
దలాల్ స్ట్రీట్‌లో కొత్త రికార్డుల వర్షం
ముంబై: దలాల్‌స్ట్రీట్‌లో కొత్త రికార్డుల వర్షం కురుస్తోంది. ఆసియా మార్కెట్ల మద్దతుతో దేశీయ స్టాక్ మార్కెట్లలోని ప్రధాన సూచీలు సెన్సెక్స్,నిఫ్టీ రెండూ ఎలాంటి వెనకడుగు లేకుండా బుల్‌రన్‌ను కొనసాగిస్తున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్ళ జోరుతో సెన్సెక్స్ 32609 వద్ద నిఫ్టీ ఆల్ టైంహైని నమోదు చేసింది. నిఫ్టీ 10,110 దాటేసింది. బ్యాంక్ నిఫ్టీ కూడా 25వేల మార్క్‌కు చేరువలో ఉంది.
మిడ్ క్యాప్ ఇండెక్స్ లైఫ్ హైని తాకింది. ఎల్ అండ్ టీ ఫైనాన్స్, హెచ్ సీఎల్ టెక్నాలసీజ్ హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్, ఐసీఐసీఐ, ఎల్ అండ్‌టీ, ఐడియా, ఐటీసీ, మారుతీ సుజుకి, జీఎంఆర్, ఇండియా బుల్స్ రియల్, రాడికా ఖైతాన్, శ్రీరేణుకా లాభపడుతున్నాయి. అటు టెక్ మహీంద్రా, భారతి ఎయిర్‌టెల్, బోష్ నష్టాల్లో ఉన్నాయి.