ముంబై: ప్రపంచకప్‌లో సెమీస్ మొదలవ్వడానికి ముందే భారత్‌లో బెట్టింగ్ రాయుళ్లలో వేడి పెరిగింది. రెండు సెమీస్‌లతోపాటు ఫైనల్ మ్యాచ్ కలిపి భారత్‌లో వెయ్యి కోట్ల రూపాయల పైన బెట్టింగ్ జరిగే అవకాశం ఉందని బుకీలు అంచనా వేస్తున్నారు. భారత్‌దే కప్ అని చెబుతున్నారు.
వాట్సప్‌లో గోల గోల...
మరోవైపు వాట్సప్‌లో ప్రపంచకప్ ఫలితాల గురించిన ఒక పోస్ట్ సంచల నం రేపుతోంది. ఇప్పటివరకూ జరిగిన అన్ని మ్యాచ్‌ల ఫలితాలు ఆ పోస్ట్‌లో ఉన్నట్లే వచ్చాయట. క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్ 45 ఓవర్లలో ఆలౌట్ అవుతుందని, అలాగే పాక్‌పై ఆస్ట్రేలియా 38 ఓవర్లలోపే లక్ష్యాన్ని ఛేదిస్తుందని ఆ పోస్ట్‌లో ఉంది. వాస్తవంలో కూడా ఈ రెండు మ్యాచ్‌ల ఫలితాలు అలాగే వచ్చాయి. ఫైనల్లో భారత్ 20 పరుగులతో న్యూజిలాండ్‌ను ఓడించి కప్ గెలుస్తుందన్న ఆ సందేశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఆసీస్‌కు ‘కంగారు’
ప్లీజ్... గురువారం సిడ్నీ గ్రౌండ్‌కు వచ్చి మాకు మద్దతుగా నిలవండి... ఆస్ట్రేలియా కెప్టెన్ క్లార్క్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన సందేశం ఇది. కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. సిడ్నీ మైదానం సామర్థ్యం 42 వేలు. టిక్కెట్లన్నీ అమ్ముడయ్యాయి. ఇందులో సుమారు 70 శాతం భారత అభిమానులు టిక్కెట్లు కొన్నట్లు అంచనా. అంటే 30 వేల మంది భారత్ ఫ్యాన్స్ మైదానంలో ‘గోల’ చేస్తుంటారు.
రూ.1000 కోట్లు
Published Tue, Mar 24 2015 2:06 AM | Last Updated on Wed, May 29 2019 2:36 PM
Advertisement
Advertisement