
‘జవహర్ బాల్‌మంచ్‌ను గ్రామస్థాయికి విస్తరిస్తాం’
స్టేషన్ మహబూబ్‌నగర్: జవహర్ బాల్‌మంచ్‌ను గ్రామస్థాయి వరకు విస్తరిస్తామని సంస్థ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ సుదర్శన్ అన్నారు. జేబీఎం నేషనల్ చైర్మన్ జీవీ హరి హైదరాబాద్‌లోని గచ్చిబౌలీ స్టేడియంలో శనివారం జవహర్‌బాల్ మంచ్ రాష్ట్రస్థాయి క్యాంపును ప్రారంభించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి చిన్నారులు పాల్గొనగా వారికి మాక్ పోలింగ్, ఇతర అంశాల్లో అవగాహన కల్పించడం జరిగిందన్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో జేబీఎం ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాల గురించి చర్చించుకోవడం జరిగిందన్నారు. త్వరలో జిల్లాస్థాయిలో జేబీఎం సమావేశాలు నిర్వహిస్తామన్నారు.