
సృజన శ్రీకర్‌కు గిన్నిస్‌బుక్‌లో స్థానం
చీపురుపల్లిరూరల్ (గరివిడి): గరివిడి పట్టణానికి చెందిన ఐదో తరగతి విద్యార్థి ధర్మవరపు సృజనశ్రీకర్ గిన్నిస్ బుక్‌లో స్థానం దక్కించుకున్నాడు. విజయవాడకు చెందిన హల్లెల్ మ్యూజిక్ స్కూల్ వ్యవస్థాపకుడు పాస్టర్ అగస్థీన్ దండంగి ఆధ్వర్యంలో డిసెంబర్ 1న 18 దేశాలకు చెందిన 1090 మంది విద్యార్థులు 60 నిమిషాలలో అందరూ ఏకకాలంలో కీబోర్డు ప్లే చేసి ఇన్‌స్ట్రాగామ్‌లో అప్‌లోడ్ చేశారు. వీరిలో 1046 మంది విద్యార్థులు గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్‌ుడ్సలో చోటు దక్కించుకున్నారు. వీరిలో గరివిడి పట్టణంలోని ఈహెచ్ కాలనీకి చెందిన పాస్టర్ ధర్మవరపు ప్రసాదరావు, వెంకటలక్ష్మి దంపతుల కుమారుడు సృజనశ్రీకర్ కూడా ఉన్నాడు. ఈ నెల 25న విజయవాడలోని మెట్రోపాలిటన్ మిషన్ చర్చిలో సృజనశ్రీకర్ ప్రశంసాపత్రం అందుకున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు.
కబ్జాదారుడిపై
చర్యలు తీసుకోండి..
● కలెక్టర్‌కు చీపురుపల్లి రైతుల వినతి
విజయనగరం అర్బన్: చీపురుపల్లి రెవెన్యూ పరిధిలోని రైతులు, ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్న జనసేన నాయకుడు విసినిగిరి శ్రీనుపై చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను సోమవారం కలసి వినతిపత్రం అందజేశారు. విసినిగిరి శ్రీను చేసిన భూ కబ్జాలపై తహసీల్దార్, ఆర్డీఓ స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. చీపురుపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల దగ్గర గెడ్డ పోరంబోకు భూమిని ఆక్రమించి విక్రయించాడని ఆరోపించారు. అలాగే చీపురుపల్లి – రాజాం మార్గంలోని ఆర్‌అండ్‌బీ రోడ్డుని ఆనుకుని సుమారు రెండెకరాల ఉమా రామలింగేశ్వరస్వామి దేవస్థానం భూమిని ఆక్రమించి దానిని ప్లాట్లగా విక్రయించాడని చెప్పారు. ఆక్రమణదారుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో కొసిరెడ్డి రమణ, గవిడి సురేష్, రెడ్డి గోపి, కరణం ఆదినారాయణ, డబ్బాడ ఆనంద్, పండు, సత్యం, వెంకీ, తదితరులు ఉన్నారు.
ఆరు కిలోల గంజాయి స్వాధీనం
శృంగవరపుకోట: అక్రమంగా తరలిస్తున్న ఆరు కిలోల గంజాయిని ఎస్.కోట పోలీసులు సోమవారం మధ్యాహ్నం స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు ఎస్.కోట పోలీసులు పందిరప్పన్న జంక్షన్‌లో వాహన తనిఖీలు చేపడుతుండగా.. మోటార్‌సైకిల్‌పై వస్తున్న ఒడిశాకు చెందిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా..వారి వద్ద ఆరు కిలోల గంజాయి పట్టుబడింది. గంజాయి, బైక్‌ను స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేసినట్లు సీఐ వి. నారాయణమూర్తి తెలిపారు.

సృజన శ్రీకర్‌కు గిన్నిస్‌బుక్‌లో స్థానం

సృజన శ్రీకర్‌కు గిన్నిస్‌బుక్‌లో స్థానం