
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ సీఎంగా నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకార తేదీ ఫైనల్ అయింది. తాను సీఎంగా బుధవారం (అక్టోబర్ 16) ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ఈమేరకు జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌సిన్హా నుంచి తనకు లేఖ అందిందని చెప్పారు.
సీఎంగా ప్రమాణ స్వీకారానికి లేఖలో తనను ఆహ్వానించారన్నారు. జమ్ముకశ్మీర్‌లో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌సీ-కాంగ్రెస్ కూటమి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాల అనంతరం ఇటీవలే జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా అక్కడ రాష్ట్రపతి పాలనను కేంద్ర ప్రభుత్వం ఎత్తేసింది.దీంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.
ఇదీ చదవండి: హిమాచల్‌లో రెండు డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు