బ్రెగ్జిట్ బంగార్రాజు
బ్రెగ్జిట్ రెఫరెండం తో బెట్టింగ్ రూపంలో వేల కోట్ల రూపాయలు చేతులు మారా యి. మెజారిటీ సర్వేలు ఈయూలోనే బ్రిటన్ ఉంటుందని వెల్లడించినా.. లండన్‌కు చెందిన ప్రముఖ హెడ్జ్ ఫండ్ సంస్థ బాస్ క్రిస్పిన్ ఓడే (57) మాత్రం బ్రిటన్ విడిపోతుందని బలంగా నమ్మాడు. అందుకు తగ్గట్లుగానే బెట్టింగ్ కట్టి 220 మిలియన్ పౌండ్ల (రూ.2 వేలకోట్లకు పైనే) జాక్‌పాట్ కొట్టాడు.
క్రిస్పిన్ బంగారంపై ఇన్వెస్ట్ చేయటంతోపాటు, పౌండ్ ధర తగ్గటంపై బెట్టింగ్ కట్టాడు. అయితే బ్రెగ్జిట్ ఫలి తంతో బంగారం డిమాండ్ పెరగటం, పౌండ్ 31 ఏళ్ల కనిష్టానికి తగ్గటం జరిగిపోయాయి. దీంతో క్రిస్పిన్ పంట పండింది.