IPL Cricket
-
వీర ఐపీఎల్ విజయగాథ!
దేశంలో లోక్‌సభ ఎన్నికలకు సమాంతరంగా రెండు నెలల పైగా సాగిన క్రికెట్ వేడి ఎట్టకేలకు ముగిసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 17వ ఎడిషన్‌కు ఆదివారం నాటి ఫైనల్‌తో శుభం కార్డు పడింది. కలకత్తా నైట్ రైడర్స్ (కేకేఆర్), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)ల మధ్య చెన్నైలో జరిగిన తుది సమరం అనూహ్యంగా ఏకపక్షంగా సాగింది. తొమ్మిది ఓవర్లు మిగిలి ఉండగానే, 8 వికెట్ల తేడాతో కేకేఆర్ విజయం సాధించి, కప్ చేజిక్కించుకుంది. 2014 తర్వాత సరిగ్గా దశాబ్ద కాలపు నిరీక్షణకు తెర దించి, మూడోసారి విజేతగా నిలిచింది. ఫైనల్ చప్పగా ముగిసిందన్న మాటే కానీ, గత రెండునెలలుగా ఐపీఎల్ పట్ల జనంలో వ్యక్తమైన ఉత్సాహం, ఉద్వేగాలను తక్కువ చేయలేం. 2008లో ఆరంభమైన ఐపీఎల్ ఏయేటికాయేడు ప్రాచుర్యం పెంచుకుంటూ, ప్రస్తుతం ప్రపంచస్థాయి సంబరంగా మారింది. నరాలు తెగే ఉత్కంఠ, వినోదం అందించే ఈ పొట్టి ఫార్మట్ క్రికెట్ ఆట వీరాభిమానుల నుంచి అదాటుగా చూసేవారి దాకా అందరినీ ఆకర్షించగలుగుతోంది. అంతర్జాతీయ ఆటగాళ్ళతో కలసి ఆడడమే కాక, శిక్షణ, వ్యూహరచనల్లో భాగస్వాములు కావడంతో మన కొత్త తరం ఆటగాళ్ళు రాటుదేలడానికి కావాల్సినంత వీలు చిక్కుతోంది. ఈసారి మొత్తం 74 మ్యాచ్‌ల ఐపీఎల్ అనేక ఆశ్చర్యాలను ఆవిష్కరించింది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సిక్సులు (1260), అత్యధిక సెంచరీలు, 9 అత్యధిక స్కోర్లలో 8 ఈ సీజన్లోనే వచ్చాయి. వాటిలోనూ 5 అత్యధిక స్కోర్లు ఫైనల్లో తలపడిన కేకేఆర్, ఎస్ఆర్హెచ్లు సాధించినవే! విరాట్ కోహ్లీ ఈ సీజన్లో 741 పరుగులు చేసి తన ఐపీఎల్ కెరీర్లోనే రెండో అత్యధిక పరుగుల వరద పారించాడు. అదీ కనివిని ఎరుగని 154.70 రేటుతో! ఏడు మ్యాచ్‌లలో వరుసగా 6 మ్యాచ్‌లు ఓడి, రెండే రెండు పాయింట్లు సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు ఆపైన వరుసగా 6 మ్యాచ్‌లు భారీ తేడాతో గెలిచి, ప్లేఆఫ్ దశకు చేరడం మరో అబ్బురం. ఆశలు వదులుకోకుండా నిలబడి, కలబడితే ఏదైనా సాధ్యమనే పాఠానికి నిదర్శనం. అలాగే, అంకితభావం ఉంటే వయసనేది అడ్డంకి కాదని, గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో 42 ఏళ్ళ ధోనీ గాలిలోకి 3 మీటర్లు గెంతి మరీ ఒంటిచేతితో పట్టిన విజయ్‌శంకర్ క్యాచ్ నిరూపించింది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో కప్ గెలిచిన కేకేఆర్ ఈసారి సాధించిన విజయంలో గమనించాల్సిన ఒక ప్రత్యేకత ఉంది. కేకేఆర్‌లో భారత క్రికెట్ జట్టు మెగాస్టార్స్ ఎవరూ లేరు. అయినా సరే టోర్నమెంట్లో అద్భుత ప్రతిభ కనబరిచింది. ఆ జట్టు పక్షాన అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్ సునీల్ నరైన్ నిజానికి మొత్తం పట్టికలో 9వ స్థానంలో ఉంటాడు. కానీ, టాప్ ఆర్డర్లో బ్యాటింగ్‌కు దిగి స్కోర్‌బోర్డ్‌ను పరుగులెత్తించిన తీరు, చూపిన ప్రభావం అసామాన్యం. కేకేఆర్ జట్టు కప్పు గెలిచిన గడచిన రెండుసార్లు (2012, 2014) కూడా ఆ యా సీజన్లలో అత్యధిక వికెట్లు (24, 21) తీసింది ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ కమ్ రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నరే! ఈ సీజన్లోనూ 15 వికెట్లు, 488 పరుగులు సాధించి, ముచ్చటగా మూడోసారి ‘మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్’ అవార్డు అందుకున్నాడు. సునీల్ కాక మరొక్క టాప్ 20 ఆటగాడు మాత్రమే కేకేఆర్ జట్టులో కనిపిస్తాడు. అయితేనేం, ఆ జట్టు మైదానంలో జోరు కొనసాగించి, విజయతీరాలు చేరింది.పరుగుల వరద ఎప్పటి కన్నా మరో మెట్టు పైకెక్కి బ్యాట్స్మన్ల రాజ్యంగా సాగిన టోర్నీ ఇది. ఈ పరిస్థితుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టే బౌలర్ లేకున్నా టాప్5 బౌలర్లలో ముగ్గురున్న కేకేఆర్ గెలుపు నమోదు చేసింది. అలాగే, కొన్నేళ్ళుగా విజయాలు రాకున్నా... ఇష్టారీతిన జట్టును మార్చేయకుండా, ఆటగాళ్ళను నమ్మి వారిని కొనసాగిస్తే అద్భుతాలు సాధ్యమేనని నిరూపించింది. పస అయిపోందని పలువురు విమర్శించినా... సునీల్, వరుణ్ చక్రవర్తి, వెంకటేశ్ అయ్యర్‌లను దీర్ఘకాలంగా జట్టులోనే అట్టిపెట్టుకుంది. ఆసిస్ పేసర్ మిషెల్ స్టార్క్ తాజా టోర్నీలో మొదట రాణించకున్నా అతణ్ణి కొనసాగించింది. అవన్నీ కీలక సమయంలో ఫలించాయి. వెరసి, పేరున్న ఆటగాళ్ళపై అతిగా ఆధారపడ్డ ఇతర ఫ్రాంఛైజీలకు కేకేఆర్ కథలో ఓ పాఠముంది. భారతజట్టులో ఆడకపోతేనేం, ప్రతిభావంతులైన యువతరంతో అద్భుతాలు చేయవచ్చని కేకేఆర్ ప్రస్థానం చాటింది.ఆదాయంలో, ఆకర్షణలో భారత జాతీయక్రీడ హాకీ సహా అన్నింటినీ క్రికెట్ ఎన్నడో మించిపోయింది. ఐపీఎల్ దెబ్బతో స్థానిక, రాష్ట్ర స్థాయుల్లోనూ టీ20 క్రికెట్ పోటీలొచ్చాయి. మన ఐపీఎల్ మూసలో ఆస్ట్రేలియాలో బిగ్‌బాష్, సౌతాఫ్రికాలో ఎస్ఏ 20 లీగ్, వెస్టిండీస్‌లో కరేబియన్ ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్ – బంగ్లాదేశ్ – శ్రీలంకల్లోనూ ఆ యా దేశాల ప్రీమియర్ లీగ్‌లు వచ్చేశాయి. ప్రతిభావంతులైన యువ భారతీయ క్రికెటర్ల ప్రత్యామ్నాయ కెరీర్‌కు ఇది ద్వారాలు తెరిచింది. అదే సమయంలో ఈ వెర్రి పెచ్చుమీరిన బెట్టింగ్ బెడద తెచ్చింది. బ్యాట్‌కూ బంతికీ మధ్య పోటీలో సమతూకాన్ని చెడగొట్టింది. గత 16 విడతల ఐపీఎల్ టోర్నీల్లో మొత్తం 1032 మ్యాచ్‌లు ఆడితే, వాటిలో 250 పైచిలుకు స్కోర్లు వచ్చింది రెండు, మూడు మ్యాచ్‌లలోనే. కానీ, ఈ తడవ ఏకంగా 8సార్లు అది జరిగింది. బ్యాట్స్మన్లదే పైచేయిగా మారుతున్న ఈ లోపాన్ని సరిదిద్దేందుకు బీసీసీఐ కొత్త రూల్‌ను ఆలోచించకపోతే కష్టమే. ఏమైనా, ఈ ఏటి ఐపీఎల్ సీజన్ ముగిసింది. రెండేళ్ళకు ఒకసారి జరిగే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ ఆదివారం మొదలవుతోంది. రోహిత్‌శర్మ జట్టులో సభ్యులైనæ కోహ్లీ, పంత్ తదితరులు గనక ప్రస్తుత ఐపీఎల్ ప్రతిభాప్రదర్శననే ఆ వరల్డ్ కప్‌లోనూ కొనసాగిస్తే అంతకన్నా కావాల్సింది ఏముంది! చాలాకాలంగా ఊరిస్తున్న కప్పు మళ్ళీ మన ఇంటికొస్తుంది!! -
#SRHVsMI: ఉప్పల్ మ్యాచ్‌కు వెళ్తున్నారా? ఇవి తెలుసుకోండి
క్రికెట్ అభిమానులను అలరించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) భాగ్యనగరానికి మళ్లీ వచ్చేసింది. ఉప్పల్ స్టేడియంలో నేటి రాత్రి జరిగే మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో హోం టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. తమ తొలి మ్యాచ్‌లు ఓడిన ఈ రెండు టీమ్‌లూ సీజన్లో బోణీపై గురి పెట్టాయి. వారాంతం కానీ, సెలవు దినం కానీ కాకపోయినా ముంబైలాంటి పెద్ద జట్టు ఆడుతుండటంతో మైదానంలో ప్రత్యక్షంగా మ్యాచ్ చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపిస్తున్నారు. మంగళవారం ఇరు జట్ల ప్లేయర్లు గ్రౌండ్లో సుదీర్ఘ సమయం సాధన చేశాయి. ఇక అభిమానులు అసలు పోరును ఆస్వాదించడమే తరువాయి. ఉప్పల్/సాక్షి, హైదరాబాద్: ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బుధవారం జరిగే ఐపీఎల్ మ్యాచ్‌కు భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ తరుణ్ జోషి తెలిపారు. మల్కాజిగిరి డీసీపీ పద్మజ, ట్రాఫిక్ డీసీపీ మనోహర్, ట్రాఫిక్ ఏసీపీ చక్రపాణిలతో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 3 గంటల ముందుగానే రావచ్చు.. ► 2,800కు పైగా వివిధ విభాగాల పోలీస్ బలగాలు 360 సీసీ కెమెరాలతో బందోబస్తును ఏర్పాటు చేశాం. సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌కు 3 గంటల ముందే ప్రేక్షకులను స్డేడియంలోకి అనుమతిస్తాం. ► స్టేడియంలోకి ఎలాంటి వస్తువులను తీసుకురావద్దు. సిగరెట్, లైటర్, బ్యానర్స్, ల్యాప్ ట్యాప్‌లు, బ్యాటరీలు, ఫర్ఫ్యూమ్స్, హెల్మెట్లు, బైనాక్యూలర్లు, అగ్గిపెట్టె, కెమెరాలు, ఎల్రక్టానిక్ పరికరాలు, పెన్నులు, వాటర్ బాటిళ్లు, బయటి తిను భండారాలకు స్టేడియంలోకి తీసుకురావద్దు. కారు పాస్ ఉన్నవారు రామంతాపూర్ నుంచి రావాలి. ఫిజికల్ చాలెంజెస్ వ్యక్తులు గేట్–3 ద్వారా వెళ్లాలి. ► క్రికెట్ అభిమానులకు వెసులుబాటుగా మెట్రో రైల్, ఆర్టీసీ బస్సుల అదనపు ట్రిప్పులు. ట్రాఫిక్ దారి మళ్లింపు ఇలా.. వరంగల్ నుంచి ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలు చెంగిచర్ల ఎక్స్‌రోడ్డు, చర్లపల్లి ఐవోసీ కేంద్రం, ఎన్ఎఫ్సీ నుంచి వెళ్లాలి. ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వచ్చే వాహనాలు నాగోల్ మెట్రో స్టేషన్, ఉప్పల్ భగాయత్ నుంచి చెంగిచర్ల మీదుగా వెళ్లాలి. సికింద్రాబాద్ నుంచి వచ్చే వాహనాలు నాచారం పారిశ్రామిక వాడ ద్వారా చెంగిచర్ల మీదుగా వరంగల్ వైపు వెళ్లాలి. టికెట్లకు తప్పని ఇక్కట్లు ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్‌కు సంబంధించి టికెట్లను ఈసారి పేటీఎం ఇన్సైడర్ యాప్ లేదా వెబ్సైట్లో మాత్రమే విక్రయించారు. ప్రకటించిన కొద్ది సమయంలోనే ‘సోల్డ్ ఔట్’ అని చూపించడంతో క్రికెట్ అభిమానుల్లో నిరాశా నిస్పృహలు నెలకొన్నాయి. ఇంత తక్కువ సమయంలో వేల టిక్కెట్లు ఎలా అమ్ముడుపోయాయని ఆందోళన చెందుతున్నారు. -
హోరా హోరీ ఐపీఎల్: నిలిచేదెవరు..? గెలిచేదెవరు..?
-
బెట్టింగ్.. బెట్టింగ్
⇒ ఐపీఎల్ క్రికెట్ పోటీల నేపథ్యంలో పందేలు ⇒ కళాశాల విద్యార్థుల మొదలు యువకుల వరకు బిజీబిజీ.. వరంగల్ రూరల్: ఐపీఎల్ క్రికెట్ పోటీల నేపథ్యంలో బెట్టింగ్ రాయుళ్లు తమ పని కానిచ్చేస్తున్నారు. బెట్టింగ్‌కు ప్రక్రియను ఇక్కడ అక్కడ అని కాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, స్మార్ట్ఫోన్లతో కానిచ్చేస్తున్నారు. గతంలో ఎక్కువగా బడాబాబులు బెట్టింగ్‌ల్లో పాల్గొనేవారు. కానీ ప్రస్తుతం కళాశాల విద్యార్థులు, యువత సైతం సరదాగా పందేలు వేసుకునే స్థాయి నుంచి బెట్టింగ్ స్థాయికి వెళ్లారు. ఇంటర్ విద్యార్థుల నుంచి ఉన్నత చదువులు చదివే విద్యార్థులు సైతం ఈ బెట్టింగ్‌కు ఆకర్షితులవుతున్నారు. హైదరాబాద్ తరువాత రాష్ట్రంలో పెద్దదైన, కీలకమైన వరంగల్ నగరం వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాలకు కేంద్రంగా ఉండడంతో పాటు చుట్టుపక్కల ఉన్న జిల్లాలకు కూడలిగా ఉండడంతో బెట్టింగ్ అడ్డాగా మారింది. బెట్టింగ్‌లు ముఖ్యంగా బార్లు, గ్రామాల్లో బెల్టు దుకాణాల వద్ద సైతం నడుస్తున్నాయి. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న చిన్న పట్టణాల్లో సైతం ఈ బెట్టింగ్ జాడ్యం కొనసాగుతోంది. ముఖ్యంగా బార్లలో పెద్ద స్క్రీన్ టీవీలు ఏర్పాటు చేస్తుండడంతో అక్కడే కొందరు గ్రూపులుగా ఏర్పడి బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. కొందరు నేరుగా బెట్టింగ్ కొనసాగిస్తుండగా, మరికొందరు కోడ్భాషను వాడుతూ బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. ఈ ఐపీఎల్ క్రికెట్ పోటీలు అర్థరాత్రి వరకు జరుగుతుండడంతో బార్లలో కుదరని వారు కొన్ని ప్రాంతాలను డెన్లుగా ఏర్పాటు చేసుకుని ఆయా గ్రూపులవారు బెట్టింగ్ చేస్తున్నారు. చివరకు కార్లలో సైతం కూర్చుని నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో బెట్టింగ్ తంతు కొనసాగిస్తున్నారు. ఇక బెట్టింగ్ ప్రక్రియ రకరకాలుగా నడుస్తోంది. కొందరు గ్రూపులుగా విడిపోయి బ్యాట్స్‌మన్‌ను గ్రూపులు చేసుకుంటారు. రన్‌కు ఇంత అని, ఫోర్ కొడితే, సిక్స్ కొడితే ఇంత, వికెట్ పడితే ఇంత అంటూ పందేలు కాస్తున్నారు. ఇక టీంల సంగతి, మ్యాచ్ ఫలితం విషయంలో మాత్రం పెద్దమొత్తంలో బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా ఈ బెట్టింగ్‌లో ఉపయోగిస్తుండడంతో ఈ జాడ్యాన్ని పోలీసులు ఒక ప ట్టాన కనుక్కునే అవకాశం లేకపోవడంతో ఈ బెట్టింగ్ రాయుళ్లు మరింత విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. -
యువకుడికి క్రిక్‌బజ్ రూ. 10లక్షల బహుమతి
దుగ్గిరాల(గుంటూరు జిల్లా): ఐపీఎల్ క్రికెట్ పై క్రిక్ బజ్.కాం నిర్వహించిన డ్రీమ్ టీమ్ ఎంపిక స్కీమ్‌లో దుగ్గిరాలకు చెందిన యువకుడు జంపాల శివ కుమార్ జాక్‌పాట్ కొట్టేశాడు. ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో శివకుమార్ ఎంపిక చేసిన టీమ్ మొదటి బహుమతి గెల్చుకుంది. ఆదివారం జరిగిన చెన్నై, ముంబాయి జట్ల నుంచి 11 మంది క్రీడాకారులతో ఎంపిక చేసిన జట్టు 389 పాయింట్లు రావటంతో ప్రపంచ వ్యాప్తంగా పాల్గొన్న 3 వేల జట్లలో ప్రథమ స్థానంలో నిలిచింది. మొత్తం రూ.25 లక్షల బహుమతుల ప్రకటించగా ప్రథమ స్థానంలో నిలిచిన తాను రూ.10 లక్షలు బహుమతికి అర్హత సాధించినట్టు శివకుమార్ చెప్పారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన 30.9 శాతం పన్నులు మినహాయించి, రూ.7.25 లక్షలు ఐదు రోజుల్లో డ్రా చేసుకునే విధంగా అవకాశం ఇచ్చినట్టు చెప్పారు. అందుకు అవసరమైన పాన్‌కార్డు, బ్యాంకు వివరాలను క్రిక్ బజ్ వారు కోరటంతో అన్ని వివరాలు పంపినట్టు తెలిపాడు. క్రికెట్‌పై ఆసక్తే తనకు రూ.10 లక్షలు బహుమతి గెలుసుకునేలా చేసిందని ఆనందం వ్యక్తం చేశాడు. -
బెట్టింగ్.. బెట్టింగ్
ప్రొద్దుటూరు క్రైం : సుమారు 40 రోజుల పాటు క్రికెట్ ప్రేమికుల్లో ఉత్సాహాన్ని నింపిన ఐపీఎల్ క్రికెట్ పండుగ ముగింపు దశకు వచ్చింది. నేడు (ఆదివారం) ఐపీఎల్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ కల్కత్తాలోని ఈడెన్గార్డెన్లో జరగ నుంది. ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్ ముగిసిన వెంటనే ఐపీఎల్-15 సీజన్ ప్రారంభమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఐపీఎల్ సీజన్లో పందేలు పెద్ద ఎత్తున జరిగినట్లు తెలుస్తోంది. తీవ్రంగా నష్టపోతున్న యువత ఈ సారి జరిగిన ఐపీఎల్ మ్యాచుల్లో క్రికెట్ పందేలు కాస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. అన్ని కళాశాలలకు వేసవి సెలవులు కావడంతో డిగ్రీ, ఇంటర్ చదువుతున్న విద్యార్థులు బెట్టింగ్ ఊబిలో పడినట్లు పోలీసు వర్గాల సమాచారం. చాలా మంది బుకీలు విద్యార్థులకు డబ్బు ఎరచూపి కొరియర్లుగా ఉపయోగించుకుంటున్నారు. మ్యాచ్ జరిగిన అనంతరం విద్యార్థుల ద్వారానే బుకీలు లావాదే వీలు జరిపిస్తున్నారు. గతంలో అయితే ఒక చోట టీవీలు ఏర్పాటు చేసుకొని బెట్టింగ్ నిర్వహించేవారు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావడంతో సెల్ఫోన్లో లైవ్ క్రికెట్ ద్వారా పందేలు కాస్తున్నారు. పట్టణంలోని మెయిన్‌బజార్, దస్తగిరిపేట, వైఎంఆర్‌కాలనీ, మిట్టమడివీధి, భగత్‌సింగ్‌కాలనీ, గాంధీరోడ్డు, ఆర్ట్స్ కాలేజిరోడ్డు సర్కిల్, తదితర ప్రాంతాలలో బెట్టింగ్ పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించి బుకీలు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు తెలిసింది. ప్రధాన బుకీలు శనివారం రాత్రికే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు లాంటి ప్రాంతాలకు వెళ్లిపోయారు. సబ్ బుకీలు మాత్రమే స్థానికంగా ఉంటూ బెట్టింగ్ వ్యవహారాలు నడుపుతున్నారు. గ్రామాలకు పాకిన జాడ్యం.. గత కొన్ని రోజుల వరకూ పట్టణాలలో మాత్రమే క్రికెట్ బెట్టింగ్ నిర్వహించేవారు. అయితే బెట్టింగ్ జాడ్యం గ్రామాలకు కూడా బాగా పాకినట్లు కనిపిస్తోంది. ప్రొద్దుటూరు చుట్టుపక్కల ఉన్న రాజుపాళెం, ఎర్రగుంట్ల, చాపాడు మండలాల్లోని గ్రామాల్లో క్రికెట్ పందేలు జరుగుతున్నాయి. పోలీసుల మౌనం.. గతంలో ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా ప్రతి రోజూ బుకీలను పోలీసులు అరెస్ట్ చేసేవారు. అయితే ఈ సారి ఎందుకో పోలీసులు బుకీల జోలికి వెళ్లలేదు. రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఒక అరెస్ట్ మినహా, 40 రోజుల్లో ఇతర స్టేషన్ల పరిధిలో ఒక్క బుకీని కూడా అరెస్ట్ చేయలేదు. ప్రొద్దుటూరులో బెట్టింగ్ జరగడంలేదా.. లేక బెట్టింగ్ జరుగుతున్నా పోలీసులు సెలైంట్‌గా ఉన్నారా అనేది ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. సమాచారం తెలిస్తే అరెస్ట్ చేస్తాం.. బెట్టింగ్ జరుగుతోందని సమాచారం తెలిస్తే మాత్రం ఎంతటి వారినైనా వదిలేది లేదని డీఎస్పీ పూజితానీలం అన్నారు. బుకీలు అందరూ ఎక్కడో హైదరాబాద్‌లో బెట్టింగ్ చేస్తుంటే అరెస్ట్ చేయడంలో ఇబ్బందులు ఉన్నాయన్నారు. స్థానికంగా మాత్రం నిఘాపెట్టామని తెలిపారు. -
యథేచ్ఛగా బెట్టింగులు
- లక్షలాది రూపాయలు చేతులు మారుతున్న వైనం - స్పందించని పోలీసులు - బెట్టింగ్ ఊబిలో విద్యార్థులు నాయుడుపేటటౌన్ : పట్టణంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగులు జోరందుకున్నాయి. ఈ దందాలో లక్షల్లో చేతులు మారుతున్నాయి. మారుమూల పల్లెలో కూడా బెట్టింగుల తంతు కొనసాగుతోంది. యథేచ్ఛగా బెట్టింగులు జరుగుతున్నా పోలీసులకు కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి. ఐపీఎల్ లో 8 జట్టు పాల్గొంటున్న నేపథ్యంలో బెట్టింగులకు హద్దే లేకుండా పోయింది. వీటిలో చెన్నై సూపర్ కింగ్, రాజస్థాన్ రాయల్స్, కోల్కత్తా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్, కింగ్స్ లెవన్ పంజాబ్, ఢిల్లీ డేర్‌డెవిల్స్, సన్‌రైజర్స్, ముంబయ్ ఇండియన్స్ ప్రాతినిత్యం వహించే మ్యాచ్‌ల్లో ఎక్కువ బెట్టింగులు పెడుతున్నారు. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌కు జరిగే పోటీల్లో ఒక్క నాయుడుపేటలోనే లక్షల రూపాయల బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. టీమ్‌ను బట్టి బుకీలు పందెం రేట్లను నిర్ణయిస్తున్నారు. మ్యాచ్ ప్రారంభం నుంచి ఏ జట్టు టాస్ గెలుస్తోంది .. విజయం ఎవరిది .. ఎన్ని పరుగులు సాధిస్తారు.. బ్యాట్స్‌మెన్ కొట్టే బౌండరీలు, సిక్స్‌లు.. ఓవర్లో ఎన్ని పరుగులు తీస్తారు.. ఏ టీమ్ ఎక్కువ వికెట్లు కోల్పోతుంది.. తదితర ఆంశాలపై పందేలు కాస్తున్నారు. కొందరు విద్యార్థులు తమ తల్లిదండ్రుల వద్ద కళాశాల ఫీజులంటూ నగదు తీసుకువచ్చి బెట్టింగులు పెడుతూ నష్టపోతున్న సంఘటనలు ఇటీవల ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. బెట్టింగ్ బారి నుంచి విద్యార్థులను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాలనీల్లో జోరందుకుంటున్న సింగల్ నంబర్ల లాటరీలు... ర్రూ10 చెల్లిస్తే వంద రూపాయులు వస్తాయన్న ఆశతో ఈ జూదంకు నిరుపేదలే వేలకు వేలు కడుతూ నష్టపోతున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు కూలి పనులకు పోయి వచ్చిన డబ్బులను సింగల్ నంబర్ల లాటరీలకు తగలేస్తున్నారు. చిన్న దర్గావీధి, పాత, కొత్త బీడీ కాలనీలు, లోతువానిగుంట, మునిరత్నం నగర్, కలగూరపేట తదితర ప్రాంతాల్లో జోరుగా సింగిల్ నంబర్ల జూదాన్ని అక్కడి సీక్రెట్ ఏజెంట్లు ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు స్పందించి తక్షణమే ఈ అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయాలి. -
పెట్టుబడుల్లో నిలువెత్తు శిల్పాశెట్టి
సెలబ్రిటీ స్టైల్.. బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి.. సాహసవీరుడు-సాగర కన్య లాంటి కొన్ని తెలుగు సినిమాల్లోనూ అలరించింది. సినిమాల్లో అవకాశాలు కాస్త తగ్గినప్పుడు బిగ్ బ్రదర్ రియాలిటీ షోలో విజేతగా నిల్చి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. మధ్యమధ్యలో వివాదాలు ఉన్నా .. ఐపీఎల్ క్రికెట్, ఆభరణాలు, రియల్టీ వంటి వ్యాపార రంగాల్లోనూ మెరుస్తోంది. కొత్త వెంచర్లతో ముందుకు సాగిపోతున్న శిల్పా శెట్టి ఇన్వెస్ట్మెంట్లు, మనీ మేనేజ్మెంట్పై ఆమె అభిప్రాయాలు సెలబ్రిటీ స్టయిల్లో.. బిజినెస్ వెంచర్లు, టీవీ షోలు, ఎండార్స్మెంట్లు మొదలైన వాటి ద్వారా శిల్పా శెట్టి సంపద విలువ దాదాపు రూ. 1,200 కోట్ల మేర ఉంటుందని అంచనా. కేవలం గ్లామర్ ఫీల్డ్కి మాత్రమే పరిమితం కాకుండా వ్యాపారవేత్తగా కూడా రాణిస్తోంది శిల్పా శెట్టి. బిగ్ బ్రదర్ షోతో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన పాపులారిటీని వృథాగా పోనివ్వకుండా అప్పటికప్పుడు తన పేరుతో ఎస్2 పర్ఫ్యూమ్ని లాంచ్ చేసింది. అలాగే, యోగాపై డీవీడీ వీడియోలు ప్రవేశపెట్టింది. మరోవైపు, బిజినెస్‌మ్యాన్ భర్త రాజ్ కుంద్రా సహకారంతో పలు బిజినెస్ వెంచర్లు కూడా చేపట్టింది ఐపీఎల్ క్రికెట్లో రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లో ఇన్వెస్ట్ చేసింది. ఆన్లైన్ ప్రాపర్టీ బ్రోకరేజి బిజినెస్‌తో పాటు గ్రూప్కో డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థను ఏర్పాటు చేసింది. అటు లండన్, దుబాయ్ సహా పలు ప్రాంతాల్లో రియల్టీ రంగంలో ఇన్వెస్ట్ చేశారు శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా. ఇటీవలే సత్యుగ్ గోల్డ్ పేరిట ఆభరణాల వ్యాపారంలోకి కూడా అరంగేట్రం చేశారు. సినీ నిర్మాతగా కూడా మారారు. శిల్పా శెట్టి ఇలా విభిన్న పాత్రలు పోషిస్తున్నప్పటికీ మనీకి సంబంధించి ఆమె ఫిలాసఫీ చాలా సింపుల్‌గా ఉంటుంది. మధ్యతరగతి కుటుంబ నేపథ్యం కావడంతో డబ్బు విలువ తనకు బాగా తెలుసంటుంది. మనీకి అనవసర ప్రాధాన్యం ఇవ్వనని, నచ్చినది చేస్తే డబ్బు దానంతటదే వస్తుందని చెబుతుంది. ఇక పెట్టుబడుల విషయానికొస్తే.. భవిష్యత్ సురక్షితంగా ఉండటం కోసం చేసేవే కాబట్టి వీటి ని పెన్షన్ ప్రణాళికలుగా కూడా పరిగణి ంచవచ్చని చెబుతుంది శిల్పా శెట్టి. -
జర్మనీకే నా ఓటు
ప్రపంచకప్ ఫుట్‌బాల్‌పై కోహ్లి బెంగళూరు: ప్రస్తుతం దేశమంతా ఐపీఎల్ క్రికెట్ ఫీవర్‌లో ఉన్నప్పటికీ విశ్వ వ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానుల దృష్టి మాత్రం వచ్చే నెలలో జరిగే ప్రపంచకప్ ఫుట్‌బాల్‌పైనే ఉంది. ఈ మెగా సాకర్ టోర్నీ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని సగటు అభిమానులతో పాటు క్రికెటర్లు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వారిలో స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి కూడా ఉన్నాడు. ఈసారి ప్రపంచకప్ ఫుట్‌బాల్‌లో జర్మనీ సూపర్‌గా ఆడుతుందనే విశ్వాసాన్ని వ్యక ్తం చేస్తున్నాడు. ‘అత్యంత ప్రమాదకర ఆటగాళ్లతో జర్మనీ పటిష్టంగా కనిపిస్తోంది. నా మద్దతు ఆ జట్టుకే. కచ్చితంగా ఈ ఏడాది జర్మనీదే అవుతుంది. ఫిలిప్ లామ్ ఆటంటే నాకు ఇష్టం. తన ఆటతీరుతో జర్మనీకి టైటిల్ దక్కుతుందనుకుంటున్నాను. రొనాల్డో, మెస్సీ నా అభిమాన ఆటగాళ్లు’ అని ఫిఫా ఫ్లాగ్ బేరర్ కార్యక్రమంలో పాల్గొన్న కోహ్లి తెలిపాడు. భారత క్రికెట్ జట్టులో రవీంద్ర జడేజా చాలా సరదాగా ఫుట్‌బాల్ ఆడతాడని పేర్కొన్నాడు. అతడు తనకు తాను రొనాల్డోలా ఫీలై గోల్స్ చేసేందుకు యత్నించడం నవ్వు తెప్పిస్తుందని చెప్పాడు. ధోని చాలా బాగా ఆడతాడని కితాబిచ్చాడు. నిజానికి భారత క్రికెట్ జట్టు మొత్తం ఫుట్‌బాల్ మ్యాచ్‌లను చాలా ఆసక్తిగా గమనిస్తుందని అన్నాడు. -
తెరపైకి మ్యాచ్ ఫిక్సింగ్
ఆ మధ్య క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ ఎంత కలకలం సృష్టిం చిందో? ఎందరు క్రీడాకారులు అందులో ఇరుక్కుని తమ ఉజ్వల భవిష్యత్‌ను నాశనం చేసుకున్నారో తెలిసిందే. ఈ మ్యాచ్ ఫిక్సింగ్ వృత్తాంతం ఇప్పుడు వెండితెరపైకి రానుంది. ఇంతకు ముందు శివ హీరోగా తిల్లుముల్లు వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన యువ దర్శకుడు బద్రి తదుపరి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. ఁఆడామే జయిచ్చమొడారూ. (ఆడకుండానే గెలిచామేరా) పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ గత ఐపీఎల్ మ్యాచ్‌లో ఫిక్సింగ్ అంశం ఎంత కలకలం సృష్టించిందో తెలిసిందేనన్నారు. ఈ మ్యాచ్ ఫిక్సింగ్‌లో టోర్నమెంట్, బెట్టిం గ్స్, క్రికెటర్స్ ఇన్వాల్మెంట్ ఉన్న విషయం తెలిసిందేనన్నారు. తాను తిల్లుముల్లు చిత్ర రూపకల్పనలో ఉన్నప్పుడే ఈ సంఘటన జరిగిందన్నారు. ఈ అంశాన్ని ఇతి వృత్తంగా తీసుకుని చిత్రం చేయాలని అప్పడే నిర్ణయించుకున్నానన్నారు. నిజానికి ఈ బెట్టింగ్‌లు, ఫిక్సింగ్‌లు చాలా మందికి తెలియవన్నారు. వీటిని విపులీకరిస్తూ కమర్షియల్ అంశాలను జోడించి జనరంజక అంశాలతో తెరకెక్కిస్తున్న చిత్రమే ఆడామే జయిచ్చమొడా అని చెప్పారు. షూటింగ్ పూర్తయిందని తెలిపారు. మే లో ఐపీఎల్ క్రికెట్ ప్రారంభం సమయంలో చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించినట్లు వివరిం చారు. యువ నటులు కరుణాకరన్, సింహా హీరోలుగా నటించిన ఈ చిత్రంలో చెన్నై-28 ఫేమ్ విజయలక్ష్మి హీరోయిన్గా నటించారని చెప్పారు. దర్శకుడు కె.ఎస్.రవికుమార్ ఒక కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో రాధారవి ముఖ్య పాత్రల్లో నటించారని తెలిపారు.