
నిర్ణీత సమయంలో సమస్యలు పరిష్కరించండి
● ఎస్పీ ఎస్‌వీ మాధవ్ రెడ్డి
పార్వతీపురం రూరల్: ప్రజలు తెలియజేసిన సమస్యలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కుటుంబ కలహాలు, వేధింపులు, భూ, ఆస్తి వివాదాలు, సైబర్ మోసాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీల వసూళ్లు, ప్రేమ పేరుతో మోసాలపై అర్జీలు వచ్చాయి. అనంతరం వివిధ స్టేషన్‌ల సిబ్బందితో ఫోన్‌లో మాట్లాడి, ఫిర్యాదులపై ఆరా తీశారు. కార్యక్రమంలో డీసీఆర్‌బీ సీఐ ఆదాం, తదితర సిబ్బంది పాల్గొన్నారు.
39 అర్జీల స్వీకరణ...
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఎస్సీ వకుల్ జిందల్, తదితరులు 39 అర్జీలు స్వీకరించారు. బాధితులతో ముఖాముఖి మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం ఆయా పోలీస్‌స్టేషన్‌ల ఎస్‌హెచ్‌ఓలతో వీడియో కాల్ ద్వారా మాట్లాడుతూ... ఫిర్యాదుదారుల సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదుల వాస్తవ నివేదికలను తన కార్యాలయానికి పంపాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ సౌమ్యలత, ఎస్‌బీ సీఐలు లీలారావు, చౌదరి, డీసీఆర్‌బీ ఎస్సై రాజేష్, పీఆర్‌ఓ కోటేశ్వరరావు, సిబ్బంది కిషోర్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

నిర్ణీత సమయంలో సమస్యలు పరిష్కరించండి