ఆరంభంలో ఎయిర్ ఇండియా విమానం
జంషెడ్‌జీ టాటా స్థాపించిన ఎయిర్ ఇండియాను భారత ప్రభుత్వం జాతీయం చేసింది. కొంత కాలం బాగానే నడిచినా చివరకు రాజకీయ జోక్యం పెరిగిపోవడం, నిర్వహణ లోపాల కారణంగా నష్టాల పాలైంది. అప్పుల కుప్పగా మారిన ఎయిరిండియాను కొనేందుకు ఎవ్వరూ ముందుకు రాని సమయంలో ఇటీవలే మరోసారి ధైర్యం చేశారు రతన్ టాటా. తన తండ్రి కలల ప్రాజెక్టయిన ఎయిర్ ఇండియాను తిరిగి 2021లో టాటా గూటికి చేర్చారు. ప్రభుత్వం నుంచి టాటాపరమైన తర్వాత తొలి ఫ్లైట్ ఈ ఏడాది జనవరి 27న టాటాల ఆధ్వర్యంలో నడిచింది. ఈ సందర్భంగా తమ విమానంలో ప్రయాణిస్తున్న వారికి మొదటి సారిగా వినిపించిన అనౌన్స్‌మెంట్‌ని టాటా మీడియాకు రిలీజ్ చేసింది.
ఈ అనౌన్స్‌మెంట్ ‘ డియర్ గెస్ట్, నేను మీ కెప్టెన్ ను మాట్లాడుతున్నాను.. సరికొత్త చరిత్రకు నాంది పలుకుతున్న విమానంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం.., అంటూ మొదలు పెట్టి ‘వెల్‌కమ్ టూ ది ఫ్యూచర్ ఆఫ్ ఎయిర్ ఇండియా! వి హోప్ యూ ఎంజాయ్ ది జర్నీ’ అంటూ ముగించింది. 1932లో తొలిసారిగా టాటా గ్రూప్ ఇండియాలో ఎయిర్‌లైన్స్‌ను స్థాపించింది. అప్పటి టాటా గ్రూప్ ఛైర్మన్ జేఆర్‌డీ టాటా ఆధ్వర్యంలో ఇది విజయవంతంగా నడిచింది. అయితే 1953 జాతీయీకరణలో ఎయిర్ ఇండియా పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లింది. చాలాకాలం విజయవంతంగా నడిచిన ఎయిర్ ఇండియా.. దాదాపు పదేళ్ల క్రితం వరకు నష్టాలను నమోదు చేస్తూనే ఉంది.
Comments
Please login to add a commentAdd a comment