
కౌలాలంపూర్ : బంగ్లాదేశ్ ప్రయాణీకుడు ఒకరు విమానంలో అమర్యాదకరంగా ప్రవర్తించిన ఘటన వెలుగు చూసింది. కౌలాలంపూర్ నుంచి ఢాకా బయలుదేరిన విమానంలో 20 సంవత్సరాల మలేషియన్ యూనివర్సిటీ విద్యార్థి వింతగా ప్రవర్తించాడు. దుస్తులను విప్పేసి తన ల్యాప్‌టాప్‌లో పోర్న్ వీడియోలు చూశాడు. విమానంలో మహిళా సిబ్బంది పట్ల అసభ్యంగా వ్యవహరించాడు.
తన చేష్టలను అడ్డుకున్న మహిళపై దాడికి తెగబడ్డాడు. దీంతో క్యాబిన్ సిబ్బంది, ప్రయాణీకులు కలిసి అతడి చేతులను కట్టేసి నిర్బంధంలోకి తీసుకున్నారు. అతను ఎందుకిలా ప్రవర్తించాడో తెలియరాలేదని ఎయిర్‌లైన్స్ ఓ ప్రకనటలో పేర్కొంది. విమానం ఢాకాకు చేరుకోగానే దుండగుడిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించింది.