ప్రపంచ కప్ నేపథ్యంలో నగరంలో జోరుగా సాగుతున్న క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై టాస్క్ పోలీసులు దృష్టి సారించారు. ఆదివారం పలు
స్థావరాలపై దాడులు చేసి నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి నగదు, బెట్టింగ్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు..
నల్లకుంట: క్రికెట్ బెట్టింగ్ కేంద్రాలపై ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఓ బూకీతో పాటు రూ. 47 వేల నగదు, ఎల్‌ఈడీ టీవీ, రెండు సెల్ ఫోన్లు, బెట్టింగ్ వివరాలు ఉన్న మూడు పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ కోటిరెడ్డి కథనం మేరకు.. తూర్పు గోదావరికి చెందిన ఎం.వెంకటేశ్వరరావు (40) పాతికేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి నల్లకుంట బాయమ్మ లేన్‌లో కొబ్బరి బొండాల వ్యాపారం చేస్తూ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. ఇతను ఐపీఎల్ క్రికెట్ పోటీలు ప్రారంభమైనప్పటి నుంచి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. ఆదివారం భారత్, సౌత్ ఆఫ్రికాల మధ్య జరిగిన మ్యాచ్‌పై పెద్ద ఎత్తున బెట్టింగ్ నిర్వహించాడు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్. శ్రీధర్, ఎస్‌ఐలు శేఖర్‌రెడ్డి, ఎ.సుధాకర్, ఎ.రవికుమార్, జి.రాజు ఆదివారం మద్యాహ్నం బాయమ్మ గల్లీలోని అపార్ట్‌మెంట్‌పై దాడిచేసి బెట్టింగ్‌కు పాల్పడుతున్న వెంకటేశ్వరరావును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇతని వద్ద లభించిన బెట్టింగ్ పుస్తకంలో ఉన్న మరో తొమ్మిది మంది పేర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. కేసు తదుపరి విచారణ కోసం నిందితుడిని నల్లకుంట ఎస్‌ఐ చిరంజీవికి అప్పగించారు.
బెట్టింగ్‌లతో గతంలో నష్టం..
వెంకటేశ్వరరావు బెట్టింగ్‌ల కారణంగా గతంలో ఓ ఫ్లాట్, రూ. 2 లక్షల నగదు నష్టపోయాడు. పోయిన ఆస్తిని ఎలాగైనా తిరిగి సంపాదించాలని క్రికెట్ బెట్టింగ్‌ను వృత్తిగా మార్చుకున్నాడు. ఈ క్రమంలో కొబ్బరి బొండాల షాపు వద్దకు వచ్చే క్రికెట్ అభిమానులను ఆకర్షించి బెట్టింగ్ రొంపిలోకి లాగుతున్నాడు.
బేగంబజార్‌లో మరొక బుకీ..
అబిడ్స్: బేగంబజార్ చుడీబజార్ ప్రాంతంలో బెట్టింగ్ నిర్వహిస్తున్న సమాచారంతో టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి పర్యవేక్షణలో ఎస్‌ఐ జలంధర్, ఇతర సిబ్బంది ఆ కేంద్రంపై దాడి చేశారు. ఇక్కడ బెట్టింగ్‌కు పాల్పడుతున్న పేరు మోసిన బుకీ ఠాకూర్ యోగేష్‌ను అరెస్ట్ చేసి అతని నుంచి రూ. 9,500 నగదు, ఆరు సెల్‌ఫోన్లు, ఒక టీవీ, రికార్డింగ్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కాగా, మరో క్రికెట్ బుకీ వెంకటేష్ పండిట్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసుల రాకతో పరారయ్యాడు. అతని కోసం కూడా గాలిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు.
రామనాథపురాలో 11 మంది అరెస్టు
బహుదూరపురా: రాంనాథపురలో కిక్రెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న స్థావరంపై ఆదివారం సౌత్ జోన్ టాస్క్ పోర్స్ పోలీసులు దాడి చేసి 11 మందిని ఆరెస్టు చేసి, వారి నుంచి రూ. 51 వేల నగదు, 10 సెల్ ఫోన్లు, టీవీ స్వాధీనం చేసుకున్నారు. బహదూర్‌పురా ఇన్‌స్పెక్టర్ హరీష్ కౌశి కథనం మేరకు.. కామాటిపుర, రాంనాథపుర, వాజుపుర ప్రాంతాలకు చెందిన 11 మంది కొందరు యువకులు కలిసి రాంనాథపుర థియేటర్ పక్క వీథిలో కిక్రెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్థావరంపై దాడి చేసి.. మహ్మద్ జహీరుద్దీన్, షేక్ మహ్మద్, మహ్మద్ అక్రమ్, సలీముద్దీన్, అబ్దుల్ రహీం, ఉమర్, మోసిద్, సయ్యద్ యూనస్, మహ్మద్ జావేద్‌లను అరెస్టు చేశారు. బహదూర్‌పురా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నారు.
క్రికెట్ బెట్టింగ్ గుట్టు రట్టు
Published Mon, Feb 23 2015 12:19 AM | Last Updated on Wed, May 29 2019 2:38 PM
Advertisement
Advertisement