ఎమ్మిగనూరుకు ‘బెట్టింగ్‌ ఫివర్‌’.! | 'Betting fiver' to yemmiganur | Sakshi
Sakshi News home page

ఎమ్మిగనూరుకు ‘బెట్టింగ్‌ ఫివర్‌’.!

Published Fri, Apr 21 2017 11:24 PM | Last Updated on Tue, Sep 5 2017 9:20 AM

ఎమ్మిగనూరుకు ‘బెట్టింగ్‌ ఫివర్‌’.!

ఎమ్మిగనూరుకు ‘బెట్టింగ్‌ ఫివర్‌’.!

 – రూ. లక్షల్లో క్రికెట్‌ బెట్టింగ్‌
 – ఎందరో బాధితులు అప్పుల పాలై దివాలా
 – 17 మంది బెట్టింగ్‌రాయుళ్ల అరెస్టు
- రూ.  రూ.1.22 లక్షలు, 15 సెల్‌ ఫోన్లు స్వాధీనం
 
ఎమ్మిగనూరు:  క్రికెట్‌ బెట్టింగ్‌కు వ్యసనానికి బానిసైన వందలాది మంది భారీ మొత్తంలో డబ్బులు పోగొట్టుకొంటున్నారు. ఐపీఎల్‌ పుణ్యమాని క్రికెట్‌ క్రేజ్‌ పెరిగిపోయింది. పిల్లల నుంచి ముదసలి వాళ్ల వరకూ ప్రతిరోజు రూ. లక్షల్లో బెట్టింగ్‌ ఆడుతూ క్రికెట్‌ క్రీడను జూదక్రీడగా మార్చేశారు. పట్టణాలే కాదు పల్లెలకూ బెట్టింగ్‌ విస్తరించింది. ముఖ్యంగా ఎమ్మిగనూరు పట్టణంలో నలుగురు బుకీలు బెట్టింగ్‌ నిర్వాహణలో కీలకసూత్రధారులుగా ఉన్నట్లు క్రీడాభిమానులు పేర్కొంటున్నారు.200 మందికి పైగా బెట్టింగ్‌ ఆడుతున్నట్లు సమాచారం. మ్యాచ్‌ గెలిస్తే ఓ రేటు..బౌలర్‌తీ సే వికెట్లను బట్టీరేటు పెరుగుతోంది. బాట్స్‌మెన్‌ చేసే స్కోర్‌పై..కొట్టే ఫోర్‌, సిక్స్‌లపై బెట్టింగ్‌ రేట్లను బుకీలు పెంచేస్తారు. క్రికెట్‌ బెట్టింగ్‌ మూలంగా అటు నిద్రహారాలను మానుకొనేవారు..ఆస్తులను అమ్మేవారు..అప్పులు కోసేవారు ఎమ్మిగనూరులో అధికమైంది.ఇక్కడ రూ.3 రూపాయలు సాధారణ వడ్డీగా రూ.15 వరకూ వడ్డీ నడుస్తోంది.కొందరైదే ఏకంగా రోజువారీ వడ్డీ వసూలు చేస్తున్నారు.లక్షకు ప్రతిరోజూ రూ.300నుంచి రూ.600వరకూ వడ్డీ చెల్లించాలి. ఇలా అధిక వడ్డీ వ్యాపారులే 37 మంది వరకు ఉన్నారు.
 
ప్రతి రోజూ బెట్టింగ్‌ నడుపుతూ ఆడేవాళ్లలో విద్యార్థులు , రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, బ్రోకర్‌లు, సిమెంట్‌ షాపు ఓనర్లు, బ్యాంక్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఎంటర్‌ ప్రైజెస్‌ వ్యాపారం, ఫైనాన్సు వ్యాపారులు, మద్యం వ్యాపారులు, వారి కుటుంబసభ్యులే అధికంగా ఉండటం విశేషం. ప్రతి రోజు జరిగే రెండు మ్యాచ్‌లకు రూ.30 లక్షల వరకు ఇక్కడ బెట్టింగ్‌ జరుగుతున్నట్లు క్రీడాభిమానులు పేర్కొంటున్నా అది ఇంకా ఎక్కువగానే ఉంటుందనీ తెలుస్తోంది. ఎమ్మిగనూరులో క్రికెట్‌ బెట్టింగ్‌ నిరంతర ప్రక్రియగా మారింది.మంచి పోలీసు అధికారులు వచ్చినప్పుడు బెట్టింగ్‌ రాయుళ్లను అరెస్టు చేస్తే..ఆమ్యామ్యాలతో పవర్‌లోకి వచ్చినవారు మ్యాచ్‌కో రేటు చొప్పున దండుకొంటుని  దందాలు నిర్వహించారు. ఏదీ ఎమైనా ఎమ్మిగనూరును బెట్టింగ్‌ ఫివర్‌ వణికిస్తోంది.బెట్టింగ్‌రాయుళ్ల ఆటకట్టించాల్సిన పోలీసు యంత్రాంగం మరింత చాకచక్యంగా వ్యవహరించాల్సి ఉంటోంది. 
 
బెట్టింగ్‌ రాయుళ్లు అరెస్టు:
క్రికెట్‌ బెట్టింగ్‌ రాయుళ్లలో కొందరిని పోలీసులు పట్టుకున్నారు.ఎమ్మిగనూరు సీఐ ప్రసాద్‌తో కలసి ఆదోని డీఎస్పీ కొల్లి శ్రీనివాసులు శుక్రవారం వివరాలు వెల్లడించారు. పట్టణంలో క్రికెట్‌ బెట్టింగ్‌ భారీ ఎత్తున జరుగుతుందని తెలియటంతో సీఐ జీ.ప్రసాద్‌ ఆదేశాల మేరకు రూరల్‌ ఎస్‌ఐ వేణుగోపాల్, నందవరం ఎస్‌ఐ జగన్‌మోహన్, క్రైంపార్టీ పోలీసులు, సిబ్బంది నిఘా పెంచారు. పకడ్బందీగా పథకం వేసి సోమప్ప నగర్‌కు చెందిన మీసే రమేష్, ఎంఆర్‌ ప్రసాద్‌ను పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారి సెల్‌ ఫోన్స్‌లో కాల్‌ డేటా ఆధారంగా మిగతా 15 మందిని అదుపులో తీసుకున్నారు. ఈ బెట్టింగ్‌కు మూల సూత్రధారి సోమప్ప నగర్‌కు చెందిన బోయ రామకృష్ణ కర్నూలులో నివాసముంటు అక్కడ నుంచే ఏజెంట్లు, బుకీలను పెట్టుకొని బెట్టింగ్‌ నిర్వహిస్తుంటాడు. మేడమ్‌ నాగేంద్ర, నజీర్‌ అహమ్మద్‌ బుకీలుగా, కళ్యాణ్‌చక్రవర్తి అనే వ్యక్తి కలెక‌్షన్‌ ఏజెంట్లుగా  ఉంటూ బెట్టింగ్‌ రాయుళ్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసేవాడు. ఈ వ్యవహరమంతా ఫోన్లలోనే నడిచేది.  
 
ఈ బారీ బెట్టింగ్‌పై పోలీసులు పక్కా సమాచారంతో రెండు వేర్వురు చోట్ల దాలు చేసి పట్టుకున్నారు. ప్రధాన సూత్రధారి బోయ రామకృష్ణ, బుకీలు నజీర్‌అహమ్మద్, మేడమ్‌ నాగేంద్రలతో పాటు మరో 14 మందిని పోలీసులు అరెస్ట్‌ చేసి వారి వద్ద నుంచి రూ.1.22 లక్షల నగదు, 15 సెల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బెట్టింగ్‌ను వెలుగులోకి తెచ్చేందుకు చాకక్యంగా వ్యవహరించిన రూరల్, నందవరం ఎస్‌ఐలు వేణుగోపాల్, జగన్‌మోహన్‌యాదవ్‌లకు రివార్డులు ఇచ్చేందుకు ఎస్పీకి ప్రతిపాదనలు పంపుతున్నట్లు డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు విలేకరులకు తెలిపారు. వీరిని అరెస్ట్‌ చేసి కోర్టులో హజరుచనున్నట్లు పేర్కొన్నారు.అయితే బెట్టింగ్‌లో అరెస్టు అయిన వారిలో ఎక్కువమంది విద్యార్థులే కావటం కొసమెరుపు.  
 
వీరంతా బెట్టింగ్‌ బాధితులు
– ఎమ్మిగనూరుకు చెందిన చిరువ్యాపారి ప్రసాద్‌ బెట్టింగ్‌కు వ్యసనపరుడు.గత ఐపీఎల్‌ మ్యాచ్‌ల్లో అప్పులు చేసి భారీగా బెట్టింగ్‌లు ఆడాడు.లక్షల్లో అప్పులు మూటగట్టుకొన్నాడు.అప్పులు చెల్లించే స్తోమతలేక 33 ఏళ్లకే ఆత్మహత్య చేసుకొన్నాడు. 
 
– పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్‌ కుమారుడు శ్రీరామచిట్స్‌లో పనిచేసేవాడు. ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌లో రూ.40 లక్షల వరకు పోగొట్టుకొన్నాడు. అప్పులు తీర్చే శక్తిలేక బెంగళూరుకు పారిపోయాడు.
 
–‘ఓ టీచర్‌ నెల జీతం 45వేలు.కానీ అతను నెలనెల కట్టే వడ్డీల మొత్తం రూ.60వేల దాకా ఉంటుంది.అంటే రూ.20 లక్షలకు పైగా క్రికెట్‌ బెట్టింగ్‌లతో అప్పు చేశాడు.మ్యాచ్‌లు జరిగేకొద్దీ ఇంకా బెట్టింగ్‌ ఆడుతూనే ఉన్నాడు..ఏదోరోజు జాక్‌పాట్‌ కొడతాననీ..బెట్టింగ్‌తోపాటు పేకాట, మందు, ధూమపానం వంటి అలవాట్లు అతడికీ బోనస్‌గా వచ్చాయి.
 
- ఎమ్మిగనూరు మండలం కలుగొట్లకు చెందిన 8వ తరగతి విద్యార్థి బెట్టింగ్‌ ఆడి రూ.5వేలు దాకా అప్పు చేశాడు.విషయం బయటపడతుందనీ గత ఏడాది ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు. విషయాన్ని గ్రామస్తులు గోప్యంగా ఉంచారు.
 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement