బతుకులన్నీ బౌల్డ్‌ | cricket betting youth lives of depressed | Sakshi
Sakshi News home page

బతుకులన్నీ బౌల్డ్‌

Published Wed, Apr 5 2017 2:15 AM | Last Updated on Tue, Sep 5 2017 7:56 AM

బతుకులన్నీ బౌల్డ్‌

బతుకులన్నీ బౌల్డ్‌

నేటి నుంచి ఐపీఎల్‌ క్రికెట్‌ పోటీలు
జిల్లాలో బెట్టింగ్‌లకు సిద్ధమవుతున్న యువత
ఆకర్షించేందుకు సిద్ధమైన బుకీలు
చితికిపోతున్న జీవితాలు

మదనపల్లెకు చెందిన ఓ యువకుడు బెంగళూరులో ఓ సాప్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తూ క్రికెట్‌ బెట్టింగ్‌కు అలవాటు పడ్డాడు. తన సంపాదన సరిపోక అప్పులు చేసి చేతులెత్తేశాడు. బుకీలు ఇంటికి రావడంతో చేసేది ఏమీలేక ఉన్న ఆస్తులు అమ్ముకుని అప్పులు కట్టాడు. తిరుపతికి చెందిన మరో యువకుడు కాలేజీ చదువుల సమయంలోనే బెట్టింగ్‌లకు అలవాటు పడ్డాడు. అనంతరం బుకీ అవతారం ఎత్తాడు. ఈ సంపాదనతో వ్యసనాలకు బానిసయ్యాడు. రెండుమూడుసార్లు పోలీసులకు పట్టుబడినా తిరిగి అదేపనిలో కొనసాగుతున్నట్టు సమాచారం. ఇలా..ఎందరో బెట్టింగ్‌ మాయాజాలంలో చిక్కుకుంటున్నారు.

తిరుపతి క్రైం : గతంలో క్రీడాస్ఫూర్తిని నింపిన క్రికెట్‌ ఆట రాన్రాను జూద క్రీడగా మారిపోయింది. టి–20 మ్యాచ్‌లు బుక్కీలకు వరంగా, బెట్టింగ్‌ రాయుళ్లకు వ్యసనంగా మారింది. గురువారం నుంచి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మ్యాచ్‌లు ప్రారంభం కానున్న నేపథ్యంలో మరోసారి పోలీసులు బెట్టింగ్‌ రాయుడుళ్ల స్థావరాలపై పోలీసులు దృష్టి సారించాల్సిన అవస రం ఎంతైనా ఉంది. దాదాపు రెండు నెలలు సాగే ఐటీఎల్‌లో పలు జట్లపై ఇప్పటికే ఎవరికి తోచిన అంచనాలతో గెలుపోటములపై వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇది బెట్టింగ్‌ రాయుళ్లకు మంచి కిక్‌నిస్తోంది. క్రికెట్‌ను జూదక్రీడగా మార్చేసిన బుకీలు జిల్లాలో పలు పట్టణాలు, పల్లెల్లో యువకులను టార్గెట్‌ చేస్తున్నారు. టోర్నీ ముగిసే సరికి ఎంతమంది బతుకులు చిన్నాభిన్నమవుతుందో? ఎంత సొమ్ము చేతులు మా రుతుందోనని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

వ్యవహారాలన్నీ సెల్‌ఫోన్లలోనే
బెట్టింగ్‌ తంతు మొత్తం ఎక్కువ సెల్‌ఫోన్‌ ద్వారానే సాగుతుంది. టాస్‌ పడిన దగ్గర నుంచి బంతి బంతికీ రకరకాల పందాలు కొనసాగుతుంటాయి. ప్రధాన నగరాల్లో ఉండే పెద్ద బుకీలు వివిధ ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించుకుని వీరి ద్వారా కార్యకలాపాలు కొనసాగిస్తుంటారు. ఎస్‌...నో.. ఓకే.. డన్‌ .. ఈటింగ్‌ వంటి వివిధ రకాల కోడ్‌లతో బెట్టింగ్‌ పర్వం కొనసాగుతుంది.

పరిజ్ఞానం లేకుండా పందేలు
క్రికెట్‌ ఆటపై పెద్దగా పరిజ్ఞానం లేకున్నా ఆడుతుం ది.. ఓడుతుంది– అన్న సూ త్రాలతో చాలా మంది డబ్బులు పెడుతుంటారు. సాంకేతికంగా కొంత అవగాహన ఉన్న కొందరు వీరి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని డబ్బులు దండుకుంటున్నారు. 90 శాతం మంది టీవీ చూస్తూనే పందేలు కాస్తారు. కానీ గ్రౌండ్‌లో జరిగే ఆటకు, టీవీలో వచ్చే ఆటకు మూడు బంతులు తేడా ఉంటుంది. బంతి.. బంతికీ ఆట ఎలా ఉంటుందో ముందే తెలుసుకుని కాసేవారిని మోసగిస్తుంటారు.

బుగ్గిపాలవుతున్న బతుకులు
ఎక్కువగా విద్యార్థులు ఈ బెట్టింగ్‌ మాయాజా లంలో చిక్కుకుంటున్నారు. మొదట సరదాగా మొదలై, బెట్టింగ్‌ అలవాటు క్రమేణా ఓ వ్యసనంగా మారుతుంది. అదృష్టం బాగుంటే వేలు, లక్షలు సంపాదించవచ్చనే ఆశతో ఈ ఊబిలో కూరుకుపోతున్నారు. అనంతరం ఆస్తులు హ రించుకుపోయి అప్పులపాలవుతున్నారు.

పల్లెల్లోనూ కాయ్‌ రాజా కాయ్‌
క్రికెట్‌ బెట్టింగ్‌లు పట్ట ణాల నుంచి పల్లెలకు విస్తరిస్తున్నాయి. సన్నకారు రైతుల దగ్గర నుంచి కూలీ పనులు చేసుకునేవారు, ఆటో వాలాలు, తోపుడుబండ్ల నిర్వాహకులు, పండ్ల వ్యాపారులు.. ఇలా చాలా మంది క్రికెట్‌ పందాలు కాస్తూ నష్టపోతున్నారు. ఐపీఎల్‌ టోర్నీ ముగిసే వరకూ పోలీసు దీనిని సీరియస్‌గా తీసుకుంటే దీనికి కొంతవరౖకైనా అడ్డుకట్ట వేయొచ్చని క్రికెట్‌ పండితులు చెబుతున్నారు.

పందెం ఇలా..
సాధారణంగా క్రికెట్‌ పందాలు సమాన నగదుతో సాగేది. కానీ టీ–20 రాకతో పందాల స్వరూపమే మారిపోయింది. ఆడే జట్లు ఆధారంగా రూపాయికి 80పైసలు, రూపాయికి 2 రూపాయలు ఇలాంటి ఆఫర్లు ఎన్నో! అటు ఎవరు గెలుస్తారో? అనే పందెం మాత్రమే కాకుండా జట్టు ఎన్ని పరుగులు చేస్తుంది? ఏ ఆటగాడు ఎన్ని పరుగులు చేస్తాడు? ఈ  ఓవర్‌లో ఎన్ని పరుగులు వస్తాయి?..  ఇలా రకరకాల పందేలు నిర్వహిస్తారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement