రఘునందన్‌పై ఫిర్యాదు: మహిళ ఆత్మహత్యాయత్నం | Raja Ramani Who Complaints On Raghunandan Rao Suicide Attempt | Sakshi
Sakshi News home page

రఘునందన్‌పై ఫిర్యాదు: మహిళ ఆత్మహత్యాయత్నం

Published Tue, Nov 17 2020 1:52 PM | Last Updated on Tue, Nov 17 2020 3:36 PM

Raja Ramani Who Complaints On Raghunandan Rao Suicide Attempt - Sakshi

రఘునందన్‌తో పాటు పలువురు పోలీసులు తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.

సాక్షి, సిద్దిపేట: బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుపై అత్యాచార సంచలన ఆరోపణలు చేసిన రాజా రమణి మంగళవారం ఆత్మహత్యాయత్నం చేశారు. రఘునందన్‌తో పాటు పలువురు పోలీసులు తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అత్యాచారం కేసులో న్యాయం చేయాలని 20 ఏళ్లుగా తిరుతున్నా ఎవరూ స్పందించడం లేదని సెల్ఫీ వీడియోలో వాపోయారు. న్యాయం జరక్కపోగా.. వేధింపులకు గురిచేస్తున్న అధికారులు, ఎమ్మెల్యే రఘునందన్‌, ఆర్‌సీ పురం పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. న్యాయం జరగడం లేదనే ఆవేదన, నిరసనతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు చెప్పారు.
(చదవండి: హైకోర్టును ఆశ్రయించిన రఘునందన్‌రావు)

రాజా రమణి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేయగా.. ఆర్‌సీ పురం పోలీసులు ఆమెకు పటాన్‌చెరులోని ఓ ఆస్పత్రిలో రహస్యంగా చికిత్స చేయించి ఇంటికి తరలించినట్టు సమాచారం. కాగా, న్యాయవాది అయిన రఘునందన్‌ను ఒక కేసు విషయమై ఆశ్రయించగా, కాఫీలో మత్తు మందు కలిపి తనపై అత్యాచారం చేశాడంటూ రాజా రమణి గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే. కేసుల పరిష్కారం కోసం వచ్చే మహిళల్ని రఘునందన్ భయపెట్టి లొంగదీసుకుంటాడని కూడా రాజా రమణి అప్పటల్లో సంచలన ఆరోపణలు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర మానవ హక్కుల సంఘాన్ని కూడా ఆమె ఆశ్రయించారు.
(చదవండి: విలేకరి నుంచి ఎమ్మెల్యే వరకు..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement