క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
Published Sat, Apr 22 2017 11:13 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
రూ.1.60 లక్షలు స్వాధీనం
రాజమహేంద్రవరం క్రైం : క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా సభ్యులను రాజమహేంద్రవరం పోలీసులు అరెస్ట్ చేశారు. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి. రాజకుమారి తెలిపిన వివరాల ప్రకారం తాడితోట, ఏసీవై కాలనీలోని పళ్ల సత్తిరాజు ఇంట్లో శనివారం జరుగుతున్న 20–20 క్రికెట్ మ్యాచ్ పూనే వర్సెస్ ముంబయి ఇండియ¯Œ్స క్రికెట్ మ్యాచ్‌కు బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా సభ్యులు ప్రభునాయుడు, కామేశ్వరరావు, పళ్ల సత్తిరాజులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ 1.60 లక్షలు నగదు, 9 సెల్‌ఫోన్‌లు, ఒక ల్యాప్ ట్యాప్, టీవీ, బ్యాటరీలు, స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ప్రభునాయుడు, కామేశ్వరరావులు 2014 నుంచి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ పట్టుబడిన కేసు వన్‌టౌన్ పరిధిలో ఉందని తెలిపారు. ప్రధాన నిందితుడు వైజాగ్‌కు చెందిన మున్నిని అరెస్ట్ చేయ్యాల్సి ఉందని తెలిపారు. వీరిని అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపిన ఏజీఎస్ ఎస్సై రాంబాబు, కానిస్టేబుళ్లు తాతారావు, మణికంఠలను ఎస్పీ అభినందించారు. సెంట్రల్ జోన్ డీఎస్పీ కుల శేఖర్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ రామకృష్ణ, వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ రవీంద్ర, ఎస్సై రాజ శేఖర్ పాల్గొన్నారు.
క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తే కఠిన చర్యలు
క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాజమహేంద్రవరం అర్భ¯ŒS జిల్లా ఎస్పీ బి.రాజకుమారి తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే వారిపై నిఘా ఏర్పాటు చేస్తామని అన్నారు.
Advertisement
Advertisement