
హైదరాబాద్‌లో చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ అండ్ నిర్మాణ సంస్థ అయిన మకుటా డెవలపర్స్, నిర్మాణాలతో సొంతిటి కలల్ని సాకారం చేస్తూనే, ప్రతిభ కలిగిన యువతకు చేయూతనిచ్చి లక్ష్య సాధనలో ప్రోత్సహిస్తుంది. అంతర్జాతీయ క్రీడా వేదికలపై రాణిస్తున్న క్రీడాకారునికి వెన్నుతట్టి నడిపిస్తోంది.
దక్షిణ కొరియాలో జరిగే 20వ ఆసియా రోలర్-స్కేటింగ్ చాంపియన్షిప్ భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్‌లోని అల్వాల్కు చెందిన యువ రోలర్ స్కేటర్ 'ప్రతీక్'ను మకుట నిర్మాణ సంస్థ స్పాన్సర్‌గా వ్యవహరించేందుకు ముందుకు వచ్చింది. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ప్రతీక్ అన్ని పోటీల్లో రాణిస్తూ, అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్నాడు.
రోలర్ స్కేటింగ్‌లో యువ క్రీడాకారుని అంకితభావం, అభిరుచిని గుర్తించి మకుట డెవలపర్స్ స్పాన్సర్ షిప్ చేస్తోంది. ప్రతీక్ పోటీల్లో రాణించి సత్తా చాటేందుకు మద్దతుగా ₹2 లక్షలు విరాళంగా ఇచ్చింది. ఈ విరాళాన్ని శ్రీ జనార్ధన్ కొంపల్లి (వ్యవస్థాపకుడు & CEO), శ్రీ హర్షవర్ధన్ రెడ్డి వంగా (డైరెక్టర్) చేతుల మీదుగా ప్రతీక్, అతని తల్లి శ్రీమతి మృదులకు సోమవారం అందజేశారు.
ఈ సందర్భంగా మకుట వ్యవస్థాపకులు కొంపల్లి జనార్ధన్ మాట్లాడుతూ.. "సమాజం అభివృద్ధి చెందినప్పుడే నిజమైన వృద్ధి జరుగుతుందని మేము నమ్ముతాము. యువ ప్రతిభకు మద్దతు ఇవ్వడం అనేది మెరుగైన భవిష్యత్తుకు పెట్టుబడి లాంటిది. ప్రతీక్ లాంటి యువ ప్రతిభను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సామాజిక బాధ్యతతో ఇలాంటి ఆటగాళ్లకు మద్దతు తెలిపితే, అంతర్జాతీయ క్రీడా పోటీల్లో రాణించి భారతదేశం ఖ్యాతి, గౌరవాన్ని పెంచుతారని'' కొంపల్లి అన్నారు.