
ముంబై: దేశీ విమాన ప్రయాణికుల సంఖ్య ఏప్రిల్ నెలలో వార్షిక ప్రాతిపదికన 26 శాతం వృద్ధితో 1.15 కోట్లకు చేరింది. టూరిస్ట్ సీజన్ దీనికి ప్రధాన కారణం. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తాజా గణాంకాల ప్రకారం..
► దేశీ విమానయాన సంస్థలు ఏప్రిల్ నెలలో మొత్తంగా 1.15 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. గతేడాది ఇదే నెలలో విమాన ప్రయాణికుల సంఖ్య 91.34 లక్షలుగా ఉంది.
► మార్కెట్ లీడర్ ఇండిగో ఫ్లైట్స్‌లో 45.8 లక్షల మంది ప్రయాణించారు. ఇది 39.8 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది. ప్రతి పది మంది ప్యాసింజర్లలో నలుగురికిపైగా ఇండిగో సర్వీస్‌నే ఎంచుకున్నారు.
► సీట్ ఆక్యుపెన్సీ స్పైస్‌జెట్‌లో ఎక్కువగా 95.5 శాతంగా నమోదయ్యింది. ఇక ఆన్‌టైమ్ ఫెర్ఫార్మెన్స్‌లో ఇండిగో ముందుంది. ఈ సంస్థకు చెందిన 86.6 శాతం విమానాలు షెడ్యూల్ ప్రకారం నడిచాయి.