shines
-
ఫ్యాషన్ మ్యాగజీన్ వోగ్ (Vogue) కవర్ పేజీపై మెరిసిన నటి (ఫోటోలు)
-
మాల్దీవులు బీచ్‌లో హన్సిక అందాల హోయలు (ఫోటోలు)
-
హీరోయిన్లా మెరిసిపోతున్న టాప్ సింగర్.. ఎవరో గుర్తుపట్టారా..? (ఫోటోలు)
-
బంగారు కాంతుల మధ్య మెరిసిపోతున్న మెహరీన్ (ఫొటోలు)
-
Seerat Kapoor: ఎర్ర చీరలో రాణిలా వెలిగిపోతున్న హీరోయిన్ (ఫోటోలు)
-
నంబర్ 2
సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ అనే ట్యాగ్ ఇక ఆమెకు అవసరం లేదు. ఎందుకంటే ఆమె కథానాయికగా నటించిన ‘కేదార్నాథ్’ చిత్రం విడుదలైంది. సారా నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు సారా నంబర్ 2. ఒక్క సినిమా రిలీజైతేనే నంబర్ 2 ఏంటి? అని ఆశ్చర్యపోకండి. ఆమె నంబర్ 2గా నిలిచింది గూగుల్ సెర్చ్‌లో అన్నమాట. ఈ ఏడాది నెటిజన్లు అత్యధికంగా వెతికిన బాలీవుడ్ కథానాయికల్లో సారా నంబర్ టూ. ఫస్ట్ ప్లేస్‌లో ప్రియాంకా చోప్రా నిలిచారు. ఇక రణ్వీర్ సింగ్, సారా అలీఖాన్ జంటగా రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందిన ‘సింబా’ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. తెలుగు హిట్ ‘టెంపర్’కు ఇది హిందీ రీమేక్. -
దలాల్ స్ట్రీట్‌లో కొత్త రికార్డుల వర్షం
-
దలాల్ స్ట్రీట్‌లో కొత్త రికార్డుల వర్షం
ముంబై: దలాల్‌స్ట్రీట్‌లో కొత్త రికార్డుల వర్షం కురుస్తోంది. ఆసియా మార్కెట్ల మద్దతుతో దేశీయ స్టాక్ మార్కెట్లలోని ప్రధాన సూచీలు సెన్సెక్స్,నిఫ్టీ రెండూ ఎలాంటి వెనకడుగు లేకుండా బుల్‌రన్‌ను కొనసాగిస్తున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్ళ జోరుతో సెన్సెక్స్ 32609 వద్ద నిఫ్టీ ఆల్ టైంహైని నమోదు చేసింది. నిఫ్టీ 10,110 దాటేసింది. బ్యాంక్ నిఫ్టీ కూడా 25వేల మార్క్‌కు చేరువలో ఉంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ లైఫ్ హైని తాకింది. ఎల్ అండ్ టీ ఫైనాన్స్, హెచ్ సీఎల్ టెక్నాలసీజ్ హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, ఐసీఐసీఐ, ఎల్ అండ్‌టీ, ఐడియా, ఐటీసీ, మారుతీ సుజుకి, జీఎంఆర్, ఇండియా బుల్స్ రియల్, రాడికా ఖైతాన్, శ్రీరేణుకా లాభపడుతున్నాయి. అటు టెక్ మహీంద్రా, భారతి ఎయిర్టెల్, బోష్ నష్టాల్లో ఉన్నాయి. -
స్టాక్‌మార్కెట్ల దూకుడు: రికార్డుల మోత
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. దలాల్ స్ట్రీట్‌లో రికార్డుల మోత మోగుతోంది. గత కొన్నిసెషన్లుగా జోరుమీద ఉన్న సూచీలు చారిత్రక గరిష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ డబుల్ సెంచరీ సాధించి, నిఫ్టీ కూడా 9900 స్థాయికి సమీపంలో మెరుపులు మెరిపిస్తోంది. ఆరంభంనుంచి దూకుడును ప్రదర్శిస్తున్న సెన్సెక్స్ ప్రస్తుతం 210 పాయింట్లు ఎగిసి 32008వద్ద, నిఫ్టీ 62 పాయింట్ల లాభంతో 9877 వద్ద తమ జోరును కొనసాగిస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా కొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే కొనసాగుతున్నాయి. ఎఫ్ఎంసీజీ, మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్ల లాభాల దౌడు తీస్తున్నాయి. ఐటీసీ టాప్ విన్నర్‌గా ఉంది. -
ఎయిర్‌లైన్స్ షేర్ల జోరు
స్టాక్ సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడుతున్నప్పటికీ, విమానయాన రంగ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా బోయింగ్విమానాలను కొనుగోలు ఒప్పంద వార్తలతో స్పైస్ జెట్ భారీగా లాభపడింది. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్(ఇండిగో), స్పైస్‌జెట్, జెట్ ఎయిర్వేస్ షేర్లు 1.3 శాతం నుంచి 2.5 శాతం రేంజ్లో లాభాలతో ట్రేడవుతున్నాయి. దేశీయ ఎయిర్‌ట్రాఫిక్ గత నెలలో 17 శాతం పెరిగిందన్న వార్తల విమానయన రంగ షేర్ల జోరుకు కారణమని నిపుణులంటున్నారు. ఇంట్రాడేలో స్పైస్ జెట్, ఇండిగో రికార్డ్ స్థాయిలను నమోదు చేశాయి. స్పైస్‌జెట్‌కు జీవిత కాల గరిష్ట స్థాయిని, ఇండిగోకు ఏడాది గరిష్ట స్థాయిని తాకాయి. ముందున్నది మంచి కాలమే... ఇంధన వ్యయాలు తక్కువగా ఉండడం, జీఎస్టీ అమలు కారణంగా విమాన చార్జీలు తగ్గి మరింత మంది విమానయానం చేసే అవకాశాలు తదితర అంశాల కారణంగా విమానయాన రంగ షేర్లు జోరుగానే పెరుగుతాయని నిపుణులంటున్నారు. పెద్ద కరెన్సీ నోట్ల రద్దు ప్రభావం నుంచి విమానయాన రంగం బైటపడిందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అభిప్రాయపడింది. జూన్ క్వార్టర్లో ఈ రంగ కంపెనీల ఆర్థిక ఫలితాలు బాగా ఉంటాయని పేర్కొంది. వ్యయాలు తగ్గుతున్నందున ధరల విషయంలో విమానయాన కంపెనీలు క్రమశిక్షణ పాటిస్తే మార్జిన్లు పెరిగే అవకాశాలున్నాయని వివరించింది. -
పీవీఆర్‌కు బాహుబలి-2 కిక్.. సీఈవో ఏమన్నారు?
ముంబై: భారతీయ సినిమాలో బ్లాక్ బస్టర్ మూవీగా చరిత్ర సృష్టించనున్నబాహుబలి -2 స్టాక్ మార్కెట్లో కూడా మెరుపులు మెరిపిస్తోంది. ముఖ్యంగా మల్టీప్లెక్స్ నిర్వాహక సంస్థలు పీవీఆర్, ముక్తా ఆర్ట్స్ కౌంటర్లకు బాహుబలి విజయం మాంచి కిక్ ఇచ్చింది. మదుపర్ల కొనుగోళ్లతో ఈ షేర్లు కళకళలాడుతున్నాయి. ప్రధానంగా ముక్తా ఏ2 సినిమాస్ పేరుతో ముక్తా ఆర్ట్స్ మల్లీప్లెక్స్‌లను నిర్వహిస్తున్న ముక్తా ఆర్ట్స్ ఏకంగా 6.3 శాతం ఎగిసింది. మరో మల్టీప్లెక్స్ దిగ్గజ సంస్థ పీవీఆర్ షేరు 1.7 శాతం జంప్ చేసింది. సినిమా టికెట్లు, ఆహారం, పానీయాలు(ఫుడ్ అండ్ బెవరేజెస్) విక్రయాల ద్వారా ఆదాయం పెరుగుతుందన్న అంచనాలు ఈ కౌంటర్లలో జోష్ పెంచినట్టు నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా భారీసంఖ్యలో 9వేల స్క్రీన్లలో రిలీజ్ అయిన బాహుబలి-2 రికార్డులు సృష్టించడం ఖాయమని పీవీఆర్ పిక్చర్స్ సీఈవో కమల్ జ్ఞాన్‌చందానీ అభిప్రాయపడ్డారు. తాను వ్యక్తిగతంగా దర్శకుడు రాజమౌళికి పెద్ద ఫ్యాన్ అని చెప్పారు. స్పెషల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయినీ, ఇంతకముందెన్నడూ చూడలేదని, నమ్మశక్యం కానంత అమోఘంగా ఉన్నాయని కొనియాడారు. బాహుమలి-2కి అనూహ్యమైన స్పందన వస్తోందని.. కలెక్షన్లు ఇప్పుడే అంచనావేయడం కష్టమని కమల్ తెలిపారు. అమెరికాలో దాదాపు 30 లక్షల ముందస్తు టికెట్లు అమ్ముడుబోయినట్టు చెప్పారు. దంగల్ను మించి రికార్డులు సృష్టిస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. అటు బాహుబలి ట్విట్టర్ పేజీ ఇప్పటికే 2,లక్షల 45 వేలకు పైగా ఫాలోవర్లను దాటేసింది. -
రూపాయికి పాలసీ రివ్యూ జోష్!
ముంబై: ఆర్బీఐ పాలసీ రివ్యూ అంచనాల నేపథ్యంలో దేశీయ కరెన్సీ బాగా పుంజుకుంది. కీలక వడ్డీరేట్టు తగ్గనున్నాయనే అంచనాలతో 36పైసలు పైకి ఎగబాకింది. డాలర్ మారకపువిలువలో రూపాయి రూ. 68 స్థాయి నుంచి పుంజుకుంది. బుధవారం ఆరంభంలో 12 పైసల లాభంతో రూ. 67.78 స్థాయిని నమోదు చేసింది. ప్రస్తుతం 8 పైసల లాభంతో రూ. 67.82 వద్ద కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం తర్వాత అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్ లో డాలర్ కు బాగా డిమాండ్ పుట్టింది. దీంతో ప్రపంచ కరెన్సీలు పతనమయ్యాయి. దీంతో రూపాయి కూడా రూ.68 దిగువకు పతనమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన డీమానిటైజేషన్ తర్వాత మొదటి సారి ఆర్ బీఐ ఆధ్వర్యంలోని ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ రెండురోజులు సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈరోజు (బుధవారం) సమీక్ష విధానాన్ని ప్రకటించనున్నారు. 0.25 -0.50 బేసిస్ పాయింట్లను తగ్గించే అవకాశం ఉందని మార్కెట్ల వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ఆరేళ్ల కనిష్టానికి కీలక వడ్డీరేట్లు చేరనున్నాయని భావిస్తున్నారు. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు మరోసారి బలహీనపడ్డాయి. ఒపెక్ దేశాలు ఉత్పత్తిలో కోత విధించడం ద్వారా ధరలకు బూస్ట్‌నివ్వాలని భావించినప్పటికీ ట్రేడర్లు చమురు ఫ్యూచర్స్‌లో అమ్మకాలు కొనసాగిస్తుండటంతో చమురు ధరలు క్షీణిస్తున్నాయి. ఏఏ దేశాలు ఎంతమేర ఉత్పత్తిలో కోత పెట్టేదీ స్పష్టతలేదని, ఒప్పందానికి ఎన్ని దేశాలు కట్టుబడేదీ కూడా అనుమానమేనని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అటు స్వదేశీ, విదేశీ మార్కెట్లో బంగారం ధరలు కూడా బలహీనంగానే కదులుతున్నాయి. -
టాలీవుడ్ లో మళ్లీ తెలుగమ్మాయిల జోష్