జోరుగా క్రికెట్ బెట్టింగ్
Published Thu, Apr 20 2017 12:24 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
- పోలీసుల అదుపులో నిందితులు
ఉయ్యాలవాడ: మండల కేంద్రమైన ఉయ్యాలవాడతో పాటు వివిధ గ్రామాల్లో క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఐపీఎల్–10 జరుగుతుండడంతో గెలుపోటములపై జోరుగా పందాలు కాస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళ, బుధవారాల్లో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఉయ్యాలవాడ కేంద్రంగా చేసుకుని గత 15 రోజులుగా బెట్టింగ్ తంతు సాగుతోంది. మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన 10 మంది యువకులు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు. వీరిని అదుపులోకి తీసుకునేందుకు జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా బెట్టింగ్ జాబితాలో కొందరి వారి పేర్లు తొలగించాలని పోలీసులపై టీడీపీ నాయకులు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అయితే నిందితులు ఎంతటివారైనా సరే చట్ట ప్రకారం చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు.
Advertisement
Advertisement