జర్మనీకే నా ఓటు | Virat Kohli talks about World Cup Football | Sakshi
Sakshi News home page

జర్మనీకే నా ఓటు

Published Sun, May 11 2014 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 7:11 AM

జర్మనీకే నా ఓటు

జర్మనీకే నా ఓటు

 ప్రపంచకప్ ఫుట్‌బాల్‌పై కోహ్లి

 బెంగళూరు: ప్రస్తుతం దేశమంతా ఐపీఎల్ క్రికెట్ ఫీవర్‌లో ఉన్నప్పటికీ విశ్వ వ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానుల దృష్టి మాత్రం వచ్చే నెలలో జరిగే ప్రపంచకప్ ఫుట్‌బాల్‌పైనే ఉంది. ఈ మెగా సాకర్ టోర్నీ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని సగటు అభిమానులతో పాటు క్రికెటర్లు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వారిలో స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లి కూడా ఉన్నాడు. ఈసారి ప్రపంచకప్ ఫుట్‌బాల్‌లో జర్మనీ సూపర్‌గా ఆడుతుందనే విశ్వాసాన్ని వ్యక ్తం చేస్తున్నాడు.

‘అత్యంత ప్రమాదకర ఆటగాళ్లతో జర్మనీ పటిష్టంగా కనిపిస్తోంది. నా మద్దతు ఆ జట్టుకే. కచ్చితంగా ఈ ఏడాది జర్మనీదే అవుతుంది. ఫిలిప్ లామ్ ఆటంటే నాకు ఇష్టం. తన ఆటతీరుతో జర్మనీకి టైటిల్ దక్కుతుందనుకుంటున్నాను. రొనాల్డో, మెస్సీ నా అభిమాన ఆటగాళ్లు’ అని ఫిఫా ఫ్లాగ్ బేరర్ కార్యక్రమంలో పాల్గొన్న కోహ్లి తెలిపాడు. భారత క్రికెట్ జట్టులో రవీంద్ర జడేజా చాలా సరదాగా ఫుట్‌బాల్ ఆడతాడని పేర్కొన్నాడు. అతడు తనకు తాను రొనాల్డోలా ఫీలై గోల్స్ చేసేందుకు యత్నించడం నవ్వు తెప్పిస్తుందని చెప్పాడు. ధోని చాలా బాగా ఆడతాడని కితాబిచ్చాడు. నిజానికి భారత క్రికెట్ జట్టు మొత్తం ఫుట్‌బాల్ మ్యాచ్‌లను చాలా ఆసక్తిగా గమనిస్తుందని అన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement