నగరంలో క్రికెట్ బెట్టింగ్‌లపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడులు కొనసాగుతున్నాయి. ఏసీపీలు ఏవీఆర్‌జీబీ ప్రసాద్, ....
వేర్వేరు ప్రాంతాల్లో ఆరుగురు బెట్టింగ్‌రాయుళ్ల అరెస్ట్
తొమ్మిది మంది పేకాటరాయుళ్లు కూడా..
మధురానగర్ : నగరంలో క్రికెట్ బెట్టింగ్‌లపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడులు కొనసాగుతున్నాయి. ఏసీపీలు ఏవీఆర్‌జీబీ ప్రసాద్, పి.మురళీధరన్‌ల పర్యవేక్షణలో ఆదివారం వేర్వేరు ప్రాంతాల్లో దాడులుచేసి ఆరుగురు బెట్టింగ్‌రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. మాచవరం ఎస్‌ఆర్‌ఆర్, సీవీఆర్ ప్రభుత్వ కళాశాల ఎదురుగా ఉన్న కూరగాయల మార్కెట్‌లో క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది దాడిచేశారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న జి.లక్ష్మణరావు, జి.విజయ్, ఎంవీ నరసింహారావులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.10,340 నగదు, మూడు సెల్‌ఫోన్లు, టీవీని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం మాచవరం పోలీసులకు అప్పగించారు.
గోసాల సెంటర్‌లో...
కంకిపాడు మండలం ఈడుపుగల్లులోని గోసాల సెంటర్‌లోని వెంకటరత్నం ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలియడంతో ఏసీపీలు ఏవీఆర్‌జీబీ ప్రసాద్, పి.మురళీధరన్, ఎస్‌ఐలు సురేష్‌రెడ్డి, జి.శ్రీనివాస్‌లు సిబ్బందితో కలిసి దాడిచేశారు. బెట్టింగ్ నిర్వహిస్తున్న బొబ్బా వెంకటరత్నం, పర్వతనేని రవీంద్ర, సానికొమ్ము వెంకటేశ్వర్లును అరెస్టుచేశారు. వారి నుంచి రూ.1,51,340 నగదు, సెల్‌ఫోన్, కంప్యూటర్, కొన్ని నోట్‌పుస్తకాలు సీజ్‌చేశారు. తదుపరి విచారణ నిమిత్తం వారిని కంకిపాడు పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు.
తొమ్మిది మంది పేకాటరాయుళ్ల అరెస్టు
గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక లాడ్జిలో పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని టాస్క్‌ఫోర్స్ సిబ్బంది అరెస్టు చేశారు. వారి నుంచి రూ.30వేలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కోసం గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు.