betting
-
బెట్టింగ్ యాప్స్‌పై మానవ హక్కుల సంఘానికి కేతిరెడ్డి ఫిర్యాదు
ఆన్లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ యాప్స్ వల్ల దేశవ్యాప్తంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వాటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల సంఘంలో తమిళనాడు తెలుగు యువశక్తి వవస్థాపక అధ్యక్షులు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ఫిర్యాదు చేశారు. అందులో ఆయన ఇలా పేర్కొన్నారు. "ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ వల్ల యువత ఎంతో నష్టపోతుందన్నారు. 2017లోనే బెట్టింగ్ యాప్స్ నిర్మూలణ కోసం తెలంగాణలో ఒక చట్టం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోతుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా బెట్టింగ్ యాప్స్ నిర్మూలణ కోసం 2020లో చట్టాలు తీసుకొచ్చారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రలు చట్టాలు చేసినప్పటికీ సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఒక జడ్జిమెంట్‌ను ఆధారం చేసుకుని వారి ఆగడాలకు అడ్డులేకుండా పోతుందన్నారు. రమ్మీ అనేది స్కిల్ గేమ్ అంటూ ఈ ఆన్లైన్ గ్యాంబ్లింగ్‌కు చెందిన వారు చెప్పడం.. ఆపై తమ యాప్స్‌ను ప్రముఖ క్రీడాకారులు, సినీ నటులతో ప్రకటనలు క్రియేట్ చేసి వదులుతున్నారని తెలిపారు. పక్కా ప్లాన్‌తో ఇలా ప్రజలను లూటీ చేస్తున్నారని చెప్పారు. ఇటీవల కాలంలో తెలంగాణ, ఆంద్రప్రదేశ్‌లలో దాదాపు 1000 మందికి పైగానే ఆత్మహత్యలు చేసుకున్నరని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికైనా దేశవ్యాప్తంగా ఉన్న ఈ బెట్టింగ్ యాప్స్‌ను బ్యాన్ చేయడమే కాకుండా ఈ మాఫియాను కట్టడి చేయాలన్నారు. అందు కోసం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక నిఘా సంస్థను ఏర్పాటు చేసి ఈ ఆన్లైన్ బెట్టింగ్ భూతాన్ని తరిమికొట్టేందుకు చర్యలు చేపట్టాలని కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. -
బెట్టింగ్ యాప్స్ వ్యవహారం.. నాకు వచ్చిన ఆఫర్స్ మరెవరికీ రావు: బిగ్‌బాస్ ఆదిరెడ్డి
బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. కామన్ మ్యాన్ కోటాలో బిగ్ బాస్-6లోకి ఎంట్రీ ఇచ్చి ఊహించని విధంగా టాప్-5 కంటెస్టెంట్లలో ఒకరిగా నిలిచారు. ఈ షో ద్వారానే ఆదిరెడ్డి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వీడియోలు చేస్తున్నారు. అంతే కాకుండా బిగ్‌బాస్ షోపై రివ్యూలు కూడా ఇచ్చారు. బిగ్‌బాస్ షోపై రివ్యూలతో మరింత ఫేమ్ తెచ్చుకున్నారు.అయితే ఇటీవల టాలీవుడ్లో ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు బుల్లితెర నటీనటులపై కేసులు నమోదు చేశారు. ఇప్పటికే పలువురు పోలీసుల ఎదుట హాజరై వివరణ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ కంటెస్టెంట్ ఆదిరెడ్డి సైతం పోలీసులను ఆశ్రయించారు.నా పేరుతో టెలీగ్రామ్ గ్రూపులు ఏర్పాటు చేసి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని ఆదిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ గ్రూపుతో నాకు ఎలాంటి సంబంధం లేదు.. అందుకే ఎస్పీని కలిసి పీఎస్‌లో ఫిర్యాదు చేశానని వెల్లడించారు. తనకు వచ్చిన బెట్టింగ్ యాప్ ఆఫర్స్ అన్నింటిని తిరస్కరించినట్లు ఆదిరెడ్డి వివరించారు. ఎవరూ కూడా దయచేసి బెట్టింగ్ ఆడొద్దని తన ఫాలోవర్స్‌కు సూచించారు.అయితే గతంలో తాను చేసిన ఫాంటసీ యాప్స్ మన ఇండియాలో లీగల్‌గానే చేశారని తెలిపారు. ఫాంటసీ యాప్స్ కుడా ఆంధ్రా, తెలంగాణలో ఓపెన్ చేయొచ్చు.. కానీ కేవలం ఫ్రీ లీగ్స్ మాత్రమే అడేందుకు మాత్రమే వీలవుతుందని వెల్లడించారు. అయితే ఇండియా మొత్తంలో లీగల్ ఫాంటసీ యాప్‌ను కూడా 9 నెలల క్రితమే ఆపేశానని ఆదిరెడ్డి వివరించారు . బెట్టింగ్ చేయాలి అనుకుంటే.. నాకు వచ్చిన అన్నీ ఆఫర్స్ ఎవరికి రావు అని అన్నారు. అవకాశం ఉన్నప్పటికీ తాను ఆ పని చేయలేదని పేర్కొన్నారు. 2020 తర్వాత నేను ఫాంటసీ యాప్స్‌లో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదు.. అంతేకాకుండా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెట్టుబడి పెట్టమని ఎవ్వరికీ చెప్పలేదని వెల్లడించారు. అయితే ఆంధ్ర, తెలంగాణలో ఫాంటసీ యాప్‌లలో కేవలం ఉచిత లీగ్‌లు మాత్రమే ఆడగలరు.. కానీ ఇతర రాష్ట్ర ప్రజలు ఫాంటసీ లీగ్స్ ఆడే అనుమతులు ఉన్నాయని బిగ్‌బాస్ ఆదిరెడ్డి పేర్కొన్నారు. -
బెట్టింగ్ యాప్‌లపై సిట్ చీఫ్‌గా ఐజీ రమేష్
సాక్షి, హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ వ్యవహారాలను పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) అధిపతిగా ఐజీ ఎం.రమేష్ పేరు ఖరారైంది. ఈ మేరకు డీజీపీ డాక్టర్ జితేందర్ ఆదివారం ఉత్తర్వులు (ఆర్సీ నం.191/ఎల్ అండ్ ఓ–ఐ/2025) జారీ చేశారు. తొలుత ఈ బా«ధ్యతల్ని డీఐజీగా ఉన్న అభిషేక్ మహంతికి అప్పగించాలని భావించారు. అయితే ఆయన తెలంగాణకు కేటాయింపుపై స్పష్టత లేకపోవడం, హైకోర్టు ఆదేశాల మేరకే ఇక్కడ కొనసాగుతుండటంతో డీజీపీ కార్యాలయంలో పీ అండ్ ఎల్ విభాగం ఐజీగా ఉన్న రమేష్‌ను ఎంపిక చేశారు. విదేశీ లింకులతో పాటు ఇతర కీలకాంశాలతో ముడిపడిన బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తు సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంది. ఈ లోపు అభిషేక్ మహంతికి వ్యతిరేకంగా క్యాట్ ఉత్తర్వులు వస్తే ఆ ప్రభావం కేసుల దర్యాప్తుపై పడుతుందని డీజీపీ కార్యాలయం భావించింది. ఈ నేపథ్యంలోనే మరో సమర్థుడైన అధికారిగా పేరున్న రమేష్‌ను ఖరారు చేసింది. సిట్‌లో ఇంటెలిజెన్స్ ఎస్పీ సీహెచ్ సింధు శర్మ, సీఐడీ ఎస్పీ కె.వెంకటలక్ష్మీ, సైబరాబాద్‌లో పని చేస్తున్న అదనపు ఎస్పీ ఎస్.చంద్రకాంత్, సీఐడీ డీఎస్పీ ఎం.శంకర్ సభ్యులుగా ఉన్నారు. ఈ కేసుల దర్యాప్తునకు అవసరమైన ఇతర అధికారులను సిట్ ఎంపిక చేసుకోనుంది. దీంతో పాటు ఆర్థిక నిపుణులు, న్యాయాధికారులు, ఆడిటర్లు, ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ నిపుణులు తదితరులను సీఐడీ అదనపు డీజీ అనుమతితో నియమించుకునే అవకాశం ఉంది. దర్యాప్తే కాదు..సిఫారసులూ చేయాలి ఈ సిట్ కేవలం కేసుల్ని దర్యాప్తు చేయడం మాత్రమే కాకుండా బెట్టింగ్ యాప్స్ తీరుతెన్నులు, వ్యవహారాలను సమగ్రంగా అధ్యయనం చేసి, వీటిని నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యలను సిఫారసు చేయాల్సి ఉంటుంది. ఈ యాప్స్‌ను కట్టడి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీలు, ఆదాయపు పన్ను శాఖ, జీఎస్టీ, సమాచార ప్రసార, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ, హోం మంత్రిత్వ శాఖలతో పాటు డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ తదితరాల బాధ్యతలను గుర్తించాల్సి ఉంది.ఈ యాప్స్ ఆర్థిక లావాదేవీలు, వాటి మార్గాలను గుర్తించి, తీసుకోవాల్సిన చర్యలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకువెళ్లాలని డీజీపీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇలాంటి అనేక అంశాలు, సమగ్ర వివరాలతో కూడిన నివేదికను సిట్ 90 రోజుల్లో డీజీపీకి సమర్పించాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం డీజీపీ కార్యాలయం కేంద్రంగానే పని చేయనుంది. -
అమ్మా.. నాన్నా.. సారీ అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టి
మేడ్చల్ రూరల్: నేను సూసైడ్ చేసు కోవాలని డిసైడయ్యా.. దయచేసి నన్ను డిస్ట్రబ్ చేయకండి.. నేను డబ్బు ల విషయంలో ఆత్మహత్యకు పాల్పడడం లేదు. నా మైండ్ సెట్ కంట్రోల్ కావడం లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. అమ్మా.. నాన్నా.. అండ్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్.. సారీ.. అంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టి సోమేష్‌కుమార్ అనే యువకుడు గౌడవెల్లి గ్రామ పరిధిలో రైలు కిందపడి తనువు చాలించిన ఘటన చోటుచేసుకుంది. మృతుడి కుటుంబీకులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం..ఏపీలోని అనకాపల్లి జిల్లా చోడవరం మండలం భోగాపురం గ్రామానికి చెందిన రమణ, కనకమ్మ దంపతులు బతుకుదెరువు కోసం 25 ఏళ్ల క్రితం నగరానికి వలసవచ్చి గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడు సోమేశ్కుమా ర్ (29) కొంపల్లి సమీపంలో ఉన్న ఓ కంపెనీ వేర్‌హౌస్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. క్రికెట్ బెట్టింగులకు బానిసైన సోమేశ్ రూ.లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్నాడు. గతంలో కుటుంబీకులు సోదరి వివా హం కోసం దాచిన డబ్బులు సైతం బెట్టింగ్స్‌లో కోల్పోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు కుమారుడిని మందలించారు. బెట్టింగ్ కారణంగా రూ.3.5 లక్షల వరకు అప్పులు చేయడంతో వాటిని తల్లిదండ్రులే చెల్లించారు. దీంతో మళ్లీ బెట్టింగులకు పాల్పడనంటూ చెప్పిన సోమేశ్‌కుమార్ ఇటీవల ఐపీఎల్ క్రికెట్ మొదలవ్వడంతో మళ్లీ బెట్టింగుల వైపు మళ్లాడు. గత సోమవారం రాత్రి జరిగిన లక్నో– ఢిల్లీ మ్యాచ్ సందర్భంగా రూ.లక్ష క్రికెట్ బెట్టింగ్ యాప్‌లో బెట్టింగ్ వేశాడు. దురదృష్టవశాత్తు ఢిల్లీ మ్యాచ్ గెలవడంతో ఒక్క రోజే రాత్రికిరాత్రి రూ.లక్ష పోగొట్టుకున్నాడు. ఆ మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు సికింద్రాబాద్ రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన విష్ణుప్రియ
-
ఐపీఎల్లో బెట్టింగ్ జోరు
ఈ సీజన్ ఐపీఎల్లో మొదటి మ్యాచ్ కోల్‌కత నైట్రెడర్స్ (కేకేఆర్), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మధ్య మొదలైంది. డఫ్పా బెట్‌తో పాటు దాదాపు అన్ని బెట్టింగ్ యాప్‌లు కేకేఆర్ ఫేవరెట్ టీంగా బెట్టింగ్ నిర్వహించాయి. ఆర్సీబీపై మొదట్లో బెట్టింగ్ కాసిన వారు ఆ తర్వాత మళ్లీ కేకేఆర్‌పై బెట్టింగ్ కాశారు. కానీ, చివరికి ఆర్సీబీ గెలుపొందింది. దీంతో కేకేఆర్‌పై బెట్టింగ్ చేసిన వారంతా నిండా మునిగిపోయారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచుల్లో బెట్టింగ్‌ల జోరు తీరిది.సాక్షి ప్రతినిధి కర్నూలు : అందరి చేతిలో స్మార్ట్ఫోన్లు ఉండటం, ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్లైన్లో బెట్టింగ్ యాప్‌లు పుష్కలంగా ఉండడంతో అధికశాతం క్రికెట్ అభిమానులు ఆన్లైన్ బెట్టింగ్‌లో మునిగిపోతున్నారు. సెలబ్రిటీలు కూడా వీటిని ప్రమోట్ చేస్తుండడంతో రెండేళ్లుగా ఈ యాప్‌లు భారీగా పెరిగాయి. పైగా.. ఈసారి ప్లేయర్ల ఆక్షన్‌లో ఎక్కువశాతం ప్లేయర్లు జట్లు మారారు. దీంతో బెట్టింగ్ రాయుళ్లు జట్ల విజయావకాశాలను సరిగ్గా అంచనా వేయలేకపోతున్నారు. చివరికి.. వారి ఖాతాల్లోని డబ్బు ఆవిరవుతోంది. ఆఫ్‌లైన్ కంటే ఆన్లైన్లోనే బెట్టింగ్‌లు ఎక్కువగా జరుగుతుండడంతో పోలీసులకు కూడా ఇవి సవాల్‌గానే మారాయి. ఈ ఐపీఎల్ సీజన్ ముగిసేలోపు రూ.లక్ష కోట్లు చేతులుమారే అవకాశముందని అంచనా.బెట్టింగ్ యాప్‌లు ఇవే.. ఆన్లైన్ బెట్టింగ్‌లో ఎక్కువమంది ‘డఫ్పా బెట్టింగ్’ యాప్‌ను వాడుతున్నారు. దీంతో పాటు ఎక్స్ బెట్, స్కై ఎక్సే్ఛంజ్, ఫ్యాన్సీ లైఫ్, క్రికెట్ మజా, లైవ్‌లైన్, లోటస్, బెట్ 65, బెట్ ఫెయిర్, టెన్క్రిక్, 22 బెట్, ఫోర్రాబెట్, వన్ విన్, పారిమ్యాచ్, మెల్బెట్తో పాటు అనేక బెట్టింగ్ యాప్‌లు ఉన్నాయి.ఆన్లైన్ బెట్టింగ్ తీరిది..⇒ ఈ విధానంలో మ్యాచ్‌కు గంట ముందే కొంత మొత్తాన్ని డిపాజిట్ చేయాలి. దాంతోనే బెట్టింగ్ కాయాలి. ⇒ మ్యాచ్‌కు ముందు రేటింగ్స్ ఇస్తారు. ఆ ప్రకారం పందెం వేయాలి. ⇒ మ్యాచ్ సాగేతీరును బట్టి ఇవి మారుతుంటాయి. డిపాజిట్ క్లోజ్ అయితే అప్పటికప్పుడు డిపాజిట్ చేసి బెట్టింగ్ కాసే అవకాశం ఉండదు. దీంతో చాలామంది రూ.50వేల నుంచి లక్షల రూపాయలు ముందుగానే యాప్స్‌లో డిపాజిట్ చేస్తున్నారు. ⇒ మ్యాచ్ పరిస్థితి, రేటింగ్స్‌ను బట్టి అప్పటికప్పుడు ఆకర్షితులై కూడా భారీగా బెట్టింగ్ కాస్తారు. ⇒ బెట్టింగ్‌లో గెలిస్తే క్షణాల్లో డబ్బు ఖాతాల్లో జమవుతుంది. ఓడిపోతే ఖాతా ఖాళీ అవుతుంది. .. ఇలా రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఆన్లైన్ బెట్టింగ్ ఊబిలో చిక్కుకుని రూ.వేల నుంచి రూ.లక్షల వరకూ పొగొట్టుకుంటున్నారు.ఆఫ్‌లైన్ బెట్టింగ్ ఇలా.. టాస్ నుంచి బాల్ టు బాల్ వరకూ బెట్టింగ్ సాగుతుంది. టాస్ ఎవరు గెలుస్తారు? తొలి ఓవర్ స్పిన్నర్‌తో బౌలింగ్ వేయిస్తారా? పేసర్‌తో వేయిస్తారా? మొదటి ఓవర్లో ఎన్ని పరుగులు వస్తాయి? జట్టు ఎంత స్కోర్ చేస్తుంది? ఎవరు గెలుస్తారు? ఫలానా బాల్‌కు ఫోర్ వస్తుందా? సిక్స్ వస్తుందా? లేదా ఒక్క పరుగే వస్తుందా? ఇలా అనేక రకాలుగా బెట్టింగ్‌లు ఉంటాయి. ఇక బుకీలు ముంబై, హైదరాబాద్, బెంగళూరులో ఉంటారు. జిల్లా, పట్టణ కేంద్రాల్లో సబ్‌బుకీలు ఉంటారు. మ్యాచ్ మారుతున్న స్వరూపాన్ని బట్టి బెట్టింగ్ లెక్కలు మారుస్తారు. వీరు వాట్సప్ గ్రూపుల్లో బెట్టింగ్ ధరలు నిర్ధారిస్తారు. ఆఫ్‌లైన్‌లో బెట్టింగ్ కాసేవారు బార్లతో పాటు హోటళ్లలో కూర్చుని బెట్టింగ్ కాస్తారు. 357 రకాల వెబ్సైట్లు బ్లాక్.. బెట్టింగ్‌లను అరికట్టేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) 357 రకాల వెబ్సైట్లను బ్లాక్ చేసింది. వాటికి చెందిన 2,400 బ్యాంకు ఖాతాల్లో రూ.126 కోట్లను ఫ్రీజ్ చేసింది. మరో 700 యాప్‌లపై నిఘా ఉంచింది. అనుమతితో నడిచే బెట్టింగ్ యాప్‌లను టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు సోషల్ మీడియా సెలబ్రిటీలు ప్రమోట్ చేస్తున్నారు. ఈనెల 16న ఫణీంద్రశర్మ అనే వ్యక్తి ఫిర్యాదుతో హైదరాబాద్‌లో దగ్గుబాటి రానా, ప్రకాశ్‌రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీత, శ్రీముఖి, వర్షిణితో పాటు 24 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ బెట్టింగ్ ఊబిలో వ్యాపారులు, ఉద్యోగులతో పాటు యువత ఎక్కువగా చిక్కుకుంటున్నారు. -
Satyameva Jayate: నమ్మించి ప్రాణాలు తీస్తున్నారు.. వీళ్లా మన హీరోలు?
-
ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న బెట్టింగ్ విషాదాలు
-
బెట్టింగ్ యాప్స్‌పై ప్రకాష్ రాజ్ వివరణ
-
Betting Apps: ఒక్కో వీడియోకు రూ. 90వేలు తీసుకున్నట్లు విష్ణుప్రియ వెల్లడి
-
ఈడీకి చేరిన బెట్టింగ్ యాప్స్ వ్యవహారం!
హైదరాబాద్: యూట్యూబర్లు, పలువురు ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిసున్న బెట్టింగ్ యాప్స్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. వాళ్ల సంపాదన, ఆదాయాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన యూట్యూబర్ల వ్యవహారంపై ఆరా తీసిన ఈడీ.. వాళ్లకు జరిగిన చెల్లింపుల వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే నమోదైన కేసుల ఆధారంగా 11 మంది వివరాలను ఈడీ తెప్పించుకున్నట్లు సమాచారం. మనీలాండరింగ్, హవాలా రూపంలో నగదు చెల్లింపులు జరిగి ఉండొచ్చని ఈడీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.మరోవైపు బెట్టింగ్ యాప్స్ కేసులో పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే 11 మందిపై కేసు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన మరింత మందిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం విచారణకు హాజరుకావాలని కొందరికి నోటీసులు కూడా జారీ చేశారు. అయితే విచారణకు వాళ్లు కొంత గడువు కోరగా.. అందుకు పోలీసులు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరికొందరికి నోటీసులు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇదీ చదవండి: వీసీ సజ్జనార్ హెచ్చరిక.. వీళ్లను తక్షణమే అన్‌ఫాలో చేయండి -
నటి విష్ణుప్రియకు పంజాగుట్ట పోలీసుల నోటీసులు
-
నేను చాలా సేఫ్‌గా ఉన్నా.. దయచేసి అవన్నీ నమ్మొద్దు: సుప్రీత విజ్ఞప్తి
త్వరలోనే టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోన్న సుప్రీత ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. బిగ్‌బాస్ -7 రన్నరప్ అమర్దీప్ చౌదరితో కలిసి ప్రస్తుతం ఓ సినిమా చేస్తోంది. సుప్రీత హోలీ పండుగ రోజును అభిమానులను ఉద్దేశించి ఓ వీడియోను రిలీజ్ చేసింది. తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్‌ను తాను కూడా ప్రమోట్ చేశానని వెల్లడించింది. దయచేసి ఎవరూ కూడా ఇలాంటి పనులు చేయవద్దని విజ్ఞప్తి చేసింది. మీరు కూడా అందరూ ఇలాంటి వారికి దూరంగా ఉండాలని ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేసింది.అయితే గత కొద్ది రోజులుగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్స్, యూట్యూబర్లపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే పలువురు సినీ తారలపై కేసు కూడా నమోదు చేశారు. వీరిలో సుప్రీత, టేస్టీ తేజ, విష్ణుప్రియ, రీతూచౌదరి లాంటి వారి పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.(ఇది చదవండి: క్షమాపణలు చెప్పిన సురేఖవాణి కూతురు సుప్రీత.. ఎందుకంటే?)అయితే తాజాగా తనపై వస్తున్న వార్తలపై సురేఖ వాణి కూతురు సుప్రీత స్పందించింది. ఈ మేరకు ఇన్‌స్టా స్టోరీస్ వేదికగా మరో వీడియోను విడుదల చేసింది. దయచేసి సోషల్ మీడియాలో తనపై వస్తున్న వార్తలను ఎవరూ నమ్మొద్దు.. అవన్నీ ఫేక్ స్పష్టం చేసింది. ప్రస్తుతం నేను మూవీ షూటింగ్లో బిజీగా ఉన్నానని సుప్రీత వెల్లడించింది.సుప్రీత మాట్లాడుతూ..'హాయ్.. అందరికీ నమస్కారం.. నేను మీ సుప్రీత. సోషల్ మీడియాతో పాటు టీవీ ఛానెల్స్‌లో నాపై వస్తున్న ప్రచారాలన్నీ అబద్ధాలు. మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. నేను ఇప్పుడు షూటింగ్లో ఉన్నాను. మీరు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్.' అంటూ వీడియోను రిలీజ్ చేసింది. -
అక్రమ యాప్‌లు ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీలపై కొరడా
-
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్న యూట్యూబర్లపై కేసులు.. త్వరలోనే అరెస్ట్?
సాక్షి, హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్స్కు హైదరాబాద్ పోలీసులు షాకిచ్చారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న కంటెంట్ క్రియేటర్లపై కేసులు నమోదు చేశారు. వారిలో హర్షసాయి, సన్నీ యాదవ్, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్, టెస్టీ తేజ, కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, రీతూ చౌదరి, బండారు పేషయాని సుప్రిత తదితరులపై వారిపై 318(4) BNS, 3, 3(A), 4 TSGA, 66D ITA Act-2008 సెక్షన్ల చేయగా.. త్వరలోనే వీరిని అరెస్ట్ చేయనున్నట్లు సమాచారం. -
భయం మొదలైంది.. సారీ చెప్పిన రీతూ చౌదరి
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ వివాదం గట్టిగానే నడుస్తోంది. ఐపీఎస్ వీసీ సజ్జనార్ తన వంతు బాధ్యతగా బెట్టింగ్ మహమ్మారిపై యుద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం వైజాగ్ కి చెందిన లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేశారు. మోటో వ్లాగర్ భయ్యా సన్నీ యాదవ్ పై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అతడి అందుబాటులో లేడు.(ఇదీ చదవండి: వీసీ సజ్జనార్ హెచ్చరిక.. వీళ్లను తక్షణమే అన్‌ఫాలో చేయండి)ఇదివరకే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన పలువురు చోటామోటా ఇన్ఫ్లూయెన్సర్స్ బయటకొస్తున్నారు. టేస్టీ తేజ, సుప్రీత తదితరులు క్షమాపణలు చెప్పారు. ఇప్పుడు ఈ లిస్టులో టీవీ నటి రీతూ చౌదరి చేరింది. 'గతంలో నేను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాను. క్షమించండి. తెలిసో తెలియకో చేసిన నా తప్పుని క్షమిస్తారని అనుకుంటున్నాను. దయచేసి ఏ బెట్టింగ్ యాప్స్‌ని నమ్మకండి' అని రీతూ చౌదరి చెప్పుకొచ్చింది. అయితే సారీ చెప్పినంత మాత్రాన పోలీసులు వీళ్లని వదిలేస్తారా అనేది సందేహమే.(ఇదీ చదవండి: మళ్లీ హాస్పిటల్ బెడ్ పై సమంత) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) -
వీసీ సజ్జనార్ హెచ్చరిక.. వీళ్లను తక్షణమే అన్‌ఫాలో చేయండి
బెట్టింగ్ యాప్స్, వాటిని ప్రమోట్ చేస్తున్న సోషల్‌మీడియా ఇన్‌ప్లూయెన్సర్లకు టీజీఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ (VC Sajjanar) చుక్కలు చూపుతున్నారు. ఇంతకాలం కొనసాగిన తమ ఆగడాలకు ఆయన ఫుల్స్టాప్ పెడుతున్నారు. కాసులకు కక్కుర్తిపడి వాటికి ప్రచారం చేయొద్దని ఇప్పటికే ఆయన పలుమార్లు హెచ్చరించారు. అయినప్పటికీ వారిలో మార్పు రాకపోవడంతో కేసులు నమోదు అయ్యేలా చైతన్యం తీసుకొచ్చారు. దీంతో చాలామంది యూట్యూబర్స్ బెట్టింగ్ యాప్స్‌కు వ్యతిరేఖంగా ఆయనతో చేతులు కలిపేందుకు ముందుకు వస్తున్నారు.మొన్న వైజాగ్ లోకల్ బాయ్ నాని, నిన్న భయ్యా సన్నీ యాదవ్.. నేడు హర్ష సాయిల బాగోతాన్ని వీసీ సజ్జనార్ ‘ఎక్స్’ వేదికగా బయటపెట్టారు. రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావొచ్చని సోషల్ మీడియాలో వారు విడుదల చేసే వీడియోల వల్ల అమాయకులు ఆన్లైన్ బెట్టింగ్ మహమ్మారికి బానిసలవుతున్నారని ఆయన మండిపడ్డారు. ఈ క్రమంలో వారి బంగారు జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. ఈ క్రమంలో యూట్యూబర్ హర్ష సాయి గురించి సజ్జనార్ ఇలా చెప్పుకొచ్చారు. 'హర్ష సాయి చేస్తున్నదే తప్పు.. అదేదో సంఘసేవ చేస్తున్నట్టు ఎంత గొప్పలు చెప్పుకుంటున్నాడో ఈ వీడియోలో చూడండి. తాను బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయకుంటే ఎవరో ఒకరు చేస్తారని ఈయన చేస్తున్నాడట. ఏమైనా బుద్దుందా అసలు!ఎంతో మంది అమాయకుల ప్రాణాలు ఆన్లైన్ బెట్టింగ్‌కు బలైతుంటే కనీసం పశ్చాత్తాపం కూడా లేదు. వీళ్లకు డబ్బే ముఖ్యం, డబ్బే సర్వస్వం.. ఎవరూ ఎక్కడ పోయినా, సమాజం, బంధాలు, బంధుత్వాలు చిన్నాభిన్నమైన వాళ్లకు సంబంధం లేదు. ఈయనకు రూ. 100 కోట్ల నుంచి రూ. 500 కోట్ల వరకు ఆఫర్ చేశారట. అంత మొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచించండి. మీ ఫాలోయింగ్‌ని మార్కెట్లో పెట్టి కోట్లకు కోట్లు సంపాదిస్తున్న ఇలాంటి వాళ్లనా.. మీరు ఫాలో అవుతోంది. వెంటనే ఈ బెట్టింగ్ ఇన్‌ప్లూయెన్సర్లను అన్‌ఫాలో చేయండి. వారి అకౌంట్లను రిపోర్ట్ కొట్టండి. ఆన్లైన్ బెట్టింగ్ భూతాన్ని అంతమొందించడంలో మీ వంతు బాధ్యతను నిర్వర్తించండి.' అంటూ ఆయన సూచించారు. దీంతో సోషల్‌మీడియాలో సజ్జనార్ పేరు మారుమ్రోగిపోతుంది.వాళ్లకు చుక్కులు చూపించిన అన్వేష్ముఖ్యంగా యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ఉన్న తెలుగు ట్రావెలర్ నా అన్వేషణ.. 'అన్వేష్' చాలారోజుల నుంచే బెట్టింగ్ యాప్స్‌పై వ్యతిరేఖంగా పోరాటం చేస్తున్నాడు. ఈ క్రమంలో వందల కొద్ది వీడియోలను తన యూట్యుబ్‌లో పోస్ట్ చేశాడు. అసలు బెట్టింగ్ యాప్స్ వల్ల జరిగే నష్టాలను తెరపైకి తీసుకొచ్చాడు. ఆపై వాటిని ప్రమోట్ చేస్తున్న లోకల్ బాయ్ నాని, భయ్యా సన్నీ యాదవ్, హర్ష సాయి, ఇమ్రాన్ వంటి వారిని హెచ్చరిస్తూనే పలు వీడియోలతో వారికి చుక్కులు చూపించాడు. దీంతో అన్వేష్‌కు మద్ధతుగా చాలామంది నెటిజన్లు నిలిచారు. ఈ క్రమంలో వీసీ సజ్జనార్ కూడా అన్వేష్‌తో ఒక లైవ్ వీడియో ప్రోగ్రామ్ చేశారు. దానిని తన యూట్యూబ్‌లో ఆయన షేర్ చేయడంతో సుమారు రెండు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఎంతో మంది IPS, IASలు ఉన్నారు. కానీ, బెట్టింగ్ యాప్స్ మీద మాట్లాడింది సజ్జనార్ సార్ మాత్రమే అంటూ ఆయన అభిమానులు కామెంట్ రూపంలో చెబుతున్నారు. ఈ వీడియోతో రెండు రాష్ట్రాల తెలుగువారి మనసులు గెలిచేసావ్ అంటూ అన్వేష్‌పై ప్రశంసలు వస్తున్నాయి. అన్వేష్ లాంటి యూట్యూబర్‌ను ఫాలో అవుతున్నందుకు చాలా గర్వపడుతున్నానని ఒక నెటిజన్ పేర్కొనడం విశేషం. ఐపీఎస్ సజ్జనార్‌తో ఇంటర్వ్యూ చేసిన అన్వేష్‌కు సోషల్‌మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఆ వీడియో కింద కామెంట్లు అన్నీ కూడా వారిని ప్రశంసిస్తూ ఉండటం విశేషం. చేస్తున్నదే తప్పు.. అదేదో సంఘసేవ చేస్తున్నట్టు ఎంత గొప్పలు చెప్పుకుంటున్నాడో చూడండి. తాను బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయకుంటే ఎవరో ఒకరు చేస్తారని ఈయన చేస్తున్నాడట. బుద్దుందా అసలు!ఎంతో మంది అమాయకుల ప్రాణాలు ఆన్లైన్ బెట్టింగ్‌కు బలైతుంటే కనీసం పశ్చాత్తాపం లేదు.… pic.twitter.com/h0Vyxl2vXh— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 15, 2025 -
బెట్టింగ్ ఆటగాడి ఆట కట్టించిన పోలీసులు
-
బెట్టింగ్ యాప్‌లో రూ. 13 లక్షలు లాస్
ఆత్మకూరురూరల్: ఆన్లైన్ జూదానికి బానిసైన ఓ యువకుడు సర్వం పోగొట్టుకుని కుటుంబ సభ్యులకు చెప్పుకోలేక ఇంటి నుంచి వెళ్లిపోయాడు. నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణానికి చెందిన నిరంజన్ అనే యువకుడు ఓ ఫైనాన్స్ సంస్థలో చిరుద్యోగిగా పని చేస్తున్నాడు. ఇతను బెట్టింగ్ యాప్ ద్వారా రూ. 13 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. ఈ మొత్తాన్ని క్రెడిట్ కార్డులు, ప్రైవేట్ చీటీల ద్వారా తీసుకున్నాడు. అప్పులు తీర్చే మార్గం లేక శుక్రవారం రాత్రి ఆరు పేజీల లేఖ రాసి ఇంట్లో పెట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు, భార్యను క్షమించమని, ఇక నుంచి ఎవరికీ కనపడనని లేఖలో రాశాడు. నిరంజన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ రాము తెలిపారు. -
‘లైవ్’ కోడి స్పెషల్!
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: సంక్రాంతి సంబరాలకు కూటమి సర్కారు కొత్త భాష్యం చెప్పింది. పండుగ సంప్రదాయం ముసుగులో ప్రైవేట్ సైన్యాల పహారాలో యథేచ్ఛగా కోడి పందేలు, లైవ్‌లో బెట్టింగ్‌లు, ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో క్యాసినోలను తలదన్నే రీతిలో నిర్వహించిన జూద క్రీడలు, బెల్టు షాపులు పచ్చ ముఠాలకు కాసులు కురిపించాయి. ఇసుక (Sand) నుంచి మద్యం దాకా ప్రజలను పిండేస్తున్న కూటమి నేతలు సంపాదనే లక్ష్యంగా బరి తెగించి వ్యవహరించారు. మునుపెన్నడూ లేని విధంగా ఊరూవాడా కోడి పందాలు, పేకాట, గుండాటలను (Gundata) యథేచ్ఛగా నిర్వహించారు. పండుగ 3 రోజుల్లో రూ.ఐదు వేల కోట్ల మేర దందా సాగింది. పలుచోట్ల కోడి పందేలను కూటమి ప్రజాప్రతినిధులు, మంత్రులు ప్రారంభించడంతోపాటు వారి ఫొటోలతో బరుల వద్ద పెద్ద ఎత్తున ప్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం గమనార్హం. నిశ్చింతగా వచ్చేయండి... సంక్రాంతికి ముందు కూడా కూటమి నేతల కనుసన్నల్లో, పోలీసుల సహకారంతో బాపట్ల, కృష్ణా, భీమవరం, కోనసీమ (Konaseema) తదితర జిల్లాల్లో కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో కోడి పందేలు, జూద శిబిరాలు కొనసాగాయి. కొద్ది నెలల ముందు నుంచే పందేలు కాసేవారికి ఆహ్వానాలు అందాయి. ‘మా మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే కనుసన్నల్లోనే బరులు ఏర్పాటవుతున్నందున ఇబ్బందులేమీ ఉండవు. 3 రోజులు ఉండేలా మీరు నిశ్చింతగా వచ్చేయండి. హోటళ్లలో గదులు కూడా సిద్ధం చేశాం’ అని ఆహ్వానాలు పంపారు. కొత్త వారికి గేలం.. పందెంరాయుళ్లతో ఉన్న పాత పరిచయాలను బలోపేతం చేసుకుంటూనే కొత్తవారిని రప్పించేందుకు నిర్వాహకులు పలు మార్గాలు అనుసరించారు. సోషల్ మీడియాలో ప్రచారంతో హైప్ సృష్టించారు. విదేశాల్లో ఉన్నవారితో పాటు హైదరాబాద్ తదితర నగరాల్లో గేటెడ్ కమ్యూనిటీల్లో నివసిస్తున్న వారు, సాఫ్ట్వేర్ ఉద్యోగులను ఆకర్షించేందుకు నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నారు. ముందే గెట్ టు గెదర్లు ఉభయ గోదావరి జిల్లాల్లో పెద్ద బరుల సంఖ్య ఈదఫా పెరిగాయి. 2 నెలల క్రితమే సమాచారమిచ్చి రహస్యంగా గెట్ టు గెదర్లు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లోని కూటమి ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులను రప్పించారు. మందు, విందు భోజనాలతో జరిగిన ఈ పార్టీల్లోనే సంక్రాంతి బరుల్లో కోడి పందేలపై పందెంరాయుళ్లు అవగాహనకు వచ్చారు. బరుల విస్తీర్ణం, పోటీ జోడీలు, తేదీలు, సమయాలు, వ్యయం తదితరాలు అప్పుడే ఖరారైపోయాయి. రాజకీయ, సినీ, పారిశ్రామిక రంగాల నుంచి ఎవరెవరిని ఆహ్వానించాలనేది నిర్ణయించి ఆ మేరకు అమలు చేసేలా ప్రణాళిక రూపొందించారు. ప్రొఫైల్స్ సిద్ధం.. బరులు నిర్వహించిన వారు భవిష్యత్తులో నిర్వహించబోయే ఆటలకు మంచి లాబీయింగ్ ఏర్పాటు చేసుకున్నారు. సంపన్న వర్గాల నుంచి కొత్తగా వచ్చిన పందెంరాయుళ్ల బలాలు, బలహీనతలను అంచనా వేసుకుని ప్రొఫైల్స్ సిద్ధం చేసుకున్నారు. రానున్న రోజుల్లో నిర్వహించబోయే జూద కార్యకలాపాలకు ఆహ్వానాలు పంపి జేబులు నింపుకునేలా రూట్‌మ్యాప్‌ల తయారీలో నిమగ్నమయ్యారు. శ్రీలంక, థాయ్‌లాండ్, నేపాల్ తదితర దేశాల్లో జరిగే పేకాట, క్యాసినో శిబిరాలకు కూడా వీరిని తరలించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. భీమవరానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారితోపాటు ఆక్వా రంగంలోని పలువురు ప్రముఖులు హైదరాబాద్, విశాఖ, విజయవాడలకు చెందిన వారిని కోళ్ల పందేలకు ఆహ్వానించి పండుగ మూడు రోజులు రాచమర్యాదలు చేసి పంపడం గమనార్హం.లైవ్‌లో బెట్టింగ్‌లు...ఈసారి భారీ బరుల వద్ద పందేలను లైవ్ టెలికాస్ట్ చేయడం ద్వారా క్రికెట్ తరహాలో బెట్టింగ్‌లు నిర్వహించారు. లైవ్ లింక్ ద్వారా దేశ విదేశాల్లోని పందెంరాయుళ్లు కోడిపందేలపై బెట్టింగ్‌లు కాయడం గమనార్హం. ఇదివరకెన్నడూ లేని విధంగా డేగాపురం, వెంకట్రామన్నగూడెం, సీసలి, ఎస్.యానాం, కొయ్యలగూడెం, వీరవాసరం, మురుముళ్ల తదితర ప్రాంతాల్లో పెద్దపెద్ద బరులు ఏర్పాటయ్యాయి. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏకంగా ‘కోడిపందెం లీగ్ (కేపీఎల్)’ పేరిట బరి నిర్వహించడం విశేషం. చదవండి: మహా కుంభమేళా.. ‘కొబ్బరి’ ఆనంద హేలబీచ్ ఫెస్టివల్ పేరిట సంగీత విభావరి ముసుగులో విభిన్న రకాల జూదాలను కొనసాగించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కూటమి ఎమ్మెల్యేలు ఇతరచోట్ల బరులు ఏర్పాటు కాకుండా, తమ బరివద్దకే పందెం రాయుళ్లు వచ్చేలా గుత్తాధిపత్యం చలాయించారు. ఇక మహిళా బౌన్సర్లు ఈసారి ప్రత్యేకం. పందెంరాయుళ్లు ఫోన్ పే ద్వారా డబ్బులు బదిలీ చేస్తే అయిదు నుంచి పది శాతం కమీషన్ తీసుకుని నగదు అందించేలా బరుల వద్ద ఏర్పాట్లు చేశారు. -
పరిగిలో బెట్టింగ్ పావురాల కలకలం
పరిగి: బెట్టింగ్ కోసం తీసుకువచ్చిన రేసింగ్ పావురాలు వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో హాట్ టాపిక్‌గా మారాయి. వీటిని గాల్లోకి వదులుతుండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. శనివారం ఉదయం 7.30 గంటలకు పట్టణ కేంద్రంలోని లక్ష్మీనగర్‌కు ఇద్దరు వ్యక్తులు గూడ్స్ వాహనంలో వచ్చి రెండు బాక్స్‌లలో తెచ్చిన పావురాలను బయటకు వదిలారు. ఉదయాన్నే వాకింగ్‌కు వెళ్లిన స్థానికులు వారిని ప్రశ్నించగా.. తాము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చామని, ఇక్కడ వదిలిన పావురాలు తమతమ యజమానుల వద్దకు వెళ్తాయని చెప్పారు.పావురాల కాళ్లకు కోడ్ నంబర్లు ఉండటంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు ఘటన స్థలానికి రావడానికి ఆలస్యం కావడంతో స్థానికులే పావురాలు ఉన్న వాహనాన్ని పీఎస్‌కు తరలించి, పోలీసులకు అప్పగించారు. డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తిని పోలీసులు విచారించగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సత్యసాయి జిల్లా గోరంట్ల గ్రామానికి చెందిన మునావర్, బాబుజానీలుగా తెలిపారు.పది మంది యజమానులు తమ పావురాలను ఈ పోటీలో పెట్టారని, ఇక్కడ వదిలిన పావురాల్లో ముందుగా చేరుకున్న దాన్ని చిప్ సాయంతో విజేతగా గుర్తిస్తారని చెప్పారు. గోరంట్లకు చెందిన ప్రేంకుమార్ తమను పంపించారని, ఉదయం పావురాలను వదిలితే సాయంత్రం వరకు అక్కడికి వెళ్తాయని వివరించారు. మొత్తం 20 బాక్స్‌లలో 400 పావురాలను తీసుకువచ్చామని, ఇందులో రెండు బాక్స్‌లలోని పావురాలను వదిలామని చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. రూ. వేలల్లో ధర.. ప్రత్యేక శిక్షణ సాధారణంగా పావురాలు గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. వీటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి పోటీల్లో వినియోగిస్తారు. ట్రైనింగ్ పొందిన కపోతాలు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో వెళ్తాయి. ఎక్కడ వదిలినా గమ్య స్థానానికి చేరుకునేలా తరీ్ఫదునిస్తారు. ఉదయం వదిలితే సాయంత్రం వరకు గమ్యాన్ని చేరుకుంటాయి.ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో పావురాల బెట్టింగ్‌లను అధికంగా నిర్వహిస్తారు. పోటీల్లో పాల్గొనే ఒక్కో పావురాన్ని కొనుగోలు చేసేందుకు వేలాది రూపాయలు వెచ్చిస్తారు. అనంతరం వీటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి, బెట్టింగ్‌లలో పాల్గొంటారు. బెట్టింగ్ కాసిన ప్రదేశం నుంచి దాదాపుగా 500 కిలోమీటర్ల దూరానికి తీసుకెళ్లి వదులుతారు. వీటిలో ఎవరి పావురం ముందుగా అక్కడకు చేరుకుంటే వారే గెలిచినట్లు ప్రకటించి బహుమతులు అందజేస్తారు. -
బెట్టింగ్ పిచ్చి తగ్గేదెలా?
మా ఆయనకు 35 సంవత్సరాలు. ఫార్మా కంపెనీలో మంచి ఉద్యోగం. కంపెనీలో మంచి పేరుంది. కానీ ఇటీవల ఆన్లైన్లో గుర్రపు పందేలపై బెట్టింగ్ చేసి చాలా డబ్బు నష్టపోయారు. ఇపుడు జీతం మొత్తం బెట్టింగ్‌కి పెడుతూ, అప్పులు కూడా చాలా చేశారు. నేను అడిగితే, ఏదో ఒక రోజు పెద్దమొత్తంలో గెలిచి, బాకీలన్నీ తీర్చేస్తానని అంటారు. ఎప్పడూ అబద్ధాలు చెప్పని ఆయన ఇప్పుడు తన అప్పులు, బెట్టింగ్ గురించి అబద్ధాలు చెబుతున్నారు. రోజురోజుకు మాకు ఆయన మాటల పైన నమ్మకంపోతోంది. ఆయనను ఎలాగైనా ఈ వ్యసనం నుండి బయటపడేసే మార్గం చెప్పగలరు!– గీత, సికింద్రాబాద్మీ ఆవేదన అర్థమయింది. మద్యానికి, మత్తు పదార్థాలకు అలవాటు పడినట్లే కొందరు ఇలా ‘బెట్టింగ్’ లాంటి వ్యసనాలకు బానిసలవుతున్నారు. వీటిని ‘బిహేవియరల్ అడిక్షన్స్ అంటారు. ఇటీవల చాలామంది ఆన్లైన్ జూదం, స్టాక్ మార్కెట్, క్రికెట్ బెట్టింగ్, హార్స్ రేస్ లాంటి వాటికి బానిసలవుతున్నారు. మీ ఆయనకు ఉన్న మానసిక రుగ్మతను ‘గ్యాంబ్లింగ్ డిజార్డర్’ అంటారు. మొదట్లో సరదాగా ప్రారంభమై, చివరకు ఇలా పూర్తిగా బానిసలవుతారు. ఏదో ఒకరోజు గెలుస్తామనే ధీమాతో అప్పులు చేసి మరీ బెట్టింగ్స్ చేస్తారు. వీరిని మోసగాళ్ళుగా, అబద్ధాల కోరుగా చూడకుండా, ఒక వ్యసనానికి బానిసలైన వారిగా మనం పరిగణించి, మంచి సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో ‘డీఅడిక్షన్ సెంటర్’లో అడ్మిట్ చేయించి, తగిన చికిత్స చేయించాలి. కొన్ని మందులు, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనే మానసిక చికిత్స ద్వారా మీ ఆయనకున్న ఈ బెట్టింగ్ వ్యసనాన్ని మాన్పించవచ్చు. ప్రస్తుతానికి మనీ మేటర్స్ మీ కంట్రోల్లోకి తీసుకోండి. ఆయనను ఏవగించుకోకుండా, సానుభూతితో చూడండి. సమస్య పరిష్కారమయేందుకు మీ తోడ్పాటు చాలా అవసరం. నమ్మకంతో ముందుకెళ్ళండి. ఆల్ ది బెస్ట్ !డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ. (సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com)(చదవండి: వెయిట్ లాస్ స్టోరీ: ఆరోగ్య సమస్యల భయంతో.. ఏకంగా 40 కిలోలు..) -
మీరు కూడా ఆ ఉచ్చులోనే చిక్కుకున్నారా..?
-
విశాఖలో బెట్టింగ్ యాప్ ముఠా.. చైనాతో లింకులు
సాక్షి,విశాఖపట్నం : భారీ సైబర్ ముఠా గుట్టురట్టయ్యింది. విశాఖ కేంద్రంగా బెట్టింగ్ యాప్‌లను నిర్వహిస్తూ వచ్చిన నిధుల్ని చైనా, తైవాన్లకు తరలిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్ సెంటర్ ముసుగులో సైబర్ క్రైమ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు విశాఖ పోలీసులకు అహ్మదాబాద్ నుంచి వచ్చిన సమాచారం అందింది. దీంతో రంగంలోకి విశాఖ పోలీసులు సైబర్ నేరస్థుల్ని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సైబర్ నేరగాళ్ల దందాపై సీపీ శంఖబ్రత బాగ్చి మాట్లాడారు. అహ్మదాబాద్ నుంచి వచ్చిన సమాచారంతో విశాఖ కేంద్రంగా సైబర్ క్రైమ్‌కి పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నాం. చైనాతో సంబంధాలు ఉన్న ఈ ముఠా గుట్టు రట్టు చేశాం. నిందితులు రకరకాల పేర్లతో బెట్టింగ్ యాప్‌లు నిర్వహిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా ఈ బెట్టింగ్ యాప్ నడుపుతున్నారు. విశాఖ వన్ టౌన్ ప్రాంతంలో ఒక వర్కింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన సొమ్మును చైనా,తైవాన్లకు పంపుతున్నారు. నేరానికి పాల్పడ్డ నిందితుల్ని ఇప్పటి వరకూ ఏడుగురుని అదుపులోకి తీసుకున్నాం. నిందితులు నుంచి పది ల్యాప్‌టాప్‌లు, ఎనిమిది పర్సనల్ కంప్యూటర్లు,కార్,బైక్ స్వాధీనం చేసుకున్నాం.వీటితో పాటు 800 అకౌంట్లు, చెక్ బుక్ లు, డెబిట్ కార్డులు, స్వాధీనం చేసుకున్నట్లు సీపీ శంఖబ్రత బాగ్చి వెల్లడించారు. -
పేకాట మొదలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేకాట మళ్లీ మొదలైంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మూసేయించిన పేకాట క్లబ్‌లు టీడీపీ అధికారంలోకి రావడంతో మళ్లీ తెరుచుకుంటున్నాయి. అధికార కూటమి నేతలు క్లబ్‌లను ప్రారంభించేందుకు వారం రోజులుగా సన్నాహాలు చేస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండానే అధికారాన్ని అడ్డం పెట్టుకుని క్లబ్‌లను ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే గుంటూరు నగరంలో నడిబొడ్డున ఉన్న ప్రముఖ క్లబ్లో బుధవారం నుంచి పేకాట ప్రారంభమైంది.గత టీడీపీ ప్రభుత్వాల హయాంలో పేకాట క్లబ్బులది ప్రత్యేక చరిత్ర. రిక్రియేషన్ పేరుతో ఈ క్లబ్‌లలో పేకాటే కాదు.. బెట్టింగులు, అసాంఘిక కార్యకలాపాలూ కొనసాగేవి. ఊర్ల శివార్లు, తోటల్లో ప్రత్యేక శిబిరాలు కూడా నిర్వహించేవారు. అంతా ఆ పార్టీ నేతల నిర్వహణలో, వారి కనుసన్నల్లోనే జరుగుతుండేవి. వీటిని మూసి వేయాలని ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేశాయి. అయినా అధికార పార్టీ ఎమ్మెల్యేల అండతో అవి నిరాఘాటంగా కొనసాగాయి. 2019లో రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా క్లబ్‌లను మూసివేయించింది. రిక్రియేషన్ పేరుతో క్లబ్‌లలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు, పేకాట, బెట్టింగ్‌లను పూర్తిగా నిషేధించింది. వీటి మూసివేతకు ప్రత్యేక బృందాలను కూడా నియమించింది. గత ఐదేళ్లలో ఎక్కడా పేకాట క్లబ్‌లు నడవకుండా చర్యలు తీసుకుంది.టీడీపీ కూటమి అధికారంలోకి రాగానేరాష్ట్రంలో మళ్లీ టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు మళ్లీ క్లబ్‌లు, శిబిరాలు తెరిచి పేకాట, బెట్టింగ్, ఇతర కార్యకలాపాలకు రంగం సిధ్ధం చేస్తున్నారు. క్లబ్‌ల నిర్వాహకులు ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధులను ఆశ్రయించగా, తాము చూసుకుంటామని, క్లబ్‌లు ప్రారంభించుకోండని భరోసా ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఎలాంటి అనుమతులు లేకపోయినా 2019కి ముందు మాదిరిగానే మళ్లీ క్లబ్‌ల వ్యవహారాలు నడిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే గతంలో ఆడిన క్లబ్ సభ్యులకు మళ్ళీ పేకాట ప్రారంభిస్తున్నట్టు సమాచారం అందించారు.రోజూ లక్షల్లో వ్యాపారంక్లబ్లో ప్రతి ఆటకు ప్రతి టేబుల్ నుంచి సుమారు రూ.1000 చొప్పున కమీషన్ తీసుకుంటారు. అలా 20కి పైగా టేబుల్స్‌తో పేకాట, సైడ్ బిజినెస్‌లతో రోజూ లక్షల్లో వ్యాపారం జరుగుతుంది. ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ పేకాట కొనసాగుతూనే ఉంటుంది. ఈ క్లబ్‌ల బారిన పడి ఉన్నతస్థాయిలో ఉన్న వారు, మధ్యతరగతి వారు అనేక మంది ఆస్తులు పోగొట్టుకొని, అప్పుల పాలైపోయారు. వారిలో కొందరు దిక్కు తోచక ఆత్మహత్యలు కూడా చేసుకొన్నారు. దీంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. బాగు పడిందల్లా క్లబ్‌ల నిర్వాహకులు, వాటి నుంచి నెలనెలా మామూళ్ల రూపంలో లక్షలాది రూపాయలు దండుకొనే కొందరు టీడీపీ ప్రజాప్రతినిధులే. ఇప్పుడు మళ్లీ ప్రజల జేబులను పీల్చి పిప్పి చేసి, తమ జేబులు నింపుకొనేందుకు అధికార కూటమి నేతలు సిద్ధమవుతున్నారు. ఇవి మళ్లీ ప్రారంభమైతే మధ్య తరగతి కుటుంబాల జీవితాలు చీకటిమయం కావడం ఖాయం. అధికార పార్టీ నాయకులకు భయపడి ఇలాంటి క్లబ్‌లను పోలీసులు చూసీ చూడకుండా వదిలేస్తారా లేక వాటిపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. -
ఫలితాలపై బెట్టింగ్ మార్కెట్ ప్రకంపనలు
2024 లోక్‌సభ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. చివరి దశ ఓటింగ్ జూన్ ఒకటిన జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ లోక్‌సభ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విజయం తమదేననే నమ్మకంతో ఉంది. ప్రధాని మోదీ కూడా బీజేపీకి 400కు పైగా లోక్‌సభ స్థానాలు దక్కుతాయని జోస్యం చెప్పారు. అయితే ‘బెట్టింగ్ మార్కెట్’ దీనికి భిన్నమైన వాదన వినిపిస్తోంది.ముంబైకి చెందిన టాప్ బుకీ ఒకరు మీడియాతో మాట్లాడుతూ ప్రారంభంలో అంటే మొదటి దశ ఓటింగ్‌కు ముందు, బీజేపీకి దక్కే సీట్లు అధికంగా ఉంటాయనే అంచనాలున్నాయన్నారు. అయితే అయితే మూడు దశల ఓటింగ్ తర్వాత బీజేపీకి ఆదరణ తగ్గిందన్నారు. ఇప్పుడు ఆరు దశల ఓటింగ్ తర్వాత బీజేపీ పరిస్థితి తారుమారయ్యిదన్నారు.బెట్టింగ్ మార్కెట్ అంచనాల ప్రకారం ప్రస్తుతం బీజేపీ 295 నుంచి 305 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్‌కు 55 నుంచి 65 సీట్లు వస్తాయనే అంచానాలున్నాయి. మార్కెట్ ఎప్పుడూ బీజేపీ చెప్పిన 400 లెక్కకు మద్దతునివ్వలేదు. మార్కెట్ సెంటిమెంట్ ప్రకారం బీజేపీకి 350 సీట్లు కూడా సాధ్యమయ్యేలా కనిపించడం లేదని ముంబై బుకీ తెలిపారు. దేశంలో వివిధ ప్రాంతాల్లోని బెట్టింగ్ మార్కెట్లు అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్‌కు దక్కే లోక్‌సభ సీట్లపై వేసిన అంచనాలిలా ఉన్నాయి.ఫలోడి బెట్టింగ్ మార్కెట్ (రాజస్థాన్)🔹కాంగ్రెస్ - 117🔹ఇండియా - 246🔹బీజేపీ - 209🔹ఎన్డీఏ - 253పాలన్పూర్ (గుజరాత్)🔹కాంగ్రెస్ - 112🔹ఇండియా - 225🔹బీజేపీ - 216🔹ఎన్డీఏ - 247కర్నాల్ (హర్యానా)🔹కాంగ్రెస్ - 108🔹ఇండియా - 231🔹బీజేపీ - 235🔹ఎన్డీఏ-263బెల్గాం (కర్నాటక)🔹కాంగ్రెస్ - 120🔹ఇండియా - 230🔹బీజేపీ - 223🔹ఎన్డీఏ-265కోల్‌కతా 🔹కాంగ్రెస్ - 128🔹భారతదేశం - 228🔹బీజేపీ - 218🔹ఎన్డీఏ - 261విజయవాడ 🔹కాంగ్రెస్ - 121🔹ఇండియా- 237🔹బీజేపీ - 224🔹ఎన్డీఏ - 251ఇండోర్ 🔹కాంగ్రెస్ - 94🔹ఇండియా - 180🔹బీజేపీ - 260🔹ఎన్డీఏ - 283అహ్మదాబాద్ 🔹కాంగ్రెస్ - 104🔹ఇండియా - 193🔹బీజేపీ - 241🔹ఎన్డీఏ-270సూరత్ 🔹కాంగ్రెస్ - 96🔹ఇండియా - 186🔹బీజేపీ - 247🔹ఎన్డీఏ - 282దేశంలోని పలు బెట్టింగ్ మార్కెట్లు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ - బీజేపీల మధ్య గట్టి పోటీని సూచిస్తున్నాయి. జూన్ ఒకటిన చివరి దశ ఓటింగ్ జరిగాక, జూన్ 4న వెలువడే ఫలితాల్లో ఏ పార్టీ సత్తా ఎంతో తేలిపోనుంది. -
IPL 2024 ఫైనల్ జోరుగా బెట్టింగ్..
-
Lok Sabha Election 2024: ఫలోదీ సట్టా బజార్లో... తగ్గిన బీజేపీ హవా
లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై రాజస్తాన్‌లోని ఫలోదీ సట్టా బజార్ తాజా అంచనాలు ఎలా ఉన్నాయి? కచి్చతమైన అంచనాలు, బెట్టింగ్‌లకు దేశమంతటా పేరొందిన ఫలోదీ మార్కెట్ ఇప్పటికీ బీజేపీ సొంతంగా మెజారిటీ సాధిస్తుందని నమ్ముతోంది. అక్కడి పంటర్లు మోదీ సర్కారుపైనే బెట్టింగులు కడుతున్నారు. కానీ నెలక్రితం అంచనాలతో పోలిస్తే బీజేపీ నెగ్గబోయే స్థానాల సంఖ్య బాగా తగ్గడం విశేషం. బీజేపీ 330 నుంచి 333 స్థానాలు నెగ్గుతుందని తొలి విడత పోలింగ్‌కు ముందు దాకా ఇక్కడ జోరుగా పందేలు సాగాయి. కానీ ఇప్పుడది 296 నుంచి 300 సీట్లకు పరిమితమైంది...! క్రమంగా తగ్గుదల.. ఒక్కో విడత పోలింగ్ జరుగుతున్న కొద్దీ ఫలోదీ బజార్లో బీజేపీకి అంచనాలు తగ్గుతూ వస్తున్నాయి. 307 నుంచి 310 స్థానాలు గెలుస్తుందంటూ మే 13న నాలుగో విడత పోలింగ్‌కు ముందు పందేలు నడిచాయి. నాలుగో దశ ముగిశాక తాజాగా 296 నుంచి 300కు తగ్గాయి. ఎన్డీఏకు 350 దాటుతాయని తొలుత పేర్కొనగా, 329 నుంచి 332 మధ్య రావచ్చని తాజాగా పందేలు సాగుతున్నాయి. 2019 ఎన్నికల్లో ఎన్డీఏకు 353 స్థానాలు రావడం తెలిసిందే. ఇక కాంగ్రెస్‌కు 41 నుంచి 43 సీట్ల కన్నా రావని నెల క్రితం అంచనా వేసిన ఫలోదీ పందెంరాయుళ్లు కాస్తా, 58 నుంచి 62 స్థానాలు గెలుస్తుందని తాజాగా బెట్లు కడుతున్నారు. 2019లో కాంగ్రెస్‌కు 52 స్థానాలొచ్చాయి. ఈసారి నాలుగు విడతల్లో పోలింగ్ 2019 ఎన్నికలతో పోలిస్తే కాస్త తగ్గడం తెలిసిందే. తదనుగుణంగా ఫలోదీ మార్కెట్ కూడా బీజేపీ విషయంలో అంచనాలను సవరించుకున్నట్టు కనిపిస్తోంది. రాష్ట్రాలవారీగా.. ఫలోదీ సట్టా బజార్ తాజా బెట్టింగ్‌ల ప్రకారం బీజేపీ గుజరాత్లో క్లీన్‌స్వీప్ చేస్తుంది. 26 స్థానాలూ గెలుస్తుంది. మధ్యప్రదేశ్‌లోని 29కి 27–28 రావచ్చు. రాజస్తాన్‌లో 2019లో 24 గెలవగా ఈసారి 18–20తో సరిపెట్టుకోవచ్చు. ఒడిశాలోని మరో 4 స్థానాలు అదనంగా 11 నుంచి 12 రావచ్చు. పంజాబ్‌లో 2019లో రెండు గెలవగా ఈసారీ 2 నుంచి 3 రావచ్చు. మొత్తం 10 స్థానాలూ గెలిచిన హరియాణాలో 5 నుంచి 6తో సరిపెట్టుకోవచ్చు. తెలంగాణలో 4 గెలవగా ఈసారి 5 నుంచి 6 రావచ్చు. ఛత్తీస్‌గఢ్‌లోని 11, హిమాచల్‌ప్రదేశ్‌లోని 4, ఉత్తరాఖండ్‌లోని 5 స్థానాలనూ బీజేపీ క్లీన్‌స్వీప్ చేస్తుంది. జార్ఖండ్‌లో మళ్లీ 10 నుంచి 11 దాకా రావచ్చు. 2019లో ఒక్క సీటూ నెగ్గని తమిళనాడులో 3 నుంచి 4 స్థానాలు రావచ్చని బెట్టింగులు నడుస్తున్నాయి. కీలకమైన పశి్చమబెంగాల్లో 2019లో 18 చోట్ల గెలవగా ఈసారి 21 నుంచి 22 దాకా రావచ్చు. యూపీలో 63 చోట్ల గెలిచిన బీజేపీ ఈసారి మరో రెండు సీట్లు పెంచుకోవచ్చని సట్టా బజార్ అంచనా. కచ్చితత్వం ఎక్కువ... ఎన్నికల ఫలితాల విషయంలో ఫలోదీ మార్కెట్ ఏం చెబితే అదే జరుగుతుందన్న నమ్మకముంది. ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఫలోదీ బుకర్ల అంచనాలే అక్షరాలా నిజమయ్యాయి. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్ విషయంలో దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ తలకిందులు కాగా సట్టా బజార్ అంచనాలు మాత్రమే నిజమయ్యాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎన్నికలవేళ తీవ్ర ఒడుదొడుకుల్లో స్టాక్‌మార్కెట్లు.. కారణం..
సార్వత్రిక ఎన్నికల ప్రారంభానికి ముందు స్టాక్‌మార్కెట్లు రికార్డు గరిష్ఠాలను చేరాయి. కానీ క్రమంగా సెన్సెక్స్ అస్థిరంగా మారింది. ప్రస్తుత కాలంలో సూచీలు నిత్యం తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. ఈసారి ఎన్నికల్లో గతంలో కంటే తక్కువ ఓటింగ్ శాతం నమోదవడంతో కేంద్రంలో అధికారపార్టీ, ప్రతిపక్షపార్టీల గెలుపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలను సర్దుబాటు చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. సమీప భవిష్యత్తులో ఏం జరుగుబోతుందో పరిశీలిస్తున్నారు.ఎన్నికల అనిశ్చితి వల్ల గత రెండు వారాలుగా స్మాల్ అండ్ మిడ్‌క్యాప్ స్టాక్‌లు తీవ్ర ఒడుదొడుకులకు గురవుతున్నాయి. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లో మరింత అనిశ్చితులు ఏర్పడతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చేముందు 3-4 ట్రేడింగ్ సెషన్లు, ఫలితాలు వచ్చాక 3-4 ట్రేడింగ్ సెషన్లు మార్కెట్లో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నాయి.ఇదీ చదవండి: 100 నుంచి 75 వేల పాయింట్ల వరకు ప్రస్థానంస్టాక్మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకునే చాలామంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంటారు. కొందరికైతే స్టాక్‌మార్కెట్ గ్యాంబ్లింగ్ అనే అభిప్రాయం ఉంది. స్పష్టమైన వైఖరి, భవిష్యత్తు ప్రణాళిక లేకుండా మార్కెట్లో తాత్కాలికంగా డబ్బు సంపాదించే వారికి ఇది గ్యాంబ్లింగ్‌గానే కనిపిస్తోంది. ఈజీ మనీకి అలవాటుపడి మార్కెట్లో కాకుండా బయట ఇతర అవకాశాలు ఉంటే వెంటనే ఆయా మార్గాల్లోకి డబ్బు మళ్లిస్తుంటారు. ఇటీవల జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గెలుపోటములపై ఇప్పటికే బెట్టింగ్‌ల పర్వం మొదలైంది. దాంతో మార్కెట్లో ఉన్న చాలామంది బెట్టింగ్‌వైపు మొగ్గు చూపుతున్నారు. జూన్ 4న జరిగే ఓట్ల లెక్కింపునకు ముందే ఎవరుగెలుస్తారనే అంచానాలతో షాడో బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లను పరిశీలిస్తున్నారు. -
పొలిటికల్ పార్టీలపై కోట్లలో బెట్టింగ్
-
యాప్‌ల్లో ఎన్నికల పందేలు
సాక్షి, హైదరాబాద్: బంతి బంతికీ.. మ్యాచ్ మ్యాచ్‌కూ ఎలాగైతే క్రికెట్ బెట్టింగ్‌లు జరుగుతున్నాయో.. అచ్చం అదే తరహాలో దేశంలో జరుగుతున్న ఎన్నికలపై కూడా పందేలు కాస్తున్నారు. క్రికెట్, ఫుట్‌బాల్, రగ్బీ, సాకర్, బాక్సింగ్, హార్స్ రైండింగ్ వంటి అన్ని రకాల క్రీడలపై బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న పలు ఆఫ్ షోర్ బెట్టింగ్ యాప్‌లు, వెబ్సైట్లు ఎన్నికల ఫలితాలపై కూడా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నాయి. పార్టీల వారీగా వచ్చే ఫలితాలు, నియోజకవర్గం, అభ్యర్థుల విజయాలు, మెజారిటీ వారీగా పందేలు కడుతున్నాయి.గత ఎన్నికల్లోనే మొదలు..2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఈ తరహా బెట్టింగ్‌లు జరిగినా అది తక్కువ స్థాయిలోనే జరిగాయి. కానీ, ఈసారి ఎన్నికలు అన్ని ప్రాంతీయ, జాతీయ పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడంతో పందేలపై ఆసక్తి పెరిగింది. దీంతో బెట్టింగ్, గ్యాంబ్లింగ్ సంస్థలు వీటిపై దృష్టిసారించాయి. ఫెయిర్ ప్లే, జన్నత్‌బుక్, ఓం 247, జైబుక్, సాట్‌స్పోర్ట్, బకార్డీ వంటి సుమారు డజన్ యాప్‌లు, వెబ్సైట్లు ప్రత్యేకంగా ఎన్నికల్లో బెట్టింగ్‌లను నిర్వహిస్తున్నాయి. మ్యూల్ ఖాతాల్లోనే లావాదేవీలుబెట్టింగ్ యాప్‌లు ఇండియా వెలుపలి నుంచి నిర్వహిస్తుంటాయని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. యాప్‌లను నిర్వహణ చేసే కంపెనీలు సిండికేట్‌గా మారి ఈ ఎన్నికల పందేలను నిర్వహిస్తుంటాయని, యూపీఐ చెల్లింపులు, బ్యాంక్ లావాదేవీల కోసం మ్యూల్ బ్యాంక్ అకౌంట్లనే వినియోగిస్తుంటాయని తెలిపారు. పందెం డబ్బు మొత్తం ఆయా అకౌంట్ల నుంచి క్రిప్టో వ్యాలెట్ల ద్వారా ఎలాంటి పన్ను చెల్లింపులు లేకుండా దేశం దాటేస్తుందని పేర్కొన్నారు.ఇదంతా చట్ట విరుద్ధంతెలంగాణ, ఏపీతో సహా దేశంలోని చాలా రాష్ట్రాల్లో బెట్టింగ్, జూదం చట్టవిరుద్ధం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం–2000, ఇన్మర్మేషన్ టెక్నాలజీ రూల్స్–2021 ప్రకారం ఆన్లైన్లో బెట్టింగ్ అనేది జూదంగా పరిగణిస్తారు. యాప్‌లను డౌన్లోడ్ చేసేందుకు వీలుగా ఏపీకే ఫైల్స్‌ను అందుబాటులో ఉంచుతారు. డోన్లోడ్ చేసుకునే క్రమంలో ఫోన్ కాంటాక్ట్‌లు, ఇతరత్రా పర్మిషన్స్‌ను అనుమతించాలని కోరతారు. పొరపాటున యాక్సెస్ చేయగానే హానికర సాఫ్ట్వేర్లు మొబైల్లో డౌన్లోడ్ అయిపోతాయి. దీంతో మన ఫోన్ హ్యాక్ అయిపోతుంది. సైబర్ నేరాల బారిన పడే ప్రమాదం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రూ.100 నుంచి రూ.10 లక్షల వరకూ పందెం..రూ.100 నుంచి రూ.10 లక్షల వరకు పందేం వేయవచ్చు. టెలిగ్రాం, వాట్సాప్ వంటి ఇన్స్టంట్ మెసేజ్ యాప్‌ల ద్వారా ఈ బెట్టింగ్‌లు ఎక్కువగా జరుగుతుంటాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు వంటి దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోని పలు కీలకమైన రాష్ట్రాల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందో ఫ్యాన్సీ పందేలుగా పేర్కొంటూ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నాయి. ప్రధాన జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లు ఒంటరిగా ఎన్ని సీట్లు సాధిస్తాయి? రాష్ట్రాల వారీగా ఆయా పార్టీలు కూటమితో కలిసి ఎన్ని సీట్లు గెలుస్తాయి? .. ఇలా విభాగాల వారీగా పందేలు నిర్వహిస్తున్నాయి. -
బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్లాట్ఫారాలతో నష్టం ఎంతంటే..
భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ కంపెనీలపై ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. ఆయా బెట్టింగ్ సంస్థల వల్ల ప్రభుత్వానికి 2.5 బిలియన్ డాలర్లు(రూ.20వేలకోట్లు) నష్టం కలుగుతోందని అఖిల భారత గేమింగ్ సమాఖ్య (ఏఐజీఎఫ్) తెలియజేసింది. విదేశీ కంపెనీలు భారత్‌లో తమ సంస్థలకు చెందిన ప్లాట్ఫామ్ల్లో చట్టవ్యతిరేక బెట్టింగ్, గ్యాంబ్లింగ్ గేమ్‌లను అందిస్తున్నాయి. అయితే వాటికి చట్టబద్ధత లేకపోవడంతో చాపకింద నీరులా అవి విస్తరిస్తున్నాయి. ఆ కంపెనీలకు చెందిన ప్లాట్‌ఫామ్‌లు వినియోగిస్తున్న వారు చట్టబద్ధత ఉన్నావాటికి లేని వాటిని మధ్య తేడాను గ్రహించలేకపోతున్నారని ఏఐజీఎఫ్ సీఈఓ రోలండ్ లాండర్స్ తెలిపారు. ఇలా విదేశీ కంపెనీలు భారత్‌లోని చట్టబద్ధ గేమింగ్ పరిశ్రమకు హాని కలిగించడంతో పాటు వినియోగదార్లకు నష్టం కలిగేంచేలా వ్యవహరిస్తున్నాయని ఆయన అన్నారు. ఈ ఆఫ్‌షోర్ ప్లాట్‌ఫామ్స్ ఏటా 12 బిలియన్ డాలర్ల (సుమారు రూ.లక్ష కోట్ల) వరకు యూజర్లు, ప్రకటన కంపెనీల నుంచి డిపాజిట్లను వసూలు చేస్తున్నాయి. అంటే జీఎస్టీ రూపంలో 2.5 బిలియన్ డాలర్ల(రూ.20వేల కోట్లు) మేర కేంద్రానికి నష్టం జరుగుతోందని చెప్పారు. ఇలాంటి కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందన్నారు. చాలా సంస్థలు ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్లో వ్యాపార ప్రకటనలు పెంచాయి. తమ ప్లాట్‌ఫారాలపై జీఎస్టీ/ టీడీఎస్ వర్తించదనీ చెబుతున్నాయన్నారు. దాంతో ఆయా గేమింగ్ ప్లాట్‌ఫారాల్లో ప్రకటనలకోసం కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: గూగుల్‌లో నిరసన సెగ..రూ.10వేలకోట్ల ప్రాజెక్ట్ నిలిపేయాలని డిమాండ్.. -
ఐపీఎల్ బెట్టింగ్ జోరు..! బార్ అండ్ రెస్టారెంట్లు, లాడ్జీలే అడ్డా..
ఆన్లైన్ బెట్టింగ్‌ల ద్వారా యువత పెడ దారి పడుతోంది. గతంలో ఐపీఎల్ బెట్టింగ్‌లు జరిపిన వారే మళ్లీ రంగలోకి దిగినట్లు తెలుస్తోంది. గతంలో జిల్లా కేంద్రంలోని ఓ వార్డులో ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతోందన్న సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌లో జోరుగానే సాగుతున్నట్లు సమాచారం. ఇప్పటికై నా పోలీసులు స్పందించి బెట్టింగ్ రాయుళ్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా వాసులు కోరుతున్నారు. అన్నిరకాల క్రీడల్లో క్రికెట్ అంటే అందరికీ మక్కువ. చిన్నారుల నుంచి మొదలుకుని వృద్ధుల వరకు క్రికెట్ అంటే అభిమానమే. అదే అభిమానంతో ఐపీఎల్ క్రికెట్‌పై యువత నుంచి మొదలుకుని మధ్య వయస్సు వారు సైతం ఆన్లైన్ బెట్టింగ్ పెడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని కొన్ని బార్ అండ్ రెస్టారెంట్లు, లాడ్జీలను అడ్డగా చేసుకుని మందు, విందు పార్టీలు ఏర్పాటు చేసుకుని క్రికెట్ చూసుకుంటూ బాల్ టూ బాల్.. వికెట్ టూ వికెట్ అంటూ బెట్టింగ్‌లు పెడుతున్నారు. మరికొందరు రహస్య ప్రాంతాల్లో ఒకేచోట గుమిగూడి సెల్ఫోన్లలో క్రికెట్ వీక్షిస్తూ ఆన్లైన్ బెట్టింగ్‌లు పెడుతున్నారు. ఇంట్లోనే ఉండి టీవీల ముందు కూర్చుని ఆన్లైన్ ద్వారానే బెట్టింగ్ కడుతున్నారు. పల్లెలు మొదలుకుని పట్టణాల వరకు యువత టీవీలు, సెల్ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ఈ సంస్కృతి కొన్నేళ్లుగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోనూ పట్టణాలు, పల్లెల్లోనూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. బాల్ టూ బాల్.. వికెట్ టూ వికెట్ అంటూ రూ.100 నుంచి బెట్టింగ్ ప్రారంభిస్తారు. రోజూ ఒక్కో మ్యాచ్‌పై సుమారు రూ.1000 నుంచి ప్రారంభమై రూ.లక్షల్లో బెట్టింగ్ సాగుతోంది. అంతేకాకుండా బార్ అండ్ రెస్టారెంట్లలో పెద్దపెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసి మ్యాచ్ వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. యువత పెడదారి.. జిల్లా కేంద్రంలోని ఓ కాలనీకి చెందిన యువకుడు ఉన్నత చదువు నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లాడు. అక్కడ స్నేహితులతో కలిసి క్రికెట్ బెట్టింగ్, ఆన్లైన్ గేమ్స్‌కు పాల్పడి ఇంట్లో తల్లిదండ్రులకు తెలియకుండా రూ.3లక్షలు అప్పు చేశాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు కొడుకును మందలిస్తే ఆత్మహత్య చేసుకుంటాడేమోనని భయపడి అతను చేసిన అప్పు తిరిగి చెల్లించారు. 2023 నవంబర్ 15న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ నడుస్తుండగా మంచిర్యాలకు చెందిన ఓ సింగరేణి ఉద్యోగి కుమారుడు ఇంట్లో నుంచి రూ.50 వేలు తీసుకెళ్లి బెట్టింగ్‌కు పాల్పడ్డాడు. విషయం ఇంట్లో తెలియడంతో మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా కుటుంబ సభ్యులు గమనించి కాపాడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కానీ ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లలేదు. ఐపీఎల్ అంటేనే బెట్టింగ్ గేమ్.. నేడు క్రికెట్ ఆట అంటే అన్ని వర్గాల ప్రజలకు ఎంతో అభిమానం. దీన్ని ఆసరాగా మల్చుకుని కొందరు వ్యాపారం చేస్తున్నారు. కమీషన్లు తీసుకుంటూ బూకీలుగా మారుతున్నారు. ఆన్లైన్ ద్వారా బెట్టింగులు నడిపిస్తూ రెండు వర్గాల తరుపున మధ్యవర్థిత్వం చేసి అందిన కాడికి దండుకుంటున్నారు. గూగుల్‌పే, పేటీఎం ద్వారా సులభంగా మనీ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉన్నందువల్ల ఆన్లైన్ ద్వారా లావాదేవీలు జరుపుతున్నారు. గతంలో జిల్లా కేంద్రంలో ఇలాంటి సంఘటనలు వెలుగుచూశాయి. మ్యాచ్‌లు ప్రారంభమైనప్పటి నుంచి ఆడేది ఎవరైనా సరే తమకు నచ్చిన ఆటగాళ్ల గెలుపు ఓటమిపై తమకున్న ఆలోచన విధానంతో బెట్టింగులు పెడుతున్నారు. పలువురిపై కేసు నమోదు.. నిర్మల్‌టౌన్: ఐపీఎల్ బెట్టింగ్ ఆడిన వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలో వివరాలు వెల్లడించారు. జిల్లా కేంద్రానికి చెందిన మణికంఠ, చిలమంతుల శివచారి భైంసాకు చెందిన రెహమాన్ ద్వారా ఆన్లైన్లో వెబ్సైట్, ఐడీ క్రియేట్ చేసుకున్నారు. డబ్బులను కై న్లుగా మార్చి యూజర్ ఐడీలో పెట్టి బెట్టింగ్ ఆడుతున్నామని కస్టమర్లకు చెప్పారు. కస్టమర్లకు కూడా ఐడీ క్రియేట్ చేసి ఆడిపిస్తామని తెలిపారు. పక్కా సమాచారం మేరకు పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.14,170 నగదు, 4 ఫోన్లు, 1 ఏటీఎం కార్డు స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో పట్టణ సీఐ అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఇవి చదవండి: మొబైల్ రిపేరే.. జాడ చూపింది! -
కంపెనీని బురిడీ కొట్టించి గ్యాంబ్లింగ్.. అసలేం జరిగిందంటే..
కాయ్ రాజా కాయ్.. వంద పెట్టండి... వెయ్యి పట్టండి వంటి ప్రకటనలతో ఆన్లైన్ జూదం, బెట్టింగ్‌లు, మనీసర్క్యులేషన్ వంటి చెడు మార్గాలకు యువత బానిసవుతున్నారు. విలాసాలకు అలవాటుపడిన వారు తమ కోరికలు తీర్చుకునేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. తీరా నేరం రుజువై జైలుపాలవుతున్నారు. ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్న ఓ వ్యక్తి తాజాగా తన అధికారాన్ని దుర్వినియోగం చేసి దాదాపు రూ.180 కోట్లమేర మోసానికి పాల్పడ్డాడు. గ్యాంబ్లింగ్ చేసి ఆ డబ్బంతా పోగొట్టుకున్నాడు. చివరికి నేరం రుజువై ఆరున్నరేళ్ల జైలు శిక్ష విధించిన ఘటన అమెరికాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. అమిత్‌పటేల్ అనే ఉద్యోగి అమెరికాలోని జాక్సన్విల్లే జాగ్వార్ కంపెనీలో ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ అనాలసిస్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తుండేవాడు. కంపెనీ, ఉద్యోగులు తాత్కాలిక ఖర్చుల కోసం వర్చువల్ క్రెడిట్ కార్డ్ ప్రోగ్రామ్ (వీసీసీ)ని ఉపయోగించేలా అతడికి అవకాశం ఉండేది. వీసీసీను చట్టబద్ధమైన వ్యాపార ఖర్చులకోసం వినియోగించాల్సి ఉంటుంది. అయితే అతడు వ్యక్తిగతంగా చేస్తున్న అంతర్జాతీయ ప్రయాణాల కోసం, విమాన ఛార్జీలు, హోటల్ ఛార్జీలు వంటి వాటికి వీసీసీను వినియోగించేవాడు. ఈ లావాదేవీలను కంపెనీ తరఫు ఖర్చులుగా చిత్రీకరించేందుకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించాడు. చాలాసార్లు ప్రయాణాలు చేయకపోయినా నకిలీ ధ్రువపత్రాల ద్వారా కంపెనీని మోసం చేశాడు. అవి ముందుగా నమ్మదగినవిగానే అనిపించినా క్రమంగా కంపెనీ యాజమాన్యానికి అనుమానం వ్యక్తం అయింది. పటేల్ వీసీసీ ద్వారా అక్షరాల 21.1 మిలియన్ డాలర్లు(సుమారు రూ.180 కోట్లు) ఖర్చు చేశాడు. ఈ డబ్బును ఖరీదైన గడియారాలను కొనుగోలు చేయడానికి, ఆన్లైన్లో జూదం ఆడటానికి, ప్రైవేట్ జెట్లను అద్దెకు తీసుకోవడానికి, స్నేహితుల కోసం లగ్జరీ ట్రిప్‌ల కోసం ఉపయోగించాడు. ఫ్లోరిడాలోని పోంటే వెడ్రా బీచ్‌లో విల్లా, కొత్త టెస్లా మోడల్ 3 సెడాన్, నిస్సాన్ పికప్ ట్రక్ కొనుగోలు చేయడానికి ప్రయత్నించగా కంపెనీ విచారణ జరిపి పోలీసులను ఆశ్రయించింది. ఇదీ చదవండి: ‘గొప్పలు చెప్పి సరిపెట్టొద్దు.. అదో విచిత్ర అలవాటు’ ఈ వ్యవహారంపై పూర్తి విచారణ జరిపిన పోలీసులు కేసును కోర్టుకు తరలించారు. పూర్వాపరాలు, ఆధారాలు తెలుసుకున్న కోర్టు మంగళవారం అమిత్పట్ల్కు ఏకంగా ఆరున్నరేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ సందర్భంగా పటేల్ మాట్లాడుతూ ఏడాది ముందు తానెంతో తెలివిగల వాడినని భావించినట్లు చెప్పాడు. కానీ జూదం, గ్యాంబ్లింగ్ వల్ల చాలా నష్టపోయానని అన్నాడు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారంలో కంపెనీకి చెందిన ఇతర ఉద్యోగులపాత్ర లేదని కోర్డు నిర్ధారించింది. చివరకు కంపెనీ పటేల్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. -
బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్రకటనలకు దూరంగా ఉండండి
న్యూఢిల్లీ: బెట్టింగ్, గ్యాంబ్లింగ్ సంబంధిత ప్రకటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో అటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను ప్రమోట్ చేయడానికి దూరంగా ఉండాలని సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ సంస్థ సీసీపీఏ సూచించింది. అలాంటి కార్యకలాపాలను ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు అడ్వైజరీని జారీ చేసింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల ప్రకటనలు, ప్రమోషన్ మొదలైనవి వివిధ చట్టాల కింద నిషిద్ధమని సీసీపీఏ పేర్కొంది. ‘పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867 ప్రకారం బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌పై నిషేధం ఉంది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వీటిని చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు. అయినప్పటికీ గేమింగ్ ముసుగులో పలు ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లు, యాప్‌లు నేరుగా బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్రకటనలు ఇస్తున్నాయి‘ అని సీసీపీఏ తెలిపింది. ఇలాంటి కార్యకలాపాలను బలపర్చడమనే ది ఆర్థికంగా, సామాజికంగా, ముఖ్యంగా యువతపై, తీవ్ర ప్రతికూల ప్రభావాలు చూపుతుందని పేర్కొంది. వాటికి సంబంధించిన మార్గదర్శకాలు అన్ని మాధ్యమాలకు వర్తిస్తాయని సీసీపీఏ తెలిపింది. చట్టవిరుద్ధమైన వాటిని ఏ రకంగా ప్రమోట్ చేసినా ఆయా కార్యకలాపాల్లో పాల్గొన్న వారితో సమానంగా చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లను హెచ్చరించింది. -
తొలిరోజే పుంజుకున్నాయ్
సాక్షి, అమరావతి/భీమవరం/అమలాపురం: భోగి రోజైన ఆదివారం పందెం కోళ్లు జూలు విదిల్చాయి. బరిలోకి దూకి కత్తులు దూశాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కోడి పందేలు మొదలయ్యాయి. గోదావరి జిల్లాల్లో భారీఎత్తున పందేలు జరిగాయి. పశి్చమ గోదావరి జిల్లా భీమవరం, ఉండి, ఆకివీడు, కాళ్ల, పాలకొల్లు, నరసాపురం, ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం, నిడమర్రు, దెందులూరు మండలాలు, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పందేలు సందడిగా సాగాయి. కోనసీమ జిల్లా రాజోలు, అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం నియోజకవర్గాల పరిధిలో పలుచోట్ల కోడిపందేలు జోరుగా సాగాయి. కొన్నిచోట్ల బరులకు ప్రత్యేకంగా ఫెన్సింగ్ కూడా వేశారు. పెద్దాపురం, కరప తదితర మండలాల్లో కోడిపందేలు జరిగాయి. తూర్పు గోదావరి జిల్లాలో రాజమండ్రి రూరల్, కడియం, మండపేట తదితర ప్రాంతాలతోపాటు నల్లజర్ల, నిడదవోలు, పెరవలి, తాళ్లపూడి తదితర మండలాల్లో కోడిపందేలు జోరుగా నిర్వహించారు. వరి చేలు, కొబ్బరి తోటలు, మైదాన ప్రాంతాల్లో భారీ బరులు ఏర్పాటు చేశారు. బెట్టింగ్ స్థాయిని బట్టి బరులు ఏర్పాటు చేశారు. పందేలకు వచ్చే వారికి వీవీఐపీ, వీఐపీ, సామాన్యుల కోసం ప్రత్యేక గ్యాలరీలు నెలకొల్పారు. బరులను ఆనుకుని ప్రత్యేకంగా సిట్టింగ్ (బెంచీలు, కుర్చిలు) ఏర్పాటు చేశారు. బరుల చుట్టూ ఎల్ఈడీ స్క్రీన్లు, ఫ్లడ్‌లైట్లు పెట్టారు. తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోడి పందేలు మోస్తరుగా కొనసాగాయి. అన్నిచోట్లా పందేల బరులకు ఆనుకుని గుండాట, పేకాట, కోసు ఆటలు నిర్వహించారు. పందేలకు వచి్చన వారి కోసం బిర్యానీ, మాంసం పకోడి, కూల్‌డ్రింక్స్, సిగరెట్ స్టాల్స్ ఏర్పాటు చేయడంతో జాతరను తలపించింది. గోదావరి జిల్లాల్లో నిర్వహించే కోడి పందేలను తిలకించేందుకు, పందేలు వేసేందుకు బెట్టింగ్ రాయుళ్లు పయనమవడంతో హైదరాబాద్, విజయవాడ మార్గంలో వాహనాల రద్దీ కని్పంచింది. పందేలకు వచి్చన వారితో గోదావరి జిల్లాల్లోని లాడ్జిలు, అతిథి గృహాలు సైతం నిండిపోయాయి. ట్యాగ్లు ఉంటేనే అనుమతి పశి్చమ గోదావరి జిల్లా కాళ్ల మండలంలోని పెదఅమిరం, సీసలి గ్రామాల్లో కోడి పందేలు వీక్షించడానికి ఎల్ఈడీ డిస్ప్లేను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. పందేలను వీక్షించడానికి వచ్చే వారి చేతులకు ట్యాగ్లు వేశారు. బరుల వద్ద బౌన్సర్లను ఏర్పాటు చేసి ట్యాగ్లు ఉన్నవారిని మాత్రమే బరుల్లోకి ప్రవేశించే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. పాలకొల్లు నియోజకవర్గంలోని యలమంచిలి మండలం కలగంపూడి, కాపవరం, పూలపల్లి, పాలకొల్లు మండలం, నరసాపురం నియోజకవర్గంలోని మొగల్తూరు మండలం, ఆచంట నియోజకవర్గంలోని కవిటం, తణుకు నియోజకవర్గం అత్తిలి, వేల్పూరు, తేతలి గ్రామాల్లోనూ భారీ స్థాయిలో పందేలు నిర్వహించారు. ఏలూరు జిల్లాలోని కైకలూరు, దెందులూరు, ఉంగుటూరు, చింతలపూడి, ఏలూరు, నూజివీడు నియోజకవర్గాల్లోనూ భారీ స్థాయిలో కోడి పందేలు నిర్వహించారు. ఎన్నికల ఏడాది కావడంతో వివిధ పారీ్టల నేతలు బరులకు వెళ్లి నిర్వాహకులను, పందేల రాయుళ్లను పలకరించారు. అక్కడే కొంత సమయం గడిపి స్థానికులతో మమేకమై ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాగా.. ఈసారి హైదరాబాద్ నుంచి రాజకీయ నేతల రాక పెద్దగా కనిపించలేదు. బుసకొట్టిన ‘కట్టల’ పాములు కోడి పందేలతో పాటు పేకాట, గుండాట వంటి జూద క్రీడల శిబిరాలు కూడా భారీగానే వెలిశాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 200 బరుల్లో పందేలు నిర్వహించగా సుమారు రూ.150 కోట్ల వరకు చేతులు మారినట్టు అంచనా. కోనసీమ జిల్లాలోనూ నోట్ల కట్టలు బుసలు కొట్టినట్టుగా చేతులు మారాయి. కోడి పందేలు నిర్వహించే పెద్ద బరుల వద్ద సొమ్ములు లెక్కించడానికి కౌంటింగ్ మెషిన్లు ఏర్పాటు చేయడం విశేషం. కైకలూరు నియోజకవర్గ పరిధిలోని కలిదిండి మండలం మిలట్రీపేట, మండవల్లి మండలం భైరవపట్నం శిబిరాల వద్ద ఎక్కువ పందేలు గెలిచిన వారికి బుల్లెట్లను బహుమతిగా ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి జూదాలు విపరీతంగా పెరిగాయి. అక్కడ కూడా రూ.కోట్లు చేతులు మారాయి. -
AP: విశాఖలో మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు కలకలం
సాక్షి, విశాఖపట్నం: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు ఛత్తీస్‌గఢ్‌లో సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ స్కామ్ వైజాగ్‌లో కలకలం రేపుతోంది. వైజాగ్‌లో నమోదైన మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో వైజాక్‌కు చెందిన అమిత్ అగర్వాల్, నితిన్ తిబ్రూయల్‌ను ఈడీ తాజాగా అదుపులోకి తీసుకుంది. నితిన్, అమిత్‌లు టెక్ ప్రో ఐటీ సొల్యూషన్ పేరుతో వైజాగ్‌లో కంపెనీ ఏర్పాటు చేశారు. మహదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా వచ్చిన నిధులను ఈ కంపెనీ ఖాతాలను వినియోగించి వీరిద్దరు మళ్లించారని ఈడీ ఆరోపిస్తోంది. బెట్టింగ్ యాప్లోలో వచ్చిన నిధులతో ఆస్తులు కొనుగోలు చేశారు. భార్యల పేరు మీద ఈ ఆస్తులన్నీ ఉంచారు. ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బాగేల్కు ఈ కేసులో ఈడీ ఇప్పటికే నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే ముగిసిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ కేసు అక్కడ పెద్ద రాజకీయ దుమారం రేపింది. ఇదీచదవండి.. పండగ పూట విషాదం.. ముగ్గులు వేస్తుండగా -
మహాదేవ్ యాప్ ‘రవి’ అరెస్టు
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ యజమాని రవి ఉప్పల్ (43)ను దుబాయ్ పోలీసులు గత వారం అదుపులోకి తీసుకున్నట్లు ఈడీ అధికారులు బుధవారం వెల్లడించారు. అతడిని భారత్ ర్రప్పించి విచారిస్తామని తెలిపారు. -
ఆసక్తికరంగా ఛత్తీస్‌గఢ్ పోరు.. ఎవరి ధీమా వారిదే!
కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా తలపడ్డ ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల పోరు తుది దశకు చేరింది. రెండో, చివరి దశలో 70 స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. రైతు అనుకూల ప్రభుత్వమనే ముద్రతో అధికారం నిలుపుకుంటామని కాంగ్రెస్ ధీమాగా ఉంది. వరి రైతులకు ఇన్పుట్ సబ్సిడీతో పాటు అనేకానేక సంక్షేమ పథకాలు తమకు శ్రీరామరక్ష అని సీఎం భూపేశ్ బఘేల్ అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు సీఎం, మంత్రులపై అవినీతి ఆరోపణలు తమకు కలిసొస్తాయని బీజేపీ భావిస్తోంది. ఎన్నికల ప్రచారం కోసం దుబాయ్ బెట్టింగ్ యాప్ నుంచి 508 కోట్ల దాకా ముడుపులు అందుకున్నారంటూ బఘేల్‌పై వచ్చిన ఆరోపణలు ఓటర్లపై గట్టి ప్రభావం చూపుతాయని ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గత మూడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఓసారి చూస్తే... 2008 అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలైన తొలినాళ్లలో అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటాపోటీ నడిచింది. కానీ పోలింగ్ సమీపించే కొద్దీ పరిస్థితి బీజేపీకి అనుకూలంగా మారుతూ వచ్చింది. ముఖ్యంగా సీఎం రమణ్‌సింగ్ మిస్టర్ క్లీన్ ఇమేజీ ఆ పార్టీకి బాగా కలిసొచ్చింది. దాంతో ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించింది. 50 స్థానాలు సాధించి అధికారం నిలుపుకుంది. ఇటు బస్తర్ మొదలుకుని అటు సర్గుజా దాకా మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలన్నింట్లోనూ బీజేపీ హవా సాగింది. అక్కడి 26 స్థానాలకు గాను ఆ పార్టీ ఏకంగా 23 చోట్ల నెగ్గింది! ప్రజల్లో బాగా ఆదరణ ఉన్న కాంగ్రెస్ నాయకుడు అజిత్ జోగి సుడిగాలి ప్రచారం చేసినా లాభం లేకపోయింది. ఆ పార్టీ చివరికి 38 సీట్లతో సరిపెట్టుకుంది. దానికి పోలైన ఓట్లు కూడా 38 శాతమే కావడం విశేషం. బీజేపీ 40 శాతం ఓట్లు సాధించింది. బీఎస్పీ రెండు సీట్లు నెగ్గింది. 2013 ముఖ్యమంత్రిగా రమణ్‌సింగ్ హ్యాట్రిక్ కొట్టారు. 2003 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఆయన విజయ పథంలో నడిపి తొలిసారి సీఎం అయ్యారు. అప్పట్నుంచీ 15 ఏళ్లపాటు రాష్ట్రంలో ఆయన హవా సాగింది. రమణ్ పరిపాలనా శైలి కాంగ్రెస్ నేతల నుంచి కూడా ప్రశంసలు అందుకోవడం విశేషం! 2008 ఎన్నికల విజయం తర్వాత ఆయన అమలు చేసిన ఆహార భద్రత పథకం ఛత్తీస్‌గఢ్‌లో 60 శాతం మంది కనీసావసరాలు తీర్చింది. దాంతో ప్రజలు మరోసారి రమణ్ పాలనకే ఓటేశారు. బీజేపీకి 49 సీట్లు రాగా కాంగ్రెస్‌కు 39 స్థానాలొచ్చాయి. మొత్తమ్మీద బీజేపీకి 41 శాతం ఓట్లు రాగా కాంగ్రెస్‌కు 40 శాతం పోలయ్యాయి. బీఎస్పీకి ఒక స్థానం దక్కింది. 2018 సుదీర్ఘంగా అధికారంలో ఉండటంతో ప్రభుత్వ వ్యతిరేకత బీజేపీకి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బాగా ప్రతికూలంగా మారింది. దీనికి తోడు రైతు రుణ మాఫీని పాక్షికంగా అమలు చేసి చేతులెత్తేయడం కూడా రమణ్‌సింగ్ సర్కారుకు బాగా ప్రతికూలంగా మారింది. మార్పుకు పట్టం కట్టండంటూ కాంగ్రెస్ చేసిన ప్రచారానికి జనం జై కొట్టారు. దాంతో హస్తం పార్టీ 68 సీట్లతో ఘన విజయం సాధించింది. బీజేపీ కంచుకోటలైన సర్గుజా వంటి ప్రాంతాల్లో కాంగ్రెస్ ఏకంగా క్లీన్‌స్వీప్ చేయడం విశేషం! దాంతో 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ సరిగ్గా 15 సీట్లకు పరిమితమై ఘోర పరాజయం మూటగట్టుకుంది. కాంగ్రెస్ ఏకంగా 43 శాతం ఓట్లు కొల్లగొట్టగా బీజేపీ కేవలం 33 శాతంతో ఘోరంగా చతికిలపడింది. ఇక బీఎస్పీ మరోసారి రెండు స్థానాలతో రాష్ట్రంలో ఉనికి నిలుపుకుంది. -
22 బెట్టింగ్‌యాప్‌లు, వెబ్సైట్లను నిషేధిస్తూ కేంద్రం ఆదేశాలు
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నవంబర్ 5న ‘మహదేవ్ బుక్’తో సహా 22 బెట్టింగ్ యాప్‌లు, వెబ్సైట్లను నిషేధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. రానున్న ఛత్తీస్‌గఢ్ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం కొంత వివాదానికి దారితీసింది. చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్‌ల సిండికేట్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవల దాడులు నిర్వహించింది. ఛత్తీస్‌గఢ్‌లోని ‘మహదేవ్ బుక్’యాప్‌తో పాటు ఇతర బెట్టింగ్‌యాప్‌లు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిపింది. పీఎంఎల్ఏ చట్టం ప్రకారం మనీలాండరింగ్ ఆరోపణపై మహదేవ్ యాప్ యజమానులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పింది. ఈ యాప్ ప్రమోటర్ల ద్వారా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌కు రూ.508 కోట్లు అందినట్లు తమకు సమాచారం ఉందని ఈడీ పేర్కొంది. అయితే బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లను అణిచివేయడంలో బఘేల్ నేతృత్వంలోని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. సెక్షన్ 69A ఐటీ చట్టం ప్రకారం వెబ్సైట్/ యాప్‌ను మూసివేయమని సిఫార్సు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. అయితే గత కొద్దికాలంగా ఈడీ దర్యాప్తు చేస్తున్నా బఘేల్ ప్రభుత్వం అలా చేయలేదని తప్పుపట్టారు. మరోవైపు యాప్‌ను నిషేధించాలన్న అభ్యర్థన వచ్చిన వెంటనే కేంద్రం చర్యలు తీసుకుందని మంత్రి వివరించారు. -
ఆన్లైన్ గేమింగ్ కంపెనీలపై పన్ను పిడుగు
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్ కంపెనీలపై పన్ను పిడుగు పడింది. పన్ను ఎగవేతకు సంబంధించి రూ.లక్ష కోట్ల మేర చెల్లించాలని కోరుతూ జీఎస్టీ అధికారులు షోకాజు నోటీసులు జారీ చేశారు. ఈ విషయాన్ని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. అక్టోబర్ 1 తర్వాత భారత్‌లో నమోదు చేసుకున్న విదేశీ గేమింగ్ కంపెనీలకు సంబంధించి డేటా లేదన్నారు. విదేశాల నుంచి కార్యకలాపాలు నిర్వహించే గేమింగ్ కంపెనీలు, జీఎస్టీ చట్టం కింద నమోదు చేసుకోవడాన్ని అక్టోబర్ 1 నుంచి కేంద్రం తప్పనిసరి చేసింది. ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లలో బెట్టింగ్ పూర్తి విలువపై 28 శాతం పన్ను వసూలు చేస్తామని జీఎస్టీ కౌన్సిల్ ఆగస్ట్‌లోనే స్పష్టం చేయడం గమనార్హం. డ్రీమ్11, డెల్టా కార్ప్ తదితర సంస్థలు భారీ మొత్తంలో పన్ను చెల్లింపులకు సంబంధించి గత నెలలో షోకాజు నోటీసులు అందుకోవడం తెలిసిందే. గేమ్స్క్రాఫ్ట్ సంస్థ రూ.21,000 కోట్ల పన్ను ఎగవేసిందంటూ గతేడాది జీఎస్టీ అధికారులు షోకాజు నోటీసులు జారీ చేశారు. దీంతో సంస్థ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించి, సానుకూల ఆదేశాలు పొందింది. దీనిపై కేంద్ర సర్కారు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు డ్రీమ్11 సంస్థ రూ.40,000 కోట్ల పన్ను ఎగవేతకు సంబంధించి షోకాజు నోటీసులు అందుకుంది. డెల్టా కార్ప్, దాని అనుబంధ సంస్థలకు రూ.23,000 కోట్లకు సంబంధించి షోకాజు నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసులపై డెల్టాకార్ప్ బోంబే హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. న్యాయస్థానాలు ఇచ్చే తదుపరి ఆదేశాలకు అనుగుణంగా పన్ను వసూళ్లు ఆధారపడి ఉన్నాయి. -
మహదేవున్నీ వదల్లేదు!
దుర్గ్: దుబాయ్‌కి చెందిన మహదేవ్ బెట్టింగ్ యాప్ నుంచి ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్‌కు ముడుపుల అంశంలో కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. సదరు యాప్‌తో తనకున్న సంబంధాలేమిటో బఘేల్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. యాప్ నిర్వాహకుల నుంచి ఆయనకు ఇప్పటిదాకా రూ.508 కోట్ల మేరకు ముడుపులు అందినట్టు ఈడీ శుక్రవారం ప్రకటించడం, అది దేశవ్యాప్తంగా కలకలం రేపడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఛత్తీస్‌గఢ్‌లో శనివారం దుర్గ్ నగరంలో బీజేపీ ప్రచార సభలో మోదీ ప్రసంగించారు. ‘‘దోపిడీకి ఏ ఒక్క అవకాశాన్నీ రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు వదల్లేదు. చివరికి మహదేవుని పేరును కూడా వాళ్లు వదిలిపెట్టలేదు. బెట్టింగ్ కంపెనీకి చెందిన భారీ మొత్తాలను రెండు రోజుల క్రితం రాయ్‌పూర్‌లో పట్టుకున్నారు. అదంతా రాష్ట్ర పేదలు, యువత నుంచి దోచిందే. అలాంటి డబ్బుతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అందలమెక్కుతున్నారు. పట్టుబడ్డ డబ్బును సీఎం బఘేల్‌కు ఇచ్చేందుకు తీసుకెళ్తున్నట్టు చెబుతున్నారు. దుబాయ్‌లోని యాప్ నిర్వాహకులతో తమకున్న బంధమేమిటో కాంగ్రెస్ ప్రభుత్వం, బఘేల్ బయట పెట్టాలి’’ అని డిమాండ్ చేశారు. ఉచిత రేషన్ మరో ఐదేళ్లు దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ అందిస్తున్న ప్రధాన్‌మంత్రి గరీబ్ కల్యాణ్ యోజనను మరో ఐదేళ్ల పాటు పొడిగించనున్నట్టు మోదీ ప్రకటించారు. దేశంలో అతి పెద్ద కులం పేదరికం మాత్రమేనన్నారు. పేదల అభ్యున్నతి కాంగ్రెస్‌కు సుతరామూ ఇష్టముండదని ఆరోపించారు. -
ఆన్లైన్ గేమింగ్‌లపై 28 శాతం జీఎస్టీ
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు బెట్టింగ్‌ల పూర్తి విలువపై 28 శాతం జీఎస్టీని ఈరోజు(అక్టోబర్ 1వ తేదీ) నుంచి వసూలు చేయనున్నాయి. ఈ రంగంలో విదేశాల నుంచి భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలు జీఎస్టీ రిజి్రస్టేషన్ తప్పనిసరి చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ నోటిఫై చేసింది. సెంట్రల్ జీఎస్టీ, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ చట్టాలలో సవరించిన నిబంధనలకు అక్టోబర్ 1వ తేదీని అపాయింటెడ్ డేట్‌గా ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా నోటిఫై చేసింది. కేంద్ర జీఎస్టీ చట్టంలోని మార్పుల ప్రకారం ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందాలను ఇక నుంచి లాటరీ, బెట్టింగ్, జూదం మాదిరిగా పరిగణిస్తారు. ఆఫ్‌షోర్ ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లు భారత్‌లో రిజిస్ట్రేషన్ తీసుకోవడంతోపాటు దేశీయ చట్టానికి అనుగుణంగా 28 శాతం పన్ను చెల్లించడం తప్పనిసరి చేసింది. రిజిస్ట్రేషన్, పన్ను చెల్లింపు నిబంధనలను పాటించడంలో విఫలమైతే విదేశాలలో ఉన్న ఆన్లైన్ గేమింగ్ కంపెనీలను నిరోధించేందుకు ఈ సవరణలు వీలు కల్పిస్తాయి. కాగా, ఆర్థిక శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రాకు ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ లేఖ రాసింది. 15 రాష్ట్రాలు స్టేట్ జీఎస్టీ చట్టాల్లో మార్పులు ఇంకా చేయలేదని.. ఆయా రాష్ట్రాల ఆటగాళ్ల నుండి పొందిన డిపాజిట్లపై ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు అనుసరించాల్సిన జీఎస్టీ విధానం ఏమిటో తెలపాలని లేఖలో కోరింది. ఈ నోటిఫికేషన్లను పునఃపరిశీలించాలని, జీఎస్టీ స్కీమ్, భారత సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా అన్ని రాష్ట్రాలు తమ సంబంధిత సవరణలను ఆమోదించే వరకు వాటిని నిలిపివేయాలని కేంద్రాన్ని అభ్యర్థించింది. ఈలోగా తాము పేర్కొన్న సమస్యలను అవసరమైన వివరణలతో పరిష్కరించాలని కోరింది. -
భార్యతోనే స్నేహితుడికి వలపు వల..! చివరికి..
నల్గొండ: వ్యసనాలకు బానిసలైన యువ జంట.. ఓ అమాయకుడిని మోసగించి రూ.30 లక్షలు కాజేశారు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం గుడుగుంట్లపాలెం గ్రామంలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పాలకవీడు మండలం గూడుగుంట్లపాలెం గ్రామానికి చెందిన సట్టు నారాయణ నేరేడుచర్లకు చెందిన గడ్డం భారతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. నారాయణ క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతుంటాడు. వీరి అవసరాలకు, ఆన్లైన్ బెట్టింగులకు డబ్బు అవసరం కావడంతో అదే గ్రామానికి చెందిన దొంగల సతీష్ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసానికి తెరలేపారు. నారాయణ తన భార్య భారతిని సంధ్య అనే పేరుతో సతీష్‌కు పరిచయం చేశాడు. మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో సతీష్ వద్ద నుంచి డబ్బులు కాజేయడం మొదలు పెట్టారు. సతీష్‌ను బెదిరించి నాలుగేళ్లుగా సుమారు రూ.30 లక్షలు కాజేశారు. మోసపోయానని గ్రహించిన సతీష్ పోలీసులను ఆశ్రయంచాడు. జరిగినదంతా పోలీసులకు వివరించి నారాయణ, భరతిలపై ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పిట్టిన పోలీసులు బుధవారం వారిని మిర్యాలగూడ వద్ద అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.13వేల నగదు, బైక్ ఇతర సామగ్రి స్వాధీనపరుచుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ లింగయ్య తెలిపారు. -
కర్ణాటక ఎన్నికల బెట్టింగ్‌పై ఫన్నీ స్కిట్
-
ఐపీఎల్ 2023లో ఏం జరుగుతోంది..? ఆ రెండు మ్యాచ్‌లు ఫిక్స్ అయ్యాయి..!
ఐపీఎల్-2023లో ఫస్ట్ ఆఫ్ మ్యాచ్‌లు అయిపోయాక ఒక్కసారిగా భారీ మార్పులు సంభవిస్తున్నాయి. బ్యాటర్లకు స్వర్గధామంగా ఉన్న పిచ్‌లు ఉన్నట్లుండి బౌలర్లకు పెద్ద ఎత్తున సహకరిస్తున్నాయి. బ్యాటర్ల హవా కొనసాగిన మైదానాల్లో బౌలర్లు రాజ్యమేలుతున్నారు. రాజస్థాన్ రాయల్స్-ముంబై ఇండియన్స్ మ్యాచ్ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఆయా జట్లు అతి స్వల్ప స్కోర్లను డిఫెండ్ చేసుకోగలిగాయి. అంతకుముందు వరకు పరిస్థితి వేరేలా ఉండేది. దాదాపు ప్రతి మ్యాచ్‌లో రెండు జట్లు అలవోకగా 200 స్కోర్‌ను దాటేవి. ఉన్నట్లుండి ఈ మార్పుకు కారణమేంటని అభిమానులు చర్చింకుంటున్నారు. ఆర్సీబీ-లక్నో, ఢిల్లీ-గుజరాత్ మ్యాచ్‌లు ఫిక్స్ అయ్యాయా అని అనుమానులు వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు మ్యాచ్‌ల్లో బౌలర్లు అత్యుత్తమ ప్రతిభ కనబర్చారన్నది కాదనలేని సత్యమే అయినప్పటికీ, ఇదే వేదికలపై గతంలో పరుగుల వరద పారిన విషయాన్ని మరచిపోకూడదు. బ్యాటర్లకు ఓ రేంజ్లో సహకరించిన పిచ్‌లు ఒక్కసారిగా స్లో పిచ్‌లుగా మారి బౌలర్ల పిచ్‌లుగా మారాయంటే ఏదో జరుగుతుందని అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. గత రెండు మ్యాచ్‌లు సాగిన వైనం కూడా అభిమానుల అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. పిచ్ బ్యాటర్లకు సహకరిస్తుందని అర్ధం వచ్చేలా టాస్ గెలిచిన జట్లు తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాయి. ఆతర్వాత అతి స్వల్ప స్కోర్లను విజయవంతంగా డిఫెండ్ చేసుకున్నాయి. పైగా ఈ రెండు మ్యాచ్‌ల్లో ఓడిన జట్లు (లక్నో, గుజరాత్) హాట్ ఫేవరెట్ జట్లు. స్వల్ప లక్ష్య ఛేదనలో విధ్వంసకర బ్యాటర్లు ఉన్న జట్లు ఒక్కో పరుగు చేసేందుకు ఆపసోపాలు పడ్డాయి. ఆర్సీబీ-లక్నో మ్యాచ్‌లో ఇది స్పష్టంగా కనిపించింది. ఈ మ్యాచ్‌లో లక్నో ఓటమిని ముందుగానే ఖరారు చేసి, ప్రజల దృష్టిని మరల్చేందుకు ఐపీఎల్ యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే కోహ్లి-నవీన్ ఉల్ హాక్-గంభీర్ల డ్రామాను తెరపైకి తెచ్చిందని కొందరు అభిమానులు అనుకుంటున్నారు. మరికొందరైతే బెట్టింగ్ మాఫియాను ప్రోత్సహించేందుకు తక్కువ అంచనాలు కలిగిన జట్లను ఐపీఎల్ యాజమాన్యమే గెలిపిస్తుందని చర్చించుకుంటున్నారు. క్రికెట్ పరిజ్ఞానం, ఐపీఎల్ ఫాలో అయిన అనుభవం ఉన్న కొందరైతే, ఏ మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందో ముందే చెప్పేస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా లీగ్ సాగబోయే తీరును వారు ముందే పసిగడుతున్నారు. మ్యాచ్‌లు వన్ సైడెడ్‌గా సాగితే (బ్యాటర్లకు సహకారం) కూడా జనాలు చూడరని, బెట్టింగ్‌లు కాసే వారు సులువుగా మ్యాచ్ తీరును అంచనా వేయగలుగుతున్నారని ఐపీఎల్ యాజమాన్యమే ఇలాంటి స్క్రిప్టెడ్ గేమ్స్‌ను ప్లాన్ చేస్తుందని ఇంకొందరు ఆరోపిస్తున్నారు. -
విజయ్ శంకర్ కొంపలు ముంచాడు.. లబోదిబోమనేలా చేశాడు..!
గుజరాత్ ఆల్‌రౌండర్, త్రీ డీ ప్లేయర్ విజయ్ శంకర్ బెట్టింగ్ రాయుళ్లను నట్టేట ముంచాడు. నిన్న (ఏప్రిల్ 29) కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో విధ్వంకర హాఫ్‌సెంచరీ (24 బంతుల్లో 51 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) బాదిన శంకర్, బెట్టింగ్ కాసే వాళ్ల కొంపలు కొల్లేరు చేశాడు. గుజరాత్ గెలుపుకు అడపాదడపా అవకాశాలు ఉన్న దశలో ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన శంకర్.. ఎవరూ ఊహించని విధంగా రెచ్చిపోయి ఎడాపెడా సిక్సర్లు బాది, కేకేఆర్ గెలుపుపై గంపెడాశలు పెట్టుకున్న బెట్టింగ్ రాయుళ్లకు దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చాడు. Vijay Shankar's counter-attacking 5️⃣0️⃣ ensures #GujaratTitans keep their perfect away record intact 💯 The defending champions also go 🔝 of the #TATAIPL points table!#KKRvGT #IPLonJioCinema #IPL2023 | @vijayshankar260 pic.twitter.com/uLpd5RYmgW — JioCinema (@JioCinema) April 29, 2023 క్రీజ్‌లో ఉన్నది విజయ్ శంకరే కదా అని తక్కువ అంచనా వేసిన బెట్టింగ్ రాయుళ్లకు ఫ్యూజులు ఎగిరిపోయేలా చేశాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో నిదానంగా ఆడి బెట్టింగ్ కాసే వాళ్లను కేకేఆర్‌వైపు చూసేలా చేసిన శంకర్.. ఆతర్వాత ఒక్కసారిగా గేర్ మార్చి సిక్సర్ల సునామీ సృష్టించాడు. దీంట్లో ఈడెన్ గార్డెన్స్ మైదానంతో పాటు బెట్టింగ్ రాయుళ్లు తడిసిముద్ద అయిపోయారు. కేకేఆర్‌పై పందెం కాసి భారీగా దండుకోవచ్చని అంచనా వేసిన బెట్టింగ్ రాయుళ్ల ఆశలు అడియాశలయ్యాయి. విజయ్ శంకర్‌పై నమ్మకంతో (ఏం చేయలేడని భావించి) భారీగా బెట్టింగ్ కాసి, అది కాస్త బెడిసికొట్టడంతో లబోదిబోమంటున్నారు. 180 పరుగుల లక్ష్య ఛేదనలో 14 ఓవర్ల (111/3) వరకు గెలుపుపై ఏమాత్రం ఆశలు లేని గుజరాత్.. శంకర్, మిల్లర్ (18 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కసారిగా విరుచుకుపడటంతో ఆ తర్వాత నాలుగు ఓవర్ల వ్యవధిలోనే మ్యాచ్‌ను ముగించింది. 15వ ఓవర్లో 18, 16లో 13, వరుణ్ చక్రవర్తి వేసిన 17వ ఓవర్లో 24, 18వ ఓవర్లో 14 పరుగులు సాధించి, మరో 13 బంతులుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. గుర్భాజ్ (81), రసెల్ (18) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేయగా.. గిల్ (49), విజయ్ శంకర్ (51 నాటౌట్), మిల్లర్ (32 నాటౌట్) సత్తా చాటడంతో గుజరాత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. -
చెన్నై vs రాజస్థాన్.. ఎవరు గెలిస్తే ఏంటీ? కిడ్నాప్ కథకు లింకేంటీ?
ఒంగోలు టౌన్: నగరంలో క్రికెట్ బెట్టింగ్ వివాదం తెలుగు సినిమా తరహాలో అటు తిరిగి ఇటు తిరిగి పోలీసు అరెస్టులతో ఒక కొలిక్కి వచ్చింది ..డీఎస్పీ యు.నాగరాజు తెలిపిన వివరాలు ప్రకారం...నగరంలోని సత్యనారాయణపురం 3వ లైన్లో నివాసం ఉండే గుజ్జుల అయ్యప్ప 9వ తరగతి వరకు చదువుకుని చెడు వ్యసనాలకు బానిసై తిరుగుతున్నాడు. ఈ క్రమంలో అతడికి కేశవరాజుకుంటకు చెందిన రియాజ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌కు అయ్యప్ప చేత బెట్టింగ్ పెట్టించాడు. చెన్నయ్ సూపర్ కింగ్స్ వర్సస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నయ్ సూపర్‌కింగ్స్ తరఫున రూ.15 వేలను బెట్టింగ్ పెట్టించాడు. అయితే ఆ టీం ఓడిపోయేలా ఉండడంతో అయ్యప్పకు ఫోన్ చేసిన రియాజ్ రాజస్థాన్ మ్యాచ్ వైపు బెట్టింగ్‌ను మార్చమని చెప్పాడు. అయితే సిగ్నల్ సరిగా లేకపోవడంతో అయ్యప్ప మార్చలేకపోయాడు. ఈ విషయాన్ని రియాజ్‌కు చెప్పగా అందుకు అతడు అంగీకరించలేదు. నాకు బెట్టింగ్‌లో వచ్చే రూ.23 వేలతో సహా మొత్తం రూ.38 వేలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. దీంతో ఏం చేయాలో దిక్కు తోచని అయ్యప్ప రెండు రోజుల పాటు రియాజ్‌కు కనిపించకుండా తిరిగాడు. ఈ క్రమంలో పీవీఆర్ స్కూల్లో క్రికెట్ చూస్తున్న అయ్యప్పను ఈ నెల 21న రియాజ్ స్నేహితులు కరీమ్‌బాషా, నాగార్జున, వినోద్‌లు కలిసి బలవంతంగా తీసుకెళ్లారు. పాపాకాలనీలోని కరీమ్‌బాషా ఇంటికి తీసుకెళ్లి బంధించి కొట్టారు. అంతటితో ఊరుకోకుండా అయ్యప్ప తల్లి తిరుపతమ్మకు ఫోన్‌చేసి మీ అబ్బాయి మాకు డబ్బులు ఇవ్వాలి, అది ఇస్తేనే మీ అబ్బాయిని వదులుతామని బెదిరించారు. ఈ లోగా అయ్యప్ప అక్కడి నుంచి తప్పించుకున్నాడు. సమాచారం తెలిసిన తాలుకా పోలీసులు అతడిని వారి తలిదండ్రులకు అప్పగించి నిందితులు రియాజ్, కరీం బాషా, మౌలాలి, సాల్మన్లను అరెస్టు చేశారు. నాగార్జున, వినోద్‌లు పరారీలో ఉన్నారు. -
ఇంగ్లండ్ హెడ్ కోచ్‌కు బిగ్ షాక్.. వివాదంలో మెకల్లమ్!
లండన్: ఇంగ్లండ్ టెస్టు టీమ్ హెడ్ కోచ్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ వివాదానికి కేంద్ర బిందువయ్యాడు. ఒక బెట్టింగ్ కంపెనీ ‘22బెట్ ఇండియా’కు అతను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో బెట్టింగ్ చేయమంటూ అభిమానులను ప్రోత్సహిస్తూ అతను ఇచ్చిన ప్రకటనలు ఇటీవల వెల్లువెత్తాయి. సైప్రస్‌లో రిజిస్టర్ అయిన బెట్22తో గత నవంబర్‌లో మెకల్లమ్ ఒప్పందం కుదర్చుకున్నాడు. దాంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) దీనిపై దృష్టి సారించింది. ఈసీబీ అవినీతి నిరోధక విభాగం నిబంధనల ప్రకారం ‘ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బెట్టింగ్‌లో పాల్గొనడం, పాల్గొనేలా చేయడం లేదా అందుకు ప్రోత్సహించడం చేయరాదు’. టీమ్ హెడ్ కోచ్‌గా మెకల్లమ్‌కు ఈ నిబంధనలు వర్తిస్తాయి. ప్రస్తుతం ఈ అంశంపై విచారణ జరుపుతున్నట్లు ఈసీబీ ప్రకటించింది. న్యూజిలాండ్‌లో కూడా నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తుండటంతో ‘22బెట్ ఇండియా’పై ఆ దేశం నిషేధం విధించింది కూడా. ఆ దేశానికి చెందిన ‘ప్రాబ్లమ్ గ్యాంబ్లింగ్ ఫౌండేషన్’ సంస్థనే మెకల్లమ్ గురించి ఈసీబీకి తెలియజేసింది. మెకల్లమ్ కోచ్‌గా వచ్చాక ఆడిన 12 టెస్టుల్లో ఇంగ్లండ్ 10 టెస్టులు గెలిచింది. చదవండి: IPL 2023: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హ్యారీ బ్రూక్.. తొలి సన్‌రైజర్స్ ఆటగాడిగా -
క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు
-
బెట్టింగ్ బాబులు.. జాగ్రత్త..!
ఐపీఎల్ 16వ ఎడిషన్ రసవత్తరంగా మారుతోంది. మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా మారుతుండడంతో కొందరు బెట్టింగ్‌కు తెర లేపుతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బెట్టింగులు జోరందుకున్నాయి. ఒకప్పుడు మ్యాచ్ విన్నర్లపై బెట్టింగ్ సాగేది. కానీ ఇప్పుడు బాల్ బాల్‌కు బెట్టింగ్ జరుగుతోంది. ఆన్లైన్ పేమెంట్లు ఊపందుకున్నప్పటి నుంచి బెట్టింగ్ భూతం మరింతగా విజృంభిస్తోంది. వందల నుంచి ప్రారంభమై రూ.వేలు, లక్షలు, కోట్లు చేతులు మారుతున్నాయి. డబ్బులు వస్తాయన్న ఆశతో బెట్టింగ్ పెడుతూ నిండా మునుగుతున్నారు. పలమనేరు: ఐపీఎల్ సీజన్ ముగిసేసరికి లక్షాధికారులు కావాలనే ఆశతో కష్టపడకుండా సులభంగా డబ్బులు సంపాదించాలనే దురాశతో యువకులు, విద్యార్థులు బెట్టింగుల రొచ్చులోకి దిగుతున్నారు. తీరా నష్టపోయి అప్పులపాలై బికారీలుగా మారుతున్నారు. బెట్టింగుల కారణంగా యువత జీవితా లు నాశనమై ఆ కుటుంబాల్లో పెద్దలకు మనోవ్యధను కలిగిస్తోంది. చాలామంది యువకులు బైక్‌లను, ఒంటిపై ఉన్న చైన్లు, ఉంగరాలను అమ్ముకోవాల్సి వస్తోంది. అదీ చాలక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చాలామందికి బెట్టింగులు వ్యసనంలా మారుతోంది. ప్రస్తుతం బెట్టింగులు మూడు రకాలుగా ఉన్నాయి. 1. కొంతమంది కలసి ఆన్లైన్ పేమెంట్ల ద్వారా బెట్టింగులు చేస్తున్నారు. 2. ఇంకొందరు రహస్యప్రదేశాల్లో ఉంటూ మ్యాచ్‌లు మొదలైనప్పటి నుంచి గ్రూపుల్లోని వ్యక్తులతో చాటింగ్ చేస్తూ బెట్టింగ్‌లు చేస్తున్నారు. 3. ఎక్కువ మంది మాత్రం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్‌ను వాడుతున్నారు. ప్రస్తుతం ఎలెవన్ బెట్, డ్రీమ్–11, ట్వంటీఫోర్క్లబ్, బీక్రిక్, మోస్ట్‌బెట్, ఐవిన్, మెల్‌బెట్, బెట్ 365, పారీమ్యాచ్, ఫెయిర్‌ప్లే లాంటి యాప్‌లను ఎక్కువ మంది బెట్టింగుల కోసం వాడుతున్నారు. పడమటి మండలాలను ఆనుకుని ఉన్న కర్ణాటక పరిధిలోని ముళబాగిలు, శ్రీనివాసపురం, కేజీఎఫ్, బెంగళూరుకు చెందిన క్రికెట్ బుకీలకు చెందిన ముఠాలు జిల్లాలో బెట్టింగులు జోరుగా సాగిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే పోలీసులు నిఘా ఉంచినా కీలక వ్యక్తుల జాడ తెలియడం లేదని తెలుస్తోంది. టాస్ నుంచే.. ఐపీఎల్ మే 18 తేదీ వరకు జరుగుతుంది. రోజూ మధ్యాహ్నం మొదటి మ్యాచ్ 3.30, రెండో మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు మొదలవుతుంది. మ్యాచ్‌కు ముందుగానే టాస్ వేస్తారు. టాస్ ఎవరుగెలుస్తార నే దాంతో బెట్టింగులు మొదలవుతున్నాయి. ఆపై బాల్బై బాల్, ఓవర్ టు ఓవర్, ఎక్కువ వికె ట్లు, ఎక్కువ పరుగులు, సిక్స్‌లు, ఫోర్లతో పాటు మ్యా చ్ గెలుపు వరకు పందేలు సాగుతున్నాయి. మ్యాచ్ కు ముందుగా అయితే 1కి 2, ఓడిపోతే టీమ్‌పై 1కి 5 రెట్లు ఎక్కువగా బెట్టింగులు ఉంటున్నాయి. అప్రమత్తంగా ఉండాలి పట్టణంలోని ఆవాస ప్రాంతాల్లో యువకు లు సెల్ఫోన్ల ద్వారా బెట్టింగ్‌లకు పాల్పడడుతున్నారు. ము ఖ్యంగా కాలేజీలకు వెళ్లే విద్యార్థులు సైతం బెట్టింగ్‌లకు అలవాటుపడ్డారు. మద్యం సేవించడం, గంజాలాగడాలు అన్నీ బెట్టింగులు జరిగే చోట సాధారణంగా మారింది. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాల్సిందే. – పుష్పరాజ్, ఎస్సీ టీచర్స్ సంఘ నాయకులు, పలమనేరు ప్రత్యేక నిఘా ఉంచాం ఐపీఎల్ మొదలైయ్యాక సబ్ డివిజన్ పరిధిలో క్రికెట్ బెట్టింగులు రహస్యంగా సాగుతున్న విషయం తమ దృష్టిలో ఉంది. దీనిపై ఇప్పటికే దృష్టి సారించాం. కేవలం స్మార్ట్ఫోన్లలో సాగే బెట్టింగ్ వ్యవహారాలను కనుక్కోవడం కొంచెం కష్టమే. అయితే బెట్టింగుల్లో బాధితులుగా మారిన వారి ద్వారా కీలక సమాచారాన్ని తెలుసుకొని ముఠాలను పట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నాం. – సుధాకర్‌రెడ్డి, డీఎస్పీ, పలమనేరు ● బైరెడ్డిపల్లె మండలానికి చెందిన యువకుడు క్రికెట్ బెట్టింగుల కారణంగా అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నాడు. ● పలమనేరుకు చెందిన ఓ యువకుడు బెట్టింగుల కారణంగా వ్యాపారాన్ని వదులుకుని బెంగళూరుకు వెళ్లాడు. ● పెద్దపంజాణి మండలానికి చెందిన ఓ యువకుడు బెట్టింగ్‌ల కారణంగా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ● మదనపల్లెకు చెందిన ఓ బీటెక్ విద్యార్థి పలమనేరులోఉంటూ ఆన్లైన్ బెట్టింగుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ● పలమనేరు మండలం సముద్రపల్లెకు చెందిన ఓ యువకుడు ఆన్లైన్ బెట్టింగుల కారణంగా బైక్‌ను తనఖా పెట్టి అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఇలాంటి సంఘటనలు ఉమ్మడి జిల్లాలో గత మూడేళ్లలో పదుల సంఖ్యలో జరిగాయి. కానీ వెలగుచూడని విషయాలు వందల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. -
‘నాటు నాటు’కు ఆస్కార్ వస్తుందా? రాదా? కోట్లలో బెట్టింగ్
యావత్ సినీ ప్రపంచమంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్న ఆస్కార్ అవార్డుల వేడుక మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతుంది. ఆదివారం (మార్చి 12) రాత్రి 8 గంటలకు(భారత కాలమానం ప్రకారం మార్చి 13 ఉదయం 5.30 గంటలకు) లాజ్ ఏంజిల్స్ అత్యంత ఘనంగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంగా బెట్టింగ్ రాయుళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమయ్యారు. ఆస్కార్ అందుకునే హీరో ఎవరు? ఏ సినిమాకి ఆస్కార్ వస్తుంది? తదితర అంశాలపై జోరుగా బెట్టింగ్ సాగిస్తున్నారు. (చదవండి: వామ్మో.. ఆస్కార్ వేడుక ఖర్చు అన్ని వందల కోట్లా?.. ఈసారి స్పెషల్ ఏంటంటే..) ఇక ఇండియా నుంచి ఆస్కార్ బరిలో ఉన్న ‘ఆర్ఆర్ఆర్’పై కోట్ల రూపాయల్లో బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్, ముంబై నగరాల్లో తిష్టవేసిన బుకీలు.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్‌కు నామినేట్ అయిన ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ వస్తుందా? లేదా? అంటూ బెట్టింగ్ వేస్తున్నారు. బెట్టింగ్ వ్యవహారమంతా ఆన్లైన్లోనే నడిపిస్తున్నారు. 1:4 నిష్పత్తితో నడుస్తున్న ఈ బెట్టింగ్‌లో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్లుగా తెలుస్తోంది. (చదవండి: ఆస్కార్‌కు అడుగు దూరంలో నాటు నాటు.. ఆ పాటనే అడ్డు..!) సామాన్యులతో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు నిర్మాతలు..టెక్నీషియన్స్ కూడా బెట్టింగ్స్ వేస్తున్నట్లు సమాచారం. తొలిసారి ఒక తెలుగు సినిమా ఆస్కార్ బరిలో నిలవడంతో టాలీవుడ్ ప్రేక్షకులంతా ఈ వేడుక కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా..ఆర్ఆర్ఆర్.. నాటు నాటు పాట గురించే చర్చిస్తున్నారు. ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ విభాగంలో మరో నాలుగు పాటలతో పోటీ పడుతున్న నాటు నాటుకి ఆస్కార్ వస్తుందా రాదా తెలియాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే. -
చైనా యాప్‌లపై కేంద్రం కొరడా.. ఈసారి ఏకంగా
న్యూఢిల్లీ: మోదీ సర్కార్ డ్రాగన్ కంట్రీకి భారీ షాకిచ్చింది. దేశంలో ఒకేసారి 232 చైనా యాప్‌లపై అత్యవసర ప్రాతిపదికన నిషేధం విధించే ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్పర్మేషన్ మంత్రిత్వశాఖ ఆదివారం వెల్లడించింది. నిషేధం విధించిన వాటిలో 138 బెట్టింగ్ యాప్‌లు, 98 లోన్ యాప్‌లు ఉన్నాయి. కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి ఆదేశాల ప్రకారం వీటిని బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. చైనా లింకులు కలిగి ఉన్నట్లు గుర్తించడంతో ఈ యాప్‌లపై అత్యవసర ప్రాతిపదికన నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఎంహెచ్ఏ (MHA).. ఆరు నెలల క్రితం 28 చైనీస్ లోన్ లెండింగ్ యాప్‌లపై నిఘా పెట్టింది. అయితే, ఈ-స్టోర్లలో 94 యాప్‌లు అందుబాటులో ఉన్నాయని, మరికొన్ని థర్డ్-పార్టీ లింక్‌ల ద్వారా పనిచేస్తున్నాయని గుర్తించింది. అంతేకాకుండా దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండడంతో ఈ చైనీస్ యాప్‌లపై ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. గతంలోనూ ఈ తరహా పలు చైనీస్ యాప్‌లను కేంద్రం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది జూన్ 2020 నుంచి టిక్ టాక్, షేర్ఇట్, వీ చాట్, హలో, లైకీ, యూసీ న్యూస్, బిగో లైవ్, యూసీ బ్రౌజర్, ఈఎస్ ఫైల్ ఎక్స్‌ఫ్లోరర్, ఎంఐ కమ్యూనిటీ వంటి ప్రముఖ అప్లికేషన్లతో సహా 200కి పైగా చైనీస్ యాప్‌లను ప్రభుత్వం నిషేధించింది. చదవండి: భారీగా పన్ను భారం తగ్గించే ఈ 7 అలెవెన్సుల గురించి మీకు తెలుసా? -
మునుగోడు రిజల్ట్ పై ఐపీఎల్ తరహాలో బెట్టింగ్
-
మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలపై జోరుగా బెట్టింగ్
-
భారత్-పాక్ మ్యాచ్ పై భారీగా బెట్టింగ్ లు
-
హైదరాబాద్ అడ్డాగా భారీ ఐపీఎల్ బెట్టింగ్
-
సైబరాబాద్ పరిధి లో భారీ బెట్టింగ్ ముఠా అరెస్ట్
-
సైబరాబాద్ పరిధిలో బెట్టింగ్
-
ప్రాణం తీసిన ఆన్లైన్ గేమ్స్
లక్సెట్టిపేట (మంచిర్యాల): మొబైల్లో ఆన్లైన్ గేమ్స్‌కు ఓ బీటెక్ విద్యార్థి జీవితం బలైంది. చిన్నచిన్న గేమ్స్‌తో మొదలైన ఆకర్షణ.. బెట్టింగ్‌వరకూ వెళ్లి అప్పుల పాలు చేసింది. విషయం కుటుంబ సభ్యులకు తెలవడంతో వారు అప్పులు తీర్చినప్పటికీ తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని మోదెల గ్రామంలో శనివారం ఈ సంఘటన వెలుగు చూసింది. ఏఎస్సై రాజయ్య కథనం ప్రకారం.. మోదెల గ్రామానికి చెందిన తోట శంకర్ కుమారుడు మధుకర్ (24) హైద రాబాద్లోని ఓ ప్రైవేటు కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్నాడు. కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ విధించినప్పటి నుంచి ఇంటివద్దనే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆన్లైన్ గేమ్స్‌కు బానిసయ్యాడు. తన మొబైల్లో ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ బెట్టింగ్ కాయడంతో తీవ్రంగా నష్టపోయా డు. ఇలా తెలిసినవారి వద్ద రూ.15 లక్షల వరకు అప్పులు చేశాడు. ఈ విష యం కుటుంబ సభ్యులకు తెలియడంతో మందలించి.. అప్పులన్నీ తీర్చా రు. అయితే తాను చేసిన అప్పులకు కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డారని ఆవేదనకు గురైన మధుకర్ ఈనెల 7న ఇంటినుంచి బయటకు వెళ్లాడు. మంచిర్యాలలో క్రిమిసంహారక మందు తాగి తన అక్కకు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. వారు అక్కడున్న స్థానికుల సాయంతో ఆస్పత్రిలో చేర్పించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా.. పరిస్థితి విషమించి శనివారం ఉదయం మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సర్వేతో ప్రాణం తీశారు!
-
ప్రాణం తీసిన బెట్టింగ్
-
క్రికెట్ బెట్టింగ్‌లో టిడీపీ నేతలు అరెస్ట్
-
కాయ్ రాజా కాయ్
♦ కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్‌ల జోరు ♦ లక్షల్లో కాస్తూ సై అంటే సై... ♦ 30వ డివిజన్ ఫలితంపై రెట్టింపు సంఖ్యలు ♦ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ‘పోటీ’దారులు కాకినాడ క్రైం : కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు మంగళవారం ప్రశాంతంగా ముగియడంతో సెప్టెంబర్ ఒకటో తేదీన వెలువడే ఎన్నికల ఫలితాల కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల్లో విజయం కోసం అధికార టీడీపీ కోట్లాది రూపాయలను తృణప్రాయంగా ఖర్చు చేసింది. ఎన్నడూలేని రీతిలో ఎన్నికలకు రెండు రోజుల ముందే ఓటర్ స్లిప్పులతోపాటు డబ్బులు పంచి ఓటర్లను పలు ప్రలోభాలకు గురిచేశారు. మద్యాన్ని వరదలా పారించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థులు పార్టీ అధినేత జగన్ పర్యటనతో రెట్టించిన ఉత్సాహంతో విజయం కోసం అహర్నిశలూ శ్రమించారు. అక్కడక్కడా కొన్ని సంఘటనలు జరిగినా మొత్తంమీద ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అభ్యర్థుల విజయంపై జోరుగా బెట్టింగులకు తెరదీశారు. టీడీపీ, వైఎస్సార్సీపీ అభ్యర్థుల గెలుపుపై జోరుగా పందేలు కడుతున్నారు. వేల నుంచి లక్షల రూపాయల మేర పందాలు సాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ డివిజన్ వైపే చూపంతా... కాకినాడ డివిజన్ పరిధిలోని 30వ డివిజన్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిని రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బాదం బాలకృష్ణల మధ్య ఎన్నికల ఫలితంపై జోరుగా పందేలు సాగుతున్నాయి. ఇక్కడ అధికార పార్టీ అభ్యర్థి బాలకృష్ణ గెలుపు కోసం ప్రభుత్వానికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలంతా తిష్టవేసి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. వైఎస్పార్సీపీ అభ్యర్థిని తరపున మాజీ ఎమ్మెల్యే, సిటీ కోఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, అభ్యర్థిని భర్త ప్రూటీకుమార్ విస్త్రుత ప్రచారం నిర్వహించారు. అధినేతలంతా ఇక్కడే... ఏడేళ్ల విరామం తర్వాత నిర్వహించిన కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందేందుకు అధికార టీడీపీ, ప్రతిపక్ష వైఎస్సార్సీపీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయం కోసం పోరాడాయి. తెలుగు దేశం పార్టీ అభ్యర్థుల విజయం కోసం సీఎం చంద్రబాబు నాయుడుతో సహా కేబినెట్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రచారం నిర్వహించి విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు రెండు రోజులపాటు కాకినాడలో కార్పొరేషన్ ఎన్నికల్లో అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జ్వరంతో బాధపడుతున్నా, పార్టీ అభ్యర్థుల విజయం కోసం ఒకరోజు కాకినాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎంపీ విజయసాయి రెడ్డితో పలువురు వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ప్రచారం నిర్వహించారు. కాకినాడ కార్పొరేషన్పరిధిలో 50 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా విలీన పంచాయతీలపై కొంత మంది కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో రెండు డివిజన్లను మినహాయించి 48 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించారు. గెలుపు అవకాశాలపై లెక్కలు వేసుకునే పనిలో అభ్యర్థులు నిమగ్నమై ఉన్నారు. పోలింగ్ సరళి, పోలైన ఓట్లు, ఏ వర్గం ఓట్లు తమకు అనుకూలంగా పడ్డాయి, ఎక్కడ వ్యతిరేకంగా ఓట్లు పడ్డాయనే విషయంపై అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. మరో రోజులో తేలే ఎన్నికల ఫలితాల కోసం ఇటు అభ్యర్థులతోపాటు అటు పార్టీశ్రేణులు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
ఎవరి ధీమా వారిదే!
- ఉప ఎన్నికల ఫలితంపై నేతల్లో టెన్షన్ - గ్రామాల వారీగా లెక్కలు చూస్తున్న వైనం - రూ.కోట్లలో బెట్టింగ్‌లు నంద్యాల: ఉప ఎన్నికల ప్రచారంలో హోరాహోరీగా తలపడిన ప్రధాన పార్టీల నాయకులు ప్రస్తుతం ఫలితంపై టెన్షన్‌గా గడుపుతున్నారు. గ్రామాల వారీగా లెక్కలు చూసుకుంటూ విజయంపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రధాన పార్టీ అభ్యర్థుల తరఫున కోట్లాది రూపాయల బెట్టింగ్ కాసిన వారు అభ్యర్థులను మించి ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. బుధవారం పోలింగ్ ప్రక్రియను ప్రశాంతంగా ముగించిన అధికారులు సోమవారం కౌంటింగ్‌కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. అంచనాల్లో నిమగ్నమైన నేతలు.. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా శిల్పామోహన్‌రెడ్డి, టీడీపీ తరఫున భూమా బ్రహ్మానందరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా అబ్ధుల్ఖాదర్తోపాటు మరో 13మంది ఎన్నికలో పోటీ చేశారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన మరు నిమిషం నుంచి వీరంతా వార్డులు, పల్లెల వారీగా ఫలితంపై అంచనాలు వేస్తూ గడుపుతున్నారు. పట్టణంలో 1,42,628 ఓటర్లకు 1,05,629 మంది, రూరల్‌కు సంబంధించి 47,386 ఓటర్లకుగాను 41,514 మంది, గోస్పాడు మండలంలో 28,844 ఓటర్లలో 26,192 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. నియోజకవర్గ చర్రితలో ఎన్నడూ లేని విధంగా 79.20శాతం పోలింగ్ నమోదైంది. ఫలితం మిగిలి ఉండడంతో నాయకుల దృష్టి అటువైపు పడింది. గ్రామాల వారీగా నాయకులు, ఓటర్లకు పంపిణీ చేసిన నగదు, చీరలు, ముక్కుపుడకలు, దేవాలయాలకు అందజేసిన నగదు, వాటి కారణంగా తమకు వచ్చే ఓట్లను అంచనా వేస్తూ గడుపుతున్నారు టీడీపీ నాయకులు. ఓటింగ్ శాతం పెరగడంతో టీడీపీలో ఆందోళన... నియోజకవర్గంలోని 2,18,858 ఓటర్లలో 1,73,335 మంది ఓటు వేసి రికార్డు సృష్టించడంతో టీడీపీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఓటింగ్ శాతం పెరిగితే ప్రతిపక్ష పార్టీకి కలిసి వస్తుందని లోలోన మధనపడుతున్నారు. నియోజకవర్గంలో 1,11,018 మంది మహిళలుండగా 88,503 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. వీరు ఎవరికి ఓటు వేశారనేది అంతు పట్టడం లేదు. గ్రామాల్లో కూడా టీడీపీ నాయకుల అంచనా కన్నా పోలింగ్ శాతం పెరగడం ఆ పార్టీ నాయకుల్లో అలజడి రేపుతోంది. గోస్పాడు, నంద్యాల మండలాల్లోని గ్రామాలు మొదటి నుంచి వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉండటం, వాటిలో ఓటింగ్ శాతం విపరీతంగా పెరగడం టీడీపీ నాయకుల కలవరపాటుకు కారణంగా మారింది. పందెంరాయుళ్ల ఉత్కంఠ.. నంద్యాల ఉప ఎన్నిక ఫలితాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఫలితంపై నాయకులు, బెట్టింగ్ రాయళ్లు రూ.కోట్లలో పందాలు కాస్తున్నారు. ఒక్క నంద్యాల నియోజకవర్గంలోనే రూ.50కోట్ల వరకు పందాలు జరిగినట్లు సమాచారం. స్థానిక నాయకులు సైతం గ్రామాల వారీగా పందె కాస్తున్నట్లు తెలిసింది. -
బెట్టింగ్‌ల జోరు
►నంద్యాల ఉపఎన్నికపై జోరుగా పందేలు ►జిల్లాలో రూ.కోట్లలో జరుగుతున్న వైనం ►వైఎస్ఆర్సీపీ గెలుపు అంచనాలతో వెనక్కి తగ్గుతున్న టీడీపీ ►ఎక్కడ చూసినా నంద్యాల గురించే చర్చ కడప : జిల్లాలో బెట్టింగ్‌రాయుళ్లు ఏ ఎండకు ఆ గొడుగు పడుతున్నారు. ఒకసారి ఐపీఎల్, మరోసారి ఇండియా మ్యాచ్‌లపై బెట్టింగ్ జరుగుతుండగా.. ప్రస్తుతం నంద్యాల ఉప ఎన్నికపైనే జోరుగా బెట్టింగ్‌లు వేయిస్తున్నారు. ఊహకందని రీతిలో రాష్ట్రవ్యాప్తంగా బెట్టింగ్‌లు జరుగుతుండగా.. జిల్లాలో కూడా పెద్దఎత్తున పోటీ పడుతున్నారు. నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి 40రోజులుగా ప్రచార పర్వం జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా బెట్టింగ్‌రాయుళ్లు అప్పటినుంచే భారీగా పందేలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో నంద్యాల పోలింగ్ నేపథ్యంలో ఎక్కడ చూసినా ఆసక్తికర చర్చ నడుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బెట్టింగ్‌కు అన్ని పార్టీల వారు కాలర్ ఎగరేస్తున్నారు. కోట్లలో బెట్టింగ్ జిల్లాలో నంద్యాల ఉపఎన్నికపై భారీగా బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. ఎన్నికకు ముందు ఒక రేటు.. పోలింగ్ సరళిని బట్టి అయితే మరొక రేటు అన్నట్లు బెట్టింగ్ జరుగుతోంది. ఎక్కడచూసినా చిన్న, పెద్దా, ఉద్యోగ, కార్మిక ఇలా పార్టీల నాయకులతోపాటు ప్రతి ఒక్కరిలోనూ నంద్యాల ఉప ఎన్నిక గురించే చర్చ జరుగుతోంది. కిందిస్థాయి కార్యకర్తల నుంచి ఓ రకమైన నేతల వరకు నంద్యాల ఉపఎన్నికపై ఆరా తీసి పందేలు పెట్టేందుకు ఆసక్తిచూపుతున్నారు. ఏదీ ఏమైనా జిల్లాలో పెద్ద ఎత్తున బెట్టింగ్ వ్యవహారం కొనసాగుతోంది. ఎన్నికలకు సంబంధించి ఫలితాలు ఈనెల 28వ తేదీన వెలువడనున్నాయి. వెనుకంజ వేస్తున్న టీడీపీ కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ ముందురోజు వరకు టీడీపీ గెలుపు తమదేనంటూ కాలర్ ఎగరేసినా బుధవారం మాత్రం చతికిలపడ్డారు. పోలింగ్ సరళి బట్టి వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌రెడ్డి గెలుపు తథ్యమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో టీడీపీ నేతలు వెనుకంజ వేస్తున్నారు. ఎన్నిక ముందురోజు వరకు లక్షకు రూ.1.50లక్షలు ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చిన టీడీపీ నేతలు ప్రస్తుతం లక్షకు లక్ష ఇచ్చేందుకు కూడా సిద్ధంగా లేకపోగా పందేలు కాయడానికి కూడా వెనుకంజ వేస్తున్నారు. ఎన్నికలలో శిల్పా మోహన్‌రెడ్డి గెలుపు దాదాపు ఖాయమైందని, ఈ నేపథ్యంలో అనవసరంగా పందేలు పెట్టి నష్టపోవడంకంటే ఊరకుండటమే మంచిదనే నిర్ణయానికి టీడీపీ నేతలు వచ్చినట్లు తెలుస్తోంది. -
ఆట.. ఏమైందో వేట
► క్రికెట్ బెట్టింగ్ కేసులో టీడీపీ నేతలకు మినహాయింపు! ► 25 రోజులుగా అజ్ఞాతంలోనే అధికార పార్టీ బుకీలు ► పోలీసులపై అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు ► కేసును వైఎస్సార్ సీపీ నేతలపై నెడుతూ మైండ్‌గేమ్ ► పోలీస్ కస్టడీకి కృష్ణసింగ్, మరో నలుగురు ► నేటినుంచి రెండోదఫా విచారణ నెల్లూరు : జిల్లాలో సంచలనం సృష్టించిన క్రికెట్ బెట్టింగ్ రాకెట్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. కీలక బుకీలను శనివారం నుంచి పోలీస్ కస్టడీకి తీసుకుని మరోసారి విచారణ జరిపేందుకు ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ సిద్ధమవడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో అధికార పార్టీలో మళ్లీ అలజడి మొదలైంది. ఇదిలావుంటే.. 25 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న టీడీపీ నేతలను పోలీసులు ఇంతవరకు అదుపులోకి తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులపై అధికార పార్టీ ఒత్తిళ్లు పనిచేస్తున్నాయని.. మంత్రులు, ఎమ్మెల్సీలు స్వయంగా రంగంలోకి దిగి వారిని రక్షించే ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ సాగుతోంది. మళ్లీ మొదలు సమర్థవంతమైన అధికారిగా జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణకు పేరుంది. గతంలో ఆయన పనిచేసినచోట అవినీతి, అక్రమాలపై ఉక్కుపాదం మోపారు. నెల్లూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం బెట్టింగ్ రాకెట్‌పై దృష్టి సారించారు. మూలాలతోసహా రాకెట్ గుట్టును రట్టు చేసి 115 మందిని మొదటి విడతలో అరెస్ట్ చేశారు. వీరిలో కీలక బుకీగా ఉన్న కృష్ణసింగ్‌తోపాటు మరో 8 మంది ప్రధాన బుకీలు, వారి అనుబంధంగా ఉండే 15 మందిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. పలు రాజకీయ పార్టీలకు చెందిన కొంతమంది బుకీలను, పంటర్లను సైతం అరెస్ట్ చేసి వారి పాత్ర ఏ మేరకు ఉందనేది నిర్ధారించారు. జిల్లాలో సీఐలు, డీఎస్పీలే బెట్టింగ్ రాకెట్‌ను పెంచి పోషించారనే వాదన బలంగా ఉంది. ఈ క్రమంలో వారి పాత్రను కూడా నిర్ధారించి ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు సీఐలను వీఆర్‌కు పంపారు. ఆ తరువాత ఈ వ్యవహారంపై ఐదు రోజులపాటు స్తబ్దత నెలకొనగా.. తాజాగా కీలక బుకీలను పోలీస్ కస్టడీకి తీసుకుని విచారణ చేపట్టనుండటంతో రాజకీయ నేతల్లో అలజడి రేగుతోంది. ప్రధాన బుకీ కృష్ణసింగ్, షంషీర్, అనిల్‌కుమార్‌రెడ్డితోపాటు మరో ఇద్దరిని విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వీరిని శనివారం అధీనంలోకి తీసుకుని పోలీసులు మరిన్ని వివరాలు రాబట్టేందుకు సన్నద్ధమయ్యారు. బుకీల నుంచి ఎవరెవరికీ మామూళ్లు అందాయనే దానిపైనే కీలకంగా విచారణ సాగుతోంది. పోలీసు శాఖతోపాటు రాజకీయ మామూళ్లు, బుకీలకు అండదండలు అందిస్తున్న ముఖ్యనేతలకు సంబంధించిన వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. ఇంకా పరారీలోనే.. ఇదిలా ఉంటే బెట్టింగ్ రాకెట్ విషయంలో మొదటి నుంచీ దూకుడుగా వ్యవహరిస్తున్న పోలీసులు బుకీలుగా ఉన్న ఇద్దరు టీడీపీ నేతలను అరెస్ట్ చేయకపోవడంపై అనేక అనుమానాలకు తెరలేచింది. తెలుగుదేశంపార్టీ మాజీ కౌన్సిలర్ దువ్వూరు శరత్చంద్ర, అతని కుమారుడు కీలక బుకీలుగా ఉన్నారు. మంత్రులు, మాజీ మంత్రులతో శరత్చంద్రకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గత నెలలో మంత్రి నివాసంలో జరిగిన విందులో అన్నీ తానే అన్నట్టు కీలకంగా వ్యవహరించాడు. శరత్చంద్ర, అతని కుమారుడు ఇద్దరూ నగరంలో కొన్నేళ్లుగా కీలక బుకీలుగా వ్యవహరిస్తూ కోట్ల రూపాయల లావాదేవీలు జరిపారు. టీడీపీలో నామినెటేడ్ పదవి అనుభవిస్తున్న నేతకు ముఖ్య అనుచరుడైన బ్రహ్మనాయుడు కూడా కీలక బుకీగా వ్యవహరిస్తున్నాడు. బ్రహ్మనాయుడు రూ.లక్షల్లో బెట్టింగ్ నిర్వహించడంతోపాటు వందల మంది ద్వారా బెట్టింగ్ రాకెట్‌ను నడుపుతూ కీలక బుకీగా నగరంలో ఎదిగాడు. వీరంతా 25 రోజుల నుంచి పరారీలోనే ఉన్నారు. పోలీసు బృందాలు వీరి ఆచూకీ కోసం అన్వేషించినా దొరకని పరిస్థితి. పరారీకి అధికార పార్టీ నేతలే పూర్తిస్థాయిలో సహకరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు పోలీసులపై కూడా అధికార పార్టీ నేతలు బలమైన ఒత్తిడి తీసుకొస్తున్నారు. వీరిని తప్పించడం కోసం బెట్టింగ్ రాకెట్ వ్యవహారం మొత్తాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపైకి నెట్టేలా అధికార పార్టీ నేతలు మైండ్ గేమ్‌కు తెరలేపారు. జిల్లాలో పార్టీ వ్యవహారాలను కీలకంగా చూస్తున్న ఎమ్మెల్సీ కనుసన్నల్లోనే బుకీలందరూ ఉన్నారన్నది బహిరంగ రహస్యమే. కృష్ణసింగ్ మొదలుకొని బ్రహ్మనాయుడు వరకు అందరూ పెద్ద మొత్తాలను సదరు ఎమ్మెల్సీకి ముట్టజెప్పడం, వారిపై కేసులు నమోదు కాకుండా పోలీసులపై ఒత్తిడి తేవడం పరిపాటిగా మారింది. ఇదే క్రమంలో బెట్టింగ్ రాకెట్ వేట కొనసాగుతున్న తరుణంలోనూ సదరు ఎమ్మెల్సీ మంత్రుల ద్వారా పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. అరెస్ట్‌లు అనివార్యమని పోలీసులు పరోక్షంగా చెప్పడంతో వారిద్దరినీ పరారీలోనే కొనసాగేలా చూస్తున్నారు. -
పసుపు దొంగల్ని వదిలేసి వీఆర్వోలపై చర్యలా!
►మార్క్‌ఫెడ్ కుంభకోణం వ్యవహారంలో కలెక్టర్ తీరుపై కాకాణి ఆక్షేపణ ►ఉదయగిరి ఎమ్మెల్యే రూ.కోట్లు కొల్లగొట్టారని మేకపాటి ఆరోపణ ►బెట్టింగ్ వ్యవహారంలో టీడీపీ నేతల్ని వదిలేశారన్న ప్రతాప్‌కుమార్‌రెడ్డి కావలి : ఉదయగిరి నియోకవర్గంలో వెలుగుచూసిన పసుపు కుంభకోణంలో అసలు దొంగలను వదిలేసి.. 19 మంది వీఆర్వోలను బలి పశువుల్ని చేయడం శోచనీయమని వైఎస్సా ర్ సీపీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. కావలిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ నాయకుల ఒత్తిళ్లకు కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు తలొగ్గారని.. ఆయన బలహీనంగా వ్యవహరిస్తే జిల్లాలో పాలక వ్యవస్థ నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పసుపు కుంభకోణంలో జిల్లా కలెక్టర్ పక్షపాత వైఖరి అవలంబిస్తూ కేసును నీరుగార్చేలా వ్యవహరిస్తున్నారన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేసిన టీడీపీ నేతలను రక్షించేందుకు యత్నించడం సిగ్గుచేటన్నారు. ఈ కుంభకోణంలో నిష్పక్షపాతంగా, లోతుగా దర్యాప్తు చేసి, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మార్క్‌ఫెడ్‌కు నాసిరకం పసుపుతోపాటు మట్టిని సైతం అంటగట్టి నిధులు లూటీ చేసింది ఎవరో తేలిపోయిందన్నారు. ఈ కుంభకోణంతో ప్రత్యక్ష సంబంధం ఉన్న అధికార పార్టీకి చెందిన మార్కెట్ కమిటీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మండల పరిషత్ అధ్యక్షులు, సర్పంచ్‌లను విస్మరించారన్నారు. టీడీపీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గిన కలెక్టర్ 19మంది వీఆర్వోలను సస్పెండ్ చేశారని.. అసలు దోషులైన టీడీపీ నాయకులు వదిలేయడం అన్యాయమని పేర్కొన్నారు. అక్రమార్కులు కొల్లగొట్టిన ప్రభుత్వ సొమ్మును ఆర్ ఆర్ యాక్ట్ ప్రకా రం రికవరీ చేసేందుకు కలెక్టర్ ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. వైఎస్సార్ సీపీ సర్పంచ్ల చెక్ పవర్ రద్దు చేయడం, టీడీపీ సర్పంచ్ల అవకతవకలను నివేదిక రూపంలో తెలియజేసిన కార్యదర్శులను సస్పెండ్ చేయడం కలెక్టర్‌కు తగదన్నారు. నీరు–చెట్టు పథకం నిధులను పక్కదారి పట్టించిన వ్యవహారంలో అధికారులపై చర్యలు తీసుకున్న కలెక్టర్ ఇందుకు కారణమైన టీడీపీ నేతలను గాలికొదిలేయడం శోచనీయమన్నారు. బెట్టింగ్‌ల పాపం టీడీపీదే జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ వ్యవహారాలకు బీజం వేసింది టీడీపీ నేతలేనని కాకాణి విమర్శించారు. వారికి నచ్చిన పోలీసు అధికారులకు వివిధచోట్ల పోస్టింగ్‌లు వేయించుకుని.. అక్రమాలను పెంచి పోషించింది వారేనన్నారు. క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుల నుంచి మామూళ్లు వసూలు చేసిన కొందరు పోలీసులు, వారికి పోస్టింగ్ ఇప్పించిన టీడీపీ నేతలకు అందులో వాటాలు ఇచ్చేవారని అన్నారు. వాస్తవం ఇది కాగా, టీడీపీ నేతలు సిగ్గు లేకుండా బెట్టింగ్ వ్యవహారాన్ని తమ పార్టీకి అంటగట్టే విధంగా మాట్లాడటం శోచనీయమన్నారు. -
టీడీపీలో బెట్టింగ్ బాబులు
►ముగ్గురు నేతల కోసం పోలీసుల అన్వేషణ ►వారిని తప్పించేందుకు అధికార పార్టీ నేతల యత్నాలు ►రంగంలోకి అమాత్యుని సన్నిహితుడు నెల్లూరు : తెలుగుదేశం పార్టీలో బెట్టింగ్ బాబుల వ్యవహారం కలకలం రేపుతోంది. క్రికెట్ బెట్టింగ్ వెనుక నగరానికి చెందిన ఇద్దరు టీడీపీ నేతలతోపాటు ఓ మాజీ కార్పొరేటర్ కుమారుడి హస్తం ఉందని నిర్ధారణకు వచ్చిన పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అధికార పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఇద్దరు నేతలు తెరచాటున క్రికెట్ బుకీలుగా వ్యవహరిస్తున్నారు. వారిద్దరికీ కీలక నాయకులతో సన్నిహిత సంబంధాలతోపాటు ఆర్థిక లావాదేవీలు కూడా ఉండటం హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో మంత్రికి సన్నిహితుడైన ఓ కీలక నాయకుడు రంగంలోకి దిగి వారిద్దర్ని తప్పించేందుకు యత్నిస్తున్నారు. టీడీపీ నేతల బెట్టింగ్ కార్యకలాపాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు నిర్వహించారు. నగర తెలుగు యువత నేతతోపాటు ఆలయ మాజీ చైర్మన్ ఏడాదిగా బెట్టింగ్ కార్యకలాపాలను భారీ ఎత్తున నిర్వహించి నట్టు నిర్ధారించారు. వీరితో పాటు మాజీ కార్పొరేటర్ కుమారుడు సైతం ఈ కార్యకలాపాలు నిర్వహించినట్టు తేల్చారు. ఇతడు కొంతకాలంగా వీటికి దూరంగా ఉంటున్నట్టు చెబుతున్నారు. నగరానికి చెందిన ఒక కుటుంబం మాజీ కార్పొరేటర్ కుమారుడి వద్ద భారీగా బెట్టింగ్ కట్టి అప్పుల పాలయ్యారు. ఆ ఊబినుంచి బయటపడే మార్గం లేక నెల క్రితం ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న విషయం విది తమే.ఈ నేపథ్యంలో ముగ్గురి కోసం పోలీసులు అన్వేషణ మొదలైంది. ఇతర ప్రముఖులతోనూ సంబంధాలు పోలీసుల అదుపులో ఉన్న అంతర్జాతీయ క్రికెట్ బుకీ కృష్ణసింగ్‌కు టీడీపీ నేతలతోపాటు మరికొందరు ప్రముఖులతోనూ సంబంధాలు, బెట్టింగ్ లావాదేవీలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. కృష్ణసింగ్ నేరుగా ముంబైలోని కీలక ఏజెంట్ ద్వారా నెల్లూరు జిల్లాతోపాటు మరో రెండు రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఈ దృష్ట్యా జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతల్లో పలువురు అతడిని ఆర్థికంగా వినియోగించుకున్నారు. పోలీసులపై ఒత్తిళ్లు 15 రోజుల క్రితం ఒకచోట జూద శిబిరం నిర్వహించగా.. అక్కడ కృష్ణసింగ్ ఉన్నాడన్న సమాచారంతో పోలీసులు మెరుపుదాడి చేశారు. వారు దాడికి వస్తున్నారన్న సమాచారం కృష్ణసింగ్‌కు పోలీసు వర్గాల ద్వారా ముందుగానే తెలియడంతో అప్రమత్తమైన అతడు రాష్ట్రాన్ని వదిలి పారిపోయాడు. అతడి జాడ కనుక్కునేందుకు జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. వారం రోజులపాటు అతడి కోసం జల్లెడ పట్టిన పోలీసులు ఎట్టకేలకు వేరే రాష్ట్రంలో అదుపులోకి తీసుకుని నగరానికి తీసుకొచ్చారు. కృష్ణసింగ్‌ను అక్కడి నుంచి తీసుకురావడానికి రెండు రోజుల సమయం పట్టింది. ఈలోగా టీడీపీ నేతల నుంచి సింగ్‌కు ఒత్తిళ్లు వచ్చాయి. తమ పేర్లు బయట పెట్టవద్దని ఆ నేతలు హడావుడి చేసిన విషయాన్ని పోలీస్ బాస్ నిర్ధారించారు. అధికార పార్టీ నేతలే కాకుండా మరికొందరు ప్రముఖులకూ కృష్ణసింగ్‌తో బెట్టింగ్ లావాదేవీలు ఉన్నాయి. ఇదిలావుండగా.. కృష్ణసింగ్‌ను అదుపులోకి తీసుకున్న వెంటనే టీడీపీ నేతల నుంచి పోలీసులపైనా ఒత్తిళ్లు పెరిగాయి. జిల్లాకు చెందిన ఒక మంత్రి సైతం చర్యలు లేకుండా చూడాలంటూ పోలీసులకు సిఫార్సు చేసినట్టు సమాచారం. ఈ వ్యవహారాన్ని చక్కదిద్దే బాధ్యతను ఆయన తన సన్నిహితుడికి అప్పగించినట్టు భోగట్టా. అయితే, పోలీసులు మాత్రం ఒత్తిళ్లను, సిఫార్సులను పట్టించుకోకుండా దర్యాప్తులో వేగం పెంచారు. -
ఆన్లైన్ బెట్టింగ్‌కు చట్టబద్ధత!
న్యూఢిల్లీ: భారత్‌లో క్రీడల ప్రోత్సాహానికి నిధుల కొరత ఉండటంతో ఆన్లైన్ బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయాలని కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ భావిస్తోంది. దీనికి సంబంధించిన న్యాయపరమైన చిక్కులు లేకుండా ఉండేందుకు డ్రాఫ్ట్‌ను తయారు చేస్తోంది. వచ్చే రెండెళ్లలో ఆన్లైన్ బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయాలని ఆ శాఖ ప్రణాళిక రచిస్తోంది. ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా ప్రభుత్వానికి వచ్చే నిధులతో క్రీడలను ప్రోత్సహించాలనుకుంటుంది. ఇప్పటికే భారత్‌లో చట్ట వ్యతిరేకంగా ఏడాదికి రూ 9.6 లక్షల కోట్ల బెట్టింగ్ జరుగుతుంది. దీంతో దీనిని చట్ట బద్ధం చేస్తే పన్నుల రూపంలో క్రీడాశాఖకు నిధులు చేరే అవకాశం ఉంది. ప్రస్తుతానికి హార్స్ రేసింగ్‌లపై బెట్టింగ్‌లు చట్టబద్ధంగా ఉండగా కేంద్రం వీటిపై 28శాతం జీఎస్టీ వసూలు చేస్తోంది. ఇటీవల ఈ విషయంపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ అధికారులతో సమావేశమై చర్చించారు. క్రీడాశాఖ ఆర్ధిక పరిస్ధితి మెరుగుపరచడం, ప్రపంచానికి గొప్ప క్రీడాకారులను పరిచయం చేయడం తమ అభిమతం అని క్రీడామంత్రిత్వ శాఖ పేర్కొంది. బెట్టింగ్ అనేది ఓ సున్నితమైన సామాజిక రాజకీయ సమస్యా అని పేర్కొంది. దీంతో మ్యాచ్ ఫిక్సింగ్, స్పాట్ ఫిక్సింగ్ వివాదాలు చెలరేగే అవకాశం ఉండడతో ఆచుతూచి ప్రణాళిక సిద్దం చేస్తున్నామని తెలిపింది. గతంలో సుప్రీం కోర్టుకు క్రికెట్ బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయాలని చాల మంది అభిప్రాయపడినట్లు లోథా కమిటీ తమ నివేదికలో పేర్కొంది. ఇది ఇప్పటికే యూకేలో అమలవుతుందని సూచించింది. -
బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయొచ్చా?
ప్రజాభిప్రాయం కోరిన న్యాయ కమిషన్ న్యూఢిల్లీ: బెట్టింగ్, జూదాలను చట్టబద్ధం చేయొచ్చో లేదో తెలపాలని న్యాయ కమిషన్ ప్రజలను కోరింది. వీటిని చట్టబద్ధం చేస్తే దేశంలో అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుందో లేదో కూడా తెలపాలంది. బెట్టింగ్, జూదాలకు లైసెన్స్ ఇస్తే ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందా? కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందా? లాంటి విషయాలను ప్రజాభిప్రాయం ద్వారా తెలుసుకోవాలనుకుంటోంది. మన దేశంలో జూదం, బెట్టింగ్‌లను చట్టబద్ధం చేయడం ఎంత వరకు నైతికంగా సరైందని ప్రశ్నించింది. ‘ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొనేవారు దివాలాతీయకుండా కాపాడేందుకు ఉన్న మార్గం ఏంటి? ఒకవేళ వీటిని చట్టబద్ధం చేస్తే విదేశీ కంపెనీలను భారత్‌లోకి అనుమతించాలా?’ అని కమిషన్ అడిగింది. బీసీసీఐ వర్సెస్ బిహార్ క్రికెట్ అసోసియేషన్ కేసును విచారిస్తూ, బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని 2016లో సుప్రీంకోర్టు, న్యాయ కమిషన్‌ను ఆదేశించింది. -
ఐపీఎల్ బెట్టింగ్‌లే కొంపముంచాయి!
► భార్యాబిడ్డలకు నిద్రమాత్రలు, విషపు ఇంజెక్షన్ ! ►హెడ్ కానిస్టేబుల్ కుటుంబం ఆత్మహత్య కేసులో వెల్లడైన నిజం ►హత్య కేసుగా నమోదు యలహంక: ఐపీఎల్ బెట్టింగ్‌లు కుటుంబాన్ని మింగేశాయి. అతను పోలీస్ హెడ్ కానిస్టేబుల్ విచ్చలవిడిగా బెట్టింగ్ వేశాడు. ఆ కారణంతోనే కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకునేలా చేశాయి. బెట్టింగ్ ఒక సరదా. హద్దులు దాటి ఆడితే అదే సరదా ప్రాణాలు తీస్తుంది. ఇలాంటి సంఘటననే నగరంలో సంపిగేహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సీఏఆర్ హెడ్ కానిస్టేబుల్ సుభాష్‌చంద్ర ఆరోగ్యం మెరుగ్గానే ఉందని చికిత్స అందిస్తున్న బాప్టిస్ట్ ఆసుపత్తి వైద్యురాలు ఇందిరా మీనన్ తెలిపారు. ఈ ఘోరానికి మూలం ఐపీఎల్ బెట్టింగ్లేనని తెలుస్తోంది. అతని కుటుంబం ‘ఆత్మహత్యాయత్నం’ ఘటనలో భార్య, ఇద్దరు పిల్లలు మరణించడం తెలిసిందే. మంగళవారం వెలుగు చూసిన ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఆత్మహత్యకు యత్నించిన సుభాష్ మొదట భార్య వీణ, పిల్లలు, మణి, పథ్విలకు నిద్రమాత్రలు వేశారు. వారు నిద్రలోకి జారుకోగానే విషపు ఇంజెక్షన్లను ఇచ్చాడని వైద్యపరీక్షలో తేలినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. ఆ తరువాత సుభాష్ కూడా నిద్రమాత్రలు మింగి తాను కూడా విషాన్ని ఇంజెక్ట్ చేసుకున్నాడు. విషం ధాటికి భార్య పిల్లు మరణించగా, ఇతడు కొనప్రాణంతో ఉండగా బంధువులు గమనించి ఆస్పత్రికి తరలించారు. విచారణలో వెలుగు చూసిన అంశాలతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. విచ్చలవిడిగా ఐపీఎల్ పందేలు తాజాగా ముగిసిన ఐపీఎల్ క్రికెట్ టోర్నీలో బెట్టింగ్‌లే హెడ్‌కానిస్టేబుల్ సుభాష్ కుటుంబంలో ఘోరానికి కారణంగా తెలుస్తోంది. మ్యాచ్‌లు మొదలైన రోజు నుంచి బెట్టింగ్‌లకు పాల్పడుతున్న సుభాష్ చాలా మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో బాగా నష్టపోయాడు. అతని ఒత్తిడితో భార్య వీణ అప్పుడప్పుడూ ఇంటి నుంచి డబ్బులు తెచ్చేదని వారి బంధువులు చెబుతున్నారు. ఆదివారం పుణే,ముంబయి జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సుభాష్ రూ.15 లక్షలకు పుణె గెలుస్తుందని పందెం కాశాడని తెలిసింది. అయితే పుణె ఓడిపోవడంతో బెట్టింగ్‌రాయుళ్లు డబ్బుల కోసం ఇతనిపై ఒత్తిడి తెచ్చారు. సుభాష్ బళ్లారిలో ఉన్న స్నేహితులు, బంధువులను అప్పులు అడగగా అంతమొత్తంలో ఇవ్వలేమంటూ సమాధానాలు రావడంతో అప్పులు తీర్చే మార్గం కానరాక ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. దీంతో భార్యా, పిల్లలకు విషమివ్వాలనే భయంకరమైన ఆలోచన తట్టి ఉంటుందని చెబుతున్నారు. ఇతడు తక్కువ మోతాదులో నిద్రమాత్రలు, విషాన్ని ఇంజెక్ట్ చేసుకోవడంతో ప్రాణాపాయం నుంచి బయటపడి ఉంటాడని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. -
ఫైనల్.. కాస్కో !
► నేడే ఐపీఎల్ ఫైనల్ ► భారీగా బెట్టింగ్‌లు ► రెండు జిల్లాల్లో రూ.100 కోట్లు చేతులుమారే అవకాశం ► అధికార పార్టీ పెద్దలే సూత్రధారులు ► విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లిలో భారీగా ఏర్పాట్లు చేసిన బుకీలు ► పట్టించుకోని పోలీసుయంత్రాంగం సాక్షి, గుంటూరు: నలభై ఐదు రోజులుగా క్రికెట్ బుకీలకు కాసుల వర్షం కురిపిస్తున్న ఐపీఎల్–10 చివరి దశకు చేరింది. ముంబయి ఇండియన్స్–పుణే సూపర్ జెయింట్స్ మధ్య ఆదివారం రాత్రి ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ సందర్భంగా రాజధాని జిల్లాల్లో భారీగా బెట్టింగ్‌లు నిర్వహించేందుకు బుకీలు రంగం సిద్ధం చేశారు. ఫైనల్ మ్యాచ్ కావడంతో రెండు జిల్లాల్లో కలిపి నాలుగు గంటల్లోనే రూ.100 కోట్ల వరకు చేతులు మారే అవకాశం ఉందని అంచనా. బుకీలు అపార్టుమెంట్లను కేంద్రంగా చేసుకుని యువత, వ్యాపారులే లక్ష్యంగా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. ఈ వ్యవహారం మొత్తం సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఆన్లైన్ ద్వారా నడిపిస్తున్నారు. కొందరు బంతిబంతికీ బెట్టింగ్ నిర్వహిస్తూ కోట్లాది రూపాయలను ఆర్జిస్తున్నారు. బుకీలు ప్రత్యేకంగా నిఘా వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకున్నట్లు తెలిసింది. పోలీసు నిఘా నామమాత్రమే..! ఏప్రిల్ ఐదో తేదీన ఐపీఎల్–10 ప్రారంభమైంది. అప్పటి నుంచి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. సులభంగా డబ్బు వస్తుందనే ఆశతో మధ్య తరగతి ప్రజలు, కూలీలు సైతం పందేలు కాస్తున్నారు. పోలీసులు పెద్ద బుకీలను వదిలి కేవలం కొద్ది మొత్తంలో పందేలు కాస్తున్నవారిని మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లా, విజయవాడ కమిషనరేట్, గుంటూరు రూరల్, అర్బన్ జిల్లా పరిధిలో 50 వరకు బెట్టింగ్ కేసులు నమోదు చేశారు. అయితే ఎక్కడా భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకోలేదు. బెట్టింగ్ బోర్డు నిర్వాహకులను అరెస్ట్ చేయలేదు. కొందరు పోలీసులే బుకీల నుంచి మామూళ్లు వసూలు చేసి స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు అప్పగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో స్టేషన్ హౌస్ ఆఫీసర్లు బెట్టింగ్‌ల జోలికి వెళ్లడంలేదని తెలిసింది. మరోవైపు గుంటూరులో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, క్విక్ రియాక్షన్ బృందాలు దాడులు నిర్వహించి పట్టాభిపురం, అరండల్‌పేట, గుంటూరు రూరల్ తదితర స్టేషన్ల పరిధిలో బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఎనిమిది బృందాలను అరెస్ట్ చేయడం ఇందుకు బలాన్నిస్తోంది. విజయవాడలో వింత పరిస్థితి... విజయవాడలో ఒకటి, రెండు స్టేషన్లు మినహా టాస్క్‌ఫోర్స్ పోలీసులు మాత్రమే బెట్టింగ్ రాయుళ్లను అరెస్ట్ చేస్తున్నారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు పెద్ద ఎత్తున డబ్బులు అందడమే ఇందుకు కారణమని సమాచారం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కీలకమైన బెట్టింగ్‌లను వదిలి పోలీసులు ఇప్పుడు నిషేధిత గుట్కా విక్రేతలపై దాడుల పేరుతో హడావుడి చేస్తున్నారు. ఐపీఎల్ బెట్టింగ్‌ల నుంచి దృష్టి మళ్లించేందుకే ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నేతల అండతోనే... కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకుల అండతోనే బుకీలు యథేచ్ఛగా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. కొందరు నేతలు ఏకంగా బుకీలతో సంబంధాలు పెట్టుకుని బెట్టింగ్‌ల నిర్వహణకు సహకరిస్తున్నారు. విజయవాడ బావాజీపేటలోని ఓ రియల్ ఎస్టేట్ కార్యాలయం కేంద్రంగా టీడీపీకి చెందిన ఒక ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం తెలిసినా... పోలీసులు అటువైపు వెళ్లే సాహసం చేయడం లేదు. సత్తెనపల్లి, గుంటూరులో కూడా అధికార పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతల ముఖ్య అనుచరులే బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. సత్తెనపల్లిలో బెట్టింగ్ బోర్డు... సత్తెనపల్లి, గుంటూరుల్లో ప్రధాన బెట్టింగ్ బోర్డు నిర్వాహకులు ఉన్నారు. వీరి నుంచి ప్రాంతాల వారీగా అనేక మంది స్థానికంగా బెట్టింగ్‌లు నిర్వహిస్తుంటారు. బెట్ ఫేర్తోపాటు పలు వెబ్సైట్లలో బంతిబంతికీ బెట్టింగ్ కాస్తుంటారు. ఫైనల్ మ్యాచ్‌లో ప్రధానంగా ముంబయి హాట్ ఫేవరేట్ కావడంతో ఈ బెట్టింగ్ బోర్డు ఆ జట్టుపై రూ.లక్షకు రూ.70 వేలు ఇస్తే చాలు.. పుణే గెలిస్తే రూ.లక్షకు రూ.1.35 లక్షలు ఇస్తామని ఊరిస్తున్నట్లు సమాచారం. -
ట్రంప్ ఉంటాడా?.. ఊడతాడా?
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మహాభిశంసన తీర్మానం ద్వారా వైదొలుగుతారా? లేదా?. ఈ ప్రశ్నపై ఆన్లైన్లో అత్యధికంగా బెట్టింగ్‌లు జరగుతున్నాయి. ఆన్లైన్ పొలిటికల్ స్టాక్ మార్కెట్ ప్రెడిక్ట్ఇట్లో గత రెండు రోజులుగా ఈ ప్రశ్నపై ఎక్కువ మంది బెట్ చేస్తున్నారు. ఇప్పటివరకూ దాదాపు లక్షకు పైచిలుకు మంది ప్రెడిక్ట్ఇట్లో ట్రంప్ ప్రశ్నపై బెట్ చేశారు. గత వారంలో ట్రంప్ అభిశంసనకు గురవుతారని ప్రెడిక్ట్ఇట్లో 7గా ఉన్న ఓట్ల శాతం.. బుధవారం ఒక్కరోజే 33 శాతానికి వెళ్లింది. సాయంత్రానికి మళ్లీ తగ్గి 24 శాతానికి చేరింది. ప్రెడిక్ట్ఇట్ను వాషింగ్టన్ పొలిటికల్ కన్సల్టెన్సీ అరిస్టోటిల్, విక్టోరియా యూనివర్సిటీ-వెల్లింగ్టన్లు నిర్వహిస్తున్నాయి. ఇందులో రిజిస్టర్ అయినవారందరూ అమెరికన్లే. ఎక్కువ మంది బెట్టర్లు ట్రంప్ పూర్తి కాలం పదవిలో కొనసాగరని 5 వేల డాలర్లు బెట్ చేసినట్లు బుక్‌మేకర్ పాడీ పవర్ బెట్‌ఫెయిర్ చెప్పింది. -
క్రికెట్ బుకీల అరెస్ట్
- అదుపులో ఐదుగురు బెట్టింగ్ రాయుళ్లు - రూ. 1.13 లక్షలు, ఏడు సెల్ఫోన్లు, చీటీలు స్వాధీనం ఆదోని అర్బన్: ఆదోని పట్టణంలో వివిధ ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు బుకీలతో పాటు, బెట్టింగ్ పాల్పడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 1.13 లక్షలు, ఏడు సెల్ఫోన్లు, చీటీలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు నిందితుల వివరాలను వెల్లడించారు. పట్టణంలోని బార్పేటకు చెందిన రియాజ్‌బాషా, కునిముల్లాకు చెందిన గరీఫ్ బాషా ఇంటి వద్దనే క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడటంతో పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు. అలాగే పట్టణంలో బెట్టింగ్ ఆడుతున్న వాల్మీకి నగర్‌కు చెందిన సోను, గోకర్‌జెండా నవశాద్, కౌడల్‌పేట నసీర్‌బాషా, జావిద్, హవన్నపేట మహ్మద్‌బాషాను త్రీటౌన్ సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ విజయ్‌కుమార్, ఎస్ఐలు సునిల్ కుమార్, సిబ్బందితో కలిసి వారిపై దాడి చేసి వారి వద్ద నుంచి నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఇంకా కొంతమంది బుకీల వివరాలు వెలుగులోకి వచ్చినట్లు డీఎస్పీ తెలిపారు. ప్రస్తుతం వారంతా కర్ణాటకకు చెందిన రాయచూరు, బెంగళూరు, శిరుగుప్ప, బళ్లారిలో మకాం పెట్టి ఆదోని పట్టణంంలో సెల్‌ఫోన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. -
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
కర్నూలు: కర్నూలు నగరం సుంకేసుల రోడ్డులోని ఎస్వీఆర్ లాడ్జి సమీపంలో బహిరంగ ప్రదేశంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న తుపాకుల ఆంజనేయులు, షేక్ ఇర్ఫాన్‌ను రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.30 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. కల్లూరులోని చింతలముని నగర్‌కు చెందిన ఆంజనేయులు, పాతబస్తీలోని పెద్దమార్కెట్ ప్రాంతానికి చెందిన షేక్ ఇర్ఫాన్ ముఠాగా ఏర్పడి నెట్ ద్వారా భజరంగ్ అనే యాప్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం జరుగుతున్న సన్‌రైజర్స్ హైదరబాదు ‘ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఆన్లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ జరుపుతుండగా పక్కా సమాచారం మేరకు సీఐ డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో ఎస్ఐలు చంద్రశేఖర్‌రెడ్డి, మోహన్ కిషోర్ రెడ్డి, సిబ్బంది మద్దీశ్వర్, సుంకన్న, వరకుమార్, కృష్ణ, అమర్నాథ్రెడ్డి తదితరులు సోమవారం రాత్రి 10 గంటల సమయంలో దాడి చేసి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.30 వేలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించినట్లు సీఐ తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి బెట్టింగ్ ముఠాను అరెస్టు చేయడమే కాకుండా డబ్బు రికవరీ చేసినందుకు సిబ్బందిని డీఎస్పీ రమణమూర్తి అభినందించారు. -
ఇద్దరు క్రికెట్ బుకీలు అరెస్ట్
ఆదోని అర్బన్: ఆదోని పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే ఇద్దరు బుకీలను పోలీసులను అరెస్ట్ చేశారు. నిందితుల వివరాలను డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు మీడియాకు వివరించారు. పట్టణంలోని అమరావతి నగర్‌కు చెందిన మంగలి రాజు, కల్లుబావి బీసీ నగర్‌కు చెందిన శ్రీరాములు సోమవారం ఉదయం 9 గంటలకు ఓవర్ బ్రిడ్జి కింద రవిబార్ సమీపంలో ఐపీఎల్ 20–20 క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు సమాచారం రావడంతో వన్‌టౌన్ సీఐ రామానాయుడు, ఎస్ఐ బాబు సిబ్బందితో దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.25 వేలు, రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు 9 బెట్టింగ్ కేసుల్లో రూ. 7 లక్షలు స్వాధీనం చేసుకున్నామన్నారు. -
కొత్తదారుల్లో కిక్రెట్ బెట్టింగ్!
-
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
రూ.1.60 లక్షలు స్వాధీనం రాజమహేంద్రవరం క్రైం : క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా సభ్యులను రాజమహేంద్రవరం పోలీసులు అరెస్ట్ చేశారు. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి. రాజకుమారి తెలిపిన వివరాల ప్రకారం తాడితోట, ఏసీవై కాలనీలోని పళ్ల సత్తిరాజు ఇంట్లో శనివారం జరుగుతున్న 20–20 క్రికెట్ మ్యాచ్ పూనే వర్సెస్ ముంబయి ఇండియ¯Œ్స క్రికెట్ మ్యాచ్‌కు బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా సభ్యులు ప్రభునాయుడు, కామేశ్వరరావు, పళ్ల సత్తిరాజులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ 1.60 లక్షలు నగదు, 9 సెల్ఫోన్లు, ఒక ల్యాప్ ట్యాప్, టీవీ, బ్యాటరీలు, స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ప్రభునాయుడు, కామేశ్వరరావులు 2014 నుంచి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ పట్టుబడిన కేసు వన్‌టౌన్ పరిధిలో ఉందని తెలిపారు. ప్రధాన నిందితుడు వైజాగ్‌కు చెందిన మున్నిని అరెస్ట్ చేయ్యాల్సి ఉందని తెలిపారు. వీరిని అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపిన ఏజీఎస్ ఎస్సై రాంబాబు, కానిస్టేబుళ్లు తాతారావు, మణికంఠలను ఎస్పీ అభినందించారు. సెంట్రల్ జోన్ డీఎస్పీ కుల శేఖర్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ రామకృష్ణ, వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ రవీంద్ర, ఎస్సై రాజ శేఖర్ పాల్గొన్నారు. క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తే కఠిన చర్యలు క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజమహేంద్రవరం అర్భ¯ŒS జిల్లా ఎస్పీ బి.రాజకుమారి తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే వారిపై నిఘా ఏర్పాటు చేస్తామని అన్నారు. -
ఎమ్మిగనూరుకు ‘బెట్టింగ్ ఫివర్’.!
– రూ. లక్షల్లో క్రికెట్ బెట్టింగ్ – ఎందరో బాధితులు అప్పుల పాలై దివాలా – 17 మంది బెట్టింగ్‌రాయుళ్ల అరెస్టు - రూ. రూ.1.22 లక్షలు, 15 సెల్ ఫోన్లు స్వాధీనం ఎమ్మిగనూరు: క్రికెట్ బెట్టింగ్‌కు వ్యసనానికి బానిసైన వందలాది మంది భారీ మొత్తంలో డబ్బులు పోగొట్టుకొంటున్నారు. ఐపీఎల్ పుణ్యమాని క్రికెట్ క్రేజ్ పెరిగిపోయింది. పిల్లల నుంచి ముదసలి వాళ్ల వరకూ ప్రతిరోజు రూ. లక్షల్లో బెట్టింగ్ ఆడుతూ క్రికెట్ క్రీడను జూదక్రీడగా మార్చేశారు. పట్టణాలే కాదు పల్లెలకూ బెట్టింగ్ విస్తరించింది. ముఖ్యంగా ఎమ్మిగనూరు పట్టణంలో నలుగురు బుకీలు బెట్టింగ్ నిర్వాహణలో కీలకసూత్రధారులుగా ఉన్నట్లు క్రీడాభిమానులు పేర్కొంటున్నారు.200 మందికి పైగా బెట్టింగ్ ఆడుతున్నట్లు సమాచారం. మ్యాచ్ గెలిస్తే ఓ రేటు..బౌలర్తీ సే వికెట్లను బట్టీరేటు పెరుగుతోంది. బాట్స్మెన్ చేసే స్కోర్‌పై..కొట్టే ఫోర్, సిక్స్‌లపై బెట్టింగ్ రేట్లను బుకీలు పెంచేస్తారు. క్రికెట్ బెట్టింగ్ మూలంగా అటు నిద్రహారాలను మానుకొనేవారు..ఆస్తులను అమ్మేవారు..అప్పులు కోసేవారు ఎమ్మిగనూరులో అధికమైంది.ఇక్కడ రూ.3 రూపాయలు సాధారణ వడ్డీగా రూ.15 వరకూ వడ్డీ నడుస్తోంది.కొందరైదే ఏకంగా రోజువారీ వడ్డీ వసూలు చేస్తున్నారు.లక్షకు ప్రతిరోజూ రూ.300నుంచి రూ.600వరకూ వడ్డీ చెల్లించాలి. ఇలా అధిక వడ్డీ వ్యాపారులే 37 మంది వరకు ఉన్నారు. ప్రతి రోజూ బెట్టింగ్ నడుపుతూ ఆడేవాళ్లలో విద్యార్థులు , రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బ్రోకర్లు, సిమెంట్ షాపు ఓనర్లు, బ్యాంక్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఎంటర్ ప్రైజెస్ వ్యాపారం, ఫైనాన్సు వ్యాపారులు, మద్యం వ్యాపారులు, వారి కుటుంబసభ్యులే అధికంగా ఉండటం విశేషం. ప్రతి రోజు జరిగే రెండు మ్యాచ్‌లకు రూ.30 లక్షల వరకు ఇక్కడ బెట్టింగ్ జరుగుతున్నట్లు క్రీడాభిమానులు పేర్కొంటున్నా అది ఇంకా ఎక్కువగానే ఉంటుందనీ తెలుస్తోంది. ఎమ్మిగనూరులో క్రికెట్ బెట్టింగ్ నిరంతర ప్రక్రియగా మారింది.మంచి పోలీసు అధికారులు వచ్చినప్పుడు బెట్టింగ్ రాయుళ్లను అరెస్టు చేస్తే..ఆమ్యామ్యాలతో పవర్లోకి వచ్చినవారు మ్యాచ్‌కో రేటు చొప్పున దండుకొంటుని దందాలు నిర్వహించారు. ఏదీ ఎమైనా ఎమ్మిగనూరును బెట్టింగ్ ఫివర్ వణికిస్తోంది.బెట్టింగ్‌రాయుళ్ల ఆటకట్టించాల్సిన పోలీసు యంత్రాంగం మరింత చాకచక్యంగా వ్యవహరించాల్సి ఉంటోంది. బెట్టింగ్ రాయుళ్లు అరెస్టు: క్రికెట్ బెట్టింగ్ రాయుళ్లలో కొందరిని పోలీసులు పట్టుకున్నారు.ఎమ్మిగనూరు సీఐ ప్రసాద్‌తో కలసి ఆదోని డీఎస్పీ కొల్లి శ్రీనివాసులు శుక్రవారం వివరాలు వెల్లడించారు. పట్టణంలో క్రికెట్ బెట్టింగ్ భారీ ఎత్తున జరుగుతుందని తెలియటంతో సీఐ జీ.ప్రసాద్ ఆదేశాల మేరకు రూరల్ ఎస్ఐ వేణుగోపాల్, నందవరం ఎస్ఐ జగన్మోహన్, క్రైంపార్టీ పోలీసులు, సిబ్బంది నిఘా పెంచారు. పకడ్బందీగా పథకం వేసి సోమప్ప నగర్‌కు చెందిన మీసే రమేష్, ఎంఆర్ ప్రసాద్‌ను పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారి సెల్ ఫోన్స్‌లో కాల్ డేటా ఆధారంగా మిగతా 15 మందిని అదుపులో తీసుకున్నారు. ఈ బెట్టింగ్‌కు మూల సూత్రధారి సోమప్ప నగర్‌కు చెందిన బోయ రామకృష్ణ కర్నూలులో నివాసముంటు అక్కడ నుంచే ఏజెంట్లు, బుకీలను పెట్టుకొని బెట్టింగ్ నిర్వహిస్తుంటాడు. మేడమ్ నాగేంద్ర, నజీర్ అహమ్మద్ బుకీలుగా, కళ్యాణ్‌చక్రవర్తి అనే వ్యక్తి కలెక్షన్ ఏజెంట్లుగా ఉంటూ బెట్టింగ్ రాయుళ్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేవాడు. ఈ వ్యవహరమంతా ఫోన్లలోనే నడిచేది. ఈ బారీ బెట్టింగ్‌పై పోలీసులు పక్కా సమాచారంతో రెండు వేర్వురు చోట్ల దాలు చేసి పట్టుకున్నారు. ప్రధాన సూత్రధారి బోయ రామకృష్ణ, బుకీలు నజీర్‌అహమ్మద్, మేడమ్ నాగేంద్రలతో పాటు మరో 14 మందిని పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.1.22 లక్షల నగదు, 15 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్‌ను వెలుగులోకి తెచ్చేందుకు చాకక్యంగా వ్యవహరించిన రూరల్, నందవరం ఎస్ఐలు వేణుగోపాల్, జగన్మోహన్యాదవ్లకు రివార్డులు ఇచ్చేందుకు ఎస్పీకి ప్రతిపాదనలు పంపుతున్నట్లు డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు విలేకరులకు తెలిపారు. వీరిని అరెస్ట్ చేసి కోర్టులో హజరుచనున్నట్లు పేర్కొన్నారు.అయితే బెట్టింగ్‌లో అరెస్టు అయిన వారిలో ఎక్కువమంది విద్యార్థులే కావటం కొసమెరుపు. వీరంతా బెట్టింగ్ బాధితులు – ఎమ్మిగనూరుకు చెందిన చిరువ్యాపారి ప్రసాద్ బెట్టింగ్‌కు వ్యసనపరుడు.గత ఐపీఎల్ మ్యాచ్‌ల్లో అప్పులు చేసి భారీగా బెట్టింగ్‌లు ఆడాడు.లక్షల్లో అప్పులు మూటగట్టుకొన్నాడు.అప్పులు చెల్లించే స్తోమతలేక 33 ఏళ్లకే ఆత్మహత్య చేసుకొన్నాడు. – పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్ కుమారుడు శ్రీరామచిట్స్లో పనిచేసేవాడు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌లో రూ.40 లక్షల వరకు పోగొట్టుకొన్నాడు. అప్పులు తీర్చే శక్తిలేక బెంగళూరుకు పారిపోయాడు. –‘ఓ టీచర్ నెల జీతం 45వేలు.కానీ అతను నెలనెల కట్టే వడ్డీల మొత్తం రూ.60వేల దాకా ఉంటుంది.అంటే రూ.20 లక్షలకు పైగా క్రికెట్ బెట్టింగ్‌లతో అప్పు చేశాడు.మ్యాచ్‌లు జరిగేకొద్దీ ఇంకా బెట్టింగ్ ఆడుతూనే ఉన్నాడు..ఏదోరోజు జాక్‌పాట్ కొడతాననీ..బెట్టింగ్‌తోపాటు పేకాట, మందు, ధూమపానం వంటి అలవాట్లు అతడికీ బోనస్‌గా వచ్చాయి. - ఎమ్మిగనూరు మండలం కలుగొట్లకు చెందిన 8వ తరగతి విద్యార్థి బెట్టింగ్ ఆడి రూ.5వేలు దాకా అప్పు చేశాడు.విషయం బయటపడతుందనీ గత ఏడాది ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. విషయాన్ని గ్రామస్తులు గోప్యంగా ఉంచారు. -
జోరుగా క్రికెట్ బెట్టింగ్
- పోలీసుల అదుపులో నిందితులు ఉయ్యాలవాడ: మండల కేంద్రమైన ఉయ్యాలవాడతో పాటు వివిధ గ్రామాల్లో క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఐపీఎల్–10 జరుగుతుండడంతో గెలుపోటములపై జోరుగా పందాలు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళ, బుధవారాల్లో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఉయ్యాలవాడ కేంద్రంగా చేసుకుని గత 15 రోజులుగా బెట్టింగ్ తంతు సాగుతోంది. మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన 10 మంది యువకులు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. వీరిని అదుపులోకి తీసుకునేందుకు జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా బెట్టింగ్ జాబితాలో కొందరి వారి పేర్లు తొలగించాలని పోలీసులపై టీడీపీ నాయకులు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అయితే నిందితులు ఎంతటివారైనా సరే చట్ట ప్రకారం చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. -
క్రికెట్ బెట్టింగ్‌పై ఉక్కుపాదం మోపండి
– క్షేత్రస్థాయి అధికారులకు ఎస్పీ ఆదేశం కర్నూలు: క్రికెట్ బెట్టింగ్‌రాయుళ్లపై నిఘా తీవ్రతరం చేసి ఉక్కుపాదం మోపాలని ఎస్పీ ఆకే రవికృష్ణ పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజాదర్బార్‌కు వచ్చే ఫిర్యాదులపై స్పందించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్యాయం జరిగే చోట పోలీసులు బాధితులకు అండగా ఉండి, నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా నేరాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. విధి నిర్వహణలో కర్నూలు పోలీసులు రాష్ట్రంలోనే ఉత్తమ పోలీసులుగా ఉండాలన్నారు. వీవీఐపీలు వచ్చే ప్రాంతాలకు పూర్తిగా రక్షణ కల్పించాలని ఆదేశించారు. జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో సైబర్ నేరాలపై పోలీసులకు శిక్షణ తరగతులు నిర్వహించాలని సూచించారు. మహిళల సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేసవిలో దొంగతనాలు అధికంగా జరిగే అవకాశమున్నందున నిఘాను తీవ్రతరం చేయాలని, సమస్యాత్మక ప్రాంతాల్లో గస్తీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. బాధ్యతాయుతంగా పనిచేసి పోలీసు అధికారులు యూనిఫాం గౌరవం కాపాడాలన్నారు. కేబుల్ సమస్యలపై స్పందించాలన్నారు. ఆదోనిలో సీసీ కెమెరాల పనితీరు భేష్: ఆదోనిలో సీసీ కెమెరాల పనితీరు చాలా బాగుందని, కర్నూలు, నంద్యాలలో కూడా ఆదోని తరహాలో మెరుగుపరిచేందుకు మున్సిపల్ అధికారులతో మాట్లాడి చర్యలు చేపట్టాలన్నారు. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా చురుకుగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాత్రివేళల్లో అనుమానితులపై నిఘా ఉంచి బైండోవర్ కేసులు నమోదు చేయాలని సూచించారు. అడిషనల్ ఎస్పీ షేక్షావలి, ఓఎస్డీ రవిప్రకాష్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు బాబుప్రసాద్, డి.వి.రమణమూర్తి, కొల్లి శ్రీనివాసులు, వెంకటాద్రి, హరినాథరెడ్డి, మురళీధర్, వినోద్‌కుమార్, రాజశేఖర్‌రాజు, బాబా ఫకృద్దీన్, రామచంద్ర, ఈశ్వర్‌రెడ్డి, డీపీఓ ఏఓ అబ్దుల్ సలాం, సీఐలు, ఎస్ఐలు సమావేశంలో పాల్గొన్నారు. -
జోరుగా ఐపీఎల్ బెట్టింగ్
చిత్తూరు, సాక్షి: ఐదు రోజల క్రితం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఇందులో రెండు నెలలు 70 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ క్రమంలో జిల్లాలో బెట్టింగ్ జోరందుకుంది. ఆట వారిది, జూదం మాది అంటూ కొందరు బ్రోకర్లు క్రికెట్ టోర్నీ ద్వారా కాసుల పంటకు సిద్ధమయ్యారు. లాడ్జీలు, హోటల్స్, అపార్ట్మెంట్లు, టీ కేఫ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లు, స్థావరాలుగా చేసుకుని కొందరు చెన్నై, బెంగళూరు కేంద్రంగా చక్రం తిప్పుతున్నారు. గంటల వ్యవధిలో భారీగా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో పేదలు, యువకులు ఈ ఊబిలో చిక్కుకుపోతున్నారు. పలు ప్రాంతాల్లో సబ్‌బుకీలను ఏర్పాటు చేసుకొని రాజకీయ నేతలు, కొందరు పోలీసుల అండదండలతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. బెట్టింగ్ రాయుళ్ల ప్రధాన దృష్టంతా యువతపైనే ఉంది. కాలేజీ విద్యార్థులు, చిన్నచిన్న ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునే వారిని సబ్‌బుకీలు డబ్బుల ఆశ చూపి బెట్టింగ్ ఊబిలోకి దింపుతున్నారు. బాల్ బాల్‌కూ రేటు..: తొలి బాల్ నుంచి చివరి బాల్ వరకు బెట్టింగ్ కాస్తున్నారు. ఫోర్, సిక్స్, హాఫ్ సెంచరీ అంటూ బ్యాట్స్‌మన్‌పై, వికెట్, పరుగు ఇస్తాడు అంటూ బౌలర్‌పై బెట్టింగ్ కడుతున్నారు. మ్యాచ్ ముగిసే లోపు ఫలానా బ్యాట్స్‌మన్ ఇన్ని ఫోర్లు, సిక్స్‌లు కొడతారని, ఒక్కో ఫోర్కు రూ.2 వేలు, సిక్స్‌కు రూ.10 వేల వరకు బెట్టింగ్ కాస్తున్నారు. చిత్తూరు నగరానికి చెందిన ఒక వ్యక్తి శుక్రవారం జరిగిన కోల్‌కతా వర్సెస్ గుజరాత్ లయన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో గంభీర్‌పై బెట్టింగ్ కాసి దాదాపు రూ.30 లక్షలు గెలుచుకున్నట్లు సమాచారం. పల్లెల్లోనూ..: బెట్టింగ్ జాడ్యం నగరాలు, పట్టణాలు దాటి పల్లెలను కూడా తాకింది. స్మార్ట్‌ఫోన్ పుణ్య మా స్కోర్లు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పందేలు కాస్తున్నారు. కొన్ని బృందాలు చిత్తూరు, పుత్తూరు, శ్రీకాళహస్తి, మదనపల్లె, తిరుపతి తదితర ప్రాంతాల్లో ఎవరికీ అనుమానం రాని, జన సంచారం ఎక్కువగా ఉండేచోట ఇళ్లను అద్దెకు తీసుకొని బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్టు సమాచారం. పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుంటున్నారని తెలుస్తోంది. భారీ మొత్తంలో బెట్టింగ్‌లు జరుగుతున్నా పోలీసులు పట్టిం చుకోకపోవడానికి రాజకీయ ఒత్తిళ్లే కారణమని కొంతమంది అంటున్నారు. బెట్టింగ్.. సాగుతుందిలా..: జట్టు ప్రాముఖ్యత, మ్యాచ్ స్వరూపం, బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆటగాళ్లను బట్టి రూ.1000 నుంచి లక్షలు, కోట్ల వరకు పందేలు కాస్తున్నారు. బుకీకి, ఫంటర్‌కు మధ్య పరిచయం లేకుండానే ఆన్లైన్ ఖాతాల ద్వారా లావాదేవీలు సాగుతున్నాయి. బుకీలు ఎవరికంటే వారికి అవకాశం ఇవ్వ రు. వారి పరిధిలో ఏజెంట్లు, నమ్మకమున్న సభ్యుడు సిఫార్సు చేయాల్సి ఉంటుంది. బెట్టింగ్‌కు అర్హత పొందిన వారిని ఫంటర్ అంటారు. బుకీ అకౌంట్లో ఫంటర్ స్థాయిని బట్టి కొంత సొమ్ముæ జమ చేసిన తర్వాత బెట్టింగ్‌లో పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి 40 నుంచి 30 నిమిషాల ముందు ఎంతమంది ఫంటర్లు బెట్టింగ్‌లో పాల్గొం టారో బుకీలు ఫోన్ చేసి చెబుతారు. గెలుపొందిన తర్వాత బ్యాంక్ టైమ్ నాటికి లేదా ఆన్లైన్ ద్వారా ఫంటర్ ఖాతాలో డబ్బులు జమచేస్తారు. ఫంటర్ ఓడిపోతే బుకీ ఖాతాలో డబ్బులు జమ చేయాలి. -
బతుకులన్నీ బౌల్డ్
⇒నేటి నుంచి ఐపీఎల్ క్రికెట్ పోటీలు ⇒జిల్లాలో బెట్టింగ్‌లకు సిద్ధమవుతున్న యువత ⇒ఆకర్షించేందుకు సిద్ధమైన బుకీలు ⇒చితికిపోతున్న జీవితాలు మదనపల్లెకు చెందిన ఓ యువకుడు బెంగళూరులో ఓ సాప్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ క్రికెట్ బెట్టింగ్‌కు అలవాటు పడ్డాడు. తన సంపాదన సరిపోక అప్పులు చేసి చేతులెత్తేశాడు. బుకీలు ఇంటికి రావడంతో చేసేది ఏమీలేక ఉన్న ఆస్తులు అమ్ముకుని అప్పులు కట్టాడు. తిరుపతికి చెందిన మరో యువకుడు కాలేజీ చదువుల సమయంలోనే బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. అనంతరం బుకీ అవతారం ఎత్తాడు. ఈ సంపాదనతో వ్యసనాలకు బానిసయ్యాడు. రెండుమూడుసార్లు పోలీసులకు పట్టుబడినా తిరిగి అదేపనిలో కొనసాగుతున్నట్టు సమాచారం. ఇలా..ఎందరో బెట్టింగ్ మాయాజాలంలో చిక్కుకుంటున్నారు. తిరుపతి క్రైం : గతంలో క్రీడాస్ఫూర్తిని నింపిన క్రికెట్ ఆట రాన్రాను జూద క్రీడగా మారిపోయింది. టి–20 మ్యాచ్‌లు బుక్కీలకు వరంగా, బెట్టింగ్ రాయుళ్లకు వ్యసనంగా మారింది. గురువారం నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్న నేపథ్యంలో మరోసారి పోలీసులు బెట్టింగ్ రాయుడుళ్ల స్థావరాలపై పోలీసులు దృష్టి సారించాల్సిన అవస రం ఎంతైనా ఉంది. దాదాపు రెండు నెలలు సాగే ఐటీఎల్లో పలు జట్లపై ఇప్పటికే ఎవరికి తోచిన అంచనాలతో గెలుపోటములపై వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇది బెట్టింగ్ రాయుళ్లకు మంచి కిక్‌నిస్తోంది. క్రికెట్‌ను జూదక్రీడగా మార్చేసిన బుకీలు జిల్లాలో పలు పట్టణాలు, పల్లెల్లో యువకులను టార్గెట్ చేస్తున్నారు. టోర్నీ ముగిసే సరికి ఎంతమంది బతుకులు చిన్నాభిన్నమవుతుందో? ఎంత సొమ్ము చేతులు మా రుతుందోనని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వ్యవహారాలన్నీ సెల్ఫోన్లలోనే బెట్టింగ్ తంతు మొత్తం ఎక్కువ సెల్‌ఫోన్ ద్వారానే సాగుతుంది. టాస్ పడిన దగ్గర నుంచి బంతి బంతికీ రకరకాల పందాలు కొనసాగుతుంటాయి. ప్రధాన నగరాల్లో ఉండే పెద్ద బుకీలు వివిధ ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించుకుని వీరి ద్వారా కార్యకలాపాలు కొనసాగిస్తుంటారు. ఎస్...నో.. ఓకే.. డన్ .. ఈటింగ్ వంటి వివిధ రకాల కోడ్లతో బెట్టింగ్ పర్వం కొనసాగుతుంది. పరిజ్ఞానం లేకుండా పందేలు క్రికెట్ ఆటపై పెద్దగా పరిజ్ఞానం లేకున్నా ఆడుతుం ది.. ఓడుతుంది– అన్న సూ త్రాలతో చాలా మంది డబ్బులు పెడుతుంటారు. సాంకేతికంగా కొంత అవగాహన ఉన్న కొందరు వీరి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని డబ్బులు దండుకుంటున్నారు. 90 శాతం మంది టీవీ చూస్తూనే పందేలు కాస్తారు. కానీ గ్రౌండ్లో జరిగే ఆటకు, టీవీలో వచ్చే ఆటకు మూడు బంతులు తేడా ఉంటుంది. బంతి.. బంతికీ ఆట ఎలా ఉంటుందో ముందే తెలుసుకుని కాసేవారిని మోసగిస్తుంటారు. బుగ్గిపాలవుతున్న బతుకులు ఎక్కువగా విద్యార్థులు ఈ బెట్టింగ్ మాయాజా లంలో చిక్కుకుంటున్నారు. మొదట సరదాగా మొదలై, బెట్టింగ్ అలవాటు క్రమేణా ఓ వ్యసనంగా మారుతుంది. అదృష్టం బాగుంటే వేలు, లక్షలు సంపాదించవచ్చనే ఆశతో ఈ ఊబిలో కూరుకుపోతున్నారు. అనంతరం ఆస్తులు హ రించుకుపోయి అప్పులపాలవుతున్నారు. పల్లెల్లోనూ కాయ్ రాజా కాయ్ క్రికెట్ బెట్టింగ్‌లు పట్ట ణాల నుంచి పల్లెలకు విస్తరిస్తున్నాయి. సన్నకారు రైతుల దగ్గర నుంచి కూలీ పనులు చేసుకునేవారు, ఆటో వాలాలు, తోపుడుబండ్ల నిర్వాహకులు, పండ్ల వ్యాపారులు.. ఇలా చాలా మంది క్రికెట్ పందాలు కాస్తూ నష్టపోతున్నారు. ఐపీఎల్ టోర్నీ ముగిసే వరకూ పోలీసు దీనిని సీరియస్‌గా తీసుకుంటే దీనికి కొంతవరౖకైనా అడ్డుకట్ట వేయొచ్చని క్రికెట్ పండితులు చెబుతున్నారు. పందెం ఇలా.. సాధారణంగా క్రికెట్ పందాలు సమాన నగదుతో సాగేది. కానీ టీ–20 రాకతో పందాల స్వరూపమే మారిపోయింది. ఆడే జట్లు ఆధారంగా రూపాయికి 80పైసలు, రూపాయికి 2 రూపాయలు ఇలాంటి ఆఫర్లు ఎన్నో! అటు ఎవరు గెలుస్తారో? అనే పందెం మాత్రమే కాకుండా జట్టు ఎన్ని పరుగులు చేస్తుంది? ఏ ఆటగాడు ఎన్ని పరుగులు చేస్తాడు? ఈ ఓవర్లో ఎన్ని పరుగులు వస్తాయి?.. ఇలా రకరకాల పందేలు నిర్వహిస్తారు. -
కాయ్ రాజా కాయ్.!
మైదుకూరు(చాపాడు): పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలను తలపించే విధంగా ఈ నెల 17న జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ సారి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు టీడీపీ అహంకారం.. అధికార దుర్వినియోగానికి.. వైఎస్సార్సీపీ ఆత్మవిశ్వాసం..అభిమానికి మధ్య జరిగినట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. వైఎస్సార్సీపీని అణగదొక్కేందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికల బరిలో దిగగా.. ప్రజా నమ్మకం, ఆత్మ విశ్వాససంతో వైఎస్సార్సీపీ బరిలో దిగింది. ఈ రెండింటికి నడుమ జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ కడపలో సోమవారం ఉదయం 8గంటలకు మొదలవగా, మధ్యాహ్నం 12గంటలకు గెలుపుపై క్లారిటీ రానుంది.. గెలుపోటములపై జోరుగా బెట్టింగ్‌లు.. ప్రతి మండలంలో లక్షల్లో పందేలు.. ఈ నెల 17న జిల్లాలోని మూడు డివిజన్లలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నిక గెలుపోటములపై 16వ తేదీ నుంచే జోరుగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. టీడీపీ నిర్వహించిన పాండిచ్ఛేరి శిబిరంలో ఉన్న ఓటర్ల సంఖ్యా బలం చూసుకుని గెలుస్తామనే ధీమాతో తెలుగు తమ్ముళ్లు పందేలకు సిద్ధమవగా.. సంఖ్యా బలంతో పాటు ప్రజా నమ్మకం, ఆత్మ విశ్వాసం, క్రాస్ ఓటింగ్ నమ్మకంతో వైఎస్సార్సీపీ వర్గీయులు.. ఇలా ఎవరికి వారే గట్టి ధీమాతో బెట్టింగులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రతి మండలంలో రూ.50 లక్షల నుంచి రూ.70లక్షల వరకూ పందేలు జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మండలంలోని ప్రతి గ్రామంలో రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకూ బెట్టింగ్‌లు జరిగినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన నియోజకవర్గ వ్యాప్తంగా రూ.2.50 కోట్ల నుంచి రూ.5కోట్ల వరకూ పందేలు జరిగినట్లు సమాచారం. క్రాస్ ఓటింగ్‌పైనే అందరి దృష్టి.. ప్రతి మండలంలో జరిగిందంటున్న విశ్లేషకులు.. ఈ నెల 17న జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో క్రాస్ ఓటింగ్ జరిగిందన్న ధీమాతో వైఎస్సార్సీపీ వర్గీయులు గెలుస్తామనే విశ్వాసంతో ఉండగా, ఓటింగ్ వరకూ సంఖ్య బలంతో ధీమాగా ఉన్నా రెండు రోజులుగా క్రాస్ ఓటింగ్ ఫీవర్‌తో తెలుగు తమ్ముళ్లు బేజారవుతున్నారు. మైదుకూరు నియోజకవర్గంలోని ప్రతి మండలంలో క్రాస్ ఓటింగ్ జరిగి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎన్నిక జరిగిన తీరు, నియోజకవర్గంలో ఉన్న పార్టీ మెజార్టీ సభ్యుల ఆధారంగా, వైఎస్సార్సీపీని గెలిపించాలనే పట్టుదలతో క్రాస్ ఓటింగ్ జరిగి ఉండవచ్చని సీనియర్ రాజకీయ నాయకులు చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ 25–35ఓట్ల తేడాతో గెలుస్తుందని నియోజకవర్గానికి చెందిన ఓ మాజీ సీనియర్ నేత తమ కార్యకర్తలకు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. మైదుకూరు మున్సిపాలిటీలో 8, మండలంలో 2, దువ్వూరులో 3, చాపాడులో 2, ఖాజీపేటలో 11, బ్రహ్మంగారిమఠంలో 4 చొప్పున టీడీపీ నుంచి వైఎస్సార్సీపీకి క్రాస్ ఓట్లు పడ్డాయని, ఇదే క్రమంలో మైదుకూరులో 2, దువ్వూరులో 2, బ్రహ్మంగారిమఠంలో 1, ఖాజీపేట, చాపాడు మండలాల్లో 2 ఓట్ల చొప్పున టీడీపీకి క్రాస్ ఓటింగ్ చేసి ఉంటారనే అంచనాల్లో ఇరు పార్టీల నాయకులు ఉన్నారు. ఏది ఏమైనా గెలుపు ధీమాతో రెండు వర్గాలు భారీ మొత్తంలో పందెం కాయడం గమనార్హం. -
‘బెట్టింగ్’ హీట్
– రేపే ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ – గెలుపోటములపై ‘అనంత’తో పాటు కడప, కర్నూలులో జోరుగా బెట్టింగ్ – పట్టభద్రుల కోటాలో గోపాల్‌రెడ్డి, గేయానంద్, ఉపాధ్యాయ కోటాలో కత్తి, ఒంటేరుపై పందేలు – కడప, కర్నూలు, నెల్లూరు ‘స్థానిక ఎమ్మెల్సీ’ ఫలితాలపైనా జోరుగా బెట్టింగ్ (సాక్షి ప్రతినిధి, అనంతపురం) ఎమ్మెల్సీ ఎన్నికలలో చివరి అంకానికి రంగం సిద్ధమైంది. రాయలసీమ పశ్చిమ నియోజకవర్గం నుంచి పట్టభద్రులు, ఉపాధ్యాయ కోటాలో జరిగిన ఎన్నికల కౌంటింగ్ రేపు (సోమవారం) జరగనుంది. స్ట్రాంగ్‌రూంలో భద్రంగా ఉన్న ఓటరు తీర్పు రేపు లేదా ఎల్లుండి వెలువడే అవకాశముంది. ఈ ఫలితాలపై ‘అనంత’తో పాటు కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో జోరుగా పందేలు కాస్తున్నారు. ఎమ్మెల్యేలు, ద్వితీయశ్రేణి నేతలతో పాటు మండలస్థాయి నేతలు కూడా బెట్టింగ్ వేస్తున్నారు. వైఎస్సార్, కర్నూలు, నెల్లూరు జిల్లాలలో శుక్రవారం జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై కూడా భారీగా బెట్టింగ్ నడుస్తోంది. ఒకవైపు ఫలితాలు ఎలా ఉంటాయోనని అభ్యర్థులు టెన్షన్ పడుతుంటే..మరోవైపు ఫలితాలపై పందేలు కాస్తుండటంతో రాయలసీమలో ‘వేడి’ మొదలైంది. పశ్చిమ రాయలసీమ పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 9న జరిగాయి. పట్టభద్రుల కోటాలో 2,49,582 ఓట్లకు గాను 1,55,536 పోలయ్యాయి. పోలైన ఓట్లలో మొదటి ప్రాధాన్యత ఓట్లు 50శాతం కంటే ఎక్కువగా ఎవరికి వస్తాయో వారు గెలిచినట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు. అంటే మొదటి ప్రాధాన్యత ఓట్లు 77,768 కంటే ఒక్క ఓటు అధికంగా వచ్చినా..వారిని విజేతగా ప్రకటిస్తారు. ఇంతకంటే ఒక్క ఓటు తక్కువగా పోలైనా, రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కపెడతారు. ఈ ఓట్ల కౌంటింగ్‌లో కూడా 50శాతం కంటే ఒక్క ఓటు(మొదటి ప్రాధాన్యత ఓట్లు కలిపి) అధికంగా వచ్చినా విజేతగా నిర్ణయిస్తారు. లేదంటే మూడో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. ఈ ప్రాతిపదికన కౌంటింగ్ ప్రక్రియ నడుస్తుంది. ఉపాధ్యాయ ఎన్నికల కౌంటింగ్ కూడా ఇదే తరహా జరుగుతుంది. ఉపాధ్యాయ కోటాలో 20,515 ఓట్లకుగాను 18,739 పోలయ్యాయి. ఇందులో 50శాతం కంటే ఒక్క ఓటు ఎక్కువగా అంటే 9,370 ఓట్ల కంటే ఒక్క ఓటు అధికంగా వచ్చినా వారు గెలుపొందుతారు. లేదంటే రెండు, అప్పటికీ రాకపోతే మూడో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. కౌంటింగ్ సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు మొదలవుతుందని ప్రకటించారు. అయితే.. బ్యాలెట్ పేపర్ల విభజన పూర్తయి ఓట్ల లెక్కింపు మొదలవ్వాలంటే మధ్యాహ్నం రెండు గంటలపైన పడుతుంది. కౌంటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా జరగనుండటంతో ఫలితాలు మంగళవారం వెలువడే అవకాశం ఉంది. భారీగా బెట్టింగ్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ‘అనంత’లో భారీగా బెట్టింగ్ నడుస్తోంది. పట్టభద్రుల కోటాలో వైఎస్సార్సీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి, సిట్టింగ్ ఎమ్మెల్సీ గేయానంద్ మధ్యే పోటీ ఉంటుందని రాజకీయ పార్టీలతో పాటు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో వీరిద్దరిపైనే పందేలు కాస్తున్నారు. వీరిపై బెట్టింగ్ చాలా రకాలుగా సాగుతోంది. బరిలోని 25మందిలో మొదటి ప్రాధాన్యత ఓట్లు గోపాల్‌రెడ్డికి అధికంగా పోలవుతాయని భారీగా బెట్టింగ్ కాస్తున్నారు. బెట్టింగ్‌రాయుళ్లలో దాదాపు 90శాతం ఇదేవిధంగా వేస్తున్నారు. ఈ ఓట్లు అధికంగా వస్తాయనే కారణంతో గెలుపు విషయంలో కూడా గోపాల్‌రెడ్డి వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పందేలు 1ః1(రూపాయికి రూపాయి) లెక్కన కాస్తున్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు గోపాల్‌రెడ్డికి ఎక్కువగా వస్తాయని, అయితే అవి 50 శాతం కంటే మించడం కష్టమని, కాబట్టి రెండో ప్రాధాన్యత ఓట్లతో గేయానంద్ కూడా గెలిచే అవకాశాలున్నాయని కొందరు పందెం కాస్తున్నారు. వీరిద్దరిపైనే బెట్టింగ్ జరుగుతుండటంతో రేసులో టీడీపీ అభ్యర్థి కేజేరెడ్డి లేరని స్పష్టమవుతోంది. అయిన్పటికీ మొదటి ప్రాధాన్యత ఓట్లు గోపాల్‌రెడ్డి తర్వాత కేజేరెడ్డికే వస్తాయని కొందరు పందెం వేస్తున్నారు. మొత్తమ్మీద గోపాల్‌రెడ్డి గెలుస్తారని 1ః1 పందేలు జరుగుతుంటే, గేయానంద్ గెలుస్తారనే వారు 2ః1(రెండు రూపాయలకు ఒక్క రూపాయి) కాస్తున్నారు. ఉపాధ్యాయ కోటాలో కత్తి, ఒంటేరుపై పందేలు ఉపాధ్యాయ కోటాలో కత్తినరసింహారెడ్డి, ఒంటేరు శ్రీనివాసులరెడ్డిపై ఎక్కువగా పందేలు కాస్తున్నారు. బరిలోని 10మందిలో కత్తినరసింహారెడ్డి, బచ్చలపుల్లయ్య, ఒంటేరు మధ్య త్రిముఖ పోరు నడిచినట్లు పోలింగ్ సమయంలో చర్చ సాగింది. అయితే.. ఇప్పుడు కత్తి, ఒంటేరుపైనే అధికంగా పందేలు వేస్తుండడంతో సిట్టింగ్ ఎమ్మెల్సీ బచ్చలపుల్లయ్య రేసులో ఉన్నారా, లేదా అన్నది ఆసక్తి రేపుతోంది. ఓసీల మధ్య బీసీకార్డుతో బరిలోకి దిగి విజయం సాధిద్దామని ఆశపడిన పుల్లయ్యను టీడీపీ వ్యతిరేక ఓటు దెబ్బతీసిందని కూడా ఉపాధ్యాయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే.. కొందరు కత్తి, పుల్లయ్య మధ్య, ఇంకొందరు ఒంటేరు, పుల్లయ్య మధ్య కూడా పందేలు కాస్తున్నారు. 1ః1 ప్రకారమే పందేలు నడుస్తున్నాయి. అనంతపురంతో పాటు కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లోనూ ఇదే తరహాలో వేస్తున్నారు. ‘స్థానిక’ పోరుపైనా.. వైఎస్సార్, కర్నూలు జిల్లాలలో స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా ‘అనంత’లో పందేలు కాస్తున్నారు. వైఎస్సార్ జిల్లాలో వివేకానందరెడ్డికి బీటెక్ రవి గట్టిపోటీ ఇచ్చారని, ఫలితాలు వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉండే అవకాశం లేదని ఓ వర్గం మీడియా విస్తృతంగా ప్రచారం చేసింది. అయితే.. శనివారం నుంచి వివేకా గెలుస్తారని బెట్టింగ్ రాయుళ్లు భారీగా పందెం వేస్తున్నారు. దీంతో వివేకా విజయంపై రాజకీయ పార్టీల్లోనూ స్పష్టత వచ్చినట్లయింది. కర్నూలులో కూడా గౌరు వెంకటరెడ్డి, శిల్పా చక్రపాణిరెడ్డి గెలుపోటములపై పందేలు కాస్తున్నారు. ఇవి రూపాయికి రూపాయి అనే లెక్కన నడుస్తున్నాయి. ఈ పందేలు కాసేవారిలో ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, ద్వితీయశ్రేణి నేతలు కూడా ఉన్నారు. రూ.లక్ష నుంచి రూ.50 లక్షల వరకూ ఒక్కొక్కరు పందేం కాస్తున్నారు. ఎమ్మెల్యేలు వారి పీఏలతో వ్యవహారం నడిపిస్తున్నారు. దీంతో పందెం కాయాలనుకునేవారంతా పీఏలను సంప్రదిస్తున్నారు. మొత్తమ్మీద అభ్యర్థులతో పాటు పందెం రాయుళ్లలో ఎవరిని అదృష్టం వరిస్తుందో, దురదృష్టం వెంటాడుతుందో వేచి ఉండాల్సిందే! -
డేటింగ్ వాగ్దానాన్ని నిలబెట్టుకుంది!
వాషింగ్టన్:ఇటీవల ట్విట్టర్ వేదికగా డేటింగ్ బెట్టింగ్ వేసి ఓటమి పాలైన కెనడా టెన్నిస్ స్టార్ ఎగునీ బౌచర్డ్ తన వాగ్దానాన్ని నిలబెట్టుకుంది. తాను వేసిన బెట్టింగ్ ప్రకారం 20 ఏళ్ల విద్యార్థి జాన్ గోహ్రెక్ తో కలిసి డేటింగ్ వెళ్లినట్లు బౌచర్డ్ తాజాగా స్పష్టం చేసింది.' నా మాట ప్రకారం అతనితో డేటింగ్ కు వెళ్లా. దానిలో భాగంగా ముందుగా అతనితో కలిసి మిల్ వాకీ-ఎన్బీఏ జట్ల మధ్య జరిగిన బాస్కెట్ బాల్ మ్యాచ్ కు హాజరయ్యా. ఆ తరువాత డేటింగ్ కోసం కొన్ని స్విమ్ సూట్లు పరిశీలించా 'అని బౌచర్డ్ తెలిపింది. ఈ మేరకు జాన్ గోహ్రెక్ తో కలిసి ఉన్న ఫోటోను ట్వీట్ చేసింది. గత నెల్లో సూపర్ బౌల్ ఈవెంట్ లో భాగంగా అమెరికా ఫుట్‌బాల్ లీగ్ జట్లైన అట్లాంటా ఫాల్కోన్స్-న్యూ ఇంగ్లండ్ పాట్రియట్స్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో బౌచర్డ్ బెట్టింగ్ కు పాల్పడి ఓటమి పాలైంది. ఇరు జట్ల మ్యాచ్ లో భాగంగా తొలి క్వార్టర్ అనంతరం అట్లాంటా ఫాల్కోనస్ గెలుస్తుందంటూ బౌచర్డ్ ట్వీట్ చేసింది. అయితే జాన్ గోహ్రెక్ అనే అభిమాని ఆమె నిర్ణయంతో విభేదించాడు. ఒకవేళ పాట్రియట్స్ గెలిస్తే తనతో డేటింగ్ చేయడానికి సిద్ధమా?అంటూ మరో ట్వీట్ చేశాడు. దీనికి బౌచర్డ్ వెంటనే అంగీకారం తెలపడం, ఆపై పరాజయం చెందడం చకచకా జరిగిపోయాయి. ఈ మ్యాచ్‌లో పాట్రియట్స్ 34-28 తేడాతో అట్లాంటాపై గెలుపొందింది. కాగా, మ్యాచ్ తొలి అర్థభాగంలో అట్లాంటా 28-3 తేడాతో ఆధిక్యంలో ఉన్న దశలో బౌచర్డ్ బెట్టింగ్ వేసింది. దాంతో పాట్రియట్స్ కు వ్యతిరేకంగా బెట్టింగ్ వేసి చాలా పెద్ద తప్పుచేశానని ఆ తరువాత బౌచర్డ్ తలపట్టుకుంది. ఫిబ్రవరి 25 వ తేదీన 23 ఒడిలోకి అడుగుపెడుతున్న బౌచర్డ్.. తాను జీవితంలో చేసిన పొరపాట్లలో ఇదొక పెద్ద తప్పిదంగా పేర్కొంది. Just met my 'Super Bowl Twitter Date' John -
బెట్టింగ్ గ్యాగ్ అరెస్ట్
నంద్యాల: ఇంగ్లాండ్-భారత్ మధ్య బెంగళూరులో జరిగిన టి20-20 క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్‌కు పాల్పడుతూ పవన్ యువసేన టౌన్‌వైడ్ అధ్యక్షుడు దాసరి రవిశంకర్, అలియాస్ దాసరి రవి, మరో నలుగురు పోలీసులకు దొరికిపోయారు. డీఎస్పీ హరినాథరెడ్డి స్థానిక పోలీస్ అతిథి గృహంలో గురువారం విలేకరులకు వెల్లడించారు. శ్యాంనగర్లోని ఒక ఇంట్లో బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలియడంతో త్రీటౌన్ ఎస్ఐ జయన్న సిబ్బందితో దాడి చేశారు. దాసరి రవిశంకర్, సయ్యద్ ఖాదర్‌బాషా, షేక్‌సుభాన్, మొగల్ హారూన్బేగ్, మొగల్సికిందర్బేగ్ అరెస్ట్ చేసి రూ.1.70 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. -
కొనసాగిన కోట్లాట
సాక్షి ప్రతిని«ధి, ఏలూరు : ప్రభుత్వ యంత్రాంగం ఓడిపోయింది. కోడి పందేలతోపాటు జూద క్రీడలను ముందుండి మరీ గెలిపించింది. జూదరుల సొమ్ములను కరిగించేసి.. పందేల నిర్వాహకులకు సిరుల వర్షం కురిపించింది. రాజకీయ క్రీడలో.. అధికార పార్టీ నేతలు అండదండలు అందించడంతో ప్రభుత్వం నుంచి ‘చూసీచూడనట్టు వెళ్లండి’ అంటూ మౌఖిక ఆదేశాలు వెలువడటంతో జిల్లా యంత్రాంగం చేష్టలుడిగి చూసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన జాయింట్ యాక్షన్ టీమ్‌లు అడ్రస్ లేకుండా పోయాయి. మూడు రోజుల పండగ అయినా బోనస్‌గా నాలుగో రోజున కూడా పందేలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చి పోలీసులు తమ ఉదారత చాటుకున్నారు. దీంతో సోమవారం కూడా జిల్లా వ్యాప్తంగా కోడిపందేలు, పేకాట, ఇతర జూద క్రీడలు యథేచ్ఛగా సాగాయి. కోట్లాది రూపాయలు చేతులు మారగా.. సందట్లో సడేమియా అన్నట్టుగా రూ.2 వేల నకిలీ నోట్లనూ చలామణి చేయడం కలకలం సృష్టించింది. అకివీడు మండలం ఐ.బీమవరం జూద శిబిరంలో పెద్దఎత్తున రూ.2 వేల నకిలీ నోట్లు చలామణి అయ్యాయి. దీనిని గుర్తించిన నిర్వాహకులు ఒకరిని పట్టుకుని దేహశుద్ధి చేసి పంపించి వేశారు. కొన్ని దొంగనోట్లను చించివేశారు. ఇంత జరిగినా పోలీసులు మాత్రం పట్టించుకోలేదు. కోడిపందేల మాటున జూద క్రీడలు, పేకాట పెద్దఎత్తున సాగినా ఖాకీలు మిన్నకుండటం విమర్శలకు తావిచ్చింది. అంతా అయిపోయాక పందేలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు ఉన్నతాధికారులు ప్రకటనలు ఇవ్వడం హాస్యాస్పదంగా మారింది. కోర్టు తీర్పును అనుసరించి ఏర్పాటు చేసిన జాయింట్ యాక్షన్ కమిటీలు పనిచేయలేదు. ఈ నెపాన్ని కిందిస్థాయి సిబ్బందిపై నెడతారా, వారికి నోటీసులు ఇస్తారా లేక ఉన్నతాధికారులు బాధ్యత వహిస్తారా అనేది వేచి చూడాల్సిందే. కోర్టుకు చూపడం కోసం నామమాత్రంగా కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు 330 మందిపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. అన్నిచోట్లా ఆడించారు ప్రధానంగా భీమవరం మండలం వెంప, వీరవాసరం మండలం కొణితివాడ, భీమడోలు మండలం గుండుగొలను, పెదవేగి మండలం కొప్పాకలో భారీస్థాయి పందేలు నిర్వహించగా, భీమవరం మండలం తోకతిప్ప, ఈలంపూడి, దిరుసుమర్రు, చినఅమిరం, రాయలం, యనమదుర్రు, లోసరి, దెయ్యాలతిప్ప, వీరవాసరం, అండలూరు, నందమూరుగరువు, మత్య్సపురి, నవుడూరు, ఉత్తరపాలెం, వడ్డిగూడెం తదితర గ్రామాల్లో ఒక మోస్తరు పందేలు జరిగాయి. నరసాపురం నియోజకవర్గంలో సోమవారం కూడా కోడిపందేలు, గుండాట, పేకాట విచ్చలవిడిగా సాగాయి. మొగల్తూరు పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో గుండాట, కోడి పందేలను రేయింబవళ్లు నిర్వహించారు. రామన్నపాలెం, తూర్పుతాళ్లు గ్రామాల్లోని శిబిరాలపై పోలీసులు సోమవారం పోలీసులు దాడులు చేశారు. లిఖితపూడి, రాజుల్లంక, వేములదీవి, లక్ష్మణేశ్వరం, రుస్తుంబాద, తూర్పుతాళ్లు, మత్స్యపురి, యర్రంశెట్టివారిపాలెం పందేలు యథావిదిగా జరిగాయి. పాలకొల్లు మండలం పూలపల్లి ప్రధాన బరులు కోలాహలంగా మారింది. దగ్గులూరు, తిల్లపూడి, చింతపర్రు, భగ్గేశ్వరం, వడ్లవానిపాలెం, గొల్లవానిచెరువులో జూద క్రీడలు అడ్డూఅదుపు లేకుండా సాగాయి. యలమంచిలి మండలం కలగంపూడి గ్రామంలో ఎట్టి పరిస్థితితుల్లోను కోడి పందాలను ఆపాలని అధికార పార్టీ నాయకుల నుంచి పోలీసులకు ఒత్తిడి రావడంతో సోమవారం ఉదయం పోలీసులు, గ్రామస్తులు మధ్య రెండు గంటలపాటు హైడ్రామా నడిచింది. భీమడోలు మండలం గుండుగొలను, కురెళ్లగూడెం, పోలసానిపల్లి, సూరప్పగూడెం, అంబర్‌పేట తదితర గ్రామాల్లో పందేలు భారీ ఎత్తున జరిగాయి. నిడమర్రు మండలం పత్తేపురంలోని పెద్ద బరితోపాటు రెండు చిన్నబరుల్లోనూ పందెంకోళ్లు కత్తులు దూశాయి. కాళ్ల మండలం సీసలి, జక్కరం, పెదఅమిరం, మాలవానితిప్ప, ఏలూరు రూరల్ మండలం వెంకటాపురం, కొమడవోలు, జాలిపూడి, శ్రీపర్రు గ్రామాల్లో పందేలు, పేకాట శిబిరాలు జోరుగా సాగాయి. కాట్లంపూడి, మాదేపల్లి శివారు ప్రాంతాల్లోని చేపల చెరువులు, పంటభూముల మధ్య చెట్ల కింద కొత్తగా పేకాట స్థావరాలు నడిచాయి. జంగారెడ్డిగూడెం, సుబ్బంపేట రోడ్డు, శ్రీనివాసపురం, లక్కవరం, దేవులపల్లి, పేరంపేట, పంగిడిగూడెం తదితర గ్రామాల్లో పందేలు, జూదాలు జోరుగా నిర్వహించారు. కొయ్యలగూడెం మండలం రామానుజపురం, బయ్యనగూడెం, దిప్పకాయలపాడు, పరింపూడి గ్రామాల్లోనూ కొనసాగాయి. అధికార పార్టీకి చెందిన నాయకులు నిర్వహించే బరుల్లో సోమవారం పందేలు వేయగా, మిగిలిన చోట్ల నిలిచిపోయాయి. లింగపాలెం మండలం కొణిజర్ల, ధర్మాజీగూడెం, కలరాయనగూడెం, ములగలంపాడు గ్రామాల్లోని ఆయిల్‌పామ్, మామిడి తోటల్లో నిర్వహించిన పందేలకు కృష్ణా, ఖమ్మం జిల్లాల నుంచి పందెగాళ్లు తరలివచ్చారు. తణుకు, తాడేపల్లిగూడెం, ఆచంట, నిడదవోలు, కొవ్వూరు, గోపాలపురం, పోలవరం నియోజకవర్గాల్లోనూ పలుచోట్ల పందేలు కొనసాగాయి. -
యదేచ్ఛగా కోళ్ల కత్తుల కోలాటం
-
తొలికాంతి.. సంక్రాంతి
ఆరుబయట చలిమంటలు.. వాకిళ్లలో ముగ్గులు.. వాటిపై గొబ్బెమ్మలతో ఆడపిల్లల ఆనందం.. ఆకాశంలో పతంగులతో అబ్బాయిల ఉత్సాహం.. గంగిరెద్దుల ఆటలను చూసి పిల్లల కేకలు.. ఈ సంబరాలను చూసేందుకు రెండు కళ్లు చాలవు.. మరోవైపు వంటింట్లోంచి నోరూరించే వంటల ఘుమఘుమలు.. బోగిపండ్లు.. బొమ్మలు కొలువులు! మొత్తంగా ఇవి సంక్రాంతి తెచ్చే ఆనందాల కాంతులు. నెల్లూరు(సెంట్రల్): తెలుగు వారి పెద్దపండుగైన సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. కొత్త అల్లుళ్ల రాకలు, బంధువుల సందడితో వాతావరణం పేరుకు తగ్గట్లే పెద్ద గానే ఉంటుంది.పల్లెల్లో అయితే చెప్పనక్కర్లే దు. పండుగకు వారం రోజుల ముందే పిండివంటల తయారీ మొదలెట్టి పూర్తిచేశారు. పట్టణాల బాట పట్టినవారు సైతం సంక్రాంతికి సొంతూళ్లకు వచ్చేస్తున్నారు. గంగిరెద్దులవారు, బుడబుడకల సందడి..యువత ఆటలు, కేరింతల సవ్వడి.. పల్లె, పట్నం తేడా లేకుండా కనిపిస్తోంది. అపార్ట్మెంట్ వాసులందరూ కలిసి కులమతాలకు అతీతంగా పండుగను జరుపుకుంటున్నారు. ఇక నెల్లూరు పట్టణంలోని పెన్నా నదిలో గత కొన్ని సంవత్సరాలుగా ఏటి పండుగను నిర్వహిస్తున్నారు. గాలి పటాల పండుగను కూడా చేసుకుంటారు. సంక్రాంతి రోజు జిల్లాలోని అన్ని ప్రముఖ దేవాలయాల లోని దేవతామూర్తుల విగ్రహాలను పెన్నా నది ఒడ్డుకు తీసుకుని వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడకు వచ్చిన వారికి తీర్థప్రసాదాలు అందచేస్తారు. ఈ వేడుకను చూడటానికి నగరం చట్టుపక్కల వారు కూడా వస్తుంటారు. ఇక పోతే సూళ్ళూరుపేట, నాయుడుపేటలలో మాత్రం కాళంగి నది, స్వర్ణముఖి నదిలో ఏటి పండుగను ప్రజలు జరుపుకుంటారు. కోవూరులో గత 25 సంవత్సరాలుగా వస్తున్న ఎడ్ల పందాలు ప్రత్యేకం. మన జిల్లా నుంచే కాకుండా పక్కనే ఉన్న ప్రకాశం జిల్లా నుంచి కూడా ఈ పందేలు చూడటానికి వస్తుంటారు. అందుకే తెలుగు లోగిళ్లకు తొలికాంతి అయిన సంబరాల సంక్రాంతిని అందరూ ఆనందంగా జరుపుకుంటారు. సంక్రాంతి అంటే.. సంక్రాంతి అంటే పురాణాల సాక్షిగా సంక్రమణం. అంటే మార్పు చెందడం. సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. ఎందుచేతనంటే సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశిస్తాడు. అయినా పుష్యమాసంలో, హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో మకర సంక్రాంతి రోజున, సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. అందుకే ఈ రోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. పంట చేతికొచ్చిన ఆనందంలో రైతన్నల కళ్ళల్లో విరిసే కోటి కాంతు లతో, అనందాల కోలాహలంతో, ఈ పండుగను మూడు రోజులు చేసుకోవడం ఆచారం. అందుకే దీనిని పెద్ద పండుగ అని కూడా పిలుస్తారు. భోగిభాగ్యాలు మూడు రోజుల పండగలో మొదటిగా భోగ భాగ్యాలను ఇచ్చే భోగి. ఈరోజు అందరూ భోగి మంటలతో ఉల్లాసంగా గడుపుతారు. అందరూ ఉదయాన్నే లేచి ఎముకలు కొరికే చలిని తరిమేయడానికి పాతవస్తువులు అన్నీ సమకూర్చి, కొత్తవాటితో నిత్య నూతన జీవితం ఆరంభించడానికి గుర్తుగా వాటిని భోగి మంటల్లో మంట పెడుతూ చల్లని ఆ చలిలో వెచ్చదనాన్ని ఆస్వాదిస్తారు. ఇక సాయంత్రం వేళ, బొమ్మల కొలువులతో, చాలా ఇళ్ళలో చిన్నపిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆటవస్తువులను ప్రదర్శిస్తూ ఆనందంగా, ఉల్లాసంగా అడుతూపాడుతూ గడుపుతారు. ఇక భోగిపళ్ళ పేరంటాలైతే అందరూ సమావేశమై రేగిపళ్ళు, శనగలు, పూలు, చెరుకుగడలు, మరియు కొన్ని నాణేలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. సంప్రదాయానికి ప్రతీక మకర సంక్రాంతి రెండవ రోజు. ఈరోజు తెల్లవారగానే పాలు పొంగించి, కొత్త బట్టలు వేసుకుని, రుచికరమైన పిండి వంటలు తింటూ, సంతోషంగా గడుపుతూ ఈ పండుగను ఆస్వాదిస్తారు, మరో ప్రత్యేకత ఏమిటంటే సంక్రాంతి రోజులలో మనం చూసే ఇంకో సుందర దృశ్యం గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దులవారు. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనం ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తారు. మరో ఆనందమైన, అలరించే విషయం ఏమిటంటే ఈ రోజున ‘హరిలో రంగ హరీ’ అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో, కంచు గజ్జెలు ఘల్లుఘల్లుమనగా చిందులు తొక్కుతూ, చేతుల్లో చిరుతలు కొడుతూ కోడిగుడ్డు లాంటి బోడి తలపై రాగి అక్షయపాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమై సందడి చేస్తాడు. పిల్లలు గాలిపటాలు ఎగరవేస్తూ సరదాగా గడుపుతారు. రథం ముగ్గు, రంగ వల్లులతో ఇంటి ముంగిళ్ళు కళకళలాడతాయి. అయితే ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. కాని మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వక పోయినా, ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు. అన్నదాతకు కొత్తకళ సంక్రాంతి పండుగ మూడవ రోజు చివరిదైన కనుమ రోజు. ఇళ్ళన్నీ అందమైన ముగ్గులతో శోభిస్తూ, అందరికి ఆనందాన్ని పంచే పండుగను ఘనంగా సాగనంపేందుకు రథం ముగ్గు తాడును మరొక ఇంటి వారి ముగ్గుతో కలుపుతూ అందరూ ఒకరికి ఒకరు తోడుంటూ కలసి సహజీవనం సాగించాలని అందరూ కోరుకుంటారు, ఈరోజు ఆడపిల్లలకు ప్రత్యేకమైన రోజు. ఈరోజు ఆడ పిల్లలందరు గొబ్బెమ్మలు పెడతారు. గొబ్బెమ్మ అంటే గోపిబొమ్మ. అంటే కృష్ణుని భక్తురాళ్ళు అని అర్థం. వీటి చుట్టూ తిరుగుతూ పాటలుపాడుతూ నృత్యం చేస్తూ కృష్ణ భక్తి తమకూ కలగాలని ప్రార్థిస్తుంటారు. -
’కట్టలు’ తెగాయ్
పందెం కోడి గెలిచింది జూదం జూలు విదిల్చింది పనిచేయని కోర్టు ఉత్తర్వులు, పోలీస్ ఆంక్షలు నేడు, రేపు ఇదే జోరు సెక్షన్ 144 విధిస్తున్నట్టు ప్రకటించిన కలెక్టర్ కనిపించని జాయింట్ యాక్షన్ టీమ్‌లు మార్టేరులో పొట్టేలు పందేలు సాక్షి ప్రతినిధి, ఏలూరు : పండగ వేళ పందెం కోడి గెలిచింది. కోర్టులిచ్చిన ఉత్తర్వులు అపహాస్యం పాలయ్యాయి. సంప్రదాయం పేరిట రాజకీయ పార్టీల నేతలు దగ్గరుండి మరీ కోడి పందేలు వేయించారు. ఒకరోజు ముందువరకూ హడావుడి చేసిన జాయింట్ యాక్షన్ టీములు, పోలీసులు పత్తా లేకుండా పోయారు. శుక్రవారం సాయంత్రానికి కోడి పందేలు నిర్వహించే చోట 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు కలెక్టర్ కె.భాస్కర్ ప్రకటించగా, ఎక్కడా దాని ప్రభావం కనపడలేదు. కోడిపందేల ముసుగులో జూదం యథేచ్ఛగా సాగింది. మద్యం ఏరులై పారింది. మీడియాను అనుమతించకుండా పోటీలు జరుపుకోవచ్చని ప్రభుత్వం నుంచి అనధికారికంగా అనుమతులు రావడంతో పందేలరాయుళ్లు చెలరేగిపోయారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురంలో ఖమ్మం జిల్లా జూబ్లీపుర గ్రామానికి చెందిన గంగవరపు లక్ష్మీదయాకర్ అనే వ్యక్తి తన లైసెన్స్ రివాల్వర్‌తో మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపి మరీ తన అనందాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ ఖమ్మం జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా పందేల రాయుళ్ల మధ్య బెట్టింగ్‌లు జరిగాయి. గాల్లోకి కాల్పులు జరిపిన దయాకర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పెనుమంట్ర మండలం మార్టేరులో పొట్టేలు పందేలు నిర్వహించారు. ఎక్కడ చూసినా పందేలే భీమవరం మండలం వెంపలో ఫ్లడ్ లైట్ల వెలుగుల నడుమ రేయింబవళ్లు పందేలు వేస్తున్నారు. ఆకివీడు మండలం ఐ.భీమవరం గ్రామంలో ప్రధాన బరిగా ఉన్న ఎఫ్‌సీఐ గోడౌన్ల ప్రాంతంలో కోడి పందేలు వేయరాదంటూ పోలీసులు, రెవిన్యూ యంత్రాంగం అడ్డుకుంది. ఒక దశలో పందేల రాయుళ్లు తాత్కాలికంగా వెనక్కి తగ్గారు. చివరకు ఉండి ఎమ్మెల్యే కలవూడి శివ వత్తిడితో మధ్యాహ్నం నుంచి అనుమతి ఇచ్చారు. పోలేరమ్మ గుడివద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డింకీ పందాలను ఎమ్మెల్యేతో బీజేపీ నేతలు కనుమూరి రఘురామకృష్ణంరాజు, శ్రీనివాస వర్మ తిలకించారు. భీమవరం మండలం వెంప, తోకతిప్ప గ్రామాల్లో భారీ పందేలు వేస్తుండగా దిరుసుమర్రు, ఈలంపూడి, వీరవాసరం మండలంలోని కొణితివాడ, నవుడూరు, ఉత్తరపాలెం, అండలూరు, వీరవాసరం, నందమూరు గరువు తదితర గ్రామాల్లో పందేలు నిర్వహిస్తున్నారు. వీరవాసరం మండలం కొణితివాడ చుట్టుపక్కల గ్రామాల ఏడు గ్రామాల్లోని సంఘ పెద్దలు ఉత్తరపాలెంలో నిర్వహించే కోడి పందాలకు పోటీగా మరొక బరిని సిద్ధం చేయడంతో మహిళలు అడ్డుకున్నారు. దేవరపల్లి మండలంలో దేవరపల్లి, చిన్నాయిగూడెం, పల్లంట్ల, త్యాజంపూడి, లక్ష్మీపురం గ్రామాల్లో భారీ పందేలు నిర్వహించారు. గోపాలపురం మండలం గుడ్డిగూడెం, వెంకటాపాలెం, కొవ్వూరుపాడు, వాదాలకుంట గ్రామాల్లో పందేలు జరిగాయి. నల్లజర్ల మండలం నల్లజర్ల, అనంతపల్లి, చోడవరం, పోతవరం, ద్వారకాతిరుమల మండలంలో రాళ్లకుంట, వెంకటకృష్ణాపురం, దోసన్నపాడు, తిమ్మాపురం గ్రామాల్లో భారీగా పందేలు ప్రారంభించారు. తొలిరోజు పందేలకు ప్రముఖులు ఎవరూ హాజరుకాకపోయినప్పటికీ మండల స్థాయి టీడీపీ నాయకులు బాధ్యతలు తీసుకుని జోరుగా నిర్వహించారు. దెందులూరులో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ దగ్గరుండి మరీ పందేలను నిర్వహిస్తున్నారు. పెదవేగి మండలం కొప్పాకలో పోటీల వద్దకు పోలీసులు, మీడియా రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మొగల్తూరులో పందేలు నిర్వహించే బరికి వేలం నిర్వహించారు. నిడమర్రు మండలం పత్తేపురంలో భారీ పందేలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు వీటిని ప్రారంభించారు. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు పాల్గొన్నారు. ఈ బరిని స్థానిక నాయకుడొకరు రూ.32 లక్షలు చెల్లించి వేలంలో దక్కించుకున్నట్టు సమాచారం. జూలు విదిల్చిన జూదం.. ఏరులై పారిన మద్యం కోడి పందేల బరులకు అనుబంధంగా కోతాట, గుండాట పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. అక్కడే మద్యం లూజు విక్రయాలు భారీగా సాగుతున్నాయి. నిడమర్రు మండలం పెదనిండ్రకొలనులో స్థానిక టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో భీమేశ్వరస్వామి ఆలయం వద్ద పందేలు జరుగుతున్నాయి. బువ్వనపల్లి, తోకలపల్లి గ్రామాల్లో చిన్న బరులు ఏర్పాటు చేఽశారు. ఇక్కడ పందేల కంటే పేకాట, గుండాట వంటి జూదాలకే అధిక ప్రాధాన్యత ఉంది. కొవ్వూరు నియోజకవర్గ పరిధిలోని 14 గ్రామాల్లో కోడి పందాల శిబిరాలను ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటల వరకూ ఎటువంటి అనుమతులు ఇవ్వకపోవడంతో బరులు ఏర్పాటు చేసే ప్రాంతాల వద్ద పోలీసులు పికెట్లు ఏర్పాటు చేసి గస్తీ నిర్వహించారు. 11గంటల తరువాత పోలీసు ఉన్నతాధికారుల నుంచి అనధికారిక అనుమతులు రావడంతో పోలీసు గప్‌చిప్‌గా అక్కడి నుంచి వెళ్లిపోయారు. మార్టేరు, ఆలమూరు, పెనుమంట్ర, వడలి, సిద్ధాంతం, దొంగరావిపాలెం, ములపర్రు, ఆచంట, కొడమంచిలి, వల్లూరు గ్రామాలలో కోడి పందేలు, జూదం నిర్వహించారు. ఆచంట మండలం వల్లూరులో పందేల బరిని వేలం వేయగా, గ్రామానికి చెందిన ఒక వ్యక్తి రూ.2 లక్షలకు దక్కించుకున్నట్టు సమాచారం. చింతలపూడి మండలం వెంకటాపురం, సీతానగరం, నాగిరెడ్డిగూడెం, లింగపాలెం మండలంలోని కొణిజర్ల, ములగలంపాడు, కామవరపుకోట మండలం రావికంపాడు, కళ్లచెర్వు, జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం, లక్కవరం గ్రామాల్లో భారీగా పందేలు నిర్వహించారు. పాలకొల్లు, యలమంచిలి, పోడూరు మండలాల్లో ఉదయం 10 గంటలకే కోడి పందేలు, గుండాట, కోతాట తదితర జూద క్రీడలు ప్రారంభించారు. పాలకొల్లు మండలంలో టీడీపీ నేత ఆధ్వర్యంలో పూలపల్లి బైపాస్ రోడ్డులో కోడి పందేలు వేశారు. పోలవరం నియోజకవర్గ పరిధిలోని గుంజవరం, గూటాల, పి.రాజవరం, పి.అంకంపాలెం, కామయ్యపాలెం, రాచన్నగూడెం, ములగలంపల్లి, తాటియాకులగూడెం, జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, బూసరాజుపల్లి, దొరమామిడి, వెలుతురువారిగూడెం, టి.నరసాపురం, బందంచర్ల, రామవరం, తిరుమలదేవిపేట, అప్పలరాజుగూడెం, రామానుజపురం, బయ్యనగూడెం, కుక్కునూరు మండలం వీరవల్లి, వేలేరు గ్రామాల్లో కోడిపందేలు జరిగాయి. -
పందేలదే పైచేయి
పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందేలు కోర్టు ఉత్తర్వులు బేఖాతర్ గాలిలోకి కాల్పులు జరిపి ప్రారంభించిన వైనం చేతులు మారుతున్న రూ.కోట్లు 144 సెక్షన్ ప్రకటించిన కలెక్టర్ సాక్షి ప్రతినిధి, ఏలూరు : భోగి రోజున పందెం రాయుళ్లు రెచ్చిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడిపందేలు యథేచ్ఛగా జరిగాయి. అధికార పార్టీ నేతలే ముందుండి నడిపించడంతో గురువారం రాత్రివరకూ హడావుడి చేసిన పోలీసులు శుక్రవారం పూర్తిగా చేతులెత్తేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా కోడిపందేలు జరిగాయి. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం కోడి పందాల్లో తెలంగాణ పరిధిలోని ఖమ్మం, ఏపీ పరిధిలోని పశ్చిమ గోదావరి జిల్లాల పందేల రాయుళ్ల మధ్య భారీ పందేలు జరిగాయి. ఇక్కడ ఖమ్మం జిల్లా జూబ్లీపుర గ్రామానికి చెందిన గంగవరపు లక్ష్మీదయాకర్ అనే వ్యక్తి పందేల ప్రారంభం సందర్భంగా తన లైసెన్స్ రివాల్వర్‌తో గాల్లోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ విషయం తెలిసిన కొన్నిగంటల తరువాత అక్కడకు చేరుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఏటా మాదిరిగానే ముందువరకూ ఉత్కంఠ నెలకొన్నా సంక్రాంతి సంబరాల్లో తొలిరోజైన భోగినాడు జిల్లావ్యాప్తంగా పందెం కోళ్లకు రెక్కలు తెగాయి. హైకోర్టు ఉత్తర్వులు, దానిపై సుప్రీంకోర్టు స్పందనతో చివరి రోజు వరకూ పందేలను అడ్డుకున్నా భోగి రోజున చేతులెత్తేశారు. ఉదయం 11 గంటల తర్వాత ప్రభుత్వం నుంచి అనధికారిక ఉత్తర్వులు రావడంతో పోలీసులు తప్పుకున్నారు. నిడమర్రు మండలం పత్తేపురంలో, భీమడోలు మండలం గుండుగొలను బరుల్లో పందేలను ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ప్రారంభించారు. టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఈ పందాల్లో పాల్గొన్నారు. పెదవేగి మండలం కొప్పాకలో ప్రభుత్వ విప్ చింతమనేని ఆధ్వర్యంలో కోడిపందేలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం మండలంలోని శ్రీనివాసపురం, లక్కవరం గ్రామాల్లో భారీగా పందాలు నిర్వహించారు. తెలంగాణ నుంచి కోడి పందేల రాయుళ్లు భారీగా తరలి వచ్చారు. రూ.లక్షల్లో పందాలు జరిగాయి. పందేల ముసుగులో కోతాట, గుండాట, మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగాయి. పోలీసులు కనీసం కన్నెత్తి కూడ చూడలేదు. ఆచంట మండలం వల్లూరులో కోడి పందేల బరిని వేలం పాట నిర్వహించగా గ్రామానికి చెందిన ఒక వ్యక్తి రూ.2 లక్షలకు పాడుకున్నట్టు సమాచారం. అకివీడు మండలం ఐ.భీమవరంలో హైడ్రామా నడిచింది. గ్రామంలోని ప్రధాన బరిగా ఉన్న ఎఫ్‌సీఐ గోడౌన్ల ప్రాంతంలో కోడి పందేలు వేయరాదంటూ పోలీస్, రెవెన్యూ యంత్రాంగం తిష్ట వేశాయి. పందెంరాయుళ్లు గొడవకు దిగినా తహసీల్దార్ ఒప్పుకోలేదు. పోలేరమ్మ గుడివద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డింకీ పందాలను ఎమ్మెల్యేతో ప్రారంభించేందుకు నిర్వాహకులు నిర్ణయించి ఎమ్మెల్యే కలవపూడి శివను ఆహ్వానించారు. ఎమ్మెల్యే చెప్పడంతో మధ్యాహ్నం నుంచి ప్రధాన బరిలో కూడా కోడిపందేలు జరిగాయి. భీమవరం మండలం వెంప, తోకతిప్ప గ్రామాల్లో భారీ పందాలు వేస్తుండగా దిరుసుమర్రు, ఈలంపూడి, వీరవాసరం మండలంలోని కొణితివాడ, నవుడూరు, ఉత్తరపాలెం, అండలూరు, వీరవాసరం, నందమూరుగరువు తదితర గ్రామాల్లో పందేలు నిర్వహిస్తున్నారు. వీరవాసరం మండలం కొణితివాడ చుట్టుపక్కల గ్రామాల ఏడు చిన్నచిన్న గ్రామాల్లోని సంఘ పెద్దలు ఉత్తరపాలెంలో నిర్వహించే కోడి పందాలకు పోటీగా మరొక బరిని సిద్ధం చేయడంలో అక్కడి మహిళలు అడ్డుకున్నారు. తొలిరోజు పందాలకు ప్రముఖులు ఎవరూ హాజరు కాకపోయినప్పటికీ మండలస్థాయిలోని టీడీపీ నాయకులు నిర్వహణ బాధ్యతలు తీసుకుని జోరుగా నిర్వహించారు. -
పందేలకు రెఢీ
నిడమర్రు: గ్రామీణ ప్రాంతాల్లో కోళ్లు కాళ్లు దువ్వుతున్నాయి, సంక్రాతి పండుగ సమీపించడంతో పందేల రాయయళ్లు సమరానికి సన్నద్దమవుతున్నారు. ప్రతీ ఏటా సంప్రదాయ ముసుగులో కోడిపందాలు నిర్వహించడం జరుగుతుంది. గ్రామాల్లో పందాల నిర్వహణకు గ్రామాల్లో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి, ఈ కోడి పందాల నిర్వహణ పండుగ ఆనవాతీ అని దీన్నిఅడ్డుకోవడం ఎవరి తరంకాదని పందేం రాయుళ్లు చెబుతున్నారు. సంక్రాంతి పండుగ మూడు రోజులు పందాలు వేసి తీరుతామనిబరులు సిద్దం చేసుకుంటున్నారు. ఇప్పటికే పందాలకు అవసరమైన కోళ్లును పలువరు నిర్వహకులు సామూహికంగా పెంచి పందాలకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ’ఓ సామాజిక వర్గం ఆధిపత్య గ్రామాల్లోనే... గణపవరం, నిడమర్రు మండలాల్లో ఓ సామాజిక వర్గం ఆధిపత్యం ఉన్న గ్రామాల్లోనే కోడి పందాలు నిర్వíßంచేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. గణపవరం మండలంలో అర్ధవరం, నిడమర్రు మండలంలో పత్తేపురంగ్రామాల్లో పెద్ద బరులు సిద్దంచేస్తున్నారు. పత్తేపురంలో ఈ పందేల నిర్వహణకు చేపల చెరువును ఎండగట్టి నట్లు తెలుస్తుంది. దీని కోసం చెరువు యజమానికి సుమారు రూ 3లక్షలు నిర్వహకులు చెల్లిస్తున్నట్లు సమాచారం. అలానే గుండాటలు, పేకాటలు, కోడిమాసం పకోడి, ఫాస్ట్ ఫుడ్, ఐస్‌క్రీం, మధ్యం దుకాణాల సముదాయాలకు పాటలు నిర్వహించడం లేదా మూడు రోజులకు కలిపి కొంత మొత్తంలో అద్దె తీసుకోవడం నిర్వహకులు చేస్తుంటారు. అలానే చిన్న బరులు ప్రతీ ఏటా నిడమర్రు మండంలో పెదనిండ్రకొలను, బువ్వనపల్లి, తోకలపల్లి, మందలపర్రుగ్రామాల్లో ఉంటాయి. గణపవరం మండలంలో గణపవరం, సరిపల్లె, కొమ్మర, జగన్నాధపురం, పిప్పిర గ్రామాల్లో ఏర్పాటు చేస్తుంటారు. ఈ ఏడాదికూడా ఆయా గ్రామాల్లో నిర్వహించేందుకు స్థానిక పందెంరాయుళ్లు అధికార పార్టీ నేతలతో మంతనాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ’ ప్రతీఏటా చివరి నిముషంలో.. ప్రతీ ఏటా పందాలకు అనధికార అనుమతులవిషయంలో పందెంరాయుళ్లకు చివరి నిముషం వరుకూ టెక్షన్గా ఉంటారు. ప్రతీ ఏటా భోగి రోజు ఉదయం 9 నుండి 11 గంటలకు అనుమతి లభిస్తుంది. ప్రతీ ఏటా 3 రోజులకు మాత్రమే అనధికార అనుమతులు ఉంటాయి, కానీ గతేడాది బోగి, సంక్రాతి, కనుమతోపాటు ముక్కనమ కలుసుకుని 4 రోజులకు అనధికారఅనుమతులతో పందాలు నిర్వహించారు. దీంతో అప్పట్లో పాలకులు,పోలీసుల తీరును అనేమ మంది తప్పు పట్టారు. ’ఆన్లైన్ వద్దు నోట్లే ముద్దు పెద్దనోట్లు రద్దు ప్రభావం కోడిపందాల నిర్వహణపై పెద్దగా ప్రభావం చూపలేదని తెలుస్తుంది. ఆన్లైన్ లావాదేవీల వైపు పందెంరాయుళ్లు మగ్గుచూపడంలేదు. పందాలకు నోట్లు సిద్దం చేసుకోవలని నిర్వహకుల నుండి పందాల్లో పాల్గునేవారిని సమాచారం అందుతుంది. మొత్తం మీద ప్రస్తుతానికి కోడిపందాల నిర్వహణ వ్యవహారంలో గతేడాదితో పోల్చితే వెనకబడినట్లూ కనిపిస్తుందని పలువురు భావిస్తున్నారు. ఇంకా 3 రోజులు సమయం ఉండటంతో పందాల నిర్వహణలో పోలీసులా, పందెంరాయళ్లా అనే విషయం తేలాల్సి ఉంది. -
కోడి పందాలకు హైకోర్టు బ్రేక్!
-
కోడి పందాలకు హైకోర్టు బ్రేక్!
హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా కోలాహలంగా నిర్వహించే కోడిపందాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. కోడి పందాల పేరుతో మద్యం, జూదం విచ్చలవిడిగా సాగుతుందని ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోడిపందాల పేరుతో జంతువులను హింసిస్తున్నారని పేర్కొంటూ.. పీపుల్ ఫర్ యనిమల్ ఆర్గనైజేషన్, యనిమల్ వెల్ఫేర్ బోర్డు వేసిన పిటిషన్‌పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కోడి పందాలు నిర్వహించకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. -
జిల్లాలో జడలు విదిలిస్తున్న బెట్టింగ్ భూతం
ఏలూరు అర్బన్ ః జిల్లాలో బెట్టింగ్ భూతం మరోమారు జడలు విప్పి నాట్యం చేస్తుంది. జిల్లా పోలీసులు బెట్టింగ్ నిర్మూలించేందుకు తీసుకున్న చర్యల కారణంగా గత కొద్ది కాలంగా జిల్లాలో స్థబ్డంగా ఉన్న బెట్టింగ్ వ్యాపారం ఇటీవలి కాలంలో తిరిగి హల్చల్ చేస్తున్నారు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన అమెరికా ఆ«ద్యక్ష ఎన్నికల సందర్బంగా డొనాల్డ్ ట్రంప్, హిల్లరీల మధ్య జరిగిన ఎన్నికలు, న్యూజిలాండ్, భారత్ మధ్య జరిగిన క్రికెట్ పోటీల నేపథ్యంలో బెట్టింగ్ రాయుళ్ళు పందాల మానియాకు గురికావడం బుకీలకు వరంగా మారింది. ప్రజలకు జూదంపై ఉన్న మక్కువను, బలహీనతలను ఆసరాగాచేసుకుని బెట్టింలను పూర్తిస్థాయి వ్యాపారాంగా మార్చేస్తున్నారు. అక్రమమార్గంలోనైనా సులువుగా డబ్బు సంపాదించాలనే లక్ష్మంతో ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్న అక్రమార్కులు బెట్టింగ్‌లో సాంకేతికతను జోడిస్తున్నారు. నిత్యం పశ్చిమగోదావరి జిల్లాలోని పట్టణాలతో పాటు పొరుగున ఉన్న తూర్పుగోదావరి జిల్లాలోని బుకీలతో కలుపుకుని నిత్యం లక్షల్లో జరుగుతున్న బెట్టింగ్ వ్యాపారాన్ని జనసంచారం ఎక్కువగా ఉండే అపార్ట్మెంట్లలోని ఫ్లాట్లలో కేవలం ఒక టివి సెల్ఫోన్లతో నడిపించేస్తున్నారు. ఈ వ్యాపారానికి నిరుద్యోగులు, విద్యార్ధులు, వ్యాపారులు, ఉద్యోగులతో పాటు పారిశ్రామిక వేత్తలను మూల«దనంగా మార్చుకుని బెట్టింగ్ వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారు. ఇందుకు బుకీలకు ఉన్న పరిచయాలే పెట్టుబడి కావడంతో నానాటì కీ పెట్టుబడి, నష్టం అనే మాటే వినపడని బెట్టింగ్ వ్యాపారానికి ప్రధాన ఆకర్షగా మారడం పోలీసులకు సవాలుగా మారుతోంది. ఈ నేపథ్యంలో జల్లాలో పోలీసులు విస్తుతంగా దాడులు చేస్తున్న సందర్భంగా బుకీలు తమ వద్ద నగదు లేకుండా జాగ్రత్త పడడడంతో పోలీసులకు టివి, ల్యాప్‌టాప్, ఆన్లైన్ బాక్స్, సెల్ఫోన్లు మినహా భారీగా నగదు చిక్కడం లేదు. గడచిన నెలరోజుల కిందట జిల్లాలో జరిగిన బెట్టింగ్‌లకు సంబంధించి వివిధ ప్రాంతాల్లో పోలీసులు దాడులు చేసి నమోదు చేసిన కేసులు బెట్టింగ్ భూతం విచ్చలవిడి తనానికి సజీవ సాక్ష్మాలుగా నిలుస్తున్నాయి. భీమవరంలో గడచిన అక్టోబర్ , 7వ తేదీన పాలకొల్లు పట్టణం కొత్త కుళాయి గట్టు వెంకటేశ్వరస్వామి కాలనీలోని బివిఆర్ అపార్ట్మెంట్, 501వ నంబర్ ఫ్లాట్‌లో గుట్టు చప్పుడు కాకుండా భారీగా నిర్వహిస్తున్న క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో బుకీలు ముదునూరి ప్రదీప్, పెన్మెత్స సాయి దిలీప్ కుమార్ వర్మ, పెన్మెత్స రామకృష్టంరాజు, కాలినీడు పవన్‌కుమార్ రాజు, ఇసుకమర్తి సతీష్‌లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 24,020ల నగదు స్వాధీనం చేసుకోవడంతో పాటు బెట్టింగ్‌కు ఉపయోగిస్తున్న 25 సెల్ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లు, ఒక లైన్‌బాక్స్ అనే ఆధునికి యంత్రాన్ని స్వా«ధీనం చేసుకున్నారు. తాడేపల్లిగూడెంలో అక్టోబర్, 10న తాడేపల్లిగూడెంలోని సత్యవతి నగర్లో సూర్యచంద్ర అపార్ట్మెంట్లోని ఫ్లాట్‌లో బెట్టింగ్ స్థావంరపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో బెట్టింగ్ నిర్వహిస్తున్న మునగాల సత్యనారాయణ, మునగాల శ్రీనివాస్, కనపర్తి ఇళయరాజా అనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 1200ల నగదు, టివి, రెండు ల్యాప్‌టాప్‌లు, 12 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. భీమవరంలో అక్టోబర్, 29న భీమవరం వన్‌టౌన్ పోలీసులు పట్టణంలో ఒక ఇంటిలో గుట్టుగా జరుగుతున్న క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై దాడి చేశారు. ఈ దాడిలో బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.4,460లు, ఒక ల్యాప్‌టాప్, ఒక లైన్ బాక్స్, టివి, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నల్లజర్ల మండలం దూబచర్లలో ఈ నెల 9న నల్లజర్ల మండలం దూబచర్ల గ్రామంలో బుకీ కొమ్మన గోపాలకృష్ణను అనంతపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 50,000లు, టివి, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం దేశంలో భారత్ ఇగ్లండ్ దేశాల మధ్య క్రికెట్ పోటీలు జరుగుతున్న నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్‌లు, బుకీల కదలికలపై పోలీసులు మరింతగా దృష్టి సారించాల్సి ఉంది. -
బెట్టింగ్ రాయుళ్లు ‘ఆమె’ వైపే
అమెరికా అధ్యక్ష ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ పెరుగుతోంది. ఇదే సమయంలో అధ్యక్షపీఠాన్ని దక్కించుకునేది ట్రంపా? లేక హిల్లరీనా? అంటూ బెట్టింగ్ లు కూడా ఊపందుకున్నాయి. అయితే, ఎక్కువమంది హిల్లరీనే అధ్యక్ష పదవికి ఎన్నికౌతారని విశ్వసిస్తున్నారట. ఓ వైపు ప్రిడిక్షన్ మార్క్ ట్ 'ప్రిడిక్ట్ ఇట్' చేసిన సర్వేలో అధ్యక్షురాలిగా హిల్లరీ ఎన్నికయ్యే అవకాశాలు 13శాతం తగ్గిపోయాయని చెప్పినా.. బెట్టింగ్ రాయుళ్లు ఆమె వైపే చూస్తుండటం విశేషం. గత వారం 'ప్రిడిక్ట్ ఇట్' వెబ్ సైట్లో క్లింటన్ పై 81శాతం మంది విశ్వాసం ఉంచగా.. ప్రస్తుతం క్లింటన్ విజయంపై నమ్మకం ఉంచిన వారి శాతం 56కి పడిపోయింది. కాగా, అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికౌతారని గత వారం 22శాతం మంది విశ్వసించారు. ప్రస్తుతం ట్రంపే అధ్యక్షునిగా ఎన్నికౌతారని విశ్వసించే వారి శాతం 44కు పెరిగింది. నార్త్ కరోలినాలో హిల్లరీ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని, ఫ్లోరిడాలో ట్రంప్ ఆధిపత్యాన్ని ప్రదర్శించే అవకాశం ఉందని సదరు వెబ్ సైట్ లో పేర్కొన్నారు. ఈ సైట్ ద్వారా బెట్టింగ్ రాయుళ్లు స్ధానికంగా జరిగే ఎన్నికల మీద కూడా బెట్ చేయొచ్చు. పోటీ చేస్తున్న అభ్యర్ధిపై ఎక్కువ మంది గెలుస్తారని నమ్మకం ఉంచితే ఆ షేర్లు మరింత ధర పలుకుతాయి. అదే ఓడిపోతారని భావిస్తే ఆ షేర్ల విలువ పడిపోతుంది. -
క్రికెట్ బుకీల అరెస్ట్
తాడేపల్లిగూడెం రూరల్ : ఆన్లైన్ ద్వారా బెట్టింగులు నిర్వహిస్తున్న క్రికెట్ బుకీలను అరె స్ట్ చేసినట్టు పట్టణ సీఐ ఎంఆర్‌ఎల్‌ఎస్‌ఎస్ మూర్తి తె లిపారు. వివరాలి లా ఉన్నాయి.. ఆదివారం రాత్రి స్థానిక సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కైకరానికి చెందిన కనపర్తి ఇళయరాజా, మునగాల నాగశ్రీనివాస్, మునగాల సత్యనారాయణ అనే వ్యక్తులు పట్టణంలోని ఓ అపార్ట్మెంట్లో క్రికెట్ బెట్టింగులు నిర్వహిస్తున్నారు. ఆది వారం భారత్–న్యూజిలాండ్ మ్యాచ్ సందర్భంగా ఆన్లైన్లో బెట్టింగులు నిర్వహిస్తుండగా ఎస్ఐ ఐ.వీర్రాజు తన సిబ్బందితో దాడి చేశారు. నింది తులను అదుపులోకి తీసుకుని టీవీ, రెండు ల్యాప్‌టాప్‌లు, 12 సెల్ఫోన్లు, రూ.1,300 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సైలు పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన జూదం
కామవరపుకోట: జూదం అతని పాలిట మృత్యువయ్యింది. కోడి పందాల్లో జరిగిన గొడవ నిండు ప్రాణాలను బలిగొంది. కామవరపుకోట శివారు కొండగూడెం వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించి చింతలపూడి సీఐ జి.దాసు తెలిపిన వివరాలిలా ఉన్నా యి.. మండలంలోని ఉప్పలపాడు పంచాయతీ పరిధిలోని గొల్లగూడెంకు చెందిన వీరవల్లి వీరాస్వాములు (45)కు కోడి పందాలు ఆడే అలవాటు ఉంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పందాలకు వెళ్లాడు. అక్కడ వీరాస్వాములుకు, మరికొందరితో గొడవ జరగ్గా కొద్దిసేపటికి ఎవరికి వారు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో సాయంత్రం కామవరపుకోట శివారు కొండగూడెం వాటర్ ప్లాంట్ వద్ద వీరు మళ్లీ ఘర్షణకు దిగారు. ఈ సమయంలో వీరాస్వాములు తలపై ప్రత్యర్థి వర్గం వారు బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. నిందితులను గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలి పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు తరలించారు. ఇదిలా ఉండగా వీరాస్వాములు ఉదయం పచ్చిమిరపకాయల బస్తా వేసుకుని కామవరపుకోట వెళ్లాడని స్థానికులు చెబుతున్నా రు. మృతునికి భార్య జ్ఞానేశ్వరి, వివాహిత అయిన కుమార్తె, కుమారుడు నాగరాజు ఉన్నారు. కుటుంబ పెద్ద అకాల మరణంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. -
చెలరేగుతున్న బుకీలు
ప్రొద్దుటూరు క్రైం: కొన్ని రోజుల క్రితం వరకూ బెట్టింగ్ నిర్వహించాలంటేనే బుకీలు భయపడే వారు. ప్రొద్దుటూరును వదలి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి ప్రాంతాలకు వెళ్లి క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే వారు. జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ హెచ్చరికల నేపథ్యంలో ఇక్కడి పోలీసులు క్రికెట్ బెట్టింగ్, మట్కాలను కట్టడి చేయడమే గాక కేసులు కూడా నమోదు చేశారు. దీంతో రెండు నెలల నుంచి జిల్లాలో క్రికెట్ పందేలు నిర్వహణ బాగా తగ్గిందని చెప్పవచ్చు. పోలీసులు బడా బుకీల మీదే దృష్టి సారించడంతో ఛోటా బుకీలు ఇదే అదనుగా భావించి బాగా రెచ్చిపోతున్నట్లు కనిపిస్తోంది. గతంలో బడా బుకీలకు అసిస్టెంట్లుగా, కొరియర్ బాయ్‌లుగా పని చేసిన వారు ఇపుడు బుకీల అవతారం ఎత్తి పందేలు నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇటీవల ఈ తరహా బుకీలు కూడా రూ.లక్షల్లో లావాదేవీలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. పోలీసుల చర్యలు ఏవి ? జిల్లాలో ప్రొద్దుటూరు ప్రధాన ప్రాంతం. ఇక్కడ కొన్ని రోజుల క్రితం వరకు బెట్టింగ్ ముఠాలపై పోలీసుల నిఘా ఉండేది. దీంతో పట్టణంలో బెట్టింగ్ రాయాలంటేనే పందెం రాయుళ్లు జంకే పరిస్థితి ఉండేది. అయితే కొన్ని రోజుల నుంచి ఎందుకో మరి పోలీసులు దాడులకు స్వస్తి చెప్పారు. పట్టణంలో బెట్టింగ్ ఎక్కడా జరగడం లేదని కింది స్థాయి సిబ్బంది చెప్పడంతో ఉన్నతాధికారులు దాడులు చేయడం లేదని తెలుస్తోంది. కాగా జమ్మలమడుగు, కడప, కదిరి, అనంతపురం ప్రాంతాలకు చెందిన కొత్త వ్యక్తులు ఇక్కడికి వచ్చి బెట్టింగ్ దందా కొనసాగిస్తున్నారు. కొత్త వ్యక్తులను పోలీసులు గుర్తు పట్టే అవకాశం లేనందున వారు బహిరంగంగానే పందేలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. గుంటూరు, కదిరి, అనంతపురం ప్రాంతాలకు చెందిన ఆరుగురు బుకీలను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంటర్, డిగ్రీ చదివిన విద్యార్థులు కూడా క్రి కెట్ పందేలు కాస్తున్నారు. పోలీసు అధికారులు బెట్టింగ్‌ను అరికట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ ప్రాంతాల్లో జోరుగా.. క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్న సమయాల్లో వైఎంఆర్ కాలనీలోని పార్కు సమీపంలో పెద్ద ఎత్తున బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలిసింది. అలాగే కొర్రపాడు రోడ్డులోని భగత్‌సింగ్ కాలనీ, ఆర్ట్స్ కాలేజి రోడ్డులోని నాలుగు రోడ్ల కూడలి, దస్తగిరిపేట, మోడంపల్లె, వన్‌టౌన్ సమీపంలోని జెండా చెట్టు సమీపంలో, సుందరాచార్యుల వీధిలోని ఓ లాడ్జి పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బెట్టింగ్ జరుగుతోంది. పందేలు నిర్వహిస్తున్న బుకీలు గుర్తింపు లేని వారు కావడంతో వారి ఆటలు సాఫీగా సాగుతున్నాయి. కాగా చాలా మంది బుకీలు బెట్టింగ్‌లో ఇటీవల భారీగా నష్టపోయినట్లు తెలుస్తోంది. కొందరైతే తమ ఆస్తులను కూడా పోగొట్టుకున్నారు. దస్తగిరిపేట, వన్‌టౌన్ ప్రాంతం, మోడంపల్లె, గంగమ్మ ఆలయం వీధి, జిన్నారోడ్డు, భగత్‌సింగ్ కాలనీలకు చెందిన ప్రధాన బుకీలు భారీగా నష్టపోయినట్లు తెలుస్తోంది. ఎవ్వరినీ వదలం క్రికెట్ బెట్టింగ్‌ను పూర్తి స్థాయిలో అరికడతాం. ప్రత్యేకంగా నిఘా ఉంచి దాడులు నిర్వహిస్తాం. బుకీలతోపాటు ఇకపై రాసే వారు పట్టుబడినా కూడా కేసులు నమోదు చేస్తాం – పూజితానీలం, ప్రొద్దుటూరు డీఎస్పీ -
క్రికెట్ బుకీల అరెస్ట్: నగదు స్వాధీనం
రాయచోటి: వైఎస్సార్ జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు బుకీలను రాయచోటి పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం రాత్రి బొట్లచెరువు గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఉన్న బెట్టింగ్ నిర్వహిస్తున్న బుకీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.96,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం నిందితులను రిమాండ్‌కు తరలిస్తామని పోలీసులు తెలిపారు. -
బ్రెగ్జిట్ బంగార్రాజు
బ్రెగ్జిట్ రెఫరెండం తో బెట్టింగ్ రూపంలో వేల కోట్ల రూపాయలు చేతులు మారా యి. మెజారిటీ సర్వేలు ఈయూలోనే బ్రిటన్ ఉంటుందని వెల్లడించినా.. లండన్‌కు చెందిన ప్రముఖ హెడ్జ్ ఫండ్ సంస్థ బాస్ క్రిస్పిన్ ఓడే (57) మాత్రం బ్రిటన్ విడిపోతుందని బలంగా నమ్మాడు. అందుకు తగ్గట్లుగానే బెట్టింగ్ కట్టి 220 మిలియన్ పౌండ్ల (రూ.2 వేలకోట్లకు పైనే) జాక్‌పాట్ కొట్టాడు. క్రిస్పిన్ బంగారంపై ఇన్వెస్ట్ చేయటంతోపాటు, పౌండ్ ధర తగ్గటంపై బెట్టింగ్ కట్టాడు. అయితే బ్రెగ్జిట్ ఫలి తంతో బంగారం డిమాండ్ పెరగటం, పౌండ్ 31 ఏళ్ల కనిష్టానికి తగ్గటం జరిగిపోయాయి. దీంతో క్రిస్పిన్ పంట పండింది. -
క్రికెట్ బెట్టింగ్ బుకీల అరెస్ట్: 18 లక్షలు స్వాధీనం
శ్రీకాకుళం: నగరంలో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠాను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళంలోని పుప్పాలవారి వీధిలో నివాసం ఉంటున్న టంకాల వెంకటరమణ అనే వ్యక్తి ఇంట్లో కొంతకాలంగా క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు తమకు సమాచారం వచ్చిందని తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఇంగ్లాండ్-శ్రీలంక జట్ల మధ్య రసవత్తర పోటీకి బెట్టింగ్ ను నిర్వహిస్తుండగా దాడి చేసి పెద్ద ఎత్తున నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. బుకీ టంకాల వెంకటరమణతో పాటు మరో 12 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు. మొత్తం 22 లక్షలు విలువజేసే నగలు, నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. బెట్టింగ్ రాకెట్ సంబంధించి ప్రధాన సూత్రధారుడిగా భావిస్తున్న కిరణ్, అతని తమ్ముడు రవి ప్రస్తుతం విశాఖపట్టణంలో తలదాచుకుంటున్నట్లు అనుమానిస్తున్నారు. వీరికి సంబంధించిన వివరాలను సేకరించినట్లు తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెప్పారు. -
రమ్మీ... రమ్మటోందా?
శ్రీకాకుళం: ఈజీ మనీ... క్షణాల్లో లక్షాధికారుమైపోవాలనే ఆలోచన చాలా మంది జీవితాలను నాశనం చేస్తోంది. ఈ ఆలోచననే అదనుగా చేసుకుని ఊరిలో బెట్టింగ్ నుంచి ఆన్లైన్లో పేకాట వరకు అంతా మోసం చేయడానికి రెడీ అయిపోతున్నారు. యువత కూడా ఈజీగా వీరి ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఫేస్బుక్ తెరిస్తే చాలు ఊరూ పేరూ లేని వ్యక్తులు ‘మేం అంత గెలిచాం.. ఇంత గెలిచామంటూ’ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఏదో వెబ్సైట్ బ్రౌజ్ చేద్దామన్న రమ్మీ అంటూ రమ్మంటూ ప్రకటనలు కనిపిస్తున్నాయి. క్షణాల్లో డబ్బులు సంపాదించాలనే యా వతో జిల్లాలోనూ చాలా మందికి వీటికి అలవాటు పడుతున్నారు. ఫలితంగా ఉన్న డబ్బులు క్షవరం చేయించుకుని మోసపోతున్నారు. బంగారు ఆభరణాలతోపాటు విలువైన వస్తువులను తనఖా పెట్టి మరీ జూదమాడి కుదేలవుతున్నారు. క్రికెట్ బెట్టింగ్ కూడా ఇలాగే తయారైంది. చాలా మంది పాకెట్ మనీగా ఇళ్లల్లో ఇచ్చింది ఇలాంటి బెట్టింగులపై పెట్టి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. బైకులు, సెల్ఫోన్లు వంటి ఖరీదైన వస్తువులను అమ్మి జూదం, బెట్టింగ్‌లకు పెడుతున్న వారూ ఉన్నారు. ఇటీవలి కాలంలో పోలీసులకు చిక్కిన నేరస్తుల్లో ఎక్కువమంది యువకులే కావడం, వీరంతా బెట్టింగ్, జూదంలోనే పట్టుబడుతుండడమే దీనికి నిదర్శనం. బెట్టింగు నిర్వహిస్తున్న వారు అన్ని వర్గాల అధికారులను తమ దారిలోకి తెచ్చుకునేందుకు నెలనెలా లక్షల రూపాయలు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఆన్లైన్ జూదాన్ని అదుపులోకి ఎలా తేవాలన్నది ఎవరికీ తెలి యడం లేదు. అలాగే జిల్లా వ్యాప్తంగా 15 నుంచి 20 వరకు జూదశాలలు నడుస్తున్నట్లు అనధికారిక లెక్క ప్రకారం తెలుస్తోంది. వీటిలో కొన్ని ప్రజాప్రతినిధులు, కొందరి అధికారుల కనుసన్నల్లో నడుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి వాటిని తక్షణంఅరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
భారత్- జింబాంబ్వే వన్డే సీరీస్‌లో భాగంగా ఈ రోజు జరిగిన రెండో వన్డే సందర్భంగా బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 81 వేల నగదుతో పాటు 3 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు చెందిన మరో నలుగురు వ్యక్తులు పరారీలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయాలి: బీసీసీఐ కార్యదర్శి షిర్కే
క్రికెట్లో అవినీతిని, ఫిక్సింగ్‌ను అరికట్టాలంటే బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయడమే మేలనే లోధా కమిటీ సిఫారసుకు తాను మద్దతు ఇస్తున్నట్లు బీసీసీఐ కార్యదర్శి అజయ్ షిర్కే చెప్పారు. ‘బీసీసీఐ ఆటగాళ్లను ఎడ్యుకేట్ చేస్తుంది. కానీ వాళ్లమీద అనుక్షణం నిఘా పెట్టలేం. కాబట్టి లోధా కమిటీ ప్రతిపాదనను అమల్లోకి తెస్తే మేలనేది నా అభిప్రాయం’ అని షిర్కే తెలిపారు. -
క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరి అరెస్ట్
మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. లక్ష్మీగూడలోని ఓ ఇంటిపై మంగళవారం అర్ధరాత్రి దాడి చేసిన పోలీసులు బెట్టింగ్‌కు పాల్పడిన తిరుమలేష్, రవిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.12వేలు స్వాధీనం చేసుకున్నారు. -
బంతి బంతికీ బెట్టింగ్ చేస్తూ...
చిత్తూరు జిల్లాలో జోరుగా ఐపీఎల్ బెట్టింగ్.. రోజుకు రూ.10 కోట్ల వరకు అమాయకుల జేబులు ఖాళీ జిల్లాలో మొత్తం 25 మంది బుకీలు? నియంత్రించలేకపోతున్న పోలీసులు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై జిల్లాలో బెట్టింగుల పర్వం జోరుగా సాగుతోంది. లీగ్ ప్లేఆఫ్ దశకు చేరడంతో ముఖ్యమైన టీంలపై లక్షల్లో బెట్లు కట్టేందుకు కూడా యువకులు వెనకాడడం లేదు. రెట్టింపు స్థాయిలో డబ్బు ఎర చూపి బుకీలు అమాయకులను నిలువునా ముంచేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 25 మంది బుకీలు చిత్తూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో తిష్టవేసి కోట్ల రూపాయలు హాంఫట్ చేస్తున్నట్లు సమాచారం. చిత్తూరు: ఐపీఎల్ క్రికెట్ సందర్భంగా జిల్లావ్యాప్తంగా భారీగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. బంతి బంతికీ బెట్టింగ్ చేస్తూ పలువురు నిమిషాల్లో వేలు సంపాదిస్తుంటే.. మరికొంద రు బికారులుగా మారుతున్నారు. జిల్లావ్యాప్తంగా కోట్లలో బెట్టింగ్ జరుగుతోందని పోలీసులకు సమాచారం ఉన్నా.. తగినంత మంది సిబ్బంది లేక బెట్టింగును వారు నియంత్రించలేకపోతున్నారు. ముఖ్యంగా కర్ణాటక నుంచి బెట్టింగ్ రాయుళ్లు తిరుపతి, చిత్తూరు, మదనపల్లి, బంగారుపాళ్యం, పుత్తూరు, పుంగనూరులకు వచ్చి బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. బెట్టింగ్ చేసే విషయం, ఆ ముఠా తీసుకునే జాగ్రత్తలు తెలుసుకుంటే ఎవరైనా విస్మయానికి గురికావాల్సిందే. అమాయకులే టార్గెట్.. క్రికెట్ బెట్టింగ్ ద్వారా రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయిపోవచ్చని బుకీలు అమాయకులకు వల వేస్తున్నారు. కొందరు యు వకులు ఈ రొంపిలో దిగి వదులుకోలేకపోతున్నారు. దీంతో బెట్టింగ్ ముఠా జేబులు నిండుతున్నాయి. అమాయకుల జేబులు ఖాళీ అవుతున్నాయి. బెట్టింగ్‌కు పాల్పడే రెండు పార్టీల నుంచి బుకీలు కమీషన్ తీసుకొని కోట్లకు పడగలెత్తుతున్నారు. జిల్లాలో సుమారు 25 మంది బుకీలు పని చేస్తున్నట్లు సమాచారం. వీరు కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చి ఈ తంతును నడిపిస్తున్నారని తెలుస్తోంది. వీరందరూ తమకంటూ ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నారు. బెట్టింగ్ చేయాలనుకునే వారి నుంచి ముందస్తు రుసుం వసూలు చేసి సభ్యత్వం కల్పిస్తున్నారు. ఒక కంప్యూటర్, పదుల సంఖ్యలో సెల్ఫోన్లు అందుబాటులో ఉంచుకొని జోరుగా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. ఏవిధంగా బెట్టింగ్ కట్టాలనుకుంటున్నారో సభ్యులు చెబితే వారు అదే విధంగా బెట్టింగ్ కట్టాలనుకునే వారితో ఒప్పందం కుదురుస్తారు. వీటిని ఎక్కడా రికార్డు చేయరు. కేవలం కోడ్ బాషను మాత్రమే ఉపయోగిస్తారు. మ్యాచ్ ఓడిన వారి నుంచి మరుసటి రోజు డబ్బులు వసూలు చేసి కమీషన్ పట్టుకొని మిగతా సొమ్మును పక్కాగా గెలిచిన వారికి అందిస్తున్నారు. అద్దె ఇళ్లు, టైలరింగ్ షాపులు.. బెట్టింగ్ నిర్వహించాలంటే కచ్చితంగా కంట్రోల్ రూం ఉండాల్సిందే. ఒకప్పుడు వీరు పెద్దపెద్ద హోటళ్లలో కార్యకలాపాలు చేస్తుండే వారు. వీరి గుట్టు అందరికీ తెలియడంతో చిన్నచిన్న అద్దె గృహాలు, మొబైల్ వాహనాలు, టైలరింగ్ షాపుల్లో వ్యవహారాలు నడిపిస్తున్నారు. కర్ణాటక నుంచి వచ్చే హైఫై ముఠా మొబైల్ వాహనాల్లో కథ నడిపిస్తున్నారు. సుమో, స్కార్పియో లాంటి వాహనాలకు డీ2హెచ్‌లను అమర్చుకొని డీల్స్ ఓకే చేస్తున్నారు. ఈ వాహనం ఒకే చోట కాకుండా జిల్లా మొత్తం తిరుగుతుంది. బెట్టింగ్ విషయాలు బయటికి పొక్కకుండా కేవలం ఫోన్లో మాత్రమే మాట్లాడతారు. మెసేజ్‌లు పెడతారు. తమ సభ్యుల్లో ఎవరిపైనైనా అనుమానం వారితో వెంటనే కార్యకలాపాలు ఆపేస్తారు. ఫోన్ నంబర్ మార్చి మిగతా సభ్యులకు కొత్త నంబర్ తెలియజేస్తారు. ఎవరూ నోరు మెదపడం లేదు.. సాధారణంగా జూదంలో ఓడిపోయిన వాడే పోలీసులకు సమాచారం ఇస్తాడు. దీని ద్వారా పోలీసులు చర్య లు తీసుకుంటారు. అయితే బెట్టింగ్ విషయంలో ఈ విషయాలన్నీ గోప్యంగా ఉంటాయి. బెట్ ఏంటన్నది బుకీలే బయటపెడతారు. బుకీలు ఎక్కడి నుంచి వ్యవహారం నడిపిస్తున్నారన్నది ఎవరికీ తెలియదు. వ్యవహారం మొత్తం రహస్యం. దీన్ని ఎవరూ దాటడానికి వీల్లేదు. దాటితే వారికపై కఠిన చర్యలు ఉంటాయి. చంపడానికైనా వెనకాడరు. ఒక వేళ ఓడిపోయిన వ్యక్తి బెట్టింగ్ మొత్తం చెల్లించకపోతే...మరోసారి బెట్టింగ్ చేయడానికి అతడు అనర్హుడు. ఇంకో బెట్టింగ్ ముఠా కూడా అతనిన బెట్టింగ్‌కు సభ్యత్వం ఇవ్వదు. దీనికోసం వారు సరికొత్త సాఫ్ట్‌వేర్‌నే ఉపయోగిస్తున్నారు. కొత్తవారు సభ్యులుగా చేరాలంటే పాత సభ్యుడి సిఫారసు ఉండాల్సిందే. ప్రొటోకాల్ పాటించడానికే.. ప్రొటోకాల్ పాటించడానికే సమయం మొత్తం సరిపోతోందని.. మరి ఇలాంటి విషయాలపై దృష్టిపెట్టడానికి టైమ్‌లేదని పోలీసులు వాపోతున్నారు. జిల్లా మొత్తం దాదాపు 3600 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. జిల్లా జనాభా 40 లక్షలు పైనే. ఈ లెక్కన ప్రతి 1111 మందికి ఒక పోలీసు ఉంటారు. జనాభా పెరుగుతున్నా పోలీసు నియామకాలపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదు. దీనికి తోడు ఉన్న వారిపై పనిభారం పెరుగుతుండటంతో నేరాల కట్టడి అంతంత మాత్రంగానే ఉంది. -
బంతి బంతికో లెక్క...జీవితమే పణంగా
నగరం, జిల్లాలో ప్రాణాలు తీస్తున్న క్రికెట్ బెట్టింగ్‌లు ఈ ఐపీఎల్ సీజన్లో ముగ్గురు ఆత్మహత్య! నగరంలో ద్వితీయ, రూరల్‌లో తృతీయ శ్రేణి బుకీలు ఇతర జిల్లాలు, రాష్ట్రాల్లో ప్రధాన సూత్రధారులు రెస్టారెంట్లలో లైవ్ బెట్టింగ్‌లపై సాధారణ కేసులు భారతీయులకు క్రికెట్ అంటే ఆట మాత్రమే కాదు.. అదో మతం. క్రికెట్టే శ్వాసగా లక్షలాది మంది టీవీలకు అతుక్కుపోయి గడిపేస్తుంటారు. ఈ బలహీనతనే సాంకేతికత సాయంతో కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. క్రికెట్ ప్రేమికులకు బుకీలు ఎరవేసి బెట్టింగ్ ఉచ్చులోకి దింపుతున్నారు. ఫలితంగా ఎందరో అమాయక ప్రజలు లక్షలాది రూపాయలు కోల్పోయి రోడ్డున పడుతున్నారు. వీరిలో విద్యావంతులు, యువతే ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగించే అంశం. పైసా ఖర్చు లేకుండా కేవలం చిన్న గదిలో కూర్చుని బెట్టింగ్‌లకు పాల్పడే బుకీలు మన విశాఖలోనూఉన్నారంటే ఆశ్చర్యం కలగకమానదు. కానీ ఇది వాస్తవమని కొన్నేళ్ల క్రితమే బయటపడింది. విశాఖ కేంద్రంగా బుకింగ్‌లకు పాల్పడుతున్న ఓ బుకీని పోలీసులు గతంలో అరెస్ట్ చేశారు. అప్పట్లో అది ఓ సంచలనం. అయితే ఆ తర్వాత అతను సిటీ నుంచి నగర శివారుకు మకాం మార్చాడు. అక్కడి నుంచే తన నెట్‌వర్క్‌ను నడుపుతున్నాడు. - సాక్షి, విశాఖపట్నం హుషారెత్తించే టీ20 మ్యాచ్ ఎక్కడ జరిగినా అందరూ ఎంతో ఉత్సాహంగా చూస్తారు. ఐపీఎల్ ప్రారంభమై తొమ్మిదేళ్లు గడిచినా క్రికెట్ ప్రేమికుల్లో ఆసక్తి మాత్రం తగ్గలేదు. రోజురోజుకూ ఐపీఎల్ చూసేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లోనూ ప్రతీ జట్టూ నువ్వా నేనా అన్నట్లు తలపడుతున్నాయి. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే... ఇంకోవైపు మాత్రం కోట్ల రూపాయలు కొల్లగొట్టే బెట్టింగులకు వేదికగా మారడం మాత్రం విచారకరం. ఐపీఎల్‌తోపాటు వరల్డ్ కప్, ఇండియా-పాకిస్తాన్, ఇండియా-ఆస్ట్రేలియా... ఇలా కొన్ని ముఖ్యమైన, పెద్ద జట్ల మధ్య జరిగే మ్యాచ్‌ల సమయంలో బుకీలకు పండుగే పండుగ. మాదకద్రవ్యాలకు మించిన మత్తు ఒకప్పుడు వన్డేలు, వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరిగినప్పుడు మాత్రమే జరిగే బెట్టింగ్‌లు ఐపీఎల్ రంగప్రవేశంతో విస్తృతమయ్యాయి. నగరాల నుంచి పట్టణాలు, పల్లెలకూ ఈ జాఢ్యం విస్తరించింది. ఈ నేపథ్యంలో సంపన్నులే కాకుండా మధ్యతరగతి, రోజువారీ కూలీలు కూడా పందేలు కాస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే మత్తు పదార్థాలకు మించిన రీతిలో బెట్టింగ్‌లకు బానిసలైపోతున్నారు. నగరానికి చెందిన కొందరు బుకీలు యువతను టార్గెట్ చేసుకుని బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. కొందరు విశాఖ నగరంలోనే హోటళ్లు, లాడ్జీలు అద్దెకు తీసుకుని బెట్టింగ్‌లు నడుపుతుంటే... మరికొందరు రూరల్ ప్రాంతాలకు వెళ్లి అక్కడి నుంచి ఏజెన్సీ, గ్రామీణుల చేత బెట్టింగ్ లు వేయిస్తున్నారు. మరి కొందరు ఇటు విజయనగరం, అటు రాజమండ్రి ప్రాంతాల్లో ఉంటూ విశాఖలో బెట్టింగ్‌లు నడిపిస్తున్నారు. వీరి ఉచ్చులో పడి బెట్టింగ్‌లు కట్టి సొమ్ములు కోల్పోయి అప్పుల పాలై తాజా ఐపీఎల్ సీజన్లో అనకాపల్లి, నర్సీపట్నం, చోడవరం ప్రాంతాలకు చెందిన ముగ్గురు ఆత్మహత్యలు చేసుకున్నారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అయితే విషయం బయటకు తెలిస్తే పరువుపోతుంద ని వారి కుటుంబ సభ్యులు విషయాన్ని గుట్టుగా ఉంచారు. ఇలా చాలా మంది బయటకు చెప్పుకోలేక, పోలీసులను ఆశ్రయించలేక జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈ ఐపీఎల్లో రూ.5 కోట్ల వ్యాపారం మూడంచెల విధానంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బెట్టింగ్‌లు జరుపుతున్న బుకీలు సబ్బవరం, రణస్థలం నుంచి ఎక్కువగా ఆపరేట్ చేస్తున్నట్లు మొబైల్ సిగ్నల్స్‌ను బట్టి పోలీసులకు తెలుస్తోంది. అయితే ఇటు అనకాపల్లి, నర్సీపట్నం, చోడవరం వంటి రూరల్ ప్రాంతాల్లో తృతీయ శ్రేణి బుకీలు గ్రామీణ యువతను ఆకర్షిస్తున్నారు. విశాఖ కేంద్రంగా ద్వితీయ శ్రేణి బుకీలు బెట్టింగ్‌లు నడిపిస్తుండగా ప్రధాన సూత్రధారులు హైదరాబాద్, ముంబై నగరాల నుంచి చక్కబెడుతున్నారు. ఐపీఎల్ వరకూ ఒక్క విశాఖ కేంద్రంగానే కనీసం రూ.5కోట్ల మేర వ్యాపారం జరుగుతోందని అంచనావేస్తున్నారు. స్థానికంగా పలు రెస్టారెంట్లు బెట్టింగ్‌లను నిర్వహిస్తున్నాయి. స్కీన్‌పై లైవ్ మ్యాచ్‌ను చూస్తూ బెట్టింగ్ జరిపే విధానాన్ని వీరు అనుసరించి స్థానిక యువతను దీనిలోకి దింపుతున్నారు. అయితే ఇలాంటి కొందరిని పోలీసులు పట్టుకున్నారు. కానీ వీరిపై కేవలం గేమింగ్ యాక్ట్ ప్రకారమే కేసు నమోదు చేస్తున్నారు. సమిధలవుతున్న బతుకులు సరదాగా మొదలైన బెట్టింగ్ రానురానూ వ్యసనంగా మారిపోతోంది. కొంతమంది అదృష్టం బాగుంటే కూర్చుని రూ.లక్షలు సంపాదించవచ్చనే ఆశతో ఇదే లోకంగా గడిపేస్తున్నారు. దీంతో తెలియకుండా ఈ ఊబిలో కూరుకుపోతున్నారు. చేతిలో ఉన్న నగదు, బంగారం... ఇలా స ర్వం కోల్పోయాక కూడా అప్పులు చేసి బెట్టింగ్‌లు కడుతున్నారు. చేసిన అప్పులు తీర్చలేక కుటుంబానికి భారమై ఆత్మహత్యలకు సిద్ధమవుతున్నారు. మారిన పందేల తీరు సాధారణంగా క్రికెట్ పందేలు పేకాట తరహాలో సమాన నగదుతోనే జరిగేవి. టీ20 రాకతో వాటి స్వరూపమే మారిపోయింది. ఆడే జట్ల బలాల ఆధారంగా రూపాయికి 80 పైసలు, రెండు రూపాయలు... ఇలా కొత్త ఆఫర్లు రూపొందించారు. మ్యాచ్ ఎవరు గెలుస్తారనేది మాత్రమే కాకుండా ఒక జట్టు ఎన్ని పరుగులు చేస్తుంది. ఎన్ని వికెట్లు పడగొడుతుంది. స్టార్ ఆటగాడు ఎన్ని పరుగులు చేస్తాడు... ఈ తరహాలో రకరకాలుగా పందేలు సాగుతున్నాయి. ఈ తతంగమంతా అరచేతిలో చరవాణి ద్వారానే సాగిపోతోంది. టాస్ వేసినప్పటి నుంచి బంతి బంతికీ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ప్రధాన నగరాల్లో ఉండే పెద్ద పెద్ద బుకీలు తమ ఏజెంట్ల ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇంటర్నెట్ పరిజ్ఞానం ఉన్నవారు చరవాణి ద్వారా కార్యకలాపాలు సాగిస్తూ పోలీసులకు అనుమానం రాకుండా వ్యవహరిస్తున్నారు. -
యువకుడి ప్రాణం తీసిన పందెం
బాలాయపల్లి: పందెం ఓ యువకుడి ప్రాణం పోవడానికి దారితీసింది. నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం కడగుంట గ్రామంలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హరి (20) అనే యువకుడు స్నేహితులతో కలసి గ్రామంలోని దిగుడుబావి వద్దకు ఆదివారం వెళ్లాడు. హరికి ఈత రాకపోవడంతో స్నేహితులు పందెం వేశారు. పందెం కోసం పట్టుదలతో ఈత రాకపోయినా హరి నీటిలోకి దిగడంతో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు అతడి మృతదేహాన్ని వెలికితీశారు. -
కుర్రాళ్లలో నైపుణ్యం పుష్కలం
హర్షా భోగ్లే: ఇద్దరు మేటి వ్యక్తుల్లో ఒకరు ఇప్పటికే ఆట నుంచి తప్పుకున్నాడు. మరొకరు ఇంకో నెలలో అదే బాటలో పయనించనున్నాడు. అయితే వీరిద్దరు ఇప్పుడు ఢిల్లీ డేర్‌డెవిల్స్ అభిమానుల్లో ఎనలేని ఆనందాన్ని నింపుతున్నారు. చాలాకాలంగా ఢిల్లీ జట్టు విజయాలను అందుకోలేకపోయినా ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఈ నేపథ్యంలో నేడు ఢిల్లీ... గుజరాత్ లయన్స్‌ను ఎదుర్కోబోతోంది. ఈ మ్యాచ్ గెలిస్తే క్వాలిఫికేషన్‌కు సగం దూరంలో నిలిచినట్లు అవుతుందని వాళ్లకు తెలుసు. రెండు వారాల క్రితం వీళ్లపై ఎవరూ బెట్టింగ్ పెట్టడానికి ఆసక్తి చూపలేదు. మ్యాచ్ విన్నర్లను కాకుండా కుర్రాళ్లను ఎంపిక చేయడంలో రాహుల్ ద్రవిడ్ విధానం ఏమాత్రం మారలేదు. రాజస్తాన్ రాయల్స్ మాదిరిగానే ఉంది. ఢిల్లీ జట్టులో శ్రేయస్ అయ్యర్, మయాంక్ అగర్వాల్, సంజూ శామ్సన్, కరణ్ నాయర్లలో నైపుణ్యానికి కొదవలేదు. వీళ్లకు తోడు డికాక్‌లో అమోఘమైన ప్రతిభ ఉంది. మనల్ని మెరుగుపర్చడానికి ఓ స్టార్ ఆటగాడు చాలా శ్రమిస్తున్నాడని వీళ్లందరూ మనస్ఫూర్తిగా నమ్ముతున్నారు. ర్యాంప్ షాట్లు, రివర్స్ స్వీప్లపై కాకుండా తన బలాన్ని బట్టి ఆడేలా బ్యాట్స్‌మెన్‌ను ద్రవిడ్ బాగా ప్రోత్సహిస్తున్నాడు. టాప్ ఆర్డర్ విఫలమైనా నిజమైన టి20 విన్నర్ డుమిని ఉన్నాడనే భరోసాతో ఆ విధంగా చేస్తున్నాడు. కెప్టెన్‌గా జహీర్ ఖాన్‌ను నియమించడం ఓ మాస్టర్ స్ట్రోక్ అని నా అభిప్రాయం. ఈ సమయంలో అతను చాలాకాలం కొనసాగలేడని తెలుసు. అలాగే చురుకైన బౌలర్ కూడా కాదు. కానీ సుదీర్ఘ కాలం నుంచి భారత క్రికెట్లో అతను బౌలింగ్ కెప్టెన్. ఇతర బౌలర్లకు అతను స్ఫూర్తిగా నిలిచాడు. షమీని తీర్చిదిద్దడం భారత్ క్రికెట్‌కు లాభించే అంశం. జహీర్ పైనుంచి ఊడిపడలేదు. కానీ అతనిలోని ఆత్మవిశ్వాసం, సానుకూలత అమోఘం. స్టార్ స్పోర్ట్స్ స్టూడియోలో నేను మొదటిసారి అతణ్ని చూశా. కెరీర్ ఆఖర్లో ఉన్నాడనే ఉద్దేశంతో డీడీ అతనికి అవకాశం ఇచ్చినా.. రెండో ఆధ్యాయంలో కొత్త అంకం మొదలైంది. భారత క్రికెట్‌కు జహీర్ కోచ్ అవుతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. అది కూడా ఎంతో దూరంలో లేదు. మొత్తానికి ఐపీఎల్ అతనికి చాలా గొప్ప మలుపునిచ్చింది. ఆరుగురు బౌలర్లు అందులో ఇద్దరు లెగ్ స్పిన్నర్లతో ఆడటం నాకేమీ ఆశ్చర్యమనిపించలేదు. అమిత్ మిశ్రా, పీయూష్ చావ్లా ఐపీఎల్లో ఇప్పటికే నిరూపించుకున్నారు. తాహిర్ చాలా అరుదుగా విఫలమవుతుంటాడు. షమీ, మోరిస్‌లకు తోడు అవసరమైనప్పుడు జహీర్ బాగా మద్దతిస్తున్నాడు. అయితే ఢిల్లీ ఇప్పుడిప్పుడే విజయాలబాట పట్టినా... ఐపీఎల్లో ఇంకా చాలా మ్యాచ్‌లు ఉన్నాయి. -
ఐపీఎల్ బెట్టింగ్ రూ.100 కోట్లు
సిద్దిపేట రూరల్: ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) ఫోర్లు.. సిక్సర్ల హోరుతో జోరందుకుంది. బెట్టింగ్ కూడా అదే స్థాయిలో లక్షలు దాటి కోట్ల రూపాయలకు చేరింది. ఇటీవల ముగిసిన టీ-20 వరల్డ్ కప్‌లో మెదక్ జిల్లాలో రోజూ రూ.లక్షల్లో బెట్టింగ్ జరిగితే... ఐపీఎల్లో రూ. 2 కోట్ల మేర బెట్టింగ్ నడుస్తున్నట్లు సమాచారం. బెట్టింగ్ తీరిది... వరల్డ్‌కప్‌లో అయితే ఇండియా ఆడే మ్యాచ్‌లపై ఎక్కువగా బెట్టింగ్ నడుస్తుంది. కానీ, ఐపీఎల్‌లోని 8 జట్లలోనూ ఇండియా ఆటగాళ్లు ఉంటారు. దీంతో ప్రతీమ్యాచ్పైనా బెట్టింగ్ దందా ఉంటోంది. ఐపీఎల్ ప్రధానంగా నాలుగు జట్లు ఫెవరేట్‌గా ఉన్నాయి. బెట్టింగ్‌లో ప్రత్యర్థి జట్లుపై అధికంగా బెట్టింగ్ కాస్తారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్, ముంబై ఇండియన్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, గుజరాత్ లయన్స్‌లో భారీ హిట్టర్లు ఉన్నారు. దీంతో ఇవి ఫెవరేట్ టీంలుగా బెట్టింగ్ రాయుళ్లు భావిస్తున్నారు. ఫేవరేట్ జట్ల మధ్య బెట్టింగ్ జోరుగా నడుస్త్తోంది. మరో నెల రోజులు ఇదే తీరు.. ఈ నెల 8న ప్రారంభమైన ఐపీఎల్ 45రోజుల పాటు జరగనుంది.మొదట్లో కాస్త నెమ్మదిగా ప్రారంభమైంది. భారీ స్కోర్లు లేవు. ఆర్సీబీ, సన్‌రైజర్స్ హైదారాబాద్ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదు కావడంతో బెట్టింగ్ జోరందుకుంది. ఈ మ్యాచ్‌లో చాలా మంది హైదరాబాద్‌పై పందేలు కాశారు. అయితే ఆర్సీబీ గెలవడంతో భారీగా బెట్టింగ్ రాయుళ్లు జేబులు ఖాళీ చేసుకున్నారు. ఇప్పటి వరకూ రోజు ఒక మ్యాచ్ మాత్రమే నేటి నుంచి రోజుకు రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లలో జిల్లాలో రోజూ సుమారుగా రూ. 3కోట్లు మేర బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం. జిల్లాలో బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు పోలీసు వర్గాలు సైతం అంగీకరిస్తున్నాయి. లీగ్ మొత్తంపైన జిల్లాలో దాదాపు రూ. 100 కోట్ల మేర చేతులు మారే అవకాశం ఉందని అంచనా. ఈ ప్రాంతాల్లో బెట్టింగ్ అధికం... మెదక్ జిల్లాలో సిద్దిపేట, గజ్వేల్, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, తుప్రాన్, పటాన్చెరువు, జహీరాబాద్, రాంచంద్రానగర్, జోగిపేట ప్రాంతాల్లో బెట్టింగ్‌లు పెద్ద ఎత్తున నడుస్తున్నట్లు తెలుస్తోంది. బుకీలు ఈ ప్రాంతాల్లో మకాం వేశారు. కొంతమంది ఏజెంట్లను ఆయా ప్రాంతాల్లో నియమించుకున్నారు. మ్యాచ్‌కు రెండు గంటల ముందు బెట్టింగ్ తీరును చెప్పేస్తారు. ఈ మేరకు బెట్టింగ్ రాయుళ్లు ఏజెంట్లకు డబ్బులు ఇస్తారు. వీరు సబ్‌బుకీలకు చెల్లిస్తారు. మ్యాచ్ అనంతరం వెంటనే బెట్టింగ్ డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఈ బెట్టింగ్‌ల వల్ల చాలా మంది నష్టపోతున్నారు. రోడ్డున పడుతున్న కుటుంబాలు... ఇటీవల వరంగల్ జిల్లా చేర్యాల మండలానికి చెందిన ఓ వ్యక్తి సిద్దిపేట ప్రాంతంలో నిర్వహించే బెట్టింగ్‌లో రూ.1.50 లక్షలు ఒకే రోజు పొగొట్టుకున్నట్లు సమాచారం. ఇవే కాకుండా ఇలాంటి ఘటనలు పట్టణ ప్రాంతాల్లో చాలా ఉన్నాయి. లాడ్జీలు, దాబాలు, ఇంటర్నెట్లు, మోబైల్ షాపుల్లో ఈ దందా నడుస్తోంది. బెట్టింగ్ ఎవరు, ఎక్కడ నిర్వహిస్తున్నారనేది స్థానిక పోలీసులకు తెలిసినప్పటికీ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని బాధిత కుటుంబాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. నిఘా ఉంచాం...: సిద్దిపేట పరిధిలో క్రికెట్ బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. పట్టణ పరిధిలో 10మంది బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు తెలిసింది. వారిపై ఇప్పటికే నిఘా పెట్టాం. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఆన్లైన్, సెల్ఫోన్ల ద్వారా బెట్టింగ్‌లు నడిపిస్తుండడం వల్ల పట్టుకోలేకపోతున్నాం. బాధితులెవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదించాలి. వారికి పొగొట్టుకున్న డబ్బులు ఇప్పించడంతో పాటు వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం. సమాచారం ఇస్తే హైదరాబాద్ నుంచి బెట్టింగ్ నడిపిస్తున్న అక్కడి పోలీసుల సాయంతో పట్టుకుంటాం. - సీహెచ్. శ్రీధర్, డీఎస్పీ సిద్దిపేట -
ఐపీఎల్ బెట్టింగ్‌కు యువకుడు బలి
ఆర్థిక ఇబ్బందులకు తోడు ఐపీఎల్ బెట్టింగ్ ఓ యువకుడి ప్రాణం తీసింది. తాహతుకు మించి అప్పులు చేసి జల్సాలు చేస్తున్న యువకుడు ఐపీఎల్లో భారీగా బెట్టింగ్ కాసి ఓడి పోవడంతో.. బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా పత్తికొండలో గురువారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న మధు(24) సెల్‌ఫోన్ దుకాణం నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈక్రమంలో.. జల్సాలకు అలవాటు పడి క్రికెట్ బెట్టింగ్ ద్వారా సులువుగా డబ్బు సంపాదించవచ్చని ప్లాన్ వేశాడు. బుధవారం జరిగిన కోల్ కతా, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ పై భారీగా బెట్టింగ్ పెట్టాడు. బెట్ ఓడిపోవడంతో.. అప్పులు తీర్చే దారి కానరాక.. తన దుకాణంలోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.5 కోట్ల క్రికెట్ బెట్టింగ్
♦ ఎంత పనిచేశావు ‘సిమన్స్’ ♦ గిద్దలూరు బెట్టింగ్ రాయుళ్లను ఊడ్చేసిన వెస్టిండీస్ మ్యాచ్ ♦ రూ.5 కోట్లకు పైగానే చేతులు మారినట్లు ప్రచారం ♦ గెలుపు భారత్‌దేనంటూ బెట్టింగ్ ఆశలు రేకెత్తించిన క్రికెట్ ♦ బెట్టింగ్రాయునికి ఓ మాజీ ఎమ్మెల్యే అండదండలు? గిద్దలూరు: భారత్, వెస్టిండీస్ మధ్య గురువారం రాత్రి జరిగిన టీ20 ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ గిద్దలూరు బెట్టింగ్‌రాయుళ్ల జీవితాలతో చెలగాటమాడినట్లయింది. భారత క్రికెటర్లు భారీ స్కోరు నెలకొల్పారు. ఇక భారత్‌కు గెలుపు తధ్యమని భావించిన బెట్టింగ్‌రాయుళ్లు ఇష్టారాజ్యంగా బెట్టింగ్‌కు పాల్పడ్డారు. వారితోపాటు ఎన్నడూ బెట్టింగ్ జోలికెళ్లని వారిని కూడా ఈ కూపంలో ఇరుక్కున్నారు. గిద్దలూరు పట్టణంతోపాటు ముండ్లపాడు, కె.ఎస్. పల్లె గ్రామాలు, కొమరోలు, రాచర్ల, కంభం మండలాల్లో సుమారు రూ.5 కోట్లకు పైగానే బెట్టింగ్‌కు జరిగినట్లు సమాచారం. బెట్టింగ్‌రాయుళ్ల ఆశలపై నీళ్లు చల్లిన సిమన్స్... గిద్దలూరు బెట్టింగ్ రాయుళ్ల ఆశలపై వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ సిమన్స్ నీళ్లు చల్లారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 192 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో వెస్టిండీస్ ఓడటం ఖాయమైందంటూ బెట్టింగులు పెద్దమొత్తంలో పెట్టారు. దీనికితోడు భారత్ వరుస మ్యాచ్‌లలో విజయాలను నమోదు చేస్తుండటంతో భారత్ గెలుస్తుందని లక్షల్లో బెట్టింగ్‌కు పాల్పడ్డారు. తక్కువ పరుగుల్లోనే విధ్వంసకర బ్యాట్స్‌మెన్ గేల్ అవుట్ కావడంతో ఆట మధ్యలోనూ బెట్టింగ్‌కు ఊతం పోసింది. ఇలా బెట్టింగ్ రాయుళ్ల ఆశలకు అవధుల్లేనట్లుగా నగదును ఫణంగా పెట్టారు. చివరకు సిమన్స్, చార్లెస్, రసెల్ వంటి బ్యాట్స్మెన్లు అద్భుతంగా రాణించడం, భారత్ బౌలర్లు విఫలమవడంతో బెట్టింగ్‌రాయుళ్ల ఆశలు అడియాశలుగా మారాయి. చిరు వ్యాపారులు, చిరుద్యోగులు, యువకులు, విద్యార్థులు సైతం బెట్టింగ్‌లో నగదు పోగొట్టుకున్న వారిలో ఉన్నట్లు సమాచారం. బెట్టింగ్ నిర్వాహకుడిగా ఓ ప్రజాప్రతినిధి? పట్టణంలో బెట్టింగ్‌కు ఆతిధ్యం వహించింది ఓ ప్రజా ప్రతినిధి అనే విమర్శ గుప్పుమంటోంది. అతనితోపాటు మరో బట్టల వ్యాపారి, బంగారు వ్యాపారి కలిసి బెట్టింగ్ మధ్యవర్తులుగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. వీరు రహస్య ప్రదేశాల్లో ఉంటూ ఫోన్ల ద్వారా బెట్టింగ్ రాయుళ్లను సేకరించి ప్రధాన బెట్టింగ్ కేంద్రానికి దేనికి ఎంత మొత్తంలో అనేది సమాచారమిస్తారు. వీరితో పరిచయాలున్న వారితోనూ, వారికి పరిచయాలున్న వారితో బెట్టింగ్‌లో పాల్గొనేలా చేస్తారు. బెట్టింగ్‌కు పాల్పడే వారు ప్రత్యేక సెల్ఫోన్లు వాడటంతో ఎవరూ గురుపట్టలేరు. భారత్ పాల్గొనే మ్యాచ్‌లే కాకుండా ఇతర దేశాల మ్యాచ్‌లకు కూడా బెట్టింగ్ సాగుతోంది. పోలీస్ స్టేషన్లో ప్రధాన భూమిక పోషిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లకు ఖరీదైన సెల్ఫోన్లు, నెలసరి మామూళ్లు ముట్టజెబుతున్నారని, దీంతో ఎస్సై, సీఐ, పై స్థాయి అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నారుు. 11 మంది బెట్టింగ్ రాయుళ్లు అరెస్టు గిద్దలూరు రూరల్: పట్టణంలోని నరవ రోడ్డులో క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న 11 మంది యువకులను గురువారం అర్థరాత్రి స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందిన సమాచారం మేరకు కొందరు యువకులు క్రికెట్ క్రీడపై బెట్టింగులకు పాల్పడుతూ ఘర్షణలకు దిగుతున్నారని తెలియడంతో ఆ ప్రాంతంలో సోదాలు నిర్వహించిన పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వీరి వద్ద నుంచి ఐదు వేల రూపాయలను స్వాధీనపరచుకున్నట్లు సిఐ ఫిరోజ్ తెలిపారు. -
బెట్టింగ్ హీట్
► టీ-20 క్రికెట్ ప్రపంచకప్ నేపథ్యంలో జోరుగా బెట్టింగ్ ► ‘అనంత’తో పాటు ధర్మవరం, తాడిపత్రి, గుంతకల్లు, కదిరిలో సబ్ బుకీలు ► బుకీలతో సంబంధం లేకుండానూ...భారీగా వడ్డీలు పెంచిన ‘కాల్‌మనీ’ వ్యాపారులు ► దృష్టిసారించని పోలీసులు టాస్ ఎవరు గెలుస్తారు? మ్యాచ్ ఎవరి సొంతం? ఈ బాల్‌కు సిక్స్ కొడతాడా.. లేదా? ఈ ఓవర్లో ఎన్ని పరుగులు వస్తాయి? ఈ బాల్‌కు ఎన్ని పరుగులు వస్తాయి?...సాయంత్రమయితే చాలు బెట్టింగ్ రాయుళ్ల మధ్య జరిగే సంభాషణలివి. టీ-20 క్రికెట్ ప్రపంచకప్ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ జోరందుకుంటోంది. బుకీల అండతో నడిచే సబ్‌బుకీలతో పాటు కొంతమంది గ్రూపులుగా విడిపోయి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. మ్యాచ్ ఏ జట్ల మధ్య జరిగినా ‘అనంత’లో రూ. 1.5-2కోట్ల దాకా బెట్టింగ్ సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇతర ప్రాంతాల వారు కూడా ‘అనంత’లో మకాం వే స్తున్నారు. (సాక్షిప్రతినిధి, అనంతపురం) టీ-20 ప్రపంచ కప్ ఈ నెల 15 నుంచి మొదలైంది. అన్ని జట్లు మంచి ఫాంలో ఉండటంతో ప్రతిమ్యాచ్ బిగ్‌ఫైట్‌ను తలపిస్తోంది. ఇదే బెట్టింగ్ రాయుళ్లకు అనువుగా మారింది. క్షణాల్లో రూ.లక్షలు చేతులు మారుతున్నాయి. ‘అనంత’కు మారిన బెట్టింగ్ కేంద్రం రాయలసీమలో ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్ ఎక్కువగా సాగేది. అక్కడ పోలీసుల నిఘా ఎక్కువ కావడం, ఏళ్ల తరబడి అరెస్టులు, కౌన్సెలింగ్‌ల నేపథ్యంలో గతంతో పోలిస్తే అక్కడ బెట్టింగ్ కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. దీంతో బుకీలు ప్రొద్దుటూరుపై కాస్త ఫోకస్ తగ్గించి అనంతపురం, ధర్మవరం, గుంతకల్లు కేంద్రాలుగా బెట్టింగ్ నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ముంబయిలో బుకీలు ఉంటారు. వారు ఇక్కడ సబ్‌బుకీలను నియమించారు. వీరు మ్యాచ్ ప్రారంభం నుంచి ముగిసే వరకూ బెట్టింగ్ ఫీజును ఎప్పటికప్పుడు నిర్ధారిస్తారు. బుకీల ద్వారా మ్యాచ్ గెలుపోటములపై మాత్రమే బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మ్యాచ్ తీరును బట్టి బెట్టింగ్ స్వరూపాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటుంది. ఇది సబ్‌బుకీల ద్వారా జరుగుతుంది. ఈ తరహా బెట్టింగ్ ద్వారాజిల్లాలో రోజూ రూ.1.50-2కోట్లు చేతులు మారుతోంది. ఇటీవల ఇండియా-పాకిస్థాన్, ఇంగ్లండ్- సౌతాఫ్రికా మ్యాచ్‌ల సమయంలో రూ.5కోట్ల దాకా బెట్టింగ్ జరిగి ఉంటుందని ఓ అంచనా. బాల్ టు బాల్ బెట్టింగ్ సబ్‌బుకీలతో పనిలేకుండా ‘లోకల్’బెట్టింగ్ రాయుళ్ల కనుసన్నల్లో ‘బాల్ టు బాల్’ బెట్టింగ్ జరుగుతోంది. ఈ బాల్‌కు ఎన్ని పరుగులు వస్తాయి? ఈ బాల్‌కు వికెట్ పడుతుందా? లేదా? సిక్స్ లేక ఫోర్ కొడతాడా? బ్యాట్స్‌మెన్ ఎన్ని పరుగులు చేస్తాడు? ఇలా ప్రతిబాల్కు బెట్టింగ్ జరుగుతోంది. అంటే ఒక మ్యాచ్ ముగిసే లోపు టాస్, గెలుపుపై కాకుండా మ్యాచ్ జరిగే 240 బంతులపై బెట్టింగ్ ఆడతారు. ఈ తరహా బెట్టింగ్‌కు కొన్ని లాడ్జీలను వేదికగా చేసుకుంటున్నారు. భారీ వడ్డీలకు అప్పులు ఈ మాయలో పడిన కొందరు బెట్టింగ్ కోసం కొందరు నూటికి రూ.10 వడ్డీకి డబ్బు తెస్తున్నారు. ఇంకొందరు రూ.పదివేలు ఇస్తే రోజుకు రూ.2వేలు వడ్డీ వసూలు చేస్తున్నారు. బెట్టింగ్‌రాయుళ్లు చేతిలోని ఉంగరాలు, మెడలోని బంగారు గొలుసులు, బైక్‌లను కూడా తాకట్టుపెడుతున్నట్లు తెలుస్తోంది. వీరిలో కొందరు ప్రముఖ వ్యాపారులు కూడా ఉన్నట్లు సమాచారం. ఇంత జరుగుతున్నా ‘అనంత’ పోలీసులు దృష్టి సారించడం లేదు. ప్రపంచకప్ ముందు బెట్టింగ్‌పై ఎస్పీ రాజశేఖరబాబు ఆరా తీయగా.. ‘అబ్బే అనంతలో అంత లేదు సార్’ అని కొందరు తప్పుడు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఎస్పీ దృష్టి సారిస్తేనే బెట్టింగ్ రాయుళ్ల ఆటకట్టించవచ్చు. -
జీవితాలు క్లీన్ బోల్డ్!
జోరుగా టీ-20 ప్రపంచ కప్ బెట్టింగ్‌లు చేతులు మారుతున్న కోట్లాది రూపాయలు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్న పోలీసు యంత్రాంగం టీ-20 ప్రపంచకప్ పోటీలు వీక్షకులకు ఆనందాన్ని ఇస్తుంటే.. పందెంగాళ్లు మాత్రం కాయ్‌రాజాకాయ్ .. అంటూ యువతపై వల విసురుతున్నారు. మ్యాచ్ ప్రారంభమైందంటే చాలు ఏ బ్యాట్స్‌మన్ ఎన్ని పరుగులు తీస్తాడు.. బంతిబంతికీ బేరమం టూ పందేల రాయుళ్లను ఆహ్వానిస్తున్నారు. ఈ రొంపిలోకి దిగిన యువత జీవితాలను సర్వనాశనం చేసుకుంటోంది. తిరుపతి క్రైం: క్రికెట్ బెట్టింగ్‌లో జిల్లా అడ్డూ అదుపులేకుండా పోతోంది. ఇండియా, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ ఇలా.. జట్టు ఏదైనా బెట్టింగ్‌లు మాత్రం అసాధారణ స్థాయిలో సాగుతున్నాయి. టీ-20 ప్రపంచకప్ పోటీల్లో ఏరోజుకు ఆరోజే పందేలు కాస్తున్నారు. ప్రధానంగా యువత ఇష్టానుసారం బెట్టింగ్‌లు కాస్తూ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. జిల్లాలో ఆట ప్రారంభమైందంటే సుమారు రూ.కోట్లు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. యువతపై తీవ్ర ప్రభావం పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా బెట్టింగ్‌లు సాగుతున్నాయి. మదనపల్లిలో క్రికెట్ స్టార్ట్ అయిందంటే బెట్టింగ్ రాయుళ్లు బుకీల వద్ద బారులు తీరుతున్నారు. రెండు రోజుల క్రితం నగదుతో సహా పలువురుని మదనపల్లి పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే. బుకీలు పట్టణ, నగర ప్రాంతాల్లోని శివారు ప్రాంతాల్లో స్టార్ హోటల్స్‌లో రూములు తీసుకుని ఏమీ తెలియని వారిలా అంతా ఫోన్లలోనే బెట్టింగ్‌లు జరుపుతున్నారు. పోలీసులకు ఎటువంటి అనుమానం లేకుండా ఏరోజుకారోజు హోటల్ గదిని ఖాళీ చేసి మరో హోటల్‌కు మారిపోతున్నారు. రాష్ట్ర స్థాయిలో బెట్టింగ్ బుకీలు జిల్లాలోని తిరుపతి, మదనపల్లి, చిత్తూరు, పుంగనూరు వంటి ముఖ్యపట్టణాలకు చెందిన కొందరు రాష్ట్ర స్థాయిలో బెట్టింగ్‌ల ద్వారా దందా కొనసాగిస్తున్నారు. చోటా రాజకీయల నాయకుల అండదండలతో ఈ కార్యకలాపాలు విస్తృతం చేస్తున్నారు. గతంలో బెట్టింగ్ రాయళ్లతో పాటు బుకీ రాయళ్లు కూడా ఒకేచో ఉంటూ మ్యాచ్ అయ్యేవరకు ఆస్వాదించేవారు. పోలీసులు వారిపై నిఘా ఉంచడంతో నిర్మానుష్యంగా ఉన్న దూరప్రాంతాల్లోని లాడ్జీల్లో రూమ్‌లు తీసుకుని వ్యవహారాలు నడుపుతున్నారు. నిర్వాహకులంతా ఎక్కువగా సెల్ఫోన్ల ద్వారానే ఈ దందా కొనసాగిస్తున్నారు. బెట్టింగ్‌ల కోసమే కొత్త సిమ్‌లు కొనుగోలు చేసి లావాదేవీలు అయిన తర్వాత వాటిని పారేస్తున్నారు. పటిష్టమైన చర్యలు నగరంలో బెట్టింగ్‌పై నిఘా ఏర్పాటు చేశాం. క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభమైన సందర్భంలో నగరంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నాం. బెట్టింగ్ కాయడం చట్టరీత్యానేరం. యువకులు కూడా వీటికి దూరంగా ఉండాలి. ఎవరైనా ఎక్కడైనా బెట్టింగ్‌లకు పాల్పడినట్లు తెలిస్తే పోలీసు వాట్సప్ నెం.8099999977, 9491086021 నెంబర్లకు సమాచారం అందించండి. -మురళీకృష్ణ, ఈస్టు సబ్‌డివిజనల్ డీఎస్పీ -
బెట్టింగ్ చేతిలో బంతి..!
♦ టీ ట్వంటీ వరల్డ్ కప్ క్రికెట్ ♦ దర్శి కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ అంతా వన్ సైడే.. ♦ ఓడితే..డబ్బు ఇవ్వకుండా పోలీసులతో బెదిరింపులు.. ♦ గెలిస్తే అధికారం ఉపయోగించి వసూళ్లు ♦ టీ 20లో జోరుగా వ్యాపారం సందడిలో అభిమానులుంటే.. మరోవైపు బెట్టింగ్ రాయుళ్లు గుట్టుగా తమ పని చక్కబెట్టుకుంటున్నారు. కోట్ల రూపాయల బెట్టింగులకు పాల్పడుతూ అభిమానుల్ని దోచుకుంటున్నారు. ఒక్క షాట్ కొడితే ఆరు పరుగులు రావాలి ఒక్క బెట్టింగ్ నిర్వహిస్తే కోట్లు వచ్చిపడాలి అరుుతే ఎవరు గెలుస్తారో చెప్పలేం అటూ ఇటూ అరుుతే లైఫ్ రిస్క అందుకే కొత్త తరహా మాఫియూ పుట్టింది.. మధ్యవర్తుల్లా రంగంలోకి దిగుతారు.. ఒక సైడ్ తమవారిని ఉంచుతారు ఓడితే.. డబ్బు ఇవ్వకుండా వేధిస్తారు.. గెలిస్తే బెదిరించి డబ్బు గుంజుకుంటారు ఇదంతా దర్శి క్యాపిటల్‌గా జరుగుతున్న వ్యవహారం - సాక్షి ప్రతినిధి, ఒంగోలు క్రికెట్ బెట్టింగ్ బూచీ పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటోంది. రెట్టింపు డబ్బులు వస్తాయన్న ఆశతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. 20-20 ప్రపంచకప్ రాకతో బెట్టింగులు జోరందుకున్నాయి. జిల్లాలోని పలు పట్టణాల్లో ఈ వ్యవహారం జోరందుకుంది. ప్రధానంగా దర్శి కేంద్రంగా కోట్లాది రూపాయల బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు తెలిసింది. పాకిస్థాన్- ఇండియా మ్యాచ్ జరిగితే మాత్రం భారీగా డబ్బులు చేతులు మారుతున్నారుు. ఎలా? బెట్టింగ్ నిర్వహించే మధ్యవర్తి.. పోటీదారులు ఇద్దరినీ ఫోన్ లైన్లో ఉంచి బెట్టింగ్‌ను నిర్ణరుుస్తాడు. వాయిస్‌లను రికార్డు చేస్తాడు. తానే మీ ఇద్దరికి హామీ అంటూ వారి మధ్య ఒప్పందం కుదుర్చుతాడు. తన కమీషన్ కూడా ప్రస్తావించి గెలిచిన వారే ఇచ్చేలా మాట్లాడుకుంటారు. గెలిచిన వ్యక్తి.. మధ్యవర్తిని డబ్బులు అడగగానే అవతల వ్యక్తి ఇంకా తన చేతికి ఇవ్వలేదని.. ఇచ్చిన వెంటనే అందజేస్తానని హామీ ఇస్తాడు. కానీ డబ్బు ఎప్పటికీ అందదు. ఎందుకంటే అవతలి వ్యక్తి.. మధ్యవర్తి ఏర్పాటు చేసిన వాడే కావడం. గెలుపొందిన వ్యక్తి గట్టిగా నిలదీస్తే పోలీసులను ఆశ్రయిస్తున్నానని బెదిరింపులకు గురి చేస్తాడు. ఆ తరువాత పోలీసు అధికారి పేరుతో ఓ ఫోన్ వస్తుంది. ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. ఇలా గెలిచిన వ్యక్తి మౌనంగా ఉండిపోతాడు. మధ్యవర్తికి చెందిన వ్యక్తి గెలిస్తే మాత్రం అధికార బలాన్ని ఉపయోగించి డబ్బులు వసూలు చేస్తారు. కోట్లాది రూపాయలు.. నియోజకవర్గంలో ఉన్న ఓ ప్రధాన సూత్రదారుడు జిల్లాతో పాటు ఇతర జిల్లాలు, తెలంగాణ రాష్ట్రంలో కూడా మధ్యవర్తులను పెట్టి బెట్టింగ్‌లు నడిపిస్తున్నట్లు సమాచారం. ఇతను ప్రభుత్వ ఉద్యోగి కావడంతో పోలీసులు కేసులు రాకుండా చూసుకుంటున్నాడని తెలిసింది. -
దాయాదుల పోరుపై బెట్టింగ్‌ల జోరు
విజయవాడ : క్రికెట్ బెట్టింగ్‌ల జోరు మళ్లీ మొదలైంది. చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న భారత్-పాకిస్తాన్ల మధ్య టీ 20 క్రికెట్ ప్రపంచకప్ మ్యాచ్ శనివారం జరగనుంది. దీంతో అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో బంతి బంతికీ మ్యాచ్ ఫలితంపై బెట్టింగ్‌లు నిర్వహించడానికి నగరంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లాలోనూ పలుచోట్ల బుకీలు బెట్టింగ్‌లకు ఏర్పాట్లు చేశారు. పలుచోట్ల లాడ్జీలు, రియల్ ఎస్టేట్ ఆఫీసు కార్యాలయాలను ఇందుకు వేదికగా చేసుకున్నట్లు సమాచారం. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రారంభమయ్యే మ్యాచ్ హడావుడిని భారీగా సొమ్ము చేసుకోవడానికి ఇప్పటికే ఆన్లైన్లో బెట్టింగ్ వివరాలు అందుబాటులో ఉంచటం గమనార్హం. 20 ఓవర్ల పరిమిత మ్యాచ్‌లో ఒక్కరోజే దాదాపు రూ.100 కోట్లపైనే బెట్టింగ్ జరిగే అవకాశముందని తెలుస్తోంది. బెట్టింగ్‌లో భారత్ హాట్ ఫేవరెట్‌గా ఉన్నట్లు సమాచారం. విజయవాడలో కృష్ణలంక, సింగ్ నగర్, పటమట తదితర ప్రాంతాల్లో బెట్టింగ్‌లు అధికంగా జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆయా పరిధిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్లతో పాటు టాస్క్‌ఫోర్స్ పోలీసులు కూడా బెట్టింగ్ రాయుళ్లపై దృష్టి సారించారు. గతంలో నమోదైన కేసుల ఆధారంగా కీలక బుకీల కదలికలపై నిఘా ఉంచారు. కృష్ణలంకలో బెట్టింగ్ ముఠా అరెస్టు విజయవాడ : కృష్ణలంకలోని ఓ ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. భ్రమరాంబపురం కాలనీలోని మలేరియా హాస్పిటల్ సమీపంలో గల ఓ ఇంట్లో బెట్టింగులకు పాల్పడుతున్న ఆరుగురు వ్యక్తులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఓ టీవీ, ఆరు మొబైల్ ఫోన్లు, రూ.19 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీ టీమ్-2 మురళీధర్ ఆధ్వర్యంలో ఎస్ఐ సురేష్‌రెడ్డి, సిబ్బంది ఈ దాడి నిర్వహించారు. నిందితులను కృష్ణలంక పోలీసులకు అప్పగించారు. -
బాబోయ్ బెట్టింగ్..
► మొదలైన టీ20 ప్రపంచకప్ ► చక్రం తిప్పుతున్న బుకీలు ► యువతను లక్ష్యంగా చేసుకున్న వైనం ► బుకీల దూకుడుకు పోలీసులు కళ్లెం వేసేనా..? టీ20 ప్రపంచకప్ పోటీలు ప్రారంభమయ్యాయి. దీంతో పాటుగా జీవితాలు నాశనం చేసే బెట్టింగ్ కూడా పురివిప్పింది. బెట్టింగ్ కారణంగా ఇల్లు గుల్లయినా, అప్పులుపాలైపోయినా కొందరు అదేం పట్టించుకోకుండా పోయిన చోటే వెతుక్కోవాలనే సామెతను అనుసరిస్తూ మళ్లీ ఆ ఊబిలోకి దిగేస్తున్నారు. మంగళవారం ప్రారంభమైన పోటీలు ఏప్రిల్ 3వ తేదీ వరకు జరగనున్నాయి. మొన్నటి వరకు నగరాలకే పరిమితమైన బెట్టింగ్ స్మార్ట్ ఫోన్ల పుణ్యమా అని పల్లెలకు పాకేసింది. బుకీలు ఈనెల మొదటి నుంచే బెట్టింగ్‌లు కాసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ క్రమంలో ప్రపంచకప్ పోటీలు ముగిసేనాటికి ఎందరి బతుకులు తలకిందులవుతాయో? ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారుతాయో అన్న ప్రశ్న అందరిలో చర్చనీయాంశంగా మారింది. నెల్లూరు(క్రైమ్) : కొంతకాలంగా టీ20 క్రికెట్ మ్యాచ్‌లకు అభిమానుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది. గతంలో ఇరుదేశాల మధ్య వన్డే మ్యాచ్ అంటే సుమారు 10 గం టల పాటు టీవీల వద్ద కూర్చొని ఫలితాల కోసం ఎదురుచూడాల్సి వచ్చేది. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. టీ20 మ్యాచ్‌లతో కేవలం రెండున్నర గంటల వ్యవధిలోనే జట్ల భవితవ్యం తేలిపోతోంది. దీంతో బెట్టింగ్ కాసేందుకు ఊత్సాహం చూపుతున్నారు. సంపన్నుల నుంచి.. రోజువారి కూలీవరకు.. గతంలో కేవలం వన్డే మ్యాచ్‌లు, ప్రపంచకప్ పోటీలపై మాత్రమే పందేలు కాసేవారు. టీ20 మ్యా చ్‌లు రావడంతో పరిస్థితి మారింది. స్మార్ట్ఫోన్ల కారణంగా ఎక్కడున్నా స్కోర్ల వివరాలు సులువుగా తెలుస్తుండటంతో పందెంరాయుళ్లు వ్యవహారాన్నంతా ఫోన్ల ద్వారానే జరిపిస్తున్నారు. సంపన్నవర్గాల కు చెందిన వారే కాకుండా మధ్యతరగతి, దినసరి కూ లీలు, ఆటోవాలాలు, హోటల్సర్వర్లుతో పాటు అనేకవర్గాల వారు పందేలకు అలవాటుపడి విలువైన జీవితాలను చిధ్రం చేసుకొంటున్నారు. రూ.లక్షల్లో పందేలు కడుతున్నారు. పందేల్లో సరస్వస్వం కోల్పోయినప్పటికి అప్పులు తెచ్చి మరీ ఫణంగా పెడుతూ నడిరోడ్లపై పడుతున్నారు. మరికొందరు అప్పులు తీర్చలేక ఆత్మహత్యాయత్నాలు, దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇంకొందరు ఊర్లు విడిచి పారిపోతున్నారు. యువతే లక్ష్యంగా..... యువత, విద్యార్థులే లక్ష్యంగా క్రికెట్‌బుకీలు పావులు కదుపుతున్నారు.వారికి లేని పోని ఆశలు చూపి బెట్టింగ్‌వైపు ఆకర్షితులను చేస్తున్నారు. బెట్టింగ్‌లో నగదు కోల్పోయిన యువతే ఎక్కువగా నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు అంచనా.గతంలో జరిగిన పలు సం ఘటనలు ఊదాహరణగా నిలుస్తోన్నాయి.ఇది ఇలా ఉంటే ప్రపంచకప్ పోటీలు పదోతరగతి విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.ఓవైపు పరీక్షలు, మరోవైపు ప్రాణప్రదమైన క్రికెట్ పోటీలు జరగుతుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నెల్లూరు నగరానికి చెందిన కొందరు బుకీలుగా అవతారమెత్తారు. ఇతరప్రాంతాల్లో పాగావేసి జిల్లా వ్యాప్తంగా సబ్‌బుకీలను ఏర్పాటు చేసుకొని విచ్చలవిడిగా బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. గతంలో పోలీ సు అధికారులు విసృ్తతంగా దాడలు చేయడంతో కొంతమేర పందేలకు బ్రేక్‌పడింది. అయితే ఇటీవల తిరిగి ఊపందుకున్నాయి. ఒక్కో మ్యాచ్‌కు రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల మేర బెట్టింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జోరుమీద ఉన్న బుకీల దూకుడు కు పోలీసులు ఏమాత్రం కళ్లెం వేస్తా రో వేచి చూడాల్సిందే. బెట్టింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు.. క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడేవారిపై చర్యలు తీసుకొంటాం. ఇప్పటికే మా వద్ద బుకీల సమాచారం ఉంది. వారిపై నిఘా ఉం చాం. ప్రజలు తమ ప్రాంతాల్లో బెట్టింగ్ నిర్వహిస్తే సమాచారం అందించాలి. వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తాం. జి.వెంకటరాముడు, డీఎస్పీ -
విశాఖలో బెట్టింగ్ గుట్టు రట్టు
విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో ఓ క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టైంది. ఆదివారం జరిగిన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా టీ-20 మ్యాచ్ పై బెట్టింగ్ చేస్తుండగా పోలీసులు బెట్టింగ్ సెంటర్ పై దాడి చేసి పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరుబుకీలను అరెస్టు చేశారు, 10 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్, టీవీ లతో పాటు.. రూ.1.08 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. -
మూలాలపై నిఘా
ఫేవ‘రేట్’ కట్టేదెవరు? బెట్టింగ్ దందాల్లో కీలకంగా రేష్యో ఇప్పటి వరకు చిక్కింది పాత్రధారులే సూత్రధారుల కోసం సాగుతున్న దర్యాప్తు సిటీబ్యూరో: దేశంలోనే కాదు... ప్రపంచ వ్యాప్తంగా ఏ రెండు జట్ల మధ్య క్రికెట్ జరుగుతున్నా... నగరంలో బెట్టింగ్ దందా ఊపందుకుంటోంది. హైటెక్ పరిజ్ఞానం వినియోగిస్తూ, వ్యవస్థీకృతంగా ఈ వ్యవహారాలు నడిపిస్తున్న పాత్రధారులు పలువురిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. బెట్టింగ్ దందాలో అత్యంత కీలకంగా పరిగణించే రేష్యో, ఫేవరెట్ల నిర్ధారణ మాత్రం పోలీసులకు అంతు చిక్కట్లేదు. ఈ నేపథ్యంలోనే దీనిపై పోలీసు విభాగం ప్రత్యేకంగా దృష్టి సారించింది. గడిచిన నెల రోజుల్లో చిక్కిన రెండు ముఠాలూ... తమకు రేష్యోను ఢిల్లీకి చెందిన అగర్వాల్ చెప్తున్నాడని వెల్లడించడంతో అతడి కోసం వేట ముమ్మరం చేశారు. వ్యక్తుల నుంచి వ్యవస్థీకృతంగా... ఒకప్పుడు క్రికెట్ బెట్టింగ్ దందాను బుకీలు (పందాలు స్వీకరించే వ్యక్తులు) ఎవరికి వారుగా చేసుకునే వారు. టీవీల్లో వచ్చే మ్యాచ్ ఆధారంగా ఫలానా టీమ్ గెలుస్తుందనో, ఓడుతుందనో పంటర్ల (పందెం కాసే వాళ్లు) నుంచి బెట్టింగ్స్ స్వీకరించారు. ఇటీవల కాలంలో ఈ వ్యవహారం వ్యవస్థీకృతంగా మారిపోయింది. గత నెల 23న, ఈ నెల మొదటి వారం ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ అదుపులోకి తీసుకున్న రెండు ముఠాలూ ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నా యి. ఆధునిక పరికరాలు, బ్రాంచ్ కార్యాలయాలు, కలెక్షన్ ఏజెంట్లను పెట్టుకుని మరీ నడిపిస్తున్నట్లు స్పష్టమైంది. దీంతో టాస్క్‌ఫోర్స్ పోలీసుల సాధారణ నిఘాతో పాటు సాంకేతిక నిఘాకు పని చెప్పారు. ‘పై నుంచే’ ఫేవరెట్, రేష్యో... ఇలా ఆధునిక పంథాలో పందాలు నిర్వహించడంలో ఫేవరెట్ టీమ్ ఎంపిక, రేష్యో నిర్ధారణ అత్యంత కీలకంగా మారాయి. మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఏ స్థాయిలో ఏ జట్టుపై ఎంత రెట్టింపు ఆఫర్ ఇవ్వాలి? ఎంత మొత్తం అదనంగా చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకోవాలి అంశాలు రేష్యోలో ఉంటాయి. అలాగే ఏ జట్టు ఫేవరెట్ టీమ్ అనేది నిర్థారించడమూ కీలకాంశమే. ఫేవరెట్ జట్టుపై పందాలు కాసే వాళ్లకు తాము గెలిచినప్పుడు వచ్చే మొత్తం తక్కువగా ఉంటుంది. ఇప్పటి వరకు చిక్కిన వారందరూ ఈ వివరాలు ‘పై నుంచి’ వస్తున్నాయని మాత్రమే చెప్పగలిగారు. ఢిల్లీ, ముంబై, రాజస్థాన్, గుజరాత్‌ల్లో ఉన్న తమ ఏజెంట్లకు నెలనెలా కొంత మొత్తం చెల్లిస్తామని, వారే అంతర్జాతీయ స్థాయిలో జరిగే మ్యాచ్‌ల రేఫ్యో, ఫేవరెట్స్ చెప్తుంటారని వారు పేర్కొన్నారు. అరెస్టయితే ఫోన్ ‘కట్’... సిటీలో ఉన్న బుకీలకు రేష్యో, ఫేవరెట్స్ చెప్పే ఏజెంట్లు అంతా కేవలం ఫోన్ల ద్వారా పరిచయమైన వారే. వీరిలో ఏ ఒక్కడూ ఇతర రాష్ట్రాల్లో ఉండే ఆ ఏజెంట్లను ప్రత్యక్షంగా చూసిందిలేదు. దీంతో వారు చెప్పిన పేరే అసలుదని నమ్ముతున్నారు. ఫోన్ల ద్వారా వివరాలు చెప్పడం, బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయించుకోవడం ఏజెంట్ల వ్యవహారంగా మారిపోయింది. వీరు ఒక్కో బుకీతో వ్యవహారాలు నెరపడానికి ఒక్కో ఫోన్ నెంబర్ వాడతారు. ఈ సిమ్‌కార్డులతో పాటు బ్యాంకు ఖాతాలు నకిలీ వివరాలతోనే తీసుకుంటారు. సదరు బుకీ పోలీసులకు చిక్కాడని తెలిస్తే... అతడితో సంప్రదింపులు జరపడానికి వినియోగించిన సిమ్‌ను ధ్వం సం చేసేస్తారు. ఆ బ్యాంక్ ఖాతా వాడదు. దీంతో పాత్రధారుల దగ్గరే అరెస్టుల పర్వం ఆగిపోవాల్సి వస్తోంది. ఎవరీ అగర్వాల్..? ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేసిన రెండు ముఠాల విచారణలోనూ అగర్వాల్ పేరు వెలుగులోకి వచ్చింది. తాము ఢిల్లీకి చెందిన అగర్వాల్ నుంచి రేష్యో, ఫేవరెట్ తెలుసుకుంటామని చెప్పారు. దీంతో ఈ ఇద్దరు అగర్వాల్స్ ఒకరేనా? అనే కోణంపై పోలీసు లు దృష్టి పెట్టారు. మరోపక్క రేష్యో, ఫేవరెట్స్‌ను ముందే నిర్ధారించేస్తున్న నేపథ్యంలో ఇందులో మ్యాచ్ ఫిక్సింగ్, మాఫియా కోణాలు ఉన్నాయా? అనే అంశా న్నీ పరిగణలోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరాదికి చెందిన ఏజెంట్లు దొరికితే తప్ప వీటి మూలాలు వెలుగులోకి రావని అధికారులు పేర్కొంటున్నారు. -
మరో ఆసీస్ మహిళా క్రికెటర్ పై నిషేధం
బెట్టింగ్‌కు పాల్పడినందుకు శిక్ష సిడ్నీ: బెట్టింగ్‌కు పాల్పడినందుకు ఆస్ట్రేలియాకు చెందిన మరో మహిళా క్రికెటర్ నిషేధానికి గురైంది. బిగ్‌బాష్ టి20 లీగ్‌లో పెర్త్ స్కార్చర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన 19 ఏళ్లీ పీపా క్లీరీపై ఆరు నెలల నిషేధం విధిస్తున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది. ఇటీవల ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పురుషుల జట్ల మధ్య అడిలైడ్‌లో జరిగిన డే అండ్ నైట్ టెస్టు మ్యాచ్‌పై క్లీరీ 15.5 ఆస్ట్రేలియన్ డాలర్ల (దాదాపు రూ. 758) అతి స్వల్ప మొత్తానికి పందెం కాసింది. బోర్డుతో కాంట్రాక్ట్ ఉన్న ప్లేయర్లు బెట్టింగ్‌కు పాల్పడటం నిబంధనలకు విరుద్ధం. బెట్టింగ్ విషయంలో క్రికెటర్లకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తరహా వ్యవహారాలను సహించబోమని సీఏ అవినీతి వ్యతిరేక విభాగం అధికారి ఇయాన్ రాయ్ స్పష్టం చేశారు. గతేడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్‌పై బెట్టింగ్ కాసి పట్టుబడిన ఆస్ట్రేలియాకు చెందిన మరో మహిళా క్రికెటర్ ఏంజెలా రీక్స్ కూడా ప్రస్తుతం నిషేధం ఎదుర్కొంటోంది. -
మహిళా క్రికెటర్‌పై నిషేధం
సిడ్నీ: ఇటీవల ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్ సందర్భంగా ఓ మహిళా క్రికెటర్ అమితోత్సాహం చూపించింది. తాను క్రీడాకారణి అనే సంగతిని కూడా మరచి బెట్టింగ్ పాల్పడింది. ఆస్ట్రేలియాలో జరిగే మహిళా బిగ్ బాష్ లీగ్ లో పెర్త్ స్కార్చర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించే పీపా క్లీరే(19) పదకొండు డాలర్లను( సుమారు రూ.700) బెట్టింగ్ వేసింది. ఇటీవలే ఈ విషయం బయటపడటంతో ఆస్ట్రేలియాలోని ఏ క్రికెట్ లోని పాల్గొనే అవకాశం లేకుండా ఆరు నెలల పాటు నిషేధానికి గురైంది. మరోవైపు ఆమె బెట్టింగ్ ఘటనపై బిగ్ బాష్ లీగ్ కూడా తీవ్రంగా స్పందించింది. ఆమెను 18 నెలల పాటు బిగ్ బాష్ నుంచి సస్పెండ్ చేసింది. గతేడాది డిసెంబర్ లో ఆసీస్ మహిళా క్రికెటర్ రీక్స్ బెట్టింగ్ పాల్పడి రెండేళ్ల నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌పై 9 డాలర్లు పందెంగా కాసి చిక్కుల్లో పడింది. చిన్నమొత్తంలో బెట్టింగ్ లు వేసి తమ క్రికెట్ జీవితాన్నిపణంగా పెట్టడం ఆసీస్ క్రికెట్ లో కలకలం రేపుతోంది. -
బెట్టింగ్ బంగార్రాజులు!
‘గ్రేటర్’ ఎన్నికల నేపథ్యంలో పెరిగిన వ్యవహారాలు నగర వ్యాప్తంగా స్పెషల్ టీమ్స్ నిఘా ఆన్లైన్ వ్యవహారాల పైనా దృష్టి సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ ఘట్టం పూర్తయింది. పందెం రాయుళ్లకు పని పెరిగింది. దీంతో పోలీసులు బెట్టింగ్ వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరించారు. ఈసారి పోలింగ్ ఆశించిన స్థాయిలో లేకపోవడం.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల నేపథ్యంలో పందాలు జోరందుకుంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోపక్క ఆన్లైన్ బెట్టింగుల పైనా నిఘా ఉంచాలని నిర్ణయించారు. వీటి నిర్వాహకులకు చెక్ చెప్పడానికి హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్, సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ) పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ‘గ్రేటర్’ పరిధిలోని 150 డివిజన్లకు పోలింగ్ పూర్తయి... అభ్యర్థుల భవిత ఈవీఎంలలోకి చేరింది. దీంతో నాయకులంతా ఎక్కడిక్కడ గెలుపోటముల లెక్కల్లో బిజీ అయిపోయారు. మంగళవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌తో పందెంరాయుళ్ల పల్స్ మారింది. దీంతో బుకీలు బెట్టింగులకు తెరలేపారు. కౌంటింగ్‌కు మరో రెండు రోజుల గడువు ఉండటంతో బెట్టింగ్స్ పెరిగే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. వివిధ పార్టీల చోటా నేతలతో సహా అనేక మంది రూ.లక్షల్లో బెట్టింగులకు పాల్పడతారని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఈ వ్యవహారం జోరుగా సాగుతోందనే సమాచారం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. అభ్యర్థుల ఖర్చు కంటే ఎక్కువగానే బెట్టింగులు పెడుతున్నట్టు పోలీసులు అంచనా. డివిజన్ నుంచి మెజారిటీ వరకు... ఈసారి బెట్టింగుల్లో కొన్ని ప్రత్యేకతలు కనిపిస్తున్నాయి. అభ్యర్థుల గెలుపోటముల పైనే కాకుండా... వారికి లభించే మెజారిటీ ఎంత? రెండో స్థానంలో ఎవరుంటారు? మొత్తమ్మీద గ్రేటర్లో ఏఏ పార్టీలు ఎలా ఉంటాయి? ఫలానా పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయి? అనే అంశాలపైనా జోరుగా పందా లు కడుతున్నారు. మరోపక్క రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పందాలరాయుళ్లతో ఫోన్లో టచ్‌లో ఉంటున్న బుకీలు గ్రేటర్ ఎన్నికలపై ఆన్లైన్ బెట్టింగ్స్ నిర్వహిస్తున్నారు. వీ టిపై దృష్టి పెట్టిన జంట కమిషనరేట్ల పోలీ సులు నిఘా ముమ్మరం చేశారు. బుకీల ఆట కట్టించడానికి చర్యలు తీసుకుంటున్నారు. స్థా నిక పోలీసులతో పాటు టాస్క్‌ఫోర్స్, ఎస్ఓటీ అధికారులూ వేగులను అప్రమత్తం చేశారు. ఈ ప్రాంతాల్లోనే అధికం... శివార్లలోని అత్తాపూర్, శంషాబాద్, సరూర్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్‌లతో పాటు నగరంలోని బేగంబజార్, కాచిగూడ, సికిం ద్రాబాద్, అబిడ్స్, మోతీనగర్, ఎస్సార్ నగర్, దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాలు బెట్టింగ్ వ్యవహారాలకు కేంద్రాలుగా ఉన్నాయి. వీటికి తోడు నగరం బయట ఉన్న అనేక గెస్ట్‌హౌస్‌లు, ఫామ్ హౌస్‌లు బుకీలకు వేదికలుగా మారుతున్నాయని పోలీసుల అనుమానం. పార్టీ, అభ్యర్థి, డివిజన్లను బట్టి ఈ పందాల్లో 1:1 నుంచి 1:10 వరకు ఇచ్చేలా బుకీలు ఆకర్షిస్తున్నారు. ముంబయికి చెందిన కొందరు బుకీలు సైతం రంగంలోకి దిగారని తెలుస్తోంది. దీంతో ఇప్పటికే ఈ తరహా కేసుల్లో అరెస్టయి... బెయిల్‌పై విడుదలైన వారిపై డేగకన్ను వేసి ఉంచారు. బెట్టింగ్ పరిభాషలో పందాలు కాసే వారిని పంటర్లని, వీటిని నిర్వహించే వారిని బుకీలని సంబోధిస్తారు. అత్యంత గుట్టుగా వ్యవహారాలు సాగించే ‘కాయ్ రాజా’ల ఆట కట్టించడానికి ప్రజల సహకారం ఎంతో కీలకమని పోలీసులు చెబుతున్నారు. బెట్టింగ్ ముఠా లు, బుకీలకు సంబంధించిన సమాచారం తెలిస్తే తమకు అందించాలని కోరుతున్నారు. ఇలా సమాచారం ఇచ్చిన వారి పేర్లు, వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇస్తున్నారు. ‘100’తో పాటు పోలీసు వెబ్సైట్లలోని నెంబర్లకు ఫోన్ చేసి, అధికారిక వాట్సాప్‌ల్లో పోస్ట్ చేయడం ద్వారా బెట్టింగ్ వ్యవహారాలను తమకు తెలియజేయవచ్చని కోరుతున్నారు. బెట్టింగ్ దందా చట్ట విరుద్ధమే కాకుండా పరోక్షంగా అనేక కుటుంబాలను రోడ్డున పడేస్తుందన్నారు. -
హైటెక్ బెట్టింగ్స్!
మూసధోరణి వీడిన వ్యవస్థీకృత ముఠాలు హాట్‌లైన్ బాక్సులు, రికార్డర్లతో వ్యవహారం మూడు రోజుల్లో పట్టుబడిన రెండు గ్యాంగ్స్ సిటీబ్యూరో: భారత్‌లో జరిగే లేదా భారత్ ఆడే క్రికెట్ మ్యాచ్‌లు జరిగే సమయంలోనే బెట్టింగ్ నిర్వహించడం... టీవీ, పంటర్ల వివరాలు రాసుకోవడానికి రికార్డులు, ఫోన్లు... ఒకప్పుడు బెట్టింగ్స్ నిర్వహించే ముఠాల వ్యవహార శైలి ఇది. 365 రోజులూ పని చేసే డెన్లు... ప్రపంచంలో ఎక్కడ మ్యాచ్ జరిగినా పందాలు స్వీకరించడం.... ల్యాప్‌టాప్‌లు, హాట్‌లైన్ బాక్సులు, వాయిస్ రికార్డర్లు... ఇదీ నేటి బెట్టింగ్ రాయుళ్ల హైటెక్ పంథా. పోలీసు విభాగమే కాదు... అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే ముఠాలు సైతం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నాయి. ‘సమకాలీన’ అవసరాలకు తగ్గట్టు మార్పుచేర్పులు సంతరించుకుంటున్నాయి. పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు మూడు రోజుల వ్యవధిలో అరెస్టు చేసిన రెండు బెట్టింగ్స్ గ్యాంగ్స్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ రెండు ముఠాలూ భారత్‌తో ఎలాంటి సంబంధం లేని, ఆస్ట్రేలియాలో జరుగుతున్న అక్కడి దేశవాళీ మ్యాచ్‌లకు పందాలు నిర్వహిస్తూ చిక్కినవే. ముఖేష్‌శర్మ... ‘హాట్ హాట్ హాట్’ చార్మినార్‌లోని చిల్లాపురకు చెందిన ముఖేష్‌శర్మ నేతృత్వంలో సాగుతున్న ఈ ముఠాను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. కొన్నేళ్లుగా ‘ఇదే వృత్తి’లో కొనసాగుతున్న ఇతగాడు మరో ఐదుగురితో కలిసి ముఠా ఏర్పాటు చేసి బెట్టింగ్స్ నిర్వహిస్తున్నాడు. దీనికోసం మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన మనోజ్ నుంచి మూడు హాట్‌లైన్ బాక్సులు సమీకరించుకున్నాడు. ఒక్కో బాక్సులో గరిష్టంగా 10 సెల్ఫోన్ల అనుసంధానించే అవకాశం ఉంది. ఆ ఫోన్లలో కేవలం పంటర్లతో మాట్లాడటానికి వినియోగించే సిమ్‌కార్డుల్ని మాత్రమే వేస్తారు. ఆ పది మందీ ఒకేసారి ఫోన్ చేసి మాట్లాడాలని ప్రయత్నించినా... అవన్నీ హాట్‌లైన్ బాక్సులో రికార్డు అయిపోతాయి. ఎంత పందెం కాశారు? ఏ జట్టు వైపు కాశారు? అనేవి తెలుసుకోవడానికి, ఆట ముగిశాక లావాదేవీల ఆధారంగానూ ఆ రికార్డింగ్స్ ఉపకరిస్తాయని నిందితులు వెల్లడించారు. కుల్దీప్సింగ్ ‘రికార్డ్’... మంగళ్‌హాట్‌కు చెందిన కుల్దీప్సింగ్ నేతృత్వంలో మరో నలుగురితో ఏర్పాటైన గ్యాంగ్‌ను బుధవారం పట్టుకున్నారు. వీరి నుంచి టీవీ, సెట్‌టాప్ బాక్సులు తదితరాలతో పాటు ప్రముఖ కంపెనీకి చెందిన ఓ వాయిస్ రికార్డర్‌ను స్వాధీనం చేసుకున్నారు. పాత, కొత్త పంటర్ల నుంచి పందాలు అంగీకరిస్తున్న ఈ గ్యాంగ్ వారి నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌ను రికార్డు చేయడానికి దీన్ని వినియోగిస్తోంది. ఈ వాయిస్ రికార్డర్‌ను కేవలం ఒక ఫోన్‌కు మాత్రమే కనెక్ట్ చేసే అవకాశం ఉంది. దాని ద్వారానే ఈ ముఠా.. పంటర్లకు కాల్ చేస్తూ, వారి నుంచి వచ్చే ఫోన్లు రిసీవ్ చేసుకుంటూ ఆధారాలు భద్రపరుచుకోవడం ప్రారంభించిందని టాస్క్‌ఫోర్స్ అధికారులు గుర్తించారు. బంజారాహిల్స్‌లోని ఓ కంపెనీలో పని చేస్తున్న కుల్దీప్... వచ్చే జీతం కుటుంబ పోషణకు సరిపోకపోవడంతో ‘అదనపు ఆదాయం’ కోసం వ్యవస్థీకృత బెట్టింగ్ ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు. ల్యాప్టాప్స్, ఏజెంట్స్ సైతం... ఈ రెండు ముఠాలకూ మరో ప్రత్యేకత ఉంది. ముఖేష్ గ్యాంగ్ పంటర్ల (పందాలు కాసే వ్యక్తులు) జాబితాను భద్రపరచడానికి, లావాదేవీలు చేయడానికి ల్యాప్టాప్స్ వినియోగిస్తోంది. ఆట ముగిసిన తర్వాత నగదు వసూలు, చెల్లింపుల కోసం ప్రత్యేకంగా ఏజెంట్లను సైతం ఏర్పాటు చేసుకుంది. కుల్దీప్ ముఠా ఈ కోణంలో మూసధోరణిలోనే ఉండి ఇంకా స్లిప్పులు, పుస్తకాలు నిర్వహిస్తుండగా... పంటర్లను గుర్తించడానికి మాత్రం ఏజెంట్లను పెట్టకుంది. -
'కోడి పందాలకు బ్రేక్ వేస్తున్నాం'
-
'కోడి పందాలకు బ్రేక్ వేస్తున్నాం'
హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగే కోడి పందాల నిర్వహణ అంశంపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. కోడి పందాలు నిర్వహించకుండా ఇప్పటికే చర్యలు ప్రారంభించామని ప్రభుత్వం తెలిపింది. హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. కోడి పందాల నిర్వహణకు ఎవ్వరికీ అనుమతినిచ్చే ప్రసక్తే లేదని హైకోర్టు గత విచారణలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి కోడి పందాలను నిర్వహించినా, జూదం ఆడినా తగిన చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల ఎస్పీలకు గత ఏడాది జారీ చేసిన ఆదేశాలను రాతపూర్వకంగా తమ ముందుంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పశ్చిమ గోదావరి జిల్లాలో చట్టాలను ఉల్లంఘించి సంక్రాతి సందర్భంగా పెద్ద ఎత్తున కోడి పెందాలు నిర్వహిస్తున్నారని, ఈ పోటీల్లో సంఘ వ్యతిరేక శక్తులు పాల్గొంటున్నా కూడా పోలీసులు పట్టించుకోవడం లేదని అదే జిల్లాకు చెందిన నరహరి జగదీష్‌కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో గత ఏడాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం ప్రభుత్వ వివరణ కోరగా, కోడి పందాల నిర్వహణకు తాము ఎవ్వరికీ అనుమతులు ఇవ్వలేదని, పందాలు నిర్వహించినా, జూదం ఆడినా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల ఎస్పీలకు ఆదేశాలిచ్చామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీనిని రికార్డ్ చేసుకున్న ధర్మాసనం ఈ వ్యాజ్యంపై విచారణను ముగిస్తూ ఉత్తర్వులిచ్చింది. తాజాగా ఆ వ్యాజ్యంలో పిటిషనర్ మరో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. సంక్రాంతి సందర్భంగా మళ్లీ కోడి పందాల నిర్వహణకు పెద్ద సంఖ్యలో ఏర్పాట్లు జరుగుతున్నాయని, పోలీసులు తగిన విధంగా స్పందించడం లేదని పిటిషనర్ వివరించారు. ఈ నేపథ్యంలో కోడి పందాలు నిర్వహించకుండా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. -
కోడిపందాల నిర్వహణకు బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాల నిర్వహణకు ఎవ్వరికీ అనుమతినిచ్చే ప్రసక్తే లేదని హైకోర్టు మంగళవారం తేల్చి చెప్పింది. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి కోడి పందాలను నిర్వహించినా, జూదం ఆడినా తగిన చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల ఎస్పీలకు గత ఏడాది జారీ చేసిన ఆదేశాలను రాతపూర్వకంగా తమ ముందుంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 31కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బీ బొసాలే, జస్టిస్ ఎస్వీ భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో చట్టాలను ఉల్లంఘించి సంక్రాతి సందర్భంగా పెద్ద ఎత్తున కోడి పెందాలు నిర్వహిస్తున్నారని, ఈ పోటీల్లో సంఘ వ్యతిరేక శక్తులు పాల్గొంటున్నా కూడా పోలీసులు పట్టించుకోవడం లేదని అదే జిల్లాకు చెందిన నరహరి జగదీష్‌కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో గత ఏడాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దీనిపై ధర్మాసనం ప్రభుత్వ వివరణ కోరగా, కోడి పందాల నిర్వహణకు తాము ఎవ్వరికీ అనుమతులు ఇవ్వలేదని, పందాలు నిర్వహించినా, జూదం ఆడినా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల ఎస్పీలకు ఆదేశాలిచ్చామని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీనిని రికార్డ్ చేసుకున్న ధర్మాసనం ఈ వ్యాజ్యంపై విచారణను ముగిస్తూ ఉత్తర్వులిచ్చింది. తాజాగా ఆ వ్యాజ్యంలో పిటిషనర్ మరో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. సంక్రాంతి సందర్భంగా మళ్లీ కోడి పందాల నిర్వహణకు పెద్ద సంఖ్యలో ఏర్పాట్లు జరుగుతున్నాయని, పోలీసులు తగిన విధంగా స్పందించడం లేదని పిటిషనర్ వివరించారు. ఈ వ్యాజ్యంపై మంగళవారం విచారణ జరిపిన ధర్మాసనం కోడి. -
9 డాలర్ల బెట్టింగ్: మహిళా క్రికెటర్ సస్పెన్షన్
సిడ్నీ: ఈ ఏడాది ఆరంభంలో జరిగిన క్రికెట్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాకు చెందిన ఓ మహిళా క్రికెటర్ స్వల్ప మొత్తంలో బెట్టింగ్ కు పాల్పడి రెండు సంవత్సరాల పాటు బహిష్కరణకు గురైంది. వివరాల్లోకి వెళితే.. వన్డే వరల్డ్ కప్ లో భాగంగా మార్చి 29వ తేదీన ఆసీస్-కివీస్ ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ పై ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ అంజెలా రీక్స్ కేవలం 9 డాలర్లు పందెం కాసింది. అది కూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ఎవరు గెలుస్తారనే దానిపై బెట్టింగ్ వేసింది. అది ఆమె సరదాగా చేసినట్లు మనకు కనబడుతున్నా.. దీనిపై ఆస్ట్రేలియా క్రికెట్ అవినీతి నిరోధక శాఖ మాత్రం సీరియస్ గా దృష్టి పెట్టింది. ఈ ఘటనపై విచారణ జరిపిన అనంతరం అంజెలా తప్పు చేసినట్లు ధృవీకరించింది. దీంతో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఆమెను తీవ్రంగా మందలించిన పిదప రెండు సంవత్సరాల పాటు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మహిళల బిగ్ బాష్ లీగ్ లో సిడ్నీ సిక్సర్స్ తరపున రీక్స్ ఆడుతుంది. ఇది మిగతా క్రికెటర్లు ఒక గుణపాఠం ఉంటుందని క్రికెట్ ఆస్ట్రేలియా ఇంటిగ్రిటీ యూనిట్ చీఫ్ ఇవాన్ రాయ్ తెలిపారు. ఏ ఫార్మెట్ క్రికెట్ అయినా బెట్టింగ్ అనేది నేరమే కాబట్టి జాతీయ స్థాయి క్రికెటర్లు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. -
62మంది జూదరుల అరెస్టు
రూ. 42 వేలు, 24 సెల్ఫోన్లు స్వాధీనం తాండూరు రూరల్: తాండూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో పేకాటాడుతున్న 62 మందిని అరెస్టు చేసినట్లు కరన్‌కోట్ ఎస్ఐ విజయ్‌కుమార్‌గౌడ్ గురువారం తెలిపారు. వివరాలు.. బుధవారం రాత్రి కార్తీక పౌర్ణమి సందర్భంగా మండలంలోని అల్లాపూర్, గౌతపూర్, గోపన్‌పల్లి ,సంగెంకాలన్, చెంగోల్, కరన్‌కోట్ గ్రామాల్లో పేకాటాడుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేశారు. ఈక్రమంలో 62 మందిని అరెస్టు చేసి రూ.42 వేలు, 24 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. మరో ఘటనలో ఎనిమిది మంది.. పెద్దేముల్: పోలీసులు ఎనిమిది మంది జూదరులను అరెస్టు చేశారు. ఈ సంఘటన గురువారం పెద్దేముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ఐ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి పెద్దేముల్ మండల కేం ద్రంలో దుర్గా వైన్స్ పక్కన అదే గ్రామానికి చెందిన ఎనిమిది మంది పేకాటాడుతుండగా పోలీసులు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.6,830 నగదునుస్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కోడిపందెం శిబిరాలపై పోలీసుల దాడి
కంకిపాడు (కృష్ణా): కోడిపందెం శిబిరాలపూ పోలీసులు దాడి చేసి పందెం రాయుళ్లను అరెస్టు చేశారు. ఈ సంఘటన కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకంది. మండలంలోని మారేడుమాకలో కోడిపందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు శిబిరంపై దాడి చేసి 9 మందిని అరెస్టు చేశారు. సంఘటనా స్థలంలో ఉన్న పది బైకులు, రూ. 2,420 నగదు స్వాధీనం చేసుకున్నారు. -
క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు
13 మంది అరెస్టు రూ.26.48 లక్షల నగదు సీజ్ బెట్టింగ్‌కు వాడిన పరికరాలు, ఫోన్లు స్వాధీనం హైదరాబాద్ కేంద్రంగా ఐదు రాష్ట్రాల్లో బెట్టింగ్ నాంపల్లి: నగరంలో గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న అంతర్రాష్ట క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. తూర్పు మండలం టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి పర్యవేక్షణలో ఏకకాలంలో మూడు ప్రదేశాల్లో దాడులు చేసి 13 మందిని అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.26,48,500 నగదును సీజ్ చేశారు. బెట్టింగ్ నిర్వహణ కోసం వినియోగించిన లైన్ బాక్సులతో కూడిన నాలుగు సి.డి.ఎం.ఎ సెల్ఫోన్లు, తొమ్మిది లైన్ ఫోన్లు, ఆరు ల్యాప్‌టాప్‌లు, మూడు టెలివిజన్లు, 36 సెల్ఫోన్లు, మూడు సెటప్ బాక్సులు, రెండు మౌత్ స్పీకర్లు స్వాధీనం చేసుకున్నారు. బుధవారం బషీర్‌బాగ్‌లోని నగర పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రికెట్ బెట్టింగ్ ముఠా వివరాలను నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. రెండు రోజుల క్రితం సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్ జరిగింది. సత్య ప్రకాష్ జిందాల్ అలియాస్ నక్కు అనే వ్యక్తికి క్రికెట్ బెట్టింగ్‌ను నిర్వహించి అధికంగా సంపాదించాలని అనుకున్నారు. బెట్టింగ్ నిర్వహణ కోసం బ్రోకర్లు, సబ్ బ్రోకర్లను నియమించుకున్నారు. హైదరాబాద్‌ను ప్రధాన కేంద్రంగా ఏర్పాటుచేశారు. రాజస్థాన్‌కు చెందిన ఆషూ అనే కరుడుగట్టిన మోసకారి, క్రికెట్ బెట్టింగ్ ఏజెంటుతో సత్సంబంధాలు ఏర్పరచుకున్నారు. యువతను ఆకట్టుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎర చూపి ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా మ్యాచ్ వివరాలను వీక్షించే అవకాశం కల్పించారు. బెట్టింగ్ నిర్వహణను తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్, హర్యాన, రాజస్థాన్ రాష్ట్రాలకు విస్తరింపజేశారు. నాలుగు రాష్ట్రాల్లో పెద్ద మొత్తంలో వ్యాపారం కొనసాగించి లక్షల్లో ధనాన్ని పోగు చేశారు. పది లక్షల వరకు బెట్టింగ్ కట్టే వారిని తన వద్ద ఉంచుకుంటారు. ఆ పైబడిన మొత్తాన్ని చెల్లించే వారిని రాజస్థాన్‌లో ఉన్న ఆషూను డీల్ చేయమంటారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ మ్యాచ్ ప్రారంభమైన సమయం నుంచి ముగిసే వరకు ఐదు సెషన్లుగా విభజిస్తారు. ఒక్కో సెషన్‌కు పది బాల్స్ కింద లెక్క క ట్టి బెట్టింగ్‌ను వసూల్ చేస్తారు. గెలుపోటములను బేరీజు వేస్తూ మరి కొందరి వద్ద బెట్టింగ్ ను నిర్వహిస్తారు. బెట్టింగ్ నిర్వహణ ద్వారా కమీషన్లను పొందుతారు. ఈ విషయాన్ని పసిగట్టిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు బెట్టింగ్ కేంద్రంపై దృష్టిసారించారు. సుల్తాన్ బజార్, షాహినాయత్ గంజ్, రాంగోపాల్‌పేట్ పోలీసుస్టేషన్ల పరిధిలో 13 మందిని అరెస్టు చేశారు. అరెస్టైయిన వారిలో సత్యప్రకాష్ జిందాల్ లియాస్ నక్కు కింద పనిచేసిన బ్రోకర్లు, సబ్ బ్రోకర్లు, అసిస్టెంట్లు గోవింద్‌రాఠి, జి.ప్రశాంత్‌కుమార్, ఎం.దిలీప్‌కుమార్, విజయ్ కుమార్ గోయెల్ అలియాస్ గోలు, రమేష్‌కుమార్ గోయెల్, లావనీస్ బన్సాల్, గోవిల్ మక్కార్, సాహిల్ ముంజాల్, ప్రిన్స్, కుమార్ కెవ్లీని, రాహుల్ కందాయ్, యశ్వంత్ సింగ్ ఉన్నారు. రాజస్థాన్‌కు చెందిన ఆషూ అనే వ్యక్తి పరారీలో ఉన్నారు. ఆషూను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ దాడుల్లో టాస్క్ఫోర్సు ఇన్స్పెక్టర్ సీహెచ్ శ్రీధర్, ఎస్సై ఎ.సుధాకర్, ఎస్ శేఖర్‌రెడ్డి, ఎ.రవి కుమార్, జి.రాజు, ఇతర కానిస్టేబుల్స్ పాల్గొన్నారు. -
బెట్టింగ్ స్థావరాలపై దాడి: రూ.26 లక్షలు స్వాధీనం
హైదరాబాద్: నగరంలో క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై బుధవారం సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో బెట్టింగ్ పాల్పడుతున్న 13 మందిని అరెస్టు చేశారు. పట్టుబడిన నిందితుల నుంచి రూ. 26 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను స్టేషన్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గంగూలీకి కీలక బాధ్యతలు
వర్కింగ్ గ్రూప్‌లో చోటు - లోధా కమిటీ నివేదికపై అధ్యయనం - వాడి వేడిగా ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో బెట్టింగ్‌కు సంబంధించి రెండు జట్లను నిషేధించాలంటూ జస్టిస్ లోధా కమిటీ ఇచ్చిన నివేదికపై బీసీసీఐ ఇప్పటికిప్పుడు చర్య తీసుకునే అవకాశం కనిపించడం లేదు. ఈ నివేదికను అధ్యయనం చేయడంతో పాటు వచ్చే ఐపీఎల్ నిర్వహణపై తగిన సూచనలివ్వాలంటూ నలుగురు సభ్యులతో బోర్డు కొత్తగా వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని సభ్యుడిగా ఎంపిక చేశారు. ఈ కమిటీలో ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లాతో పాటు బోర్డు కార్యదర్శి అనురాగ్ ఠాకూర్, కోశాధికారి అనిరుధ్ చౌదరి ఉన్నారు. బీసీసీఐ లీగల్ హెడ్ ఉషానాథ్ బెనర్జీ న్యాయపరమైన అంశాల్లో వీరికి సహకారం అందిస్తారు. కొత్తగా ఏర్పడిన వర్కింగ్ గ్రూప్‌నకు ఆరు వారాల గడువు ఇచ్చారు. ‘లోధా కమిటీ సూచనలను ఎలా అమలు చేయవచ్చో అధ్యయనం చేయడంతో పాటు ఐపీఎల్-9 కోసం ఈ కమిటీ రోడ్‌మ్యాప్ తయారు చేస్తుంది. ఐపీఎల్లో కనీసం ఎనిమిది జట్లు ఉండటం మాత్రం ఖాయం. ఆటగాళ్ల ప్రతినిధిగా సౌరవ్ గంగూలీకి ఇందులో చోటిచ్చాం. వచ్చే ఐపీఎల్‌కు ఇంకా చాలా సమయం ఉంది. కాబట్టి ఎలాంటి తొందరపాటు ప్రదర్శించకుండా మేం జాగ్రత్తగా, ఒక పద్ధతి ప్రకారంగా ఈ అంశంపై ఒక నిర్ణయానికి వస్తాం’ అని రాజీవ్ శుక్లా వెల్లడించారు. బీసీసీఐ ఇప్పటికే లోధా నివేదికను అంగీకరించిందని, వర్కింగ్ గ్రూప్ పేరుతో ఆ నివేదికను పక్కదారి పట్టించే ఎలాంటి పనులు చేయమని ఆయన స్పష్టం చేశారు. అలాంటి తప్పు మళ్లీ చేయవద్దు! ఆదివారం జరిగిన సమావేశంలో బోర్డు మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ రెండు జట్లను రద్దు చేయాలనే పట్టుబట్టారు. అయితే 2011లో ఇదే తరహాలో ఆవేశంగా స్పందించి కొచ్చి టీమ్‌ను రద్దు చేశామని, ఇప్పుడు ఆర్బిట్రేషన్ కొచ్చికి అనుకూలంగా తీర్పు ఇస్తూ రూ. 550 కోట్లు చెల్లించాలని చెప్పడం తమకు ఇబ్బందిగా మారిందని మరొక సభ్యుడు అన్నారు. నాడు శశాంక్ బోర్డు అధ్యక్షుడిగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘ఇప్పుడు టీమ్‌ను రద్దు చేస్తే చెన్నై కోర్టుకెక్కదని గ్యారంటీ ఏమిటి. క్రికెట్‌ను పట్టించుకోకుండా న్యాయపరమైన అంశాల కోసమే పోరాడుదామా’ అని ఈ సమావేశంలో ఆయన గట్టిగా ప్రశ్నించారు. ఐపీఎల్ జట్లకు రవిశాస్త్రి మద్దతు... లోధా కమిటీ నివేదికను చదవడానికి ఆరు వారాలు సమయం తీసుకుని కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం వివరాలను చెప్పడానికి కనీసం ఓ మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు. షెడ్యూల్ ప్రకారం తొలుత వివరాలు మీడియాకు వెల్లడించాలని భావించారు. అయితే ఈ సమావేశం వాడి వేడిగా సాగిందని సమాచారం. చెన్నై, రాజస్తాన్ జట్లపై తక్షణమే నిషేధం విధించాలనే ప్రతిపాదన రాగానే కౌన్సిల్ సభ్యుడు, భారత జట్టు డెరైక్టర్ రవిశాస్త్రి దీనిని వ్యతిరేకించారు. ‘లోధా కమిటీ నివేదిక వల్ల క్రికెటర్లు నష్టపోవడానికి వీల్లేదు. ఐపీఎల్ బ్రాండ్ విలువను పెంచడంలో చెన్నై కీలక పాత్ర పోషించింది. రాజ్ కుంద్రా చేసిన తప్పుకు ద్రవిడ్ శిక్ష అనుభవించడం కరెక్ట్ కాదు’ అని రవిశాస్త్రి వాదించారు. అయితే బోర్డు సెక్రటరీ అనురాగ్ ఠాకూర్ దీనితో విభేదించారు. దీంతో జట్లపై నిర్ణయాన్ని వాయిదా వేశారు. -
ఓ మై గాడ్!
అయ్యో మన దగ్గర కోడి పందేలు ఎలాగో... ఢిల్లీ శివార్లలో ‘శునకాల పోరు’ అలాగ. ఢిల్లీ శివార్లలోని ఫాంహౌజ్‌లలో ఈ శునకాల పోరుపై వేలాది రూపాయలు బెట్టింగ్ జరుగుతుంది. ఢిల్లీ వాసులు మాత్రమే కాదు... పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి కూడా శునకాల మీద పందేలు కాయడానికి ఎంతో మంది వస్తుంటారు. పరమ హింసాత్మకంగా సాగే ‘డాగ్ ఫైట్స్’లో రక్తం ఓడుతూ శునకాలు చనిపోతుంటాయి కూడా. శిక్షణ ఇవ్వడంలో భాగంగా శునకాలను రకరకాలుగా హింసిస్తుంటారు వాటి యజమానులు. ఫాంహౌజ్‌లలో ఈ ‘డాగ్ ఫైట్స్’ ఎక్కువగా జరుగుతుండడం వల్ల బాహ్యప్రపంచ దృష్టికి పెద్దగా రావడం లేదు. ‘‘దీనికి వెనుక పెద్ద రాకెట్ ఉంది. వారి పని పడతాం’’ అంటున్నారు కేంద్రమంత్రి మేనకాగాంధీ. ఆ పనేదో తొందరగా చేసి పుణ్యం కట్టుకోండి మేడమ్ జీ! -
ఎన్నికల బెట్టింగ్ ఫలితం
కున్న యువకుడు గౌరిబిదనూరు : ఎన్నికల సమయంలో ఆనేక చోట్ల గెలుపు ఓటమిలపైన బెట్టింగ్‌లు జరగడం సహజం. గ్రామీణ ప్రదేశాలలో గొర్రెలు, కోళ్ళు, డబ్బు, పందెంగా పెట్టడం విన్నాం అయితే ఒక యువకుడు తన అర గుండు, అర మీసాన్ని పణంగా పెట్టాడు. తాలూకాలోని నగరగెరె గ్రామంలోని అశ్వత్థనారాయణ పక్కా కాంగ్రెస్ కార్యకర్త. తన పార్టీ మద్దతు అభ్యర్థులు గెలుస్తారని పందెం కట్టాడు. ఇతను పందెం కాసిన కాంగ్రెస్ అభ్యర్థి ఒక్క ఓటుతో పరాజయం పాలయ్యాడు. అశ్వత్థనారాయణ ఎలాంటి పశ్చాతాపం లేక వీర యోధునిలా అరగుండు గీయించుకుని గ్రామంలో సంచరిస్తుంటే ఇతనిని చూసిన మహిళలు కొంగు అడ్డం పెట్టుకుని ముసిముసి నవ్వులు నవ్వడం కనిపించింది. -
నేడు లెక్కింపు
- అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ - గెలుపోటములపై గ్రామాల్లో జోరుగా బెట్టింగ్ - అవాంఛనీయ - సంఘటనలు జరగకుండా హోం శాఖ చర్యలు రెండు విడతలుగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు నేడు(శుక్రవారం) జరగనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దాయాదుల సమరం, అత్తాకోడళ్ల పోటీ కి గ్రామ పంచాయతీ ఎన్నికలు వేదికగా నిలిచిన విషయం తెలిసిందే. సాక్షి, బెంగళూరు : రాష్ట్ర వ్యాప్తంగా రెండు విడతలుగా జరిగిన ఈ ఎన్నికల్లో మొత్తం 5,735 గ్రామ పంచాయతీల్లో 84,854 స్థానాలకు అభ్యర్థులు పోటీపడ్డారు. మొదటి విడతలో 82. 54శాతం ఓటింగ్ నమోదు కాగా, రెండో విడతలో 80. 38శాతం ఓటింగ్ నమోదైంది. శుక్రవారం ఉదయం 8గంటలకు ఆయా తాలూకాల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుండగా, సాయంత్రం 5గంటలకు ఫలి తాలను వెల్లడించాలని అధికారులు భావిస్తున్నారు. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈవీఎంలు కాకుం డా బ్యాలెట్ పత్రాలను ఉపయోగించడంతో కౌంటింగ్ ప్రక్రియ అనుకున్న సమయం కన్నా కాస్తంత ఆలస్యం అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే సందర్భంలో గెలుపు, ఓటములపై గ్రామాల్లో జోరుగా బెట్టింగ్ సైతం సాగుతోంది. కొన్ని గ్రామాల్లో బెట్టింగ్ వేలు, లక్షలు సైతం దాటి కోట్ల రూపాయల్లోకి చేరడం గమనార్హం. ఇక పార్టీ గుర్తులపై ఈ ఎన్నికలు జరగక పోయినప్పటికీ, అన్ని ప్రముఖ రాజకీయ పార్టీలు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల కంటే ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను భావిస్తున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు ఆయా పార్టీల భవితవ్యాన్ని నిర్దేశించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయనే వార్తల మధ్య ప్రముఖ పార్టీల నేతల్లో సైతం గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర కుతూహలం నెలకొందనే చెప్పవచ్చు. కట్టుదిట్టమైన భద్రత కౌంటింగ్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా హోం శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టంది. దాదాపు 22వేల మంది పోలీసులు భద్రతను పర్యవేక్షించనున్నారు. ఇదే సందర్భంలో ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు విజయోత్సవాలు నిర్వహించే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చో టుచేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు హోం శాఖ ఉన్నత అధికారులు వెల్లడించారు. అంతేకాక సమస్యాత్మకంగా గుర్తించిన ప్రాంతాల్లో విజయోత్సవాలకు అనుమతి సైతం ఇవ్వలేదని అధికారులు తెలిపారు. -
బెట్టింగ్ ముఠా అరెస్ట్
కడప: ఐపీఎల్ సందర్భంగా బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్న సంఘటన కడప జిల్లా బ్రహ్మంగారిమఠం వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకుంది. బెట్టింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి రూ. 54వేలతో పాటు మూడు సెల్ఫోన్లు, బెట్టింగ్ కోసం సిద్ధం చేసిన స్లిప్పులు స్వాధీనం చేసుకున్నారు. -
యథేచ్ఛగా బెట్టింగులు
- లక్షలాది రూపాయలు చేతులు మారుతున్న వైనం - స్పందించని పోలీసులు - బెట్టింగ్ ఊబిలో విద్యార్థులు నాయుడుపేటటౌన్ : పట్టణంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగులు జోరందుకున్నాయి. ఈ దందాలో లక్షల్లో చేతులు మారుతున్నాయి. మారుమూల పల్లెలో కూడా బెట్టింగుల తంతు కొనసాగుతోంది. యథేచ్ఛగా బెట్టింగులు జరుగుతున్నా పోలీసులకు కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఐపీఎల్ లో 8 జట్టు పాల్గొంటున్న నేపథ్యంలో బెట్టింగులకు హద్దే లేకుండా పోయింది. వీటిలో చెన్నై సూపర్ కింగ్, రాజస్థాన్ రాయల్స్, కోల్కత్తా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్, కింగ్స్ లెవన్ పంజాబ్, ఢిల్లీ డేర్‌డెవిల్స్, సన్‌రైజర్స్, ముంబయ్ ఇండియన్స్ ప్రాతినిత్యం వహించే మ్యాచ్‌ల్లో ఎక్కువ బెట్టింగులు పెడుతున్నారు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌కు జరిగే పోటీల్లో ఒక్క నాయుడుపేటలోనే లక్షల రూపాయల బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. టీమ్‌ను బట్టి బుకీలు పందెం రేట్లను నిర్ణయిస్తున్నారు. మ్యాచ్ ప్రారంభం నుంచి ఏ జట్టు టాస్ గెలుస్తోంది .. విజయం ఎవరిది .. ఎన్ని పరుగులు సాధిస్తారు.. బ్యాట్స్‌మెన్ కొట్టే బౌండరీలు, సిక్స్‌లు.. ఓవర్లో ఎన్ని పరుగులు తీస్తారు.. ఏ టీమ్ ఎక్కువ వికెట్లు కోల్పోతుంది.. తదితర ఆంశాలపై పందేలు కాస్తున్నారు. కొందరు విద్యార్థులు తమ తల్లిదండ్రుల వద్ద కళాశాల ఫీజులంటూ నగదు తీసుకువచ్చి బెట్టింగులు పెడుతూ నష్టపోతున్న సంఘటనలు ఇటీవల ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. బెట్టింగ్ బారి నుంచి విద్యార్థులను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాలనీల్లో జోరందుకుంటున్న సింగల్ నంబర్ల లాటరీలు... ర్రూ10 చెల్లిస్తే వంద రూపాయులు వస్తాయన్న ఆశతో ఈ జూదంకు నిరుపేదలే వేలకు వేలు కడుతూ నష్టపోతున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు కూలి పనులకు పోయి వచ్చిన డబ్బులను సింగల్ నంబర్ల లాటరీలకు తగలేస్తున్నారు. చిన్న దర్గావీధి, పాత, కొత్త బీడీ కాలనీలు, లోతువానిగుంట, మునిరత్నం నగర్, కలగూరపేట తదితర ప్రాంతాల్లో జోరుగా సింగిల్ నంబర్ల జూదాన్ని అక్కడి సీక్రెట్ ఏజెంట్లు ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి తక్షణమే ఈ అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయాలి. -
రూ.1000 కోట్లు
ముంబై: ప్రపంచకప్‌లో సెమీస్ మొదలవ్వడానికి ముందే భారత్‌లో బెట్టింగ్ రాయుళ్లలో వేడి పెరిగింది. రెండు సెమీస్లతోపాటు ఫైనల్ మ్యాచ్ కలిపి భారత్‌లో వెయ్యి కోట్ల రూపాయల పైన బెట్టింగ్ జరిగే అవకాశం ఉందని బుకీలు అంచనా వేస్తున్నారు. భారత్‌దే కప్ అని చెబుతున్నారు. వాట్సప్‌లో గోల గోల... మరోవైపు వాట్సప్‌లో ప్రపంచకప్ ఫలితాల గురించిన ఒక పోస్ట్ సంచల నం రేపుతోంది. ఇప్పటివరకూ జరిగిన అన్ని మ్యాచ్‌ల ఫలితాలు ఆ పోస్ట్‌లో ఉన్నట్లే వచ్చాయట. క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్ 45 ఓవర్లలో ఆలౌట్ అవుతుందని, అలాగే పాక్‌పై ఆస్ట్రేలియా 38 ఓవర్లలోపే లక్ష్యాన్ని ఛేదిస్తుందని ఆ పోస్ట్‌లో ఉంది. వాస్తవంలో కూడా ఈ రెండు మ్యాచ్‌ల ఫలితాలు అలాగే వచ్చాయి. ఫైనల్లో భారత్ 20 పరుగులతో న్యూజిలాండ్‌ను ఓడించి కప్ గెలుస్తుందన్న ఆ సందేశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆసీస్‌కు ‘కంగారు’ ప్లీజ్... గురువారం సిడ్నీ గ్రౌండ్‌కు వచ్చి మాకు మద్దతుగా నిలవండి... ఆస్ట్రేలియా కెప్టెన్ క్లార్క్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన సందేశం ఇది. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. సిడ్నీ మైదానం సామర్థ్యం 42 వేలు. టిక్కెట్లన్నీ అమ్ముడయ్యాయి. ఇందులో సుమారు 70 శాతం భారత అభిమానులు టిక్కెట్లు కొన్నట్లు అంచనా. అంటే 30 వేల మంది భారత్ ఫ్యాన్స్ మైదానంలో ‘గోల’ చేస్తుంటారు. -
హిట్ వికెట్
క్రికెట్ బెట్టింగ్తో వీధిన పడుతున్న పలు కుటుంబాలు ఇప్పటికే భారీగా నష్టపోయిన యువకులు స్టార్ హోటళ్లు కేంద్రాలుగా సాగుతున్న వైనం మామూళ్ల మత్తులో పోలీసులు క్రికెట్, జీవితం ఇంచుమించూ ఒకటే. ఊరించే బౌన్సర్లూ ఉంటాయి. తికమక పెట్టే గుగ్లీలూ ఉంటాయి. ఏమరుపాటుగా ఉంటే హిట్ వికెట్ తప్పదు. వైకుంఠపాళిలో ఉన్నట్లు క్రికెట్లో బెట్టింగ్ పాము పొంచి ఉంటుంది. కుటుంబాన్ని వీధికి లాగి విషం చిమ్ముతుంది. తేలిగ్గా వచ్చే డబ్బు కోసం అత్యాశకు పోతే నెట్ ప్రాక్టీస్ లేని బ్యాట్స్‌మన్‌లా జీవితంలో డకౌట్ కాక తప్పదు. తిరుపతి: జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ఊపందుకుంది. బెట్టింగ్ మత్తులో పడి కొందరు తెల్లారేసరికే బికారులుగా మారుతున్నారు. ఇప్పటికే భారత్‌తో జరిగిన పాకిస్తాన్, దక్షిణాఫ్రికా మ్యాచ్‌లపై బెట్టింగ్‌లు పెట్టి పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారు. బుకీలు యువతను బెట్టింగ్ ఊబిలోకి దించి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా కప్ గెలిచే దేశంపైన భారీ బెట్టింగ్‌లకు యువతను పురిగొల్పుతూ బుకీలు సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని అరికట్టాల్సిన పోలీసులు సైతం మాముళ్ల మత్తులో జోగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘నారాయణ.. (పేరు మార్చాం). తన దగ్గరున్న డబ్బుతోపాటు, రూ.25 లక్షలు అప్పు తీసుకుని ఇండియా-దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలుస్తోందని బెట్టింగ్ పెట్టారు. రూ.30 వేలకు లక్ష రూపాయలుగా ఆన్లైన్లో బుకీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తీరా మ్యాచ్‌లో ఇండియా గెలిచింది. రూ.25 లక్షలు పోయాయి. అప్పు ఎలా తీర్చాలో తెలియక అతను కనీసం సొంత ఊరికికూడా పోలేక ముఖం చాటేస్తూ కుమిలిపోతున్నారు’. ‘రమాకాంత్..(పేరుమార్చాం) తాను కొత్త వ్యాపారం ప్రారంభిస్తున్నానని, పెట్టుబడి కావాలని తల్లిదండ్రుల చేత బలవంతంగా పొలం అమ్మించడంతో పాటు ఉన్న కొద్దోగొప్పో బంగారును సైతం తాకట్టు పెట్టించి దాదాపు రూ.10 లక్షలు జమ చేసుకున్నారు. ఇండియాతో జరిగిన పాకిస్తాన్, దక్షిణాఫ్రికా మ్యాచ్‌లపై ఇండియా ఓడిపోతుందని పందెం కాశాడు. రెండు మ్యాచ్‌లో ఇండియా గెలిచింది. డబ్బులన్నీ పోయాయి. కుటుంబం వీధిన పడింది. ఇప్పుడు అతనికి దిక్కు తోచడం లేదు.’ ఇలా జిల్లా వ్యాప్తంగా వందలాది మంది ఈ మహమ్మారి మత్తులో చిక్కుకుని విలవిలాడుతున్నారు. ఈ వ్యసనానికి అమ్మాయిలు సైతం బానిసలు కావడంతోపాటు, కమీషన్ ఏజెంట్లుగా అవతారం ఎత్తడం విశేషం. నగరంలో దందా ఇలా... తిరుపతి ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఓ లాడ్జిలో ఈ వ్యవహారం సాగుతోంది. ఓల్డ్ తిరుచానూరు రోడ్డులోని ఇంకొక లాడ్జిలో.. ఇలా నగరంలో ప్రముఖ హోటళ్లలో బెట్టింగ్ వ్యవహారం జోరుగా నడుస్తోంది. బెట్టింగ్ వ్యవహారం అంతా ఆన్లైన్లో జరగడం గమనార్హం. ఏజెంట్లు, బుకీలు అంతా సెల్‌ఫోన్ ద్వారానే వ్యవహారాన్ని నడుపుతున్నారు. పోలీసులు కొద్దిపాటి నిఘా పెడితే ఈ వ్యవహారాన్ని గుట్టురట్టు చేసే అవకాశం ఉంది. బెట్టింగ్‌లు ఇలా... జిల్లాలో ఎక్కువ మంది ఇండియా ఓడిపోతుందని పాకిస్తాన్, దక్షిణాఫ్రికా జట్లు గెలుపొందుతాయని బెట్టింగ్ కాసి నిండా మునిగారు. పోయిన సొమ్మును సంపాదించాలని ఉన్న ఆస్తులను తాకట్టు పెట్టి పందేలు కాసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పుడు నగరంలో తాజాగా కప్ గెలిచే దేశంపైనే బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఆస్ట్రేలియా గెలుస్తుందని రూ.10 వేలకు రూ.20 వేలు, దక్షిణాఫ్రికా గెలుస్తుందని రూ.10 వేలకు రూ.30 వేలు, ఇండియా గెలుస్తుందని రూ.10 వేలకు రూ.50 వేలు బెట్టింగ్ జరుగుతున్నట్లు వినికిడి. పోలీసులు క్రికెట్ బెట్టింగ్‌ను కట్టడి చేయాలని నగర వాసులు, బాధిత తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. -
మరో బెట్టింగ్ గుట్టు రట్టు
-
హైటెక్ బెట్టింగ్
క్రికెట్ పై జోరుగా పందేలు అడ్డంగా దోచేస్తున్న బుకీలు చేతులు మారుతున్న కోట్లు టాస్పైనా సాగుతున్న బెట్టింగ్ జిల్లా వాసులకు క్రికెట్ వరల్డ్‌కప్ ఫీవర్ పట్టుకుంది. ఏ దేశమైనా సరే.. మ్యాచ్ ప్రారంభమైందంటే చాలు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఇక సెలవు రోజుల్లో అయితే కదలడం కష్టమే. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు బుకీరాయుళ్లు రంగంలోకి దిగారు. విచ్చలవిడిగా పందేలు కాస్తున్నారు. అందినకాడికి అడ్డంగా దోచేసి మధ్యతరగతి ప్రజలకు టోపీలు పెట్టేస్తున్నారు. ఈ వ్యవహారమంతా ఆన్లైన్లోనే మూడు ఫోర్లు.. ఆరు సిక్సర్లుగా సాగుతోంది. తిరుపతి, క్రైం: క్రికెట్ బెట్టింగ్‌ల జోరు జిల్లాలో ఊపందుకుంది. మదనపల్లి, పలమనేరు, తిరుపతి నగరాల్లో బుకీ ఏజెంట్ల ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. అధికంగా గెలుపు గుర్రాలపైనే బెట్టింగ్‌లు కాస్తున్నారు. తాజాగా ఇండియా -పాకిస్తాన్, ఇండియా-సౌత్ ఆఫ్రికా మ్యాచ్ సందర్భంగా జిల్లాలో కోట్ల రూపాయల బెట్టింగ్‌లు చేతులు మారినట్టు సమాచారం. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్, పాకిస్తాన్, ఇండియా, ఇంగ్లండ్, శ్రీలంక వంటి ప్రధాన దేశాలు ఆడినప్పుడు ప్రతిబాలుకూ, సిక్సర్లకు, ఫోర్లకు బెట్టింగ్ కట్టేవారి సంఖ్య పెచ్చుమీరుతోంది. ఇక జట్లు వారీగా బెట్టింగ్ కట్టేవారి సంఖ్య లక్షల్లోనే ఉన్నట్టు సమాచారం. చిన్న జట్టయినా.. గెలుస్తుందనే నమ్మకంతో వేలకు వేలు కుమ్మరిస్తున్నారు. కొందరు మ్యాచ్‌కు ముందుగానే టాస్‌పై కూడా బెట్టింగ్ కాస్తున్నట్టు తెలుస్తోంది. కేరాఫ్ హైదరాబాద్ హైదరాబాద్ కేంద్రంగా బుకీ వ్యవస్థ నడుస్తున్నట్టు సమాచారం. వారి ఆధ్వర్యంలో జిల్లాలో దాదాపు రెండు వేల మంది బుకీలు తిష్టవేసినట్టు తెలిసింది. వీరు ప్రధానంగా స్టార్ హోటళ్లనే ఎంచుకుని తమ వ్యాపారాన్ని సాగిస్తున్నట్టు సమాచారం. లావాదేవీలు ఎలా జరుగుతాయంటే బెట్టింగ్‌లకు సంబంధించి అంతా ఆన్లైన్లోనే ఈ వ్యవహారమంతా కొనసాగుతుంది. బ్యాంకు అకౌంట్, ఆన్లైన్ అకౌంట్ డబ్బులు చెల్లిస్తుంటారు. ఓ ఏజెంట్ ద్వారా బెట్టింగ్ టీమ్‌లో చేర్చుకున్నారంటే అతనిపై నమ్మకంతో పాటు బ్యాంక్‌కు సంబంధించిన బ్లాంక్ చెక్, డబ్బులకు సంబంధించి లీగల్ టెర్మనాలజీలో లావాదేవీలు రాసుకుంటారు. కస్టమర్ బెట్టింగ్‌లో భారీగా డబ్బులు కోల్పోయినా.. సరే.. బ్యాంకు ద్వారా చెల్లించాల్సిందే. లేని పక్షంలో సాధారణ ఏజెంట్లు, బుకీలు చట్టపరంగా వారిపై చర్యలు తీసుకుంటారు. వీరుచేసేది న్యాయపరమైంది కాకపోయినా లీగల్‌గా కమిట్మెంట్ అయిన తర్వాతనే బెట్టింగ్ టీమ్‌లో స్థానం లభిస్తుండడంతో పోలీసులూ ఏమీ చేయలేని పరిస్థితి. ఎప్పటికప్పుడు మకాం మార్చడం ఈ వ్యవస్థలో అంతా 20-20 మ్యాచ్ లెక్కన సాగుతోంది. ఏజెంట్లు, బుకీలు ఎప్పటికప్పుడు తప్పించుకునేందుకు సెల్ఫోన్లు, మకాంలు మార్చడం రివాజుగా సాగుతోంది. ఇందులో పెద్ద పెద్ద ఏజెంట్లు స్టార్హోటళ్లను ఎంచుకోగా మరికొందరు పట్టణాలకు సమీపంలోని ఇళ్లల్లో మకాం వేస్తున్నట్టు తెలుస్తోంది. ఏజెంట్లు స్టార్ హోటళ్లలోనే మకాం వేసి క్రికెట్ వీక్షిస్తూ బెట్టింగ్ కట్టేవారి కాల్స్ స్వీకరిస్తారు. ఈ సమాచారం బుకీలకు చేరవేస్తారు. మ్యాచ్ ముగిసిన తర్వాత లాభం వస్తే డబ్బు బ్యాంక్ అకౌంట్‌కు వస్తుంది. డబ్బులు పోయిన పక్షంలో సదరు బెట్టింగ్కట్టిన వ్యక్తి అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసుకుంటారు. సదరు వ్యక్తి బ్యాంకు అకౌంట్లో డబ్బులు లేనిపక్షంలో తెల్లవారే సరికి బ్యాంకు పనిచేసే వేళల్లో ఏజెంట్ల అకౌంట్లలో జమచేయాలి. లేకుంటే ముందుగానే రాసుకున్న లీగల్ టెర్మినాలజీ ప్రకారం కోర్టుకు లాగుతారు. ఈ వ్యవహారంలో మధ్యతరగతి వారే ఎక్కువగా చితికిపోతున్నట్టు సమాచారం. పోలీసులు బుకీవ్యవస్థను, ఏజెంట్లపై ఓ కన్నేయాలని పలువురు కోరుతున్నారు. -
బెట్టింగ్‌లపై కొనసాగుతున్న టాస్క్‌ఫోర్స్ దాడులు
వేర్వేరు ప్రాంతాల్లో ఆరుగురు బెట్టింగ్‌రాయుళ్ల అరెస్ట్ తొమ్మిది మంది పేకాటరాయుళ్లు కూడా.. మధురానగర్ : నగరంలో క్రికెట్ బెట్టింగ్‌లపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడులు కొనసాగుతున్నాయి. ఏసీపీలు ఏవీఆర్‌జీబీ ప్రసాద్, పి.మురళీధరన్‌ల పర్యవేక్షణలో ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో దాడులుచేసి ఆరుగురు బెట్టింగ్‌రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. మాచవరం ఎస్ఆర్ఆర్, సీవీఆర్ ప్రభుత్వ కళాశాల ఎదురుగా ఉన్న కూరగాయల మార్కెట్లో క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది దాడిచేశారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న జి.లక్ష్మణరావు, జి.విజయ్, ఎంవీ నరసింహారావులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.10,340 నగదు, మూడు సెల్ఫోన్లు, టీవీని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం మాచవరం పోలీసులకు అప్పగించారు. గోసాల సెంటర్లో... కంకిపాడు మండలం ఈడుపుగల్లులోని గోసాల సెంటర్లోని వెంకటరత్నం ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలియడంతో ఏసీపీలు ఏవీఆర్‌జీబీ ప్రసాద్, పి.మురళీధరన్, ఎస్ఐలు సురేష్‌రెడ్డి, జి.శ్రీనివాస్‌లు సిబ్బందితో కలిసి దాడిచేశారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న బొబ్బా వెంకటరత్నం, పర్వతనేని రవీంద్ర, సానికొమ్ము వెంకటేశ్వర్లును అరెస్టుచేశారు. వారి నుంచి రూ.1,51,340 నగదు, సెల్‌ఫోన్, కంప్యూటర్, కొన్ని నోట్‌పుస్తకాలు సీజ్‌చేశారు. తదుపరి విచారణ నిమిత్తం వారిని కంకిపాడు పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. తొమ్మిది మంది పేకాటరాయుళ్ల అరెస్టు గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక లాడ్జిలో పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని టాస్క్‌ఫోర్స్ సిబ్బంది అరెస్టు చేశారు. వారి నుంచి రూ.30వేలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. -
క్రికెట్ బెట్టింగ్ గుట్టు రట్టు
ప్రపంచ కప్ నేపథ్యంలో నగరంలో జోరుగా సాగుతున్న క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై టాస్క్ పోలీసులు దృష్టి సారించారు. ఆదివారం పలు స్థావరాలపై దాడులు చేసి నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి నగదు, బెట్టింగ్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. నల్లకుంట: క్రికెట్ బెట్టింగ్ కేంద్రాలపై ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఓ బూకీతో పాటు రూ. 47 వేల నగదు, ఎల్ఈడీ టీవీ, రెండు సెల్ ఫోన్లు, బెట్టింగ్ వివరాలు ఉన్న మూడు పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ కోటిరెడ్డి కథనం మేరకు.. తూర్పు గోదావరికి చెందిన ఎం.వెంకటేశ్వరరావు (40) పాతికేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి నల్లకుంట బాయమ్మ లేన్‌లో కొబ్బరి బొండాల వ్యాపారం చేస్తూ సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. ఇతను ఐపీఎల్ క్రికెట్ పోటీలు ప్రారంభమైనప్పటి నుంచి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. ఆదివారం భారత్, సౌత్ ఆఫ్రికాల మధ్య జరిగిన మ్యాచ్‌పై పెద్ద ఎత్తున బెట్టింగ్ నిర్వహించాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సీహెచ్. శ్రీధర్, ఎస్ఐలు శేఖర్‌రెడ్డి, ఎ.సుధాకర్, ఎ.రవికుమార్, జి.రాజు ఆదివారం మద్యాహ్నం బాయమ్మ గల్లీలోని అపార్ట్‌మెంట్‌పై దాడిచేసి బెట్టింగ్‌కు పాల్పడుతున్న వెంకటేశ్వరరావును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇతని వద్ద లభించిన బెట్టింగ్ పుస్తకంలో ఉన్న మరో తొమ్మిది మంది పేర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. కేసు తదుపరి విచారణ కోసం నిందితుడిని నల్లకుంట ఎస్ఐ చిరంజీవికి అప్పగించారు. బెట్టింగ్‌లతో గతంలో నష్టం.. వెంకటేశ్వరరావు బెట్టింగ్‌ల కారణంగా గతంలో ఓ ఫ్లాట్, రూ. 2 లక్షల నగదు నష్టపోయాడు. పోయిన ఆస్తిని ఎలాగైనా తిరిగి సంపాదించాలని క్రికెట్ బెట్టింగ్‌ను వృత్తిగా మార్చుకున్నాడు. ఈ క్రమంలో కొబ్బరి బొండాల షాపు వద్దకు వచ్చే క్రికెట్ అభిమానులను ఆకర్షించి బెట్టింగ్ రొంపిలోకి లాగుతున్నాడు. బేగంబజార్‌లో మరొక బుకీ.. అబిడ్స్: బేగంబజార్ చుడీబజార్ ప్రాంతంలో బెట్టింగ్ నిర్వహిస్తున్న సమాచారంతో టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి పర్యవేక్షణలో ఎస్ఐ జలంధర్, ఇతర సిబ్బంది ఆ కేంద్రంపై దాడి చేశారు. ఇక్కడ బెట్టింగ్‌కు పాల్పడుతున్న పేరు మోసిన బుకీ ఠాకూర్ యోగేష్‌ను అరెస్ట్ చేసి అతని నుంచి రూ. 9,500 నగదు, ఆరు సెల్ఫోన్లు, ఒక టీవీ, రికార్డింగ్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కాగా, మరో క్రికెట్ బుకీ వెంకటేష్ పండిట్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసుల రాకతో పరారయ్యాడు. అతని కోసం కూడా గాలిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. రామనాథపురాలో 11 మంది అరెస్టు బహుదూరపురా: రాంనాథపురలో కిక్రెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న స్థావరంపై ఆదివారం సౌత్ జోన్ టాస్క్ పోర్స్ పోలీసులు దాడి చేసి 11 మందిని ఆరెస్టు చేసి, వారి నుంచి రూ. 51 వేల నగదు, 10 సెల్ ఫోన్లు, టీవీ స్వాధీనం చేసుకున్నారు. బహదూర్‌పురా ఇన్స్పెక్టర్ హరీష్ కౌశి కథనం మేరకు.. కామాటిపుర, రాంనాథపుర, వాజుపుర ప్రాంతాలకు చెందిన 11 మంది కొందరు యువకులు కలిసి రాంనాథపుర థియేటర్ పక్క వీథిలో కిక్రెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్థావరంపై దాడి చేసి.. మహ్మద్ జహీరుద్దీన్, షేక్ మహ్మద్, మహ్మద్ అక్రమ్, సలీముద్దీన్, అబ్దుల్ రహీం, ఉమర్, మోసిద్, సయ్యద్ యూనస్, మహ్మద్ జావేద్‌లను అరెస్టు చేశారు. బహదూర్‌పురా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు. -
'బెట్టింగ్'కు పాల్పడుతున్న ఏడుగురు అరెస్టు
ప్రొద్దుటూరు (వైఎస్సార్ జిల్లా): ఇండియా- దక్షిణాఫ్రికా మ్యాచ్ సందర్భంగా బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఏడుగురిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వివరాలు.. వెస్సార్ జిల్లా చాపాడు మండల కేంద్రానికి చెందిన చల్లా బ్రహ్మయ్య అనే వ్యక్తి మరో ఆరుగురితో కలిసి సూరత్ దాబాలో బెట్టింగ్ నిర్వహిస్తుండగా పోలీసులు దాడి చేసి నిందితులను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.2.01 లక్షల నగదు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
ప్రధాన బుకీ సహా10 మంది అరెస్టు
రూ.3.42లక్షలు స్వాధీనం పరారీలో మరో బుకీ విజయవాడ సిటీ : నగంలోని క్రికెట్ బెట్టింగ్‌స్థావరాలపై టాస్క్‌ఫోర్స్ దాడులు కొనసాగుతున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో శనివారం దాడులు నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ప్రధాన బుకీ సహా 10 మందిని అరెస్టు చేశారు. మరో ప్రధాన బుకీ పరారవగా, పట్టుబడిన వారి నుంచి రూ.3.42 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం నింది తులను ఆయా పోలీసు స్టేషన్లకు అప్పగిం చారు. టాస్క్‌ఫోర్స్ ఏసీపీలు ఎ.వి.ఆర్.జి.బి.ప్రసాద్, పి.మురళీధరన్ ఈ దాడులను పర్యవేక్షించగా ఎస్ఐలు ఆర్.సురేష్ రెడ్డి, జి.శ్రీనివాస్ తమ సిబ్బందితో పాల్గన్నారు. నగల తయారీ మాటున బెట్టింగ్ దందా రెండేళ్లుగా గుట్టు చప్పుడు కాకుండా క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న ప్రధాన బుకీని ఎట్టకేలకు టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. అతనితో పాటు కలెక్షన్ వ్యవహారాలు చూసే మరో వ్యక్తిని, ముగ్గురు బెట్టింగ్ రాయుళ్లను శనివారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.2,64,000 నగదు, ఐదు మొబైల్ ఫోన్లు, ఆయా వ్యక్తులకు ఇవ్వాల్సిన, రావాల్సిన నగదు లావాదేవీలతో కూడిన స్లిప్పులను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ అధికారుల కథనం ప్రకారం.. గుణదల గంగానమ్మ గుడి ప్రాంతానికి చెందిన వరదా కేశవరాం ప్రసాద్ అలియాస్ రాంబాబు బంగారు నగల తయారీ వృత్తి చేస్తుంటాడు. రెండేళ్లుగా క్రికెట్ బుకీ అవతారం పెద్ద ఎత్తున బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నాడు. ఈ సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ అధికారులు నిఘా పెట్టారు. శని వారం బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్టు రూఢీ చేసుకొని దాడి చేసి అతనితో పాటు మరో నలుగురిని అరెస్టు చేసి సొత్తు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం మాచవరం పోలీసులకు అప్పగించారు. గవర్నరుపేటలో.. ఓ స్టార్ హోటల్లో గది అద్దెకు తీసుకొని క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్టు వచ్చిన సమాచారం మేరకు శనివారం దాడి చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. పోలీసుల రాకను పసిగట్టి హైదరాబాద్‌కు చెందిన ప్రధాన బుకీ అప్పారావు పరారవ్వగా నగరానికి చెందిన డి.ప్రదీప్ కుమార్ రెడ్డి, టి.రాజేష్ కుమార్, కె.చిట్టిబాబు, పి.వెంకటనరేష్, పి.సత్యనారాయణను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.78వేల నగదు, ఆరు మొబైల్ ఫోన్లు, ఎల్ఈడీ టీవీ స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం స్వాధీనం చేసుకున్న సొత్తు సహా నిందితులను గవర్నరుపేట పోలీసులకు అప్పగించారు. -
వేదిక ఏదైనా జూదక్రీడే..
వాలీబాల్ పోటీలపైనా భారీ ఎత్తున బెట్టింగ్ కస్టమ్స్-కర్ణాటక మ్యాచ్‌లో చేతులు మారిన రూ.5 లక్షలు ఏకపక్షపు పోటీల్లో ‘కోసు’ ప్రాతిపదికన పందేలు అమలాపురం : ‘గుండాట.. పేకాట.. కోడి పందేలు’.. జూదగాళ్లు తమ వ్యసనాన్ని పోషించుకోవడానికి ఒకప్పుడు ఇవే ఆధారాలు. కొందరు ఎక్కడో పరిగెత్తే రేసుగుర్రాలపై ఇక్కడుండే పందేలు కాసేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. జూదగాళ్లకు నిత్యం రకరకాల అవకాశాలున్నాయి.‘ కుక్కపిల్లా.. అగ్గిపుల్లా.. సబ్బుబిళ్లా.. కాదేదీ కవితకనర్హం’ అని మహాకవి శ్రీశ్రీ అంటే..‘ప్రతి బంతీ.. ప్రతి ఓవర్..ప్రతి మ్యాచ్..అవును అన్నీ బెట్టింగ్‌కు అనువే’ అంటూ క్రికెట్ చుట్టూ భారీ జూదం జరిగిపోతోంది. ప్రపంచకప్ పోటీల నేపథ్యంలో జిల్లాలో ఇప్పటికే రూ.కోట్లు చేతులు మారుతున్నాయి. ఆ క్రమంలోనే జూదోత్సాహం ఇతర క్రీడలకూ విస్తరిస్తోంది. ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో నాలుగురోజులు జరిగిన జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు సైతం బెట్టింగ్ జాఢ్యం పాకింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన జూదగాళ్లు ప్రతి మ్యాచ్‌లో పందేలు కాశారు. పురుషుల విభాగంలో హైదరాబాద్ కస్టమ్స్, కర్ణాటక జట్ల మధ్య జరిగిన పోరులో రూ.ఐదు లక్షలకు పైగా పందేలు జరిగాయంటే ఇక్కడ జూదం ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. హోరాహోరీగా తలపడే జట్ల మీదే కాకుండా పోరు ఏకపక్షంగా సాగుతుందనుకునే మ్యాచ్‌లలోనూ కోసు పందేలు (చేతులు మారే మొత్తంలో ఎక్కువ తక్కువలకు ఒప్పందం జరిగే పందేలు) కాస్తున్నారు. పురుషుల విభాగంలో పాండిచ్చేరి, హైదరాబాద్ కస్టమ్స్ జట్ల మధ్య జరిగిన పోరులో రూ.300కు రూ.1000 చొప్పున ఇచ్చేలా కోసు పందేలు జరిగాయి. హోం మంత్రి ఉన్నచోటే.. యథేచ్ఛగా బెట్టింగ్ మహిళా విభాగంలో పోటీలకు సైతం చిన్నచిన్న మొత్తాల్లో పందేలు జరుగుతుండడం విశేషం. తన తండ్రి పేరున ఈ టోర్నమెంట్ జరుగుతుండడంతో ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రతి రోజూ పోటీలను తిలకించారు. ఆయనకు బందోబస్తుగా అమలాపురం డీఎస్పీ ఎల్.అంకయ్యతో పాటు రూరల్ సీఐ దేవకుమార్, మరో నలుగురైదుగురు ఎస్సైలు, పోలీసులు, ఎస్కార్ట్ సిబ్బంది వాలీబాల్ పోటీల వద్ద ఉన్నా జూదగాళ్ల బెట్టింగ్ బరి యథేచ్ఛగా జరిగిపోవడం గమనార్హం. -
బెట్టింగ్ కు పాల్పడుతున్నఇద్దరి అరెస్టు
హైదరాబాద్ క్రైం: హైదరాబాద్ మారేడ్‌పల్లిలోని క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై గురువారం సాయంత్రం పోలీసులు దాడులు చేశారు. ఓ ఇంటిపై దాడి చేసిన స్పెషల్ పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.30 వేల నగదు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.