
తారా సుతారియా
Tara Sutaria- Beauty Secret: ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన ముంబై భామ తారా సుతారియా. అరంగేట్రంలోనే తన అందంతో యువతను ఫిదా చేసింది. తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది.
ఇక మర్జావన్, తడప్, ఏక్ విలన్ రిటర్న్స్ వంటి సినిమాలతో ప్రేక్షకులకు చేరువైన తారా.. తన మెరిసే మేనికి అమ్మ చెప్పిన చిట్కాలే కారణం అంటోంది. ముఖం చంద్రబింబంలా మెరవాలంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలని చెబుతోంది.
నా బ్యూటీ సీక్రెట్ ఏమిటంటే!
‘‘నా బ్యూటీ సీక్రెట్ మంచినీళ్లు, మా నేర్పిన హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్. పెరుగులో తేనె, శనగపిండి, కాస్త పసుపు కలిపి ప్యాక్‌లా తయారు చేసుకుని మొహానికి అప్లయ్ చేస్తా. అది కాస్త డ్రై అవుతోంది అనుకున్నప్పుడు చన్నీళ్లతో కడిగేసుకుంటా!
మొహంలోని అలసట మాయమైపోయి.. గ్లో వచ్చేస్తుంది! నిజానికి ఈ హోమ్ మేడ్ చిట్కా మా అమ్మమ్మది. మా అమ్మ ఫాలో అయ్యింది.. ఇప్పుడు నేను! ఫాలో అవుతున్నా’’ అంటూ అందం వెనుక ఉన్న రహస్యాన్ని పంచుకుంది 26 ఏళ్ల తారా.
చదవండి: Hair Care Tips: ముఖం జిడ్డుకారుతుందని పదేపదే షాంపుతో తలస్నానం చేస్తే! ఈ సమస్యలు తప్పవు!
Beetroot Aloe Vera Gel: బీట్‌రూట్ అలోవెరా జెల్‌తో ముఖం మీది మచ్చలు మాయం! అయితే ఈ క్రీమ్ రాసిన తర్వాత..