బెట్టింగ్ గ్యాగ్ అరెస్ట్
నంద్యాల: ఇంగ్లాండ్-భారత్ మధ్య బెంగళూరులో జరిగిన టి20-20 క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్‌కు పాల్పడుతూ పవన్ యువసేన టౌన్‌వైడ్ అధ్యక్షుడు దాసరి రవిశంకర్, అలియాస్ దాసరి రవి, మరో నలుగురు పోలీసులకు దొరికిపోయారు. డీఎస్పీ హరినాథరెడ్డి స్థానిక పోలీస్ అతిథి గృహంలో గురువారం విలేకరులకు వెల్లడించారు. శ్యాంనగర్‌లోని ఒక ఇంట్లో బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలియడంతో త్రీటౌన్ ఎస్‌ఐ జయన్న సిబ్బందితో దాడి చేశారు. దాసరి రవిశంకర్, సయ్యద్ ఖాదర్‌బాషా, షేక్‌సుభాన్, మొగల్ హారూన్‌బేగ్, మొగల్‌సికిందర్‌బేగ్ అరెస్ట్ చేసి రూ.1.70 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.