మహిళా కానిస్టేబుల్‌పై దురుసు ప్రవర్తన,వ్యక్తి అరెస్టు | Drunken Man Arrest For Scolding Lady Constable | Sakshi
Sakshi News home page

తాగిన మత్తులో నోరు జారాడు, అరెస్ట్‌ అయ్యాడు

Published Fri, Apr 2 2021 11:19 AM | Last Updated on Fri, Apr 2 2021 11:37 AM

Drunken Man Arrest For Scolding Lady Constable  - Sakshi

మద్యం మత్తులో ఈ యువకుడు  ట్రాఫిక్ మహిళా‌ కానిస్టేబుల్‌ను అసభ్య పదజాలంతో దూషించాడు ,పోలీసుల చేతిలో పడ్డాడు.

బంజారాహిల్స్‌: మద్యం మత్తులో ట్రాఫిక్ మహిళా‌ కానిస్టేబుల్‌ను అసభ్య పదజాలంతో దూషించిన యువకుడిపై కేసు నమోదైంది. ఘట్‌కేసర్‌ మండలం బోడుప్పల్‌కు చెందిన కొప్పు లవకుమార్‌(32), ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. బుధవారం రాత్రి స్నేహితులతో కలిసి జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో మద్యం తాగి ఇన్నోవా కారులో వెళ్తున్నారు. జూబ్లీహిల్స్‌రోడ్‌ నెం. 45 చౌరస్తాలో తిరుమలగిరి ట్రాఫిక్‌ పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీసులను చూసిన లవకుమార్‌ తప్పించుకునేందుకు ప్రయత్నిస్తుండగా  కానిస్టేబుల్‌ శ్రీలక్ష్మి గుర్తించి మరో కానిస్టేబుల్‌తో కలిసి లవకుమార్‌ కారును ఆపింది. మత్తులో ఉన్న లవకుమార్‌ శ్రీలక్ష్మి పై దుర్భాషలాడుతూ పోలీసులపై దాడికి యత్నించాడు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహిస్తుండగా నెట్టేశాడు. ఎట్టకేలకు పోలీసులు పరీక్షలు నిర్వహించగా బీఏసీ 100 పైనే వచ్చింది. అనంతరం శ్రీలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు లవకుమార్‌ను అరెస్ట్‌ చేశారు. ( చదవండి: విషాదం.. సెల్‌ ఫోన్‌లో మాట్లాడుతూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement