
మొన్నటి దాకా కమ్యూనిస్ట్ పార్టీలను పవన్ కల్యాణ్ మోసం చేశారని.. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీతో కలిసి పనిచేస్తున్నారని మండిపడ్డారు
సాక్షి, పశ్చిమగోదావరి: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విడాకులు తీసుకుని ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోవచ్చు కానీ.. రాజకీయాల్లో అలా కుదరదన్నారు. విలువలు, సిద్ధాంతాలు ఉంటాయని హితవు పలికారు. మొన్నటి దాకా కమ్యూనిస్ట్ పార్టీలను పవన్ కల్యాణ్ మోసం చేశారని.. ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీతో కలిసి పనిచేస్తున్నారని మండిపడ్డారు. బాబు, పవన్ నీచ రాజకీయాలను ప్రజలు తిరస్కరించారని గ్రంథి శ్రీనివాస్ అన్నారు.
చదవండి:
మిగిలింది.. ఒకటే జెండా, ఒకటే అజెండా
ఏం చంద్రబాబు ఇప్పుడేమంటారు..?