భగీరథ, కాళేశ్వరం పేరుతో రూ.లక్షల కోట్లు దోచుకున్నారు: మంత్రి పొంగులేటి | BRS Sidetracked Thousand Crore On Name Bhagiratha: Ponguleti Srinivasa Reddy | Sakshi

భగీరథ, కాళేశ్వరం పేరుతో రూ.లక్షల కోట్లు దోచుకున్నారు: మంత్రి పొంగులేటి

Published Tue, Sep 24 2024 5:54 AM | Last Updated on Tue, Sep 24 2024 5:54 AM

BRS Sidetracked Thousand Crore On Name Bhagiratha: Ponguleti Srinivasa Reddy

సృజన్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి అల్లుడు

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్త గూడెం/నేలకొండపల్లి: గత ప్రభుత్వం మిషన్‌ భగీరథ, కాళే శ్వరం పేరుతో రూ.లక్షల కోట్లు దోచుకుందని మంత్రి పొంగు లేటి శ్రీనివాస రెడ్డి ఆరోపించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో మార్కెట్‌ క మిటీ నూతన పాలక వర్గ ప్ర మాణస్వీకారం సోమ వారం సాయంత్రం జరగగా, ఆయ న పాల్గొని మాట్లాడారు. ము ఖ్యమంత్రి ఎంఐయూడీలో అమృత్‌ స్కీంలో అవినీతికి పాల్పడ్డారని, సృజన్‌రెడ్డికి పనులు ఇచ్చారని కేటీఆర్‌ చెబుతుండగా.. ఈ విషయమై చర్చకు ఎక్కడైనా వస్తానని, ఆరోప ణలు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెబితే సమాధానం ఇవ్వలేదన్నారు.

ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే కేటీఆర్‌ ఎవరో చెప్పిన విమర్శలు చేసే ముందుకు ఆలో చించాలని సూచించారు. పాలేరులో తనపై బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసిన కందాళ ఉపేందర్‌రెడ్డి అల్లుడే సృజన్‌రెడ్డి అని.. ఆయనకు బీఆర్‌ఎస్‌ హయాంలో సబ్‌ కాంట్రాక్టర్లు ఇప్పించారని తెలిపారు. ఇప్పుడు సృజన్‌రెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి బావమరిదిగా చిత్రీకరించే పనిచేస్తు న్నారని చెప్పారు. సీఎంను దించడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుట్ర చేస్తు న్నారని చెబుతు న్నారని.. కానీ కేటీఆర్‌ – హరీశ్‌ రావు మధ్యే అంతర్గత వివాదాలు ఉన్నాయని తెలిపారు. 

అధికారులు పద్ధతి మార్చుకోవాలి
పేదవారి కోసం తమ ప్రభుత్వం పనిచేస్తోందని.. సర్కారు ఆలోచన లకు అనుగుణంగా అధి కా రులు పనిచేయాలని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. అలా కాకుండా సొంత ఆలోచనలను పాలనలో జొప్పించాలని చూస్తే ఏ స్థాయి అధికారుల పైనైనా చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని స్పష్టం చేశారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లెందులో మంగళవారం పర్యటించిన ఆయన వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. ఆ తర్వాత నిర్వహించిన సమీక్షలో ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే కనకయ్య, కలెక్టర్‌ పాటిల్, ఎస్పీ సునీల్‌దత్, ఐటీడీఏ పీఓ రాహుల్‌ సహా అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం తరహాలో ధరణిని అడ్డుపెట్టుకొని ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకోబోమన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement