పందెం ఓ యువకుడి ప్రాణం పోవడానికి దారితీసింది.
బాలాయపల్లి: పందెం ఓ యువకుడి ప్రాణం పోవడానికి దారితీసింది. నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం కడగుంట గ్రామంలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హరి (20) అనే యువకుడు స్నేహితులతో కలసి గ్రామంలోని దిగుడుబావి వద్దకు ఆదివారం వెళ్లాడు. హరికి ఈత రాకపోవడంతో స్నేహితులు పందెం వేశారు.
పందెం కోసం పట్టుదలతో ఈత రాకపోయినా హరి నీటిలోకి దిగడంతో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు అతడి మృతదేహాన్ని వెలికితీశారు.