
బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. కామన్ మ్యాన్ కోటాలో బిగ్ బాస్-6లోకి ఎంట్రీ ఇచ్చి ఊహించని విధంగా టాప్-5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచారు. ఈ షో ద్వారానే ఆదిరెడ్డి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వీడియోలు చేస్తున్నారు. అంతే కాకుండా బిగ్‌బాస్ షోపై రివ్యూలు కూడా ఇచ్చారు. బిగ్‌బాస్ షోపై రివ్యూలతో మరింత ఫేమ్ తెచ్చుకున్నారు.
అయితే ఇటీవల టాలీవుడ్‌లో ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు బుల్లితెర నటీనటులపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే పలువురు పోలీసుల ఎదుట హాజరై వివరణ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి సైతం పోలీసులను ఆశ్రయించారు.
నా పేరుతో టెలీగ్రామ్ గ్రూపులు ఏర్పాటు చేసి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని ఆదిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ గ్రూపుతో నాకు ఎలాంటి సంబంధం లేదు.. అందుకే ఎస్పీని కలిసి పీఎస్‌లో ఫిర్యాదు చేశానని వెల్లడించారు. తనకు వచ్చిన బెట్టింగ్ యాప్ ఆఫర్స్ అన్నింటిని తిరస్కరించినట్లు ఆదిరెడ్డి వివరించారు. ఎవరూ కూడా దయచేసి బెట్టింగ్ ఆడొద్దని తన ఫాలోవర్స్‌కు సూచించారు.
అయితే గతంలో తాను చేసిన ఫాంటసీ యాప్స్ మన ఇండియాలో లీగల్‌గానే చేశారని తెలిపారు. ఫాంటసీ యాప్స్ కుడా ఆంధ్రా, తెలంగాణలో ఓపెన్ చేయొచ్చు.. కానీ కేవలం ఫ్రీ లీగ్స్ మాత్రమే అడేందుకు మాత్రమే వీలవుతుందని వెల్లడించారు. అయితే ఇండియా మొత్తంలో లీగల్ ఫాంటసీ యాప్‌ను కూడా 9 నెలల క్రితమే ఆపేశానని ఆదిరెడ్డి వివరించారు . బెట్టింగ్ చేయాలి అనుకుంటే.. నాకు వచ్చిన అన్నీ ఆఫర్స్ ఎవరికి రావు అని అన్నారు. అవకాశం ఉన్నప్పటికీ తాను ఆ పని చేయలేదని పేర్కొన్నారు. 2020 తర్వాత నేను ఫాంటసీ యాప్స్‌లో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదు.. అంతేకాకుండా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెట్టుబడి పెట్టమని ఎవ్వరికీ చెప్పలేదని వెల్లడించారు. అయితే ఆంధ్ర, తెలంగాణలో ఫాంటసీ యాప్‌లలో కేవలం ఉచిత లీగ్‌లు మాత్రమే ఆడగలరు.. కానీ ఇతర రాష్ట్ర ప్రజలు ఫాంటసీ లీగ్స్ ఆడే అనుమతులు ఉన్నాయని బిగ్‌బాస్ ఆదిరెడ్డి పేర్కొన్నారు.