విరాట్ కోసం స్పెషల్ గిఫ్ట్! | Virat Kohli receives special gift from Germany’s Toni Kroos, see pics | Sakshi
Sakshi News home page

విరాట్ కోసం స్పెషల్ గిఫ్ట్!

Jun 28 2016 8:09 PM | Updated on Sep 4 2017 3:38 AM

విరాట్ కోసం స్పెషల్ గిఫ్ట్!

విరాట్ కోసం స్పెషల్ గిఫ్ట్!

టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లికి ప్రపంచ ఫుట్ బాల్ జట్లలో జర్మనీ అంటే అమితమైన అభిమానం.

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లికి  ప్రపంచ ఫుట్ బాల్ జట్లలో జర్మనీ అంటే అమితమైన అభిమానం. తనకు జర్మనీ జట్టుపై ఉన్న అభిమానాన్ని విరాట్ ఇప్పటికే పలుమార్లు వ్యక్తీకరించాడు. యూరో 2016 ఫుట్ బాల్ టోర్నమెంట్కు ముందు తన మద్దతు జర్మనీకే అని విరాట్ ట్వీట్ చేశాడు.

 

‘యూరోలో నేను జర్మనీ వైపు. మరి మీ మద్దతు ఎవరికి’ అని ట్విటర్ ద్వారా అభిమానం చాటుకున్నాడు. అయితే తన జట్టుపై విరాట్కున్న అభిమానానికి జర్మనీ మిడ్ఫీల్డర్ టోనీ క్రూజ్ ముగ్ధుడయ్యాడు. అందుకు ప్రతిగా  విరాట్కు జర్మనీ జెర్సీని బహుకరించాడు.  దీనికి విరాట్ కోహ్లి స్పందిస్తూ..తనకు స్పెషల్ గిఫ్ట్ పంపిన క్రూజ్కు ధన్యవాదాలు అంటూ జెర్సీతో ఉన్న ఫోటోను పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా క్వార్టర్స్కు చేరిన జర్మనీకి ముందుగా విరాట్ అభినందనలు తెలిపాడు.క్వార్టర్స్ లో జర్మనీ విజయం సాధించాలని ఆకాంక్షించాడు. యూరో కప్లో జర్మనీ-ఇటలీ మధ్య క్వార్టర్ ఫైనల్ పోరు జరుగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement