ఆర్‌బీఐ వడ్డీరేట్లు తగ్గిస్తుందా? | RBI follow US Fed rate cut in October MPC meeting | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ వడ్డీరేట్లు తగ్గిస్తుందా?

Published Mon, Oct 7 2024 5:57 AM | Last Updated on Mon, Oct 7 2024 8:00 AM

 RBI follow US Fed rate cut in October MPC meeting

బుధవారం పరపతి సమీక్ష 

యథాతథ పాలసీకి చాన్స్‌ 

స్టాక్‌  మార్కెట్‌పై ప్రభావం 

ఈ వారం ట్రెండ్‌పై అంచనాలు

ప్రపంచ ఫైనాన్షియల్‌ మార్కెట్లపై ప్రభావాన్ని చూపే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఇప్పటికే వడ్డీ రేట్ల తగ్గింపు బాట పట్టింది. గత పాలసీ సమీక్షలో 0.5 శాతం వడ్డీ రేటును తగ్గించింది. ఈ ప్రభావం  దేశీ కేంద్ర బ్యాంకు ఆర్‌బీఐపైనా  ఉండవచ్చని బ్యాంకింగ్‌ వర్గాలు  భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు ప్రభావితంకానున్నట్లు 
విశ్లేషకులు పేర్కొంటున్నారు.  వివరాలు  చూద్దాం.. 

దేశీ స్టాక్‌ మార్కెట్లు నేటి(7) నుంచి ప్రారంభంకానున్న రిజర్వ్‌ బ్యాంక్‌ పాలసీ సమీక్షా సమావేశాలపై దృష్టి పెట్టనున్నాయి. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అధ్యక్షతన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) బుధవారం(9న) పరపతి నిర్ణయాలను తీసుకోనుంది. వెరసి ఈ వారం ఇన్వెస్టర్లు ఆర్‌బీఐ పాలసీ నిర్ణయాలపై అధికంగా దృష్టి సారించనున్నట్లు మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. గత నెల18న యూఎస్‌ ఫెడ్‌ నాలుగేళ్ల తదుపరి యూటర్న్‌ తీసుకుంటూ వడ్డీ రేట్లలో 0.5 శాతం కోత పెట్టింది. దీంతో ఫెడ్‌ ఫండ్స్‌ రేట్లు 4.75–5 శాతానికి దిగివచ్చాయి. ఫెడ్‌ పాలసీ నిర్ణయాల వివరాలు(మినిట్స్‌) బుధవారం వెల్లడికానున్నాయి. అయితే దేశీయంగా ద్రవ్యోల్బణ పరిస్థితులు, మధ్యప్రాచ్య అనిశి్చతులు వంటి అంశాల నేపథ్యంలో ఆర్‌బీఐ యథాతథ పాలసీ అమలుకే మొగ్గు చూపవచ్చని బ్యాంకింగ్‌ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం దేశీయంగా వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 6.5 శాతంగా 
అమలవుతోంది.  

ఫలితాల సీజన్‌ షురూ 
ఈ వారం నుంచి దేశీ కార్పొరేట్‌ జులై–సెపె్టంబర్‌ (క్యూ2) ఫలితాల సీజన్‌ ప్రారంభంకానుంది. ప్రధానంగా ఐటీ దిగ్గజాలు ప్రస్తుత ఆరి్థక సంవత్సరం(2024–25) క్యూ2 ఫలితాల సీజన్‌కు తెరతీయనున్నాయి. జాబితాలో టాటా గ్రూప్‌ దిగ్గజాలు టీసీఎస్, టాటా ఎలక్సీ 10న క్యూ2 పనితీరు వెల్లడించనున్నాయి. ఈ బాటలో డెన్‌ నెట్‌వర్క్స్, జీఎం బ్రూవరీస్, ఇరెడా సైతం ఇదే రోజు ఫలితాలు ప్రకటించనున్నాయి. కాగా.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం సెంటిమెంటుపై ప్ర భావాన్ని చూపగలదని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్‌ సీనియర్‌ టెక్నికల్‌ నిపుణులు ప్రవేశ్‌ గౌర్‌ అంచనా వేశారు. మధ్యప్రా చ్య ఉద్రిక్తతలతో సెన్సెక్స్‌ 85,000, నిఫ్టీ 26,000 పాయింట్ల మైలురాళ్లను స్వల్ప కాలంలోనే కోల్పోయినట్లు జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయిర్‌ పేర్కొన్నారు. గత వారం మార్కెట్లు 4 శాతం పతనమైన సంగతి తెలిసిందే. 

ఇతర అంశాలు కీలకం 
ఆర్‌బీఐ పాలసీ సమీక్ష, పశి్చమాసియా ఉద్రిక్తతలతోపాటు.. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు లేదా విక్రయాలు, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ కదలికలు, చమురు ధరలు వంటి అంశాలు సైతం దేశీ స్టాక్‌ మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ ఎస్‌వీపీ అజిత్‌ మిశ్రా వివరించారు. మాస్టర్‌ క్యాపిటల్‌ సరీ్వసెస్‌ డైరెక్టర్‌ పల్కా ఆరోరా చోప్రా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

గత వారం పశి్చమాసియాలో చెలరేగిన యుద్ధవాతావరణం, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలు దేశీ మార్కెట్లను దెబ్బతీసిన విషయం విదితమే. సెన్సెక్స్‌ 3,883 పాయింట్లు(4.5 శాతం) పతనమై 81,688 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 1,164 పాయింట్లు(4.5 శాతం) కోల్పోయి 25,015 వద్ద ముగిసింది. దీంతో గత వారం ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌(విలువ)లో రూ. 16.25 లక్షల కోట్లు ఆవిరికావడం ప్రస్తావించదగ్గ అంశం! కాగా.. దేశీయంగా లిక్విడిటీ పటిష్టంగా ఉన్నదని గౌర్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం అధిక విలువల్లో ఉన్న రంగాల నుంచి ఆకర్షణీయ విలువల్లో ఉన్న స్టాక్స్‌వైపు పెట్టుబడులు తరలే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు.  

ఎఫ్‌పీఐల భారీ అమ్మకాలు
ఇటీవలి యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఉన్నట్టుండి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) అమ్మకాల బాట పట్టారు. దేశీ స్టాక్స్‌ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ఈ నెల(అక్టోబర్‌)లో భారీ గా అమ్మకాలకు తెరతీశారు. ఈ నెలలో తొలి మూడు(1–4 మధ్య) సెషన్లలోనే భారీగా రూ. 27,142 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. ఇందుకు ముడిచమురు ధరలు జోరందుకోవడం, చైనాలో సహాయక ప్యాకేజీల ప్రకటనలు సైతం ప్రభావం చూపాయి. అయితే సెపె్టంబర్‌లో గత తొమ్మిది నెలల్లోనే అత్యధికంగా దేశీ స్టాక్స్‌లో రూ. 57,724 కోట్లు ఇన్వెస్ట్‌ చేసిన ఎఫ్‌పీఐలు పశి్చమాసియాలో ఉద్రిక్తతలు ఊపందుకోవడంతో అమ్మకాల యూటర్న్‌ తీసుకున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో అమ్మకాలకే ప్రాధాన్యమిచి్చన ఎఫ్‌పీఐలు జూన్‌ నుంచి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్న విషయం విదితమే.

 – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement