ఎయిర్‌లైన్స్ షేర్ల జోరు
స్టాక్ సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడుతున్నప్పటికీ, విమానయాన రంగ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా బోయింగ్‌విమానాలను కొనుగోలు ఒప్పంద వార్తలతో స్పైస్ జెట్ భారీగా లాభపడింది. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్(ఇండిగో), స్పైస్‌జెట్, జెట్ ఎయిర్‌వేస్ షేర్లు 1.3 శాతం నుంచి 2.5 శాతం రేంజ్‌లో లాభాలతో ట్రేడవుతున్నాయి.
దేశీయ ఎయిర్‌ట్రాఫిక్ గత నెలలో 17 శాతం పెరిగిందన్న వార్తల విమానయన రంగ షేర్ల జోరుకు కారణమని నిపుణులంటున్నారు. ఇంట్రాడేలో స్పైస్ జెట్, ఇండిగో రికార్డ్ స్థాయిలను నమోదు చేశాయి. స్పైస్‌జెట్‌కు జీవిత కాల గరిష్ట స్థాయిని, ఇండిగోకు ఏడాది గరిష్ట స్థాయిని తాకాయి.
ముందున్నది మంచి కాలమే...
ఇంధన వ్యయాలు తక్కువగా ఉండడం, జీఎస్టీ అమలు కారణంగా విమాన చార్జీలు తగ్గి మరింత మంది విమానయానం చేసే అవకాశాలు తదితర అంశాల కారణంగా విమానయాన రంగ షేర్లు జోరుగానే పెరుగుతాయని నిపుణులంటున్నారు.
పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ప్రభావం నుంచి విమానయాన రంగం బైటపడిందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అభిప్రాయపడింది. జూన్ క్వార్టర్లో ఈ రంగ కంపెనీల ఆర్థిక ఫలితాలు బాగా ఉంటాయని పేర్కొంది. వ్యయాలు తగ్గుతున్నందున ధరల విషయంలో విమానయాన కంపెనీలు క్రమశిక్షణ పాటిస్తే మార్జిన్లు పెరిగే అవకాశాలున్నాయని వివరించింది.