
స్టాక్‌మార్కెట్ల దూకుడు: రికార్డుల మోత
ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. దలాల్ స్ట్రీట్‌లో రికార్డుల మోత మోగుతోంది. గత కొన్నిసెషన్లుగా జోరుమీద ఉన్న సూచీలు చారిత్రక గరిష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ డబుల్ సెంచరీ సాధించి, నిఫ్టీ కూడా 9900 స్థాయికి సమీపంలో మెరుపులు మెరిపిస్తోంది.
ఆరంభంనుంచి దూకుడును ప్రదర్శిస్తున్న సెన్సెక్స్ ప్రస్తుతం 210 పాయింట్లు ఎగిసి 32008వద్ద, నిఫ్టీ 62 పాయింట్ల లాభంతో 9877 వద్ద తమ జోరును కొనసాగిస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ కూడా కొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే కొనసాగుతున్నాయి. ఎఫ్‌ఎంసీజీ, మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ షేర్ల లాభాల దౌడు తీస్తున్నాయి. ఐటీసీ టాప్ విన్నర్‌గా ఉంది.