- లక్షలాది రూపాయలు చేతులు మారుతున్న వైనం
- స్పందించని పోలీసులు
- బెట్టింగ్ ఊబిలో విద్యార్థులు
నాయుడుపేటటౌన్ : పట్టణంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగులు జోరందుకున్నాయి. ఈ దందాలో లక్షల్లో చేతులు మారుతున్నాయి. మారుమూల పల్లెలో కూడా బెట్టింగుల తంతు కొనసాగుతోంది. యథేచ్ఛగా బెట్టింగులు జరుగుతున్నా పోలీసులకు కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఐపీఎల్ లో 8 జట్టు పాల్గొంటున్న నేపథ్యంలో బెట్టింగులకు హద్దే లేకుండా పోయింది. వీటిలో చెన్నై సూపర్ కింగ్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కత్తా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్, కింగ్స్ లెవన్ పంజాబ్, ఢిల్లీ డేర్‌డెవిల్స్, సన్‌రైజర్స్, ముంబయ్ ఇండియన్స్ ప్రాతినిత్యం వహించే మ్యాచ్‌ల్లో ఎక్కువ బెట్టింగులు పెడుతున్నారు.
ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌కు జరిగే పోటీల్లో ఒక్క నాయుడుపేటలోనే లక్షల రూపాయల బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. టీమ్‌ను బట్టి బుకీలు పందెం రేట్లను నిర్ణయిస్తున్నారు. మ్యాచ్ ప్రారంభం నుంచి ఏ జట్టు టాస్ గెలుస్తోంది .. విజయం ఎవరిది .. ఎన్ని పరుగులు సాధిస్తారు.. బ్యాట్స్‌మెన్ కొట్టే బౌండరీలు, సిక్స్‌లు.. ఓవర్‌లో ఎన్ని పరుగులు తీస్తారు.. ఏ టీమ్ ఎక్కువ వికెట్లు కోల్పోతుంది.. తదితర ఆంశాలపై పందేలు కాస్తున్నారు. కొందరు విద్యార్థులు తమ తల్లిదండ్రుల వద్ద కళాశాల ఫీజులంటూ నగదు తీసుకువచ్చి బెట్టింగులు పెడుతూ నష్టపోతున్న సంఘటనలు ఇటీవల ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. బెట్టింగ్ బారి నుంచి విద్యార్థులను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
కాలనీల్లో జోరందుకుంటున్న సింగల్ నంబర్ల లాటరీలు...
ర్రూ10 చెల్లిస్తే వంద రూపాయులు వస్తాయన్న ఆశతో ఈ జూదంకు నిరుపేదలే వేలకు వేలు కడుతూ నష్టపోతున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు కూలి పనులకు పోయి వచ్చిన డబ్బులను సింగల్ నంబర్ల లాటరీలకు తగలేస్తున్నారు. చిన్న దర్గావీధి, పాత, కొత్త బీడీ కాలనీలు, లోతువానిగుంట, మునిరత్నం నగర్, కలగూరపేట తదితర ప్రాంతాల్లో జోరుగా సింగిల్ నంబర్ల జూదాన్ని అక్కడి సీక్రెట్ ఏజెంట్‌లు ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి తక్షణమే ఈ అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయాలి.
యథేచ్ఛగా బెట్టింగులు
Published Tue, May 5 2015 4:19 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement