భర్తతో గొడవ.. ఇద్దరు పిల్లలతో సహా వివాహిత అదృశ్యం  | Married Woman Missing With Two Children In Visakhapatnam | Sakshi
Sakshi News home page

భర్తతో గొడవ.. ఇద్దరు పిల్లలతో సహా వివాహిత అదృశ్యం 

Published Fri, Jul 8 2022 9:24 AM | Last Updated on Fri, Jul 8 2022 9:24 AM

Married Woman Missing With Two Children In Visakhapatnam - Sakshi

ఇద్దరు పిల్లలతో లీలావతి

ఈ నేపథ్యంలో గత నెల 27న తన ఇద్దరు పిల్లలతో కలిసి రాత్రి సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయింది.

అల్లిపురం (విశాఖ దక్షిణ): ఇద్దరు పిల్లలతో సహా వివాహిత అదృశ్యమైన ఘటనపై మహారాణిపేట పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. సీఐ జి.సోమశేఖర్‌ తెలిపిన వివరాల ప్రకారం... మహారాణిపేట, తాడివీధికి చెందిన ఎలుజుల లీలావతికి 12 సంవత్సరాల క్రితం శాంతరాజు అనే వ్యక్తితో వివాహమైంది. వారికి ఒక బాబు, పాప సంతానం. భర్తతో గొడవపడిన లీలావతి గత ఐదు సంవత్సరాలుగా తన ఇద్దరు పిల్లలతో కలిసి తాడివీధిలో గల కన్నవారింట్లో ఉంటుంది.
చదవండి: నువ్వు చనిపోతావ్‌.. నీ భార్య రెండో పెళ్లి చేసుకుంటుంది.. చివరికి ట్విస్ట్‌

ఈ నేపథ్యంలో గత నెల 27న తన ఇద్దరు పిల్లలతో కలిసి రాత్రి సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె కుటుంబ సభ్యులు పలు ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో తల్లి లింగాల ఈశ్వరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 0891–2746866, 9440796010లో తెలియజేయాలని కోరారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement