క్రికెట్‌ బుకీల అరెస్ట్‌ | cricket bookies arrest | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ బుకీల అరెస్ట్‌

Published Mon, Oct 24 2016 2:14 AM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

cricket bookies arrest

తాడేపల్లిగూడెం రూరల్‌ : ఆన్‌లైన్‌ ద్వారా బెట్టింగులు నిర్వహిస్తున్న క్రికెట్‌ బుకీలను అరె స్ట్‌ చేసినట్టు పట్టణ సీఐ ఎంఆర్‌ఎల్‌ఎస్‌ఎస్‌ మూర్తి తె లిపారు. వివరాలి లా ఉన్నాయి.. ఆదివారం రాత్రి స్థానిక సర్కిల్‌ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కైకరానికి చెందిన కనపర్తి ఇళయరాజా, మునగాల నాగశ్రీనివాస్, మునగాల సత్యనారాయణ అనే వ్యక్తులు పట్టణంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో క్రికెట్‌ బెట్టింగులు నిర్వహిస్తున్నారు. ఆది వారం భారత్‌–న్యూజిలాండ్‌ మ్యాచ్‌ సందర్భంగా ఆన్‌లైన్‌లో బెట్టింగులు నిర్వహిస్తుండగా  ఎస్‌ఐ ఐ.వీర్రాజు తన సిబ్బందితో దాడి చేశారు. నింది తులను అదుపులోకి తీసుకుని టీవీ, రెండు ల్యాప్‌టాప్‌లు, 12 సెల్‌ఫోన్లు, రూ.1,300 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సైలు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement