
భూ సమస్యల పరిష్కారానికి ‘భూభారతి’
● కలెక్టర్ల సదస్సులో సీఎం
నిర్మల్‌చైన్‌గేట్: రైతుల భూసమస్యల శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో (ఎంసీహెచ్‌ఆర్‌డీ) సోమవారం నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో భూభారతి, ఇందిరమ్మ ఇళ్లు, వేసవి తాగునీటి ప్రణాళికపై దిశానిర్దేశం చేశారు. భూభారతిపై ప్రతీ మండలంలో సదస్సు నిర్వహించాలని సూచించారు. రైతులు, ప్రజలు లేవనెత్తే సందేహాలు నివృత్తి చేయాలని తెలిపారు. సమావేశంలో కలెక్టర్ అభిలాష అభినవ్, అదనపు కలెక్టర్ కిశోర్‌కుమార్ ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.