కొత్త టెక్నాలజీతో 10 లక్షల ఉద్యోగాలు | Quantum computing and Generative AI are expected to create over 1 million jobs by 2030 | Sakshi

కొత్త టెక్నాలజీతో 10 లక్షల ఉద్యోగాలు

Published Tue, Dec 31 2024 6:19 AM | Last Updated on Tue, Dec 31 2024 12:53 PM

Quantum computing and Generative AI are expected to create over 1 million jobs by 2030

క్వెస్‌ ఐటీ స్టాఫింగ్‌ నివేదిక
 

న్యూఢిల్లీ: క్వాంటమ్‌ కంప్యూటింగ్, జనరేటివ్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) వంటి అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో 2030 నాటికి 10 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ఐటీ ప్లేస్‌మెంట్, స్టాఫింగ్‌ కంపెనీ క్వెస్‌ ఐటీ స్టాఫింగ్‌ నివేదిక వెల్లడించింది. ఏఐ, మెషీన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌), సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్, డేటా సైన్స్, బ్లాక్‌చెయిన్‌ విభాగాలలోని నైపుణ్యాలు వినూత్న అప్లికేషన్‌లతో పరిశ్రమలను అభివృద్ధి దిశగా నడిపిస్తున్నాయని తెలిపింది. 

క్వెస్‌ టెక్నాలజీ స్కిల్స్‌ రిపోర్ట్‌–2024 ప్రకారం.. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ కూడా 2030 నాటికి భారత ఆర్థిక వ్యవస్థకు 150 బిలియన్‌ డాలర్లకు పైగా దోహదపడతాయని అంచనా. ఇది సాంకేతిక నైపుణ్యంలో భారత స్థానాన్ని సుస్థిరం చేస్తుంది.  ఆరోగ్య సంరక్షణ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఇన్సూరెన్స్, రిటైల్, ఆటోమోటివ్, తయారీలో ఏఐ/ఎంఎల్‌ సాంకేతికత మోసాన్ని గుర్తించడం, నిర్ధారణ, నాణ్యత నియంత్రణ ద్వారా సామర్థ్యాన్ని పెంచుతుంది’ అని వివరించింది.  

అసమాన అవకాశాలను.. 
‘టెక్‌ నియామకాల్లో 43.5 శాతం వాటాతో బెంగళూరు ప్రధమ స్థానంలో ఉంది. హైదరాబాద్‌ 13.4 శాతం, పుణే 10 శాతం వాటాతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారత సాంకేతికత నిపుణులు టెక్నాలజీలో కొత్త మార్పులు తీసుకొస్తున్నారు.  జనరేటివ్‌ ఏఐ, బ్లాక్‌చెయిన్‌ వంటి సాంకేతికతల జోరుతో 2030 నాటికి భారత ఐటీ రంగం 20 లక్షల ఉద్యోగాలను జోడించనుంది’ అని నివేదిక తెలిపింది. ఏఐ/ఎంల్, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ వంటి అత్యాధునిక సాంకేతికతలతో ఎంటర్‌ప్రైజ్‌ రిసోర్స్‌ ప్లానింగ్‌ వంటి సంప్రదాయ నైపుణ్యాల కలయిక అసమాన అవకాశాలను అందిస్తుందని క్వెస్‌ ఐటీ స్టాఫింగ్‌ సీఈవో కపిల్‌ జోషి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement