
'స్క్విడ్ గేమ్' వెబ్ సిరీస్‌లతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హాలీవుడ్ నటుడు 'ఓ యోంగ్ సు'కు న్యాయస్థానంలో శిక్ష పడింది. 90 దేశాల్లో నెం.1గా కొనసాగిన ఈ సిరీస్‌కు చాలామంది అభిమానులు ఉన్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో తక్కవ సమయంలో ఎక్కువమంది చూసిన వెబ్‌సిరీస్‌గా గుర్తింపు ఉంది. 'స్క్విడ్ గేమ్' సిరీస్‌లో కీలకపాత్రలో కనిపించిన 'ఓ యోంగ్ సు' మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన విషయం తెలిసింది. 2017లో వచ్చిన అభియోగాలు నిజమేనని కోర్టు పేర్కొంది. దీంతో 80 ఏళ్ల ఈ నటుడికి దక్షిణ కొరియా కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది.
దక్షిణ కొరియాకు చెందిన 'ఓ యోంగ్ సు' కేసు తాజాగా తుది విచారణ జరిగింది. ఈ సందర్భంగా లాయర్లు మాట్లాడుతూ.. నాటక రంగంలో దాదాపు 50 సంవత్సరాలుగా పేరు గడించిన అనుభవజ్ఞుడైన నటుడిగా ఆయన్ను అభివర్ణించారు. కానీ, అతని చర్యలు మాత్రం ఆదర్శవంతంగా లేవని పేర్కొన్నారు. సువాన్ జిల్లా కోర్టు 'ఓ యోంగ్ సు'కు ఏడాదిపాటు జైలు శిక్ష విధించింది. అలాగే సినీ రంగంలో రెండేళ్ల పాటు నిషేధం కూడా విధించింది. గతంలో కూడా ఆయనపై మరో లైంగిక వేధింపుల కేసు కూడా ఉన్నట్లు న్యాయస్థానం దృష్టికి వచ్చింది.
2017లో ఓ గ్రామీణ ప్రాంతంలో థియేటర్ ప్రదర్శన కోసం వెళ్లిన యోంగ్ ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కానీ అక్కడ ఓ సరస్సు దాటేందుకు సహాయం కోసం మాత్రమే ఆ మహిళ చేతిని పట్టుకున్నట్లు యోంగ్ తెలిపాడు. అందుకు ఆమెకు క్షమాపణలు కూడా చెప్పినట్లు తెలిపాడు. కానీ వాస్తవంగా ఆ మహిళను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు పూర్తి ఆధారాలు కోర్టుకు దక్కడంతో ఆయనకు శిక్ష ఖరారు అయింది.