
రోమ్: ఇటలీ సముద్ర జలాల్లో వలసదారులు ప్రయాణిస్తున్న ఒక చెక్క పడవ రెండు ముక్కలై నీళ్లల్లో మునిగిపోయింది. ఆదివారం జరిగిన ఈ ప్రమాదంలో ఎందరో మరణించారు. ఇప్పటివరకు సహాయ సిబ్బంది 58 మృతదేహాలను వెలికి తీశారు. మరో 60 మంది ప్రాణాలు కాపాడారని స్టేట్ టీవీ వెల్లడించింది.
ప్రమాదం జరిగినప్పుడు పడవలో 180 మందికి పైగా శరణార్థులున్నట్టుగా తీర ప్రాంత పట్టణమైన క్రోటోన్‌లో ఓడరేవు అధికారులు చెబుతున్నారు. సామర్థ్యానికి మించి ప్రయాణికుల్ని ఎక్కించడం వల్లే అయోనియాన్ సముద్రంలో ప్రయాణిస్తున్న పడవ ధ్వంసమై ఈ ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా తెలుస్తోంది.