జిల్లాలో జడలు విదిలిస్తున్న బెట్టింగ్‌ భూతం | Ðbetting mafia in district | Sakshi
Sakshi News home page

జిల్లాలో జడలు విదిలిస్తున్న బెట్టింగ్‌ భూతం

Published Mon, Nov 21 2016 6:23 PM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM

జిల్లాలో జడలు విదిలిస్తున్న బెట్టింగ్‌ భూతం - Sakshi

జిల్లాలో జడలు విదిలిస్తున్న బెట్టింగ్‌ భూతం

ఏలూరు అర్బన్‌ ః జిల్లాలో బెట్టింగ్‌ భూతం మరోమారు జడలు విప్పి నాట్యం చేస్తుంది. జిల్లా పోలీసులు బెట్టింగ్‌ నిర్మూలించేందుకు తీసుకున్న చర్యల కారణంగా గత కొద్ది కాలంగా జిల్లాలో స్థబ్డంగా ఉన్న బెట్టింగ్‌ వ్యాపారం ఇటీవలి కాలంలో తిరిగి హల్‌చల్‌ చేస్తున్నారు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన అమెరికా ఆ«ద్యక్ష ఎన్నికల సందర్బంగా డొనాల్డ్‌ ట్రంప్, హిల్లరీల మధ్య జరిగిన ఎన్నికలు, న్యూజిలాండ్, భారత్‌ మధ్య జరిగిన క్రికెట్‌ పోటీల నేపథ్యంలో బెట్టింగ్‌ రాయుళ్ళు పందాల మానియాకు గురికావడం బుకీలకు వరంగా మారింది.  ప్రజలకు జూదంపై ఉన్న మక్కువను, బలహీనతలను  ఆసరాగాచేసుకుని బెట్టింలను పూర్తిస్థాయి వ్యాపారాంగా మార్చేస్తున్నారు. అక్రమమార్గంలోనైనా సులువుగా డబ్బు సంపాదించాలనే లక్ష్మంతో ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్న అక్రమార్కులు బెట్టింగ్‌లో సాంకేతికతను జోడిస్తున్నారు. నిత్యం పశ్చిమగోదావరి జిల్లాలోని పట్టణాలతో పాటు పొరుగున ఉన్న తూర్పుగోదావరి జిల్లాలోని బుకీలతో కలుపుకుని నిత్యం లక్షల్లో జరుగుతున్న బెట్టింగ్‌ వ్యాపారాన్ని  జనసంచారం ఎక్కువగా ఉండే అపార్ట్‌మెంట్‌లలోని ఫ్లాట్‌లలో కేవలం ఒక టివి సెల్‌ఫోన్‌లతో నడిపించేస్తున్నారు. ఈ వ్యాపారానికి నిరుద్యోగులు, విద్యార్ధులు, వ్యాపారులు, ఉద్యోగులతో పాటు పారిశ్రామిక వేత్తలను మూల«దనంగా మార్చుకుని బెట్టింగ్‌ వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారు. ఇందుకు బుకీలకు ఉన్న పరిచయాలే పెట్టుబడి కావడంతో నానాటì కీ పెట్టుబడి, నష్టం అనే మాటే వినపడని బెట్టింగ్‌ వ్యాపారానికి ప్రధాన ఆకర్షగా మారడం పోలీసులకు సవాలుగా మారుతోంది. ఈ నేపథ్యంలో జల్లాలో పోలీసులు విస్తుతంగా దాడులు చేస్తున్న సందర్భంగా బుకీలు తమ వద్ద నగదు లేకుండా జాగ్రత్త పడడడంతో పోలీసులకు టివి, ల్యాప్‌టాప్, ఆన్‌లైన్‌ బాక్స్, సెల్‌ఫోన్‌లు మినహా భారీగా నగదు చిక్కడం లేదు. గడచిన నెలరోజుల కిందట జిల్లాలో జరిగిన బెట్టింగ్‌లకు సంబంధించి వివిధ ప్రాంతాల్లో పోలీసులు దాడులు చేసి నమోదు చేసిన కేసులు బెట్టింగ్‌ భూతం విచ్చలవిడి తనానికి సజీవ సాక్ష్మాలుగా నిలుస్తున్నాయి.
 భీమవరంలో
గడచిన అక్టోబర్‌ , 7వ తేదీన పాలకొల్లు పట్టణం కొత్త కుళాయి గట్టు వెంకటేశ్వరస్వామి కాలనీలోని బివిఆర్‌ అపార్ట్‌మెంట్, 501వ నంబర్‌ ఫ్లాట్‌లో గుట్టు చప్పుడు కాకుండా భారీగా నిర్వహిస్తున్న క్రికెట్‌ బెట్టింగ్‌ స్థావరంపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో బుకీలు ముదునూరి ప్రదీప్, పెన్మెత్స సాయి దిలీప్‌ కుమార్‌ వర్మ, పెన్మెత్స రామకృష్టంరాజు, కాలినీడు పవన్‌కుమార్‌ రాజు, ఇసుకమర్తి సతీష్‌లను అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ. 24,020ల నగదు స్వాధీనం చేసుకోవడంతో పాటు బెట్టింగ్‌కు ఉపయోగిస్తున్న 25 సెల్‌ఫోన్‌లు, రెండు ల్యాప్‌టాప్‌లు, ఒక లైన్‌బాక్స్‌ అనే ఆధునికి యంత్రాన్ని స్వా«ధీనం చేసుకున్నారు. 
 తాడేపల్లిగూడెంలో 
అక్టోబర్, 10న తాడేపల్లిగూడెంలోని సత్యవతి నగర్‌లో సూర్యచంద్ర అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌లో బెట్టింగ్‌ స్థావంరపై పోలీసులు దాడి చేశారు.  ఈ దాడిలో బెట్టింగ్‌ నిర్వహిస్తున్న మునగాల సత్యనారాయణ, మునగాల శ్రీనివాస్, కనపర్తి ఇళయరాజా అనే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 1200ల నగదు, టివి, రెండు ల్యాప్‌టాప్‌లు, 12 సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు.
 భీమవరంలో
అక్టోబర్, 29న భీమవరం వన్‌టౌన్‌ పోలీసులు పట్టణంలో ఒక ఇంటిలో గుట్టుగా జరుగుతున్న క్రికెట్‌ బెట్టింగ్‌ స్థావరంపై దాడి చేశారు. ఈ దాడిలో బెట్టింగ్‌ నిర్వహిస్తున్న  ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.4,460లు, ఒక ల్యాప్‌టాప్, ఒక లైన్‌ బాక్స్, టివి, సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు.
 నల్లజర్ల మండలం దూబచర్లలో
ఈ నెల 9న నల్లజర్ల మండలం దూబచర్ల గ్రామంలో బుకీ కొమ్మన గోపాలకృష్ణను అనంతపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ. 50,000లు, టివి, ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నారు. 
ప్రస్తుతం దేశంలో భారత్‌ ఇగ్లండ్‌ దేశాల మధ్య క్రికెట్‌ పోటీలు జరుగుతున్న నేపథ్యంలో క్రికెట్‌ బెట్టింగ్‌లు, బుకీల కదలికలపై పోలీసులు మరింతగా దృష్టి సారించాల్సి ఉంది.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement