
ప్రకృతి/ సేంద్రియ సాగు విధానం, కషాయాలు, మిశ్రమాల తయారీతోపాటు పంట దిగుబడులకు విలువ జోడింపు ద్వారా అధికాదాయం పొందటం వంటి అంశాలపై గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గర కొర్నెపాడులోని రైతు శిక్షణా కేంద్రంలో ఆగస్టు 31, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో నాబార్డు సహకారంతో రైతు శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ పద్మశ్రీ పురస్కార గ్రహీత యడ్లపల్లి వెంకటేశ్వరరావు తెలిపారు. డ్రోన్ల వాడే పద్ధతులు, యంత్రపరికరాలతో సులువుగా వ్యవసాయ పనులు చేసుకోవటంపై కూడా శిక్షణ ఇస్తారు. ఏపీలోని 30 మంది రైతులకే ఈ అవకాశం. వసతి, భోజన సదుపాయం ఉంది. ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొనదలచిన రైతులు 97053 83666/ 90739 73999కు ఫోన్ చేసి తప్పక రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు.