ఓ మై గాడ్!
అయ్యో
మన దగ్గర కోడి పందేలు ఎలాగో... ఢిల్లీ శివార్లలో ‘శునకాల పోరు’ అలాగ. ఢిల్లీ శివార్లలోని ఫాంహౌజ్‌లలో ఈ శునకాల పోరుపై వేలాది రూపాయలు బెట్టింగ్ జరుగుతుంది. ఢిల్లీ వాసులు మాత్రమే కాదు... పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి కూడా శునకాల మీద పందేలు కాయడానికి ఎంతో మంది వస్తుంటారు. పరమ హింసాత్మకంగా సాగే ‘డాగ్ ఫైట్స్’లో రక్తం ఓడుతూ శునకాలు చనిపోతుంటాయి కూడా. శిక్షణ ఇవ్వడంలో భాగంగా శునకాలను రకరకాలుగా హింసిస్తుంటారు వాటి యజమానులు. ఫాంహౌజ్‌లలో ఈ ‘డాగ్ ఫైట్స్’ ఎక్కువగా జరుగుతుండడం వల్ల బాహ్యప్రపంచ దృష్టికి పెద్దగా రావడం లేదు. ‘‘దీనికి వెనుక పెద్ద రాకెట్ ఉంది. వారి పని పడతాం’’ అంటున్నారు కేంద్రమంత్రి మేనకాగాంధీ.
ఆ పనేదో తొందరగా చేసి పుణ్యం కట్టుకోండి మేడమ్ జీ!