
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) తనను స్టార్ అని పిలిస్తే నచ్చదంటున్నాడు. స్టార్‌లా ఉండటం తనకిష్టం లేదని చెప్తున్నాడు. తాజాగా ఓ కార్యక్రమంలో అక్షయ్ మాట్లాడుతూ.. నాకు స్టార్ (నక్షత్రం)గా ఉండాలని లేదు. ఎందుకంటే నక్షత్రాలు ఎప్పుడూ రాత్రివేళలో మాత్రమే ప్రకాశిస్తాయి. నాకు ఉదయం, రోజంతా కూడా ప్రకాశించాలని ఉంది. అందుకే స్టార్‌ను కాదల్చుకోలేదు అన్నాడు.
స్కూల్‌లో క్రమశిక్షణ..
క్రమశిక్షణ గురించి మాట్లాడుతూ.. మనమందరం స్కూల్‌లో ఎంతో క్రమశిక్షణతో మెదులుకునేవాళ్లం. కానీ పెరిగేకొద్దీ ఆ క్రమశిక్షణను నెమ్మదిగా కోల్పోతున్నాం. నేను త్వరగా పడుకుని అంతే త్వరగా నిద్రలేస్తాను. అది చూసి చాలామంది ఎందుకలా త్వరగా నిద్రపోతావ్? అని అడుగుతారు. డిసిప్లిన్‌గా ఉంటే కూడా ప్రశ్నిస్తారా? అన్నాడు.
సినిమా
అక్షయ్ సినిమాల విషయానికి వస్తే.. గతేడాది బడే మియా చోటే మియా, సర్ఫిరా, ఖేల్ ఖేల్ మే, స్త్రీ 2, సింగం అగైన్ వంటి చిత్రాల్లో కనిపించాడు. ఈ ఏడాది స్కై ఫోర్స్ మూవీతో అలరించాడు. ప్రస్తుతం కేసరి చాప్టర్ 2, జాలీ ఎల్‌ఎల్‌బీ 3, హౌస్‌ఫుల్ 5, కన్నప్ప(తెలుగు), భూత్ బంగ్లా, వెల్‌కమ్ టు ద జంగిల్, హీరా ఫెరి 3 వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు.