారం నాడే ఎయిర్ ఇండియా ఎం.డి., చైర్మన్ రాజీవ్ బన్సాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ‘ఎయిర్ ఇండియా’ సహాయక సంస్థ అయిన ‘అలయెన్స్ ఎయిర్’.. దేశీయ పౌర విమానయాన సంస్థ. దేశం లోపల విమానాలు నడుపుతుంటుంది. చెన్నై, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌ల నుంచి రోజూ దేశంలోని 55 గమ్యస్థానాలకు అలయెన్స్ ఎయిర్ విమానాలు చేరుతుంటాయి. విమాన భద్రత అంతా ఇప్పటి వరకు హర్‌ప్రీత్ చేతుల్లో ఉండేది. ఫ్లయిట్ సేఫ్టీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆమె. ఇప్పుడిక అలయెన్స్ ఎయిర్‌కు తొలి మహిళా సీఈవోగా అంతే కీలకమైన పై పోస్టులోకి వెళ్లారు. ఆమె పేరుతోనే ‘ఎయిర్ ఇండియా’లో మరొక రికార్డు కూడా ఉంది. ఎయిర్ ఇండియా తొలి మహిళా పైలట్ హర్‌ప్రీత్. 1988లో చేరారు. అయితే కొన్నాళ్లకు ఆరోగ్య కారణాల వల్ల విరామం తీసుకుని, ఆ తర్వాత వేరే విభాగానికి మారవలసి వచ్చింది. హర్‌ప్రీత్ జన్మస్థలం ఢిల్లీ. అక్కడే చదువుకున్నారు. ‘ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉరాన్ అకాడమీ’ నుంచి వాణిజ్య విమానాల పైలట్‌గా శిక్షణ పొందారు. ఎయిర్ ఇండియా పైలట్ ఎంపిక పరీక్షల్లో విజయం సాధించారు. హర్‌ప్రీత్‌తో పాటు ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ నివేదిత భాసిన్, కెప్టెన్ క్షమత బాజ్‌పాయ్ వంటి వారు పైలట్ అవాలనుకునే అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచారు. హర్‌ప్రీత్ ఈ ఏడాది జనవరిలో ‘అబ్దుల్ కలామ్’ అవార్డు పొందారు. విశిష్టమైన వ్యక్తిగత విజయ సాధనలకు, దేశానికి అందించిన విలక్షణమైన సేవలకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఎయిర్ ఇండియాలో అత్యంత ప్రాముఖ్యం కలిగిన ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌ను కూడా ఆమె నడిపించారు. ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా (ఎఇ.ఎస్.ఐ.) ముంబై శాఖ ఛైర్మన్‌గా, ఎఇ.ఎస్.ఐ. ఢిల్లీ కౌన్సిల్ సభ్యురాలిగా ఉన్నారు. ఎయిర్ ఇండియా ‘ఫ్లయింట్ సేఫ్టీ’ డైరెక్టర్‌గా కూడా హర్‌ప్రీత్ తొలి మహిళే. పైలట్‌గా చేరిన తొలిరోజుల్లో కొన్నాళ్లు విరామం తీసుకుని యు.ఎస్. వెళ్లి ఫ్లయిట్ ఇన్‌స్ట్రక్టర్‌గా కూడా శిక్షణ పొందారు. తర్వాత ఇండియా వచ్చి, ఎయిర్ ఇండియాలోనే వేరే విభాగంలో చేరారు. ఇండియన్ ఉమెన్ పైలట్స్ అసోసియేషన్ (ఐ.డబ్లు్య.పి.ఎ.) అధ్యక్షురాలిగా కూడా ఉన్న హర్‌ప్రీత్ పౌర విమానయానంలో కెరీర్‌ను ఎంచుకున్న మహిళలకు మార్గదర్శకంగా ఉంటున్నారు. పైలట్‌గా శిక్షణ పొందడానికి ప్రధాన అవరోధం ఫీజులకు అయ్యే ఖర్చు. అది లక్షల్లో ఉంటుంది. ప్రతిభావంతులై ఉండి ఆర్థిక కారణాల వల్ల శిక్షణను కొనసాగించలేని పరిస్థితి ఎదురైన యువతులకు ఐ.డబ్లు్య.పి.ఎ. ఛారిటీ ద్వారా ఆమె రుణాలు అందే ఏర్పాటు చేస్తున్నారు. (చదవండి: కొన్ని లైకులు... కాస్త వెలుతురు) -
విమానంలో కరోనాతో మరణించిన మహిళ
వాషింగ్టన్: ఈ ఏడాది జూలై చివరలో లాస్ వెగాస్ నుంచి డల్లాస్ వెళ్లే స్పిరిట్ ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు టెక్సాస్‌కు చెందిన మహిళ మరణించిన సంగతి తెలిసిందే.అయితే ఆమె కోవిడ్ -19 తో మరణించినట్లు అధికారులు తాజాగా వెల్లడించారు. స్పిరిట్ ఫ్లైట్ జూలై 24 సాయంత్రం లాస్ వెగాస్ నుంచి డల్లాస్-ఫోర్ట్ వర్త్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరింది. ఆ విమానంలో ప్రయాణిస్తున్న మహిళ అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమె ఎంత సేపటికి స్పందించకపోవడంతో ఆ విమానాన్ని అల్బుకెర్కీ వద్ద ఆపేశారు. అయితే ఫ్లైట్ అక్కడికి వచ్చే సరికే సదరు మహిళ చనిపోయిందని ఆల్బుకెర్కీ ఇంటర్నేషనల్ సన్‌పోర్ట్ ప్రతినిధి స్టెఫానీ కిట్స్ చెప్పారు. అయితే ఆ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు టెక్సాస్‌కు చెందిన 38 ఏళ్ల మహిళ విమానంలో అపస్మారక స్థితిలోకి వెళ్లి శ్వాస ఆగిపోయిందని తెలిపారు. విమానంలో ఒక సభ్యుడు ఆమెకు సీపీఆర్ చేయడానికి ప్రయత్నించడని కానీ ఫలితం లేకపోయింది అని తెలిపారు. అయితే ఇక్కడ ఆశ్చర్యపడాల్సిన విషయం ఏమిటంటే తాజాగా ఆమె రిపోర్ట్లు వచ్చే వరకు సదరు మహిళ కరోనాతో మరణించినట్లు విమాన సిబ్బందికి తెలియదు. ఈ ఘటన విమానాల్లో ప్రయాణించే వారి భద్రతపై పలు అనుమానాలు రేకెత్తిస్తుంది. ఈ విషయం గురించి స్పిరిట్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి ఎరిక్ హాఫ్మేయర్ మాట్లాడుతూ మహిళ కుటుంబానికి, స్నేహితులకు ఎయిర్‌లైన్స్ తరుపున సంతాపం తెలిపారు. కరోనావైరస్కు సంబంధించి ఎయిర్‌లైన్స్ తన ప్రోటోకాల్స్ ఫాలో అవుతుదని, తప్పకుండా ఏ తప్పు జరగదనే నమ్మకం తమకు ఉందని పేర్కొన్నారు. అయితే ఆ మహిళతో కాంటాక్ట్ అయిన అభ్యర్థులను ట్రేస్ చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: ‘అతను చనిపోయింది మా వ్యాక్సిన్ వల్ల కాదు’ -
మాస్క్ పెట్టుకోలేదని చితకబాదారు
-
మాస్క్ పెట్టుకోలేదని చితకబాదారు
అమ్‌స్టర్‌డామ్ : మాస్కులు పెట్టుకోలేదంటూ భౌతిక దాడులు జరిగిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇలాంటి దాడుల్లో కొందరు తీవ్రంగా గాయపడగా.. కొందరు ఏకంగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా అమ్‌స్టర్‌డామ్ నుంచి ఐబిజా వెళ్తున్న డచ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన కెఎల్ఎం విమానంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇద్దరు ప్రయాణికులు మాస్కులు ఇచ్చినా పెట్టుకోకపోవడంతో విమానంలోని తోటి ప్రయాణికులు వారిపై భౌతిక దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన ఆగస్టు 4న చోటుచేసుకున్న దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కరోనా వైరస్ నేపథ్యంలో విమానంలో ఇలాంటి దాడి జరగడం ఇదే మొదటిసారి.(బీరూట్ పేలుళ్ల ఘటనపై ట్రంప్ స్పందన) ఇక వీడియో విషయానికి వస్తే.. బ్రిటన్‌కు చెందిన ఇద్దరు స్నేహితులు ఐబిజా వెళ్తున్న కెఎల్ఎం విమానం ఎక్కారు. అయితే వారిద్దరికి మాస్కులు లేకపోడంతో తోటి ప్రయాణికులు మాస్కులు ధరించాలని కోరారు. వారి వద్ద మాస్కులు లేకపోవడంతో విమానంలో ఏర్పాటు చేసిన మాస్కులను వారికి అందించారు. మాస్కు పెట్టుకోవడానికి వారిద్దరు నిరాకరించడంతో ఆగ్రహం చెందిన ఒక వ్యక్తి.. మాస్కు ఇస్తున్నా ధరించరా అంటూ బౌతిక దాడికి పాల్పడ్డాడు. ఈ దశలో ఇద్దరు ఒకరి మీద ఒకరు పంచ్‌లు విసురుకుంటూ తీవ్రంగా కొట్టుకున్నారు. అయితే ఇది చూసిన ఇతర ప్రయాణికులు మాస్క్ ధరించని వ్యక్తిని కిందపడేసి కాళ్లతో గట్టిగా అణగదొక్కి పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పోలీసులు వచ్చి వారిద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇదంతా ఒక వ్యక్తి వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. అయితే వారిద్దరు మద్యం తాగి విమానమెక్కారని.. మాస్కులు ధరించాలని కోరినా వినకపోవడంతోనే దాడికి పాల్పడాల్సివచ్చిందని ప్రయాణికులు పేర్కొన్నారు. కాగా ఈ ఘటనతో కెఎల్ఎం ఎయిర్‌లైన్స్ విమానం ఎక్కేవారు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణికులు బోర్డింగ్ సమయంలోనే మాస్కులు ధరించాలని.. అలా చేయనివారిని బయటికి పంపించాలని నిర్ణయించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. -
అమెరికా: నో మాస్క్.. నో ఎంట్రీ
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ఒకే రోజు 50వేలకు పైగా కరోనా కేసులు కూడా నమోదయ్యాయి. ప్రపంచంలోనే కరోనా కేసుల్లో, మరణాల్లో అగ్రరాజ్యం మొదటిస్థానంలో ఉంది. అయినప్పటికీ మే, జూన్ నెలలో దేశంలో విమానాల ద్వారా ప్రయాణలు చేసిన వారి సంఖ్య పెరింగింది అని ది ట్రాన్స్‌పోర్షన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ నివేదిక ప్రకారం తెలుస్తోంది. అయితే ఆరోగ్యానికే అధిక ప్రాధాన్యత అంటున్న ఎయిర్‌లైన్స్ మాస్క్‌లు ధరించే విషయంలో కఠిన నిబంధనలు అమలుచేస్తున్నాయి. వీటిని పాటించని ప్రయాణీకుల మీద కొంత కాలం పాటు నిషేధం కూడా విధించనున్నాయి. (అమెరికా: ఒక్కరోజే 54 వేల కరోనా కేసులు) అమెరికాలో ప్రముఖ అంతర్జాతీయ విమాన సంస్థలైన అమెరికన్ ఎయిర్ లైన్స్, డెల్టా ఎయిర్‌లైన్స్, ఫ్రంటియర్ ఎయిర్‌లైన్స్, జెట్ బ్ల్యూ ఎయిర్‌లైన్స్, సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్, స్పిరిట్ ఎయిర్‌లైన్స్, యూనిటెడ్ ఎయిర్‌లైన్స్ అన్ని కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న క్రమంలో కొన్ని నిబంధనలు విధిస్తున్నాయి. ప్రయాణీకులందరూ వారి కచ్చితంగా ముక్కు, నోరు కవర్ అయ్యేలా మాస్క్ ధరించాలని సూచిస్తున్నాయి. బోర్డింగ్ దగ్గర, లాంజ్ దగ్గర, విమానం ఎక్కేటప్పుడు, ప్రయాణించేటప్పుడు కచ్చితంగా మాస్క్ ధరించే ఉండాలని నిబంధనలలో పేర్కొన్నాయి. మాస్క్‌లేని వారికి ఎయిర్ లైన్స్‌లోనే ఇచ్చే వెసులుబాటును కల్పిస్తున్నాయి. వారికి తినేటప్పుడు, తాగేటప్పుడు మాత్రం మాస్క్ ధరించడం నుంచి వెసులుబాటు కల్పించాయి. రెండు సంవత్సరాల లోపు పిల్లలు, ఆరోగ్యంగా సరిగా లేనివారికి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉన్నవారికి దీని నుంచి మినహాయింపులు ఇచ్చారు. ఒక వేళ ఈ నిబంధనలు ఉల్లంఘించే ప్రయాణీకుల మీద ఈ ఎయిర్‌లైన్స్ తాత్కలికంగా నిషేధం విధించనున్నాయి. మాస్క్ ధరించేందుకు నిరాకరించిన కన్సర్వేటివ్ పార్టీ నేతను న్యూయార్క్‌లో విమానం ఎక్కకుండా అడ్డుకున్నసంగతి తెలిసిందే. (‘బ్యాన్ టిక్‌టాక్’ అమెరికాలోనూ..!) -
విమానయాన సంస్థలకు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ , లాక్డౌన్ కాలంలో సంక్షోభంలో పడిన దేశీయ విమానయాన సంస్థలకు ఉపశమనం కలిగించేలా సుప్రీంకోర్టు తాజా తీర్పునిచ్చింది. కరోనా కట్టడి, సోషల్ డిస్టెన్సింగ్ కోసం విమాన ప్రయాణాల్లో విధించిన మధ్యసీటు ఖాళీ నిబంధనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించిన సుప్రీం మధ్య సీటు ఖాళీగా ఉంచాల్సిన అవసరం లేదని శుక్రవారం స్పష్టం చేసింది. బాంబే హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేసిన ఎయిరిండియా పైలట్ దేవెన్ కానన్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ భూషణ్ గవైలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ అభ్యర్ధనను తిరస్కరించింది. తద్వారా ఎయిరిండియాతో పాటు ఇతర దేశీయ విమానయాన సంస్థలకు మధ్య సీటును భర్తి చేసుకునేందుకు అనుమతించింది. (అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం పొడిగింపు) దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన విమాన ప్రయాణాలు రెండు నెలల తర్వాత మే 25న సేవలను తిరిగి ప్రారంభించాయి. అయితే ఈ సందర్భంగా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు పౌర విమానయాన శాఖ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ముఖ్యంగా విమాన ప్రయాణంలో ఒకరి నుంచి మరొకరికి కరోనా వైరస్ సోకే ప్రమాదం లేకుండా మిడిల్ సీటును ఖాళీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని డీజీసీఏ విమానయాన సంస్థలను ఆదేశించిన సంగతి తెలిసిందే. -
‘మా రాష్ట్రంలో వద్దు.. మరోసారి ఆలోచించండి’
చెన్నై : దేశీయ విమానయాన సర్వీసులు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో మే 31 వరకు రాష్ట్రంలో విమానయాన సర్వీసులకు అనుమతించరాదంటూ తమిళనాడు ప్రభుత్వం శుక్రవారం కేంద్రాన్ని కోరింది. భారత్‌లో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఒకటి. పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా విమానయానానికి అనుమతించరాదంటూ కోరింది. అయితే సోమవారం నుంచి అన్ని దేశీయ విమానయాన సర్వీసులకు అనుమతిచ్చిన నేపథ్యంలో తమిళ సర్కార్ చేసిన విఙ్ఞప్తిపై కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. (విమానయానం.. కొత్త కొత్తగా...) ఈ నెల ప్రారంభంలో విదేశాల్లో చిక్కుకున్న356 మంది భారతీయులను ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాల్లో చైన్నై విమానాశ్రయానికి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే వారిలో కొంతమంది ప్రయాణికులకు కరోనా నిర్థారణ అయ్యింది. గత కొన్ని రోజులుగా కోయంబేదుకు హోల్‌సేల్ మార్కెట్ నుంచి అనూహ్యంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అంతేకాకుండా దేశ వ్యాప్తంగా రెండవ అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ర్టంగా తమిళనాడు ఉంది. ఈ నేపథ్యంలో విమానాయానానికి అనుమతిస్తే రాష్ర్టంలో మరిన్ని కరోనా కేసులు పెరగడానికి ఆస్కారం ఉందని కేంద్రానికి విన్నవించుకుంది. ఇప్పటివరకు తమిళనాడులో 13,000 కరోనా కేసులు నమోదుకాగా, 95 మంది ప్రాణాలు కోల్పోయారు. (దేశంలో ఒక్కరోజే 6088 కరోనా కేసులు ) -
పక్కపక్కనే ప్రత్యేక కిట్లతో!
సాక్షి, హైదరాబాద్: భౌతిక దూరం.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్న మాట. దాన్ని పాటించకుంటే కరోనా కాటేసే ముప్పు.. అనుసరిస్తే వాణిజ్య పరంగా నష్టాల దెబ్బ. ఇప్పుడు విమానయాన రంగంలో ఇది పెద్ద సమస్యగా మారింది. దీనికి విమానయాన సంస్థలు పరిష్కారంగా ఓ ప్రతిపాదనను తెరపైకి తెచ్చాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రయాణికులు పూర్తి రక్షణ కిట్లు ధరిస్తే కరోనా వ్యాపించే అవకాశం ఉండదని, అప్పుడు భౌతిక దూరం కూడా అవసరం లేదన్నది దాని సారాంశం. కరోనా బాధితులకు చికిత్స చేసే సమయంలో వైద్యులు, సిబ్బంది ప్రత్యేక పీపీఈ కిట్లు ధరిస్తారు. అలాంటి నమూనాలో ఉండే సాధారణ రక్షణ తొడుగులు ధరించటం ద్వారా ప్రయాణికులు పక్కపక్కనే కూర్చున్నా ఇబ్బంది లేదన్నది ఆ సంస్థల యోచన. ఇందుకు ఖరీదైన పీపీఈ కిట్లు కాకుండా, తక్కువ ఖర్చుతో రూపొందే సాధారణ ఏర్పాట్లు కూడా సరిపోతాయని పేర్కొంటున్నాయి.ప్రయాణికులకు వాటిని అందుబాటులో ఉంచుతామని, వాటిని ధరించి ప్రయాణిస్తే వైరస్ సోకిన వారు న్నా, ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకే అవకాశం లేదని పేర్కొం టున్నాయి. ఈ మేరకు అనుమతి ఇవ్వాల్సిందిగా కేంద్రానికి విమానయాన సంస్థలు ప్రతిపాదించాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఆయా సంస్థలు అధికారికంగా వెల్లడించలేదు. తీవ్ర నష్టాల భయంతో.. కరోనా దెబ్బకు విమానయానరంగం కోలుకోలేనంతగా దెబ్బ తిన్నది. లాక్డౌన్ నేపథ్యంలో మనదేశంలోని ఎయిర్‌లైన్స్ సం స్థలు దాదాపు రూ.25 వేల కోట్ల వరకు నష్టపోయాయని అం చనా. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ సడలిం పులతో క్రమంగా విమానాలు గాల్లోకి ఎగిరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. కొన్ని దేశాల్లో డొమెస్టిక్ విమానాలు ఇప్పటికే ఎగురుతుండగా, తాజాగా మనదేశంలో కూడా సిద్ధమయ్యాయి. ఇంతవరకు బాగానే ఉంది, కానీ, వాటికి అనుమతించినా, అది లాక్డౌన్ సడలిం పుల్లో భాగంగానే తప్ప లాక్డౌన్ పూర్తిగా ఎత్తేయలేదు. దీంతో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి నిబంధనలకు లోబడే అవి ఎగరాల్సి ఉంది. అంటే, కచ్చి తంగా ప్రయాణికులు భౌతిక దూరం పాటించాల్సిందే. మూడు సీట్ల వరుసలో మధ్య సీటు వది లేసి ఇద్దరు ప్రయాణికులు అటూ ఇటూ కూర్చోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తారట.. ప్రయాణికులు విమానం ఎక్కేముందే వారికి ప్రత్యేక కిట్ ఇస్తారు. అందులో తల నుంచి కాలివరకు తేలికపాటి ప్రత్యే క తొడుగు ఉంటుంది. గ్లౌజ్‌లు, ముఖం వద్ద ప్రత్యేక ట్రాన్స్పరెంట్ కవచం ఉంటుంది. శానిటైజ్ చేసుకున్నాక వీటిని ధరిం చాల్సి ఉంటుంది. దేశీయంగా విమానాల గరిష్ట ప్రయాణ సమ యం దాదాపు రెండున్నర గంటలు. ఈ సమయం లో ప్రయాణికులు పక్కపక్కనే ఉన్నా, తుమ్మినా, దగ్గినా తుంపరలు పక్కవారిపై పడకుండా ఆ తొడుగులు అడ్డుకుంటాయని విమానయాన సంస్థలు పేర్కొంటున్నాయి. సాధారణంగా చిన్న విమానాల్లో సీట్ల మధ్య దూరం అంతగా ఉం డదు. మధ్యలో ఒక సీటు వదిలేసినా, భౌతిక దూరం నిబంధనల ప్రకారం అది 2 మీటర్ల ఎడం రాదు. వెరసి అది ఆ నిబంధనను పూర్తిగా సంతృప్తి పరచదు. దాని కంటే ఈ ప్రత్యేక తొడుగు ధరించి పక్కపక్కనే కూర్చోవటం ఎక్కువ సురక్షితమని పేర్కొన్నట్లు సమాచారం. విమానం దిగిన తర్వాత ఎగ్జిట్ అయ్యే చోట ఏర్పాటు చేసే ప్రత్యేక డస్ట్‌బిన్‌లో ప్రయాణికులు ఆ తొడుగును వదిలేయాల్సి ఉంటుంది. వాటిని ప్రత్యేక పద్ధతిలో సిబ్బంది ధ్వంసం చేస్తారు. అసలే నష్టాలు.. ఆపై లాక్డౌన్ కష్టాలు.. దేశంలోని చాలా విమానయాన సంస్థలు నష్టాల్లో ఉన్నట్లు వెల్లడిస్తున్నాయి. ఎయిరిండియా సహా చాలా ప్రైవేటు సంస్థలు ఏటా నష్టాల లెక్కలు అప్పచెబుతున్నాయి. ఇదే సమయంలో కరోనా దెబ్బ కోలుకోలేనంతగా కుంగదీసింది. గత 55 రోజులుగా విమానాశ్రయాలు మూతపడే ఉండటంతో భారీ నష్టాలు వచ్చిపడ్డాయి. ఇప్పుడు భౌతిక దూరం పేరుతో మధ్యలో ఒక సీటు వది లేస్తే ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గి నష్టాలు మరింత పెరుగుతాయని పేర్కొంటున్నాయి. 180 సీట్లు ఉండే విమానాల్లో భౌతిక దూరం వల్ల 120 మందే ప్రయాణించాల్సి ఉంటుంది. 120 సీట్లుండే చోట 80 మందికే అనుమతిస్తారు. వెరసి 33.3% టికెట్ రెవెన్యూను వదులుకోవాల్సి ఉంటుంది. కొన్ని విదేశీ విమానయాన సంస్థలు కూడా మధ్యలో ఓ సీటు వదిలేసేందుకు ఇష్టపడట్లేదు. వదిలేసే బదులు ఆ సీటును వెనక్కి తిప్పటం వల్ల సమస్య ఉండదన్న ఆలోచన చేస్తున్నాయి. అంటే ఇద్దరు ప్రయాణికులు కాక్‌పిట్ వైపు చూస్తూ కూర్చుంటే, మధ్య ప్రయాణికుడు వెనుకవైపు చూస్తూ కూర్చుంటాడన్న మాట. ఈ ఆలోచనకు కూడా ఇంకా ఆమోదం రాలేదు. టికెట్‌పై అదనంగా చార్జి వీటి కొనుగోలుకు అయ్యే వ్యయంతో కొంతమొత్తం విమానయాన సంస్థలు భరించనుండగా, మరికొంత మొత్తం టికెట్‌పై అదనంగా చార్జి చేయనున్నట్లు ఆ ప్రతిపాదనలో పేర్కొన్నట్లు సమాచారం. ప్రతి టికెట్‌పై రూ.300 అదనంగా చార్జి చేయనున్నట్లు తెలిసింది. దీనిపై ఇటు విమానయాన సంస్థలు ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుత పరిస్థితిలో భౌతికదూరం నిబంధనకు కేంద్రం ప్రాధాన్యమిస్తోంది. ఈ ప్రతిపాదన నిజమే అయితే, దాని విషయంలో సానుకూలత ఉండే అవకాశం తక్కువే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
బంగారు కానుక
భార్య, భర్త బెంగుళూరులో ఉంటారు. పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా భార్యాభర్తలుగానే ఉండిపోయారు. చివరికి పిల్లల కోసం సూరత్ వెళ్లారు. ఐవీఎఫ్ టెక్నిక్‌తో అద్దెగర్భాన్ని ఆశ్రయించారు. తిరిగి బెంగళూరు వచ్చేశారు. తొమ్మిది నెలలు అయ్యాక మార్చి 29న శుభవార్త అందింది. ‘మీకు పాప పుట్టింది’ అని. ఎగిరి గంతేశారు. ఎగిరిపోతే ఎంత బాగుండు అనుకున్నారు. లాక్డౌన్! కొన్నాళ్లు వీడియో కాల్స్‌తో తృప్తిపడ్డారు. పాప బంగారు బొమ్మలా ఉంది. అప్పటికే సూరత్‌లోని ఐవీఎఫ్ హాస్పిటల్ వాళ్లు ఆ పాపను ‘సన్పరి’ (బంగారు కానుక) అని పిలుచుకుంటున్నారు. ఇక్కడ బెంగళూరులో పేరెంట్స్ నిలవలేకపోతున్నారు. పాపను రెండు చేతుల్లోకి తీసుకోవాలని ఆశపడుతున్నారు. వాళ్ల తపన చూసి ఆసుపత్రివాళ్లు ఆ పర్మిషన్, ఈ పర్మిషన్ సంపాదించి, ఢిల్లీ నుంచి ఎయిర్ అబులెన్స్ను తెప్పించి, పాపను మొన్న మంగళవారం బెంగళూరు పంపారు. సూర™Œ ఎయిర్‌పోర్ట్‌లో మధ్యాహ్నం 2 గంటలకు ఎక్కిస్తే.. బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి పాప.. పేరెంట్స్ చేతుల్లోకి వెళ్లేసరికి సాయంత్రం 5 అయింది. మొదట.. తండ్రే పాపను చేతుల్లోకి తీసుకున్నాడు. -
లాక్డౌన్ దశలవారీగా సడలింపు!
ముంబై/న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 21 రోజుల దేశవ్యాప్త లాక్డౌన్లో శనివారంతో సగం రోజులు పూర్తయ్యాయి. 21 రోజులు పూర్తయ్యాక లాక్డౌన్ ఉంటుందా లేదా అనే దానిపై ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఏప్రిల్ 15వ తేదీ తర్వాత లాక్‌డౌన్‌ను దశల వారీగా సడలిస్తామని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రైలు, విమానయాన సంస్థలు సంకేతాలిస్తున్నాయి. దేశంలో రైల్వే సర్వీసుల పునరుద్ధరణపై ఇప్పటికైతే తుది నిర్ణయం తీసుకోలేదని, కొన్ని రోజుల తర్వాత తీసుకునే అవకాశముందని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ఏప్రిల్ 14న లాక్డౌన్ ఎత్తివేస్తే రైళ్లను నడిపేందుకు రైల్వే జోనల్ ఆఫీస్‌లు సిద్ధమవుతున్న వేళ ఈ ప్రకటన వచ్చింది. ‘రైల్వే బోర్డు ఒక్కో రైలుకు నిర్దిష్టంగా అనుమతి ఇచ్చాకే సర్వీసుల్ని నడుపుతాం. దశలవారీగా రైల్వే సర్వీసులను ఎలా పునరుద్ధరించాలన్న అంశంపై రైల్వే బోర్డుకు సూచనలిచ్చాం’ అని అధికారులు తెలిపారు. లాక్డౌన్ పర్యవేక్షణకు ఏర్పాటైన మంత్రుల బృందం ఓకే చెప్పాకే రైల్వే సర్వీసుల పునరుద్ధరణ ఉంటుందన్నారు. దేశంలోని 17 రైల్వేజోన్లలో అందుబాటులో ఉన్న బోగీల ఆధారంగా ఎలాంటి సర్వీసుల్ని ముందుగా పునరుద్ధరించాలన్న అంశంపై సమాలోచనలు జరుగుతున్నాయి. ఒకవేళ సర్వీసులను పునరుద్ధరించినా ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. తమ విమానాల బుకింగ్‌లు ఏప్రిల్ 15వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ఎయిర్ ఆసియా ఇండియా సంస్థ ప్రకటించింది. అయితే, డీజీసీఏ మార్గదర్శకాలను బట్టి ఇందులో మార్పులు ఉండవచ్చని పేర్కొంది. ఏప్రిల్ 15 నుంచి తమ కార్యకలాపాలను పున:ప్రారంభిస్తామని పలు విమానయాన సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. దేశీయ విమాన సర్వీసులకు గాను ఏప్రిల్ 15 నుంచి బుకింగ్‌లకు శ్రీకారం చుట్టనున్నట్లు ఇండిగో, స్పైస్‌జెట్, గోఎయిర్ సంస్థలు వెల్లడించాయి. అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణానికి మే 1 నుంచి టిక్కెట్లు విక్రయిస్తామని స్పైస్‌జెట్, గోఎయిర్ స్పష్టం చేశాయి. ప్రజలు సహకరించే విధానాన్ని బట్టి లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు. లాక్డౌన్ ముగిశాక ఎలాంటి కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలన్న దానిపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన అధికారులతో చర్చించారు. -
రైల్వే బుకింగ్‌లు షురూ!
సాక్షి, సిటీబ్యూరో: రైల్వే అడ్వాన్స్ బుకింగ్‌లు తిరిగి మొదలయ్యాయి. లాక్డౌన్ కారణంగా గత 10 రోజులుగా నిలిచిపోయిన రిజర్వేషన్ బుకింగ్‌ల కోసం ప్రయాణికులు క్రమంగా ముందుకొస్తున్నారు. ప్రస్తుతం రిజర్వేషన్ కేంద్రాలు మూసి ఉంచడంతో ఐఆర్సీటీసీ నుంచి ఆన్లైన్ ద్వారా మాత్రమే ప్రయాణికులు తమ రిజర్వేషన్లను బుక్ చేసుకొనే సదుపాయం ఉంది. లాక్డౌన్ పొడిగింపు ప్రతిపాదనలు లేవని కేంద్రం ఇటీవల ప్రకటించడంతో పాటు, లాక్డౌన్ తర్వాత రాకపోకలు సాగించేవారు తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చునని పేర్కొనడంతో గత రెండ్రోజులుగా ప్రయాణికులు రిజర్వేషన్లు బుక్ చేసుకుంటున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తేస్తే ఏప్రిల్ 16 తర్వాత హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రైళ్లు నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు రైల్వే అన్ని రకాల చర్యలు చేపట్టిందని, రైళ్లను కెమికల్ వాష్ చేయడంతో పాటు, ఎప్పటికప్పుడు శానిటేషన్ కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. లాక్డౌన్ అనంతరం కూడా రైళ్ల నిర్వహణలో పూర్తి జాగ్రత్తలు తీసుకోనున్నట్లు తెలిపారు. కరోనాను అడ్డుకునేందుకు ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో గత 10 రోజులుగా ఎక్కడికక్కడ ప్రయాణికుల రాకపోకలు స్తంభించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రయాణికులు అప్పటికప్పుడు తమ ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. అత్యవసర రాకపోకలు సైతం నిలిచిపోయాయి. ఈ నెల 15 నుంచి రైళ్లు పట్టాలెక్కితే ప్రయాణికుల రాకపోకలు తిరిగి మొదలుకావొచ్చు ప్రతిరోజూ 2.5 లక్షల మంది రాకపోకలు సాధారణ రోజుల్లో హైదరాబాద్‌లోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, లింగంపల్లి, తదితర రైల్వేస్టేషన్ల నుంచి ప్రతిరోజూ 2.5 లక్షల మంది వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. ఒక్క సికింద్రాబాద్ నుంచే ప్రతిరోజూ 1.8 లక్షల మంది ప్రయాణిస్తారు. రోజుకు కనీసం 200 రైళ్లు హైదరాబాద్ నుంచి నడుస్తాయి. లాక్‌డౌన్‌తో ఈ రాకపోకలన్నీ నిలిచిపోయాయి. ఈ నెల 15 నుంచి లాక్డౌన్ తొలగించినప్పటికీ రద్దీ అంతగా ఉండకపోవచ్చునని, కరోనా భ యం దృష్ట్యా తప్పనిసరిగా వెళ్లాల్సిన వారు. అత్యవసర ప్రయాణికులు మాత్రమే బయలుదేరొచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. ‘ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం లాక్డౌన్ తొలగించిన వెంటనే రైళ్లు అందుబాటులోకి వస్తాయి. కానీ ఈ లోపు ఏవైనా అనుకోని సంఘటనలు చోటుచేసుకొని లాక్డౌన్ కొనసాగించే పరిస్థితులు తిరిగి ఉత్పన్నమైతే ఇప్పటివరకు రిజర్వేషన్లు బుక్ చేసుకున్న వారు మరోసారి రద్దు చేసుకునేందుకు కూడా సిద్ధంగా ఉండాల్సిరావచ్చు’అని దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. ఎయిర్‌లైన్స్ బుకింగ్‌లు ఓపెన్.. లాక్డౌన్ తొలగించిన అనంతరం దేశీయ విమానాల రాకపోకలు కూడా మొదలుకానున్నాయి. ఈ మేరకు ఇప్పటికే పలు ఎయిర్‌లైన్స్ సంస్థలు బుకింగ్‌లను ఓపెన్ చేశాయి. మరోవైపు దేశీయ విమానాల రాకపోకల కోసం శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా సిద్ధమవుతోంది. ఎయిర్‌పోర్టును పూర్తిగా కెమికల్ వాష్ చేస్తున్నారు. అన్ని విభాగాల్లోనూ శానిటేషన్ ప్రక్రియ చేపట్టారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ప్రతిరోజూ 60 వేల మందికి పైగా రాకపోకలు సాగిస్తుండగా వీరిలో సుమారు 50 వేల మంది దేశీయ ప్రయాణికులే ఉంటాయి. పలు ఎయిర్‌లైన్స్ సంస్థలు బుకింగ్‌లు ప్రారంభించినప్పటికీ ప్రయాణికుల రద్దీ వెంటనే కనిపించకపోవచ్చునని, అందుకు కొంత సమయం పట్టవచ్చునని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. -
'21 రోజుల్లో కరోనాపై విజయం సాధించాలి'
న్యూఢిల్లీ: కరోనాపై పోరాటంలో అగ్రభాగంలో ఉన్న వైద్యులు, ఎయిర్‌లైన్స్ సిబ్బందితో అమర్యాదకరంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తప్పవని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. సంక్షోభ పరిస్థితుల నుంచి గట్టెక్కించేందుకు శ్రమిస్తున్న యంత్రాంగానికి పౌరులంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా సోకుతుందనే భయంతో కొన్నిచోట్ల ఎయిర్‌లైన్స్, వైద్య సిబ్బందిని ప్రజలు వివక్షకు గురి చేయటంపై ఆయన స్పందించారు. భారత యుద్ధం 18 రోజులే సాగిందని, కరోనాపై మన సంగ్రామం మాత్రం 21 రోజులు కొనసాగుతుందని చెప్పారు. పార్లమెంట్‌కు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గ ప్రజలతో ప్రధాని బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలను ప్రస్తావించిన ప్రధాని ఇబ్బందులు ఉండటం నిజమేనని, అంతా బాగుందని చెప్పడమంటే ఆత్మ వంచనే అవుతుందని వ్యాఖ్యానించారు. వైద్యులు, ఎయిర్‌లైన్స్ సిబ్బంది పట్ల కొందరు అమర్యాదగా వ్యవహరిస్తున్నట్లు వచ్చిన వార్తలు తనకు బాధ కలిగించాయన్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని హోంశాఖ, డీజీపీలను ఆదేశించినట్లు చెప్పారు. విపత్కర సమయంలో సేవలందిస్తున్న వైద్యులు, నర్సులను లక్ష్యంగా చేసుకునే వారిని ఉపేక్షించబోమన్నారు. తెల్ల కోటు ధరించే వైద్యులు, నర్సులు దేవతల లాంటి వారని ప్రధాని పేర్కొన్నారు. ఇలాంటి వారిపట్ల అమర్యాదకరంగా ప్రవర్తించేవారిని ప్రజలు కూడా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ యుద్ధంలో ప్రజలే సారథులు.. ‘కొన్ని చోట్ల సరైన సదుపాయాలు లేకపోవడం, నిర్లక్ష్యం వల్ల స్వల్ప సంఘటనలు జరిగి ఉండవచ్చు. కానీ వీటిపైనే దృష్టి పెట్టి ప్రచారం చేయడం, కొన్ని రంగాలను నిరుత్సాహపరచడం ఈ సమయంలో మంచిది కాదు. నిరాశావాదాన్ని వ్యాప్తి చేసేందుకు వెయ్యి కారణాలు ఉండొచ్చు. వారంతా తప్పు చేస్తున్నారని నేను చెప్పట్లేదు. కానీ ఆశావాదం, విశ్వాసంపైనే జీవితం కొనసాగుతుంది’అని ప్రధాని వ్యాఖ్యానించారు. కఠిన పరిస్థితుల్లో సేవలందిస్తున్న వైద్యులు, పోలీస్ సిబ్బంది, ఇతరులకు అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు. మూఢనమ్మకాలు, పుకార్లు, స్వీయ వైద్యాన్ని విడనాడాలని సూచించారు. భయంకరమైన ఈ యుద్ధంలో విజయం సాధించాలంటే సామాజిక దూరాన్ని పాటించడమే మార్గమని ప్రధాని స్పష్టం చేశారు. ‘చారిత్రక మహాభారత యుద్ధాన్ని 18 రోజుల్లో గెలిచారు. కరోనాపై 21 రోజుల్లో విజయం సాధించాలని మనం సంకల్పించాం’అని చెప్పారు. నాడు శ్రీకృష్ణుడు రథ సారథిగా ఉన్నారని, ఇప్పుడు ఈ యుద్ధంలో 130 కోట్ల మంది ప్రజలూ సారథులేనని ప్రధాని పేర్కొన్నారు. నేడు జీ–20 దేశాల సదస్సు వైరస్ కట్టడిపై చర్చించేందుకు గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న జీ–20 దేశాల సదస్సు కోసం ఎదురు చూస్తున్నట్లు మోదీ తెలిపారు. కోవిడ్ అరికట్టడంలో జీ–20 దేశాలు అంతర్జాతీయంగా కీలక పాత్ర పోషించాల్సి ఉందన్నారు. వాట్సాప్‌తో హెల్ప్‌డెస్క్ నవరాత్రుల ప్రారంభానికి గుర్తుగా అందరూ తొమ్మిది పేద కుటుంబాల సంరక్షణ బాధ్యతలు చేపట్టాలని మోదీ కోరారు. వైరస్‌ను ఓడించడంలో కరుణ చూపడం ఓ భాగమేనన్నారు. ‘ఇబ్బందులు 21 రోజులు మాత్రమే ఉంటాయి. కానీ కరోనా సంక్షోభం ముగియలేదు. వైరస్ వ్యాప్తి ఆగలేదు. అది కలగజేసే నష్టాన్ని ఊహించలేం’అని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్ష మందికిపైగా కోవిడ్–19 బాధితులు కోలుకున్నారని తెలిపారు. ‘ఈ మహమ్మారికి పేద, ధనిక, కులమతాలు, ప్రాంతాలనే తేడా లేదు. ఆరోగ్యంపై ఎంతో జాగ్రత్తలు తీసుకునే వారికి సైతం సోకుతోంది. సామాజిక దూరం పాటించడమే దీనికి విరుగుడు. ప్రజలు ఓర్పు వహించి మార్గదర్శకాలను అనుసరించాలి. వాట్సాప్‌తో కలసి సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం. 90131 51515 నంబర్లో సంప్రదించడం ద్వారా మార్గదర్శకాలను తెలుసుకోవచ్చు’అని ప్రధాని పేర్కొన్నారు. కాశీ నగరం ఓర్పు, సమన్వయం, శాంతి, సహనం, సేవాభావంతో దేశానికి దారి చూపుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. -
విమానం దిగింది.. ఎగిరింది..!
సాక్షి కడప : కడప ఎయిర్‌పోర్టు నుంచి విమాన సర్వీసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఆ దివారం కడప ఎయిర్‌పోర్టు మీదుగా మరో సర్వీసు ప్రారంభమైంది. బెల్గాం నుంచి ఉదయం 9.40 కి బయలుదేరిన విమానం సరిగ్గా 11.10 గంటల ప్రాంతంలో కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. మొదటి విడతలో భాగంగా వచ్చిన ప్రయాణికులందరికి ఎయిర్‌పోర్టు అధికారులు సంస్థ ఆధ్వర్యంలో స్వీట్లు, రోజా పూలు అందించి ఘన స్వాగతం పలికారు. తొలుత కడప నుంచి విమానం హైదరాబాదుకు బయలుదేరి వెళ్లింది. ఆ తర్వాత తిరిగి కడపకు వచ్చి బెల్గాం బయలుదేరి వెళ్లింది. బెల్గాం నుంచి çకడపకు వస్తున్న సమయంలో విమానంలో 50 మంది ప్రయాణికులు ఉండగా.. కడప నుంచి బెల్గాంకు వెళుతున్న సమయంలో దాదాపు 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. కడప ఎయిర్‌పోర్టు నుంచి 2017లో విమాన సర్వీసులు ప్రారంభం కాగా.. ఇది నాలుగవ సరీ్వసు. ఉడాన్ స్కీమ్ ద్వారా ప్రసుత్తం ఈ సరీ్వసులు నడుస్తున్నాయి. సరీ్వసు ప్రాం¿ోత్సవం సందర్భంగా ఎయిర్‌పోర్టు డైరెక్టర్ పూసర్ల శివప్రసాద్, ట్రూజెట్ సంస్థ మేనేజర్ భవ్యన్‌కుమార్ ప్రయాణికులకు శుభాకాంక్షలు తెలిపారు. విమానం రాకపోకల వివరాలు ► బెల్గాం నుంచి కడపకు బయలుదేరు సమయం - ఉదయం 09.40 ► కడపకు చేరుకునే సమయం - ఉదయం 11.10 ► కడప నుంచి హైదరాబాదుకు బయలుదేరు సమయం-ఉదయం 11.30 ► హైదరాబాదు చేరుకునే సమయం-మధ్యాహ్నం 12.45 ► హైదరాబాదు నుంచి కడపకు బయలుదేరు సమయం-మధ్యాహ్నం 03.05 ► కడపకు చేరుకునే సమయం-సాయంత్రం 04.10 ► కడప నుంచి బెల్గాంకు బయలుదేరే సమయం-సాయంత్రం 04.30 ► బెల్గాంకు చేరుకునే సమయం-సాయంత్రం 06.00 -
అర్నాబ్‌పై ఆగ్రహం, కునాల్‌కు షాక్
సాక్షి, న్యూఢిల్లీ : ‘ఇండిగో’ ప్రైవేట్ ఎయిర్‌లైన్ విమానంలో వెళుతున్న రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆర్నాబ్ గోస్వామీని అదే విమానంలో వెళుతూ హేళన చేశారన్న ఆరోపణలపై ప్రముఖ కమేడియన్ కునాల్ కామ్రపై ఇండిగో మంగళవారం నిషేధం విధించింది. అంటే ఆ విమాన సర్వీసుల్లో ప్రయాణించేందుకు అనుమతించరు. అదే తరహాలో ‘ఎయిర్ ఇండియా’ విమాన సర్వీసుల్లో ఆయన్ని అనుమతించమని ఆ సంస్థ అధికార ప్రతినిధి ధనంజయ్ కుమార్ మంగళవారం రాత్రి ప్రకటించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ నిషేధం అమలులో ఉంటోందని ఆయన చెప్పారు. ఇదే దారిలో సాగుతూ స్పైస్‌జెట్ విమానయాన సంస్థ అతన్ని బహిష్కరించింది. మిగతా విమాన సర్వీసుల కూడా కునాల్ కామ్రపై నిషేధం విధించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి పిలుపునిచ్చారు. ‘విమాన ప్రయాణంలో ఇతరులను రెచ్చగొట్టడం, ఇబ్బంది పెట్టడం అనుమతించలేం. అది ఇతరుల భద్రతకు ముప్పు కలిగిస్తుంది. తోటి ప్రయాణికుడి పట్ల అనుచితంగా ప్రవర్తించినందుకు కమేడియన్ కునాల్‌పై చర్య తీసుకోవాల్సిందిగా పిలుపునివ్వక తప్పడం లేదు’ అని హర్దీప్ సింగ్ వ్యాఖ్యానించారు. 2016, జనవరి 17వ తేదీన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో కుల వివక్ష వల్ల ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ వేముల తల్లి రాధికా వేములను ఉద్దేశించి ఆర్నాబ్ స్వామి తన షోలో ఆమె కులం ఏమిటంటూ అవమానించారు. ఈ విషయమై విమానంలో కనిపించిన ఆర్నాబ్‌ను కునాల్ నిలదీశారు. దానికి ఆయన స్పందించకుండా చెవుల్లో ఇయర్ ఫోన్లు పెట్టుకొని లాప్టాప్తో బిజీ ఉండేందుకు ప్రయత్నించగా ఆయన జాతీయవాదాన్ని నిలదీశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవడంతో కునాల్‌పై ఈ చర్యలు తీసుకున్నారు. కునాల్ తన కామిడీ షోలలో అధికార పక్షం కుహనా దేశభక్తిపై జోకులు వేస్తున్నందుకే ఆయనపై ఈ అనుచిత చర్య తీసుకున్నారని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. -
కర్బన ఉద్గారాలు! డొక్కు విమానాలు..
సాక్షి, హైదరాబాద్: మహానగరంలో ఎయిర్ ట్రాఫిక్ ఏటేటా పెరుగుతుండటంతో వాటి నుంచి వెలువడే కర్భన ఉద్గారాలు, ఏరోసాల్స్ కాలుష్యం (విమానాల కాలుష్యం) కూడా పెరుగుతూనే ఉంది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే గతేడాది 23% ఎయిర్ ట్రాఫిక్ పెరిగింది. కానీ, గ్రేటర్ నుంచి రాకపోకలు సాగించే పలు దేశీయ, అంతర్జాతీయ విమానాల నిర్వహణ అంతంతమాత్రంగానే ఉండటం, నాణ్యత లేని ఇంధనాల వినియో గం వెరసి కర్బన ఉద్గారాల కాలుష్యం పెరుగుతోంది. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ క్లీన్ ట్రాన్స్‌పోర్టేషన్ విడుదల చేసిన నివేదికలో ఈ విషయం స్పష్టమైంది. దేశంలో ముంబై నుంచి రాకపోకలు సాగిస్తున్న విమానాల నుంచి 24%, హైదరాబాద్ నుంచి బయల్దేరుతున్న విమానాల నుంచి 13%, కోల్‌కతా నుంచి రాకపోకలు సాగిస్తున్న విమానాల నుంచి 6% కర్భన ఉద్గారాలు వెలువడుతున్నట్లు ఈ నివేదిక అంచనా వేసింది. నిబంధనల ప్రకారం ఈ పరిమి తి 5% మించకూడదని స్పష్టం చేసింది. కాలుష్యం వెలువడుతోంది ఇలా... విమానాల్లో ఇంధనంగా వినియోగించే గ్యాసోలిన్ నాణ్యత లేకపోవడం, విమానాల నిర్వహణ అంతంతమాత్రం గానే ఉండటం, పలు రసాయన పరిశ్రమల నుంచి వెలువడే ఉద్గారాలు, సరిగా మండని పెట్రోలు, డీజిల్ వంటి ఇంధనాలు, జీవ ఇంధనాలు, బయోమాస్‌ను తగులబెట్టడం వంటి పరిణామాలతో ఏరోసాల్స్ కాలుష్యం ఉత్పన్నమౌతుంది. ఈ ఏరోసాల్స్లో బ్లాక్ కార్బన్‌తోపాటు ఇతర హానికారక వాయువులు, ఆవిరులు, ధూళికణాలు అధిక మోతాదులో ఉంటాయి. వీటి కారణంగా రుతుపవనాలు గతితప్పడం, అకాల వర్షాలు, అధిక వేడిమి వంటి విపరిణామాలుంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇలా లెక్కించాలి... కర్భన ఉద్గారాలు, ఏరోసాల్స్ కాలుష్యాన్ని లెక్కించేందుకు 16 ఏథలోమీటర్స్, 12 స్కై రేడియోమీటర్స్, 12 నెఫిలో మీటర్లను నగరం నలుమూలల ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటి ద్వారా ఏరోసాల్స్ ఉధృతి, అందులో అంతర్భాగంగా ఉన్న బ్లాక్‌కార్బన్ మోతాదును లెక్కించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీ ఐఐటీ ఆధ్వర్యంలో చేసిన ఓ అధ్యయనంలో గత దశాబ్దకాలంగా ఏరోసాల్స్ మోతాదు అధికమొత్తంలో పెరిగినట్లు తేలింది. దీంతో పర్యావరణం, వాతావరణంలో పెనుమార్పులు చోటుచేసుకోవడంతోపాటు మానవ ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని తేలింది. పీసీబీ లెక్కిస్తున్న సూచీలో ఏరోసాల్స్ కాలుష్యాన్ని లెక్కించేందుకు అవకాశం లేదని పీసీబీ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తుండటం గమనార్హం. రోజువారీగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల సంఖ్య, కాలుష్యం మోతాదు ఇలా ఉంది.. మెట్రోనగరం విమాన సర్వీసులు కర్బన ఉద్గారాల శాతం ముంబై 778 24 హైదరాబాద్ 400 13 కోల్‌కతా 567 06 ఢిల్లీ 600 5.9 చెన్నై 487 5.8 బెంగళూరు 508 5.2 -
ఎయిర్‌లైన్స్ కంపెనీలకు రూ.4,260 కోట్ల నష్టాలు
విమానయాన సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 600 మిలియన్ డాలర్లకు (రూ.4,260 కోట్లు) పైగా నష్టాలను నమోదుచేయవచ్చని కన్సల్టెన్సీ సంస్థ సీఏపీఏ అంచనా వేసింది. 500–700 మిలియన్ డాలర్ల వరకు లాభాలకు అవకాశం ఉంటుందని ఈ ఏడాది జూన్‌లో వేసిన అంచనాలను సవరించింది. జెట్ ఎయిర్వేస్ మూసివేత, సానుకూలంగా ఉన్న చమురు ధరల నుంచి ప్రయోజనం పొందడంలో ఎయిర్‌లైన్స్ కంపెనీలు విఫలమైనట్టు సీఏపీఏ తన తాజా నివేదికలో పేర్కొంది. -
ఎయిరిండియాకు గుడ్‌బై!
న్యూఢిల్లీ: నష్టాలు, రుణాల భారంతో కుదేలవుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో 100 శాతం వాటాలు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎయిరిండియాలో డిజిన్వెస్ట్‌మెంట్ కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని (ఏఐఎస్ఏఎం) పునరుద్ధరించినట్లు, వ్యూహాత్మ కంగా వాటాల విక్రయ ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసినట్లు గురువారం ఆయన లోక్‌సభకు రాతపూర్వక సమాధానం ద్వారా తెలిపారు. దాదాపు రూ. 50,000 కోట్ల రుణభారం ఉన్న ఎయిరిండియా .. 2018–19లో రూ. 8,556 కోట్ల నష్టాలు నమోదు చేసింది. మరోవైపు, ఏవియేషన్ రంగంలో పరిస్థితులను మెరుగుపర్చే దిశగా.. జెట్ ఎయిర్వేస్ విమానాలను ఇతర ఎయిర్‌లైన్స్‌కు బదలాయించేందుకు సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. అలాగే, వచ్చే అయిదేళ్లలో వివిధ విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) రూ. 25,000 కోట్లు వెచి్చంచనుందని వివరించారు. నిధుల సంక్షోభంతో జెట్ ఎయిర్వేస్ ఈ ఏడాది ఏప్రిల్‌లో మూతబడిన సంగతి తెలిసిందే. పారదర్శకంగా జరగాలి: ఐఏటీఏ దేశీ విమాయాన రంగంలో పోటీతత్వం మెరుగుపడే విధంగా.. ఎయిరిండియాలో డిజిన్వెస్ట్‌మెంట్ సక్రమంగా, పారదర్శక విధానంలో జరగాలని విమానయాన సంస్థల అంతర్జాతీయ సమాఖ్య ఐఏటీఏ డైరెక్టర్ జనరల్ అలెగ్జాండర్ డి జునియాక్ అభిప్రాయపడ్డారు. అలాగే ఎయిరిండియాకు ప్రస్తుతం ఇస్తున్న వనరులను .. మొత్తం ఏవియేషన్ రంగానికి అందించేందుకు ప్రభుత్వానికీ వెసులుబాటు లభించవచ్చని ఆయన పేర్కొన్నారు. భారత మార్కెట్లో గట్టి పోటీ, భారీ నిర్వహణ వ్యయాల కారణంగా విమానయాన సంస్థల నిర్వహణ ఆపరేటర్లకు చాలా కష్టంగా ఉంటోందని జునియాక్ అభిప్రాయపడ్డారు. -
‘కళ్లజోడుతో హాట్‌గా కనిపించరు.. అందుకే ఇలా’
టోక్యో : జపాన్‌లో మహిళల వేషధారణపై పలు సంస్థలు విధిస్తున్న ఆంక్షలు దుమారం రేపుతున్నాయి. పని ప్రదేశాల్లో మహిళలు కళ్లజోడు ధరించి విధుల్లోకి రావొద్దని, బూట్లకు బదులు ఎత్తయిన హైహీల్స్ ధరించాలని నిబంధనలు పెట్టాయి. కళ్లజోడుతో మహిళ సిబ్బంది విధుల్లో ఉంటే వారి మేకప్‌ను అవి డామినేట్ చేస్తాయని రెస్టారెంట్ నిర్వాహకులు అంటుండగా.. భద్రత కోసమే మహిళా సిబ్బందికి కళ్లజోడు పెట్టుకోవద్దని ఆంక్షలు విధించామని ఎయిర్‌లైన్స్ సంస్థలు చెప్తున్నాయి. ఈ ఆంక్షలపై జపాన్ వ్యాప్తంగా మహిళా లోకం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పురుషులకు ఎటువంటి ఆంక్షలు పెట్టకుండా తమపైనే వివక్ష చూపుతున్నారని, అలాంటప్పుడు కళ్లజోళ్లు అమ్మడం నిషేదించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.‘కళ్లజోడు నిషేదించబడింది’అనే హ్యాష్‌టాగ్‌తో ట్రోలింగ్ మొదలు పెట్టారు. ‘కళ్లజోడుతో హాట్‌గా కనిపించడం కుదరదు, బాస్‌కు నచ్చదు. అందుకే కాబోలు ఈ దిక్కుమాలిన ఆంక్షలు’ అని మహిళలు తిట్టిపోస్తున్నారు. గంటల తరబడి హైహీల్స్ వేసుకుంటే పని చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుందని, కాళ్లు ఎర్రగా వాచిపోయి రక్తం వచ్చిన సందర్బాలూ ఉన్నాయని పలువురు మహిళా సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదిమాత్రమే కాకుండా.. హైహీల్స్‌తో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని డాక్టర్లు చెప్తున్నారని వెల్లడించారు. హైహీల్స్‌తో నరకాన్ని చూస్తున్నామని పేర్కొంటూ.. #KuToo ఉద్యమాన్ని లేవనెత్తారు. మీటూ ఉద్యమం స్ఫూర్తిగానే కూటూ వచ్చిందని ఇషిక్వారా మహిళా ఉద్యోగిని వెల్లడించారు. జపనీస్‌లో కూటూ అంటే బాధ అని అర్థం. జపాన్‌లో పాఠశాల విద్యార్థినులపై కూడా ఆంక్షలు విధించడం గమనార్హం. నల్లని జట్టుతో.. వైవిధ్యమైన జడతో విద్యార్థినులు స్కూల్‌కు రావాలని ఆంక్షలు పెట్టడం దారుణం. -
విమానం టాయిలెట్లో కెమెరా.. రెండేళ్లుగా పోరాటం
వాషింగ్టన్: అమెరికాకు చెందిన ఇద్దరు సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ పైలట్లు విమానంలో కెమెరాను ఉంచారన్న అభియోగంతో ఫిబ్రవరి 2017 అరీదీనా కోర్టులో కేసు నమోదైంది. ఈ ఘటన గురించి ఫ్లైట్ అటెండెంట్ రెనీ స్టెయినాకర్ మాట్లాడుతూ తాను కాక్‌పీట్‌లోకి ప్రవేశించగానే పైలట్లు ఐపాడ్లో ప్రత్యక్షంగా వీడియోను చూస్తున్నారని ఆమె ఆరోపించింది. తనతో పాటు ఫ్లైట్ 1088 లో ఉన్న మరో ముగ్గురు ఫ్లైట్ అటెండెంట్లు, విమానంలో లేని స్టెయినాకర్ భర్తను సైతం తీవ్ర వేధింపులకు గురిచేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎయిర్‌లైన్స్ నియమాల ప్రకారం ఇద్దరు పైలట్లు కాక్‌పిట్‌లో ఉండాలన్న నిబంధనల నేపథ్యంలో కెప్టెన్ టెర్రీ గ్రాహం టాయిలెట్‌కు వెళ్లే క్రమంలో తనను కాక్‌పిట్‌లోకి వెళ్లాల్సిందిగా సూచించాడంది. అప్పుడే ఈ విషయం తన కంటపడిందని.. కో పైలెట్ రస్సెల్ తన ఐపాడ్లో కెమెరాలో సదరు వీడియోలు చూస్తున్నాడని తెలిపింది. ఎందుకిలా చేస్తున్నారని ప్రశ్నించగా భద్రతా చర్యలలో భాగంగా నైరుతి బోయింగ్ 737-800 విమానాలన్నింటిలోనూ ఈ వ్యవస్థ ఏర్పాటు చేయబడిందని రస్సెల్ తనను నమ్మించే ప్రయత్నం చేశాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. కాగా సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ మాత్రం విమానంలో కెమెరాలు పెట్టారన్న వార్తలను ఖండించింది. తమ ఎయిర్‌లైన్స్ మీద వచ్చిన ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయని పేర్కొంది. ఈ క్రమంలో తమ ఉద్యోగులు, ప్రయాణికులకు రక్షణ కల్పించడంలో ఏమాత్రం రాజీ పడబోమని తెలిపారు. ఇక 2017లో పిట్స్బర్గ్ నుంచి ఫోనిక్స్‌కు విమానం వెళ్తున్న క్రమంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన కేసు ప్రస్తుతం ఫోనిక్స్‌లోని ఫెడరల్ కోర్టుకు మార్చబడింది. ఇందుకు సంబంధించిన విచారణలో భాగంగా తన క్లైంట్ స్టెయినాకర్‌ను మాదకద్రవ్య పరీక్షల కంటే కూడా ఎక్కువగా వేధించారని ఆమె తరుపు న్యాయవాది చెప్పారు. సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ పైలట్లు నేరం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఆమె మాత్రం న్యాయ పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. -
భద్రం బీకేర్‌ఫుల్..
సాక్షి, హైదరాబాద్: ఆర్టికల్ 370 రద్దు చేసిన పరిస్థితుల్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని దేశంలోని అన్ని విమానాశ్రాయాలపై కేంద్రం డేగ కన్ను వేసింది. పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో అన్ని ఎయిర్‌పోర్టుల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది. దీనిలో భాగంగా ఇప్పటికే సందర్శకుల రాకపోకలపై ఆంక్షలు విధించిన పౌరవిమానయాన భద్రతా విభాగం (బీసీఏఎస్) విమానాశ్రయాల లోపల, బయట తీసుకోవాల్సిన భద్రతా చర్యలను వివరిస్తూ అన్ని విమానయాన సంస్థలు, ఎయిర్‌పోర్టులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బోర్డింగ్ వేళల సవరణ.. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా విమానాశ్రయాల్లోని అణువణువూ గాలించేలా బీసీఏఎస్ భద్రతా నియామావళిని జారీ చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం విమానాశ్రయంలోకి ప్రవేశించే ద్వారం వద్ద నుంచి విమానం లోపలికి వెళ్లేంతవరకు ప్రయాణికుల తనిఖీల్లో నిర్లిప్తత ప్రదర్శించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని బీసీఏఎస్ స్పష్టం చేసింది. ప్రయాణికుల బోర్డింగ్ వేళలను కూడా సవరించింది. ఈ మేరకు పాటించాల్సిన విధివిధానాలను ఎయిర్‌లైన్ సంస్థలకు పంపింది. దీనికనుగుణంగా బోర్డింగ్ పాస్ కోసం స్వదేశీ ప్రయాణికులు ఫ్లైట్ షెడ్యూల్‌కు మూడు గంటలకు ముందు, విదేశీయానానికి నాలుగు గంటల ముందు ఎయిర్‌పోర్టులో రిపోర్టు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇది గంట, గంటన్నరలోపే ఉండగా.. దీనిని నాలుగు గంటల వరకు పెంచారు. ప్రయాణికులతో పాటు వారు వచ్చే వాహనాలపై కూడా నిఘా ఉంచాలని నిర్ణయిం చారు. ప్రయాణికులు పార్కింగ్ చేసే వాహనాలను ర్యాండమ్‌గా సమగ్ర తనిఖీలు చేయనున్నారు. అదనపు చెక్‌పోస్టుల ఏర్పాటు.. ప్రయాణికులు, వారు సంచరించే ప్రాంతాలే కాకుండా టర్మినళ్లు, విమానాల గ్రౌండింగ్ పాయింట్లపై కూడా ఓ కన్నేసి ఉంచాలని బీసీఏఎస్ సూచించింది. అవసరమనుకుంటే ఎయిర్‌క్రాఫ్ట్ ఆసాంతం డాగ్, బాంబ్ స్క్వాడ్లతో తనిఖీలు చేయాలని పేర్కొంది. కార్గో టర్మినళ్ల విషయంలో కూడా ఏమాత్రం అలసత్వం చేయకుండా చెక్‌పోస్టుల సంఖ్యను పెంచాలని, ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకునే మార్గంలోనూ చెక్‌పోస్టులను విస్తృతం చేయాలని ఆదేశించింది. విమానాశ్రయాలకు వచ్చే సందర్శకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల 20వరకు అనుమతించకూడదని స్పష్టం చేసింది. మొత్తం మీద ఈ వారమంతా విమానాశ్రయాల వద్ద చాలా అప్రమత్తంగా ఉండాలని, అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి అపప్రద రాకుండా అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకునేలా బీసీఏఎస్ ఆదేశాలు జారీ చేసింది. -
యుద్ధభయం; విమానాల దారి మళ్లింపు
లండన్: హొర్ముజ్ జలసంధి చుట్టు పక్కల ప్రాంతాల్లో వెళ్లే పౌర/వాణిజ్య విమానాలు కూడా పొరపాటున కూల్చివేతకు గురయ్యే అవకాశాలు ఉంటాయంటూ అమెరికా హెచ్చరించడంతో పలు విమానయాన సంస్థలు తమ విమానాల ప్రయాణ మార్గాలను మార్చుకున్నాయి. బ్రిటిష్ ఎయిర్వేస్, ఖంతాస్, సింగపూర్ ఎయిర్‌లైన్స్, మలేసియా ఎయిర్‌లైన్స్, లుఫ్తాన్సా, ఎమిరేట్స్, కేఎల్ఎం సహా పలు అంతర్జాతీయ విమానయాన సంస్థలు శుక్రవారం ఈ నిర్ణయం తీసుకున్నాయి. అమెరికా నిర్ణయం ఫలితంగా న్యూయార్క్–ముంబై విమాన సర్వీసును రద్దు చేస్తున్నట్టు యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ఆ మార్గంలో విమానం నడిపి ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగించలేమని తెలిపింది. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు యుద్ధానికి దారి తీస్తాయని ప్రపంచ దేశాలు ఆందోళన నేపథ్యంలో పౌర విమానాల దారి మళ్లించినట్టు తెలుస్తోంది. ఇరాన్‌లోని ఎంపిక చేసిన మూడు లక్ష్యాలపై గురువారం రాత్రే దాడి చేయాలని అంతా సిద్ధం చేసినప్పటికీ, దాడి చేస్తే 150 మంది చనిపోతారని తెలియడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్లో శుక్రవారం ప్రకటించారు. ఇరాన్ భూభాగంలోకి ప్రవేశించిన అమెరికా నిఘా డ్రోన్‌ని ఇరాన్‌కు చెందిన రివల్యూషనరీ గార్డులు కూల్చివేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకోవడం తెలిసిందే. (చదవండి: ఆఖరి క్షణంలో ఆగిన యుద్ధం) -
ఎయిర్‌లైన్స్ పనితీరు బాధ్యత వాటిదే..
న్యూఢిల్లీ: ఆర్థిక పనితీరు మెరుగ్గా ఉండేలా చూసుకోవడం, సమర్ధంగా కార్యకలాపాలు నిర్వహించుకోవడమన్నది పూర్తిగా విమానయాన సంస్థల బాధ్యతేనని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. ఆయా సంస్థల రోజువారీ కార్యకలాపాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోజాలదని చెప్పారు. దేశీ విమానయాన రంగం తీవ్ర ఒత్తిళ్లు ఎదుర్కొంటుండటం, జెట్ ఎయిర్వేస్ పెను సంక్షోభంలో కూరుకుపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో ప్రభు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ప్రతి విమానయాన సంస్థ.. మార్కెట్‌ను పరిశీలించి, ఆర్థిక వనరులను చూసుకుని సొంతంగా ఒక వ్యాపార ప్రణాళిక వేసుకుంటుంది. ఈ ప్రణాళికల ఆధారంగా తమ తమ కార్యకలాపాలను సమర్ధంగా నిర్వహించుకోవడం, మెరుగైన ఆర్థిక పనితీరు ఆయా సంస్థల బాధ్యత’ అని మంత్రి చెప్పారు. మరోవైపు, సంక్షోభంలో ఉన్న ఎయిరిండియాకి సంబంధించి పునరుద్ధరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. సమగ్ర ఆర్థిక ప్యాకేజీ, స్పెషల్ పర్పస్ వెహికల్‌కు రుణాల బదలాయింపు తదితర అంశాలను ఇందుకోసం పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ప్రభు తెలిపారు. -
ఎగరని విమానాలు చార్జీలకు రెక్కలు!
న్యూఢిల్లీ: పలు సమస్యలతో దేశీ ఎయిర్‌లైన్స్ పెద్ద సంఖ్యలో విమానాలను నిలిపివేయాల్సి వస్తుండటంతో.. విమాన ప్రయాణ చార్జీలు గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. స్వల్పకాలికంగా చార్జీలు 25 శాతం దాకా పెరగవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. వివిధ కారణాలతో ఇండిగో, జెట్ ఎయిర్వేస్, స్పైస్‌జెట్ దగ్గరున్న వాటిలో దాదాపు 20 శాతం విమానాలు నిలిచిపోవడం ఇందుకు కారణం. దేశీయంగా మొత్తం 585 విమానాలతో ఎయిర్‌లైన్స్ ప్రస్తుతం సేవలు అందిస్తున్నాయి. తాజాగా భద్రతా కారణాల దృష్ట్యా బోయింగ్737 మ్యాక్స్ రకం విమానాలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నిషేధించింది. ఫలితంగా స్పైస్‌జెట్ తమ దగ్గరున్న ఈ తరహా 12 విమానాలను పక్కన పెట్టాల్సి వచ్చింది. దీంతో.. దేశీయంగా ఎయిర్‌లైన్స్ ఇలా పక్కకు పెట్టిన విమానాల సంఖ్య 114కి చేరింది. ఇది మొత్తం విమానాల సంఖ్యలో దాదాపు 20 శాతం కావడం గమనార్హం. విమానాల కొరత కారణంగా స్పైస్‌జెట్ బుధవారం 14 ఫ్లయిట్స్‌ను రద్దు చేయగా గురువారం 32 సర్వీసుల దాకా రద్దు చేసి ఉంటుందని అంచనా. మిగతా విమానాలను మరింత సమర్థ వంతంగా ఉపయోగించుకోవడంపై సంస్థలు కసరత్తు చేస్తున్నప్పటికీ.. స్వల్పకాలికంగా డిమాండ్‌కి తగ్గట్లుగా సేవలు అందించలేకపోవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. కష్టాల్లో ఎయిర్‌లైన్స్.. ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం కూలిపోవడంతో బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలపై ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో నిషేధం అమలవుతోంది. దీంతో భారత్ సహా పలు దేశాల్లో విమానయాన సంస్థలు ఈ రకం ఏరోప్లేన్స్‌ను పక్కన పెట్టాల్సి వస్తోంది. అయితే, దీనికన్నా ముందే దేశీయంగా ఇండిగో, గోఎయిర్, జెట్‌ఎయిర్‌వేస్, ఎయిరిండియా వంటి విమానయాన సంస్థలు ఇతరత్రా కారణాలతో చాలా విమానాలను పక్కన పెట్టాయి. ఆర్థిక సంక్షోభం మొదలుకుని సాంకేతిక సమస్యలు, పైలట్ల కొరత మొదలైనవి ఈ కారణాల్లో ఉన్నాయి. ఉదాహరణకు లీజింగ్ సంస్థలకు చెల్లింపులు జరపకపోవడంతో జెట్ ఎయిర్వేస్కి చెందిన 50 శాతం విమానాలు ఇప్పటికే నిల్చిపోయాయి. ఇక, పైలట్ల కొరత సమస్యతో ఇండిగో రోజుకు దాదాపు 30 ఫ్లయిట్ సర్వీసుల దాకా రద్దు చేస్తోంది. మరోవైపు 47 విమానాలు ఉన్న గోఎయిర్ సంస్థ ఇంజిన్ల సమస్యలు, సరైన నెట్వర్క్ లేకపోవడం తదితర అంశాల కారణంగా 14 విమానాలను పక్కన పెట్టింది. ఇలా ఒకవైపు విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండగా.. మరోవైపు డిమాండ్‌కి తగినంత స్థాయిలో సర్వీసులు నడిపేందుకు విమానాలు లేకపోతుండటం మూలంగా విమాన చార్జీలపై ప్రభావం పడుతోంది. ఇప్పటికే 15 శాతం పెరిగిన చార్జీలు.. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటిదాకా విమానయాన చార్జీలు (వార్షిక ప్రాతిపదికన) 15 శాతం దాకా పెరిగాయని ఆన్లైన్ ట్రావెల్ సెర్చి ఇంజిన్ యాత్ర ఆన్లైన్ సీవోవో శరత్ ధాల్ తెలిపారు. ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండటం, విమానాల సంఖ్య తగ్గుతుండటం కారణంగా.. భారీ సంఖ్యలో ప్యాసింజర్స్‌కు తగ్గట్లుగా ఎయిర్‌లైన్స్ సర్వీసులు నడపలేకపోవచ్చని ఆయన పేర్కొన్నారు. దీంతో చార్జీలు కచ్చితంగా పెరిగే అవకాశాలే ఉన్నాయన్నారు. ఆఖరు నిమిషంలో బుక్ చేసుకుంటే ఏకంగా 100 శాతం పైగానే చార్జీలు చెల్లించాల్సి రావొచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఉదాహరణకు ఒక ట్రావెల్ పోర్టల్ ప్రకారం.. బుధవారం ముంబై–చెన్నై రూట్లో స్పాట్ టికెట్ ధర ఏకంగా రూ. 26,073 పలికింది. గతేడాది ఇదే సమయంలో ఈ రేటు రూ. 5,369 మాత్రమే. హోలీ పండుగ, స్కూళ్లు .. కాలేజీలకు వేసవి సెలవులు వంటి అంశాలతో ప్రస్తుతం ప్రయాణికుల రద్దీ భారీగానే ఉంటుందని ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో సీఈవో అలోక్ బాజ్‌పాయ్ చెప్పారు. ఈ నేపథ్యంలో సాధ్యమైనంత ముందుగా బుక్ చేసుకోవడమే మంచిదని సూచించారు. ‘మ్యాక్స్’ సమస్యలు.. మ్యాక్స్ తరహా ఏరోప్లేన్స్ సంఖ్య ప్రస్తుతానికి తక్కువే ఉన్నా .. పలు సంస్థలు పెద్ద సంఖ్యలో వీటి కోసం ఆర్డర్ ఇచ్చాయి. నిషేధం కారణంగా ఆ విమానాల డెలివరీ ఆగిపోతే విమానాల సంఖ్యపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఏవియేషన్ కన్సల్టింగ్ సంస్థ సెంటర్ ఫర్ ఆసియా పసిఫిక్ ఏవియేషన్ (సీఏపీఏ) సీఈవో (దక్షిణాసియా విభాగం) కపిల్ కౌల్ చెప్పారు. ఇక జెట్ ఎయిర్వేస్ ఆర్థిక కష్టాలు, ఇండిగోలో పైలట్ల కొరత మొదలైనవి కూడా దీనికి తోడైతే విమానయాన సంస్థల సామర్థ్యం మరింత తగ్గుతుందని పేర్కొన్నారు. ఇది ఆందోళన కలిగించే విషయమన్నారు. మ్యాక్స్ విమానాలను పక్కన పెట్టాల్సి రావడం, నిషేధం ఎత్తివేతపై అనిశ్చితి నెలకొనడం.. స్పైస్‌జెట్ కార్యకలాపాల విస్తరణ ప్రణాళికలపై కూడా ప్రభావం చూపనుంది. స్పైస్‌జెట్ ఏకంగా ఈ రకానికి చెందిన 155 విమానాలకు ఆర్డర్లిచ్చింది. ఇవి అందుబాటులోకి వస్తే కార్యకలాపాలు మరింతగా విస్తరించాలని ప్రణాళికలు వేసుకుంది. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ ప్రణాళికలు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. -
నేలకు దిగిన బోయింగ్‌లు
న్యూఢిల్లీ/అడిస్ అబబా: భారత విమానయాన సంస్థలు ఉపయోగిస్తున్న అన్ని బోయింగ్ 737 మ్యాక్స్–8 రకం విమానాలను కిందకు దింపేశామని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఖరోలా బుధవారం చెప్పారు. దీని కారణంగా స్పైస్‌జెట్‌కు చెందిన 35 విమానాల సర్వీసులు గురువారం రద్దు అవుతాయన్నారు. రద్దవుతున్న సర్వీసులకు టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు తమ ఇతర విమానాల్లో టికెట్లు కేటాయిస్తున్నామనీ, టికెట్లు రద్దయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని స్పైస్‌జెట్ తెలిపింది. వివిధ దర్యాప్తు సంస్థల నుంచి వచ్చే సమాచారాన్ని బట్టి బోయింగ్‌పై నిషేధాన్ని కొనసాగించాలా, ఎత్తేయాలా అన్నది నిర్ణయిస్తామనీ, అయితే దీనిపై సమీప భవిష్యత్తులో నిర్ణయం వెలువడే అవకాశం లేదని ఆయన అన్నారు. ఇక మరో భారతీయ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ వద్ద కూడా ఐదు బోయింగ్ 737 మ్యాక్స్ 8 రకం విమానాలు ఉన్నప్పటికీ వాటికి అద్దె చెల్లించలేక ఆ సంస్థ వాటిని ఇప్పటికే నిలిపేసింది. తాజా నిషేధంతో ఆ సంస్థ సర్వీసులపై ప్రభావమేమీ ఉండదు. ఇథియోపియాలో ఇటీవల కూలిపోయిన బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానంలోని బ్లాక్ బాక్స్‌లను విశ్లేషణల కోసం యూరప్‌కు పంపనున్నట్లు ఇథియోపియా ప్రభుత్వం తెలిపింది. బోయింగ్ విమానాల్లో భద్రతా ప్రమాణాలపై ఆందోళనలు నెలకొన్న తరుణంలో ఈ బ్లాక్ బాక్స్‌లను విశ్లేషించాలని తీవ్రంగా ఒత్తిడి ఉన్న నేపథ్యంలో ఇథియోపియా ఈ నిర్ణయం తీసుకుంది. బోయింగ్ విమానాలపై అనేక దేశాలు నిషేధం విధించాయి. ఇథియోపియాలో కూలిన విమానం బ్లాక్ బాక్స్‌లు, కాక్పిట్ల్లోని సమాచారాన్ని విశ్లేషించేందుకు అవసరమైన పరికరాలు తమ వద్ద లేవనీ, కాబట్టి వాటిని యూరప్‌కు పంపుతున్నామని ఇథియోపియన్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి చెప్పారు. అయితే యూరప్‌లో ఏ దేశానికి పంపాలో గురువారం నిర్ణయిస్తామన్నారు. -
బోయింగ్ 737పై భారత్ నిషేధం
న్యూఢిల్లీ: బోయింగ్ 737 మ్యాక్స్–8 విమానాలపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. ఇథియోపియా ఎయిర్‌లైన్స్ ప్రమాదం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు బోయింగ్ 737పై ఇప్పటికే నిషేధం విధించాయి. ఇథియోపియా విమాన ప్రమాదంలో ఆరుగురు భారతీయులు సహా 157 మంది ప్రయాణికులు మృత్యువాతపడిన విషయం తెలిసిందే. ఈ విమానాలు సురక్షితమేనని నిర్థారించేందుకు అవసరమైన మార్పులు, భద్రతా చర్యలు చేపట్టేవరకు నిషేధం కొనసాగుతుందని కేంద్ర పౌరవిమానయాన శాఖ తెలిపింది. అంతేకాకుండా, ఈ విమాన పైలెట్లకు వెయ్యి గంటలు, కో పైలెట్‌కు 500 గంటలు నడిపిన అనుభవం ఉంటేనే అనుమతిస్తామని స్పష్టం చేసింది. ‘ప్రయాణికుల భద్రతే మాకు అత్యంత ముఖ్యం. ఇందుకు అవసరమైన చర్యలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానయాన సంస్థలు, ఉత్పత్తి దారులతో సంప్రదింపులు జరుపుతున్నాం’ అని పౌరవిమానయాన శాఖ ట్విట్టర్లో పేర్కొంది. భారత్‌కు చెందిన స్పైస్‌జెట్‌కు 13, జెట్ ఎయిర్వేస్ సంస్థకు 5 బోయింగ్ 737 మ్యాక్స్8 రకం విమానాలు ఉన్నాయి. జెట్ ఎయిర్వేస్ ఇప్పటికే ఈ విమానాలను నిలిపివేయగా స్పైస్ జెట్ మాత్రం తమ విమానాలు అత్యంత సురక్షితమైనవంటూ తెలిపింది. -
హైదరాబాద్, హాంకాంగ్ మధ్య ఐదో కెథే పసిఫిక్ ఫ్లైట్
సాక్షి, న్యూఢిల్లీ : హాంకాంగ్ ఆధారిత ఎయిర్ లైన్ కెథే పసిఫిక్, తన ఇండియా నెట్ వర్క్‌ని పెంచాలనే లక్ష్యంతో హైదరాబాద్ నుంచి హాంకాంగ్ కి ఐదవ నాన్ స్టాప్ ఫ్లైట్ సేవల్ని ప్రకటించింది. ఈ సేవలు ఈ ఏడాది జూన్ 7 నుంచి ప్రారంభించనున్నట్లు పేర్కొంది. కేథే పసిఫిక్ సంస్థ హైదరాబాద్‌లో 2012 నుంచి వారానికి నాలుగు ఫ్లైట్లతో సేవలను అందిస్తోంది.ఈ సేవలు ఏయిర్ బస్ ఏ330-300 ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా నిర్వహించబడుతున్నాయి. తమ సేవలను విస్తరించే క్రమంలో భాగంగా తాజాగా ఐదో ఫ్లైట్ సేవల్ని ప్రకటించింది. ఈ ప్రకటనపై కంపెనీ సౌత్ ఆసియా రీజినల్ జెనరల్ మేనేజర్ మార్క్ సుచ్ మాట్లాడుతూ.. ఈ ఏడాది జూన్ నుంచి తమ అదనపై ఫ్లైట్ ప్రారంభమవుతుందన్నారు. దీని ద్వారా దేశంలో తమ నెట్‌వర్క్‌ను మరింత దృఢ పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తాజా ఫ్లైట్ సేవల ద్వారా హైదరాబాద్ పాసెంజర్ ప్రయాణంలో తమ కంపెనీ సామర్థ్యం14 శాతం పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. -
రూ.899కే విమాన టికెట్
న్యూఢిల్లీ: పలు ప్రధాన రూట్లలో భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నట్లు విస్తారా ఎయిర్‌లైన్స్, బడ్జెట్ ఎయిర్‌లైన్ ఇండిగో ప్రకటించాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుంచి సెప్టెంబర్ 28 వరకు చేసే జర్నీలపై సోమవారం నుంచి బుధవారం వరకు ఈ ఆఫర్ ఇస్తున్నట్లు ఇండిగో ప్రకటించింది. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలపై ఈ ఆఫర్లు వర్తిస్తాయని వెల్లడించింది. దేశీ విమానాల్లో రూ.899కే విమాన టికెట్‌ను అందిస్తుండగా.. అంతర్జాతీయ రూట్లలో టికెట్ ప్రారంభ ధర రూ.3,399 నుంచి ఉన్నట్లు కంపెనీ తెలియజేసింది. ఇక ఫిబ్రవరి 27 నుంచి సెప్టెంబర్ 18 వరకు జరిగే ప్రయాణాలకు సంబంధించిన బుకింగ్స్‌ను మంగళవారం ప్రారంభిస్తున్నట్లు విస్తారా ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. కేవలం రెండు రోజులు మాత్రమే కొనసాగే ఈ డిస్కౌంట్ ఆఫర్ రేపటితో ముగియనుంది. ఢిల్లీ–అహ్మదాబాద్, ఢిల్లీ–కోల్‌కతా, ఢిల్లీ–చెన్నై, ముంబై–గోవా రూట్లలో ఇరు సంస్థలు ఆఫర్లను ఇస్తున్నాయి. -
200 విమానాలతో ఇండిగో రికార్డు
ముంబై: బడ్జెట్ ధరల ఎయిర్‌లైన్స్ ఇండిగో దేశీయంగా అధిక సంఖ్యలో విమానాలు కలిగిన సంస్థగా రికార్డు నమోదు చేసింది. దేశీయంగా 200 విమానాలను కలిగి ఉన్న తొలి సంస్థ ఇదే. రెండు ఎయిర్‌బస్ ఏ320(సియో), రెండు ఎయిర్‌బస్ ఏ320 నియో విమానాలు తాజాగా వచ్చి చేరడంతో సంస్థ విమానాల సంఖ్య 200కు చేరుకుంది. దేశీయ మార్కెట్లో ఇండిగో 40 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. 2015 డిసెంబర్ 24న ఈ సంస్థ నిర్వహణలోకి 100వ విమానం వచ్చి చేరగా, మూడేళ్ల తర్వాత రెట్టింపు స్థాయికి చేరుకున్నట్టు అయింది. -
లిస్టెడ్ ఎయిర్‌లైన్స్‌కు రేటింగ్ సెగ
న్యూఢిల్లీ: పెరిగిపోతున్న వ్యయాలు లిస్టెడ్ విమానయాన సంస్థలకు రేటింగ్‌పరమైన తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. ఇండిగో, జెట్ ఎయిర్వేస్, స్పైస్‌జెట్ సంస్థల రుణాలను వివిధ రేటింగ్ సంస్థలు అక్టోబర్‌లో కుదించాయి. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో) పొందిన దాదాపు రూ. 8,000 కోట్ల విలువ చేసే బ్యాంక్ ఫెసిలిటీస్ దీర్ఘకాలిక రేటింగ్‌ను అక్టోబర్ 17న ఇక్రా కుదించింది. స్వల్పకాలిక రేటింగ్‌ను యథాతథంగానే కొనసాగించింది. అటు నిర్వహణ వ్యయాలు భారీగా పెరిగిపోవడం, ఇటు వాటిని తట్టుకునేందుకు విమాన చార్జీలను పెంచలేని పరిస్థితి ఉండటం వంటివి ఇండిగో సహా ఎయిర్‌లైన్స్ రేటింగ్స్‌పై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు ఇక్రా పేర్కొంది. ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్వేస్ రుణాల దీర్ఘకాలిక రేటింగ్‌ను కూడా ఇక్రా డౌన్‌గ్రేడ్ చేసింది. నిధుల సమీకరణలో జాప్యాలు కంపెనీ ఆర్థిక పరిస్థితులపై ఒత్తిళ్లు పెంచుతున్నాయని పేర్కొంది. మరోవైపు, మధ్యకాలికంగా నిర్వహణ పనితీరుపై ఒత్తిళ్లు కొనసాగుతాయనే కారణంతో స్పైస్‌జెట్ బ్యాంక్ ఫెసిలిటీస్ రేటింగ్స్‌ను అక్టోబర్ 9న క్రిసిల్ డౌన్‌గ్రేడ్ చేసింది. 2018 మార్చి ఆఖరు నాటికి స్పైస్‌జెట్ వద్ద రూ. 248 కోట్ల నగదు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ గణనీయంగా పడిపోవడం, విమాన ఇంధనం ధరలు (ఏటీఎఫ్) 34% ఎగియడం వంటివి ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఎయిర్‌లైన్స్ నిర్వహణ వ్యయాలు భారీగా పెరిగిపోవడానికి కారణమయ్యాయని ఇక్రా వివరించింది. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాల్లో దాదాపు 40% ఏటీఎఫ్‌దే ఉంటుంది. -
మహిళపై ఓ శ్వేత జాతీయుడి జాత్యహంకార వ్యాఖ్యలు
-
జాత్యహంకార వ్యాఖ్యలు.. అయినా అతడే గెలిచాడు!
‘నీ చెత్త విదేశీ యాసతో నాకింకా చిరాకు తెప్పించకు. అసలు నిన్ను చూస్తేనే కంపరంగా ఉంది. నువ్వో అందవిహీనమైన ఆవువి’- మహిళపై ఓ శ్వేత జాతీయుడి జాత్యహంకార వ్యాఖ్యలు బార్సిలోనా : విమానంలో తను కూర్చున్న సీట్ల వరుసలో నల్ల జాతీయురాలు కూర్చోవడానికి వీల్లేదంటూ ఓ తెల్ల జాతీయుడు రెచ్చిపోయాడు. వృద్ధురాలు అనే విచక్షణ కూడా లేకుండా సదరు మహిళ, ఆమె కూతురిని అసభ్య పదజాలంతో దూషించాడు. శుక్రవారం రేయనార్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే.. మిస్సెస్ గేల్(77) అనే జమైకన్ మహిళ 1960లో బ్రిటన్ వచ్చి స్థిరపడ్డారు. శుక్రవారం తన భర్త సంవత్సరికం నిర్వహించి రేయినార్స్కు చెందిన ఫ్లైట్ ఎఫ్ఆర్015 అనే విమానంలో బార్సిలోనా నుంచి లండన్‌కు పయనమయ్యారు. వయోభారంతో బాధపడుతున్న మిసెస్ గేల్‌కు తోడుగా ఆమె కూతురు కూడా అదే విమానంలో ప్రయాణిస్తున్నారు. అయితే ఇద్దరికీ వేరు వేరు చోట్ల సీట్లు కేటాయించడంతో మిసెస్ గేల్.. ఓ శ్వేత జాతీయుడు ఉన్న సీట్ల వరుసలో కూర్చున్నారు. దీంతో అతడి అహంకారం దెబ్బతింది. ‘నేను కూర్చున్న వరుసలో ఈ నల్ల ******* కూర్చోవడానికి వీల్లేదు. ఇంత వికారమైన మనిషిని నేను చూస్తూ ఉండలేను. నువ్వో అందవిహీనమైన ఆవువి’ అంటూ అసభ్య పదజాలంతో ఆమెను దూషించడం మొదలు పెట్టాడు. దీంతో ఆమె కూతురు వచ్చి.. తన తల్లి పట్ల అమార్యదగా ప్రవర్తిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. అదే విధంగా మిసెస్ గేల్ కూడా అతడితో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ‘నీ చెత్త విదేశీ యాసతో(ఆమె జమైకా యాసలో ఇంగ్లీష్ మాట్లాడుతుండగా) నాకింకా చిరాకు తెప్పించకు. అసలు నిన్ను చూస్తేనే కంపరంగా ఉందంటూ’ మరోసారి రెచ్చిపోయాడు. అతడికే అదనపు సౌకర్యాలు! ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న ఫ్లైట్ అటెండెంట్ గొడవను ఆపే ప్రయత్నం చేశాడు. కానీ ఆ వ్యక్తి ఎంతకీ వెనక్కి తగ్గకపోడంతో మిసెస్ గేల్‌ను వేరే సీట్లో కూర్చోవాల్సిందిగా కోరాడు. అంతేకాకుండా అప్పటిదాకా రెచ్చిపోయిన శ్వేత జాతీయుడికి అదనపు సౌకర్యాలు కల్పించి అతడిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించాడు. కాళ్ల నొప్పులతో బాధ పడుతున్న మిసెస్ గేల్ ఆమె కూతురి సహాయంతో సీటు మారారు. కాగా ఈ తతంగాన్నంతా డేవిడ్ లారెన్స్ అనే వ్యక్తి వీడియో తీసి ఫేస్బుక్లో పోస్టు చేశాడు. దీంతో రేయినార్ ఎయిర్‌లైన్స్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతున్నాయి. ఈ విషయం గురించి డేవిడ్ లారెన్స్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. విమానంలో అంతగా గొడవ జరుగుతున్నా తోటి ప్రయాణికులు మాత్రం తమకేమీ పట్టనట్లు ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను, మరో వ్యక్తి మిసెస్ గేల్‌కి అండగా నిలిచినప్పటికీ న్యాయం చేయలేకపోయామన్నాడు. విమానంలో ఓ నల్ల జాతీయురాలిపై జరిగిన జాత్యహంకార దాడిని ఆపకుండా, దాడికి పాల్పడిని వాడికే విమాన సిబ్బంది అదనపు సౌకర్యాలు కల్పించడం తనను బాధించిందని పేర్కొన్నాడు. తాను ఈ వీడియోను పోస్ట్ చేసిన రెండు రోజుల తర్వాత స్పందించడం చూస్తుంటే ఎయిర్‌లైన్స్ ఎంత బాధ్యతగా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు అంటూ వ్యాఖ్యానించాడు. -
విమాన ప్రయాణీకులకు చార్జీల షాక్..
సాక్షి, న్యూఢిల్లీ : పండుగ సీజన్లో విమాన ప్రయాణీకులకు ఎయిర్‌లైన్స్ షాక్ ఇవ్వనున్నాయి. ఏవియేషన్ టర్భైన్ ఇంధనంపై కస్టమ్స్ సుంకాన్ని ప్రభుత్వం పెంచిన క్రమంలో పెరిగిన వ్యయాన్ని ప్రయాణీకులకు బదలాయించాలని విమానయాన సంస్థలు నిర్ణయించాయి. విమాన చార్జీలను నేరుగా పెంచకుండా వేరే చార్జీల రూపంలో వడ్డన ఉండే విధంగా ఎయిర్‌లైన్స్ సంసిద్దమయ్యాయి. పెరుగుతున్న ఇంధన ధరలు, విపరీతమైన పోటీ కారణంగా ప్రయాణీకులపై భారం మోపలేకపోవడం ఎయిర్‌లైన్స్‌పై ఒత్తిడి పెంచుతున్నాయని, తాజాగా ప్రభుత్వం జెట్ ఇంధనంపై కస్టమ్స్ సుంకం పెంచిన క్రమంలో చార్జీల పెంపు మినహా మరో ప్రత్యామ్నాయం లేదని ఎయిర్‌లైన్స్ భావిస్తున్నాయి. ఎయిర్‌లైన్స్ నిర్వహణ వ్యయంలో ప్రధానమైన ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్‌పై 5 శాతం కస్టమ్స్ సుంకం విధించాలని ప్రభుత్వం గత నెల నిర్ణయం తీసుకుంది. ప్రయాణం రద్దు చేసుకున్న సందర్భంలో అధిక చార్జీలను వసూలు చేయడంతో పాటు, ప్రయాణ తేదీల్లో మార్పు, ఆన్‌బోర్డ్ మీల్స్, బ్యాగేజ్ ఫీజు, కార్గో చార్జీలు, అదనపు బ్యాగేజ్ చార్జీలను భారీగా దండుకోవాలని విమానయాన సంస్థలు యోచిస్తున్నాయి. -
ఎయిర్‌లైన్స్‌కు ప్రభుత్వ విధానాల భారం
న్యూఢిల్లీ: ప్రభుత్వ విధానాలు భారత్‌లో విమానయాన సంస్థలపై వ్యయాల భారాన్ని మోపుతున్నాయని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) చీఫ్ అలెగ్జాండర్ డె జునియాక్ వ్యాఖ్యానించారు. ఇక మౌలిక సదుపాయాలపరమైన అంశాలు వల్ల కూడా విమానయాన రంగ వృద్ధి ఒక మోస్తరు స్థాయికే పరిమితమవుతోందని మంగళవారం అంతర్జాతీయ విమానయాన సదస్సులో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు. విమాన ఇంధన ధరలు భారీగా పెరగడం, రూపాయి రికార్డు స్థాయిలో పతనమవుతుండటంతో ఎయిర్‌లైన్స్ లాభాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందని తెలిపారు. ‘జెట్ ఇంధనం, ఇన్‌ఫ్రాపరమైన సమస్యలను సమగ్రంగా పరిష్కరించుకోగలిగితే ఏవియేషన్ రంగంలో భారత్ దూసుకెళ్లగలదు‘ అని అలెగ్జాండర్ చెప్పారు. అంతర్జాతీయంగా అన్ని విమానయాన సంస్థలూ ఇంధన ధరల పెరుగుదలతో ఇబ్బందిపడుతున్నప్పటికీ.. భారత్‌లో మాత్రం నియంత్రణపరమైన, ఇంధనాలపై పన్నులపరమైన నిబంధనలు ఇక్కడి విమానయాన సంస్థలకు మరింత భారంగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అటు 2037 నాటికి భారత్‌లో విమాన ప్రయాణికుల సంఖ్య (దేశీయంగా ప్రయాణించేవారు, విదేశాలకు వెళ్లేవారు, విదేశాల నుంచి వచ్చేవారు అంతా కలిపి) 50 కోట్లకు పెరుగుతుందని అలెగ్జాండర్ చెప్పారు. ప్రస్తుత గణాంకాలతో పోలిస్తే మూడు రెట్లు అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. విదేశీ టికెట్లపై జీఎస్టీ సరికాదు.. విదేశీ ప్రయాణాల టికెట్లపై కూడా జీఎస్టీ విధించడం అంతర్జాతీయ ఏవియేషన్ నియంత్రణ సంస్థ ఐసీఏవో నిబంధనలకు విరుద్ధమని అలెగ్జాండర్ చెప్పారు. దీనివల్ల ప్రభుత్వానికి స్వల్పకాలికంగా ఆదాయ లబ్ధి చేకూరవచ్చేమో గానీ కనెక్టివిటీ వ్యయాలు పెరిగి అంతర్జాతీయంగా భారత్ పోటీనిచ్చే పరిస్థితి లేకుండా పోతుందన్నారు. ప్రస్తుతం విదేశీ ప్రయాణాలకు సంబంధించి ఎకానమీ టికెట్లపై 5 శాతం, బిజినెస్ క్లాస్ టికెట్లపై 12 శాతం వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ఉంటోంది. అటు అంతర్జాతీయంగా ఎయిర్‌లైన్స్ వ్యయాల్లో ఇంధన ఖర్చుల వాటా 24.2 శాతం ఉంటుండగా.. భారత్‌లో మాత్రం 34 శాతం దాకా ఉంటోందని అలెగ్జాండర్ చెప్పారు. ఫ్లయిట్లో ఇంటర్నెట్కు అక్టోబర్‌లో దరఖాస్తులు.. విమానాల్లో ఇంటర్నెట్ సర్వీసులు (ఇన్‌ఫ్లయిట్ ఇంటర్నెట్) అనుమతించిన నేపథ్యంలో ఈ సేవలు అందించే సంస్థల నుంచి టెలికం శాఖ అక్టోబర్‌లో దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్ఎన్ చౌబే చెప్పారు. ఇప్పటికే సర్వీసుల సంస్థలు, ఎయిర్‌లైన్స్, టెలికం శాఖతో దీనిపై సుదీర్ఘంగా చర్చలు జరిగాయని, నిర్దిష్ట మార్గదర్శ ప్రణాళికను రూపొందించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. క్యాబినెట్ సెక్రటరీ సారథ్యంలోని కార్యదర్శుల కమిటీ (సీవోఎస్) దీన్ని పరిశీలిస్తుందని వివరించారు. ఇన్‌ఫ్లయిట్ కనెక్టివిటీతో విమాన ప్రయాణాల్లో కూడా ప్యాసింజర్ల ఫోన్‌కాల్స్, ఇంటర్నెట్ బ్రౌజింగ్ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. -
డిస్కౌంట్స్... టేకాఫ్!!
న్యూఢిల్లీ: ఆఫ్ సీజన్లో ప్రయాణికులను ఆకర్షించేందుకు దేశీ చౌక చార్జీల విమానయాన సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. పోటాపోటీగా డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. రూ. 999 టికెట్ చార్జీలు మొదలుకుని 20 శాతం దాకా క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తున్నాయి. ఒకవైపు ముడి చమురు రేట్ల పెరుగుదల, మరోవైపు రూపాయి క్షీణతతో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ మార్కెట్లో పట్టు కోసం ఎయిర్‌లైన్స్ తాజాగా డిస్కౌంట్లకు తెరతీయడం గమనార్హం. ఇండిగోలో పది లక్షల సీట్లు.. తమ నెట్‌వర్క్‌లోని 59 ప్రాంతాలకు ప్రయాణించే వారికి పది లక్షల పైచిలుకు సీట్లను డిస్కౌంట్ రేట్లకే అందిస్తున్నట్లు ప్రకటించింది ఇండిగో ఎయిర్‌లైన్స్. రూ.999 నుంచి వన్ వే (అన్నీ కలిపి) టికెట్ అందిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 18 నుంచి 2019 మార్చి 30 దాకా ప్రయాణాల కోసం ఈ ఆఫర్లో బుక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి సోమవారం ప్రారంభమైన ‘ఫెస్టివ్ సేల్‘ నాలుగు రోజులు కొనసాగుతుందని ఇండిగో పేర్కొంది. మొబైల్ వాలెట్ సంస్థ మొబిక్విక్ ద్వారా టికెట్లు బుక్ చేసుకుంటే రూ. 600 దాకా సూపర్ క్యాష్ లేదా 20 శాతం మేర రీఫండ్ కూడా ప్రకటించింది ఇండిగో. ఎయిర్ఏషియా ఆఫర్.. ఎయిర్ఏషియా ఇండియా కూడా అదే బాటలో దేశీ ప్రయాణాలకు రూ. 999 నుంచి, విదేశీ ప్రయాణాలకు రూ. 1,399 నుంచి టికెట్లను ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, న్యూఢిల్లీ తదితర 120 పైచిలుకు ప్రాంతాలకు డిస్కౌంట్ చార్జీలు వర్తిస్తాయి. అంతర్జాతీయంగా చూస్తే... కౌలాలంపూర్, బ్యాంకాక్, సిడ్నీ మొదలైన రూట్లలో కూడా చౌక చార్జీలను ఆఫర్ చేస్తోంది ఎయిర్ఏషియా ఇండియా. వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి నవంబర్ 26 దాకా చేసే ప్రయాణాలకు సంబంధించి ఈ సంస్థ సెప్టెంబర్ 2 నుంచి బుకింగ్స్‌ను ప్రారంభించింది. ఈ ‘బిగ్ సేల్‘ ఎనిమిది రోజుల పాటు ఉంటుంది. గోఎయిర్ సైతం.. మరో చౌక టిక్కెట్ల విమానయాన సంస్థ గోఎయిర్ కూడా దేశీ ప్రయాణాలకు రూ. 1,099 నుంచి టికెట్లు ఆఫర్ చేస్తోంది. సెప్టెంబర్ 3 నుంచి 2019 మార్చి 31 దాకా చేసే ప్రయాణాలకు ఈ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చు. సెప్టెంబర్ 3న ప్రారంభమైన టికెట్ల విక్రయం మూడు రోజుల పాటు సాగుతుందని సంస్థ వెల్లడించింది. చమురు, రూపాయి కుంగదీస్తున్నా.. సాధారణంగా పండుగలు మొదలయ్యే దాకా విమానయాన సంస్థలకు ఆఫ్సీజన్గానే ఉంటుందని, దీంతో అవి డిమాండ్‌ను పెంచేందుకు డిస్కౌంట్లు ప్రకటిస్తుంటాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. అయితే, ప్రస్తుతం ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ ఆఫర్లు ఇస్తుండటం గమనార్హమని పేర్కొన్నాయి. విమాన ఇంధన ధరలు భారీగా పెరగడం, రూపాయి రికార్డు స్థాయిలో క్షీణిస్తుండటం దేశీ విమానయాన సంస్థలను కుంగదీస్తోంది. అయితే, విపరీతమైన పోటీ నెలకొనడంతో టికెట్ చార్జీలను పెంచలేని పరిస్థితి నెలకొంది.మార్కెట్లో సింహభాగం వాటా ఉన్న సంస్థ డిస్కౌంట్లకు టికెట్లు ఆఫర్ చేస్తే మిగతా కంపెనీలు కూడా అదే బాట పట్టక తప్పదని విశ్లేషకులు పేర్కొన్నారు.పెరిగిన వ్యయాలను ప్యాసింజర్లకు బదలాయించలేని పరిస్థితుల కారణంగా కొన్ని విమానయాన సంస్థలు గత కొన్నాళ్లుగా నష్టాలు, తక్కువ స్థాయిలో లాభాలే నమోదు చేస్తున్నాయి. ముడిచమురు ధరల పెరుగుదల, అధిక వడ్డీ రేట్లు, సిబ్బంది వేతనాల పెరుగుదల వంటి కారణాలతో ఈ ఏడాదిలో భారత్ సహా అంతర్జాతీయంగా ఎయిర్‌లైన్స్ లాభాలు భారీగా తగ్గొచ్చని ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్(ఐఏటీఏ) అంచనా వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్‌లైన్స్ లాభాలు 33.8 బిలియన్ డాలర్లు మాత్రమే ఉండొచ్చని పేర్కొంది. దేశీ విమానయాన పరిశ్రమ నష్టాలు ఈ ఏడాది 1.65–1.90 బిలియన్ డాలర్ల మేర భారీ స్థాయిలో ఉండవచ్చని సెంటర్ ఫర్ ఏషియా పసిఫిక్ ఏవియేషన్(సీఏపీఏ) పేర్కొంది. గతంలో 430–460 మిలియన్ డాలర్లుగా మాత్రమే ఉండొచ్చని అంచనావేసింది. -
విమానం మోత !
సాక్షి, సిటీబ్యూరో: హజ్ యాత్రకు వెళ్లే ప్రయాణికులతో సౌదీ ఎయిర్‌లైన్స్‌కు కాసుల పంట కురుస్తోంది. సాధారణ రోజుల్లో కంటే ఈ సీజన్లో ధరలు రెట్టింపునకు మించి పెరిగాయి. దీంతో ఆ ఎయిర్‌లైన్స్‌కు సిరుల వరద పారుతోంది. హజ్ సీజన్లో మినహా మామూలు రోజుల్లో అప్ అండ్ డౌన్ విమాన టికెట్ చార్జీ రూ. 25 వేలు దాటదు. కాని హజ్ సీజన్లో అప్ అండ్ డౌన్ టికెట్ చార్జీ రూ. 68 వేల నుంచి రూ.72 వేలకు చేరడమే ఇందుకు ఉదాహరణ. అంటే సాధారణ రోజుల్లో తీసుకుంటున్న టికెట్ చార్జీల కంటే రూ.35 వేల నుంచి రూ.40 వేలు ఎక్కువగా వసూలు చేస్తున్నారన్నమాట. యేటా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం తరఫున 8 వేల మంది, ప్రైవేట్ టూర్ ఆపరేటర్ల ద్వారా 2 వేల మంది హజ్ యాత్రకు వెళుతున్నారు. ఏడాది పాటు నగరం నుంచి ఉద్యోగులు, ఉమ్రా, విజిట్ వీసాలపై నిత్యం వందల మంది సౌదీ అరేబియాకు పయనమవుతున్నారు. గ్లోబల్ టెండర్ విధానం..సౌదీ ఎయిర్‌లైన్స్ పెత్తనం ప్రపంచ దేశాల నుంచి హజ్ యాత్రకు వివిధ దేశాల నుంచి యాత్రికులు సౌదీ అరేబియాకు హజ్ సీజన్లో వెళుతుంటారు. ఆయా దేశాలు తమ సొంత విమాన యాన కంపెనీల ద్వారా లేదా ఇతర దేశాల విమాన సర్వీసుల ద్వారా హజ్ యాత్రికులను పంపిస్తారు. సొంత విమాన సర్వీసులు లేని పక్షంలో ఆయా దేశాలు గ్లోబల్ టెండర్ విధానంతో తక్కువ టికెట్ ధర పలికిన లేదా కోడ్ చేసిన విమాన సర్వీస్‌కు హజ్ యాత్రికులను తీసుకెళతారు. దీంతో «టికెట్ ధరలు తక్కువగా ఉంటాయి. అమలుకు నోచుకోలేదు.. హజ్ యాత్ర నిర్వహణ మొత్తం కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ అధీనంలో ఉంటుంది. మూడే ళ్ల నుంచి హజ్ యాత్రికులను సౌదీ అరేబియా తీసుకెళ్లడానికి గ్లోబల్ టెండర్ విధానాన్ని పాటించడం లేదు. లోపాయికారిఒప్పందాలతో పెద్దమొత్తంలో ముడుపులు తీసుకొని సౌదీ ఎయిర్‌లైన్స్‌కు దేశ వ్యాప్తంగా వివిధ మహానగరాల నుంచి హజ్ యాత్రికులకు తీసుకెళ్లే బాధ్యత అప్పగిస్తున్నారు. దీంతో సౌదీ ఎయిర్‌లైన్స్ ఇష్టారీతిగా టికెట్ చార్జీలు వసూలు చేస్తోందని ఆరోపణలు ఉన్నాయి. హజ్ యాత్రలో మోసాలు సరికాదు హజ్ యాత్ర పుణ్య యాత్ర ఇందులో మోసాలకు, అధిక డబ్బులు వసూలు చేయడం సరికాదని హజ్ యాత్రికులు అంటున్నారు. సాధారణ రోజుల్లో కంటే హజ్ సీజన్లో సౌదీ విమానాల టికెట్ ధరలు పెంచడం సరికాదంటున్నారు. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖతో పాటు సౌదీ ఎయిర్‌లైన్ హజ్ యాత్ర ద్వారా కూడా ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ వచ్చే ఏడాది హజ్ సీజన్లో విమానాల టికెట్ ధరలు తగ్గించేయందుకు చర్యలు తీసుకోవాలని హజ్ యాత్రికులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
దేశీయ విమానాల బ్యాగేజీకి ఛార్జీల మోత
-
విమాన చార్జీలకు రెక్కలు..
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రో ధరల పెంపుతో వాహనదారులకు చెమటలు పడుతుంటే. తాజాగా జెట్ ఇంధనం ధరలు చుక్కలు తాకుతుండటంతో విమాన చార్జీలు భారం కానున్నాయి. విమానాల్లో వాడే జెట్ ఇంధనం ధరలు శుక్రవారం నాలుగేళ్ల గరిష్టస్ధాయిలో ఏకంగా ఏడు శాతం పెరిగాయి. తాజా పెంపుతో ఏవియేషన్ టర్భైన్ ఇంధనం (ఏటీఎఫ్) ధరలు కిలోలీటర్‌కు రూ 4688 మేర పెరిగి రూ 70,028కి చేరాయి. జెట్ ఇంధన ధరలు ఇటీవల ఈ స్ధాయిలో భారీగా పెరగడం ఇది రెండవసారి కావడం గమనార్హం. మే 1న ఏటీఎఫ్ ధరలు కిలోలీటర్‌కు రూ 3890 మేర పెరిగాయి. తాజా పెంపుతో జెట్ ఇంధనం ధరలు నాలుగేళ్ల గరిష్టస్ధాయిలో భగ్గుమన్నాయి. మరోవైపు జెట్ ఇంధన ధరలు భారీగా పెరగడంతో విమాన ప్రయాణ చార్జీలను పెంచేందుకు విమానయాన సంస్థలు కసరత్తు సాగిస్తున్నాయి. చార్జీల పెంపు తప్పదని గతంలోనే సంకేతాలు పంపిన విమానయాన సంస్ధలు తాజాగా జెట్ ఇంధన ధరలు భారీగా పెరగడంతో ఇక ప్రయాణీకులపై చార్జీల వాత వడ్డిస్తాయని భావిస్తున్నారు. -
విమాన చార్జీలకు రెక్కలు..
సాక్షి, ముంబయి : ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ధరలు గత ఏడాదిలో 30 శాతం పెరగడంతో విమానయాన సంస్థలు నిర్వహణ ఖర్చులను అధిగమించేందుకు విమాన చార్జీలను పెంచవచ్చని నిపుణులు భావిస్తున్నారు. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయంలో 45 శాతం జెట్ ఇంధనం ఖర్చులే కావడంతో విమాన చార్జీలను 15 శాతం మేర పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇంధన ధరల పెరుగుదలతో చార్జీలు పెంచకతప్పదని ఇప్పటికే పలు ప్రైవేట్ విమానయాన సంస్థలు సంకేతాలు పంపినా అధికారికంగా చార్జీల పెంపుపై స్పష్టత ఇవ్వలేదు. గత ఏడాదిగా జెట్ ఇంధన ధరలు 30 శాతం మేర పెరిగాయని, గత ఆరునెలల్లోనే 25 శాతం భారమయ్యాయని, ఈ పరిస్థితుల్లో టికెట్ ధరలను పెంచకతప్పదని ఓ ప్రైవేట్ విమానయాన సంస్థ ప్రతినిధి వ్యాఖ్యానించారు. అయితే ముందుగా ఏ సంస్థ చార్జీల పెంపును ప్రకటిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు పోటీ పెరిగిన క్రమంలో చార్జీల పెంపుకు ముందు సీట్ల ఆక్యుపెన్సీని కూడా చూసుకోవాలని మరో ఎయిర్‌లైన్‌కు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. జెట్ ఇంధన ధరల పెంపుతో విమాన చార్జీలు 10 నుంచి 15 శాతం పెరగవచ్చని తాము అంచనా వేస్తున్నామని కేపీఎంజీ ఏరోస్సేస్, డిఫెన్స్ ఇండియా హెడ్ అంబర్ దూబే పేర్కొన్నారు. జెట్ ఇంధనంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ సుంకం తగ్గిస్తే పరిస్థితిలో కొంత మార్పు వస్తుందని అన్నారు. -
విమాన ప్రయాణీకులకు ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: తడిచి మోపెడవుతున్న కాన్సిలేషన్ చార్జీలతో ఇబ్బందులుపడుతున్న విమాన ప్రయాణికులకు విమానయాన శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. విమాన టికెట్లను బుక్ చేసుకున్న 24 గంటలలోపు కాన్సిల్ చేసుకుంటే ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని సివిల్ ఏవియేషన్ మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ మేరకు సివిల్ ఏవియేషన్ సహాయ మంత్రి జయంత్ సిన్హా మంగళవారం వెల్లడించారు. కొత్తగా ఎయిర్ సేవా డిజి యాత్రా పథకాన్ని లాంచ్ చేయనున్నట్టు తెలిపారు. కొన్ని సంస్కరణలపై తాజా ప్రతిపాదనలు ఈ క్రింది విధంగా ఉన్నాయి బుకింగ్ చేసుకున్న 24 గంటల్లో టిక్కెట్లను రద్దు చేసుకుంటే..చార్జి ఉండదు. బేస్ ఫేర్ +ఇంధన చార్జీని మించి కాన్సిలేషన్ చార్జీలు ఉండకూడదు. ప్రత్యేక అవసరాలతో ప్రయాణించేవారికోసం ప్రత్యేక సదుపాయం. విమాన ఆలస్యంలో ఎయిర్‌లైన్స్ తప్పు ఉంటే విమానయాన సంస్థ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. నాలుగు గంటలకు మించి ఆలస్యమైతే పూర్తి ఫీజు వాపసు. ఆలస్యం ఒకరోజు దాటితే ప్రయాణికులకు హోటల్లో బస తదితర సౌకర్యాలు కల్పించాలి. టికెట్ బుకింగ్‌నకు ఆధార్ తప్పని కాదు. అయితే డిజీ యాత్రలో నమోదు సమయంలో మాత్రమే ఆధార్ అవసరమవుతుందనీ, డిజిటల్ ఐడీలపై దృష్టి పెట్టామని జయంత్ సిన్హా తెలిపారు. -
దేశీ విమాన ప్రయాణికుల్లో 26% వృద్ధి
ముంబై: దేశీ విమాన ప్రయాణికుల సంఖ్య ఏప్రిల్ నెలలో వార్షిక ప్రాతిపదికన 26 శాతం వృద్ధితో 1.15 కోట్లకు చేరింది. టూరిస్ట్ సీజన్ దీనికి ప్రధాన కారణం. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తాజా గణాంకాల ప్రకారం.. ► దేశీ విమానయాన సంస్థలు ఏప్రిల్ నెలలో మొత్తంగా 1.15 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. గతేడాది ఇదే నెలలో విమాన ప్రయాణికుల సంఖ్య 91.34 లక్షలుగా ఉంది. ► మార్కెట్ లీడర్ ఇండిగో ఫ్లైట్స్‌లో 45.8 లక్షల మంది ప్రయాణించారు. ఇది 39.8 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది. ప్రతి పది మంది ప్యాసింజర్లలో నలుగురికిపైగా ఇండిగో సర్వీస్‌నే ఎంచుకున్నారు. ► సీట్ ఆక్యుపెన్సీ స్పైస్‌జెట్‌లో ఎక్కువగా 95.5 శాతంగా నమోదయ్యింది. ఇక ఆన్‌టైమ్ ఫెర్ఫార్మెన్స్లో ఇండిగో ముందుంది. ఈ సంస్థకు చెందిన 86.6 శాతం విమానాలు షెడ్యూల్ ప్రకారం నడిచాయి. -
విమానాల్లో ఛార్జీల బాదుడు
న్యూఢిల్లీ : ఇక మీదట విమానంలోనూ ఫోన్ మాట్లాడుకునేందుకు, ఇంటర్నెట్ను వాడుకునేందుకు టెలికం కమిషన్ అనుమతించనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నూతన నిబంధన పట్ల ప్రయాణికులు ఓ వైపు సంతోషిస్తున్నప్పటికీ, మరోవైపు వారికి రుచించని మాట ఒకటి తెలియజేసింది. అదేంటంటే ఇక మీదట విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో కూడా మొబైల్ ఫోన్లను వాడవచ్చు, కానీ అందుకు ఛార్జీలు చెల్లించాల్సిందేనని సంకేతాలిచ్చింది. అయితే ఈ ఛార్జీలు ఎంతమేర ఉంటాయని స్పష్టంగా తెలియజేయనప్పటికీ, అంతర్జాతీయ నిబంధనలనుసరించి నిర్ణయిస్తామని మాత్రం తెలిపింది. కాగా, అంతర్జాతీయంగా కొన్ని దేశాలు 10ఎంబీ డేటా వాడుకుంటున్నందుకు 4.5 డాలర్లు(రూ. 350) వసూలు చేస్తున్నాయి. ఇప్పటివరకైతే అంతర్జాతీయ రూట్లలో దేశీయ విమానయాన సంస్థలు ఇంటర్నెట్ సేవలకు 30నిమిషాలకు రూ.500, గంటకు రూ.1000 ఛార్జ్ చేస్తున్నాయి.అంతర్జాతీయ నిబంధనలను అనుసరించి చార్జీలు వసూలు చేయాల్సి వస్తే ఇక మీదట ఇన్ ఫ్లయిట్ ఇంటర్నెట్, మొబైల్ కాల్స్ మాట్లాడాలంటే అర గంట నుంచి గంటకు రూ.500 - 2000 చెల్లించాల్సి ఉంటుంది. ‘ఇన్ ఫ్లైయిట్ ఇంటర్నెట్ చార్జీల నిర్ణయం విషయంలో ట్రాయ్ జోక్యం ఉండదని ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ స్పష్టం చేశారు. సర్వీసు ప్రొవైడర్లే ఆ చార్జీలను నిర్ణయిస్తారని పేర్కొన్నారు. -
ఇక ఆకాశంలోనూ ఎంచక్కా మాట్లాడవచ్చు..
ముంబై : ‘మేడమ్ దయచేసి మీ ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేయండి’ విమానం టేకాఫ్ అవ్వడానికి ముందు వినిపించే సర్వసాధారణ మాట ఇది. ఇక మీదట ఈ మాట వినిపించబోదు అంటున్నాయి విమానయాన సంస్థలు. అవును ఇక మీదట విమానంలోను ఎంచక్కా ఫోన్ మాట్లాడవచ్చు, ఇంటర్నెట్ వాడుకోవచ్చు. మరో మూడు, నాలుగు నెలల్లో ఈ సదుపాయం అందుబాటులోకి రానుందని.. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను టెలికాం కమిషన్ ఆమోదించినట్లు సమాచారం. టెలికాం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తీసుకువచ్చిన నూతన నిబంధనల ప్రకారం విమానం 3 వేల మీటర్ల ఎత్తు చేరుకున్న తర్వాత ప్రయాణికులు తమ ఫోన్లను వినియోగించుకోవచ్చని తెలిపింది. అంటే విమానం టేకాఫ్ అయిన తర్వాత 3 వేల మీటర్ల ఎత్తు చేరడానికి సుమారు 4నిమిషాల సమయం పడుతుంది. అంటే మొదటి నాలుగు నిమిషాలు మినహాయించిన తర్వాత ప్రయాణికులు తమ ఫోన్లను వాడుకోవచ్చు. ట్రాయ్ సూచించిన ‘ఇన్ ఫ్లయిట్ కనెక్టివిటి’ వల్ల ఇక మీదట విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు ఫోన్ వినియోగించుకునే సదుపాయం కల్పించనున్నాయి. కానీ విమానంలో ఇలా మొబైల్, ఇంటర్నెట్ సేవలు వినియోగించుకోవడానికి ప్రయాణికులు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీలు అంతర్జాతీయ విమానయాన సంస్థల ప్రమాణాలను అనుసరించి విధించనున్నారు. ఇప్పటివరకైతే విమానంలో ఇంటర్నెట్ను వాడుకోవాలనుకుంటే 30నిమిషాలకుగాను రూ. 500, గంటకుగాను రూ. 1000 చెల్లించాల్సి వచ్చేది. ఇప్పటికే తక్కువ దూరం ప్రయాణించే డొమెస్టిక్ మార్గాల్లో ముందస్తు బుకింగ్ ప్రారంభ ఛార్జీలు 1200 రూపాయల నుంచి 2500 రూపాయల వరకూ ఉన్నాయి. త్వరలో అమల్లోకి రానున్న ‘ఇన్ ఫ్లయిట్ కనెక్టివిటి’ సౌకర్యం వల్ల విమాన ఛార్జీలు మరింత పెరిగే అవకాశం ఉంది. ట్రాయ్ తెలిపిన వివరాల ప్రకారం 83 శాతం మంది ప్రయాణికులు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే ఎయిర్‌లైన్స్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. -
విమాన ప్రయాణికులకు గుడ్‌న్యూస్..?
న్యూఢిల్లీ : విమాన ప్రయాణికులకు సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ గుడ్‌న్యూస్ ఇవ్వబోతోందా? అంటే అవుననే తెలుస్తోంది. విమాన క్యాన్సిలేషన్ లేదా ఆలస్యం కారణంతో కనెక్టింగ్ విమానాలు అందుకోలేని వారికి పరిహారాలను రూ.20వేలకు పెంచాలని సివిల్ ఏవియేషన్ మంత్రిత్వశాఖ చూస్తోంది. దీని కోసం డ్రాఫ్ట్ సిటిజన్ ఛార్టర్ను పునఃసమీక్షిస్తోందట. కొన్ని ఎయిర్‌లైన్స్ నుంచి ఈ నియమాలకు తీవ్ర వ్యతిరేకత వస్తున్నట్టు తెలుస్తోంది. పరిహారాల పెంపు మాత్రమే కాక, విమాన టిక్కెట్ బుక్ చేసుకున్న 24 గంటల్లోగా టిక్కెట్లో ఏమైనా మార్పులు చేపడితే జరిమానాలను రద్దు చేయాలని కూడా నిర్ణయిస్తోంది. మే 1న విమానయాన సంస్థలు, ఇతర వాటాదారులతో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయబోయే సమావేశంలో వీటిపై నిర్ణయం తీసుకోనున్నారు. దీనిలో కూడా కొన్ని వ్యతిరేకతలు ఉన్నాయని, మే 1న నిర్వహించబోయే సమావేశంలో ప్రయాణికులకు, విమానయాన సంస్థలకు ఇద్దరికీ ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకోనున్నారని సంబంధిత వర్గాలు చెప్పాయి. అయితే పరిహారాల పెంపుతో విమాన టిక్కెట్ ధరలు కూడా పెరుగుతాయని వాదనలు వినిపిస్తున్నాయి. 80 శాతం మార్కెట్ షేరు కలిగిన ఇండిగో, స్పైస్‌జెట్, గో ఎయిర్, జెట్ ఎయిర్వేస్ వంటి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ పరిహారాల పెంపుపై ఆందోళన వ్యక్తంచేస్తోంది. పరిహారాలు పెంచితే, విమానయాన సంస్థల ఆర్థిక సాధ్యతపై ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నాయి. -
బికినీ ఎయిర్‌లైన్స్ సేవలు ఇక ఢిల్లీకి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ బడ్జెట్ ఎయిర్‌లైన్ వియత్నాంకు చెందిన వియట్జెట్ ఢిల్లీనుంచి డైరెక్ట్ విమాన సర్వీసులను ప్రకటించింది. బికినీ ఎయిర్‌లైన్స్‌గా పేరు తెచ్చుకున్న వియట్ జెట్ ఢిల్లీ నుంచి వియత్నాంలోని హోచిమిన్ నగరానికి నడపనున్నట్లు ప్రకటించింది. ఇండియా-వియత్నాం దౌత్య సంబంధాల 45వ వార్షికోత్సవం సందర్భంగా వియత్నాం-ఇండియా బిజినెస్ ఫోరమ్‌లో ఈ విషయాన్ని ప్రకటించింది. ఆసియన్ ఏజ్ నివేదించిన ప్రకారం బికినీ ఎయిర్‌లైన్స్‌గా పేరొందిన వియట్జెట్ ఎయిర్‌లైన్స్ జులై- ఆగస్టు లో భారత్‌కు డైరెక్ట్ ఫ్లైట్స్ సేవలు అందించనున్నామని వెల్లడించింది. ఈ రెండు నగరాలమధ్య వారానికి నాలుగు సార్లు విమానాలను నిర్వహిస్తుంది. పైలట్లు, ఎయిర్‌హోస్టెస్‌లు సహా ఇతర క్యాబిన్ క్రూ అంతా బికినీ ధరించి సేవలు అందించడమే ఈ బికినీ ఎయిర్‌లైన్స్ ప్రత్యేకత. అలా బికినీ ఎయిర్‌లైన్స్‌గా ప్రఖ్యాతి పొందింది. 2007లో మహిళా బిలియనీర్ గుయేన్ థీ ఫుంగ్ థావో స్థాపించిన వైమానిక సంస్థ వియత్నాం దేశంలోనే రెండవ అత్యుత్తమ సేవలు అందిస్తున్న అతిపెద్ద సంస్థగా పాపులారిటీ సాధించింది. పైలట్లు, ఫ్లైట్ అటెండెంట్లతో బికినీలు ధరింపజేసి 2011లో ఈ సంస్థ చేసిన ప్రచారం అప్పట్లో వివాదాస్పదమైంది. అ క్కడి ప్రభుత్వంనుంచి జరిమాను కూడా ఎదుర్కొంది.అయితే కొన్ని ప్రత్యేక విమానాల్లో మాత్రమే ప్రయాణీకులను ఆకర్షించడానికి బికినీల్లో ఉన్నమహిళా సిబ్బందిని ఉపయోగిస్తుంది. అయితే ఇంత ప్రతికూల ప్రచారం ఉన్నప్పటికీ, ప్రారంభించినప్పటి నుంచీ సంస్థ పెరుగుదల గణనీయంగా ఉంది. తాజా త్రైమాసికంలో లాభాల్లో 75.9 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. దీనికి తోడు కంపెనీకి 55 ఏ320, ఏ321 విమానాల విమానాలను కలిగి ఉంది. దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో 385 విమానాలు నడుపుతోంది. -
విమానంలో ఏం చేశాడంటే..
కౌలాలంపూర్ : బంగ్లాదేశ్ ప్రయాణీకుడు ఒకరు విమానంలో అమర్యాదకరంగా ప్రవర్తించిన ఘటన వెలుగు చూసింది. కౌలాలంపూర్ నుంచి ఢాకా బయలుదేరిన విమానంలో 20 సంవత్సరాల మలేషియన్ యూనివర్సిటీ విద్యార్థి వింతగా ప్రవర్తించాడు. దుస్తులను విప్పేసి తన ల్యాప్‌టాప్‌లో పోర్న్ వీడియోలు చూశాడు. విమానంలో మహిళా సిబ్బంది పట్ల అసభ్యంగా వ్యవహరించాడు. తన చేష్టలను అడ్డుకున్న మహిళపై దాడికి తెగబడ్డాడు. దీంతో క్యాబిన్ సిబ్బంది, ప్రయాణీకులు కలిసి అతడి చేతులను కట్టేసి నిర్బంధంలోకి తీసుకున్నారు. అతను ఎందుకిలా ప్రవర్తించాడో తెలియరాలేదని ఎయిర్‌లైన్స్ ఓ ప్రకనటలో పేర్కొంది. విమానం ఢాకాకు చేరుకోగానే దుండగుడిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించింది. -
పదే పదే గ్యాస్ వదలుతున్నాడంటూ...
-
గ్యాస్ వదలుతున్నాడంటూ...
వియన్నా : కొన్ని మనకు చెప్పి రావు. ఎంత నియంత్రించుకున్న అలాంటి వాటి విషయంలో మనమేం చెయ్యగలిగింది ఏం లేదు. సరిగ్గా అలాంటి సమస్యతో బాధపడుతున్న ఓ పెద్దాయన ఇక్కడ విమానంలో రచ్చ రచ్చ రేపాడు. పదే పదే గ్యాస్ వదులుతున్నాడంటూ ఓ వ్యక్తితో ప్రయాణికులు గొడవకు దిగగా.. ఏం చేయాలో పాలుపోనీ పైలెట్ జట్టు పీకున్నాడు. డచ్ ఎయిర్ లైన్స్ ట్రాంసవియాకు చెందిన ఓ విమానం దుబాయ్ నుంచి అమస్టర్‌డామ్‌కు ప్రయాణికులతో బయలుదేరింది. అయితే జీర్ణకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ ప్రయాణికుడు పదే పదే ‘గ్యాస్’ వదులుతుండటంతో ఇతరులకు ఇబ్బంది కలిగించింది. అదే వరుసలో కూర్చున్న ఇద్దరు మహిళలతోపాటు మరో ఇద్దరు అభ్యంతరం వ్యక్తం చేశారు. విమాన సిబ్బందికి ఈ విషయంపై ఫిర్యాదు చేయగా.. ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఆ నలుగురు సదరు పెద్దాయనతో గొడవకు దిగారు. ఈ వ్యవహారంతో ఏం చేయాలో పాలుపోనీ పైలెట్ వియన్నాలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. గొడవ పడ్డ నలుగురిని దించేసి.. ఆపై ఫ్లైట్ తిరిగి బయలుదేరినట్లు సమాచారం. అక్కడి నుంచి వారిని ప్రత్యామ్నయ మార్గంలో అమస్టర్‌డామ్‌కు తరలించినట్లు తెలుస్తోంది. అయితే ఇంత గొడవకు కారణమైన ఆ వ్యక్తిని తిరిగి ఫ్లైట్ ఎక్కించుకున్నారా? లేక అతన్ని కూడా దించేశారా? అన్న దానిపై స్పష్టత కొరవడింది. -
ఎయిర్‌పోర్టులో ధావన్‌కు చేదు అనుభవం
దుబాయ్ : టీమిండియా ఓపెనర్ శిఖర్‌ధావన్‌కు దుబాయ్ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా కుటుంబంతో బయలుదేరిన ధావన్ కుటుంబాన్ని ఎయిర్‌లైన్స్ అధికారులు బోర్డింగ్‌కు అనుమతించలేదు. ఈ విషయంపై ధావన్ ట్విట్టర్ వేదికగా అసహనం వ్యక్తం చేశాడు. ‘నాతో దక్షిణాఫ్రికా వస్తున్న నా ఫ్యామిలీని అడ్డుకోవడం ఎమిరేట్స్‌కు అనైతిక చర్య. నా భార్య, పిల్లలకు దుబాయ్ నుంచి దక్షిణాఫ్రికా వెళ్లే విమానానికి బోర్డింగ్ ఇవ్వలేదు. మా పిల్లల జనన ధృవీకరణ పత్రాలు సమర్పించాలని కోరారు. ఆ సమయంలో అవి అందుబాటులో లేవు. వాటికోసం వారు దుబాయ్ ఎయిర్‌పోర్టులో నిరీక్షిస్తున్నారు. ముంబై విమానాశ్రయంలోనే ఈ పత్రాలను అడిగి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. ఎలాంటి కారణం లేకుండా ఓ ఎమిరేట్స్ ఉద్యోగి తన కుటుంబ పట్ల దురుసుగా ప్రవర్తించాడని’ అసహనం వ్యక్తం చేశాడు. 2/2.They are now at Dubai airport waiting for the documents to arrive. Why didn't @emirates notify about such a situation when we were boarding the plane from Mumbai? One of the emirates' employee was being rude for no reason at all. — Shikhar Dhawan (@SDhawan25) 29 December 2017 ఇక చీలమండ గాయంతో బాధపడుతున్న ధావన్ తొలి టెస్టుకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హోటల్‌కు చేరే సమయంలో ధావన్ తన ఎడమ చీలమండకు పట్టీ కట్టుకొని కనిపించాడు. ధావన్ గాయంపై ఫిజియో నుంచి ఎలాంటి సమాచారం అందలేదని, అతను తొలి మ్యాచ్ ఆడుతాడా లేదా అని ఇప్పుడే చెప్పలేమని ఓ బీసీసీఐ సీనియర్ అధికారి తెలిపారు. -
తిరుపతి నుండి విదేశాలకు విమానాలు నడపండి
-
విమాన ప్రయాణీకులకు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: విమాన ప్రయాణీకులకు ఇది నిజంగా శుభవార్తే. భారీగా బాదేస్తున్న విమాన టికెట్ల కాన్సిలేషన్ చార్జీలపై విమానయాన మంత్రిత్వ శాఖ త్వరలోనే ప్రయాణీకులకు భారీ ఊరట కల్పించనుంది. దేశీయ విమానయాన సంస్థల్లో టికెట్ల రద్దు సమయంలో విధించే చార్జీల సవరణకు కసరత్తు చేస్తోంది. దీనికి బదులు సరికొత్త నిబంధనలను అమలు చేయనుంది. దేశీయ విమానయాన సంస్థలు కాన్సిలేషన్ ఫీజు రూ. 3వేల చొప్పున వసూలు చేస్తున్న నేపథ్యంలో కాన్సిలేషన్ చార్జీల డేటా పంపించాల్సిందిగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కోరింది. తాజా నివేదికల ప్రకారం, రద్దు ఛార్జీలు బేస్ ఫేర్ కన్నా లేదా ఇంధన సర్ ఛార్జ్ మొత్తం కంటే ఎక్కువగా ఉండరాదు. వీటిలో ఏది తక్కువగా ఉంటే దాన్ని పరిగణనలోకి తీసుకునేలా నియమాలను రూపొందించనున్నట్టు సమాచారం. ఇటీవల కాన్సిలేషన్ ఛార్జీలను పెంచిన నేపథ్యంలో డీజీసీఏ ఈ చర్యలకు దిగనుంది. కాగ ఉడాన్(తక్కువ ధరల్లో విమాన ప్రయాణ) పథకం గంటకు రూ. 2500 విమాన టికెట్లను అందిస్తోంటే.. దానికంటే కాన్సిలేషన్ చార్జీలు అధికంగా ఉండడంపై ఏవియేషన్ మంత్రి జయంత్ సిన్హా స్పందించారు. ఈ రద్దు ఛార్జీలను తిరిగి నియంత్రించాల్సినవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో వీటిని సమీక్షించాలని జయంత్ సిన్హా ఆదేశించారు. -
విమాన ప్రయాణికులకు త్వరలో గుడ్‌న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ : విమాన ప్రయాణికులకు త్వరలోనే విమానయాన సంస్థలు గుడ్‌న్యూస్ చెప్పనున్నాయి. ప్రయాణికులపై ఇప్పటి వరకు విధిస్తున్న అత్యధిక రద్దు ఛార్జీలు ఇక నుంచి తగ్గబోతున్నాయి. ప్రస్తుతం కొన్ని విమానయాన సంస్థలు దేశీయ టిక్కెట్ల రద్దుపై రూ.3000 వరకు ఛార్జీలు విధిస్తున్నాయి. ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం భావించింది. అత్యధిక మొత్తంలో విధిస్తున్న ఛార్జీలపై తగ్గాలంటూ విమానయాన సంస్థలను కేంద్రం కోరబోతుంది. సహేతుకమైన మొత్తానికి ఈ ఫీజుల తగ్గింపు ఉండేలా ప్రభుత్వం ఎయిర్‌లైన్స్‌తో చర్చలు జరుపబోతున్నట్టు సమాచారం. ''రద్దు ఛార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయని మేము భావిస్తున్నాం. రూ.3000 ఛార్జీ చాలా కేసుల్లో టిక్కెట్ కన్నా ఎక్కువగా ఉంది. తమ ఉడాన్ స్కీమ్ కిందనే గంట ప్రయాణానికి రూ.2500 ఛార్జీ ఉంది'' అని ఏవియేషన్ మంత్రి జయంత్ సిన్హా తెలిపారు. ఎక్కువ మొత్తంలో రద్దు ఛార్జీల వల్ల ముందస్తుగా తక్కువ ధరకు టిక్కెట్లు కొనడాన్ని నిరోధిస్తుందని ట్రావెల్ నిపుణులు చెబుతున్నారు. తక్కువ ధరకు ముందస్తుగా టిక్కెట్ కొనుగోలు చేసిన తర్వాత అనుకోని కారణాల వల్ల టిక్కెట్‌ను క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తే, రద్దు ఛార్జీలు అత్యధిక మొత్తంలో ఉంటున్నట్టు తేలింది. దీంతో కొనుగోలుదారులు ముందస్తుగా టిక్కెట్లు కొనుగోలు చేయడాన్ని వాయిదా వేస్తున్నారని ట్రావెల్ ఏజెంట్ తెలిపారు. ఒక్క రద్దు ఛార్జీలను మాత్రమే కాక, చెక్-ఇన్-బ్యాగేజీ వంటి పలు ఛార్జీలను కూడా విమానయాన సంస్థలు పెంచుతున్నాయి. -
‘విమాన దాదా’లపై కొరడా
► దురుసుగా ప్రవర్తించిన ప్రయాణికులపై కఠినచర్యలు ► 3 నెలల నుంచి జీవితకాల నిషేధం ► తొలిసారిగా ‘నో ఫ్లై’ మార్గదర్శకాలు ► రూపొందించిన కేంద్రం న్యూఢిల్లీ: విమానయాన సంస్థల సిబ్బందిపై తరచూ దాడులు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. దురుసుగా ప్రవర్తించే ప్రయాణికులపై మూడు నెలల నుంచి జీవిత కాలంపాటు విమానాల్లో ప్రయాణించకుండా నిషేధం విధించాలని నిర్ణయించినట్టు శుక్రవారం ప్రకటించింది. తొలిసారిగా ‘నో ఫ్లై’జాబితాకు సంబంధించి మార్గదర్శకాలను రూపొందించింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా సత్ప్రవర్తన లేని ప్రయాణికుల జాబితాను సిద్ధం చేసింది. ప్రయాణికుల దురుసు ప్రవర్తనను మూడు రకాలుగా విభజించిన పౌర విమానయాన మంత్రిత్వ శాఖ. తీవ్రతను బట్టి ఒక్కోదానికి ఒక్కో కాలపరిమితిగల శిక్షను ఖరారు చేసింది. ఈ నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బిజినెస్ క్లాస్‌లో తనకు సీటు ఇవ్వలేదని శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఎయిర్ ఇండియా ఉద్యోగిని 25సార్లు చెప్పుతో కొట్టిన నేపథ్యంలో దుష్ప్రవర్తన గల ప్రయాణికులతో ‘నో ఫ్లై’జాబితా రూపొందించాలని విమానయాన సంస్థలు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. ప్రయాణించే సమయంలోనే... భద్రతా ప్రమాణాల్లో భాగంగా ప్రపంచంలో ‘నో ఫ్లై’జాబితా రూపొందిస్తున్న మొట్టమొదటి దేశం భారత్ అని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా చెప్పారు. అయితే విమానంలో ప్రయాణించేటప్పుడు మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయన్నారు. ఈ సమయంలో ప్రయాణికుడి దురుసు ప్రవర్తన వల్ల విమానం, అందులోని వారి భద్రతకు విఘాతం కలిగితే తీవ్రతను బట్టి నిషేధం ఉంటుందన్నారు. ఇతర సమయాల్లో జరిగే ఘటనలపై భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తాయన్నారు. ఓ దేశీయ విమానయాన సంస్థ ‘నో ఫ్లై’జాబితాకు ఇతర సంస్థలు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు. ఒక సంస్థ నిషేధించిన ప్రయాణికుడి విషయంలో నిర్ణయం తీసుకొనే స్వేచ్ఛ ఇతర విమాన సంస్థలకు ఉందని స్పష్టం చేశారు. ఈ నిబంధనలు అన్ని దేశీయ, విదేశీ విమాన సేవలకు, అన్ని విమానాశ్రయాలకూ వర్తిస్తాయన్నారు. ‘వీటన్నింటి ముఖ్య ఉద్దేశం విమానం ఎక్కిన తరువాత పూర్తి స్థాయిలో భద్రత కల్పించడం’అని సిన్హా తెలిపారు. ప్రభుత్వ ‘డిజీయాత్ర’యాప్ ద్వారా త్వరలో పీఎన్ఆర్ నంబర్‌తో పాటు యూనిక్ ఐడీ కూడా ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని, దీంతో నిషేధిత ప్రయాణికుడిని గుర్తించవచ్చని వెల్లడించారు. ముఖ్య మార్గదర్శకాలు... ♦ ప్రయాణికుడిపై విమాన పైలట్ ఇన్ కమాండ్ ఫిర్యాదు చేయవచ్చు. సదరు సంస్థ అంతర్గత కమిటీ దీనిపై 30 రోజుల్లోగా విచారణ జరపాలి. ♦ ఒకవేళ ఈ గడువు లోగా దర్యాప్తు పూర్తికాకపోతే సదరు ప్రయాణికుడు విమానాల్లో విహరించవచ్చు. ♦ దురుసుగా ప్రవర్తించిన ప్రయాణికుడిని విమానయాన సంస్థతో పాటు స్థానిక పోలీసులు కూడా విచారిస్తారు. అవసరమైతే క్రిమినల్ కేసుతో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసే అవకాశం ఉంది. ♦ దుష్ప్రవర్తన తీవ్రతను బట్టి ఎంత కాలం నిషేధం విధించాలన్నది కమిటీ నిర్ణయిస్తుంది. ♦ ప్రయాణికుడిపై తీసుకున్న చర్యలను విమానయాన సంస్థ కేంద్రానికి తెలపాలి ♦ హోంశాఖ సూచన మేరకు జాతీయ భద్రతకు విఘాతం కలిగించే ప్రయాణికుల పేర్లను కూడా ‘నో ఫ్లై’జాబితాలో చేర్చాలి. దుష్ప్రవర్తన తీవ్రతనుబట్టి నిషేధాన్ని మూడు రకాలుగా విభజించారు దూషణ: మూడు నెలల నిషేధం (తిట్టడం, మాటలతో వేధించడం, మద్యం సేవించి ఇబ్బంది కలిగించడం వంటివి) భౌతిక దాడి: ఆరు నెలల నిషేధం (తొయ్యడం, కొట్టడం, అసభ్య ప్రవర్తన) బెదిరించడం: రెండేళ్ల నుంచి జీవిత కాల నిషేధం (దీన్ని తీవ్రమైన చర్యగా భావిస్తారు. చంపుతానని బెదిరించడం, లైంగిక వేధింపులకు పాల్పడటం వంటివి) ⇒ ఒకవేళ ప్రయాణికుడు మళ్లీ అదే తప్పు చేస్తే గతంలో విధించిన నిషేధానికి రెట్టింపు కాలం నిషేధిస్తారు. ⇒ 8 నిషేధంపై ప్రయాణికుడు 60 రోజుల్లోగా మంత్రిత్వ శాఖ అప్పిలేట్ కమిటీని సంప్రదించవచ్చు. ఒకవేళ కమిటీ నిర్ణయంపై సంతృప్తి చెందకపోతే హైకోర్టును ఆశ్రయించవచ్చు. -
విమాన ప్రయాణికుల రద్దీ 17 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: దేశీ విమాన ప్రయాణికుల సంఖ్య జూలై నెలలో 17% వృద్ధి చెందింది. విమానయాన సంస్థలు 95.65 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. గతేడాది ఇదే నెలలో విమాన ప్రయాణికుల సంఖ్య 85.08 లక్షలు. తాజా గణాంకాల ప్రకారం.. ఇండిగో 38.7 శాతం మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. అయితే కిందటి నెలలో సంస్థ మార్కెట్ వాటా 40 శాతంగా ఉంది. అంటే కొంత క్షీణత నమోదయ్యింది. ఇండిగోలో 36.99 లక్షల మంది ప్యాసెంజర్లు ప్రయాణించారు. ఇక దీని తర్వాతి స్థానంలో జెట్ ఎయిర్వేస్ (15.8 శాతం), స్పైస్‌జెట్ (14.2 శాతం), ఎయిర్ ఇండియా (13.5 శాతం) ఉన్నాయి. ఈ మూడు సంస్థల మార్కెట్ వాటా జూలైలో పెరగడం గమనార్హం. -
ఎయిర్‌లైన్స్ షేర్ల జోరు
స్టాక్ సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడుతున్నప్పటికీ, విమానయాన రంగ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా బోయింగ్విమానాలను కొనుగోలు ఒప్పంద వార్తలతో స్పైస్ జెట్ భారీగా లాభపడింది. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్(ఇండిగో), స్పైస్‌జెట్, జెట్ ఎయిర్వేస్ షేర్లు 1.3 శాతం నుంచి 2.5 శాతం రేంజ్లో లాభాలతో ట్రేడవుతున్నాయి. దేశీయ ఎయిర్‌ట్రాఫిక్ గత నెలలో 17 శాతం పెరిగిందన్న వార్తల విమానయన రంగ షేర్ల జోరుకు కారణమని నిపుణులంటున్నారు. ఇంట్రాడేలో స్పైస్ జెట్, ఇండిగో రికార్డ్ స్థాయిలను నమోదు చేశాయి. స్పైస్‌జెట్‌కు జీవిత కాల గరిష్ట స్థాయిని, ఇండిగోకు ఏడాది గరిష్ట స్థాయిని తాకాయి. ముందున్నది మంచి కాలమే... ఇంధన వ్యయాలు తక్కువగా ఉండడం, జీఎస్టీ అమలు కారణంగా విమాన చార్జీలు తగ్గి మరింత మంది విమానయానం చేసే అవకాశాలు తదితర అంశాల కారణంగా విమానయాన రంగ షేర్లు జోరుగానే పెరుగుతాయని నిపుణులంటున్నారు. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ప్రభావం నుంచి విమానయాన రంగం బైటపడిందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అభిప్రాయపడింది. జూన్ క్వార్టర్లో ఈ రంగ కంపెనీల ఆర్థిక ఫలితాలు బాగా ఉంటాయని పేర్కొంది. వ్యయాలు తగ్గుతున్నందున ధరల విషయంలో విమానయాన కంపెనీలు క్రమశిక్షణ పాటిస్తే మార్జిన్లు పెరిగే అవకాశాలున్నాయని వివరించింది. -
శివసేన ఎంపీకి తప్పని తిప్పలు
న్యూఢిల్లీ: ఎయిరిండియా ఉద్యోగిపై దాడి చేసిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ కు తిప్పలు తప్పడం లేదు. ఉద్యోగిపై దౌర్జన్యం చేయడంతో ఎయిరిండియా సహా ఆరు విమానయాన సంస్థలు తమ విమానాల్లో ఎక్కించుకునేది లేదంటూ ఆయన టికెట్లు రద్దు చేసేశాయి. దీంతో ఢిల్లీ నుంచి ముంబైకి ఆయన రైళ్లో వెళ్లాల్సి వచ్చింది. ముంబై నుంచి బుక్ చేసుకున్న టికెట్‌తో పాటు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బుక్ చేసుకున్న విమానం టికెట్‌ను కూడా ఎయిరిండియా రద్దు చేయడంతో రోడ్డు మార్గంలో ఢిల్లీకి బయలుదేరారు. రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో వెళ్లాలని టిక్కెట్లు తీసుకున్నప్పటికీ చివరి నిమిషంలో ఆయన మనసు మార్చుకున్నారు. గైక్వాడ్ కారులో ఢిల్లీకి బయలుదేరిన విషయాన్ని ఉమర్గా పట్టణానికి చెందిన ఆయన స్నేహితుడొకరు వెల్లడించారు. మంగళవారం మధ్యహ్నం గైక్వాడ్, ఆయన భార్య కారులో పుణె నుంచి ఢిల్లీకి పయనమైనట్టు తెలిపారు. బుధవారం సాయంత్రానికి వీరు ఢిల్లీ చేరుకుంటారని చెప్పారు. ఈ రోజు లోక్ సభ సమావేశాలకు హాజరుకారని వెల్లడించారు. రేపటి నుంచి ఆయన లోక్ సభ సమావేశాలకు హాజరవుతారు. -
నిషేధ ఎఫెక్ట్ : లాభాలు హుష్ కాకి
పారిస్ : అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం నిషేధాల మీద నిషేధాలు విధిస్తూ పలు వివాదాలకు తెరతీస్తుంది. కొన్ని దేశాల నుంచి అమెరికాకు విమానాల్లో వచ్చే ప్రయాణికులు తమవెంట ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు వంటి తీసుకురాకుండా ట్రంప్ ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధంతో ప్రయాణికులకు తీవ్ర ఎఫెక్ట్ చూపనుంది. ఒక్క ప్రయాణికులకు మాత్రమే కాదు, ఇటు విమానయాన సంస్థలకు ఇది భారీ దెబ్బ కొట్టనుందట. భారీగా లాభాలు తగ్గిపోనున్నాయని, ముఖ్యంగా గల్ఫ్ క్యారియర్స్ బిజినెస్ క్లాస్ సెగ్మెంట్ల లాభదాయకత తగ్గిపోనుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి. టర్కీ రాజధాని ఇస్తాంబుల్, జోర్డాన్ లోని అమన్, కువైట్, ఈజిప్టు రాజధాని కైరో, మొరాకాలోని కసబ్లాంకా, ఖతార్ లోని దోహ, సౌదీలోని రియాద్, దుబాయి నుండి వచ్చే నాన్ స్టాప్ విమానాల్లో ఎలక్ట్రానిక్ వస్తువులపై నిషేధం విధిస్తూ వాషింగ్టన్ నిర్ణయం తీసుకుంది. ఇదే రకమైన ఆంక్షలను ఇటు బ్రిటన్ కూడా అమల్లోకి తేనున్నట్టు ప్రకటించింది. సెక్యురిటీ కారణాలతో విమానాల్లో ఎలక్ట్రిక్ వస్తువులపై నిషేధం విధిస్తున్నట్టు ఈ దేశాలు చెప్పాయి. కానీ ఇది విమానయాన సంస్థలకు షాకింగ్ న్యూసేనని పరిశ్రమ వర్గాలు చెప్పాయి. అమెరికాకు ఈ మార్గాలగుండా ట్రావెల్ చేసే ప్రయాణికులు ఇక నుంచి వేరే విమానాలకు మరలుతారని పేర్కొన్నారు. ఒక్క ప్రయాణికులను కోల్పోవడమే కాకుండా... లగేజీపై ఎక్కువగా ఫోకస్ చేసి తనిఖీలు పెంచడం సంస్థల వ్యయాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. అదనపు సమయం లగేజీ తనిఖీకే వాడటం ప్రయాణికుల్లో చిరాకును తెంపిస్తుందని వారు తెలిపారు. ఇవన్నీ విమానసంస్థలకు ప్రతికూలంగా మారి, లాభాలకు గండికొట్టనున్నాయని పేర్కొన్నారు. గల్ఫ్ దేశాల నుంచి అమెరికాకు వెళ్లే బిజినెస్ వ్యక్తులు ఎక్కువగా ఆన్ బోర్డులోనే వర్క్ చేసుకుంటుంటారు. కానీ ప్రస్తుతం వారికి ఈ అవకాశం లేకుండా పోతుంది. -
ఎయిర్‌లైన్స్‌కు ఈ ఏడాది సూపర్!
ఇక్రా నివేదిక ముంబై: విమానయాన రంగానికి ప్రస్తుత ఆర్థిక సంత్సరం ఓ తీపి గుర్తుగా మిగిలిపోతుంది. ముడిచమురు ధరలు పెరుగుతున్నా దేశీ విమానయాన సంస్థలు 2016–17 ఆర్థిక సంవత్సరంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచటమే దీనిక్కారణం. ఈ ఏడాది విమాన ప్రయాణికుల్లో 22–23 శాతం వృద్ధి నమోదు కానున్నట్లు రేటింగ్ సంస్థ ‘ఇక్రా’ అంచనా వేసింది. ‘‘తక్కువ విమాన టికెట్ ధరల వల్ల ఎయిర్‌లైన్స్‌కు ప్రయాణికుల రద్దీ బాగుంది. కానీ ముడిచమురు ధరలు పెరుగుతుండటం వల్ల క్యూ4లో లాభదాయకతపై ప్రతికూల ప్రభావం ఉంటుంది’’ అని ఇక్రా నివేదిక పేర్కొంది. దీని ప్రకారం ఈ ఏడాది 10 నెలల్లో విమానయాన స్థితిగతులను ఒకసారి చూస్తే.. ⇔ ప్యాసెంజర్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్) 84.4 శాతంగా నమోదయ్యింది. అంటే ప్రపంచంలోని పలు ప్రధాన మార్కెట్ల కన్నా మనం మంచి వృద్ధిని సాధిస్తున్నాం. ఈ ఏడాది జనవరిలో పీఎల్ఎఫ్ 88.3 శాతంగా ఉంది. ⇔ వార్షిక ప్రాతిపదికన విమాన ప్రయాణికుల వృద్ది 23.2 శాతంగా ఉంది. గత ఐదేళ్లుగా దేశీ విమాన ప్రయాణికుల వృద్ధి 12.9%, 5.3%, 4.6%, 15.5%, 22.1 శాతంగా నమోదవుతూ వచ్చింది. ఈ సారి వృద్ధి ఈ గణాంకాలను అధిగమించొచ్చు. అంటే ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతోన్న దేశీ మార్కెట్‌గా భారత్ ఆవిర్భవించనుంది. కాగా జనవరిలో దేశీ విమాన ప్రయాణికుల వృద్ధి 25.3%, అంతర్జాతీయ విమాన ప్రయాణికుల వృద్ధి 8.8 శాతంగా నమోదయ్యింది. -
నోట్ల రద్దు : కుప్పకూలిన విమానయానం
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు ప్రభావం అన్ని రంగాలపై భారీగా ఎఫెక్ట్ చూపుతోంది. ఈ ప్రభావంతో జోరుమీదున్న విమానరంగం ఒక్కసారిగా కుప్పకూలింది. టిక్కెట్ బుకింగ్స్ లేక సీట్లను ఖాళీగా ఉండిపోతున్నాయి. ప్రయాణాలకు ఇది అత్యంత కీలకమైన సమయం కావడంతో ఖాళీగా ఉన్న సీట్లను నింపుకోవడానికి విమానయాన సంస్థలు స్పెషల్ స్కీమ్స్‌ను ఆఫర్ చేస్తున్నాయి. మంగళవారం రాత్రి ప్రధాని మోదీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దు హఠాత్తు పరిణామంతో ఇటు దేశీయంగానే కాక, అంతర్జాతీయ విమాన టిక్కెట్ల బుకింగ్ భారీగా దెబ్బతిన్నాయని విమానయాన సంస్థలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. లోకాస్ట్ ఎయిర్‌లైన్ పేరున్న సింగపూర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన స్కూట్ సంస్థకు ఐలాండ్ నుంచి ఇండియాలోని జైపూర్, అమృత్సర్, చైన్నై ప్రాంతాలకు ఒక్కరోజు నమోదయ్యే బుకింగ్స్ 10 శాతం పడిపోయినట్టు ఆ సంస్థ భారత అధినేత భరత్ మహాదేవన్ తెలిపారు. మంగళవారం అనంతరం తమ విమానయాన సంస్థకు ఈ పరిణామం చోటుచేసుకున్నట్టు పేర్కొన్నారు. సింగపూర్ ఎయిర్‌లైన్‌కు చెందిన మరో బడ్జెట్ ఎయిర్‌లైన్ టైగర్ కూడా భారత్ నుంచి నమోదయ్యే టిక్కెట్ల బుకింగ్స్ ఒక్కరోజుకు 10 శాతం పడిపోయాయని తెలిసింది. ఫిబ్రవరి నుంచి ప్రమోషనల్ రేట్లను ఆఫర్ చేయాలని తాము భావిస్తున్నామని, కానీ నోట్ల రద్దు ఎఫెక్ట్‌తో ట్రావెల్ డిమాండ్ దారుణంగా పతనమైందని పేర్కొంది. దీంతో డిసెంబర్ నుంచే ఈ ఆఫర్లు ప్రారంభిస్తామని మహదేవన్ చెప్పారు. పెద్ద నోట్ల రద్దుతో విదేశీలకు ప్రయాణించే వారి లగ్జరీ ట్రావెల్ డిమాండ్ తగ్గినట్టు ఇంటర్నేషనల్ ట్రావెల్ పోర్టల్ తెలిపింది. చిన్న పట్టణాల్లో నివసించే వారు నగదు రూపంలోనే టిక్కెట్ చెల్లింపులు చేస్తారని, ప్రస్తుతం అది వీలుపడటం లేదని అధికారులు పేర్కొన్నారు. -
పాత నోట్ల మార్పిడిలో హైటెక్ మాయాజాలం
న్యూ ఢిల్లీ: పాత రూ.500, రూ.1000 నోట్లను మార్పిడి చేయడానికి నల్లకుబేరులు అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులు కోవడం లేదు. దేశంలో విచ్చలవిడిగా కొనసాగుతోన్న అవినీతిని రూపుమాపే క్రమంలో భాగంగా మంగళవారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ అప్పటి వరకూ మనుగడలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రజలు ఇబ్బంది పడకూడదని 72 గంటలపాటూ(నవంబర్11 రాత్రి 12 వరకు) కొన్ని సడలింపులను ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వాసుపత్రులు, రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్లు, ప్రభుత్వ బస్సులు, విమానాశ్రయాల్లోని ఎయిర్ లైన్స్ కౌంటర్లలో, ప్రభుత్వ రంగ సంస్థల అధీనంలో నడిచే పెట్రోల్, డీజిల్, గ్యాస్ స్టేషన్లలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో నడిచే సహకార కేంద్రాలు, పాల కేంద్రాల్లో.. శ్మశానాల్లోనూ 500, 1,000 నోట్లను స్వీకరించే వెసులుబాటు కల్పించారు. ఈ నిబంధనను కొందరు నల్లకుబేరులు చాకచక్యంగా తమ దగ్గరున్న నల్లధనమార్పిడికి వాడాలనుకున్నారు. ముందుగా పెద్ద మొత్తంలో ధరలుండే టికెట్లను బుక్ చేసుకోవడం తర్వాత క్యాన్సల్ చేయగడంతో నల్లధనం సునాయాసంగా మార్చవచ్చని భావించారు. అయితే ఎంతో పకడ్బందీగా అవినీతి జాడ్యాలను కూకటివేళ్లతో పెకిలించేలా చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం ఈ ఘరానా మోసాన్ని ఆదిలోనే పసిగట్టింది. పాత నోట్లతో టికెట్లను బుక్ చేసుకున్న వారి టికెట్లను క్యాన్సల్ చేయొద్దని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. కౌంటర్ దగ్గర ఎవరైతే పాత 500, 1000 రూపాయల నోట్లతో టికెట్లను బుక్ చేసుకొని క్యాన్సల్ కోసం తిరిగి రిక్వెస్ట్ పెట్టుకుంటారో వారి టికెట్లను రద్దు చేయడం లేదా తమ టికెట్ రుసుమును తిరిగి రిఫండ్ చేయడం సాధ్యంకాదని అన్ని ఎయిర్స్ లైన్స్‌కు డీజీసీఏ ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. పెద్ద నోట్లను ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత కౌంటర్లలో టికెట్ల బుకింగ్ ఒక్కసారిగా పెరిగిపోయిందని ఎయిర్‌లైన్స్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సాధారణంగా రోజుకు 20 నుంచి 25 లక్షల రూపాయలు కౌంటర్ బుకింగ్ ద్వారా వచ్చేవని కానీ, 500, 1000రూపాయల నోట్ల రద్దు నిర్ణయం తర్వాత కౌంటర్లలో రోజుకు కోటిరూపాయల వరకు టికెట్లు బుక్ చేసుకుంటున్నారని అంటే సాధారణం కంటే ఇది దాదాపు నాలుగు రెట్లు అని స్పైస్ జెట్ అధికార ప్రతినిధి అజయ్ జస్రా తెలిపారు. అధికారికంగా ప్రభుత్వంగానీ, డీజీసీఏ నుంచి ఎలాంటి ప్రకటన రానప్పటికీ, రెండు రోజుల నుంచి ఎవరైతే కౌంటర్ల దగ్గర పాత 500, 1000రూపాయలతో టికెట్లను కొనుగోలు చేసి క్యాన్సల్ చేసుకుంటారో వారి టికెట్ రుసుము తిరిగి ఇవ్వబోమని ఇప్పటికే కొన్ని ఎయిర్ లైన్స్ ప్రకటించాయి. విమానయాన సంస్థ విస్టారా గత రెండు రోజుల నుంచి పాత రద్దు చేసిన నోట్లతో బుక్ చేసుకున్న టికెట్లను క్యాన్సల్ చేసుకుంటే వాటికి రుసుము రిఫండ్ చేయడం సాధ్యంకాదని ట్విట్టర్లో పేర్కొంది. టాటా, సింగపూర్ ఎయిర్ లైన్స్ సంయుక్తంగా విస్టారాను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. -
అదృశ్యమైన ఆ విమానం చివరిక్షణాల్లో..!
-
కరాచీ టు సిటీ వయా షార్జా!
- అంతర్జాతీయ నకిలీ కరెన్సీ ముఠా గుట్టురట్టు - ముగ్గురు నిందితుల అరెస్టు, రూ. 9 లక్షలు సీజ్ - తొలిసారిగా వెలుగులోకి విమానమార్గ రవాణా సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ నకిలీ కరెన్సీ ముఠా గుట్టు రట్టు అయింది. పాకిస్తాన్లో ముద్రితమైన నకిలీ కరెన్సీని కరాచీ నుంచి షార్జా మీదుగా హైదరాబాద్ తీసుకువచ్చిన అంతర్జాతీయ ముఠా గుట్టును హైదరాబాద్ ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేసి రూ.9 లక్షల నకిలీనోట్లు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ బి.లింబారెడ్డి బుధవారం వెల్లడించారు. వీరి అరెస్టుతో నకిలీ నోట్లు విమానాల ద్వారా హైదరాబాద్‌కు వస్తున్న విషయం వెలుగులోకి వచ్చిందన్నారు. హైదరాబాద్‌లోని మొఘల్‌పుర ప్రాంతానికి చెందిన మహ్మద్ అఖీల్ మార్ఫానీ గతంలో సౌదీ, షార్జాల్లో కార్పెంటర్‌గా పనిచేశాడు. ఇటీవల అనారోగ్యం కారణంగా షార్జా నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చేయాలనుకున్నాడు. కరాచీలో ఉంటున్న తన మేనమామ యాసీన్‌కు ఇదే విషయాన్ని ఫోన్ ద్వారా చెప్పాడు. పాకిస్తాన్లో ముద్రితమయ్యే భారత నకిలీ నోట్లను మార్పిడి చేస్తే మంచి లాభాలు ఉంటాయని ‘సలహా’ ఇచ్చాడు. తన ఏజెంట్ ద్వారా రూ.వెయ్యి, రూ.500 డినామినేషన్లో ఉన్న రూ.9 లక్షల నకిలీ కరెన్సీని కరాచీ నుంచి షార్జాకు పంపుతానన్నాడు. ఆ నగదును హైదరాబాద్ తీసుకువెళ్ళి చెలామణీ చేయాలని, తన వాటాగా రూ.3 లక్షలు ఇస్తే చాలని మార్ఫానీతో చెప్పాడు. దీనికి మార్ఫానీ అంగీకరించడంతో దుబాయ్‌లోని డేరా ప్రాంతంలో ఉన్న ఏజెంట్ ద్వారా యాసీన్ నకిలీ నోట్లు అందించాడు. ఈ నోట్లను ఓ బ్యాగ్ అడుగు భాగంగా నేర్పుగా పేర్చిన మార్ఫానీ దాన్ని తీసుకుని ఈ నెల 3న స్పైస్ జెట్ విమానంలో హైదరాబాద్ వచ్చాడు. గుర్తించని కస్టమ్స్ అధికారులు... ప్రయాణం నేపథ్యంలో నకిలీ కరెన్సీ ఉన్న బ్యాగ్‌ను లగేజ్‌లో వేసి తీసుకువచ్చాడు. దీన్ని ఏ దశలోనూ కస్టమ్స్ అధికారులు గుర్తించకపోవడంతో నకిలీ నోట్ల బ్యాగ్‌ను మార్ఫానీ శంషాబాద్ విమానాశ్రయం నుంచి తన ఇంటికి తీసుకువెళ్ళాడు. కొన్ని రోజులపాటు రహస్య ప్రదేశంలో దాచి మార్పిడి కోసం తన స్నేహితులైన ఘియాస్ మోహియుద్దీన్ (హుస్సేనిఆలం), మహ్మద్ తౌఫీఖ్ అహ్మద్ (సంగారెడ్డి) సహాయం తీసుకోవాలని నిర్ణయించాడు. వాటాలు ఇస్తానని చెప్పడంతో వీరిద్దరూ ముందుకు వచ్చారు. ఈ ముగ్గురూ కలసి నకిలీ నోట్లను మార్పిడి చేసే యత్నాల్లో ఉన్నారనే సమాచారం నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు అందింది. అప్రమత్తమైన ఇన్స్పెక్టర్ పి.బల్వంతయ్య, ఎస్సైలు పి.చంద్రశేఖర్‌రెడ్డి, బి.శ్రవణ్ కుమార్, కేఎస్ రవి తమ బృందాలతో వలపన్ని ముగ్గురినీ పట్టుకున్నారు. కేసును మహంకాళి పోలీసులకు అప్పగించామని, కరాచీలో ఉన్న యాసీన్ కోసం లుక్ ఔట్ సర్క్యులర్ జారీ చేస్తామని డీసీపీ తెలిపారు. -
విమానాల్లో వైఫై వాడొచ్చు
- కాల్స్‌కూ అవకాశం - వచ్చే నెల నుంచి ప్రారంభం - తుది ఆమోదమే తరువాయి న్యూ ఢిల్లీ : విమానాల్లో సెల్‌ఫోన్ సేవలకు లైన్ క్లియర్ అవనుంది. రానున్న పది రోజుల్లో ఈ దిశగా సానుకూల నిర్ణయం వెలువడనుందని పౌర విమానయాన శాఖ కార్యదర్శి ఆర్ఎన్ చౌబే తెలిపారు. విమానాల్లో వైఫై అనుమతించే అంశంపై పౌర విమానయాన, టెలికం, హోం శాఖలు దృష్టి సారించాయని ఆయన చెప్పారు. ఇందుకు కేబినెట్ అనుమతి అవసరం పడకపోవచ్చన్నారు. డేటా వినియోగానికి అనుమతించినప్పుడు కాల్స్ చేసుకునేందుకు కూడా అనుమతి లభించవచ్చన్నారు. విమానాల్లో వైఫై సేవలు అనుమతించే ప్రతిపాదన కేంద్ర ముందు ఎప్పటి నుంచో ఉంది. భద్రతాపరమైన అంశాల దృష్ట్యా దీనిపై ఇంతవరకు ఓ నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో డేటా, కాల్స్‌ను భద్రతా సంస్థలు పర్యవేక్షించడం వంటి అంశాలపై చర్చ జరిగిందని చౌబే వెల్లడించారు. అవసరమైతే భద్రతా సంస్థలు వివరాలు పొందవచ్చని, ట్రాక్ కూడా చేయవచ్చని చెప్పారు. ప్రస్తుతం దేశీయంగా అన్ని విమానాల్లోనూ వైఫై సర్వీసులను అనుమతించడం లేదు. కానీ, ప్రపంచ వ్యాప్తంగా చాలా ఎయిర్‌లైన్స్ సంస్థలు తమ ప్రయాణికులకు వైఫై సేవలు అందిస్తున్నాయి.అయితే, భారత గగనతలంలోకి ప్రవేశించగానే ఆ సేవలను నిలిపివేస్తున్నాయి. ఇవి తొలుత కొంత సమయం పాటు ఉచితంగా వైఫై అందిస్తూ... ఆ పై వినియోగానికి చార్జీలు వసూలు చేస్తున్నాయి. అయితే, దేశీయంగానూ వైఫై సేవలకు అనుమతి లభిస్తే... ఎయిర్‌లైన్ సంస్థలకు అదనపు ఆదాయం సమకూరనుంది. అయితే, ఈ సేవలు అందించడం తప్పనిసరి కాబోదు. ఆయా సంస్థల ఇష్టంపైనే ఆధారపడి ఉంటుంది. -
ఏవియేషన్ శాఖ సరికొత్త నిర్ణయం
న్యూఢిల్లీ :విమానప్రయాణికుల సమస్యల సత్వర పరిష్కార దిశగా ఏవియేషన్ మంత్రిత్వశాఖ అడుగులు వేస్తోంది. విమానసంస్థలకు వ్యతిరేకంగా ప్రయాణికులు తమ ఫిర్యాదులను దాఖలు చేసేందుకు వీలుగా ఓ వెబ్‌సైట్‌ను లాంచ్ చేయాలని ఏవియేషన్ మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఆ ఫిర్యాదులను విమానసంస్థలకు పంపించి, సత్వరమే సమస్య పరిష్కారం అయ్యేలా ఆ వెబ్‌సైట్‌ను రూపొందించనున్నారు. ఏవియేషన్ సహాయ మంత్రి జయంత్ సిన్హా ఆలోచన మేరకు ఈ ప్లాట్‌ఫాంను ఏర్పాటుచేయనున్నట్టు ఆ మంత్రిత్వశాఖ తెలిపింది. విమానయానం చేసేటప్పుడు ఏదైన సమస్య ఎదురై మనోవేదనకు గురైనప్పుడు.. ఆ సమస్యను విమానసంస్థలకు తెలియజేయడానికి ఇప్పటివరకు సరియైన ప్లాట్ ఫామే లేదు. ఈ నేపథ్యంలో ఏవియేషన్ మంత్రిత్వశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఏవియేషన్ మంత్రిత్వ శాఖ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్లోని సభ్యులు ఈ ప్లాట్‌ఫాంను నిర్వహించనున్నట్టు సీనియర్ అధికారులు చెబుతున్నారు. అయితే ఇంకా ఎవరన్నది తెలియరాలేదు. సోషల్ మీడియా లాంటి వివిధ సమాచార మాధ్యమాల ద్వారా విమానసంస్థలకు ఫిర్యాదులను అందిస్తున్న ప్రయాణికులకు, ఈ వెబ్సైట్ సమస్యల సత్వర పరిష్కారానికి ఓ ప్లాట్ఫామ్లాగా దోహదం చేయనుంది. ప్రయాణికులు ఫిర్యాదును విమానసంస్థలకు తెలియజేయాలనుకున్నప్పుడు.. ప్రయాణికుల ఏవియేషన్ అందించే ఆ వెబ్సైట్లోకి లాగిన్ అయి, ఫిర్యాదును నమోదుచేయాల్సి ఉంటుంది. అనంతరం ఆ ఫిర్యాదును విమానసంస్థకు పంపిస్తారు. నిబంధనలకు అనుగుణంగా ఫిర్యాదును విమానసంస్థలు పరిష్కరిస్తాయి. ఏవియేషన్ మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని విమాన ప్రయాణికులు స్వాగతిస్తున్నారు. అయితే ప్రయాణికులు సమస్యలు తెలియజేయడానికి తమ దగ్గర సిస్టమ్స్ ఉన్నాయని విమాన సంస్థలు అంటున్నాయి. సోషల్ మీడియా సైట్ల ద్వారా సమస్యలు తెలుసుకుని, ఫిర్యాదులను పరిష్కృతం చేస్తున్నామని ఓ ఎయిర్‌లైన్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. దానికంటే ఎక్కువగా సమస్యల పరిష్కారానికి ఈ వెబ్సైట్ దోహదం చేయగలదా అని ప్రశ్నిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటుచేయడం అద్భుతమైన అడుగని ఎయిర్ ప్యాసెంజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి తెలిపారు. -
విమాన ప్రయాణికులకు భారీ ఊరట
-
విమాన ప్రయాణికులకు భారీ ఊరట
న్యూఢిల్లీ: త్వరలోనే అమల్లోకి రానున్న ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ కొత్త నిబంధనలు దేశీయ విమాన యాన సంస్థలకు కొత్త కష్టాలను తెచ్చిపెడుతుండగా విమాన ప్రయాణికులకు భారీ పరిహారం కోసం లభించనుంది. ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త పాలసీలో ప్రయాణికుల లగేజీ ఛార్జీలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న మంత్రిత్వ శాఖ ఒకవేళ విమానం క్యాన్సిల్ అయితే టికెట్ ధరతో పాటు అదనపు పన్నుల రూపంలో వసూలు చేసే ఛార్జీలు కూడా చెల్లించాలని చెప్పింది. ఇకపై విమానం ఆలస్యమైనా....రద్దయినా ఆయా విమానయాన సంస్థ సదరు ప్రయాణికులకు భారీ పరిహారం చెల్లించాల్సి వస్తుంది. రెండుగంటల లోపు విమానం రద్దయితే 10వేల రూపాయలు చెల్లించాలి. దీంతోపాటుగా 24 గంటల లోపు వేరే విమానాన్ని సమకూర్చలేకపోతే మరో రూ.20వేలు పరిహారం చెల్లించాల్సిందేనని విమానాయాన మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. టికెట్ క్యాన్సిల్ అయితే అదనపు పన్నులతో సహా చార్జీలను ప్రయాణికులకు రీఫండ్ చేయాలని చెప్పింది.ఈ రీఫండ్ కూడా దేశీయ ప్రయాణాలకైతే 15 రోజుల్లోగా, అంతర్జాతీయంగా అయితే 30 రోజుల్లోగా చెల్లించాలని స్పష్టం చేసింది. అయితే ఈచెల్లింపుల ప్రక్రియలో ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయనీ, వాటిపై దృష్టి పెట్టాల్సిన అవసరం వుందని ఎయిర్ పాసింజర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు డి. సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ విధానం పారదర్శకంగా లేదనీ, కొన్ని అంశాలపై తమకు తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయన్నారు. నిజాలను నిర్ధారించిన బాధ్యత ఆయా విమాన సంస్థలపై పెట్టడం ఆమోదయోగ్యం కాదని తెలిపారు. కాగా ఇటీవల విమానాయాన మంత్రిత్వ శాఖ ఆమోదించిన కొత్త విధానం విమాన ప్రయాణికులకు శుభవార్త అందించింది. లగేజీ చార్జీల తగ్గింపు తోపాటు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. -
భారత్‌లో వ్యాపారం కష్టమే..: ఎయిర్ ఏషియా
కానీ ఇక్కడి మార్కెట్లో కొనసాగుతామని స్పష్టీకరణ న్యూఢిలీ: భారత్‌లో అనుసరించే రక్షణాత్మక ఆర్థిక విధానాలు, స్వార్థ ప్రయోజనాల కారణంగా ఇక్కడి మార్కెట్లో వ్యాపార నిర్వహణ కష్టతరమని మలేసియన్ ఎయిర్‌లైన్ సంస్థ ఎయిర్ ఏషియా చీఫ్ టోనీ ఫెర్నాండెజ్ తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. ఈ విధమైన విధానాలను విడిచిపెట్టేందుకు మోదీ సర్కారు ధైర్యంగా ముందుకు వెళ్లాల్సి ఉందన్నారు. టాటాలతో తమ భాగస్వామ్య సంస్థ ‘ఎయిర్ ఏషియా ఇండియా’ ప్రధానంగా దూర ప్రాంత సర్వీసుల కోసం ఉద్దేశించినదిగా చెప్పారు. ఎయిర్ ఏషియా ఇండియా దూకుడుగా వెళ్లకుండా వృద్ధి వైపు నిదానంగా అడుగులు వేస్తున్న తీరుపై మాట్లాడుతూ... ఇక్కడి విమానయాన రంగం సుదీర్ఘ పరుగు పందెం వంటిందన్నారు. విజయ్‌మాల్యా వలే తుఫాను వేగంతో వెళ్లి సమస్యల్లో చిక్కుకోవాలని లేదని ‘కింగ్‌ఫిషర్స్ ఎయిర్‌లైన్స్’ ఉదంతాన్ని పరోక్షంగా గుర్తు చేశారు. ఇంతకుముందు విమానయాన పాలసీపై స్పష్టత లేదని, అందుకే తాము విస్తరణ విషయంలో ఆచితూచి అడుగులు వేశామని వివరించారు. ఇకపై తాము ఏం చేయాలన్న దానిపై స్పష్టతతో ఉన్నామని ఫెర్నాండెజ్ చెప్పారు. ఈ మేరకు టోనీ ఫెర్నాండెజ్ కంపెనీ వృద్ధి ప్రణాళికలపై పీటీఐ సంస్థతో మాట్లాడారు. ఎయిర్‌లైన్స్‌ను కాపాడాల్సిన పనిలేదు.. విమానయాన రంగంలో భారత సర్కారు రక్షణాత్మక విధానాలను విమర్శించడానికి మాటలు చాలవన్న ఆయన... దేశీయ ఎయిర్‌లైన్ సంస్థలు అంతర్జాతీయ సర్వీసులను నడిపే విషయంలో నిబంధన (5/20)ను మార్చడంపై సంతోషం వ్యక్తం చేశారు. ‘మలేసియాలో 2 విమానాలతో సేవలు ప్రారంభిం చాం. అక్కడ 5/20 నిబంధన లేదు. కోర్టులతో పని పడలేదు. మా వెనుక నరేష్ గోయల్ లేడు. భారత్‌లో రెండేళ్లుగానే ఉన్నాం. ఓపిక పట్టాలి. కంగారొద్దు’ అని ఫెర్నాండెజ్ అన్నారు. ‘ఎయిర్‌లైన్ సంస్థలను కాపాడే ప్రయత్నం చేయవద్దు. మరిన్ని విమానయాన సర్వీసులకు వీలు కల్పించాలి. మరింత మంది పర్యాటకులు భారత్‌కు రావాలి. దీంతో మరిన్ని ఉద్యోగాల సృష్టి జరగాలి’ అని అభిప్రాయపడ్డారు. -
విమానయాన ఛార్జీలకు పరిమితి సరికాదు: అశోక గజపతి రాజు
న్యూఢిల్లీ: విమానయాన సంస్థలు దేవదూతలు కాకపోవచ్చని, కానీ రాక్షసులు ఎంత మాత్రం కాదని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక గజపతి రాజు అన్నారు. విమానయాన చార్జీలకు పరిమితి విధించడం సమస్యకు పరిష్కారం కాదని, అలా చేస్తే ప్రారంభ ధరలు పెరిగిపోతాయన్నారు. ధరలు భారీగా పెరగకుండా చూసేందుకు సులభమైన పరిష్కారం ఏదీ లేదని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఢిల్లీలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎయిర్‌లైన్స్ సంస్థలు అధిక చార్జీలను వసూలు చేస్తున్నాయన్న ఆందోళనల నేపథ్యంలో మంత్రి స్పందిస్తూ... సంక్షోభ సమయాల్లో ఎయిర్‌లైన్స్ సంస్థలు స్పందిస్తూనే ఉన్నాయన్నారు. చెన్నై, శ్రీనగర్ వరద సమయాల్లో ఎయిర్‌లైన్స్ సంస్థలు బాధ్యతగా వ్యవహరించి ధరలను అందుబాటులోనే ఉంచిన విషయాన్ని గుర్తు చేశారు. విమాన చార్జీలకు గరిష్ట పరిమితి విధించే ప్రతిపాదనను ప్రభుత్వం ఏమైనా పరిశీలిస్తోందా? అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ..ప్రభుత్వ ఉద్దేశ్యం సహేతుక ధరలు ఉంచేలా చూడడమేనని స్పష్టం చేశారు. -
విమానయానంలో కొత్త నిబంధనలు
న్యూఢిల్లీ : విమానయాన సంస్థలపై కేంద్రం కొరడా ఝళిపించింది. టికెట్ క్యాన్సిల్ చేసుకున్న వినియోగదారులను అధిక చార్జీలతో బాదేస్తున్న సంస్థలపై కేంద్రం స్పందించింది. విమాన ప్రయాణికులకు సానుకూలంగా నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనల ద్వారా విమాన టికెట్ క్యాన్సిలేషన్, లగేజి చార్జీలపై ఊరట కల్పించింది. టిక్కెట్ రద్దు చార్జీలు, పరిమిత లగేజి అనంతరం వసూలు చేస్తున్న ఛార్జీలపై కూడా కోత పెడుతూ విమాన సంస్థలకు కొత్త నిబంధనలు విధించింది. ఈ కొత్త నిబంధనలను విమానయాన శాఖా మంత్రి అశోక గజపతిరాజు మీడియా సమావేశంలో వెల్లడించారు. టికెట్ క్యాన్సిలేషన్ సమయంలో టిక్కెట్ బేస్ ధర కంటే రద్దు ఛార్జీలు అధికంగా ఉండకూడదని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అలాగే టికెట్ రద్దుచేసుకున్న 15 రోజుల్లోగా రిఫండ్ చేయాలని పేర్కొంది. నగదు వాపసు పొందవచ్చు లేదా ఆ మొత్తాన్ని తదుపరి ప్రయాణ అవసరాలకోసం క్రెడిట్ చేసుకునే నిర్ణయం ప్రయాణీకులదే.అన్నిరకాల పన్నులు, లెవీ, యూజర్ చార్జీలను తిరిగి చెల్లించాలని కోరింది. 15 కేజీల లగేజీ దాటితే అదనంగా ఐదు కేజీల వరరూ 100 రూ.కు మించి వసూలు చేయకూడదని కేంద్ర ఆదేశించింది. ఓవర్ బుకింగ్ అయిన పక్షంలో ప్రయాణీకుడికి 20 వేల రూపాయలను పరిహారంగా చెల్లించాలని తెలిపింది. 24 గంటల్లోపు విమానం రద్దయితే 10వేల పరిహారం చెల్లించాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అన్ లైన్ పోర్టల్స్, ఎయిర్ లైన్స్ ద్వారా బుక్ చేసుకున్నా ఈ నిబంధనలు వర్తిస్తాయని మంత్రి వెల్లడించారు. అలాగే ప్రమోషనల్, స్పెషల్ రేట్లలో కూడా ఇది వర్తిస్తుందని వెల్లడించారు. కాగాఇటీవల టిక్కెట్ రద్దు చార్జీలు బేస్ ధర కంటే ఎక్కువగా వసూలు చేసిన ఈ ఛార్జీలను వెంటనే కస్టమర్లకు చెల్లించాలని విమాన సంస్థలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. టిక్కెట్ ధర కంటే కూడా రద్దు ఛార్జీలే ఎక్కువగా ఉండటం వల్ల, టిక్కెట్ రద్దు చేసుకున్నప్పుడు ప్రయాణికులు నష్టపోతున్నారన్నారు. సర్వీసు పన్నులను, ఇతర ఎయిర్ పోర్టు ఛార్జీలను ప్రయాణికులు టిక్కెట్ ధరల్లోనే విమాన సంస్థలకు చెల్లిస్తుంటారని, టిక్కెట్ రద్దు చేసుకున్నప్పుడు వీటిని అసలు లెక్కలోకే తీసుకోవడంలేది, టికెట్ రద్దు చార్జీలు క్రమేపీ పెరుగుతూ పోతున్నాయని.. వీటిని అదుపులో ఉంచడానికి అథారిటీ ఈ చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ఇవి న్యాయసంబంధమైన విషయాలకు కిందకు వస్తాయని తెలిపారు. -
విమాన టిక్కెట్ రద్దు ఛార్జీలు తగ్గిస్తారా?
న్యూఢిల్లీ : విమాన సంస్థలు అధికంగా వసూలు చేస్తున్న టిక్కెట్ రద్దు ఛార్జీలపై భారత ఏమియేషన్ రెగ్యులేటరీ అథారిటీ దృష్టి సారించింది. టిక్కెట్ రద్దు చార్జీలను వెంటనే తగ్గించాలని ఆదేశించింది. టిక్కెట్ బేస్ ధర కంటే రద్దు ఛార్జీలు అధికంగా ఉండకూడదని విమాన సంస్థలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) వెల్లడించింది. బేస్ ధర కంటే ఎక్కువగా వసూలు చేసిన ఈ ఛార్జీలను వెంటనే కస్టమర్లకు చెల్లించాలని ఆదేశించింది. టిక్కెట్ ధర కంటే కూడా రద్దు ఛార్జీలే ఎక్కువగా ఉండటం వల్ల, టిక్కెట్ రద్దు చేసుకున్నప్పుడు ప్రయాణికులు ప్రయోజనం పొందడం లేదని ఏవియేషన్ మంత్రిత్వ శాఖ ఓ సీనియర్ అధికారి చెప్పారు. సర్వీసు పన్నులను, ఇతర ఎయిర్ పోర్టు ఛార్జీలను ప్రయాణికులు టిక్కెట్ ధరల్లోనే విమాన సంస్థలకు చెల్లిస్తుంటారని, టిక్కెట్ రద్దు చేసుకున్నప్పుడు వీటిని అసలు లెక్కలోకే తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ఇవి న్యాయసంబంధమైన విషయాలకు కిందకు వస్తాయని తెలిపారు. విమాన సంస్థలకు కొత్త నిబంధనలు తీసుకొస్తున్నామని, వీటి గురించి ఇప్పటికే విమానసంస్థలతో డీజీసీఏ చర్చిందని, త్వరలోనే వీటిని ప్రకటిస్తారని తెలిపారు. టిక్కెట్ రద్దు చార్జీలు క్రమేపీ పెరుగుతూ పోతున్నాయని.. వీటిని అదుపులో ఉంచడానికి అథారిటీ ఈ చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. జూన్ 7కి ఢిల్లీ-ముంబై మార్గానికి టిక్కెట్ బుక్ చేసుకుంటే, బేస్ ధర రూ.1,559 తో మొత్తం టిక్కెట్ ధర రూ.2,419గా ఉంటుంది. ఒకవేళ ప్రయాణికుడు టిక్కెట్ ను రద్దు చేసుకుంటే అతని పొందేది కేవలం రూ.404 మాత్రమే. విమాన సంస్థలు అధిక రెవెన్యూల కోసమే ఈ ఛార్జీలను పెంచుకుంటూ పోతున్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ఒకవేళ ఇదే మొత్తంలో టిక్కెట్ ధరలను పెంచితే, ఎక్కడ కస్టమర్లు కోల్పోతారో అని ఆందోళనతో, ఈ మార్గాన్ని ఎంచుకుంటాయని విశ్లేషకులు చెబుతున్నారు.