న్యూఢిల్లీ : విమాన ప్రయాణికులకు సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ గుడ్‌న్యూస్ ఇవ్వబోతోందా? అంటే అవుననే తెలుస్తోంది. విమాన క్యాన్సిలేషన్ లేదా ఆలస్యం కారణంతో కనెక్టింగ్ విమానాలు అందుకోలేని వారికి పరిహారాలను రూ.20వేలకు పెంచాలని సివిల్ ఏవియేషన్ మంత్రిత్వశాఖ చూస్తోంది. దీని కోసం డ్రాఫ్ట్ సిటిజన్ ఛార్టర్‌ను పునఃసమీక్షిస్తోందట. కొన్ని ఎయిర్‌లైన్స్ నుంచి ఈ నియమాలకు తీవ్ర వ్యతిరేకత వస్తున్నట్టు తెలుస్తోంది. పరిహారాల పెంపు మాత్రమే కాక, విమాన టిక్కెట్ బుక్ చేసుకున్న 24 గంటల్లోగా టిక్కెట్‌లో ఏమైనా మార్పులు చేపడితే జరిమానాలను రద్దు చేయాలని కూడా నిర్ణయిస్తోంది.
మే 1న విమానయాన సంస్థలు, ఇతర వాటాదారులతో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయబోయే సమావేశంలో వీటిపై నిర్ణయం తీసుకోనున్నారు. దీనిలో కూడా కొన్ని వ్యతిరేకతలు ఉన్నాయని, మే 1న నిర్వహించబోయే సమావేశంలో ప్రయాణికులకు, విమానయాన సంస్థలకు ఇద్దరికీ ప్రయోజనం చేకూరేలా నిర్ణయం తీసుకోనున్నారని సంబంధిత వర్గాలు చెప్పాయి. అయితే పరిహారాల పెంపుతో విమాన టిక్కెట్ ధరలు కూడా పెరుగుతాయని వాదనలు వినిపిస్తున్నాయి. 80 శాతం మార్కెట్ షేరు కలిగిన ఇండిగో, స్పైస్‌జెట్, గో ఎయిర్, జెట్ ఎయిర్‌వేస్ వంటి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్ పరిహారాల పెంపుపై ఆందోళన వ్యక్తంచేస్తోంది. పరిహారాలు పెంచితే, విమానయాన సంస్థల ఆర్థిక సాధ్యతపై ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment