AP: విశాఖలో మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసు కలకలం | Two Arrested In Vizag By Ed Related To Mahadev Betting App Case | Sakshi
Sakshi News home page

విశాఖలో మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కేసు కలకలం

Published Sun, Jan 14 2024 3:00 PM | Last Updated on Sun, Jan 14 2024 3:19 PM

Two Arrested In Vizag By Ed  Related To Mahadev Betting App Case - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ముందు ఛత్తీస్‌గఢ్‌లో సంచలనం రేపిన మహదేవ్‌ బెట్టింగ్‌ స్కామ్‌ వైజాగ్‌లో కలకలం రేపుతోంది. వైజాగ్‌లో నమోదైన మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కామ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో వైజాక్‌కు చెందిన అమిత్ అగర్వాల్,  నితిన్ తిబ్రూయల్‌ను ఈడీ తాజాగా అదుపులోకి తీసుకుంది. 

నితిన్‌, అమిత్‌లు టెక్ ప్రో ఐటీ సొల్యూషన్ పేరుతో వైజాగ్‌లో కంపెనీ ఏర్పాటు చేశారు. మహదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా వచ్చిన నిధులను ఈ కంపెనీ ఖాతాలను వినియోగించి వీరిద్దరు మళ్లించారని ఈడీ ఆరోపిస్తోంది. బెట్టింగ్ యాప్‌లోలో వచ్చిన నిధులతో ఆస్తులు కొనుగోలు చేశారు. భార్యల పేరు మీద ఈ ఆస్తులన్నీ ఉంచారు. 

ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్‌ బాగేల్‌కు ఈ కేసులో ఈడీ ఇప్పటికే నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. ఇటీవలే ముగిసిన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ కేసు అక్కడ పెద్ద రాజకీయ దుమారం​ రేపింది. 

ఇదీచదవండి.. పండగ పూట విషాదం.. ముగ్గులు వేస్తుండగా 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement